'ఆమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం'.. ఉపాసన స్పెషల్ విషెస్ | Upasana Konidela Special Birthday Wishes To Chiranjeevi Mother Anjana Devi, Post Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Upasana Konidela: 'ఆమె జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం'.. ఉపాసన స్పెషల్ విషెస్

Published Wed, Jan 29 2025 2:25 PM | Last Updated on Wed, Jan 29 2025 3:16 PM

Upasana Konidela Special Wishes To Chiranjeevi Mother Anjana Devi

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవికి మెగా కోడలు శుభాకాంక్షలు తెలిపింది. ఇవాళ ఆమె పుట్టినరోజు కావడంతో స్పెషల్ విషెస్ చెప్పింది. అంజనా దేవితో ఉన్న ఫోటోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో మెగా అభిమానులు సైతం అంజనమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఉపాసన తన ఇన్‌స్టాలో రాస్తూ..'అత్యంత శ్రద్ధ, క్రమశిక్షణ కలిగిన నాయనమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీతో పాటు కలిసి జీవించడం నాకు చాలా ఇష్టం. మా యోగా క్లాస్‌ పూర్తయ్యాక మా ఫేస్‌లో ఆనందం చూడండి. ఆమె ఒక్క క్లాస్ కూడా ఎప్పటికీ మిస్సవదు. నిజంగా మీరు అందరికీ స్ఫూర్తిదాయకం.' అంటూ పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా బర్త్‌ డే విషెస్ పోస్టులు పెడుతున్నారు.

(ఇది చదవండి: అలా జరగకపోతే నా పరువు పోతుంది: నాగచైతన్య కామెంట్స్ వైరల్)

ఇక ఉపాసన విషయానికొస్తే వ్యాపారవే‍త్తగా రాణిస్తున్నారు. మరోవైపు రామ్ చరణ్ ఇటీవలే సంక్రాంతికి గేమ ‍ఛేంజర్‌ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్, దేవరభామ జాన్వీ కపూర్ చెర్రీ సరసన కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ ఆర్సీ16 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement