Brahmanandam comedian
-
మిమిక్రీ చేసి ఆశ్చర్యపరిచిన బ్రహ్మనందం..
-
బ్రహ్మనందం గొప్ప మనసు.. వారి కుటుంబానికి ఆర్థికసాయం!
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మనందం ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయాన్నే విఐపీ దర్శన సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు తిరుమలలో ఘనస్వాగతం పలికిన వేద పండితులు.. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మనందం అనంతరం పుస్తాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ కళాకారుని కుటుంబాన్ని ఆదుకుని మంచి మనసును చాటుకున్నారు. కళాకారుడు మరణించిన కుటుంబానికి రూ.2.17 లక్షల ఆర్థికసాయం అందించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బ్రహ్మనందం చేసిన పనిని అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మనందం కళాకారులను ఉద్దేశించి మాట్లాడారు. -
లారీలకు రంగులేసిన వ్యక్తి ఇప్పుడు నవ్వుల రేడు!
టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. కొన్ని వందల చిత్రాల్లో నటించిన ఆయన తెలుగు సినీ ప్రేక్షకులను తన హావభావాలతో కట్టిపడేశారు. తాజాగా ఆయన నేడు 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో బ్రహ్మానందం జన్మించారు. ఇవాళ ఆయన బర్త్‌డే కావడంతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. టాలీవుడ్లో ఆయన చేసిన సినిమాలకు ఏకంగా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కిన తొలి నటుడిగా నిలిచారు. కేవలం ముఖ కవళికలతోనే నవ్వించే టాలెంట్ ఆయనకు మాత్రమే సొంతం. అందుకే అతన్ని హాస్య బ్రహ్మ అనే బిరుదు పొందారు. బహ్మనందం సినీ ఇండస్ట్రీలో 31 ఏళ్ల పాటు కమెడియన్‌గా అభిమానులను అలరించారు. ఆయన దాదాపు 1200లకు పైగా సినిమాల్లో నటించారు. గతేడాది రంగమార్తాండ చిత్రంలో కనిపించిన ఆయన అనారోగ్య సమస్యల కారణంగా పెద్దగా సినిమాలు చేయడం లేదు. బహ్మనందం ప్రస్థానమిది.. ఎక్కడో మూరుమూల గ్రామంలో పుట్టి పెరిగిన కుర్రాడు ఇంత స్థాయికి ఎదుగుతాడని ఎవరూ ఊహించి ఉండరు. చెప్పులు కూడా కొనలేని స్థితిలో నుంచి లెక్చరర్‌గా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు. అయితే తన వద్ద చదువుకోవడానికి డబ్బు లేకపోవడంతో ఇతరుల సాయంతోనే చదువు పూర్తి చేశారు. తనకు సాయం చేసినవాళ్ల ఇంట్లో చిన్నపాటి పనులు చేసిపెడుతూ ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినట్లు తెలిపాడు. అయితే పీజీ చేసేందుకు తన దగ్గర డబ్బులు లేని పరిస్థితి. అదే సమయంలో వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీ అధికారులు గుంటూరులో పీజీ సెంటర్ ఓపెన్ చేశారు. బ్రహ్మానందం టాలెంట్, కామెడీని చూసి ఎంఏ తెలుగులో ఫ్రీ సీట్ ఇచ్చారు. గుంటూరు సమీపంలో నల్లపాడులో చిన్న అద్దెగదుల్లో చేరిన ఆయన అనసూయమ్మ చేసిన ఆర్థిక సాయంతో చదువుకున్నారు. లారీలకు రంగులు వేస్తూ.. పీజీ చదువుకునే రోజుల్లో నల్లపాడు రూమ్ నుంచి కాలేజీకి వెళ్లే దారిలో లారీలకు పెయింట్ వేసేవాళ్లు. సాయంత్రం కాలేజీ అయిపోగానే పాత బట్టలు వేసుకుని అక్కడికి వెళ్లి లారీలకు పెయింట్ వేశారు. తాను చేసిన పనికి నాలుగైదు రూపాయలు ఇచ్చేవారని పుస్తకంలో రాసుకొచ్చాడు బ్రహ్మానందం. అలా సొంతంగా పనులు చేసుకుంటూ.. దాతల సాయంతో చదువుతూ తన చదువు పూర్తి చేసి లెక్చరర్‌గా మారాడు. ఆ తర్వాత లెక్చరర్ స్థాయి నుంచి టాలీవుడ్లోనే ప్రముఖ హాస్యనటుడిగా ఎదిగిన తీరు అద్భుతం. కళారంగంలో ఆయన ప్రతిభను గుర్తించిన కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. ఎంత సంపాదించారంటే.. కొన్ని వందల సినిమాల్లో మెప్పించిన హాస్య బ్రహ్మ ఆస్తులు ఎంత సంపాదించారో తెలుసుకుందాం. చదువుకోవడానికి డబ్బుల్లేని స్థితి నుంచి వందల కోట్ల ఆస్తులు సంపాదించారు. ఇవాళ ఆయన బర్త్‌డే కావడంతో అభిమానుల్లో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఈ సందర్భంగా బ్రహ్మానందం ఆస్తుల వివరాలపై ఓ లుక్కేద్దాం. తాజా సమాచారం ప్రకారం.. ఆయన స్థిర, చరాస్థులు కలిపి దాదాపు రూ. 500 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమిక అంచనా. లగ్జరీ కార్లు.. ఆయనకు కోట్లు విలువ చేసే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉందట. దీనితో పాటు జూబ్లీహిల్స్‌లో ఓ లగ్జరీ ఇల్లు కూడా. కార్ల విషయానికొస్తే ఆడి క్యూ7, క్యూ8(ఆడి ఆర్8, ఆడి క్యూ7)తో పాటు మెర్సిడెజ్ బెంజ్ కారు ఉందట. ఇలా నటుడిగా బ్రహ్మీ బాగానే ఆస్తులు సంపాదించారట. అయితే వీటిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. ఆత్మకథ రాసుకున్న హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కేవలం నటుడు మాత్రమే కాదు.. చిత్ర కళాకారుడనే విషయం తెలిసిందే. విరామ సమయంలో ఆయన దేవుళ్ల చిత్రాలను గీస్తూ వాటిని హీరోలకు, సన్నిహితులకు బహుమతిగా ఇస్తుంటారు. ఒకప్పుడు విద్యార్థులకు పాఠాలు బోధించిన బ్రహ్మనందం.. నేడు తిరుగులేని నటుడిగా తన పేరు చరిత్రలో లిఖించుకున్నారు. ఇటీవలే మీ బ్రహ్మానందం పేరిట తన ఆత్మకథ రాసుకున్నాడు. ఆ పుస్తకాన్ని మెగాస్టార్, రామ్‌చరణ్‌కు అందించారు. పెద్దగా వివాదాల జోలికి పోలేదని, కానీ తనలోని సంఘర్షణలకు పుస్తకరూపం ఇచ్చానన్నాడు బ్రహ్మానందం. -
బ్రహ్మానందం, రఘుబాబు మరియు సప్తగిరి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి
-
ఒకే ఫొటోలో ఐదుగురు స్టార్ కమెడియన్స్.. అరుదైన దృశ్యం చూశారా?
సినిమాకు కామెడీ అనేది ప్రధానం. ఎంత పెద్దసినిమా అయినా సరే కాసింతైనా కామెడీ లేకపోతే అభిమానులు నిరాశ చెందడం ఖాయం. కథ ఎంత బలంగా ఉన్నప్పటికీ.. కామెడీ కనిపించకపోతే అబ్బే ఏదో సినిమాలో లోపించందండి అంటుంటారు. పెద్ద హీరోల సినిమాలైనా సరే కామెడీకి అంత ప్రాధాన్యత ఉంటుంది. అలా తెలుగు సినిమాలో 1990ల్లో కడుపుబ్బా నవ్వించిన వారిలో ఠక్కున వినిపించే పేర్లు బాబు మోహన్, కోట శ్రీనివాసరావు జోడీ. వీరిద్దరు చేసిన కామెడీ తెలుగు ప్రజలను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, ఎంఎస్ సత్యనారాయణ, బ్రహ్మనందం లాంటి వాళ్లు తెలుగు సినిమా కామెడీని ఓ రేంజ్‌కు తీసుకెళ్లారు. ఇప్పట్లో కమెడియన్ అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు బ్రహ్మనందమే. ఆయన లేకుండా సినిమా లేదంటే ఓ వెలితి ఉన్నట్లే అనిపిస్తుంది. అలా తన కామెడీతో సినీ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. (ఇది చదవండి: సినిమాల్లో స్టార్ హీరోయిన్.. కానీ ఆమె జీవితమే ఓ విషాదగాథ!) అయితే ఒక్క కమెడియన్ సినిమాలో ఉంటేనే కడుపు చెక్కలయ్యేలా నవ్వడం ఖాయం. అలా ఏకంగా ఐదుగురు స్టార్ కమెడియన్స్ ఓకే ఫోటోలో కనిపిస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది. ఇక నవ్వులే నవ్వులు. అలాంటి అరుదైన సన్నివేశం కూడా చోటు చేసుకుంది. దాదాపు 30 ఏళ్ల క్రితమే తెలుగులో స్టార్ కమెడియన్స్‌గా పేరొందిన ఆ ఐదుగురి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అప్పటి ఐదుగురు తెలుగు స్టార్ కమెడియన్స్ ఫోటోను నెటిజన్ ట్వీట్ చేయగా.. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి తన అనుభవాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. ఇది మా పాతికేళ్ల కామెడీ కుటుంబం అంటూ నెటిజన్‌కు రిప్లై ఇచ్చాడు. ఓకే ఫోటోలో బ్రహ్మనందం, బాబు మోహన్, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, చలపతిరావు నవ్వుతూ కనిపించారు. అయితే ఈ ఫోటో చూసిన అభిమానులు సైతం తెలుగు సినిమా కామెడీ కుటుంబం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా ఆ జోక్ ఏంటో మాకు కూడా చెప్పండి సార్ అంటూ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా కమెడియన్ సినిమాకు ప్రాణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. (ఇది చదవండి: Kutty Padmini: కమల్, వాణి గురించి చెప్పినా శ్రీవిద్య నమ్మలేదు.. పాపం!) పాతికేళ్ల క్రితం మా కామెడీ కుటుంబం! 🥰 https://t.co/WW2dmgePOl — Tanikella Bharani (@TanikellaBharni) August 7, 2023 -
బ్రహ్మనందం కుమారుడు రాజ గౌతమ్.. నెల సంపాదన ఎంతో తెలుసా?
బ్రహ్మనందం టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కమెడియన్‌గా ఆయన తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో బ్రహ్మనందం లేకపోతే ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో బ్రహ్మనందం అంటే అంతలా ఫేమస్.. మరీ ఆయన కుమారుడు రాజ గౌతమ్ ఈ విషయంలో సక్సెస్ కాలేకపోయాడు. తండ్రి బాటలో నడిచిన ఇండస్ట్రీలో నిలదొక్కుకొలేకపోయారు. (ఇది చదవండి: ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ కూడా చేశా.. విడాకులపై గజినీ హీరోయిన్!) పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతో గుర్తింపు వచ్చినా అంతగా ఫేమ్ రాలేదు. ఆ తర్వాత బసంతి, చారుశీల, మను లాంటి చిత్రాల్లో కనిపించారు. అలా అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వస్తున్న గౌతమ్.. తాజాగా బ్రేక్ అవుట్ అనే సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. అయితే గౌతమ్‌కు సినిమాల్లో నటించడం అసలు డ్రీమ్ కాదట. మరీ రాజ గౌతమ్ సినిమాలు కాకుండా ఏం చేస్తాడో మీకు తెలుసా? ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. కేవలం టైమ్ పాస్ కోసమే సినిమాలు చేస్తుంటాడని టాక్ వినిపిస్తోంది. ఆయన అసలు వృత్తి వ్యాపారం. గౌతమ్‌కు హైదరాబాద్‌లో కమర్షియల్ కాంప్లెక్స్‌లతో పాటు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలలో పెట్టుబడులు కూడా పెట్టారట. అంతేకాకుండా బెంగళూరులోనూ చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయట. కేవలం వాటి ద్వారానే నెలకు రూ.30 కోట్ల రూపాయిల ఆదాయం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంత సంపాదన వస్తే ఇంకా సినిమాల్లో నటించాల్సిన అవసరమేముంది మీరే చెప్పండి. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు సినిమాలు చేస్తుంటాడని చెబుతున్నారు అంతే. (ఇది చదవండి: అసలు ఈ డిజాస్టర్ ఏంటి?.. ఆ సాంగ్‌పై షోయబ్ అక్తర్ ఆసక్తికర కామెంట్స్!) View this post on Instagram A post shared by Raja Goutham (@rajagoutham) -
చంటి సినిమా నటి.. ఇప్పుడు ఎంతలా మారిపోయిందో చూశారా?
సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ కలల ప్రపంచం. ఇందులో గుర్తింపు రావడమంటే ఆషామాషీ కాదు. కొందరికీ స్టార్డమ్ వచ్చినా అది ఎక్కువకాలం నిలబెట్టుకోవాలంటే కత్తిమీద సాములాంటిదే. అలా కొందరు నటీమణులు వెండితెరపై కనిపించి కనుమరుగవడం చూస్తుంటాం. వారు చేసింది కొంతకాలమే అయినా.. వారి నటనతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటారు. అలా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అనుజా రెడ్డి . తెలుగమ్మాయి అయినప్పటికీ.. మలయాళం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. కేవలం మాతృభాషతో పాటు ఇతర భాషల్లో నటిగా, హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'బిచ్చగాడు 2'.. స్ట్రీమింగ్ అందులో) అనూజ రెడ్డి అంటే ఇప్పటి వారికి చాలామందికి పరిచయం లేకపోవచ్చు. ఆమెను ప్రస్తుతం సినీ ప్రేక్షకులు గుర్తు పట్టలేకపోవచ్చు. కానీ 1980లో హీరోయిన్గా, లేడీ కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించారామె. బ్రహ్మానందం-అనూజ కాంబినేషన్లో వచ్చిన కామెడీ సీన్లకు చాలా క్రేజ్ ఉంది. చంటి, పెళ్లి చేసుకుందాం సినిమాల్లో తనదై నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనూజ రెడ్డి 2004 వరకు ఆమె సినిమాల్లో నటించారు. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అయితే ప్రస్తుతం ఆమె ఇప్పుడేం చేస్తోంది. ఎలా ఉందో తెలుసుకుందాం. గుంటూరు జిల్లాలో జన్మించిన అనూజ రెడ్డి 14 ఏళ్లకే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆమెకు మూడేళ్ల వయసులోనే వారి కుటుంబం చెన్నైలోని కోడంబాక్కంలో సెటిలైంది. ఓ సినిమా కోసం తెలుగు అమ్మాయి కోసం అనూజ రెడ్డి ఉండే ఏరియాకు వచ్చింది. ఆ తర్వాత ఆమె ఓ మలయాళ సినిమాకు సెలెక్ట్ అయింది. చిన్న వయసులో తనకు సినిమాలు చేయటం ఇబ్బందిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పారట. (ఇది చదవండి: టాలీవుడ్ యాంకర్‌తో పెళ్లి.. మా బంధం అలాంటిది: జేడీ చక్రవర్తి) అయినప్పటికీ సినిమాల్లో మంచి మంచి అవకాశాలు రావటంతో తప్పలేదని తెలిపింది. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు జన్మించాడు. అనూజ కొంతకాలంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్‌గా మారాయి. అప్పట్లో సినిమాల్లో కామెడీతో అందరినీ నవ్వించిన అనూజ రెడ్డిని ఇప్పుడు చూస్తి ఇంతలా మారిపోయిందేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
బ్రహ్మానందం ఇంట పెళ్లిసందడి.. ఘనంగా కొడుకు నిశ్చితార్థం
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కొడుకు సిద్దార్థ్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. డాక్టర్ ఐశ్వర్యతో ఎంగేజ్మెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు కమెడియన్ ఆలీ, సుబ్బిరామిరెడ్డి సహా పలువురు సినీ సెలబ్రిటీలు విచ్చేసి నూతన జంటను ఆశీర్వదించారు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తెలుస్తుంది. ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా బ్రహ్మానందంకు ఇద్దరు కొడుకులున్న సంగతి తెలిసిందే. చదవండి: నటిని పెళ్లాడిన బుల్లితెర నటుడు.. ఆమెను మోసం చేశావంటూ ట్రోల్స్ పెద్ద కొడుకు రాజా గౌతమ్ పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు.గౌతమ్‌కు ఇది వరకే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో చదువుకొని అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రంగమార్తాండలో బ్రహ్మానందం నటనకు చిరంజీవి ప్రశంసలు
ఆడియెన్స్‌ని తనదైన కామెడీ పాత్రలతో కడుపుబ్బా నవ్వించి ఆకట్టుకునే కమెడియన్ బ్రహ్మానందం. స్క్రీన్‌పై ఆయన ఒక్కసారి కనిపిస్తే చాలు, స్టార్ హీరోలకు ధీటుగా రెస్పాన్స్ వస్తుంటుంది. అయితే కెరీర్ లో తొలిసారిగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ మూవీలో ఒక సీరియస్ రోల్లో కనిపించారు బ్రహ్మానందం. ఉగాది సందర్భంగా విడుదలైన రంగమార్తాండ మంచి మౌత్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా థియేటర్స్‌లో రన్ అవుతోంది. సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ బ్రహ్మానందం నటనకు ముగ్దులవుతున్నారు. ఇన్నాళ్లు మనల్ని నవ్వించిన బ్రహ్మానందం ఇలా ఏడిపించేశారు ఏంటి? అని అనుకుంటున్నారు. థియేటర్లో బ్రహ్మానందం సీన్లకు ఆడియెన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. బ్రహ్మానందం నటించిన పాత్రకు ఇంత మంచి పేరు రావడంతో మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు. శాలువాతో సత్కరించారు. -
'వరదరాజు' పాత్రలో బ్రహ్మానందం.. స్పెషల్ పోస్టర్ రిలీజ్
తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కీడా కోలా’. ఎనిమిది ప్రధాన పాత్రలతో ఈ మూవీ రూపొందుతోంది. వారిలో బ్రహ్మానందం ఒక కీలక పాత్ర చేస్తున్నారు. బుధవారం బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘మీ ప్రపంచం వింతగా మారబోతోంది’ అని పోస్టర్‌పై క్యాప్షన్ ఇచ్చారు. ‘‘ప్రతి ఇంట్లో ఉండే తాత పాత్రలో (వరదరాజు) బ్రహ్మానందంగారు కనిపిస్తారు’’ అన్నారు తరుణ్ భాస్కర్. Bhascker meets Bramhi.#keedaacola #Brahmanandam pic.twitter.com/PvOB0j3Dlw — Tharun Bhascker Dhaassyam (@TharunBhasckerD) February 1, 2023 -
Happy Birthday Brahmanandam: బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్ ఫోటోలు
-
నాకు తెలిసిన బ్రహ్మనందం ఓ లెక్చరర్: మెగాస్టార్
హాస్యనటుడు అనే పదం ఆయనకు సరిపోదేమో.. ఎందుకంటే అంతలా అభిమానుల గుండెల్లో పేరు సంపాదించాడు. హాస్యమే ఆయన కోసం పుట్టిందంటే ఆ పదానికి సరైన అర్థం దొరుకుతుందేమో. అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయనే టాలీవుడ్ హాస్యనటుడు బ్రహ్మనందం. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు . బ్రహ్మనందం అసమాన ప్రతిభను ఆయన కొనియాడారు. ఈ మేరకు ట్విటర్లో సందేశం పోస్ట్ చేశారు. మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'నాకు తెలిసిన బ్రహ్మనందం అత్తిలిలో ఓ లెక్చరర్. ఈ రోజు బ్రహ్మనందం ప్రపంచంలోనే అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కెక్కిన ఒక గొప్ప హాస్య నటుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. కామెడీకి నిలువెత్తు నిదర్శనం. అతను కామెడీ చేయనక్కర్లేదు. అతని మొహం చూస్తేనే హాస్యం వెల్లివిరుస్తుంది. పొట్ట చెక్కలవుతుంది. ఇలాంటి బ్రహ్మనందానికి హృదయపూర్వక శుభాభినందనలు. బ్రహ్మనందం ఇలాగే జీవితాంతం నవ్వుతూ, పదిమందిని నవ్విస్తూ ఉండాలని, బ్రహ్మనందంకు మరింత బ్రహ్మండమైన భవిష్యత్ ఉండాలని, తన పరిపూర్ణ జీవితం ఇలాగే బ్రహ్మనందకరంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ తనకి నా జన్మదిన శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. హాస్య నటుడు బ్రహ్మనందంకు టాలీవుడ్ ప్రముఖులు అభినందనలు చెబుతున్నారు. Happy Birthday Dear Brahmanandam 💐 pic.twitter.com/sp0r9wUJPQ — Chiranjeevi Konidela (@KChiruTweets) February 1, 2023 -
బ్రహ్మానందం ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Comedian Brahmanandam Assets, Net Worth: హాస్య బ్రహ్మ బ్రహ్మానందం.. కామెడీకి కేరాఫ్ అడ్రస్. తెరమీద ఆయన కనిపిస్తే చాలు థియేటర్లో నవ్వులు విరబూస్తాయి. ఆయన పేరు తలుచుకున్నా సరే పెదాలపై చిరునవ్వు వచ్చేస్తుంది.. దటీజ్ బ్రహ్మానందం. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన బ్రహ్మానందం తనదైన ఎక్స్‌ప్రెషన్స్‌తో చక్కిలిగింతలు పెట్టిస్తారు. అందుకే ఈమధ్య ఆయన సినిమాలు తగ్గించినా సోషల్‌మీడియాలో మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు. సోషల్ మీడియాలో బ్రహ్మానందం ఇమేజ్ అసామాన్యమైంది. ఎందుకంటే బ్రహ్మీ లేని మీమ్స్ ఊహించడం కూడా కష్టమే. ఆయన స్టైల్లో చెప్పే డైలాగులు ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. ఇండస్ట్రీలో కామెడీ కింగ్‌గా సుమారు 1250కి పైగా సినిమాల్లో నటించిన ఆయన 2010 లో గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. సినిమా ఎలాంటిదైనా అందులో బ్రహ్మీ మార్క్ ఖచ్చితంగా కనపడుతుంది. అందుకే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో బ్రహ్మానందం కూడా ఒకరు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తుల విలువ ఎంత ఉంటుదన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిబడి పెట్టిన బ్రహ్మానందం ఆస్తుల విలువ సుమారు రూ.400కోట్ల నుండీ రూ.450 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. -
హాస్యబ్రహ్మ: బ్రహ్మీ ...‘ది హీరో’
హాస్యబ్రహ్మ...నవ్వుల రారాజు.. కామెడీ కింగ్..కామెడీకి బ్రాండ్ అంబాసిడర్.. అసలు ఏ పేరుపెట్టి పిలవాలి? ఆయన కనుబొమ్మ అలా ఎగరేస్తే చాలు ప్రేక్షకుడి పొట్ట చెక్క లవ్వాల్సిందే. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం పేరు తలుచుకుంటే చాలు మనం ఏమూడ్‌లో ఉన్నా చిరునవ్వు ఇట్టే వచ్చేస్తుంది.. దటీజ్ బ్రహ్మానందం. బహుశా అందుకే ఆయనకు చిన్నప్పుడే బ్రహ్మా..నందం అని పేరు పెట్టాశారేమో. టాలీవుడ్‌కు జంధ్యాల పరిచయం చేసిన తెలుగు మాస్టారు బ్రహ్మానందం బర్త్‌డే సందర్భంగా ఈ స్పెషల్ వీడియో మీకోసం... కన్నెగంటి బ్రహ్మానందం అనే బ్రహ్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, సత్తెనపల్లిలో 1956 ఫిబ్రవరి 1న జన్మించారు. విద్యాభ్యాసం తరువాత అత్తిలిలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆయను వెండితెరకు పరిచయం చేసిన ఘనత ప్రముఖ దర్శకుడు జంధ్యాలకు దక్కుతుంది. నటుడిగా బ్రహ్మానందంగా అరంగేట్రం చేసింది, తొలి వేషం వేసిందీ కూడా ఫిబ్రవరి 1వ తేదీనే కావడం విశేషం. నరేష్ హీరోగా నటించిన తాతావతారం మూవీలో నటించారు. ఆ తరువాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఎవరగ్రీన్ క్లాసిక్ ’అహానా పెళ్లంట’ సినిమాలో అరగుండు బ్రహ్మానందంగా పండించిన హాస్యానికి జనం విరగబడి నవ్వారు. జయహో బ్రహ్మానందం అంటూ నవ్వుల రారాజుకి బ్రహ్మరథం పట్టారు. ఇక అది మొదలు తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి..నవ్వించీ కరియర్‌కు తిరుగులేని బాట వేసుకున్నారు. సినీ దర్శక నిర్మాతలకే కాదు టాప్ హీరోలకు కూడా బ్రహ్మానందం ఫ్యావరేట్‌గా మారిపోయాడు. అరగుండు, కిల్ బిల్ పాండే, కత్తి రాందాస్, ఖాన్ దాదా, శంకర్ దాదా ఆర్ ఎంపి, నెల్లూరి పెద్దారెడ్డి, గచ్చిబౌలి దివాకర్, లవంగం, భట్టు , మైఖెల్ జాక్సన్, పద్మశ్రీ, ప్రణవ్, జయసూర్య లాంటి పాత్రల్లో ఆయన పండించిన అద్భుతమైన కామెడీ నభూతో నభవిష్యతి. దశాబ్దాలు గడిచినా ఆ పాత్రలు తలుచుకుంటే ఇప్పటికీ నవ్వులు పువ్వులు విరగబూయాల్సిందే. అలాగే అలనాటి హీరోలు మొదలుమొత్తం మూడు తరాల వారితో కలిసి కామెడీ పండించిన భాగ్యం దక్కిన ఏకైక కమెడియన్ ఆయన. అంతేకాదు బ్రహ్మానందం గొప్ప మిమిక్రీ ఆర్టిస్టు కూడా. మరోవైపు సోషల్ మీడియాలో బ్రహ్మానందం ఇమేజ్ అసామాన్యమైంది. సందర్భం ఏదైనా బ్రహ్మానందం ఇమేజ్‌లేని మీమ్స్ లేవంటే అతిశయోక్తి లేదు. ఆయన పలికించని భావం, రస ఉందా అసలు. బ్రహ్మానందం పలికించిన హావభావాల ప్రాధాన్యత పాపులారిటీ అలాంటి మరిది. జంబలకిడి పంబ, చిత్రం భళారే విచిత్రం, మనీ, వినోదం అనగనగ ఓ రోజు, మన్మధుడు, అతడు, దూకుడు, అదుర్స్, రేసుగుర్రం ఇలా.. జాతిరత్నందాకా ఆయన సినీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. ఏకంగా ఐదు నంది అవార్డులను కూడా గెలుచుకున్నారు. ఆయన విశిష్ట సేవలను గురించిన భారత ప్రభుత్వం 2010లో పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది. ఒక ఫిలిమ్ ఫేర్ అవార్డు సైతం అందుకున్నాడు. అలాగే 2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బ్రహ్మానందానికి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ మధ్య కాలంలో సినిమాలను తగ్గించిన బ్రహ్మానందం తనలోని మరో కళా నైపుణ్యాన్ని చాటుకుంటున్నారు. అద్భుత పెన్సిల్ స్కెచ్‌లతో ఫ్యాన్స్‌తో ఔరా అనిపించుకుంటున్నారు బ్రహ్మానందం. -
బ్రహ్మానందం, జగపతిబాబులకు సాఫల్య పురస్కారం
సాక్షి, న్యూఢిల్లీ: హాస్యనటుడు బ్రహ్మానందం, నటుడు జగపతిబాబుకు ఢిల్లీ తెలుగు అకాడమీ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. ఢిల్లీ తెలుగు అకాడమీ 29వ వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం ఢిల్లీలోని మావలాంకర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూ పానందేంద్ర సరస్వతి స్వామీజీ, అకాడమీ చైర్మన్ మోహన్ కందా తదితరులు బ్రహ్మానందానికి అవార్డును అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి జగపతిబాబు హాజరుకాలేకపోయారు. అనంతరం జస్టిస్ ఎన్.వి.రమణ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు ఎక్కుడున్నా ఐక్యం గా ఉండాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఆయా రాష్ట్రాల వేడుకలు ఢిల్లీలో జరిగితే పెద్ద ఎత్తున హాజరవుతారని, అయితే తెలుగు ప్రజల్లో అది లోపించినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వివిధ రంగాల్లో విశేష సేవ చేసిన వారిని గుర్తించి సత్కరిస్తున్న తెలుగు అకాడమీ కృషిని స్వరూపానందేంద్ర సరస్వతి అభినందించారు. పురస్కారాన్ని స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నట్టు బ్రహ్మానందం పేర్కొన్నారు. భాషను కాపాడితే జాతిని కాపాడినట్టేనని.. తెలుగు జాతి గొప్పదనాన్ని తల్లిదండ్రులు వారి పిల్లలకు అందించాలని వ్యాఖ్యానించారు. అలాగే పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రతిభా పురస్కారాలను అందజేశారు. సినీరంగం నుంచి మురళీమో హన్, సాయికుమార్, తనికెళ్ల భరణి, అలీలకు పురస్కారాలు ప్రదానం చేశారు. సామాజిక సేవ విభాగంలో డాక్టర్ ఆర్.గురుప్రసాద్, విద్యారంగం నుంచి రావూరి వెంకటస్వామి, ఆర్థికశాఖ నుంచి వై.మహేశ్‌రెడ్డిలు పురస్కారాలు అందుకున్నారు. వైద్యరంగంలో దశరథరామిరెడ్డికి.. సాక్షి, హైదరాబాద్: వైద్యరంగంలో యశోద ఆసుపత్రి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ దశరథరామిరెడ్డిని ప్రతిభా భారతి పురస్కారం వరించింది. అస్సాం గవర్నర్ జగదీశ్‌ముఖి, జస్టిస్ ఎన్.వి.రమణలు దశరథరామి రెడ్డికి అవార్డు అందజేసి సత్కరించారు. -
కడుపుబ్బ నవ్వించి.. కంటతడి పెట్టించి..
సాంబమూర్తినగర్ (కాకినాడ) : ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (రామ్‌కోసా) సమావేశంలో తన విశిష్ట ప్రతిభను కనబరిచారు. ఆర్ఎంసీ ఆడిటో రియంలో శనివారం రామ్‌కోసా 10వ అ లూమినీ సమావేశం ప్రముఖ నిర్మాత, సంఘం అధ్యక్షుడు డాక్టర్ కేఎల్ నారాయణ అధ్యక్షతన జరిగింది. నారాయణ అభ్యర్థన మేరకు అతిథిగా హాజరైన బ్ర హ్మానందం..స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ ప్రముఖుని సన్మాన కార్యక్రమంలో వక్తల హావభావాల్ని అనుకరిస్తూ కడుపుబ్బ నవ్వించారు. చివరిగా ఆయన ఓ మానసిక వికలాంగుడి హావభావాల్ని ప్రదర్శించి, మనసుల్ని క దిలించి కంటతడి పెట్టించారు. బ్రహ్మానందం ప్రసంగించినంత సేపూ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, వై ద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీని వాస్, వైద్యులు కరతాళధ్వనులు చేశారు. వైద్యులు కనిపించే దేవుళ్లని బ్రహ్మానం దం అన్నారు. వైద్య విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. -
కడుపుబ్బ నవ్వించి.. కంటతడి పెట్టించి..
-
కంటతడి పెట్టించిన బ్రహ్మి