
కడుపుబ్బ నవ్వించి.. కంటతడి పెట్టించి..
సాంబమూర్తినగర్ (కాకినాడ) : ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (రామ్‌కోసా) సమావేశంలో తన విశిష్ట ప్రతిభను కనబరిచారు. ఆర్‌ఎంసీ ఆడిటో రియంలో శనివారం రామ్‌కోసా 10వ అ లూమినీ సమావేశం ప్రముఖ నిర్మాత, సంఘం అధ్యక్షుడు డాక్టర్ కేఎల్ నారాయణ అధ్యక్షతన జరిగింది. నారాయణ అభ్యర్థన మేరకు అతిథిగా హాజరైన బ్ర హ్మానందం..స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ ప్రముఖుని సన్మాన కార్యక్రమంలో వక్తల హావభావాల్ని అనుకరిస్తూ కడుపుబ్బ నవ్వించారు.
చివరిగా ఆయన ఓ మానసిక వికలాంగుడి హావభావాల్ని ప్రదర్శించి, మనసుల్ని క దిలించి కంటతడి పెట్టించారు. బ్రహ్మానందం ప్రసంగించినంత సేపూ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, వై ద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీని వాస్, వైద్యులు కరతాళధ్వనులు చేశారు. వైద్యులు కనిపించే దేవుళ్లని బ్రహ్మానం దం అన్నారు. వైద్య విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.