
ప్రస్తుతం టాలీవుడ్ అల్లు, మెగా ఫ్యాన్స్ మధ్యన వార్ నడుస్తోంది. ఇటీవల మారుతీనగర్ సుబ్రమణ్యం ఈవెంట్‌లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో మళ్లీ ఫ్యాన్స్ రచ్చ నడుస్తోంది. గతంలో జరిగిన రాజకీయ పరిణామాలను ఉద్దేశించే బన్నీ అలా మాట్లాడారంటూ మెగా ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు ఈ విషయంలో అల్లు అర్జున్ అభిమానులు సైతం మెగా ఫ్యాన్స్‌పై మండిపడుతున్నారు. దీంతో అది కాస్తా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్‌గా మారిపోయింది.
అయితే ఈనెల 22న మెగాస్టార్ బర్త్ డేను పురస్కరించుకుని అల్లు అర్జున్ విషెస్ తెలిపారు. మీరు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలంటూ ఆయన ట్వీట్ చేశారు. తాజాగా బన్నీ చేసిన పోస్ట్‌కు మెగాస్టార్ చిరంజీవి సైతం రిప్లై ఇచ్చారు. థ్యాంక్యూ డియర్ బన్నీ అంటూ చిరు పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇక్కడితోనైనా ఫ్యాన్స్ మధ్య నెట్టింట వార్‌కు ఫుల్‌స్టాప్ పడుతుందేమో చూడాలి.
అసలు బన్నీ ఏమన్నారంటే...
హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఆసక్తికర కామెంట్స్ చేశారు. అభిమానుల వల్లే తాను హీరో అయ్యానని ఎమోషనల్ అయ్యారు. అంతే కాకుండా నా అనుకున్న వాళ్ల కోసం ఎంతవరకైనా వెళ్తానంటూ బన్నీ మాట్లాడారు. అది ఫ్రెండైనా, బంధువైనా, నా అభిమానులైనా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అది కాస్తా బన్నీ, మెగా ఫ్యాన్స్‌కు మధ్య వార్‌కు దారితీసింది. గతంలో అల్లు అర్జున్ నంద్యాలలో వైకాపా అభ్యర్థి తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లగా.. మెగా ఫ్యాన్స్ విమర్శలు చేశారు. అందుకు కౌంటర్‌గానే ఇప్పుడు బన్నీ మాట్లాడారంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ మొదలైంది.
ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసారం ఫేమ్ వశిష్టి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు బన్నీ పుష్ప-2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది.
Thank you dear Bunny.
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 23, 2024
Comments
Please login to add a commentAdd a comment