'హ్యాపీ బర్త్‌ డే గురూజీ'.. మెగాస్టార్ స్పెషల్ విషెస్! | Amitabh Bachchan 81st Birthday: Megastar Chiranjeevi Special Wishes To Amitabh Bachchan - Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: 'ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నా'.. ఆయనకు చిరు స్పెషల్ విషెస్!

Published Wed, Oct 11 2023 12:51 PM | Last Updated on Wed, Oct 11 2023 1:06 PM

Megastar Chiranjeevi Special Wishes To Amitabh Bachchan In His Birthday - Sakshi

బాలీవుడ్ స్టార్, బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్‌ బర్త్‌ డే సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. అంతే కాకుండా సైరా నరసింహారెడ్డి చిత్రంలోని ఫోటోలను పంచుకున్నారు. 1942 అక్టోబర్ 11న జన్మించిన అమితాబ్ బచ్చన్ ఇవాళ 81వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే పలువురు సినీ తారలు, బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ముంబయిలోని  ఆయన నివాసం వద్దకు వచ్చిన అభిమానుల కోసం బయటకు వచ్చి అభివాదం చేశారు బిగ్ బీ. 

మెగాస్టార్ తన ట్వీట్‌లో రాస్తూ..' గురూజీ.. మీకు 81వ జన్మదిన శుభాకాంక్షలు. మీరు సంతోషం, మంచి ఆరోగ్యంతో నిండిన దీర్ఘాయువుతో ఆశీర్వదించబడాలి. మీ నటనా ప్రతిభా పాటవాలతో, అనేక సంవత్సరాల పాటు మీరు లక్షలాది మందిని ఆకట్టుకుని స్ఫూర్తినిస్తూనే ఉండండి. ఈ మీ పుట్టినరోజు కూడా నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మీ  కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోలో ఈ రోజు రాత్రి వర్చువల్‌గా నా ఆరాధ్యదైవమైన మిమ్మల్ని కలిసేందుకు నేను ఎదురు చూస్తున్నాను.' అంటూ పోస్ట్ చేస్తున్నారు. కాగా.. అమితాబ్ ఈ ఏడాది ప్రభాస్ కల్కి 2298 ఏడీ మూవీతో పాటు గణపత్ చిత్రంలో నటిస్తున్నారు. మెగాస్టార్ ప్రస్తుతం బింబిసార డైరెక్టర్‌ వశిష్ట డైరెక్షన్‌లో సినిమా చేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement