హాస్యనటుడు అనే పదం ఆయనకు సరిపోదేమో.. ఎందుకంటే అంతలా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించాడు. హాస్యమే ఆయన కోసం పుట్టిందంటే ఆ పదానికి సరైన అర్థం దొరుకుతుందేమో. అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయనే టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మనందం. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు . బ్రహ్మనందం అసమాన ప్రతిభను ఆయన కొనియాడారు. ఈ మేరకు ట్విటర్‌లో సందేశం పోస్ట్ చేశారు.
మెగాస్టార్ తన ట్వీట్‌లో రాస్తూ.. 'నాకు తెలిసిన బ్రహ్మనందం అత్తిలిలో ఓ లెక్చరర్. ఈ రోజు బ్రహ్మనందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కెక్కిన ఒక గొప్ప హాస్య నటుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. కామెడీకి నిలువెత్తు నిదర్శనం. అతను కామెడీ చేయనక్కర్లేదు. అతని మొహం చూస్తేనే హాస్యం వెల్లివిరుస్తుంది. పొట్ట చెక్కలవుతుంది. ఇలాంటి బ్రహ్మనందానికి హృదయపూర్వక శుభాభినందనలు.
బ్రహ్మనందం ఇలాగే జీవితాంతం నవ్వుతూ, పదిమందిని నవ్విస్తూ ఉండాలని, బ్రహ్మనందంకు మరింత బ్రహ్మండమైన భవిష్యత్ ఉండాలని, తన పరిపూర్ణ జీవితం ఇలాగే బ్రహ్మనందకరంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ తనకి నా జన్మదిన శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. హాస్య నటుడు బ్రహ్మనందంకు టాలీవుడ్ ప్రముఖులు అభినందనలు చెబుతున్నారు.
Happy Birthday
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 1, 2023
Dear Brahmanandam 💐 pic.twitter.com/sp0r9wUJPQ
Comments
Please login to add a commentAdd a comment