![Medical Student Life Ends In Kakinada](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/Medical-Student.jpg.webp?itok=OQZGv_lw)
సాక్షి, కాకినాడ: కాకినాడలో మెడికల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న రావూరి సాయిరాం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డాక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, 21 నుంచి పరీక్షలు ఉన్నాయని.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేదానిపై తెలియలేదన్నారు. ఎగ్జామ్స్ ముందు కౌన్సిలింగ్ ఉంటుంది. చాలా ఈజీ సబ్జెక్ట్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియాలి. ఫస్ట్ ఇయర్‌లో మంచి మార్కులు వచ్చాయి.. స్పోర్ట్స్ కూడా బాగా ఆడతాడని ఉమామహేశ్వరరావు అన్నారు.
రైలు కిందపడి..
శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గ ఎల్‌సీ గేటు దగ్గర గూడ్స్ రైలు క్రింద పడి గుర్తు తెలియని యువకుడు (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వివరాల కోసం రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పలాస రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment