Medical Students
-
కాకినాడలో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, కాకినాడ: కాకినాడలో మెడికల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న రావూరి సాయిరాం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.డాక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, 21 నుంచి పరీక్షలు ఉన్నాయని.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేదానిపై తెలియలేదన్నారు. ఎగ్జామ్స్ ముందు కౌన్సిలింగ్ ఉంటుంది. చాలా ఈజీ సబ్జెక్ట్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియాలి. ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు వచ్చాయి.. స్పోర్ట్స్ కూడా బాగా ఆడతాడని ఉమామహేశ్వరరావు అన్నారు.రైలు కిందపడి..శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గ ఎల్సీ గేటు దగ్గర గూడ్స్ రైలు క్రింద పడి గుర్తు తెలియని యువకుడు (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వివరాల కోసం రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పలాస రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఇన్సర్విస్ డాక్టర్ల ‘పీజీ’ ఆశలు అడియాసలేనా?
సాక్షి, హైదరాబాద్: నీట్– పీజీ వైద్య ప్రవేశాలకు సంబంధించిన గందరగోళానికి తెరపడడం లేదు. స్టేట్‌పూల్ కోటాలోని పీజీ సీట్లు పూర్తిస్థాయిలో తెలంగాణ వాళ్లకే చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తెచ్చిన జీవోలు 148, 149పై మొదలైన అలజడి ఆగడం లేదు. జీవో 148(అల్లోపతి), 149 (ఆయుర్వేదం, హోమియోపతి) ద్వారా మెడికల్ పీజీలో అడ్మిషన్లు పొందేందుకు నిర్ణయించిన స్థానికత అంశంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ‘తెలంగాణలో ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ చదివిన వారంతా ప్రెసిడెన్షియల్ ఆర్డర్–1974 ప్రకారం ‘లోకల్ ఏరియా’ పరిధిలోకి వస్తారని, వారు పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు అర్హులేనని హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, జనవరి 7న విచారణకు రానుంది.ఈ వివాదం కొనసాగుతుండగానే... తెలంగాణ స్థానికులుగా ఉండి ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివి... ఇన్‌సర్వీస్ డాక్టర్లుగా రాష్ట్రంలో సేవలందిస్తున్న డాక్టర్ల అంశం తెరపైకి వచ్చింది. తెలంగాణలో పుట్టి పెరిగి ఇంటర్మీడియెట్ వరకు సొంత ప్రాంతంలో చదివినప్పటికీ... ఎంసెట్ ర్యాంకు ద్వారా ఇతర రాష్ట్రాల్లోనో, వేరే దేశంలోనో వైద్యవిద్య అభ్యసించి, సొంత రాష్ట్రంలో పనిచేస్తున్న డాక్టర్లు పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు అనర్హులుగా మారడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్లు చదివి, అనంతరం రాష్ట్రంలోనే ఎంబీబీఎస్/ బీఏఎంఎస్/ బీహెచ్ఎంఎస్ చదివిన వారే పీజీ అడ్మిషన్లలో స్టేట్ పూల్‌లో రాష్ట్రంలో చదివేందుకు అర్హులని ప్రభుత్వం 148, 149 జీవోల్లో స్పష్టం చేసింది. ఈ అంశంపై హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించలేదు.దీంతో ఇంటర్ వరకు ఏపీ లేదా ఇతర రాష్ట్రాల్లో చదివి తెలంగాణలో ఎంబీబీఎస్ చేసిన వారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్–1974 ప్రకారం ‘లోకల్ ఏరియా’ కిందికి వచ్చి పీజీ కోర్సులకు అర్హులవుతుండగా... ఇంటర్ వరకు తెలంగాణలో చదివినప్పటికీ... వైద్య విద్యను ఇతర రాష్ట్రాల్లో అభ్యసించి సొంత రాష్ట్రంలో పనిచేస్తున్న వారు అనర్హులుగా మారారు. ప్రభుత్వం ఎంబీబీఎస్ తెలంగాణలో చదివిన వారంతా స్థానికులే అన్న హైకోర్టు తీర్పును మాత్రమే సవాల్ చేసిన నేపథ్యంలో.. ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ చదివి ఇన్సర్విస్ డాక్టర్లుగా ఉన్న వారి పరిస్థితి ఎటూ తేలకుండా పోతోంది. దీంతో వారు తమ స్థానికత అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బలయ్యేది ఇన్సర్విస్ డాక్టర్లే.. తెలంగాణ ఏర్పాటయ్యేంత వరకు ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకును బట్టి నాన్‌లోకల్ కేటగిరీలో మెరిట్ ఆధారంగా ఆంధ్ర, రాయలసీమలోని కళాశాలల్లో ఎంబీబీఎస్ విద్యనభ్యసించిన రాష్ట్రానికి చెందిన వారు వందలాది మంది ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణేతర ప్రాంతాల్లో వైద్యవిద్య పూర్తి చేసినప్పటికీ... ప్రభుత్వ సర్విసులో చేరి గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగం చేసి, స్టేట్ పూల్ కింద 15 శాతం నాన్‌లోకల్ కోటాలో పీజీ అడ్మిషన్లు పొందేవారు.148, 149 జీవోల ప్రకారం తెలంగాణలో వైద్యవిద్య అభ్యసించిన స్థానికులకే స్టేట్పూల్లో పీజీలో అడ్మిషన్లకు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేయడంతో... ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్, ఇతర కోర్సులు చదివి ఇన్సర్విస్లో ఉన్న వైద్యులకు పీజీకి అర్హత లేకుండా పోయింది. ఈ సంవత్సరం కాళోజీ యూనివర్సిటీ విడుదల చేసిన నోటిఫికేషన్లోనూ వీరికి దరఖాస్తు చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వలేదు. పట్టించుకోని ప్రభుత్వం ఇన్సర్విస్ కోటాలో తెలంగాణలో ఉద్యోగం చేస్తున్న వైద్యులు తమకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ హైకోర్టు ఇచ్చిన 106 పేజీల తీర్పులో ఇన్సర్విస్ డాక్టర్ల అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో తమకు సర్వీస్ మొత్తం ఎంబీబీఎస్ అర్హతతోనే పదవీ విరమణ వరకు ఉద్యోగం చేసే పరిస్థితి తలెత్తిందని వైద్యులు వాపోతున్నారు. ఇన్సర్విస్ డాక్టర్లకు న్యాయం జరిగేలా పీజీ అడ్మిషన్లలో అవకాశం లభించేలా కృషి చేయాలని, న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ కత్తి జనార్ధన్, డాక్టర్ పూర్ణచందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
గుండెపోటుతో ఎంబీబీఎస్ స్టూడెంట్ మృతి
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని మహవీర్ మెడికల్ కళాశాలకు చెందిన ఓ విద్యారి్థని సోమవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందింది. పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి..హైదరాబాద్‌కు చెందిన మేఘన(18) స్థానిక మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతోంది. కాగా సోమవారం సాయంత్రం కళాశాల ఆవరణలోని గ్రౌండ్లో స్నేహితులతో కలిసి ఉండగా.. గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలింది. తోటి విద్యార్థులు వెంటనే ఆమెను కళాశాల ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. తల్లిదండ్రులు చేరుకుని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి్పంచగా చికిత్స పొందుతూ కొద్ది సేపటికే మృతిచెందింది. విద్యారి్థని తండ్రి బాబురావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వికారాబాద్ పోలీసులు తెలిపారు. -
ఆందోళనలో ‘విదేశీ’ వైద్య విద్యార్థులు
లబ్బీపేట (విజయవాడతూర్పు): విదేశాల్లో వైద్య విద్యనభ్యసించిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారి సర్టిఫికెట్స్ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు ఏపీ మెడికల్ కౌన్సిల్ నుంచి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు పాటిస్తున్నట్లు మెడికల్ కౌన్సిల్ అధికారులు చెబుతుండగా, రిజిస్ట్రేషన్లను జాప్యం చేయడం వలన తమ కాలం వృధా అవుతుందని విదేశీ వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్ ఏమిటో అర్ధం కావడం లేదంటూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఇటీవల ఆందోళనకు దిగారు. తమ పీఆర్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాల్లో విదేశాల్లో విద్యనభ్యసించామంటూ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌కు వచ్చిన వారి సర్టిఫికెట్స్ నకిలీవనీ నిర్ధారణ అయింది. ఈ విషయంపై నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) స్పందించింది. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌కు వస్తే, వారు చదువుకున్న యూనివర్సిటీల నుంచి జెన్యునిటీ నిర్ధారణ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్‌కు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన సుమారు 400 మంది విద్యార్థుల సర్టీఫికెట్స్‌ను ధ్రువీకరణ కోసం ఆయా దేశాల ఎంబసీకి పంపించారు. ఇప్పటి వరకూ వాటి విషయంలో ఎలాంటి ధ్రువీకరణ రాలేదు. ర్యాంకులొచ్చినా పీజీ చేయలేం.. విదేశాల్లో వైద్య విద్యనభ్యసించి, ఇక్కడ ఎన్ఎంసీ నిర్వహించే నీట్లో మెరిట్ ర్యాంకులు వచ్చినా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో పీజీలు చేయలేక పోతున్నట్లు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరం అడ్మిషన్లకు నీట్ నోటిఫికేట్ వచ్చిందని, తమ పరిస్థితి ఏమిటో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్ఎంసీ ఆదేశాల మేరకే..విదేశాల్లో వైద్య విద్య చదివిన వారి సర్టీఫికెట్లను జన్యునిటీ నిర్ధారణ జరిగిన తర్వాత మాత్రమే పీఆర్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. వారి సూచనల మేరకు తమ వద్దకు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారి సర్టీఫికెట్స్‌ను ఆయా దేశాల ఎంబసీకి పంపిస్తున్నాం. యూనివర్సిటీల నుంచి జెన్యూన్ అని నిర్ధారిస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇప్పటి వరకూ 400 సర్టీఫికెట్స్‌ను అలా పంపించాం. – డాక్టర్ ఐ.రమేష్, రిజి్రస్టార్, ఏపీ మెడికల్ కౌన్సిల్ -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి
అలప్పుజ: కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అలప్పుజలో కారు, బస్సు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.బస్సు అతివేగంగా వచ్చి, కారును ఢీకొన్నదని స్థానికులు చెబుతున్నారు. బాధితులను వందనం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ముహ్సిన్, మహమ్మద్, ఇబ్రహీం, దేవన్‌లుగా గుర్తించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులను వందనం మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.ప్రాథమిక నివేదికల ప్రకారం మృతులు కోజికోడ్, కన్నూర్, చేర్యాల, లక్షద్వీప్‌కు చెందినవారు. ఈ ప్రమాదంలో కేఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆస్పత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.ఇది కూడా చదవండి: Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం -
పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. ఇటీవల కొత్తగా కళాశాలలో చేరిన వైద్య విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ పేరిట ఇబ్బందులకు గురిచేశారని, గోడ కురీ్చలు వేయించడం వంటి చర్యలతో వేధించారని కళాశాల డైరెక్టర్‌కు రాత పూర్వక ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు పదిమంది సీనియర్ వైద్య విద్యార్థులపై సస్పెన్షన్ విధించారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఏర్పడిన ఈ వైద్య కళాశాలకు 2016 జనవరిలో భారత వైద్యమండలి (ఎంసీఐ) నుంచి అనుమతులు లభించాయి. అదే సంవత్సరం జూన్‌లో తరగతులు ప్రారంభం కాగా.. ఇప్పటివరకు ర్యాగింగ్ ఘటనలు చోటుచేసుకోలేదు. తాజాగా ర్యాగింగ్ కారణంగా 10 మంది విద్యార్థుల సస్పెన్షన్ చర్చనీయాంశంగా మారింది. సదరు విద్యార్థులపై డిసెంబర్ ఒకటి వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని.. ర్యాగింగ్‌ను ఉపేక్షించేది లేదని కళాశాల డైరెక్టర్ రమేశ్ తెలిపారు. -
అనంతపురం : మెడికో ఫ్రెషర్స్ డే అదరహో (ఫొటోలు)
-
ప్రైవేట్ వైద్య‘మిథ్య’
తనిఖీల్లో ఏం తేలింది..? పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 50% వరకు అధ్యాపకులు లేరు. ఓ కాలేజీలో 50.47%, మరో కాలేజీలో 59.3% మేరకు కొరత ఉంది. ఒక కాలేజీలో రెసిడెంట్లు, ట్యూటర్ల కొరత 66.31% వరకు ఉంది. 150 మంది విద్యార్థులుండే కాలేజీ అనుబంధ ఆసు పత్రిలో రోజూ 1,200 మంది ఓపీ ఉండాలి. ఒక చోట 849, మరో చోట 650 మందే వస్తున్నారు. ఓ కాలేజీ ఆసుపత్రిలో 650కి 542 పడకలే ఉన్నాయి. రెండు కాలేజీల ఆసుపత్రుల్లో బెడ్ ఆక్యుపెన్సీ 9.38%, 11.97% చొప్పునే ఉంది. పలుచోట్ల లెక్చర్ హాళ్లు, పరీక్షా కేంద్రాలు సరిపడా లేవు. ఒకే ప్రొఫెసర్‌ను రెండు కాలేజీల్లో చూపించారు.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కొన్ని కళాశాలల్లో ఉండాల్సిన సంఖ్యలో సగం మంది కూడా లేరు. మరోవైపు విద్యార్థులకు అవసరమైన స్థాయిలో మౌలిక సదుపాయాలు కూడా లేవు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఇటీవలి తనిఖీల్లో ఈ అంశాలు బహిర్గతమయ్యాయి. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫె సర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు తగిన సంఖ్యలో లేకపోవడం, ల్యాబ్‌ల వంటి మౌలిక వసతుల కొరతతో అనేక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య అత్యంత నాసిరకంగా తయారవుతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఆయా కాలేజీల్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న చాలామంది తగిన సామర్థ్యం, నైపుణ్యం లేక వృత్తిలో రాణించలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్ల క్రితం మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో లేనందుకు విద్యార్థుల అడ్మిషన్లను కమిషన్ రద్దు చేసింది. తర్వాత వారిని ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేసింది. ఎన్ఎంసీ కఠిన చర్యలు తీసుకుంటున్నా, చాలా మెడికల్ కాలేజీలు ఇప్పటికీ అధ్యాపకులను నియమించుకోవడంలో, మౌలిక సదుపాయాల కల్పనలో వెనుకబడే ఉంటున్నాయని, వైద్య విద్యపై విద్యార్థులు, తల్లిదండ్రుల ఆసక్తిని సొమ్ము చేసుకుంటున్న కాలేజీలు నాణ్యమైన విద్య అందించడంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఏ కాలేజీ..ఎలా ఉండాలి: ఎంబీబీఎస్ సీట్లు 150 ఉన్న మెడికల్ కాలేజీలో 600 పడకలు ఉండాలి. 116 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 76 మంది రెసిడెంట్లు ఉండాలి. ఐదు పడకల ఐసీయూ, పీఐసీయూ వేర్వేరుగా ఉండాలి. ఫిజికల్ మెడికల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. స్కిల్ లేబొరేటరీ ఉండాలి. ఇలా ఉన్న సీట్లను బట్టి బోధనా సిబ్బంది, వసతులు ఉండాలి. అన్ని మెడికల్ కాలేజీల్లో తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేసే లేబొరేటరీ ఉండాలి. లైబ్రరీలో 4,500 పుస్తకాలుండాలి. అదే 100 సీట్లున్న మెడికల్ కాలేజీ అయితే 3 వేల పుస్తకాలు, 200 సీట్లుంటే 6 వేలు, 250 సీట్లయితే 7 వేల పుస్తకాలు ఉండాలి. లైబ్రరీ వైశాల్యం కూడా సీట్ల సంఖ్యకు అనుగుణంగా ఉండాలి. 150 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు చదివే మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రికి రోజుకు 1,200 మంది ఔట్ పేషెంట్లు అవసరం. ఆ మేరకు తప్పనిసరిగా రోగులు వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. కానీ చాలా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇలాంటి అనేక వసతులు సరిగ్గా లేకుండానే, బోధనా సిబ్బంది తగిన సంఖ్యలో లేకుండానే నడుస్తున్నట్లు తేలింది. తనిఖీల సమయంలో ‘సర్దుబాట్లు’ రాష్ట్రంలో మొత్తం 64 మెడికల్ కాలేజీలున్నాయి. అందులో 29 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాగా, 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మొత్తం 4,700 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కాగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు, రోగుల వివరాలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. వసతులు లేవని విద్యార్థులు బయటకు చెప్పలేని పరిస్థితి ఉందని, ఒకవేళ అలా చెబితే, నిరసన వ్యక్తం చేస్తే ప్రాక్టికల్స్‌లో తక్కువ మార్కులు వేస్తారన్న భయం వారిలో ఉంటోందని చెబుతున్నారు. కాగా ఎన్ఎంసీ తనిఖీలకు వచ్చే సమయానికి కాలేజీలు సర్దుబాట్లు చేస్తున్నాయి. నకిలీ బోధనా సిబ్బందితో ప్రైవేటు యాజమాన్యాలు నెట్టుకొస్తున్నాయి. అనేక కాలేజీలు సింథటిక్ బయోమెట్రిక్ ద్వారా ఒకరికి బదులు మరొకరితో హాజరు నమోదు చేయిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. -
ఎట్టకేలకు ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ మొదలైంది. ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న 16,679 మంది విద్యార్థుల వివరాలతో ప్రొవిజినల్ మెరిట్ లిస్టును కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా అన్ని సాక్షా్య లతో వర్సిటీ ఈ–మెయిల్ knrugadmission@gmail.comకు పంపించాలని వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి సూచించారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం గురువారం తుది మెరిట్ లిస్టును విడుదల చేస్తామన్నారు. అదేరోజు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు.. వెబ్ ఆప్షన్ల నమోదుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. గతేడాదికి సంబంధించిన కాలేజీలవారీ సీట్ల కేటాయింపు వివరాలు వర్సిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని.. వాటిని పరిశీలించి వెబ్ ఆప్షన్ల కోసం ముందే కాలేజీల జాబితాను సిద్ధం చేసుకోవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. జీవో 33 ప్రకారమే కౌన్సెలింగ్... స్థానికతకు సంబంధించిన జీవో–33ని సవాల్ చేస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టుకు వెళ్లడం.. కోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం వల్ల ఈసారి కౌన్సెలింగ్ ఆలస్యమైంది. జీవోను సవాల్ చేసిన పిటిషనర్లలో అర్హత ఉన్న వాళ్లను కౌన్సెలింగ్‌కు అనుమతిస్తామని.. సమయం లేనందున ఈ ఒక్కసారికి జీవో–33 నుంచి పిటిషనర్లకు మినహాయింపు ఇస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ వాదనను అంగీకరించిన కోర్టు.. జీవో 33 ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహణకు అనుమతినిస్తూ మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. తుది తీర్పును మూడు వారాలపాటు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం విడుదల చేసిన మెరిట్ జాబితాలో కోర్టుకు వెళ్లిన 132 మంది పిటిషనర్లకు కూడా చోటు కల్పించింది. మరోవైపు తెలంగాణలో దరఖాస్తు చేసుకున్న పిటిషనర్లలో మరో 9 మందికి ఏపీలోనూ స్థానికత ఉన్నట్లు తేలింది. దీంతో వారిని తెలంగాణ జాబితా నుంచి తిరస్కరించినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. కాగా, అఖిల భారత స్థాయిలో ఎస్టీ విభాగంలో టాప్ ర్యాంకు సాధించిన గుగులోత్ వెంకట నృపేష్ కాళోజి వర్సిటీ విడుదల చేసిన జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఎల్లు శ్రీశాంత్‌రెడ్డి, మూడో స్థానంలో మహమ్మద్ ఆజాద్ సాద్, నాలుగో స్థానంలో లావుడ్య శ్రీరాం నాయక్ ఉన్నారు. -
మారేడుమిల్లిలో వైద్య విద్యార్థుల విహారయాత్ర.. విషాదాంతం
అల్లూరి, సాక్షి: మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. నిన్న గల్లంతైన ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరు మృతిచెందగా.. సోమవారం ఉదయం వాళ్ల మృతదేహాల్ని వెలికి తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి ఏలూరులోని ఆశ్రం కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 14 మంది వైద్యవిద్యార్థులు ఆదివారం ట్రావెలర్ వాహనంలో వెళ్లారు. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలోని ‘జలతరంగిణి’ జలపాతం వద్దకు చేరుకుని అందులో దిగారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీవర్షం కురిసింది. జలపాతం ఉద్ధృతి పెరగడంతో ఐదుగురు కొట్టుకుపోయారు.హరిణిప్రియ, గాయత్రి పుష్పను ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు కాపాడి, రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. హరిణిప్రియ పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం తరలించారు. గల్లంతైనవారిలో సౌమ్య, హరదీప్, అమృత, హరిణిప్రియ, గాయత్రి పుష్ప ఉన్నారు. వీరిలో విజయనగరానికి చెందిన గల్లంతైన వారికోసం పోలీసులు, సీబీఈటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం సౌమ్య, అమృత మృతదేహాలు లభ్యమయ్యాయి. హరదీప్ కోసం గాలింపు కొనసాగుతోంది.కొసిరెడ్డి సౌమ్య (21) ది పార్వతీపురం జిల్లా బొబ్బిలి స్వస్థలంకాగా, బి.అమృత (21) బాపట్లగా పోలీసులు తెలిపారు. సీహెచ్ హరదీప్(20) ప్రకాశం జిల్లా మార్కాపురంగా తెలుస్తోంది. సౌమ్య, అమృత మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
అనంతపురం వైద్య కళాశాలలో వేధింపుల కలకలం
సాక్షి ప్రతినిధి, అనంతపురం :వైద్య విద్యార్థులను వేధించారన్న వార్తలు అనంతపురం మెడికల్ కాలేజీలో కలకలం రేపుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ కాలేజీలోని మూడు విభాగాల్లోని కొందరు అధ్యాపకులు మెడికోలను వేధించినట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా.. గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ విభాగాలకు సంబంధించిన అధ్యాపకులు ఈ వేధింపులకు గురిచేసినట్లు వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి.వాస్తవానికి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివే విద్యార్థులు రాష్ట్రంలోని ఇతర కాలేజీలు, ఇతర రాష్ట్రాల్లోని కాలేజీల విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసుకుంటారు. ఇప్పుడు ఈ గ్రూపుల్లో అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో వేధింపుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే వైద్యవిద్య పూర్తి చేసుకున్న ఓ విద్యార్థిని ఏకంగా జనరల్ సర్జరీ విభాగంలో లైంగిక వేధింపులు జరిగాయంటూ తన ఇన్‌స్ట్రాగాంలో వెల్లడించినట్లు మెడికోలు చెబుతున్నారు. ఈ అమ్మాయి చేసిన పోస్టే ఇప్పుడు కలకలం రేపుతోంది.పలు అనుమానాలకు తావిస్తున్న వైనం..ప్రస్తుతం అనంతపురం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థులు (నాలుగేళ్లకు కలిపి) 600 మంది, పీజీ వైద్య విద్యార్థులు 200 మంది ఉన్నారు. కాలేజీలో జరిగే వ్యవహారాలు బయటకు చెబితే ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేస్తారన్న భయంతో విద్యార్థినులు మౌనం వహించినట్లు తెలుస్తోంది. ఎంబీబీఎస్ అడ్మిషన్లు జరుగుతున్న వేళ వేధింపుల కలకలం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సైబర్ క్రైంకు ఫిర్యాదు చేస్తాం..మాకు కూడా ఈ విషయాలు వారం రోజుల కిందటే తెలిశాయి. కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైంకు ఫిర్యాదు చేస్తున్నాం. – డాక్టర్ మాణిక్యాలరావు, ప్రిన్సిపాల్, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలవాళ్లనే అడగండి చెబుతారు..లైంగిక వేధింపుల విషయం నా దృష్టికి రాలేదు. కొంతమంది పాస్డ్‌ఔట్ విద్యార్థులు పోస్ట్ చేశారని మీరే అంటున్నారు. వాళ్లనే అడగండి.. వాళ్లే మీకు ఏం జరిగిందో చెబుతారు. – డాక్టర్ రామస్వామి నాయక్, హెచ్ఓడీ, జనరల్ సర్జరీ విభాగం, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల -
తొలి నుంచీ అదే విముఖత
‘‘ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలంటే రూ. 350 కోట్లు ఖర్చవుతుంది. దాని నిర్వహణ కోసం ఏటా రూ. 30 కోట్లు కావాలి. అన్ని ప్రభుత్వమే చేయాలంటే సాధ్యం కాదు. ప్రైవేట్ వైద్య కళాశాలలఏర్పాటుకు అనుమతులిస్తాం.’’– వెనుకబడిన విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని 2019కు ముందు టీడీపీ ప్రభుత్వాన్ని కోరగా అసెంబ్లీలో నాటి వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు‘‘పులివెందుల కళాశాలకు అనుమతులు రావడం విస్మయం కలిగించింది. ప్రభుత్వం అండర్ టేకింగ్ ఇవ్వలేదు. అయినా అనుమతులు వచ్చాయి. కొత్త వైద్య కళాశాలలను ప్రభుత్వ పరిధిలో కొనసాగించడానికి నిధుల్లేవు. అందుకే పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్వహించాలని నిర్ణయించాం. – ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లోని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలుఅవకాశాలను కాలరాసిన బాబువైద్య విద్యకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. 2004కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో, 2014–19 మధ్య విభజిత రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు చంద్రబాబు చొరవ చూపలేదు. 2019కు ముందు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క వైద్య కళాశాలని రాబట్టలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపి అసెంబ్లీ సాక్షిగా కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయలేమని ప్రకటించారు.విభజన చట్టం కింద కేంద్రం మంజూరు చేసిన ఎయిమ్స్‌ను తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించి నవ్వులపాలయ్యారు. గతంలో ప్రైవేట్‌లో వైద్య కళాశాలలను ప్రోత్సహించిన బాబు.. ఈ దఫా ఏకంగా ప్రభుత్వ వైద్య కళాశాలలకు ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం వైద్య విద్య అవకాశాలను కాలరాశారని నీట్ యూజీ ర్యాంకర్లు ధ్వజమెత్తుతున్నారు. ఈ విద్యా సంవత్సరం ఐదు వైద్య కళాశాలలను ప్రారంభించేలా గత ప్రభుత్వంలో అన్ని ఏర్పాట్లు చేపట్టగా.. ఆ కళాశాలలకు అడ్డుపడి ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను పోగొట్టి కూటమి ప్రభుత్వం గొంతు కోసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వైఎస్ కుటుంబం చెరగని ముద్రఆరోగ్యశ్రీ, 108, 104 అంబులెన్స్ వంటి వ్యవస్థలను ప్రారంభించి వైద్య రంగంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెరగని ముద్ర వేశారు. ఆయన హయాంలోనే కడప, శ్రీకాకుళం, ఒంగోలు రిమ్స్‌లు రూపుదిద్దుకున్నాయి. అదే విధంగా తెలంగాణలోని ఆదిలాబాద్ రిమ్స్ కూడా వైఎస్సార్ ఏర్పాటు చేశారు. పేదలకు ప్రభుత్వ రంగంలోనే మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న తండ్రి ఆశయాన్ని వైఎస్ జగన్ పుణికిపుచ్చుకున్నారు.ఈ క్రమంలో ఆరోగ్యశ్రీ, 104, 108 వ్యవస్థలతో పాటు, నాడు–నేడు కింద ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేశారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పరిధిలో 17 వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో గత ఏడాది 5 కళాశాలలు ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి తెచ్చారు. మరో ఐదు ఈ విద్యా సంవత్సరం ప్రారంభించాల్సి ఉండగా కుట్రపూరితంగా బాబు ప్రభుత్వం అడ్డుపడింది. -
'టాప్‌లో కటాఫ్'
సాక్షి, అమరావతి: గతేడాది ఏయూ పరిధిలో ఓసీ విద్యార్థికి ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు నీట్ కటాఫ్ మార్కులు 563.. ఈ ఏడాది ఏకంగా 615..! ఇదే కేటగిరీకి ఎస్వీయూ పరిధిలో గతేడాది కటాఫ్ 550.. ఈ ఏడాది 601..!! ఆదివారం కన్వీనర్ కోటా తొలిదశ కౌన్సెలింగ్‌లో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు పరిస్థితి ఇదీ!! అప్పుడు సీటు దొరకటానికి.. ఇప్పుడు గగనంగా మారటానికి కారణం.. కొత్త మెడికల్ కాలేజీలే!గతేడాది 5 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడంతో సీట్లు పెరిగి మన విద్యార్థులు ఎంతో మంది డాక్టర్లు కాగలిగారు! ఇప్పుడు నాలుగు కొత్త కాలేజీలకు కూటమి సర్కారు నిర్వాకంతో అనుమతులు రాకపోగా పాడేరులో వచ్చింది 50 సీట్లే! ఎంబీబీఎస్ సీట్లు పెరగకపోవడంతో మనకు ఎంత నష్టం జరిగిందో తొలి దశ కౌన్సెలింగ్‌లోనే స్పష్టంగా కనిపించింది!!గతేడాది ప్రభుత్వ ఆధ్వర్యంలో 5 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం కావడంతో అదనంగా 750 సీట్లు సమకూరి మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలు నెరవేరాయి. ఏటా పెరుగుతున్న పోటీకి అనుగుణంగా దూరదృష్టితో వ్యవహరించి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏకంగా 17 ప్రభుత్వ వైద్య కశాశాలలకు శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో ఐదు కొత్త కాలేజీలు గతేడాది అందుబాటులోకి రాగా ఈ సంవత్సరం కూడా మరో ఐదు నూతన మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రారంభమైతే తమ కలలు ఫలిస్తాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు! కూటమి సర్కారు ప్రైవేట్ జపం, కొత్త కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంతో ఆ ఆశల సౌథాలు కుప్పకూలాయి. ఏడాదంతా లాంగ్ టర్మ్ శిక్షణతో రూ.లక్షలు వెచ్చించి సిద్ధమైన విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. తొలి దశ కౌన్సెలింగ్‌లోనే సీట్ దొరక్కపోవడంతో ఇక మిగిలిన దశల్లో సీటు లభించే అవకాశాలు తక్కువేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు అప్పు చేసిన మధ్యతరగతి కుటుంబాలు మేనేజ్మెంట్ కోటా సీట్ కొనే పరిస్థితి లేదు. మరోసారి ధైర్యం చేసి లాంగ్ టర్మ్ కోచింగ్‌కి పంపుదామంటే కూటమి సర్కారు ప్రైవేట్ మోజుతో వచ్చే ఏడాదైనా సీట్లు పెరుగుతాయనే నమ్మకం పోయింది. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో నీట్ యూజీ విద్యార్థుల భవిష్యత్తు తలకిందులైంది. ప్రైవేట్‌కు కట్టబెట్టే ఉద్దేశంతో నాలుగు కొత్త కాలేజీలకు అనుమతులు రాకుండా ప్రభుత్వమే అడ్డుపడింది. కేవలం పాడేరు కళాశాలలో 50 సీట్లకే అనుమతులు లభించాయి. పిల్లల గొంతు కోశారు!ప్రభుత్వ నూతన వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లకు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని.. అది కూడా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే చేసి చూపిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి సర్కారు దాన్ని గాలికి వదిలేసి బేరాలకు తెర తీసింది. వైఎస్సార్ సీపీ హయాంలో తీసుకున్న చర్యల ఫలితంగా గిరిజన ప్రాంతంలోని పాడేరు మెడికల్ కాలేజీకి ఈ ఏడాది అరకొరగానైనా 50 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు కాగా వాటిలో 21 సీట్లను సెల్ఫ్‌ఫైనాన్స్ కోటా కింద తాజాగా అమ్మకానికి పెట్టింది. ఈమేరకు 2024–25 విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ జారీ చేయడంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పులివెందుల, పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోనిలో ప్రారంభించాల్సిన ఐదు నూతన వైద్య కళాశాలలను కుట్రపూరితంగా అడ్డుకుని ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను పోగొట్టి పిల్లల భవిష్యత్తును అంధకారంగా మార్చారని మండిపడుతున్నారు. పులివెందుల వైద్య కళాశాలకు అనుమతులు వచ్చినా.. మేం నిర్వహించలేమంటూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎన్ఎంసీకి కూటమి ప్రభుత్వమే లేఖ రాయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అధికారం చేపట్టిన తొలి వంద రోజుల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ విధానానికి సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ పలు సందర్భాల్లో హామీ ఇచ్చింది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌కు హామీ గుర్తు లేదా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తమది ప్రజా ప్రభుత్వం.. పేదల పక్షపాత ప్రభుత్వమంటూ తరచూ చెప్పే సీఎం చంద్రబాబు పేదరిక నిర్మూలనకు పీ 4 ప్రణాళిక పేరుతో ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు అప్పగించి పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని ప్రజా సంఘాలు మండిపతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.రెండేళ్లలో కోల్పోతున్న సీట్లు 1,750టీడీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వ వైద్య విద్యారంగం బలోపేతానికి చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు హయాంలో ఒక్కటి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు కాకపోవడం దీనికి నిదర్శనం. 2004–09 మధ్య దివంగత వైఎస్సార్ సీఎంగా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో రిమ్స్‌లను నెలకొల్పారు. రాష్ట్ర విభజన అనంతరం వైఎస్సార్ సీపీ హయాంలో జగన్ ప్రజారోగ్యాన్ని బలోపేతం చేస్తూ 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటిలో ఐదు కొత్త వైద్య కళాశాలలు గత ఏడాది ప్రారంభం అయ్యాయి. 750 ఎంబీబీఎస్ సీట్లు ఒక్కసారిగా అదనంగా పెరగడంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆశలు చిగురించాయి. ఈ విద్యా సంవత్సరంలో కూడా మరో ఐదు కళాశాలలు ప్రారంభించేలా గత ప్రభుత్వం చర్యలు చేపట్టినా కూటమి సర్కారు దాన్ని కొనసాగించలేదు. దీంతో కేవలం 50 సీట్లు సమకూరగా అదనంగా రావాల్సిన 700 సీట్లను రాష్ట్రం నష్టపోయింది. ఇక వచ్చే ఏడాది ప్రారంభం కావాల్సిన మరో ఏడు కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం వల్ల అదనంగా మరో 1,050 మెడికల్ సీట్లను విద్యార్థులు నష్టపోతున్నారు. వెరసి మొత్తం 1,750 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోవడం ద్వారా జరుగుతున్న నష్టం ఊహించలేనిది!!.ఎంబీబీఎస్ యాజమాన్య కోటా ఆప్షన్ల నమోదు ప్రారంభం2024–25 విద్యా సంవత్సరానికి కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం తొలి దశ కౌన్సెలింగ్‌కు వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నుంచి ప్రారంభించింది. ఈ నెల 19వ తేదీ రాత్రి తొమ్మిది గంటలను ఆప్షన్ల నమోదు చివరి గడువుగా విధించారు. https://drntr.uhsap.in వెబ్సైట్లో విద్యార్థులు ఆప్షన్ నమోదు చేసుకోవాలని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. గతేడాది ప్రారంభించిన విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల, ఈ ఏడాది ప్రారంభించనున్న పాడేరు వైద్య కళాశాలలో 240 సెల్ఫ్‌ఫైనాన్స్, 101 ఎన్ఆర్ఐ కోటా (సీ కేటగిరి) సీట్లు ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా ప్రైవేట్, మైనార్టీ, స్విమ్స్ కళాశాలల్లో బీ కేటగిరి 1078, సీ కేటగిరి 495 సీట్లున్నట్లు పేర్కొన్నారు. ఆప్షన్ల నమోదు సమయంలో సాంకేతిక సమస్యలుంటే 9000780707, 8008250842 నంబర్లలో విద్యార్థులు సంప్రదించాలని తెలిపారు.ప్రైవేటీకరణ దుర్మార్గంపులివెందుల కళాశాలకు సీట్లను నిరాకరించడమేంటి? సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల రద్దు హామీ ఏమైంది? సీఎం చంద్రబాబుకు ఎస్ఎఫ్ఐ లేఖ విద్యార్ధుల వైద్య విద్య ఆశలను కూటమి ప్రభుత్వం చిద్రం చేస్తోందని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) మండిపడింది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గమని పేర్కొంది. ఈమేరకు ప్రభుత్వ తీరును తప్పుబడుతూ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రసన్న కుమార్, ఎ.అశోక్‌లు సోమవారం మీడియాకు విడుదల చేశారు. విద్యను హక్కుగా అందించాల్సిన బాధ్యతను విస్మరించి ప్రైవేట్ వైద్య విద్యకు పట్టం కట్టడం దారుణమన్నారు. కేంద్రంతో సంప్రదించి 5 కొత్త కళాశాలలకు అనుమతులు తేవాల్సిన కూటమి ప్రభుత్వం పులివెందుల కాలేజీకి వచ్చిన 50 సీట్లను కూడా వద్దంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ)కి లేఖ రాయడం ఏమిటని ప్రశ్నించారు. ఒక్క పాడేరుకు 50 సీట్లు వచ్చాయని, మిగిలిన నాలుగు కొత్త కళాశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్వోపీ ఇచ్చి ఉంటే అనుమతులు లభించేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు 700 సీట్లు కోల్పోయారన్నారు. ప్రైవేటీకరణ వల్ల పేద, మధ్య తరగతి విద్యార్ధులు వైద్య విద్యకు దూరం కావడం ఖాయమన్నారు. రిజర్వేషన్ల ఊసే ఉండదని, తద్వారా వెనకబడిన తరగతుల విద్యార్ధులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో పేదలకు ఉచిత వైద్య సేవలు కూడా అందవని ఆందోళన వ్యక్తం చేశారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని అధికారంలోకి వస్తే వంద రోజుల్లో రద్దు చేస్తామన్న హామీపై ఎందుకు నోరు మెదపడం లేదని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. వెంటనే వైద్య విద్య ప్రైవేటీకరణను విరమించుకుని ఎన్ఎంసీకి రాసిన లేఖను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరు మార్చుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.రాయలసీమకు బాబు ద్రోహం మెడికల్ సీట్లు వద్దనడం దారుణం పేద విద్యార్థులకు అన్యాయం చేయొద్దు వైఎస్సార్ సీపీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి టీడీపీ కూటమి ప్రభుత్వం రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తోందని వైఎస్సార్ సీపీ పంచాయితీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి మండిపడ్డారు. వైద్య, ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈమేరకు సోమవారం ఆరు అంశాలతో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్కి లేఖ రాశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారని, 5 కాలేజీలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల ఈ ఏడాది ఐదు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం కాకపోగా ఎన్ఎంసీ పులివెందుల మెడికల్ కాలేజీకి ఇచ్చిన 50 సీట్లు కూడా పోయాయని మండిపడ్డారు. ఇది రాయలసీమ ప్రజలకు ద్రోహం చేయడం కాదా? అని ప్రశ్నించారు. మంత్రి సత్యకుమార్ పులివెందుల మెడికల్ కళాశాలను ఎప్పుడైనా సందర్శించారా? అని నిలదీశారు. ప్రశ్నించారు. రాయల సీమ నుంచి గెలిచి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉంటూ ఇలా చేయటం దుర్మార్గం అనిపించటం లేదా? అని దుయ్యబట్టారు. 2023 డిసెంబర్ 15వ తేదీన పులివెందుల మెడికల్ కళాశాల స్టాఫ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీచేసి పోస్టులు భర్తీ చేసి 2023లో మార్చిలో కాలేజీని ప్రారంభించిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. చిన్న చిన్న ఇబ్బందులుంటే రాష్ట్ర ప్రభుత్వాలు అండర్ టేకింగ్ లెటర్ ఇస్తే అడ్మిషన్లు నిర్వహించుకోవటానికి ఎంఎన్సీ అనుమతిస్తుందన్న విషయం తెలియదా? అని ప్రశ్నించారు. కేవలం మాజీ సీఎం జగన్ హయాంలో నిర్మాణం, ప్రారంభం అయిందన్న విషయాన్ని జీర్ణించుకోలేక అడ్మిషన్లకు కూటమి ప్రభుత్వం అడ్డుపడిందని విమర్శించారు. -
MBBS సీట్లు మాకొద్దు..
-
కాలేజీలపై 'చంద్రబాబు' కత్తి!
ఆశలు నీరు గార్చారుప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటై కొత్తగా సీట్లు వస్తే నాలాంటి ఎంతో మంది విద్యార్థులకు మేలు కలుగుతుంది. కొత్త వైద్య కళాశాలలను నెలకొల్పి సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే వాటిని రద్దు చేయాలని లేఖ రాయడం సబబు కాదు. ఈ ఏడాది సీట్లు పెరుగుతాయని ఎంతో మంది ఆశ పెట్టుకున్నాం. మా ఆశలను ప్రభుత్వం నీరు గార్చింది. – పూర్ణిమ, నీట్ విద్యార్థిని, చిత్తూరు జిల్లాసాక్షి, అమరావతి: ‘‘కొత్తగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఏర్పాటై అదనంగా సీట్లు వస్తే ఎంతో మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. నూతన వైద్య కళాశాలలను నెలకొల్పి సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే వాటిని రద్దు చేయాలని లేఖ రాయడం సబబు కాదు. మా ఆశలను ప్రభుత్వం నీరు గార్చింది. లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం రూ.3 లక్షలకు పైగా ఖర్చు అయింది. ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మా పిల్లల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామన్న హామీకి టీడీపీ తిలోదకాలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం పేద బిడ్డలకు వైద్య విద్యను దూరం చేస్తోంది..’’ ఇదీ వైద్య విద్యపై ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, తల్లిదండ్రుల ఆవేదన. ప్రభుత్వ రంగంలో మనకు అదనంగా మెడికల్ సీట్లు సమకూరుతుంటే ఏ రాష్ట్రమైనా వద్దనుకుంటుందా? కొత్త వైద్య కళాశాలలను నెలకొల్పి సీట్లు పెంచాల్సిన ప్రభుత్వమే వాటిని రద్దు చేయాలని లేఖ రాసిన ఉదంతం ఎక్కడైనా ఉందా? కాలేజీల్లో మౌలిక వసతులు, సదుపాయాలు పూర్తి స్థాయిలో సమకూర్చుకునేందుకు మరికొంత సమయం తీసుకోవాలని కేంద్రం ఉదారంగా ఆఫర్ ఇస్తే ఎవరైనా తిరస్కరిస్తారా? సీఎం చంద్రబాబు మాత్రం ప్రైవేట్ మోజుతో అలాగే వ్యవహరిస్తున్నారు. మన విద్యార్థుల ఎంబీబీఎస్ కలలను నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజా భాగస్వామ్యం (పీ–4) అని నమ్మబలుకుతూ ప్రభుత్వ వ్యవస్థలను తెగనమ్మేందుకు సన్నద్ధమయ్యారు. ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేయడం ద్వారా విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తున్నారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసినప్పటికీ ఏ రాష్ట్ర ప్రభుత్వమూ వ్యవహరించని విధంగా ఆ సీట్లు మాకొద్దంటూ కూటమి సర్కారు లేఖ రాసి దుర్మారంగా అనుమతులను రద్దు చేయించడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. 2024–25 విద్యా సంవత్సరంలో కొత్తగా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభమైతే 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరి తమకు తెల్ల కోటు ధరించే అవకాశం దక్కుతుందని ఆశపడ్డ వారంతా సర్కారు తీరుపై నివ్వెరపోతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను రద్దు చేస్తామని హామీలిచ్చిన టీడీపీ ఇప్పుడు ఏకంగా వాటికి బేరం పెట్టి తీరని ద్రోహం తల పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన 7 కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలనూ నిలిపివేయడంతో రాష్ట్రం మరో 1,050 ఎంబీబీఎస్ సీట్లను కోల్పోనుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ఎంబీబీఎస్ సీట్లు అదనంగా పెరిగి తమకు వైద్య విద్య చదివే అవకాశం దక్కుతుందనే ఆశతో రూ.లక్షలు పెట్టి లాంగ్ టర్మ్ కోచింగ్‌లు తీసుకున్న విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభుత్వం తలకిందులు చేస్తోంది. ఈ నిర్వాకం ఖరీదు.. 1,750 సీట్లు వాస్తవానికి ఈ విద్యా సంవత్సరంలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పాడేరుల్లో ఒక్కో చోట 150 చొప్పున ఎంబీబీఎస్ సీట్లతో ఐదు కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉంది. తద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా రాష్ట్రానికి సమకూరాల్సి ఉండగా కూటమి సర్కారు నిర్వాకంతో కేవలం పాడేరు వైద్య కళాశాలకు 50 సీట్లే సమకూరాయి. గతేడాది వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదు కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడం ద్వారా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరాయి. ఈ ఏడాదీ అదే మాదిరిగా మరో 750 సీట్లు పెరిగి తమకు ఎంబీబీఎస్ సీట్ లభిస్తుందని నీట్ రాసి అర్హత సాధించిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు సర్కారు నిర్వాకం కారణంగా ఈ ఏడాది 700 మంది, వచ్చే ఏడాది 1,750 మంది విద్యార్థులు వైద్య విద్య అవకాశాన్ని కోల్పోనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో 750 సీట్లకు అనుమతులు వచ్చి ఉంటే అందులో 112 సీట్లు ఆల్ ఇండియా కోటా కింద పోగా మిగిలిన సీట్లన్నింటిలో మన విద్యార్థులకే అవకాశం లభించేది. ఆల్ ఇండియా కోటా సీట్లలో కూడా మన రాష్ట్రానికి చెందిన మెరిట్ విద్యార్థులు సీటు సాధించే వీలుండేది. ముఖ్యంగా ఇప్పుడు ప్రారంభం కావాల్సిన వాటిల్లో నాలుగు కళాశాలలు వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనే ఉన్నాయి. తమ పిల్లలను వైద్యులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పలువురు రూ.లక్షల్లో అప్పులు చేసి విజయవాడలో ఇంటర్‌తోపాటు నీట్ యూజీ కోచింగ్‌లలో చేరి్పంచారు. గతంలో చివరి కటాఫ్ ర్యాంక్ వరకూ వచ్చి అవకాశం దూరమైన విద్యార్థులు ఈసారి సీట్లు పెరుగుతాయనే నమ్మకంతో విలువైన సమయాన్ని, డబ్బులను వెచ్చించి లాంగ్‌టర్మ్ కోచింగ్‌లు తీసుకున్నారు. ఇంత అనుకూల పరిస్థితులున్నా.. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు, సీఎంలు కేంద్ర ప్రభుత్వ పెద్దలను ప్రత్యేకంగా కలిసి ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసి మరీ కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు, అదనపు ఎంబీబీఎస్ సీట్ల కోసం ప్రయత్నిస్తుంటే ఏపీలో మాత్రం వింత పరిస్థితులు నెలకొన్నాయని సోషల్ మీడియాలో విమర్శలు వైరల్ అవుతున్నాయి. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. బీజేపీకి చెందిన సత్యకుమార్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐదు కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభించి వంద శాతం సీట్లకు అనుమతులు తెచ్చుకోవాల్సింది పోయి.. ఎన్ఎంసీ మంజూరు చేసిన సీట్లను కూడా మాకొద్దని లేఖ రాయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2014–19 మధ్య కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగినప్పుడు కూడా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బూచిగా చూపిస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు చంద్రబాబు సర్కారు నిరాకరించటాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తొలి నుంచి ప్రైవేట్ వైద్య విద్యను ప్రోత్సహించడమే ధ్యేయంగా వ్యవహరిస్తున్న సీఎం చంద్రబాబు ఈ దఫా ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏకంగా ప్రైవేట్‌కు కట్టబెట్టే తంతుకు తెర తీశారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. బుకాయించి.. బుక్ అయిన ప్రభుత్వంఐదు కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టేలా చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అయినప్పటికీ గత ప్రభుత్వం కచిన వసతుల ఆధారంగా ఎన్ఎంసీ పాడేరు కాలేజీకి 50 సీట్లకు అనుమతులు మంజూరు చేసింది. ఆ కళాశాల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నందున గత్యంతరం లేక చంద్రబాబు సర్కారు మిన్నకుంది. అంతకంటే ముందు పులివెందుల మెడికల్ కాలేజీకి కూడా గత ప్రభుత్వం కల్పించిన వసతుల ఆధారంగా 50 సీట్లకు ఎన్ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్(ఎల్ఓపీ) మంజూరు చేసింది. అయితే ఎల్‌ఓపీని తొక్కిపెడుతూ మీరు అనుమతులు ఇచ్చినా మేం కళాశాలను నిర్వహించలేమంటూ గుట్టు చప్పుడు కాకుండా కూటమి ప్రభుత్వం ఎన్ఎంసీకి లేఖ రాసింది. బయటకేమో ఎల్ఓపీ రాలేదని బుకాయిస్తూ వచ్చింది. ఎల్లో మీడియాలో సైతం అదే తరహాలో వార్తలు రాయించారు. ప్రభుత్వం గుట్టుగా లేఖ రాసిన విషయాన్ని ‘సాక్షి’ బట్ట బయలు చేసింది. ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంతోనే ఎల్‌ఓపీని రద్దు చేస్తున్నట్లు స్వయంగా ఎన్ఎంసీ కూడా ప్రకటించింది. దీంతో ఇన్నాళ్లూ ఎల్ఓపీ రాలేదని బుకాయించిన కూటమి సర్కార్ మోసాలు బహిర్గతమయ్యాయి.మోసం చేశారు.. ఈ ప్రభుత్వం పేద బిడ్డలకు వైద్య విద్యను దూరం చేస్తోంది. ఈ ఏడాది 750 సీట్లు అదనంగా సమకూరి ఉంటే కాస్త ర్యాంకు తగ్గినా అర్హులైన విద్యార్థులకు న్యాయం జరిగేది. నా బిడ్డ నీట్ రాసింది. ఐదు కొత్త కళాశాలలు ప్రారంభమైతే సీట్ వస్తుందనే ఆశ ఉండేది. ఇప్పుడు ఏం చేయాలి? సెల్ఫ్ ఫైనాన్స్ విధానం రద్దు చేస్తామన్న హామీకి టీడీపీ తిలోదకాలు ఇచ్చింది. యాజమాన్య కోటా కింద సీట్ కొనే స్థోమత మాకు లేదు. మాలాంటి వాళ్లను మోసం చేశారు. – నెహేమియా, నెల్లూరు, నీట్ రాసిన విద్యార్థి తండ్రి తప్పుడు నిర్ణయాలతో గందరగోళం ఏడాది లాంగ్‌టర్మ్ కోచింగ్ తర్వాత మా అబ్బాయి 541 స్కోర్ సాధించాడు. బీసీ–డీ రిజర్వేషన్ కింద గతేడాది 497 స్కోర్‌కు ప్రైవేట్‌లో చివరి సీట్ వచ్చింది. ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. కొత్త కళాశాలలకు అనుమతులు వస్తే మా అబ్బాయికి సీట్ వస్తుందనే ఆశ ఉండేది. ఎస్వీ రీజియన్‌లోనే మూడు కళాశాలల ఏర్పాటుతో 450 సీట్లు సమకూరేవి. లాంగ్‌టర్మ్ కోచింగ్ కోసం రూ.3 లక్షలకు పైగా ఖర్చు అయింది. మేనేజ్మెంట్ కోటాలో సీటు కొనే స్థోమత లేదు. ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మా బాబు భవిష్యత్ గందరగోళంగా మారింది. – కోడూరు పెంచలయ్య, అన్నమయ్య జిల్లా తల్లిదండ్రుల ఆశలతో ఆడుకోవద్దు నా కుమార్తె రష్యాలోని కజికిస్తాన్లో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. స్థానికంగానే మెడికల్ కళాశాలలు అందుబాటులోకి రావడం ఎంతో శుభపరిణామం. అలాంటిది ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆదోని మెడికల్ కళాశాల నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేయడం చాలా బాధ కలిగించింది. పులివెందులకు వచ్చిన సీట్లనూ వద్దనుకుంది. ఈ చర్య ముమ్మాటికీ తల్లిదండ్రుల ఆశలతో ఆడుకోవటమే. స్థానికంగానే మెడికల్ సీట్లు లభిస్తే నాలాంటి ఎంతో మంది తల్లిదండ్రులు వ్యయ ప్రయాసల కోర్చి పిల్లలను విదేశాలకు పంపే అవసరం ఉండదు. – ఎం.చెన్నయ్య, వైద్య విద్యార్థిని అమూల్య తండ్రి, ఆదోని ఉచిత వైద్యం దూరం చేసే కుట్ర మెడికల్ కాలేజీలతో పిల్లలకు ఎంబీబీఎస్ విద్యనే కాదు. పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీ ఏర్పాటైతే దానికి అనుబంధంగా ఆస్పత్రి వస్తుంది. దాంట్లో అనుభవజు్ఞలైన వైద్యులు అందుబాటులోకి వస్తారు. వసతులు పెరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే వైద్యం కోసం పేదలు డబ్బు చెల్లించాల్సిన పరిస్థితులు వస్తాయి. – నూర్జహాన్, వేముల, వైఎస్సార్ జిల్లా -
Gandhi Hospital: మద్యం మత్తులో మహిళా జూడాపై దాడి
గాందీఆస్పత్రి : కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటన మరువక ముందే సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఓ దారుణం చోటుచేసుకుంది. అత్యవసర విభాగంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా ఇంటర్నీ (జూనియర్ డాక్టర్)పై చికిత్స కోసం వచి్చన ఓ రోగి దాడి చేశాడు. మహిళ ఇంటర్నీ చేయి, యాప్రాన్ పట్టుకుని గట్టిగా లాగడంతో ఆమె భయాందోళనకు గురైంది. దీనిని గమనించిన తోటి వైద్యులు, సిబ్బంది రోగి చేతుల్లోంచి ఆమెను విడిపించారు. ప్రత్యక్ష సాక్షులు, గాంధీ అధికారులు, జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బన్సీలాల్‌పేటకు చెందిన జీ.ప్రకాశ్ (60) దినసరి కూలీగా పని చేస్తున్నాడు. మద్యం, కల్లు తాగే అలవాటు ఉన్న ప్రకాశ్ బుధవారం ఫుల్లుగా మద్యం సేవించి, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండటంతో అతడి భార్య వైద్యసేవల నిమిత్తం ప్రకాశ్‌ను గాంధీ ఎమర్జెన్సీ విభాగానికి తీసుకువచి్చంది. భార్య పక్కనే ఉన్న ప్రకాశ్ అక్కడే డ్యూటీలో ఉన్న ఓ వైద్యవిద్యార్థిని చేయి పట్టుకుని గట్టిగా లాగాడు. ఆమె యాప్రాన్ పట్టుకుని బయటికి లాక్కెళ్లేందుకు యత్నించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో గమనించిన తోటి వైద్యులు, సిబ్బంది అతడిని కొట్టి అతని చేతుల్లోంచి ఆమెను విడిపించారు. ఈ ఘటన దృశ్యాలు అత్యవసర విభాగంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముందుగా అతడిని గాంధీ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు అక్కడి నుంచి చిలకలగూడ ఠాణాకు తరలించారు. మద్యం మత్తులో మతిస్థిమితం కోల్పోయి దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను జూనియర్ డాక్టర్ల సంఘం గాంధీ యూనిట్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. వైద్యులు, వైద్య విద్యార్థులపై దాడులు జరగకుండా, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని జూడా సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వంశీకృష్ణ, లౌక్య, గిరిప్రసాద్‌లు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చిలకలగూడ పోలీసులు తెలిపారు. -
స్థానికంగా ఉంటే అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసితులైన పిటిషనర్లు 85 శాతం స్థానిక కోటా కింద అర్హులేనని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. అయితే ఒక విద్యార్థి తెలంగాణలో నివాసం లేదా శాశ్వత నివాసి అని నిర్ధారించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలేవీ రూపొందించలేదని.. అందువల్ల తొలుత మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందించాలని స్పష్టం చేసింది. వైద్యవిద్య ప్రవేశాల కోసం ప్రభుత్వం తెచ్చిన జీవో 33లోని నిబంధన 3 (ఏ)ను సవాల్ చేస్తూ దాఖలైన 53 పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టి గురువారం ఈ మేరకు తీర్పు చెప్పింది. ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాల మేరకు ప్రతి విద్యార్ధికి స్థానిక కోటా వర్తింపజేయాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో దాదాపు 130 మంది విద్యార్థులకు ఊరట లభించనుంది. టెన్త్, ఇంటర్ స్థానికంగా చదివి ఉండాలన్న నిబంధనతో.. ‘జీవో 33లోని నిబంధన 3 (ఏ)ను సవాల్ చేస్తూ హైదరాబాద్ ప్రగతినగర్‌కు చెందిన కల్లూరి నాగనరసింహ అభిరామ్‌తోపాటు మరికొందరి తరఫున న్యాయవాది కొండపర్తి కిరణ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న జారీ చేసిన జీవో 33 చట్టవిరుద్ధం. ఈ జీవో ప్రకారం విద్యార్థులు 9, 10తోపాటు ఇంటర్ స్థానికంగా చదివి ఉండాలి. పరీక్షలు ఇక్కడే రాయాలి. ఏడేళ్లు స్థానికంగా ఉండాలి. ఇది చట్టవిరుద్ధం. లోకల్‌గా పరిగణించేందుకు కొత్త నిబంధనలు తెస్తూ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన జీవోను కొట్టేయాలి’అని పిటిషనర్లు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివారని స్థానికులు కాదంటున్నారు.. ‘చాలా మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఇంటర్ చదివారు. వారంతా తెలంగాణలోనే పుట్టి టెన్త్ వరకు ఇక్కడే చదివినా జీవో ప్రకారం వారికి స్థానికత వర్తించదు. అదే తెలంగాణలో పుట్టకపోయినా ఆ నాలుగేళ్లు ఇక్కడే చదివిన వారికి స్థానికత వర్తిస్తుంది. ఇది రాజ్యాంగ హక్కులను కాలరాయడమే. ఫిబ్రవరి 9న నీట్‌కు నోటిఫికేష¯న్Œ వెలువడగా మే 5న పరీక్ష, జూలై 26 ఫలితాలు వెలువడ్డాయి. కానీ ఫలితాల ముందు ప్రభుత్వం జీవో జారీ చేయడం చట్టవిరుద్ధం’అని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు మయూర్‌రెడ్డి, డీవీ సీతారామమూర్తి వాదించారు. అయితే హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఏపీకి చెందిన వారున్నారని ఏజీ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదించారు. నీట్ దరఖాస్తులో అభ్యర్థులే ఆ విషయాన్ని పేర్కొన్నారన్నారు. కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నిబంధనలనే ఇక్కడ తీసుకొచ్చామని చెప్పారు. మార్గదర్శకాల మేరకు అనుమతించండి.. ‘తెలంగాణకు చెందిన విద్యార్థులకే స్థానిక కోటా వర్తింపజేయాలని ప్రభుత్వం తెచ్చిన జీవో 33లోని నిబంధన 3 (ఏ) ఉద్దేశం మంచిదే. అయితే తెలంగాణకు చెందిన విద్యార్థి ఇతర రాష్ట్రం నుంచి అర్హత పరీక్ష రాశారని స్థానికత నిరాకరించడం సరికాదు’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ప్రభుత్వం రూపొందించే ‘నివాస’మార్గదర్శకాల మేరకు ప్రతి కేసును పరిశీలించాలని.. అర్హులైన పిటిషనర్లను స్థానిక కోటా కింద కౌన్సెలింగ్‌కు అనుమతించాలని కాళోజీ వర్సిటీని ఆదేశించింది. -
మన డాక్టరమ్మకు భద్రత కావాలి
సాక్షి, అమరావతి: వైద్య విద్యార్థినిపై కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రిలో హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది భద్రతలో లొసుగులను తేటతెల్లం చేసింది. ప్రస్తుతమున్న చట్టాలు వైద్యులు, వైద్య సిబ్బందికి భద్రతా వాతావరణాన్ని కల్పించడం లేదని ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మన డాక్టరమ్మల భద్రత ఏ విధంగా ఉంది? సురక్షిత వాతావరణంలో మహిళా వైద్యులు, సిబ్బంది సేవలు అందించాలంటే ఏ చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై ‘సాక్షి’ పలువురు వైద్య నిపుణులతో చర్చించింది. వైద్య శాఖలో 30 ఏళ్లకుపైగా సేవలు అందించిన సీనియర్ వైద్యులు, మాజీ ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లను కలిసి వారి అభిప్రాయాలను సేకరించింది.గళం విప్పే వ్యవస్థ రావాలిఅన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, కళాశాలల్లో ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలపై ఫిర్యాదులు చేయడానికి, పరిష్కరించడానికి అంతర్గత కమిటీలు ఉంటాయి. అయితే వీటిల్లో ఆయా కళాశాల, ఆస్పత్రిలో పని చేసే ఫ్యాకల్టీ, వైద్యులు, ఇతర అధికారులే సభ్యులుగా ఉంటారు. దీంతో ఏదైనా సమస్య తలెత్తితే విద్యార్థినులు ఫిర్యాదు చేయడానికి సంకోచించే పరిస్థితులు న్నాయి. తమ వివరాలు బహిర్గతమై కొత్త చిక్కులు తలెత్తుతాయని ఆందోళన చెందుతున్నారు. కమిటీల్లో పోలీస్, న్యాయ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు స్థానం కల్పిస్తే నిష్పాక్షిక విచారణకు వీలుంటుంది. బాధితులు నిర్భయంగా గళం విప్పడానికి ఆస్కారం లభిస్తుంది. ముఖ్యంగా లైంగిక వేధింపులు, ర్యాగింగ్ ఘటనల్లో బాధితులు వెనుకడుగు వేయడానికి ప్రధాన కారణం ఆయా కమిటీల్లో సభ్యులంతా అక్కడి వారు కావడమేనని పేర్కొంటున్నారు. హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు 36 గంటలు, రెండు, మూడు రోజులు నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్న దుస్థితి నెలకొంది. గతంతో పోలిస్తే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్లు పెరిగాయి. అందువల్ల విద్యార్థుల పని వేళలపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలి. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 24 గంటల పాటు విధులు నిర్వహించిన విద్యార్థికి డే ఆఫ్ తప్పకుండా ఇవ్వాలి.సహాయకుల రాకపోకలపై షరతులుప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగికి సహాయకుడిగా ఒకరినే అనుమతిస్తారు. కొన్ని సందర్భాల్లో అసలు సహాయకుడినే అనుమతించరు. పరామర్శలకు వచ్చే వారిని పరిమిత వేళల్లోనే అనుమతిస్తారు. ప్రతి వ్యక్తిని స్క్రీనింగ్ చేస్తారు. మద్యం, ఇతర మత్తు పదార్థాలు సేవించిన వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇలాంటి నిబంధనలే ప్రభుత్వాస్పత్రుల్లోనూ విధించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల సహాయకులు, బంధువులు, స్నేహితుల రాకపోకలపై నియంత్రణ లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. చికిత్స అందించడంలో ప్రొటోకాల్ కారణంగా ఆలస్యం / దురదృష్టవశాత్తూ రోగి మృతి చెందిన సందర్భాల్లో వైద్య సిబ్బందిపై ఒక్కోసారి దాడులు జరుగుతున్నాయి. గత రెండు నెలల్లో కర్నూలు, విజయవాడ జీజీహెచ్‌లలో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఇలాంటివి పునరావృతం కాకుండా సహాయకులను నియంత్రించాలి. ఎమర్జెన్సీ, ఇతర వార్డుల్లోకి ప్రవేశించేప్పుడే సహాయకులను స్క్రీనింగ్ చేయాలి. ఎమర్జెన్సీ వార్డుల్లో అదనపు భద్రత సిబ్బందిని నియమించాలి.భద్రతపై వైద్య వర్గాల ప్రధాన డిమాండ్లు⇒ రక్షణ చర్యలపై కనీస అవగాహన లేని వారు, వయసు మళ్లిన వారు ఆస్పత్రులు, కళాశాలల వద్ద సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్నారు. సుశిక్షితులైన భద్రతా సిబ్బందిని నియమించాలి. ⇒ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగాలి. ఆస్పత్రులు, కళాశాలల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణను బలోపేతం చేయాలి. హై రిజల్యూషన్ కెమెరాలను అమర్చి 24/7 పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఉండాలి. ఏ చిన్న అవాంఛనీయ ఘటన చోటు చేసుకున్నా వెంటనే అప్రమత్తం కావాలి.⇒ విధుల్లో ఉండే వైద్య సిబ్బందికి సరిపడా వాష్, రెస్ట్, డ్యూటీ రూమ్స్ ఉండాలి. మహిళా వైద్యులు, విద్యార్థినుల కోసం కేటాయించిన గదుల వద్ద పటిష్ట భద్రత కల్పించాలి. ⇒ ప్రస్తుతం రాష్ట్రంలోని బోధనాస్పత్రులు చాలా వరకూ కొన్ని దశాబ్ధాల క్రితం నిర్వహించినవే. గత ప్రభుత్వంలో నాడు–నేడు కింద పీహెచ్‌సీలు, సెకండరీ కేర్ పరిధిలో చాలా వరకూ కొత్తగా ఆస్పత్రుల్లో వైద్యుల అవసరాలకు అనుగుణంగా వసతులు కల్పించారు. కొత్తగా నిర్మించే వైద్య కళాశాలల్లో అదే తరహాలో వసతులు ఉంటున్నాయి. ఇక పాత బోధనాస్పత్రులతో పాటు, మరికొన్ని పాత ఆస్పత్రుల్లో పెరిగిన వైద్యులు, విద్యార్థుల సంఖ్యకు వసతులు లేవు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం వసతులు కల్పించాలి. ⇒ సాధారణంగా ఊరికి దూరంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రులు, కళాశాలల వద్ద పోలీసు నిఘా నిరంతరం ఉండాలి. పరిసరాల్లో ముళ్లు, చెట్ల పొదలు స్థానిక సంస్థలు చర్యలు చేపట్టాలి.⇒ వైద్య సిబ్బంది సంచరించే ప్రాంతాల్లో రాత్రి వేళ లైట్లు ఉండాలి. సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు దీన్ని పర్యవేక్షించాలి. వైద్య సిబ్బందితో నిర్వహించే సమావేశాల్లో రోగులకు సేవల కల్పనతోపాటు భద్రతాపరమైన అంశాలపైనా చర్చించాలి. ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించాలి.కమిటీల్లో పోలీసులు, లాయర్లు ఉండాలివైద్య విద్యార్థుల్లో 70 శాతం వరకు యువతులే ఉన్నందున వారి భద్రత పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అన్ని కళాశాలల్లో సమస్యలను నివేదించేందుకు కమిటీలున్నా చురుగ్గా పనిచేసేలా చూడాలి. కేవలం టీచింగ్ ఫ్యాకల్టీ మాత్రమే కాకుండా పోలీస్ శాఖ నుంచి సీఐ స్థాయి అధికారి, న్యాయ శాఖ నుంచి ఒకరితోపాటు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి కమిటీలో సభ్యులుగా ఉండాలి. సభ్యుల పేర్లు, ఫోన్ నెంబర్లను కళాశాలలో ప్రదర్శించాలి. – డాక్టర్ విఠల్‌రావు, సిద్ధార్థ వైద్య కళాశాల పూర్వ ప్రిన్సిపల్ సీసీ కెమెరాలు పెంచాలివిశాలమైన ప్రభుత్వ ఆసుపత్రులు, కళాశాలల ప్రాంగణాల్లో భద్రత కల్పించడం సవాళ్లతో కూడుకున్నదే. తరగతి గదులు, ల్యాబ్‌లు, కారిడార్లు, విద్యార్థులు, వైద్యులు సంచరించే అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల సర్వే లెన్స్ ఉండేలా చూడాలి. వీటి పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో 24/7 సిబ్బంది ఉండాలి. ఆస్పత్రులు, కళాశాలల పరిసర ప్రాంతాల్లో పోలీసు నిఘా ఏర్పాటు చేయాలి. దీనివల్ల భద్రతతోపాటు ఆస్పత్రుల్లో శిశువుల అపహరణలు అరికట్టవచ్చు. మహిళా వైద్య సిబ్బంది శారీరక, మానసిక దృఢత్వంపై దృష్టి సారించాలి. – డాక్టర్ వెంగమ్మ, రిటైర్డ్ డైరెక్టర్, వీసీ, స్విమ్స్ యూనివర్సిటీ, తిరుపతివసతులు మెరుగుపడాలిఆస్పత్రులు, కళాశాలల్లో వసతులను అభివృద్ధి చేయాలి. కోల్‌కతాలో హత్యాచారానికి గురైన విద్యార్థిని 36 గంటలు విధులు నిర్వర్తించింది. మన దగ్గర కూడా ఈ పరిస్థితులు న్నాయి. వైద్య విద్యార్థుల పని వేళల మీద దృష్టి పెట్టాలి. తగినన్ని వాష్ రూమ్స్, రెస్ట్ రూమ్స్, డ్యూటీ రూమ్స్ ఏర్పాటు చేసి పరిశుభ్రంగా నిర్వహించాలి. ముఖ్యంగా మహిళా వైద్య సిబ్బందికి ఆస్పత్రుల్లో సురక్షిత వాతావరణం కల్పించాలి. ఫ్యాకల్టీ సైతం విద్యార్థులను తమ పిల్లల్లాగా భావించాలి. – డాక్టర్ శశిప్రభ, మాజీ డీఎంఈ, ఉమ్మడి ఏపీ వ్యవస్థ మారాలి..దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి వద్ద జూనియర్ వైద్యులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తెల్లటి వస్త్రంపై ఎర్రటి సిరాతో చేతి ముద్రలు వేస్తూ.. మహిళలపై దాడులను అరికట్టాలంటూ నినదించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి రాత్రి భద్రత పెంచాలిబోధనాస్పత్రుల్లో టీబీ, ఇన్ఫెక్షన్ వైద్య సేవలు, బ్లడ్ బ్యాంక్‌లు, ల్యాబ్‌లు, కొన్ని రకాల విభాగాలు ఐపీ, ఓపీ భవనాలకు దూరంగా ఉన్నందున జన సంచారం తక్కువగా ఉంటుంది. అలాంటి విభాగాల్లోనూ మహిళా వైద్యులు, సిబ్బంది నైట్ డ్యూటీలు చేస్తుంటారు. అక్కడ సెక్యూరిటీ పెంచాలి. అనుమా నాస్పద వ్యక్తులు చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులు కట్టి చికిత్స పొందే ప్రైవేట్ ఆస్పత్రుల్లో సైతం క్షుణ్నంగా పరిశీలించాకే పరిమిత వేళల్లో రోగుల సహాయకులను అనుమతిస్తారు. ప్రభుత్వాస్పత్రుల్లోనూ అలాగే వ్యవహ రించాలి. సహాయకులను గుంపులుగా అనుమతించకూడదు. – డాక్టర్ చాగంటి పద్మావతి, పూర్వ ప్రిన్సిపల్, గుంటూరు వైద్య కళాశాల -
అపోలో కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్..70 మంది విద్యార్ధులకు అస్వస్థత?
చిత్తూరు జిల్లా అపోలో మెడికల్ కాలేజీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. కలుషిత ఆహారం తిన్న 70 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న యాజమాన్యం అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వా ఆస్పత్రికి తరలించింది. -
కాబోయే వైద్యురాలు కాటికి
బనశంకరి: మంగళూరులో మెడిసిన్ పీజీ చదువుతున్న వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల కు చెందిన వైద్య విద్యార్థిని డెంగీ జ్వరంతో మరణించింది. ఎర్రగుంట్ల మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పీ.మాధురి, వెంకట రమణారెడ్డి కుమార్తె పడిగపాటి సజని (27) మంగళూరు వద్ద సుళ్యలో కేవీజీ మెడికల్ కాలేజీలో గైనకాలజీలో పీజీ విద్యార్థిని. 18న సజనికి జ్వరం రావడంతో అదే మెడికల్ కాలేజీలోనే వైద్యం చేయించుకుంది. డెంగీ అని నిర్ధారణ కాగా ప్లేట్లేట్స్ తగ్గిపోయాయి. సరైన వైద్యం అందించకపోవడంతో ప్లేట్లేట్స్ బాగా తగ్గి సజని ఆరోగ్యం విషమించింది. కాలేజీ సిబ్బంది ఆలస్యంగా తల్లిదండ్రులకు చెప్పడంతో హైదరాబాద్ నుంచి మంగళూరుకు బయలుదేరారు. కానీ సజని ఆరోగ్య విషయంలో కాలేజీ డాక్టర్లు చేతులెత్తేసి మెరుగైన వైద్యం కోసం మంగళూరుకు వెళ్లాలని సూచించారు. దీంతో వైద్యసిబ్బంది ఆమెను మంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో కోమాలోకి చేరుకుంది. తల్లిదండ్రులు మంగళూరుకు వెళ్లి కోమాలో కొన ఊపిరితో ఉన్న కుమార్తె ను చూసి తల్లడిల్లిపోయారు. చివరి మాటలకు కూడా నోచుకోలేదని విలపించారు. 21 తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కన్నుమూసిందని తల్లిదండ్రులు తెలిపారు.స్పందన లేని వైద్యులుతమ బిడ్డకు సరిగా వైద్యం చేయలేదని తల్లిదండ్రులు మంగళూరు నార్త్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కాలేజీకి వెళ్లి విచారణ జరిపారు. సజనికి ట్రీట్మెంట్ గురించి వైద్యులు సరైన సమాధానం చెప్పలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. అదివారం తెల్లవారుజామున స్వగ్రామం పోట్లదుర్తికి మృతదేహాన్ని తీసుకువచ్చి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు.త్వరలో కోర్సు పూర్తి..సజని చదువులో మంచి ప్రతిభాశాలి. ఇంటర్ పూర్తయిన తరువాత మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీటును హైదరాబాదులోని గాంధీ మెడికల్ కాలేజీలో సంపాదించింది. తరువాత సుళ్యలో పీజీ కోర్సు చివరి ఏడాది చేస్తోంది. ఆమె మరణంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. త్వరలో ఎంఎస్ పూర్తి చేసుకుని వస్తుందని కోటి ఆశలతో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ వైద్య విద్యార్థినికే కనీస వైద్యం అందించకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. -
వైద్యుల నిర్లక్ష్యంతోనే మెడికో మృతి
బనశంకరి: మంగళూరులో మెడిసిన్ పీజీ చదువుతున్న వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన వైద్య విద్యార్థిని వైద్యుల నిర్లక్ష్యంతోనే డెంగీ జ్వరంతో మృతిచెందిందని కుటుంబీకులు ఆరోపింయచారు. ఎర్రగుంట్ల మాజీ జడ్పీటీసీ సభ్యురాలు పి.మాధురి, వెంకటరమణారెడ్డి కుమార్తె పడిగపాటి సృజని (27) మంగళూరు వద్ద కేవీజీ మెడికల్ కాలేజీలో గైనకాలజీలో పీజీ విద్యార్థిని. నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో అదే మెడికల్ కాలేజీలోనే వైద్యం చేయించుకుంది. డెంగీ అని నిర్ధారణ కాగా ప్లేట్లేట్స్ తగ్గిపోయాయి. సరైన వైద్యం అందించకపోవడంతో ఆరోగ్యం విషమించింది. కాలేజీ సిబ్బంది ఆలస్యంగా తల్లిదండ్రులకు చెప్పడంతో హైదరాబాద్ నుంచి మంగళూరుకు బయలుదేరారు. డాక్టర్లు చేతులెత్తేసి మెరుగైన వైద్యం కోసం మంగళూరుకు వెళ్లాలని సూచించారు. వైద్య సిబ్బంది ఆమెను మంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో కోమాలోకి చేరుకుంది. కొన ఊపిరితో ఉన్న కుమార్తె ను చూసి తల్లడిల్లిపోయారు. చివరి మాటలకు కూడా నోచుకోలేదని విలపించారు. 21 తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కన్నుమూసిందని తల్లిదండ్రులు తెలిపారు.స్పందన లేని వైద్యులుతమ బిడ్డకు సరిగా వైద్యం చేయలేదని తల్లిదండ్రులు మంగళూరు నార్త్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కాలేజీకి వెళ్లి విచారణ జరిపారు. సృజని ట్రీట్మెంట్ గురించి వైద్యులు సరైన సమాధానం చెప్పలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. అదివారం తెల్లవారు జామున స్వగ్రామం పోట్లదుర్తికి మృతదేహాన్ని తీసుకువచ్చి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు.త్వరలో కోర్సు పూర్తి..సృజని చదువులో మంచి ప్రతిభాశాలి. ఇంటర్ పూర్తయిన తరువాత మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీటు సాధించి హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించింది. తరువాత సుళ్యలో పీజీ కోర్సు చివరి ఏడాది చేస్తోంది. ఆమె మరణంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. త్వరలో ఎంఎస్ పూర్తి చేసుకుని వస్తుందని కోటి ఆశలతో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ వైద్య విద్యార్థినికే కనీస వైద్యం అందించకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. -
Medical Student Dies: ఆరిపోయిన ఆశల దీపం
కర్నూలు(హాస్పిటల్)/ రొళ్ల: ఆశల దీపం ఆరిపోయింది. రోడ్డు ప్రమాదం ఓ వైద్య విద్యార్థిని బలితీసుకుంది. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న ఆర్.తేజేశ్వర్‌రెడ్డి(22) ఆదివారం మృత్యువాత పడ్డాడు. ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండలం పిల్లిగుండ్ల గ్రామానికి చెందిన రంగనాథ్ (రత్నగిరి జెడ్పీ హైసూ్కల్ టీచర్), గీతాలక్ష్మి (పిల్లిగుండ్ల గొల్లహట్టి ప్రాథమిక పాఠశాల టీచర్) దంపతులు. వీరికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు తేజేశ్వర్‌రెడ్డి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఇక చిన్న కుమారుడు వర్షిత్‌రెడ్డి బెంగళూరులో ఇంజినీరింగ్ కోర్సు చేస్తున్నాడు. తేజేశ్వర్‌రెడ్డి ఆదివారం ఉదయం 7.30 గంటల సమయంలో కాలేజీలోని రీడింగ్ రూమ్‌లో చదవడం ముగించుకుని.. వసతిగృహానికి బుల్లెట్ బండి (ద్విచక్రవాహనం)పై బయల్దేరాడు. కళాశాల గేటు దాటి బయటకు రాగానే పెట్రోల్ బంక్ దాటిన తర్వాత అదే రోడ్డులో నందికొట్కూరు నుంచి కర్నూలుకు వేగంగా వస్తున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొట్టింది. కిందపడిన తేజేశ్వర్‌రెడ్డిని దాదాపు 50 మీటర్ల వరకు బస్సు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో తేజేశ్వర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన వైద్యశాల మార్చురీకి తరలించారు. మధ్యాహ్నం తల్లిదండ్రులు రావడంతో పోలీసులు పంచనామా చేసి మృతదేహాన్ని అప్పగించారు. చదువు పూర్తయ్యాక పెద్ద డాక్టర్ అయి తమకు అండగా ఉంటాడని భావించిన ఆ తల్లిదండ్రులు.. కుమారుని మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయారు. 20 రోజుల కిందటే కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుని వచ్చారు. ఇంతలోనే ఎంత ఘోరం జరిగిపోయిందంటూ బంధువులు, స్నేహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో పిల్లిగుండ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. జెడ్పీటీసీ సభ్యుడు అనంతరాజు, వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు విద్యార్థి మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. -
Russia: భారతీయ వైద్య విద్యార్థుల మృతదేహాలు వెలికితీత
మాస్కో: రష్యాలో విషాదం చోటు చేసుకుంది.వోల్ఖోవ్ నది ఒడ్డుకు వాకింగ్‌కు వెళ్లి గల్లంతైన నలుగురు భారతీయ వైద్య విద్యార్థుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా అధికారులు తెలిపారు. మృతదేహాలను ముంబైకి తరలించి,తర్వాత మహరాష్ట్ర జల్గావ్ జిల్లాలోని విద్యార్ధుల స్వస్థలాలకు తరలించనున్నారు.నదిలో గల్లంతైన విద్యార్ధులలో ఐదవ విద్యార్ధిని నిషా భూపేష్ సోనావానే రక్షించామని, అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.వాకింగ్‌కు వెళ్తుండగా ప్రమాదం..మరణించిన భారతీయ వైద్య విద్యార్ధులు సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలోని యారోస్లావ్ ది వైస్ నోవ్‌గొరోడ్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన వారు. వోల్ఖోవ్ నది పక్కగా వాకింగ్‌కు వెళుతున్నప్పుడు ప్రమాదం జరిగిందని యూనివర్సిటీ అధికారి ఒకరు తెలిపారు. భారతీయ విద్యార్ధులకు హెచ్చరికలుఈ దుర్ఘటన తర్వాత రష్యాలోని భారత రాయబార కార్యాలయం భారతీయ విద్యార్ధులకు హెచ్చరికలు జారీ చేసింది. రష్యాలోని భారతీయులు నదీ ప్రవాహక ప్రాంతాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని కోరింది.వరుస దుర్ఘటనలురష్యాలో భారతీయ విద్యార్థులు మునిగిపోయే దురదృష్టకర సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఇటువంటి సంఘటనలలో ఇప్పటివరకు నలుగురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు అని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.విద్యార్ధుల్లారా.. తస్మాత్ జాగ్రత్త2023లో ఇద్దరు భారతీయ విద్యార్థులు, 2022లో ఆరుగురు రష్యాలోని నదుల్లో మునిగి చనిపోయారని పేర్కొంది. కాబట్టి రష్యాలోని భారతీయ విద్యార్థులు బీచ్‌లు, నదులు, సరస్సులు, చెరువులు, నీటి ప్రవాహ ప్రాంతాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని రాయబార కార్యాలయం కోరుతోంది. విద్యార్థులు ఈ విషయంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు, భద్రతా చర్యలను తీసుకోవాలని రాయబార అధికారులు సూచించారు.తల్లిదండ్రులకు వీడియో కాల్.. అంతలోనే కాగా,ఐదుగురు వైద్య విద్యార్ధులు హర్షల్ అనంత్‌రావ్, జీషన్ పింజారీ, జియా పింజారీ, మాలిక్ మహమ్మద్ యాకూబ్,నిషా భూపేష్ సోనావానేలు వోల్ఖోవ్ నది ఒడ్డుకి వాకింగ్‌కు వెళ్లారు. జీషన్ అతని కుటుంబసభ్యులకు వీడియో కాల్ చేశారు. అయితే ఆ సమయంలో జీషన్ తల్లిదండ్రులు నది నీటిలో నుంచి బయటకు రావాలని కోరుతుండగా.. బలమైన అలల తాకిడికి విద్యార్ధులు నదిలో మునిగారని జీషన్ కుటుంబసభ్యులు తెలిపారు. మహరాష్ట్ర జల్గావ్ జిల్లా వాసులుగల్లంతైన నలుగురు విద్యార్థులను జియా పింజారీ, జిషాన్ పింజారీ అన్నా చెల్లెళ్లు, మహ్మద్ యాకూబ్ మాలిక్, హర్షల్ దేశాలీగా గుర్తించారు. నలుగురు విద్యార్థులు మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందినవారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. -
రష్యాలో నదిలో మునిగి... మన విద్యార్థుల మృతి
న్యూఢిల్లీ: రష్యాలోని వెలికీ నోవ్గోరోడ్ ప్రాంతంలోని విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న నలుగురు భారత వైద్య విద్యార్థులు వోల్ఖోవ్ నదిలో మునిగి దుర్మరణం పాలయ్యారు. మంగళవారం ఈ దుర్ఘటన జరిగినట్టు విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఒక మహిళా విద్యారి్థని కాపాడి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. విద్యార్థులంతా వెలికీ నోవ్గోరోడ్ స్టేట్ వర్సిటీలో చదువుతున్నారు. మృతులంతా మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందిన వారు. మృతుల్లో జియా, జిషాన్ అక్కాతమ్ముళ్లు. నది ఒడ్డున వాకింగ్ తర్వాత వారంతా నదిలోకి దిగారు. ఈత కొడుతుండగా జిషాన్ తమ కుటుంబసభ్యులకు వీడియో కాల్ చేశాడు. ఈత వద్దని కుటుంబసభ్యులు ఫోన్లో వారిస్తుండగానే జియా మునగడం, కాపాడేందుకు ప్రయతి్నస్తూ మిగతావారు కూడా నదిలో కొట్టుకుపోవడం కాల్లో రికార్డయింది. మృతదేహాల తరలింపు కోసం భారత కాన్సులేట్ ప్రయత్నిస్తోంది. -
రష్యాలో భారతీయ వైద్య విద్యార్థుల మృతి
మాస్కో: రష్యాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సెయింట్‌పీటర్స్‌బర్గ్ సమీపంలోని ఓ నదిలో భారత్‌కు చెందిన నలుగురు వైద్య విద్యార్థులు నీటిలో కొట్టుకుపోయారు. వీళ్లంతా బతికే అవకాశం లేదని రెస్క్యూ టీం చెబుతోంది. ఇప్పటికే ఒక మృతదేహానికి వెలికి తీసింది. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చేపట్టింది. మహారాష్ట్రలోని జలగావ్‌కు చెందిన ఈ నలుగురు సెయింట్‌పీటర్స్‌బర్గ్ సమీపంలోని నోవ్‌గొరోడ్ స్టేట్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. తొలుత నీటిలో మునిగిపోతున్న ఒక అమ్మాయిని కాపాడడానికి మిగిలిన స్నేహితులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ముగ్గురు నదిలో కొట్టుకుపోగా.. ఒక విద్యార్థిని మాత్రం స్థానికులు కాపాడగలిగారు. విద్యార్థుల మృతదేహాల్ని వెలికి తీసి.. వీలైనంత త్వరగా వారి స్వస్థలాలకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నామని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్(ట్విటర్) ద్వారా తెలిపింది. -
కిర్గిజిస్తాన్ భద్రమేనా!
ఉపాధి కోసమో, విద్యార్జన కోసమో మనదికాని చోటుకు పిల్లలను పంపినప్పుడు కన్నవాళ్ల హృదయం వారి కోసం నిత్యం ఆరాటపడుతుంది. సక్రమంగా ఉన్నారా, తిన్నారా అన్న ఆలోచనలే అనుక్షణమూ వారిని వేధిస్తుంటాయి. ప్రపంచం మునపట్లా లేదు గనుక ఇటువంటి భయాందోళనలు ఇప్పుడు మరింత పెరిగాయి. దేశంలో ఉన్నత విద్యారంగం, మరీ ముఖ్యంగా వైద్య విద్య బాగా విస్తరిస్తే అందరికీ అందుబాటులోకొస్తే మన విద్యార్థులు దూరతీరాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలా లేకపోబట్టే విద్యార్థులు అనుకోకుండా జరిగే పరిణామాల్లో చిక్కుకుని అవస్థలు పడాల్సివస్తోంది. రెండున్నరేళ్లక్రితం ఉన్నట్టుండి ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధానికి తెగబడినప్పుడు అక్కడి మన వైద్య విద్యార్థులు ప్రాణాపాయంలో చిక్కుకోవటం, ఇబ్బందులు పడటం చూశాం. మన దేశంతోపాటు అన్ని దేశాలూ తమ తమ విద్యార్థులను సురక్షితంగా వెనక్కు తీసుకెళ్లగలిగాయి. సరిగ్గా వారం క్రితం కిర్గిజిస్తాన్లోనూ విద్యార్థులకు సమస్య ఎదురైంది. ఈనెల 13న పాకిస్తాన్, ఈజిప్టు విద్యార్థులతో ఏర్పడిన తగవు ఆసరా చేసుకుని వందలాదిమంది స్థానికులు విద్యార్థుల హాస్టళ్లపై విరుచుకుపడి ధ్వంసం చేశారు. అనేకమంది విద్యార్థులను గాయపరిచారు. విద్యార్థినులను సైతం వేధించటం, దౌర్జన్యం చేయటంతో ఎప్పుడేమవుతుందో తెలియక విద్యార్థులంతా ఏడెనిమిది గంటలపాటు చీకటి గదుల్లో ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. పోలీసులు రంగంలోకి దిగినా దుండగులను అదుపు చేయలేకపోయారు. ఆ తర్వాత అరెస్టులు జరిగాయి. అది వేరే సంగతి. హాస్టళ్లకూ, విదేశీ విద్యార్థులుండే అపార్ట్మెంట్లకూ రక్షణ కల్పిస్తున్నారు. కానీ ఘటన జరిగివారం కావస్తున్నా ఎక్కడా భయాందోళనలు చల్లారలేదు. దాంతో స్వస్థలాలకు పోవటమే ఉత్తమమని శుక్రవారం కూడా వందలాదిమంది పాకిస్తానీ విద్యార్థులు ఇంటి బాట పట్టారు. వారి ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. మన విదేశాంగశాఖ మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే బిషెక్‌లోని మన రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కోరింది. వేరే దేశాలకు పోయినప్పుడు అక్కడి భాష, సంస్కృతీ సంప్రదాయాలు, పద్ధతులపై అవగాహన పెంచుకుని వాటిని గౌరవించటం అలవాటు చేసుకోవాలి. తమ దేశానికి చెందినవారితోనే సన్నిహితంగా మెలగటం, స్థానికులను చిన్నచూపు చూసే స్వభావం అనవసరమైన అపార్థాలకు దారితీస్తుంది. తమ సంస్కృతే ఘనమైనదని, ఇతరులు అల్పులన్న భావన స్వదేశంలో ఎంతోకొంత చెల్లుబాటవుతుంది. వేరేచోట మాత్రం సమస్యలు తెస్తుంది. దీన్ని గుర్తించబట్టే విశ్వవిద్యాలయాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్థానికులతో కలిసిమెలిసివుండేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. కిర్గిజిస్తాన్‌లో మూడేళ్లక్రితం కూడా గొడవలు జరిగాయి. అప్పుడూ ఇప్పుడూ కూడా పాకిస్తాన్ విద్యార్థులే గొడవలకు కారకులయ్యారు. రౌడీయిజం, స్థానిక సంప్రదాయాలను కించపరచటం, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనటం వంటివి సమస్యలు తెచ్చిపెడుతున్నాయన్నది స్థానికుల ఆరోపణ. సాధారణంగా ఒకరిద్దరి ప్రవర్తన వల్ల గొడవ జరిగితే అది వారికే పరిమిత మవుతుంది. ఎవరో ఒకరి జోక్యంతో అంతా సద్దుమణుగుతుంది. కానీ సామాజిక మాధ్యమాల హవా పెరగటం, ఆ గొడవ తాలూకు వీడియో క్షణాల్లో అందరికీ చేరటం భావోద్వేగాలను రెచ్చగొడుతోంది. ఉద్రిక్తతలు రేపుతోంది. దీనికితోడు విదేశీ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు తమకు లేకపోవటం, వారి జీవన ప్రమాణాలు మెరుగ్గా కనబడటం ఆర్థికంగా అంతంతమాత్రంగా బతుకీడ్చే స్థానికులకు సహజంగానే ఆగ్రహం కలిగిస్తుంది. తమను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణిస్తూ విదేశీ విద్యార్థులను అందలం ఎక్కించటం అసంతృప్తికి దారితీస్తుంది. పుండు మీద కారం జల్లినట్టు వారిని కించపరచటం లాంటి చేష్టలకు పాల్పడితే ఇక చెప్పేదేముంది? ఇలాంటి సమయాల్లో కారకులెవరన్న విచక్షణ ఉండదు. విదేశీయులందరినీ ఒకే గాటనకడతారు. కనుక ఎవరికి వారు పద్ధతిగా ఉంటే సరిపోదు. తోటి విద్యార్థులపై ఓ కన్నేసివుంచాలి. సమస్య తలెత్తవచ్చన్న సందేహం కలిగితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. నిజానికి మధ్య ఆసియా దేశమైన కిర్గిజిస్తాన్ వేరే దేశాలతో పోలిస్తే ఎంతో ప్రశాంతమైనది. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. స్థానికులు ప్రధానంగా సంచార జీవనానికి అలవాటుపడినవారు. విదేశీ అతిథులను ఆదరించటం, గౌరవించటంలో వారు ఎవరికీ తీసిపోరు. కిర్గిజిస్తాన్ విద్యాలయాల్లో మన విద్యార్థులు 15,000 మంది ఉంటారని అంచనా. పాకిస్తాన్ నుంచి వచ్చినవారి సంఖ్య 11,000. వీరుగాక ఇంకా బంగ్లాదేశ్, కొన్ని అరబ్, ఆఫ్రికన్ దేశాల నుంచి కూడా చదువుకోవటానికి వస్తారు. తమ దేశాల్లో వైద్య విద్య ఖరీదైన వ్యవహారంగా మారడమే ఇందుకు కారణం. పూర్వపు సోవియెట్ యూనియన్‌లో భాగం కావటం వల్ల పాశ్చాత్య దేశాలతో పోలిస్తే కిర్గిజిస్తాన్ వైద్య విద్య ఎంతో ప్రామాణికమైనది. అంతర్జాతీయంగా అనేక దేశాలతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు కూడా దానికివుంది. వేరే దేశాల్లో చదవాలని, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని తహతహలాడే పిల్లలు దూరాభారాలు లెక్కచేయక విదేశాలకు వెళ్తారు. కానీ ఇక్కడ చదువుకోవాలనుకునేవారికి మన వైద్యవిద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవటం ప్రభుత్వాల బాధ్యత. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఈ విషయంలో ప్రత్యేకశ్రద్ధ పెట్టాయి. వేరే రాష్ట్రాలు కూడా ఆ పని చేయాలి. కేంద్ర ప్రభుత్వం అందుకు సహాయసహకారాలు అందించాలి. -
అబ్బాయిలతో కలిసి ఉంటేనే వైద్య విద్య
విశాఖ సిటీ: వైద్యురాలుగా స్థిరపడాలనుకుంది. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయాలని భావించింది. ఎంత ఖర్చయినా తన కుమార్తెను డాక్టర్‌గా చూడాలని తల్లిదండ్రులు తాపత్రయపడ్డారు. నగరానికి చెందిన కన్సల్టెన్సీ ద్వారా కజకిస్తాన్‌లో ఒక యూనివర్సిటీలో సీటు సంపాదించారు. కోటి ఆశలతో విదేశీ యూనివర్సిటీలోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే విద్యార్థికి వేధింపులు ప్రారంభమయ్యాయి. అక్కడ హాస్టల్లో అబ్బాయిలతో కలిపి వసతి కల్పించడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. పాశ్చాత్య పోకడలకు ఇమడలేని విద్యార్థిని ఇంటికి వెళ్లిపోతానని వేడుకున్నప్పటికీ.. పాస్‌పోర్ట్ తీసుకొని మొత్తం ఫీజు చెల్లిస్తేనే పంపిస్తామంటూ బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో విద్యారి్థని తన పరిస్థితిని తల్లిదండ్రులకు చెప్పుకొని దేశం కాని దేశంలో తిండీ, నిద్ర లేకుండా ఇబ్బందులు పడుతోంది. అక్కడి పరిస్థితులను, ఆమె బాధను వివరిస్తూ సెల్ఫీ వీడియో సైతం విడుదల చేసింది. దీనిపై ఆమె తల్లిదండ్రులు గాజువాక పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన జి.భవాని విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయాలని భావించింది. ఇందుకోసం గాజువాకలో ఉన్న జీవీకే కన్సల్టెన్సీ అనే సంస్థను సంప్రదించారు. దాని ద్వారా కజకిస్తాన్ దేశంలో ఆల్మటీ నగరంలో కాస్పియన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ సీటుకు డబ్బు చెల్లించారు. ఆ సమయంలోనే అక్కడి వసతి ఏర్పాట్లపై భవాని తండ్రి జగదీష్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో స్పష్టంగా మాట్లాడారు. గరŠల్స్, బాయ్స్‌కు ప్రత్యేక హాస్టళ్లు ఉంటాయని చెప్పడంతో వారు సీటు కోసం డబ్బు చెల్లించారు. భవాని ఈ నెల 11వ తేదీన కజకిస్తాన్‌కు వెళ్లింది. యూనివర్సిటీలో ఒక భవనంలోనే అబ్బాయిలకు, అమ్మాయిలకు వసతి కలి ్పంచారు. కొద్ది రోజులపాటు సర్దుకున్న భవాని అక్కడి వాతావరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. అబ్బాయిలతో కలిసి ఉండడం, వారు సిగరెట్, ఇతర అలవాట్లను చూసి భరించలేక ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. దీనిపై జగదీష్ కన్సల్టెన్సీ ప్రతినిధులను సంప్రదించారు. తన కుమార్తెను వేరే హాస్టల్‌కు మార్చాలని కోరాడు. చెప్పిన కొద్దిసేపటికే భవాని రూమ్‌కు కొంత మంది సీనియర్ అబ్బాయిలు వెళ్లి ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే తప్పనిసరిగా తమతో కలిసే ఉండాలని హెచ్చరించారు. అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరుగా వసతి కల్పించినట్లు చెప్పాలని బలవంతం పెట్టడంతో భయపడిన భవాని మళ్లీ తన తండ్రికి ఫోన్ చేసి వేరే హాస్టల్‌కు మార్పించినట్లు చెప్పింది. డబ్బు చెల్లిస్తేనే పాస్‌పోర్ట్ ఇస్తామంటూ.. అక్కడి వాతావరణాన్ని భరించలేని భవాని తాను అక్కడ ఉండలేనని, ఇంటికి పంపించేయాలని కళాశాల వాళ్లను వేడుకుంది. ఫీజు మొత్తం డబ్బు చెల్లిస్తేనే తిరిగి పంపిస్తామంటూ ఆమె పాస్‌పోర్ట్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. దీంతో ఆమె ఈ విషయాన్ని తండ్రి జగదీష్ కు చెప్పింది. హాస్టల్లో పరిస్థితులు బాగోలేవని, తాను ఇంటికి వెళ్లేందుకు సహాయం చేయాలని అధికారులను కోరుతూ సెల్ఫీ వీడియో తీసి పంపించింది. దీనిపై తండ్రి జగదీష్ గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కుమార్తెకు తిరిగి విశాఖకు రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాడు. -
సంగారెడ్డిలో మెడికో అనుమానాస్పద మృతి
సాక్షి, సంగారెడ్డి: మెడికో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కృష్ణారెడ్డి పేట్ ఓఆర్ఆర్ దగ్గర కారులో ఆపస్మారక స్థితిలో ఉన్న మెడికో రచనా రెడ్డి(25)ని పోలీసులు ఆసుపత్రికి తరలించేలోగా మృతిచెందింది. మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఖమ్మం మమతా కాలేజీలో పీజీ చదువుతున్న రచనా రెడ్డి.. ప్రస్తుతం బాచుపల్లి మమతా కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తోంది. ఆమె మృతిపై అమీన్పూర్ పోలీసులు విచారణ చేపట్టారు -
రిమ్స్ వైద్య విద్యార్థులపై దాడి
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థులపై బుధవారం అర్ధరాత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతికుమార్ బయటి వ్యక్తులతో కలిసి దాడికి పాల్పడిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనలో ఇద్దరు వైద్య విద్యార్థులు గాయాలపాలయ్యారు. డైరెక్టర్ చాంబర్ ముందు నుంచి బుధవారం సాయంత్రం కవిరాజ్, మరో ముగ్గురు విద్యార్థులు అతి వేగంగా కారులో వెళ్లారు. దీంతో డైరెక్టర్ జైసింగ్ వారిని మందలించగా, విద్యార్థులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. అనంతరం జైసింగ్ అభిమానులమంటూ కొందరు సదరు విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. దీంతో దాడికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ గురువారం మెడికోలు తరగతులకు వెళ్లకుండా, ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. దీంతో కలెక్టర్ రాహుల్‌రాజ్ ఘటనపై విచారణకు ఆదేశించారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఘటనకు బాధ్యుడైన రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతికుమార్‌ను టర్మినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మెడికోలకు మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న మద్దతు తెలిపారు. వైద్య విద్యార్థులపై దాడికి దిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతికుమార్‌తోపాటు బయట వ్యక్తులైన వసీమ్, శివ, వెంకటేశ్, శ్రీకాంత్‌పై కేసు నమోదుచేసి, రిమాండ్‌కు తరలించనున్నట్లు ఆదిలాబాద్ టూటౌన్ సీఐ అశోక్ తెలిపారు. విద్యార్థుల ఫిర్యాదుతో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌పై కూడా కేసు నమోదైంది. -
కాబోయే డాక్టర్‌కు ‘మిస్ ఇండియా యూఎస్ఏ 2023’ కిరీటం (ఫొటోలు)
-
Miss India USA 2023: కాబోయే డాక్టరమ్మకు అందాల కిరీటం
‘అందమే ఆనందం’ అనుకోవడంతో పాటు ‘ఆనందమే అందం’ అనుకునే రిజుల్ మైని మిచిగాన్ (యూఎస్)లో మెడికల్ స్టూడెంట్. ఈ ఇండో– అమెరికన్ స్టూడెంట్ ‘మిస్ ఇండియా యూఎస్ఏ 2023’ కిరీటాన్ని గెలుచుకుంది... ‘మిస్ ఇండియా యూఎస్ఏ’ టైటిల్ గెలుచుకోవడానికి 25 రాష్ట్రాల నుంచి 57 మంది పోటీ పడ్డారు. ‘వినయంతో, ఒకింత గర్వంతో నేను మిస్ ఇండియా యూఎస్ఏ 2023 అని చెబుతున్నాను. నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేకపోతే ఈ విజయం సాధ్యం అయ్యేది కాదు. నా ప్రయాణంలో అడుగడుగునా స్నేహితులు అండగా నిలిచారు. విలువైన సూచనలు ఇచ్చారు’ అంటుంది రిజుల్ మైని. ఇరవై నాలుగు సంవత్సరాల ఇండియన్–అమెరికన్ రిజుల్ మైని తనను తాను మెడికల్ స్టూడెంట్, మోడల్‌గా పరిచయం చేసుకుంటుంది. సర్జన్ కావాలనేది తన లక్ష్యం. స్కూలు రోజుల నుంచి చదువుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేదో, కళలు, సాంస్కృతిక సంబంధిత కార్యక్రమాలకు అంతే ప్రాధాన్యత ఇచ్చేది రిజుల్. మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీలో ‘హ్యుమన్ సైకాలజీ’లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన రిజుల్‌కు ఖాళీ సమయం అంటూ ఉండదు. ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది. ఆమె హాబీల జాబితాలో పెయింటింగ్, కుకింగ్, గోల్ఫింగ్... ఇలా ఎన్నో ఉన్నాయి. స్వచ్ఛంద కార్యక్రమాలలోనూ ముందుంటుంది. వైద్యానికి సంబంధించిన సరికొత్త విషయాలు, పుస్తకాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో ఇతరులతో పంచుకోవడం అంటే ఇష్టం. ‘కళ అనేది మనసులోని మాలిన్యాన్ని శుభ్రం చేస్తుంది’ అనే మాట రిజుల్ మైనికి ఇష్టం. అందుకేనేమో ఆమెకు కళలు అంటే అంత ఇష్టం. కళలు ఉన్నచోట వెలుగు ఉంటుంది. ఆ వెలుగే అందం. ఆనందం. -
అమెరికాలో వైద్య విద్యార్థిని మృతి
మహబూబాబాద్: అమెరికాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్యవిద్యార్థిని మృతి చెందగా ఆదివారం సీరోలు మండలం కాంపల్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన వడ్డేపల్లి పుల్లయ్య కుమార్తె నీరజ(28) ఖ మ్మం జిల్లా కేంద్రంలోని మమత మెడికల్ కాలేజీలో బీడీఎస్ పూర్తి చేసింది. అమెరికాలోని మెస్సోరీ రా ష్ట్రంలోని లూయిస్ యూనివర్సిటీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గత నెల 28వ తేదీన మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కాగా శనివారం రాత్రి ఆమెరికా నుంచి మృతదేహం వరంగల్‌కు చేరుకోగా ఆదివారం స్వ గ్రామానికి తీసుకొచ్చారు. ఉన్నత విద్యకోసం వెళ్లిన నీరజ విగతజీవిగా స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. జిల్లేడు చెట్టుకు వివాహం జరిపించి అంత్యక్రియలు జరిపించారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కాంపల్లికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఇవి కూడా చదవండి: కళ్లెదుటే ఇద్దరు కుమారులు దుర్మరణం.. కోమాలోకి వెళ్లిన తల్లి -
భారతీయ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: భారతీయ వైద్య విద్యార్థులకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ గుడ్ న్యూస్ అందించింది. ఇకపై భారత్‌లో మెడికల్ గ్రాడ్యూయేట్ పూర్తి చేసిన విద్యార్థులు విదేశాల్లో కూడా ప్రాక్టిస్ చేయోచ్చని పేర్కొంది. ఈ మేరకు రల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యూకేషనల్ (WFME) నుంచి జాతీయ వైద్య మండలి (NMC) పది సంవత్సరాల వరకు గుర్తింపు పొందింనట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ గుర్తింపుతో భారత్‌లో వైద్య విద్యనభ్యసించిన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌లలో పీజీ కోర్సుల్లో చేరడంతో పాటు ప్రాక్టీస్ చేయవచ్చు. 2024 నుంచి భారతీయ వైద్య విద్యార్థులు విదేశాల్లో విద్య, ప్రాక్టీస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెసులుబాటుతో ఇప్పటికే దేశంలో ఉన్న 706 మెడికల్ కాలేజీలతోపాటు రాబోయే 10 ఏళ్లలో కొత్తగా ఏర్పాటు చేయబోయే కళాశాలలు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు పొందనున్నాయి. దీని వల్ల దేశంలో వైద్య విద్య ప్రమాణాలు మెరుపడటమే కాకుండా భారతీయ వైద్య విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా అపార అవకాశాలు లభించనున్నాయి ఈ సందర్భంగా ఎన్ఎమ్సీలోని ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు సభ్యుడు యోగేందర్ మాలిక్ మాట్లాడుతూ.. WFME గుర్తింపుతో భారతీయ వైద్య విద్య అంతార్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. దీనివల్ల భారతీయ వైద్య కళాశాలలకు, నిపుణులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా తమ కెరీన్‌ను కొనసాగించవచ్చని తెలిపారు. ఎన్ఎమ్సీ అంతర్జాయంగా గుర్తింపు పొందడం ద్వారా విదేశీ విద్యార్థులను భారత వైద్య కళాశాలు ఆకర్షిస్తాయని చెప్పారు. కాగా డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ అనేది ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన వైద్య విధ్యను అందించేందుకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థ. డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు ప్రక్రియ కోసం ప్రతి వైద్య కళాశాల నుంచి 60 వేల డాలర్లు రుసుము వసూలు చేస్తోంది. దీంతో దేశంలోని 706 వైద్య కళాశాలలు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు కోసం మొత్తంగా సుమారు 4,23,60,000 డాలర్లు ఖర్చు చేయనుంది. చదవండి: గణతంత్ర వేడుకలకు బైడెన్!.. ఆహ్వానించిన ప్రధాని మోదీ -
చాలా ఏళ్ళ తర్వాత మా రాయలసీమ కల సాకారం అయింది
-
మీ వల్ల మా అమ్మ క్యాన్సర్ నుండి కోలుకుంది జగనన్నా..
-
వైద్య విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): గాంధీ వైద్య కళాశాల వైద్య విద్యార్థుల సస్పెన్షన్‌పై పునరాలోచించాలని కోరు తూ వైద్య విద్యార్థులు ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని ముట్టడించి శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. గాంధీ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడిన పదిమంది వైద్య విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాంధీ వైద్య విద్యా ర్థులు మంగళవారం ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈక్రమంలో గాంధీ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, చిలకలగూడ సీఐ మట్టంరాజులు వైద్యవిద్యార్థులతో పలుమార్లు చర్చలు జరిపారు. ఢిల్లీలోని యూజీసీ యాంటీ ర్యాగింగ్ సెల్‌కు ఫిర్యాదు అందిన నేపధ్యంలో.. అక్కడి ఉన్నతాధి కారుల సూచన మేరకు గాంధీ వైద్య కళాశాల యాంటీ ర్యాగింగ్ కమిటీ జరిపిన అంతర్గత విచారణలో ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారణయిందని అధికారులు వివరించారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ తీర్మానం మేరకే చర్యలు చేపట్టామని, ఇది డీఎంఈ నిర్ణయం కాదని స్పష్టం చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై చట్టప్రకారం పోలీస్ కేసులు నమోదు చేయాలని, విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఓ అధికారి పేర్కొన్నారు. డీఎంఈ, గాంధీ ప్రిన్సిపాల్ రమేశ్‌రెడ్డి ప్రస్తుతం అందుబాటులో లేరని, బుధవారం ఆయనతో సమావేశం ఏర్పాటు చేస్తామని వైస్ ప్రిన్సిపాల్ నచ్చజెప్పడంతో విద్యార్థులు ధర్నా విరమించి, తరగతులకు హాజరయ్యారు. -
ఎందుకీ ఆత్మహత్యల పరంపర?.. రాజస్తాన్ కోటాలో ఏం జరుగుతోంది?
రాజస్తాన్‌లోని కోటా. ప్రవేశ పరీక్షల కోచింగ్‌కు పెట్టింది పేరు. ఇప్పుడు విద్యార్థి ఆత్మహత్యలకు కోటలా మారింది. వారం రోజుల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు 18 మంది నిండు ప్రాణాలను తీసుకున్నారు. ఈ ఆత్మహత్యలకి కారణలేంటి ? విద్యార్థుల ఆత్మహత్యల్ని నివారించలేరా? కోటాలో ఏ కోచింగ్ సెంటర్లో అడుగుపెట్టినా కళ్లు చెదురుతాయి. పెద్ద రిసెప్షన్ హాలు, లగ్జరీ ఫరీ్నచర్, గోడలకి పెయింటింగ్‌లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ సిస్టమ్, ఫైవ్ స్టార్ హోటల్స్‌ని తలపించేలా సకల సదుపాయాలు. ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని ఆశతో కలలు కనే విద్యార్థులకు కావల్సిన సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవడానికి దేశం నలుమూలల నుంచి 3 లక్షల మంది విద్యార్థులు చేరారు. ఐఐటీ, ఐఐఎంలలో అత్యధిక మందికి సీటు లభిస్తున్నప్పటికీ చాలా మందిలో భవిష్యత్‌పై భరోసా కూడా కరువు అవుతోంది. రాను రాను విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కొందరు హాస్టల్ భవనంపై నుంచి దూకి, మరికొందరు సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకొని , కొందరు సూసైడ్ నోట్ రాసి మరికొందరు మౌనంగా కన్నవారికి కడుపుకోత మిగిల్చి వెళ్లిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌కు చెందిన బహదూర్, రాజస్తాన్ జలోర్‌కు చెందిన పుషే్పంద్ర సింగ్ , బిహార్‌కు చెందిన భార్గవ్ మిశ్రా, యూపీకి చెందిన మంజోత్ చాబ్రా, ఇప్పుడు యూపీలోని అజమ్‌గఢ్‌కు చెందిన మనీశ్ ప్రజాపతి .. గత కొద్ది రోజుల్లో కోటాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు వీరంతా. అందరూ 16 నుంచి 19 ఏళ్ల వయసు మధ్యనున్న వారే. మనీష్ నాలుగు నెలల క్రితమే కోటాలో ఇంజనీరింగ్ కోచింగ్‌లో జాయిన్ అయ్యాడు. బుధవారమే అతని తండ్రి వచ్చి కొడుకుని చూసి క్షేమసమాచారాలు అడిగి తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన తన ఊరు చేరకుండానే మనీశ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఫోన్ వచి్చంది. అంతే ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. ఈ మధ్య కాలంలో కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 12 ఏళ్లలో 150 మంది విద్యార్థులు కోటాలో ఆత్మహత్య చేసుకున్నట్టు గణాంకాలు వెల్లడిçÜ్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత కోచింగ్ సెంటర్లు ప్రారంభమయ్యాక 2021లో నలుగురు ఆత్మహత్యకు పాల్పడితే, 2022లో 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 18 మంది బలవన్మరణం చెందారు. ప్రధాని హోదాకు తగని ప్రసంగం గురువారం లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు. ప్రధాని మోదీ రెండు గంటల ప్రసంగమంతా హాస్యం, వ్యంగ్యం, అసందర్భ వ్యాఖ్యలతోనే గడిచిపోయిందని వ్యాఖ్యానించారు. ‘మణిపూర్ లాంటి తీవ్రమైన, సున్నితమైన అంశంపై మాట్లాడేటప్పుడు నవ్వడం, ఎగతాళి చేయడం ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి తగదు’అని ఆమె శుక్రవారం ట్వీట్ చేశారు. ► ఇది పోటీ ప్రపంచం. వంద సీట్లు ఉంటే లక్ష మంది పరీక్ష రాస్తున్నారు. అంత పోటీని తట్టుకొని విజయం సాధించడం సులభం కాదు. అందుకే విద్యార్థులు ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టుగా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. తాము కన్న కలలు కల్లలవుతాయన్న భయంతో నిండు ప్రాణాలు తీసేసుకుంటున్నారు. ► కోటాలో ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల్లో యూపీ, బిహార్ వంటి రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువ. ఆ విద్యార్థులు వారి స్కూల్లో ఫస్ట్ ర్యాంకర్స్. దీంతో తల్లిదండ్రులు గంపెడాశలతో అప్పో సప్పో చేసి కోటాలో చేరి్పస్తున్నారు. తమ స్కూల్లో హీరోగా వెలిగిన విద్యారి్థకి అక్కడికి రాగానే తాను లక్షల మందిలో ఒకడినన్న వాస్తవం తెలుస్తుంది. మిగిలిన విద్యార్థులతో నెగ్గుకు రాలేక, తల్లిదండ్రుల్ని నిరాశపరచలేక ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. ► కోటాలో కోచింగ్ తీసుకునే విద్యార్థులు రోజుకి 16–18 గంటల చదవాలి. ఉదయం 6.30 నుంచి మళ్లీ అర్థరాత్రి 2 వరకు తరగతులు ఉంటాయి. అంటే విద్యార్థి పడుకోవడానికి ఇచ్చే సమయం కేవలం నాలుగు గంటలు. మధ్యలో తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. ‘‘ఏదో ఒకరోజు బాగా నిద్ర వచ్చి పావుగంట ఎక్కువ సేపు పడుకుంటే గిల్టీగా ఫీలవుతాను. తోటి వారి కంటే వెనకబడిపోతానన్న భయం వేస్తుంది. ఆ రోజంతా ఏడుస్తూనే ఉంటాను’’ అని ఐఐటీకి ప్రిపేర్ అవుతున్న సమర్ అనే విద్యార్థి చెప్పాడు. కంటినిండా నిద్రకి కూడా నోచుకోని చదువుల భారం వారి ప్రాణాలు తోడేస్తోంది. ► కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కోవిడ్ తర్వాత మరింత ఎక్కువయ్యాయి. కరోనా సమయంలో విద్యార్థులకి చదివే అలవాటు తప్పిపోయింది. దానికి తోడు కోవిడ్ సోకిన వారిలో మానసిక సమస్యలు ఎక్కువయ్యాయి. చదువుల ఒత్తిడి మరింతగా కుంగదీస్తోంది. ఆత్మహత్యకు పురిగొల్పుతోంది. ► కోటాలో కోచింగ్‌కే ఏడాదికి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల దాకా అవుతుంది. నిరుపేద కుటుంబాల విద్యార్థులకి తల్లిదండ్రులు చేసిన అప్పే ఎప్పుడూ కళ్ల ముందు కనిపిస్తోంది. ఆ లేత మనసులపై ఒత్తిడి పెంచుతుంది. దీంతో కోచింగ్ సెంటర్ల పరీక్షల్లో ఫెయిలైనా జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. ఆత్మహత్యకి నివారణ మార్గాలేంటి ? విద్యార్థుల వరస ఆత్మహత్యలతో కోచింగ్ సిటీ కోటాపై వ్యతిరేకత పెరిగిపోతూ ఉండడంతో రాజస్తాన్ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. 24/7 పనిచేసే హెల్ప్‌లైన్ నెంబర్లు, పోలీసుల ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేశారు. కొన్ని కోచింగ్ సెంటర్లు ప్రత్యేకంగా కౌన్సెలర్లను నియమించి ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పిస్తోంది. మానసిక ప్రశాంతతనిచ్చే యోగా, ధ్యానం, జుంబా డ్యాన్స్‌లు వంటి క్లాసులు కూడా కొన్ని కోచింగ్ సెంటర్లలో కనిపిస్తున్నాయి. అయితే ఈ చర్యలు సరిపోవని అనూ గుప్తా అనే టీచర్ చెబుతున్నారు. కోచింగ్ సెంటర్ యాజమాన్యాలు 24 గంటలూ పోటీ పరీక్షల్లో టెక్నిక్కులను బోధించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప జీవితంలో వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో, పోటీ ప్రపంచంలో ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించే పోరాటస్ఫూర్తిని విద్యార్థుల్లో కలి్పంచడం లేదని అనూ పేర్కొన్నారు. ఎలాగైనా బతకగలమన్న ధీమా విద్యార్థుల్లో నింపినప్పుడే ఆత్మహత్యల్ని నివారించవచ్చునని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు చదువు మీద పెట్టే సమయానికి, ఇతర కార్యక్రమాలకి ఇచ్చే సమయానికి మధ్య సమతుల్యత ఉండాలని అహ్లా మాత్రా అనే సైకాలజిస్ట్ చెప్పారు. రోజుకి 18 గంటలు చదువు రుద్దేయడం వల్ల మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల్ని కోటా ఫ్యాక్టరీకి పంపించే ముడి పదార్థాలుగా చూస్తున్నారని ఇప్పుడు వారిపై పెట్టుబడి పెడితే భవిష్యత్‌లో వారు ఉపయోగపడతారన్న ధోరణి నుంచి బయటకు రావాలని అవిజిత్ పాఠక్ అనే సైకాలిజిస్టు సూచించారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి రాజస్థాన్ ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల నియంత్రణ బిల్లుని తీసుకురావాలని భావిస్తోంది.ఆ బిల్లు వెంటనే తీసుకువచ్చి విద్యార్థుల ఆత్మహత్యల్ని నివారించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Nellore: 3 నెలల కిందటే పెళ్లి.. నారాయణ కళాశాలలో హౌస్‌సర్జన్ ఆత్మహత్య
సాక్షి, నెల్లూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ పరిధి లోని చింతారెడ్డిపాళెంలో ఉన్న నారాయణ వైద్య కళాశాలలో ఓ హౌస్‌సర్జన్ తన రూమ్‌లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. నెల్లూరు రూరల్ పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం.. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన చైతన్య(24) నారాయణ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతోంది. మూడు నెలల కిందట శ్రీకాకుళం జిల్లాకు చెందిన శరత్‌చంద్రతో ఆమెకు వివాహమైంది. శరత్చంద్ర విజయనగరంలోని వైద్య కళాశాలలో ఆర్థో విభాగంలో పీజీ చదువుతున్నాడు. పెళ్లయిన నాటి నుంచి చైతన్యను భర్త వేధింపులకు గురిచేసేవాడని, నగదు, కారు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెస్తుండేవాడని తెలుస్తోంది. భర్త నుంచి వేధింపులు అధికం కావడంతో మనస్తాపం చెందిన చైతన్య రూమ్‌లో తన చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చైతన్యకు తల్లి జ్యోతికుమారి ఫోన్ చేయగా ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో హాస్టల్ వార్డెన్‌కు కాల్ చేసింది. హాస్టల్ సిబ్బంది చైతన్య గది వద్దకు వెళ్లి రూమ్ తలుపులు పగులగొట్టి చూడగా చైతన్య మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ ఉంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి -
వైద్య విద్యార్థి ఆత్మహత్య
నెల్లూరు: పట్టణంలోని పాతూరు పుచ్చలపల్లివీధికి చెందిన దింటకుర్తి లోకేశ్ (21) కర్నూలు విశ్వభారతి మెడికల్ కళాశాల హాస్టల్లో సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం మేరకు.. బ్రహ్మానందరావు అనే వ్యక్తి టైలర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య గృహిణి. వారి పిల్లల్లో ఒకరైన లోకేశ్ విశ్వభారతి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె హైదరాబాద్‌లో ఆయుర్వేద డాక్టర్‌గా పనిచేస్తున్నారు. బ్రహ్మానందరావుది మధ్య తరగతి కుటుంబం. ఎంతో కష్టపడి కొడుకును చదివిస్తున్నాడు. వైద్యుడిగా చేతికి అందివస్తాడనుకున్న తరుణంలో లోకేశ్ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. మృతుడి తల్లిదండ్రులతోపాటు బంధువులు కర్నూలుకు తరలివెళ్లారు. -
ఖమ్మం మెడికో విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలు!
సాక్షి, ఖమ్మం: మెడీకో విద్యార్థిని మానస మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం నగరంలోని మమత మెడికల్ కాలేజ్‌లో బీడీఎస్ నాలుగవ సంవత్సరం చదువుతున్న మానస ఆదివారం బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. హాస్టల్ గదిలో లోపల గడి పెట్టుకొని ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. 80శాతం గాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. మహబూబాబాద్ కేసముద్రానికి చెందిన మానస.. మానసిక ఒత్తిడి కుటుంబ పరిస్థితుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యవక్తమవుతున్నాయి. ఆమెకు అంతకు ముందు సంవత్సరాలకు సంబంధించి కొన్ని బ్యాక్‌లాగ్‌లున్నట్లు సమాచారం. మరోవైపు మెడికో ఆత్మహత్యపై లోతైన విచారణ చేపట్టకుండా పోలీసులు ఆగమేఘాలపై మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చేతులు దులిపేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత వార్త: ఖమ్మంలో మెడికో ఆత్మహత్య.. హాస్టల్ నిర్వాహకులు, సహచర విద్యార్థుల నుంచి వివరాలేమీ సేకరించకుండా హడావుడిగా వెళ్లిపోవడం చర్చనీయాంశమయ్యింది. మీడియాకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో మానస మృతికి దారితీసిన కారణాలపై కనీస స్పష్టత కొరవడింది. అదే విధంగా ఆత్మహత్య చేసుకున్న ప్రాంతానికి మీడియాను అనుమతించొద్దని పోలీసులు చెప్పారంటూ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన విలేకరులను హాస్టల్ నిర్వాహకులు గేటు బయటే అడ్డుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఖమ్మం అర్బన్ సీఐ శ్రీహరిని వివరణ కోరగా.. తమ ఎస్సైలు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారని తెలిపారు. మానస కుటుంబ సభ్యులు వస్తే తప్ప ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదని చెప్పారు. హాస్టల్ నిర్వాహకులే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. అయితే ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు వారు ఖమ్మం చేరుకోలేదు. కాగా సమీపంలోని పెట్రోల్ బంక్ నుంచి బాటిల్లో పెట్రోల్ తెచ్చుకున్న మానస.. మానసిక ఒత్తిళ్లతోనే బలవన్మరణం చేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. చదవండి: అసమ్మతి నేతల ‘అల్టిమేటం’.. ‘బండి’ని ఢిల్లీ పిలిపించిన అధిష్టానం? -
ఖమ్మంలో మెడికో ఆత్మహత్య.. కారణం అదేనా?
ఖమ్మం అర్బన్: ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో బీడీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న సముద్రాల మానస (22) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. కళాశాల సమీపంలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ఆమె నాలుగో అంతస్తులోని గదిలో సాయంత్రం 5 గంటల సమయంలో ఒంటిపై పెట్రోల్‌ను పోసుకొని నిప్పంటించుకుంది. మంటల్లో ఉన్న మానసను పక్క గదుల్లోని విద్యార్థినులు గుర్తించి హాస్టల్ నిర్వాహకులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి 80 శాతం కాలిన గాయాలతో మానస ప్రాణాలు కోల్పోయి కన్పించింది. దీంతో ఆమె మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి మార్చురీకి తరలించారు. పెట్రోల్ కొనుక్కుని.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రానికి చెందిన మానస కుటుంబం వరంగల్‌లోని పోచమ్మ మైదాన్‌లో నివాసం ఉంటోంది. కాగా ఇరవై రోజుల క్రితం వరకు కళాశాల సమీపంలోని వసతి గృహంలో ఉన్న ఆమె ఇటీవలే కళాశాల గేటు పక్కనే ఉన్న వసతి గృహంలోకి మారింది. ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో సమీపంలోని ఓ పెట్రోల్ బంక్‌కు వెళ్లిన ఆమె సీసాలో పెట్రోల్ పోయించుకుని వచ్చింది. ఆ కాసేపటికే గదిలోంచి మంటలు వస్తుండగా పక్క గదుల్లోని విద్యార్థులు గమనించారు. మానసిక ఒత్తిళ్లు.. కుటుంబ పరిస్థితులే కారణమా? మానస బలవన్మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బీడీఎస్ నాలుగో సంవత్సరంలో ఉన్న ఆమెకు అంతకు ముందు సంవత్సరాలకు సంబంధించి కొన్ని బ్యాక్‌లాగ్‌లున్నట్లు సమాచారం. అలాగే ఆమె కుటుంబ పరిస్థితులు కూడా కారణమై ఉండొచ్చునని ఆమె స్నేహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ గది తలుపులకు లోపల గడి పెట్టుకొని ఆమె నిప్పంటించుకోగా.. ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో మిగతా గదుల్లోని విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలియగానే ఖమ్మం సమీప ప్రాంత విద్యార్థినులను వారి కుటుంబ సభ్యులు ఇళ్లకు తీసుకెళ్లారు. పోలీసుల వైఖరిపై విమర్శలు మెడికో ఆత్మహత్యపై లోతైన విచారణ చేపట్టాల్సిన పోలీసులు అదేమీ పట్టించుకోకుండా ఆగమేఘాలపై మృతదేహాన్ని మార్చురీకి తరలించి చేతులు దులిపేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్ నిర్వాహకులు, సహచర విద్యార్థుల నుంచి వివరాలేమీ సేకరించకుండా హడావుడిగా వెళ్లిపోవడం చర్చనీయాంశమయ్యింది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన బడా ఖానా(సాంస్కృతిక కార్యక్రమాలు) కార్యక్రమంలో పాల్గొనేందుకే వారు హడావుడిగా వెళ్లిపోయినట్లు తెలిసింది. వారు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో మానస మృతికి దారితీసిన కారణాలపై కనీస స్పష్టత కొరవడింది. మరోవైపు ఘటన జరిగిన ప్రాంతానికి మీడియాను అనుమతించొద్దని పోలీసులు చెప్పారంటూ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన విలేకరులను హాస్టల్ నిర్వాహకులు గేటు బయటే ఆపేశారు. వారు కూడా ఎలాంటి వివరాలూ వెల్లడించలేదు. ఖమ్మం అర్బన్ సీఐ శ్రీహరిని వివరణ కోరగా.. తమ ఎస్సైలు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారని తెలిపారు. మానస కుటుంబ సభ్యులు వస్తే తప్ప ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదని చెప్పారు. హాస్టల్ నిర్వాహకులే కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. అయితే ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు వారు ఖమ్మం చేరుకోలేదు. చదవండి: నవదంపతులుగా గదిలోకి.. ఎంత సేపటికీ రాలేదు.. తీరా లోపలకి వెళ్లి చూస్తే -
వైద్య విద్యార్థుల స్టైపెండ్ పెంపు
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యార్థులకు శుభవార్త. వారి నెలవారీ స్టైపెండ్‌ను ప్రభుత్వం పెంచింది. సగటున 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. హౌస్ సర్జన్లతో పాటు పీజీ మెడికల్, పీజీ డిప్లొమా, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్లకు ఇస్తున్న స్టైపెండ్‌ను పెంచుతూ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఈ ఏడాది జనవరి నెల నుంచే అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు స్టైఫండ్ పెంపు ప్రక్రిను వేగంగా పూర్తి చేసి అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇలావుండగా స్టైపెండ్ పెంపు నిర్ణయంపై తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కౌశిక్ కుమార్ పింజర్ల, ఆర్కే అనిల్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి తదితరులకు జూడా తరపున కృతజ్ఞతలు తెలిపారు. -
విశాఖపట్నం : అంతర్జాతీయ నర్సుల వారోత్సవాలు (ఫొటోలు)
-
NEET UG 2023: దేశవ్యాప్తంగా నీట్.. పరీక్షకు 20 లక్షల మంది విద్యార్థులు
న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా నీట్ యూజీ ప్రారంభమైంది. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం 20 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాల్లో నీట్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు పరీక్ష జరగనుంది. కాగా.. పరీక్షకు హాజరయ్యేవారికి కఠిన నిబంధనల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆభరణాలు, మెటల్‌తో తయారైన ఎలాంటి వాటిని కూడా ఎగ్జామ్ హల్లోకి అనుమతించడం లేదు. వాటన్నింటిని తొలగించిన తర్వాతే హాల్లోకి అనుమతిస్తున్నారు. దీంతో విద్యార్థులు తమ చెవిదుద్దులు, ముక్కుపుడకలు, నెక్లెస్, చైన్, ఉంగరాలు ఇతర వస్తువులను బయటే తమ వాళ్లకు అప్పగించి వెళ్తున్నారు. విద్యార్థికి నో ఎంట్రీ.. హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని పరీక్ష కేంద్రానికి ఓ విద్యార్థి ఐదు నిమిషాలు అలస్యంగా వెళ్లగా.. సిబ్బంది ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదు. దీంతో పరీక్షకు హాజరుకాలేకపోయాడు. మరోవైపు మణిపూర్‌లో ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో నీట్ పరీక్షను వాయిదా వేశారు. అయితే విద్యార్థులు మాత్రం పరీక్ష సమయానికి ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చి రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు. వీరందరికి మరో రోజు పరీక్ష నిర్వహించనున్నారు. చదవండి: పని చేసే శక్తి మనదే, సంపాదించే సత్తా మనదే, ఏడేళ్లలో ఊహించని వృద్ధి -
వైద్య పరిశోధనలకు ప్రోత్సాహం
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలోని సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో నూతన వైద్య విధానాలపై పరిశోధనలు చేసేలా వైద్యులు, విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. మన ప్రాంతంలో సోకే వ్యాధులకు అవసరమైన వైద్య పరిష్కారాలపై ఇక్కడ పరిశోధనలు సాగిస్తున్నారు. ఇందుకు కళాశాలలో మల్టిడిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్(ఎంఆర్‌యూ)ను ఏర్పాటు చేశారు. దీని కేంద్రంగా వివిధ విభాగాల్లోని వైద్యులు, పోస్ట్రుగాడ్యుయేట్ విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. అందుకయ్యే ఖర్చును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేయనుంది. అయితే ముందుగా పరిశోధనలకు కళాశాల ఎథికల్ కమిటీ నుంచి అనుమతి పొందాలి. ఇలా అనుమతి పొందిన పరిశోధనలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఏం పరిశోధనలు చేయాలనుకుంటున్నారు? ఎలా చేస్తారు? ఏ అంశంపై చేస్తారు? అనే వివరాలను పేపర్ ప్రజెంటేషన్ రూపంలో సమర్పించాల్సి ఉంది. వీటిని వైద్య కళాశాలలోని ఎథికల్ కమిటీ పరిశీలించి అనుమతి ఇస్తుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపుతారు. అక్కడి నుంచి అనుమతులు వచ్చాక పరిశోధనలు ప్రారంభించవచ్చు. పలు విభాగాల్లో పరిశోధనలు సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇప్పటికే ఎనస్థీషియా, మైక్రోబయాలజీ విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేశారు. ప్రస్తుతం కమ్యూనిటీ మెడిసిన్(ఎస్పీఎం)లో పరిశోధనలు కొనసాగుతున్నాయి. అలాగే పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, మైక్రోబయాలజీ విభాగాల్లో పరిశోధనలకు ఎథికల్ కమిటీ నుంచి అనుమతి పొంది కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అక్కడి నుంచి అనుమతి రావాల్సి ఉంది. క్లినికల్ రీసెర్చ్ సైతం.. ఔషధ రంగంలో కొత్తగా కనిపెట్టిన మందుల పనితీరుపై కూడా సిద్ధార్థ వైద్య కళాశాలలో క్లినికల్ రీసెర్చ్ చేస్తున్నారు. ఆయా వ్యాధులకు మందులు ఎలా పనిచేస్తున్నాయి? వంటి అంశాలపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వీటికి సైతం ముందుగా ఎథికల్ కమిటీ నుంచి అనుమతులు తప్పనిసరి. అలాగే రోగి అంగీకారం కూడా అవసరం. కాగా కళాశాలలో జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్ అందుబాటులో ఉంది. ఇందులో కొత్తగా సోకే వ్యాధుల జీన్స్, ఏ రకం వ్యాధి అనేది గుర్తించనున్నారు. కరోనాలో కొత్త వేరియెంట్లతో పాటు హెచ్3ఎన్2 వైరస్ వంటి వాటిని కూడా గుర్తించే సదుపాయం ఉంది. అందుబాటులోకి నూతన వైద్య విధానాలు ఇప్పటివరకు వివిధ వ్యాధులకు ఎక్కడో చేసిన పరిశోధనల ఆధారంగా చికిత్స అందిస్తున్నారు. అలా కాకుండా మన ప్రాంతంలో సోకే వ్యాధులకు అవసరమైన వైద్య పద్ధతులపై ఇక్కడే పరిశోధనలు చేయడం ద్వారా నూతన వైద్య విధానాలు అందుబాటులోకి రానున్నాయి. వైద్యులు చేసే పరిశోధనల్లో వైద్య విద్యార్థులు సైతం భాగస్వాములు కానుండటంతో వారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. చదువుకునే సమయంలోనే పరిశోధనలపై పట్టు సాధించడంతో పాటు కొత్త విధానాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. కొత్త చికిత్సలపై అవగాహన పెరుగుతుంది.. వైద్య కళాశాలలోని పలు విభాగాల్లో పరిశోధనలతో వైద్య విద్యార్థుల్లో పరిజ్ఞానం మరింత పెరుగుతుంది. నూతన వైద్య విధానాలు, కొత్త చికిత్సలపై అవగాహన పెంపొందించుకోవచ్చు. ప్రస్తుతం ఎనస్థీషియా, మైక్రోబయాలజీ విభాగాల్లో పరిశోధనలు పూర్తయ్యాయి. పరిశోధనల కోసం వైద్య కళాశాలలో ప్రత్యేకంగా మలీ్టడిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్‌ను ఏర్పాటు చేశాం. –డాక్టర్ కంచర్ల సుధాకర్, ప్రిన్సిపాల్, సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడ -
మరింత సమర్థంగా ‘ఫ్యామిలీ డాక్టర్’
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించడానికి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని (ఎఫ్పీసీ) మరింత సమర్థంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం అమలు తీరుతెన్నులను ఎప్పటికప్పుడు అంచనా వేయడం, బలమైన పర్యవేక్షణకు వైద్య కళాశాలలను భాగస్వామ్యం చేస్తోంది. తద్వారా ఈ కార్యక్రమంలో ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులు భాగస్వాములవుతారు. కార్యక్రమం అమలు సంతృప్తస్థాయిలో జరుగుతోందా లేదా ఏమైనా మార్పులు చేయాలా అన్న విషయాలతోపాటు వివిధ అరోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. ఇంతే కాకుండా ప్రజారోగ్య సమస్యలపై వైద్యులు, సిబ్బందికి కళాశాలల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ బాధ్యతలను వైద్య కళాశాలల్లోని కమ్యూనిటీ మెడిసిన్ విభాగాలకు అప్పగించారు. ఈ విభాగం వైద్యులను నోడల్ అధికారులుగా నియమించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని జిల్లాలను మూడు జోన్లుగా వర్గీకరించి భవిష్యత్ కార్యాచరణపై త్వరలో వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నారు. లక్ష్యం మేరకు ఎఫ్పీసీ అమలవుతోందా, ఇతర అంశాలను అంచనా వేయడానికి చెక్ లిస్ట్‌ను కూడా రూపొందించారు. దీని ఆధారంగా ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులు గ్రామాల్లో పర్యటించి మూడు నెలలకు ఒకసారి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కార్యక్రమంలో అవసరమైన మార్పులు చేస్తారు. ప్రజల్లో చైతన్యం కల్పించేలా ఎఫ్‌పీసీలో భాగంగా వైద్య విద్యార్థులు పలు ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తారు. ప్రస్తుతం గ్రామాల్లోనూ మధుమేహం, రక్తపోటు, ఊబకాయం వంటి నాన్ కమ్యూనికబుల్(ఎన్సీడీ) వ్యాధుల బాధితులు పెరుగుతున్నారు. వీటితోపాటు ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించడం, ఆ సమస్యలతో బాధపడుతున్న వారు మందులు సరిగా వాడకపోవడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా ఎఫ్‌పీసీలో నమోదయ్యే వివరాల ఆధారంగా ప్రజారోగ్య సమస్యలపై వైద్య విద్యార్థుల ద్వారా అధ్యయనాలు చేపడతారు. 88 లక్షల మందికి సొంత ఊళ్లలోనే వైద్యం గత ఏడాది అక్టోబర్ నెలలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఫ్యామిలీ డాక్టర్ విధానం ఈ నెల 6వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలవుతోంది. ఇప్పటివరకు 88.4 లక్షల మంది సొంత ఊళ్లలోనే వైద్య సేవలు పొందారు. వీరిలో 31.40 లక్షల మంది జనరల్ ఓపీ సేవలు అందుకున్నారు. మిగిలిన వారిలో 5.64 లక్షల మంది గర్భిణులు, 2.62 లక్షల మంది బాలింతలు, 25.41 లక్షల మంది రక్తపోటు, 18.18 లక్షల మంది మధుమేహం, 40 వేల మంది రక్తపోటు, మధుమేహం బాధితులు, 38 వేల మంది రక్తహీనత బాధితులు, ఇతరు అనారోగ్య సమస్యలతో బాధపడే రోగులు ఉన్నారు. మూడు ప్రధాన ఉద్దేశాలు ఎఫ్‌పీసీలో వైద్య కళాశాలలను భాగస్వామ్యం చేయడం వెనుక మూడు ప్రధాన ఉద్దేశాలు ఉన్నాయి. కార్యక్రమాన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం మొదటిది. కార్యక్రమం అమలును మూల్యాంకనం చేయడం రెండోది. వివిధ ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలను చైతన్యవంతం చేయడం మూడోది. ఈ అంశాల ఎజెండాగానే కమ్యూనిటీ మెడిసిన్ పనితీరు ఉంటుంది. ఇందుకోసం ప్రజారోగ్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగాలతో సమన్వయం చేసుకుంటాం. – డాక్టర్ నీలిమ, కోఆర్డినేటర్, ఫ్యామిలీ డాక్టర్ విధానం -
ప్రీతి మృతి కేసు.. ఖమ్మం జైలు నుంచి సైఫ్ విడుదల
సాక్షి, ఖమ్మం: వరంగల్ ఎంజీఎంలో మెడికో ప్రీతి మృతి కేసు తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రీతి మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ఖమ్మం జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే, సైఫ్‌కు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పది వేల బాండ్, ఇద్దరు వ్యక్తిగత పూచీకత్తుపై ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర నిందితుడు సైఫ్‌కు బెయిల్ మంజూరు చేశారు. దీంతో, సైఫ్ గురువారం సాయంత్రం జైలు నుంచి విడులయ్యాడు. ఇదిలా ఉండగా.. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య సంబంధ విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని షరతులు కోర్టు విధించింది. అయితే ప్రీతి డెత్ కేసులో సైఫ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను మూడుసార్లు న్యాయస్థానం తిరస్కరించింది. తాజాగా బెయిల్ మంజూరు కావడంతో 56 రోజుల తరువాత నిందితుడు సైఫ్ ఖమ్మం జైలు నుంచి విడుదలయ్యాడు. -
ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు.. జాతీయ మెడికల్ కమిషన్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాగింగ్ వంటి చర్యలకు పాల్పడరాదని.. అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) హెచ్చరించింది. విద్యార్థులు మానసిక స్థైర్యాన్ని కలిగి ఉండాలని.. రోగులతో మర్యాదగా, సున్నితంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. మారుతున్న వైద్య విధానాలు, సాంకేతికత, చికిత్సలపై అవగాహన పెంచుకోవాలని సూచించింది. రోగులు, వారికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదని పేర్కొంది. దేశంలో వైద్య విద్యార్థుల వృత్తిపరమైన బాధ్యతలపై ఎన్ఎంసీ తాజాగా మార్గదర్శకాలను జారీచేసింది. వైద్య విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఈ అంశాలు కీలకమని పేర్కొంది. వైద్య విద్యార్థులు రోగులతో సమర్థవంతంగా మాట్లాడటానికి స్థానిక భాష నేర్చుకోవాలని కోరింది. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, వైద్యారోగ్య అత్యవసర పరిస్థితుల వంటి సందర్భాల్లో వీలైనంత సాయం చేయాలని సూచించింది. శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలి కేవలం చికిత్సకే పరిమితం కాకుండా వైద్యారోగ్య వ్యవస్థపై నమ్మకం కలిగేలా రోగి–వైద్యుడి సంబంధం ఉండాలని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని.. జాతీయ ఆరోగ్య సంరక్షణ ప్రాధాన్యతలపై అవగాహన కలిగి ఉండాలని సూచించింది. కేవలం పుస్తకాల నుంచే మాత్రమే కాకుండా అధ్యాపకుల అపార అనుభవం, ఆచరణాత్మక బోధన నుంచి నేర్చుకోవాలని పేర్కొంది. విద్యార్థులు ప్రాక్టికల్ రికార్డులు, కేస్షీట్లను శ్రద్ధగా నిర్వహించాలని.. కాపీ చేయడం, తారుమారు చేయడం వంటివి చేస్తే తగిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. -
కాబోయే వైద్యులకూ కావాలి వైద్యం!
వారంతా స్టెత్‌పట్టి రోగుల నాడి చూడాల్సిన మెడికోలు... కానీ వారిలో కొందరు మానసిక ఒత్తిళ్లకు చిత్తవుతున్నారు! మనోవేదనను తాళలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు!! గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ఈ ధోరణి చోటుచేసుకుంటోంది. రాష్ట్రంలోనూ ఇటీవల కాలంలో పలువురు వైద్య విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. భావిభారత వైద్యులకు ఈ పరిస్థితి ఎందుకు తలెత్తుతోంది? అందుకుగల కారణాలు ఏమిటి? సాక్షి, హైదరాబాద్: జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చేపట్టిన అధ్యయనం ప్రకారం 2010 నుంచి 2019 మ«ధ్య దేశవ్యాప్తంగా 125 వైద్య విద్యార్థులు, 105 మంది రెసిడెంట్ డాక్టర్లు, 128 మంది వైద్యులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బలవన్మరణాలకు పాల్పడిన ప్రతి 10 మందిలో ఏడుగురు 30 ఏళ్లలోపు వారేనని అధ్యయనంలో వెల్లడైంది. అలాగే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలోనే (కేరళ మినహా) ఎక్కువ మంది మెడికోల ఆత్మహత్యలు నమోదయ్యాయని, గత ఐదేళ్లలో 64 మంది ఎంబీబీఎస్, 55 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికోలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఎన్ఎంసీ వెల్లడించింది. ఒత్తిళ్లు.. విభేదాలు.. అనారోగ్యం.. మెడికోల ఆత్మహత్యలను ఎన్ఎంసీ విశ్లేషించగా విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. మెడికోల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగే విభాగాల్లో అనస్తీ షియాలజీ (22.4 శాతం) తొలి స్థానంలో నిలవగా ఆ తర్వాత స్థానంలో ప్రసూతి–గైనకాలజీ (16 శాతం) నిలిచింది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వైద్య విద్యార్థుల్లో (45.2 శాతం), రెసిడెంట్ డాక్టర్లలో (23.1 శాతం) చదువుల ఒత్తిడి కారణమవుతోంది. అలాగే వైద్యుల దాంపత్య జీవితంలో మనస్పర్థలు (26.7 శాతం), మానసిక సమస్యలు (వైద్య విద్యార్థుల్లో 24 శాతం, వైద్యుల్లో 20 శాతం), వేధింపులు (20.5 శాతం) ఆత్మహత్యలకు ఇతర కారణాలుగా నిలిచాయి. ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో 13 శాతం మంది గతంలో మానసిక వైద్య సహాయం కోరడం గమనార్హం. ఆర్టీఐ కార్యకర్త వివేక్ పాండే ఇటీవల అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ అధ్యయన ఫలితాల్ని విడుదల చేసింది. మరోవైపు వైద్యవృత్తిలో ఉన్నవారిలో ఆత్మహత్య ప్రమాదం సాధారణ జనాభా కంటే దాదాపు 2.5 రెట్లు ఎక్కువని ఇండియన్ మెడికల్ అసోసియేషన్–జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ కమిటీ హెడ్ రిమీ డే పేర్కొన్నారు. చదువుకు గుడ్‌బై చెబుతున్నారు దాదాపు అన్ని మెడికల్ కాలేజీల్లో నియమాలు, రక్షణలు సహాయక వ్యవస్థలు ఉన్నప్పటికీ సక్రమంగా అమలు కావడం లేదని... అందుకే 1,166 మంది విద్యార్థులు వైద్య కళాశాలలకు వీడ్కోలు పలికారని అధ్యయనం తేలి్చంది. వారిలో 160 మంది ఎంబీబీఎస్, 1,006 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్న వారు ఉన్నారు. ఎన్ఎంఏ కీలక సూచనలివీ... ♦ వైద్య విద్యార్థులు మాదకద్రవ్యాలు, మద్యం, పొగాకు ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలి. ♦సామాజిక మాధ్యమ పరిధి, ఉపయోగంతో పాటు విచక్షణారహిత వినియోగంతో వచ్చే వృత్తిపరమైన ప్రమాదాల గురించి వైద్య విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ♦ రోగులతో సమర్థంగా కమ్యూనికేట్ చేయడానికి స్థానిక భాషను నేర్చుకోవాలి. ♦ విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడి, మానసిక అనారోగ్య సమస్యల గురించి ప్రొఫెసర్లు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ♦ వైద్య విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి అందుబాటులో ఉన్న పరిష్కార ప్రక్రియల గురించి అవగాహన పెంచుకోవాలి. అధ్యయనం జరగాలి... ‘వెలుగులోకి వచ్చేవి, మీడియా లో చర్చకు నోచుకున్నవే కాదు. బయటకు రాని మరికొన్ని ఆ త్మహత్యల ఉదంతాలూ ఉన్నా యి. ప్రైవేటు మెడికల్ కాలేజీ ల్లో నిబంధనల పేరిట విద్యార్థుల్ని విపరీతమైన ఒత్తిడికి లోనుచేస్తున్నారు. ఇక ఆస్పత్రుల్లో 24/7 షిఫ్టులు, కుటుంబానికి దూరంగా ఉండటం, ఆర్థిక కష్టాలు, కొన్ని చోట్ల ర్యాగింగ్, కుల వివక్ష, భవిష్యత్తుపై భయం వంటివి వైద్య విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. దీనిపై సమగ్ర అధ్యయనం జరపాలి. నివారించే దిశగా కార్యాచరణ రూపొందించాలి. – డాక్టర్ బీఎన్ రావు, ఐఎంఏ అధ్యక్షుడు ఒత్తిడి ఉంది... పరీక్షల దశలోనే ఒత్తిడి బా గా ఉంది. ఇంటర్న్స్, పీజీలకు రెగ్యులర్ డ్యూటీల భారం ఉంటోంది. ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఎక్కు వమంది రోగులు, తక్కువ మంది వైద్యులు ఉండటం వల్ల నిర్ణీత పనివేళలు ఉండవు. సర్జరీల్లో ఉండే వారికి మరింత ఎక్కువ పనిభారం ఉంటోంది. –డాక్టర్ కౌశిక్ డెర్మా, జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు -
‘సారీ.. మమ్మీ, డాడీ, అన్నయ్యా’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి మోసం సనత్ (22) గురువారం రాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం స్నేహితులతో కలిసి సినిమా చూసి, అర్ధరాత్రి వరకు వారితో కలిసి చదువుకున్న సనత్.. ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడనేది తెలియరాలేదు. అతనికి ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలూ లేవని తల్లిదండ్రులు చెప్పగా, ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. తనొక్కడి నంబర్ మాత్రమే ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో తల్లిదండ్రులకు, అన్నయ్యకు సారీ చెబుతూ మెసేజ్ పెట్టాడు తప్ప, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నదీ వెల్లడించ లేదు. అయితే కొద్దిరోజుల ముందు కూడా అతను ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు మెసేజ్‌ను బట్టి తెలుస్తోంది. కాగా పది నెలల్లో ఈ కళాశాలకు చెందిన ముగ్గురు వైద్య విద్యార్థులు మరణించడం కలకలం రేపుతోంది. సనత్ మృతిపై కళాశాల వర్గాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సినిమా చూసి..కలిసి చదువుకుని..: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో నివసించే మోసం రమేశ్, సుజాత దంపతులకు సనత్ రెండో కుమారుడు. రమేష్ సింగరేణి ఆర్జీ–3 ఏరియాలోని ఓసీపీ–2లో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. కాగా సనత్కు పది రోజుల క్రితమే థియరీ పరీక్షలు పూర్తి అయ్యాయి. శనివారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన ఇద్దరు రూంమేట్స్‌తో కలిసి కూలర్ ఉన్న మరో గదిలోకి వెళ్లి అర్ధరాత్రి 2 గంటల వరకు చదువుకున్నాడు. తర్వాత ఒక్కడే గదికి తిరిగి వచ్చాడు. ఉదయం 5 గంటలకు గదికి వచి్చన స్నేహితులు, డోర్ కొట్టినా స్పందన లేకపోవడంతో బలవంతంగా తెరిచారు. బెడ్ïÙట్‌తో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న సనత్ చనిపోయి కని్పంచాడు. గురువారం అర్ధరాత్రి వరకు తమతో కలిసి గడిపిన సనత్ తెల్లవారేసరికి విగతజీవిగా మారడంతో సహచర విద్యార్థులు విషాదంలో మునిగిపోయారు. వెంటనే అక్కడికి చేరుకున్న కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది.. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఒత్తిడితోనే ఆత్మహత్య: ప్రిన్సిపాల్ ఒత్తిడి కారణంగానే సనత్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా భావిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర తెలిపారు. తెల్లవారుజామున 5 గంటల లోపు ఉరి వేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నామన్నారు. అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు. ఫింగర్ ప్రింట్స్‌తో ఫోన్ లాక్ ఓపెన్ చేశామని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వస్తే అనుమానాలు నివృత్తి అవుతాయన్నారు. 10 నెలల్లో ముగ్గురి మృతి ఇదే కళాశాలకు చెందిన శ్వేత అనే పీజీ ఫైనలియర్ విద్యార్థిని 2022 మే 13న అనుమానాస్పద స్థితిలో శవమై కని్పంచింది. చదువులో చురుగ్గా ఉండే కరీంనగర్ జిల్లాకు చెందిన పేద విద్యారి్థని మరణం అప్పట్లో సంచలనం సృష్టించింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఇదే హాస్టల్లో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడకు చెందిన దాసరి హర్ష అనే మెడిసిన్ ఫైనలియర్ విద్యార్థి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నెల దాటిందో లేదో సనత్ ఆత్మహత్యకు పాల్పడటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తల్లిదండ్రుల అనుమానాల నేపథ్యంలో సనత్ ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. నువ్వే డాక్టర్ అనుకుంటిమి ‘మన కుటుంబం మొత్తంలో ఇప్పటివరకు డాక్టర్ లేడు.. నువ్వే డాక్టర్ అనుకుంటిమి కదా సన్నీ (సనత్ ముద్దు పేరు).. డాక్టర్ అయి వస్తావనుకుంటే ఇలా నిన్ను తీసుకుపోతామని అనుకోలేదు కొడుకా.. నా సన్నీను ఇలా చూడలేను.. అన్నను అమెరికా వెళ్లనీ అన్నావు.. నువ్వెటు పోతివిరా సన్నీ..’అంటూ సనత్ తల్లి సుజాత విలపించిన తీరు కంటతడి పెట్టించింది. అప్పుడే అనుకున్నా కానీ.. సనత్ సెల్ఫోన్లో ఉన్న ఓ వాట్సాప్ గ్రూప్‌లో అతని ఒక్కడి నంబర్ మాత్రమే ఉంది. ఆ గ్రూప్‌లో ‘సారీ.. మమ్మీ, డాడీ, అన్నయ్యా.. ఇలా చేద్దామని ఫార్మా పేపర్–1 పరీక్ష అయ్యాకే అనుకున్నా.. కానీ మేడం, ఫ్రెండ్స్ డిస్టర్బ్ అవుతారని చేసుకోలేదు.. అన్నయ్యా నువ్వు యూఎస్ నుంచి వచ్చి ఇక్కడ ఉండు..’అంటూ రాత్రి 3:11 గంటలకు పోస్ట్ చేసిన ఓ మెసేజ్ ఉంది. సనత్ అన్నయ్య సాయితేజ నెల క్రితమే ఎమ్మెస్ చదువు నిమిత్తం యూఎస్ వెళ్లాడు. తిరుపతి వెళ్దామని చెప్పి ఇలా చేశాడు.. ఏప్రిల్ 4 తరువాత తిరుపతి వెళదామని చెప్పిన తమ కుమారుడు ఇంతలోనే ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ సనత్ తండ్రి రమేశ్ విలపించాడు. మూడురోజుల క్రితం ఫోన్ చేసినప్పుడు కూడా ఏదైనా సమస్య ఉన్నట్టుగా చెప్పలేదన్నాడు. సనత్కు ఏడాది క్రితం గాల్ బ్లాడర్ సర్జరీ అయిందని, ఇప్పుడు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యా లేదని చెప్పాడు. సనత్ మరణించినట్టుగా ప్రిన్సిపాల్ తమకు సమాచారం ఇచ్చారని, తాము వచ్చేవరకు మృతదేహాన్ని తీయవద్దని ప్రిన్సిపాల్‌కు చెప్పినా తీశారని తెలిపాడు. తమ కుమారుడి ఫోన్ లాక్ ఎవరు ఓపెన్ చేశారో తెలియదని చెప్పాడు. -
రెండు ప్రయత్నాల్లో పూర్తి చేయొచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్ తదితర దేశాల నుంచి భీతావహ పరిస్థితుల్లో ప్రాణాలు అరచేత పట్టుకొని దేశానికి వచ్చిన ఫైనల్ ఇయర్ వైద్య విద్యార్థుల భవిష్యత్తుకు సుప్రీంకోర్టు ఊపిరిపోసింది. దేశీయంగా ఏ కళాశాలలోనూ చేరకుండానే రెండు ప్రయత్నాల్లో ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలు పూర్తి చేసేందుకు అవకాశం ఇచ్చింది. ఏడాది కాలంగా ఆందోళన చెందుతున్న విద్యార్థుల సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం చూపింది. చైనా, ఫిలిప్పీన్స్‌లో కరోనా ఆంక్షలు, ఉక్రెయిన్–రష్యా యుద్ధం కారణంగా విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేయలేకపోయిన వైద్య విద్యార్థుల పిటిషన్లను మంగళవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్‌నాద్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విద్యార్థుల అభ్యర్థన దృష్టిలో ఉంచుకొని నిపుణుల కమిటీ కొన్ని సూచనలు చేసిందని కేంద్రం తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ధర్మాసనానికి తెలిపారు. ‘‘ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం, భారతీయ కళాశాలల్లో నమోదు చేసుకోకుండా ఎంబీబీఎస్ ఫైనల్ పార్ట్–1, పార్ట్–2 పరీక్షలు (థియరీ, ప్రాక్టికల్) ఒక ఏడాదిలో పూర్తి చేయడానికి అవకాశం ఇస్తాం. అంటే, పార్ట్–2 పరీక్ష రాయాలంటే పార్ట్–1 పూర్తి చేసి ఒక ఏడాది పూర్తి కావాలి. దేశీయంగా ఎంబీబీఎస్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారో అదేవిధంగా థియరీ పరీక్షలు, నిర్ణయించిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయి. పార్ట్ట్–1, పార్ట్–2 పూర్తి చేసిన తర్వాత రెండు సంవత్సరాల నిర్బంధ రొటేషనల్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేయాలి. జాతీయ వైద్య కమిషన్ నిర్ణయించిన విధంగా చెల్లింపులు ఉంటాయి. ఈ సిఫార్సులు అత్యవసర చర్యగా భావించాలి.’’ అని ఐశ్వర్య భాటి వివరించారు. ‘‘ఉత్తీర్ణత సాధించకపోతే భవిష్యత్తు ఉండదు.. అందుకే’’ జాతీయ వైద్య కమిషన్, విదేశీ వైద్య విద్య సంస్థలు అనుసరించే సిలబస్ వేరుగా ఉంటాయని విద్యార్థుల తరఫు సీనియర్ న్యాయవాదులు గోపాల శంకర్‌నారాయణ్,నాగముత్తులు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పరీక్ష పూర్తి చేయడానికి ఒక ప్రయత్నంలో సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు. ‘‘ఇదేమీ అఖిల భారత బార్ ఎగ్జామినేషన్ కాదు. ఉత్తీర్ణత సాధించకపోతే కనీసం అప్పటికే పూర్తి చేసిన ఎల్ఎల్బీ డిగ్రీ ఉంటుంది. విద్యార్థులు ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే భవిష్యత్తు ఉండదు’’ అని గోపాల శంకర్‌నారాయణ్ తెలిపారు. నిపుణుల కమిటీ నిర్ణయంలో జోక్యం చేసుకోమని, అయితే ఒకే ప్రయత్నంలో పరీక్ష పూర్తి చేయాలన్న సూచన ఆందోళన కలిగించే విషయమని ధర్మాసనం అభిప్రాయపడింది. రెండు ప్రయత్నాలు అవకాశం ఇవ్వాలన్న సవరణ చేయాలని కమిటీని ఆదేశించింది. ‘‘కమిటీ నివేదికను చిన్న మార్పుతో పరిగణనలోకి తీసుకుంటాం. పార్ట్–1, పార్ట్–2 (థియరీ, ప్రాక్టికల్) పరీక్షలు పూర్తి చేయడానికి రెండు అవకాశాలు ఇవ్వాలి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. మానవతా దృక్పథంతో భారతీయ వైద్య కళాశాలల్లో ప్రవేశం కలి్పంచాలని సుప్రీంకోర్టును విద్యార్థులు ఆశ్రయించారు. జాతీయ వైద్య కమిషన్‌తో సంప్రదింపులు చేసి దీనికి పరిష్కారం కనుక్కొనే దిశగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని గతంలో కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. -
ఎంబీబీఎస్ పరీక్షల్లో ఫెయిల్: కల చెదిరె..కడుపుకోత మిగిలే!
స్టెత్ వేసుకోవాల్సిన వాడు... మెడకు తాడు బిగించుకున్నాడు ఆస్పత్రిలో ఉండాల్సిన వాడు మార్చురీలో పడుకున్నాడు తెల్లకోటులో ఉండాల్సిన వాడు.. తెల్లగుడ్డలో దూరిపోయాడు అల్లారుముద్దుగా పెంచితే అందనంత దూరం పోయాడు తండ్రి పోగుపోగునూ కలుపుతూ బంధం అల్లుతుంటే తనేమో బంధం తెంపుకుని వెళ్లిపోయాడు గాయానికి కట్టుకట్టాల్సిన వాడు... తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు జీవితమనే పరీక్షలో ఫెయిలై ఉరితాడుకు వేలాడాడు ధర్మవరం అర్బన్: ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షల్లో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన ఓ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ధర్మవరం పట్టణం తారకరామాపురంలో బుధవారం చోటుచేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని తారకరామాపురానికి చెందిన రామాంజనేయులు, రాజమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించే రామాంజనేయులు ఆడ పిల్లలిద్దరికీ వివాహాలు జరిపించాడు. చిన్న కుమారుడైన ముక్తాపురం నవీన్‌కుమార్ (23)ను వైద్యుడిగా చూడాలని కలలు కనేవాడు. ఈక్రమంలోనే ఖర్చుకు వెనకాడకుండా కుమారుడిని చదివించాడు. తండ్రి ఆశయానికి తగ్గట్టుగానే ఇంటర్, నీట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి కర్నూలు మెడికల్ కళాశాలలో సీటు సంపాదించాడు. మొదటి సంవత్సరం పరీక్షలు కూడా రాశారు. అయితే ఇటీవల వచ్చిన ఫలితాల్లో మూడు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. దీన్ని నవీన్‌కుమార్ అవమానంగా భావించాడు. తల్లిదండ్రులకు ఈవిషయం చెప్పలేక మదనపడ్డాడు. ఉగాది పండుగ నేపథ్యంలో మంగళవారం ధర్మవరానికి వచ్చిన నవీన్‌కుమార్...రాత్రి తల్లిదండ్రులతో కులాసాగా కబుర్లు చెప్పాడు. అనంతరం తండ్రి రామాంజనేయులు వద్దే పడుకున్న నవీన్‌కుమార్... అందరూ నిద్రపోయాక ఇంటి ఎదురుగా ఉన్న షెడ్డులోని ఇనుపరాడ్డుకు ఉరివేసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున నిద్రలేచిన తండ్రి పక్కలో ఉండాల్సిన కుమారుడు కనిపించకపోవడంతో బయటకు వెళ్లి చూశాడు. అప్పటికే కసువు ఊడ్చేందుకు షెడ్డులోకి వెళ్లిన రాజమ్మ ఉరికి వేలాడుతున్న కుమారుడిని చూసి గట్టిగా కేకలు వేసింది. దీంతో రామాంజనేయులు కూడా పరుగున వెళ్లి ఇరుగూ పొరుగు సాయంతో కుమారుడిని కిందకు దించి చూడగా, అప్పటికే నవీన్‌కుమార్ మృతి చెంది ఉన్నాడు. వైద్యుడిగా చూడాలన్న కలను... కల్లలు చేసి వెళ్లిపోయావా అంటూ రామాంజనేయులు ఏడుస్తుంటే అతన్ని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న టూటౌన్ ఏఎస్ఐ డోణాసింగ్, జమేదార్ సూర్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉగాది రోజున ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మెడికో ప్రీతి కేసు: కోర్టులో పోలీసులకు చుక్కెదురు!
సాక్షి, వరంగల్: రాష్ట్రంలో సంచలనంగా మారిన మెడికో ప్రీతి మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసు విషయమై కోర్టులో పోలీసులకు చుక్కెదురైంది. ప్రీతి మృతికి కారకుడిగా పేర్కొన్న నిందితుడు సైఫ్ పోలీస్ కస్టడీ పొడిగింపు పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే నాలుగు రోజుల పాటు అతడిని కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. మరో నాలుగు రోజుల పాటు సైఫ్‌ని కస్టడీలో ఉంచేందుకు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ రెండు రోజులు వాయిదా పడింది. బుధవారం విచారించిన కోర్టు పోలీసుల పిటిషన్‌ను తిరస్కరించింది. మరో వైపు ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్‌లో షాకింగ్ అంశాలు వెల్లడయ్యాయి. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని ఆ రిపోర్ట్ స్పష్టం చేసింది. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లోనూ ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని రిపోర్ట్‌లో తేలింది. దీంతో ఆత్మహత్యాయత్నం కేసును అనుమానాస్పద మృతి కేసుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీతిది హత్యా, ఆత్మహత్యా తేల్చుకోలేక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. చదవండి: ప్రీతి కేసు: కోర్టుకు సైఫ్.. డీజీపీ ఆఫీసుకు ప్రీతి పేరెంట్స్ -
సంగారెడ్డి మెడికల్ కాలేజీ విద్యార్థులు మంత్రి హరీష్ రావు ముఖాముఖీ
-
మెడికో ప్రీతి కేసు.. ఆ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
మెడికో ప్రీతి మృతి కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్‌లో ఎలాంటి విషపదార్థాలు డిటెక్ట్ కాలేదని రిపోర్ట్‌లో వెల్లడైంది. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని టాక్సికాలజీ రిపోర్ట్ స్పష్టం చేసింది. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లోనూ ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని రిపోర్ట్‌లో తేలింది. ఇప్పటికే ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్ వరంగల్ సీపీ రంగనాథ్ సీపీ చేతికి చేరింది. దీంతో ఆత్మహత్యాయత్నం కేసును అనుమానాస్పద మృతి కేసుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నారు. ప్రీతిది హత్యా, ఆత్మహత్యా తేల్చుకోలేక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రీతిది ముమ్మాటికీ హత్యేనని ఆమె కుటుంబసభ్యులు, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. హైదరాబాద్‌కు వరంగల్ సీపీ ప్రీతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఇప్పటికే డీజీపీ వరంగల్ సీపీ రంగనాథ్‌కు ఫోన్ కూడా చేశారు. ప్రీతి కేసు కొత్త మలుపు మెడికల్ విద్యార్థిని ప్రీతీ ఉదంతం కొత్త మలుపు తిరగబోతోంది. సైఫ్ హోమ్ మంత్రికి సమీప బంధువు అంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కేసు మరిన్నీ మలుపులు తిరగనుంది. తాజా నివేదికతో ఆత్మహత్య కేసును అనుమానాస్పద మృతి గా కేసు మార్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
మెడికో ప్రీతి మృతి కేసులో కీలక పరిణామం
-
ఐదేళ్లలో 119 మంది మెడికోల ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: దేశంలో 512 మెడికల్ కాలేజీల్లో 119 మంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినట్లు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. ఆత్మహత్య చేసుకున్నవారిలో ఎంబీబీఎస్ తదితర వైద్య గ్రాడ్యుయేట్లు 64 మంది ఉండగా, 55 మంది ఎండీ, ఎంఎస్ చదువుతున్న విద్యార్థులున్నారని పేర్కొంది. వేధింపులు, ఒత్తిడి తదితర కారణాల వల్ల 1,166 మంది మధ్యలోనే వైద్యవిద్యను వదిలేసి వెళ్లిపోయారని వివరించింది. అందులో ఎంబీబీఎస్ విద్యార్థులు 160 మంది, పీజీలో ఎంఎస్ జనరల్ సర్జరీ విద్యార్థులు 114 మంది, ఎంఎస్ ఆర్థోపెడిక్స్ 50 మంది, గైనిక్ 103 మంది, ఎంఎస్ ఈఎన్టీ 100 మంది, పీజీ ఎండీ జనరల్ మెడిసిన్56 మంది, ఎండీ పీడియాట్రిక్స్ 54 మంది, ఇతర బ్రాంచీలకు చెందినవారు 529 మంది ఉన్నారని తెలిపింది. 18–30 ఏళ్ల మధ్యలో వైద్యవృత్తిలో తలెత్తే ఒడిదొడుకులను తట్టుకోలేక కొందరు యువవైద్యులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికలో వెల్లడించింది. వైద్య విద్యార్థుల్లో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎంజీఈ) పాసయ్యేవారు 20 శాతం వరకే ఉంటున్నారు. ఎఫ్ఎంజీఈ పాసైతేనే మన దేశంలో మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్‌కు అర్హత ఉంటుంది. పీజీలో ఆర్థికభారం, వృత్తి బాధ్యతలు, పెళ్లికాకపోవడం వంటివి ఆత్మహత్యలకు కారణాలుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఆత్మహత్యల్లో 60 శాతం ఒత్తిడికి సంబంధించినవే ఉంటున్నాయని వివరించారు. -
విజయవాడలో ఖమ్మం వైద్యవిద్యార్థి ఆత్మహత్య
ఏన్కూరు: ఖమ్మం జిల్లాకు చెందిన వైద్య విద్యార్థి ఏపీలోని విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం భగవాన్ నాయక్ తండాకు చెందిన బానోతు నవీన్‌కుమార్ (23) విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో మెడిసిన్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 15వ తేదీన అతను విజయవాడలోని తన గదిలో పురుగు మందు తాగగా స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అప్పటి నుంచి చిక్సిత పొందుతున్న నవీన్ శనివారం ఉదయం మృతి చెందగా మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. కాగా, నవీన్ ఆత్మహత్యకు కారణాలు తెలియల్సి ఉందని అంటున్నారు. -
నిజామాబాద్ లో వైద్య విద్యార్థి ఆత్మహత్య
-
నిజామాబాద్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య
నిజామాబాద్ సిటీ/నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా చింతగూడకు చెందిన దాసరి హర్ష (24) తాను ఉంటున్న హాస్టల్ గదిలోనే శనివారం తెల్లవారుజామున ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ప్రస్తుతం ఫైనల్ పరీక్షలు జరుగుతుండగా, శుక్రవారం పరీక్ష రాసిన అనంతరం హర్ష నడుంనొప్పిగా ఉందని స్నేహితులతో చెప్పి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నాడు. రాత్రి భోజనం తర్వాత 10 గంటలకు తన గదికి వెళ్తూ.. తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేపాలని స్నేహితుడు తరుణ్‌కు చెప్పాడు. తరుణ్ ఆ సమయానికి వచ్చి హర్ష గది తలుపు తట్టగా స్పందనలేదు. మళ్లీ ఉదయం 7 గంటలకు వచ్చి పిలిచినా హర్ష స్పందించకపోవటంతో తరుణ్ తోటి విద్యార్థులకు విషయాన్ని తెలిపాడు. మెస్ ఇన్చార్జులు వచ్చి హర్షను పిలవగా స్పందించకపోవటంతో తలుపును బలవంతంగా తెరిచారు. హర్ష ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించటంతో అంతా షాక్‌కు గురయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర వన్‌టౌన్ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు హర్ష తల్లి రాధకు విషయం తెలిపి, మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తెలియని కారణాలు.. అనుమానాలు దాసరి శ్రీనివాస్, రాధ దంపతులకు హర్ష, ధనుష్ ఇద్దరు కుమారులు. పెద్దవాడైన హర్ష ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. తండ్రి శ్రీనివాస్ పన్నెండేళ్లుగా మలేసియాలో ఉంటున్నారు. తల్లి ఇంటివద్ద ఉంటున్నారు. హాస్టల్లో ఎలాంటి ఇబ్బందుల్లేవని, హర్ష చదువులో చురుగ్గా ఉండేవాడని స్నేహితులు చెబుతున్నారు. తోటి విద్యార్థులతో కలసిమెలసి ఉండే హర్ష ఆత్మహత్యకు పాల్పడటం అనుమానాలను రేకెత్తిస్తోందని అంటున్నారు. హర్షకు ఎలాంటి దురలవాట్లు లేవని కుటుంబసభ్యులు చెప్పారు. ప్రేమ వ్యవహారాలు కారణమా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఘటనపై విచారణ జరిపించాలంటూ ఎన్ఎస్యూఐ, ఏఐఎస్ఎఫ్ తదితర సంఘాల విద్యార్థులు హాస్టల్ ఎదుట బైఠాయించారు. పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. మమ్మీ నేను డాక్టరవుతున్నా.. ‘మమ్మీ నేను డాక్టర్‌ను అవుతున్నా.. నీకు ఇల్లు కట్టిస్తా.. కారు కొనిస్తా’ అంటూ తన కుమారుడు మూడ్రోజుల క్రితమే ఫోన్లో సంబరంగా చెప్పాడని తీరా శవమై కనిపిస్తాడని అనుకోలేదంటూ హర్ష తల్లి దాసరి రాధ విలపించిన తీరు కలచివేసింది. సంవత్సరం నుంచి హర్షకు నడుం నొప్పి ఉందని, బుధవారం ఫోన్‌చేసి నొప్పి బాగా ఉందని ఏడ్వటంతో ఇంటికి రమ్మని చెప్పానన్నారు. కాని పరీక్షలు ఉన్నాయని, ఇప్పుడే ఇంటికి రాలేనని అన్నాడని తెలిపారు. పరీక్షలు పూర్తయ్యాక హర్షను హైదరాబాద్‌కు తీసుకెళ్లి చూపిద్దామనుకున్నామని, ఇంతలోనే అఘాయిత్యానికి పాల్పడతాడనుకోలేదన్నారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లి, బంధువులు గుండేలవిసేలా రోదించారు. నడుం నొప్పి మినహా మరే సమస్యలు లేవని, తన కొడుకు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడంటూ తల్లి రాధ కళాశాల అధికారులను, తోటి విద్యార్థులను ప్రశ్నిస్తూ విలపించడం కలచివేసింది. -
వేధింపులు నిజమే..మనస్తాపంతోనే ఆత్మహత్యాయత్నం!
వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ వైద్య విద్యార్థి ఎంఏ సైఫ్ వేధింపులే కారణమని తేలింది. ఘటనపై ప్రీతి కుటుంబ సభ్యుల ఆరోపణలు.. మెడికల్ కాలేజీ, ఎంజీఎం హెచ్ఓడీ వర్గాలు చెప్తున్న అంశాలు భిన్నంగా ఉండటంతో పోలీసులు సెల్‌ఫోన్, వాట్సాప్ గ్రూపులలో చాటింగ్‌ల ఆధారంగా విచారణ జరిపారు. ప్రీతిని సైఫ్ టార్గెట్ చేసి వేధించడం వల్లే ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా భావిస్తున్నామని పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈ కేసులో నిందితుడైన సైఫ్‌ను అరెస్టు చేసినట్టు ప్రకటించారు. వాట్సాప్ గ్రూపులో వేధింపులతో.. 2022 నవంబర్‌లో పీజీ వైద్య విద్యార్థినిగా చేరిన ప్రీతిపై డిసెంబర్ నుంచే సైఫ్ వేధింపులకు పాల్పడినట్టు వాట్సాప్ గ్రూపుల పరిశీలనలో తేలింది. డిసెంబర్ 6న సైఫ్, ప్రీతి మధ్య చాటింగ్ వార్ నడిచింది. తర్వాత కూడా రెండు, మూడుసార్లు చిన్న గొడవలు జరిగినా సద్దుమణిగాయి. అయితే అనస్తీషియా విభాగానికి సంబంధించి 31 మందితో ఏర్పాటు చేసిన ఓ వాట్సాప్ గ్రూపులో ఈనెల 18న చేసిన పోస్టుతో గొడవ ముదిరింది. ఓ హౌస్ సర్జన్ విద్యార్థితో కేస్ షీట్ రాయించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ప్రీతికి సరైన బ్రెయిన్ లేదు.. బుర్ర తక్కువ మనిషి’అంటూ సైఫ్ కామెంట్ పెట్టాడు. దీనిని అవమానంగా భావించిన ప్రీతి.. ‘యు మైండ్ యువర్ ఓన్ బిజినెస్’అంటూ వ్యక్తిగతంగా సైఫ్‌కు మెసేజ్ పెట్టింది. ఏదైనా ఉంటే తమ హెచ్ఓడీకి ఫిర్యాదు చేయాలని, గ్రూపులో తనపై మెసేజ్‌లు పెట్టవద్దని సూచించింది. అంతటితో ఆ వివాదం సమసిపోకపోవడంతో.. ఈ నెల 20న విషయాన్ని తన తండ్రి నరేందర్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన ఏసీపీకి, మట్టెవాడ ఎస్సైలకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సూచన మేరకు 21న ఉదయం మొదట సైఫ్‌తో, తర్వాత ప్రీతితో మెడికల్ కాలేజీ హెచ్ఓడీలు మాట్లాడారు. కానీ ప్రీతి అవమానభారంతోనే ఉండిపోయింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో శైలేష్ అనే సహ విద్యార్థితో ప్రీతి మాట్లాడుతూ.. ‘‘సైఫ్ వేధింపుల విషయంలో నాకు ఎవరూ సపోర్టు చేయడం లేదేం’’అని అడిగింది. ఆ తర్వాత 7.30 గంటల సమయంలో ఆత్మహత్యాయత్నం చేసింది. నిందితుడి అరెస్టు.. రిమాండ్ ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనకు సంబంధించి నిందితుడు ఎంఏ సైఫ్‌ను మట్టెవాడ పీఎస్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. సైఫ్ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఆధారాల కోసం పరిశీలించారు. పలు అంశాలపై ప్రశ్నించారు. తర్వాత వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. అయితే బాధితురాలికి వరంగల్ ఎంజీఎంలో చేసిన చికిత్స రిపోర్టులు, ఆమె ఆరోగ్య స్థితిపై తాజా వైద్య నివేదికలు సమర్పించలేదంటూ.. నిందితుడిని రిమాండ్‌కు పంపేందుకు జడ్జి చాముండేశ్వరీ దేవి తొలుత తిరస్కరించారు. తర్వాత పోలీసులు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై వరంగల్ ఎంజీఎం సూపరింటెండెంట్ జారీ చేసిన పత్రికా ప్రకటనను జడ్జికి సమర్పించారు. బాధితురాలి తల్లిదండ్రుల అంగీకారంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించినట్టు వివరించారు. అయితే ఈ సమయంలో జడ్జికి తన వాదన వినిపిస్తానని నిందితుడు సైఫ్ కోరాడు. జడ్జి పోలీసులు, న్యాయవాదులు అందరినీ కోర్టు హాల్‌నుంచి బయటికి పంపి నిందితుడు చెప్పిన వివరాలను విని, నోట్ చేసుకున్నారు. తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. పోలీసులు సైఫ్‌ను ఖమ్మం జైలు తరలించేందుకు ప్రయత్నించినా.. అప్పటికే రాత్రికావడంతో తాత్కాలికంగా పరకాల జైలుకు తీసుకెళ్లారు. శనివారం ఉదయం ఖమ్మం జైలుకు తరలించనున్నారు. డీఎంఈకి సీల్డుకవర్లో నివేదిక? ఎంజీఎం ఆస్పత్రి, కేఎంసీలో జరిగిన ఘటనలపై గురు, శుక్రవారాల్లో విచారణ జరిపిన త్రిసభ్య కమిటీ.. తమ నివేదికను వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ)కు సీల్డ్ కవర్లో సమర్పించినట్టు తెలిసింది. ఇక ఈ ఘటనపై ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజన్‌కుమార్ శుక్రవారం ఆరా తీసినట్టు తెలిసింది. ప్రీతి ప్రశ్నించేతత్వాన్ని తట్టుకోలేక వేధింపులు: సీపీ రంగనాథ్ మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. శుక్రవారం పోలీస్ కమిషనరేట్‌లో కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్, హెచ్ఓడీలతో మాట్లాడి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టామని తెలిపారు. ప్రీతి తెలివైన అమ్మాయి అని, ఇటీవలే వైద్య విభాగానికి సంబంధించి యూపీఎస్సీ ఇంటర్వూ్యకు కూడా హాజరైందని వివరించారు. ఆమెకు ప్రశ్నించే తత్వం ఉందని.. దీనిని తట్టుకోలేకనే సీనియర్ అయిన సైఫ్ ఆమెను టార్గెట్ చేసి వేధించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తనకు తోటి విద్యార్థులు సపోర్ట్ చేయడం లేదని మనస్తాపానికి గురైన ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తేలిందని వివరించారు. నిందితుడు సైఫ్‌కు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, సోషల్ మీడియాలో దీనిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్యం: నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప మెడికల్ పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని.. ఆమెకు ఎక్మో, సీఆర్ఆర్టీ చికిత్స అందిస్తున్నామని నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. ఆమె బ్రెయిన్ ఎంత చురుగ్గా ఉందో తెలుసుకునేందుకు బ్రెయిన్ మ్యాపింగ్ కూడా చేస్తున్నామని వివరించారు. మంత్రి హరీశ్‌రావు ప్రీతి ఆరోగ్యంపై నిరంతరం ఆరా తీస్తున్నారని చెప్పారు. ఇక మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం ప్రీతి తల్లిదండ్రులు శారద, ధరావత్ నరేందర్‌లతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి ఉష ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ప్రీతిది లవ్ జిహాదీ కేసే
కరీంనగర్‌టౌన్: వరంగల్ మెడికల్ స్టూడెంట్ ప్రీతిది ముమ్మాటికీ ‘లవ్ జిహాదీ’కేసేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. అమ్మాయిలను టార్గెట్ చేసి మరీ వేధింపులకు గురిచేస్తున్నారని, అందుకోసం విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులొస్తున్నాయని ఆరోపించారు. తక్షణమే ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లోని మహాశక్తి దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. వరంగల్‌లో మెడికల్ విద్యార్థిని ప్రీతిని ర్యాగింగ్ చేయడంవల్లే ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, విద్యార్థి సంఘాల ఆందోళనను చల్లబర్చడానికి మెరుగైన వైద్యం పేరుతో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేక సార్లు అమ్మాయిని వేధింపులకు గురిచేశారని ప్రీతి తండ్రే చెప్పారని తెలిపారు. దీనిని చిన్న కేసుగా మార్చి నీరుగార్చే కుట్ర జరుగుతోందన్నారు. వేధింపులకు పాల్పడ్డ వారి విషయంలో ఉదారత చూపుతున్న పోలీసులు.. అమ్మాయి కుటుంబ సభ్యులపై చూపకపోవడమేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మనిషి ప్రాణాన్ని తేలికగా తీసిపారేస్తోందని, హైదరాబాద్‌లో కుక్కల దాడిలో చిన్న పిల్లాడు చనిపోతే కుక్కలకు మటన్ దొరకకపోవడంవల్లే అలా చేశాయని తేలికగా చెప్పడం, ఈ రెండు విషయాల్లో ఇప్పటివరకు కేసీఆర్ స్పందించకపోవడం సిగ్గు చేటని అన్నారు. కేసీఆర్‌ది ఐరన్ లెగ్.. ‘కొండగట్టు ఆలయంలో గర్భగుడి దగ్గర దొంగతనం జరగడం సిగ్గు చేటు. కేసీఆర్‌ది ఐరన్ లెగ్. ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ మటాష్ అవుతోంది’అని సంజయ్ అన్నారు. ‘యాగాలు చేస్తే యాగశాల ఆహుతైంది. యాదాద్రికి పోతే వరదలొచ్చే. కొండగట్టుకు వస్తే దొంగతనం జరిగే. కొండగట్టుకు వెయ్యి కోట్లు రాకపోగా దొంగలొచ్చి దొంగతనం జరిగింది’అని ఎద్దేవా చేశారు. రేపో మాపో ఈ కేసును కూడా నీరుగారుస్తారని, మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని అని అమాయకులను ఇరికించే కుట్ర చేసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కేసీఆర్‌ది దొంగ పూజని, ఆయన కొడుకు దేవుడినే నమ్మని నాస్తికుడు, మూర్ఖుడని అన్నారు. దందాలకు కేరాఫ్ కేసీఆర్ కుటుంబం లంగ దందా, దొంగ దందాలకు కేరాఫ్ కేసీఆర్ కుటుంబమని బండి సంజయ్ విమర్శించారు. ‘ఒకరిది ఇసుక దందా, ఇంకొకరిది డ్రగ్స్ దందా, మరొకరిది దొంగ సారా, పత్తాల దందా..’ఈ దందాలను ప్రశ్నిస్తున్నందుకే కేంద్రం తెలంగాణకు ఏమీ చేయడం లేదని అబద్దాలాడుతూ సెంటిమెంట్‌ను రగిల్చే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘కేసీఆర్‌కు దమ్ముంటే తెలంగాణలో జరిగిన అభివృద్ధి, ఇచ్చిన హామీలతోపాటు కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులిచ్చిందనే అంశంపై చర్చకు సిద్ధం కావాలి’అని అన్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సమావేశంలో పాల్గొన్నారు. -
ప్రీతి ఆత్మహత్యయత్నం ఘటనపై కొనసాగుతున్న విచారణ
-
ప్రీతి ఘటనలో దోషుల్ని వదలం
సాక్షి, హైదరాబాద్/ఎంజీఎం/సుల్తాన్‌బజార్(హైదరాబాద్): వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నంపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేపడుతుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించినట్టు తెలిపారు. ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రీతి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడినట్టు.. వైద్యులను ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ప్రీతి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్నట్టు వివరించారు. ఘటనపై ఢిల్లీ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆరా: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి సీనియర్ విద్యార్థి వేధింపులే కారణమని పత్రికల ద్వారా తెలుసుకున్న ఢిల్లీలోని యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు స్పందించారు. ఘటన వివరాలను వెంటనే తెలపాలంటూ కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్‌ను ఆదేశించారు. దీంతో కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ అధ్యక్షతన శుక్రవారం కాకతీయ మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. సీనియర్ విద్యార్థిపై చర్యకు డిమాండ్: పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారకుడైన సీనియర్ విద్యార్థిపై ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం నేత తమ్మినేని డిమాండ్ చేశారు. అలాగే, సైఫ్ వేధిస్తున్నాడని ప్రీతి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమని ఏబీవీపీ వర్కింగ్ కమిటీ సభ్యుడు ప్రవీణ్‌రెడ్డి వేరొక ప్రకటనలో పేర్కొన్నారు. ఏబీవీపీ ధర్నా.. నేతల అరెస్టు: వరంగల్ కాకతీయ వైద్య కళాశాల పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారకుడైన సైఫ్‌ను కఠినంగా శిక్షించాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు గురువారం కోఠిలోని వైద్య విద్య సంచాలకుని కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుల్తాన్‌బజార్ పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. దీంతో ఉభయులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇన్స్పెక్టర్ బాలగంగిరెడ్డి ఏబీవీపీ నేతలను అరెస్టు చేసి సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులూ.. ఆత్మహత్యలు వద్దు
సాక్షి, హైదరాబాద్/లక్డీకాపూల్: ఏ సందర్భంలోనైనా విద్యార్థులు ధైర్యంగా ఉండాలని.. ఆత్మహత్యలకు పాల్పడటం సరికాదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. సీనియర్ వేధింపులకు గురిచేశాడంటూ ఆత్మహత్యాయత్నం చేసి ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వరంగల్ ఎంజేఎం పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతిని, ఆమె కుటుంబసభ్యుల్ని గవర్నర్ గురువారం పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ ఇది చాలా సున్నితమైన అంశమని, దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలన్నారు. ఒక వైద్య విద్యార్థినికి ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. బాధితురాలిని కాపాడేందుకు అన్ని రకాల వైద్య సహాయం అందించాలని వైద్యుల్ని కోరినట్లు గవర్నర్ చెప్పారు. బాధ్యులెవరైనా వదలం: డీఎంఈ వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఉదంతంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులు ఎవరైనా వదిలేది లేదని రాష్ట్ర వైద్య, విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రీతి పరిస్థితిని తెలుసుకోవడానికి ఆయన గురువారం నిమ్స్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రీతి పరిస్థితి విషమంగానే ఉందన్నారు. ఆత్మహత్యాయత్నానికి ఆమె ఇంజక్షన్ తీసుకోవడమే కారణమనే విషయాన్ని అప్పుడే నిర్ధారించలేమని, దానికి సంబంధించిన ఆనవాళ్లేవీ వైద్యులు ఇప్పటిదాకా గుర్తించలేదన్నారు. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణం ర్యాగింగ్ కాదని, పీజీ స్థాయిలో అప్పటికే వైద్యులుగా ఉన్న పరిస్థితిలో ర్యాగింగ్ ఉండదన్నారు. హోంమంత్రి బంధువనే చర్యలు తీసుకోలేదా?: విపక్షాలు పంజగుట్ట: ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ధరావత్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు పలు పార్టీలు, సంఘాల నాయకులు గురువారం నిమ్స్ ఆసుపత్రికి వచ్చారు. మాజీ మంత్రి రవీంద్రనాయక్, టీడీపీ నాయకురాలు జ్యోత్స్న, గిరిజన విద్యార్థి సంఘం నాయకుడు వెంకట్ బంజారా, బీజేపీ మహిళా మోర్చా నాయకులు, సామాజిక కార్యకర్త ఇందిరా శోభన్ వచ్చి డాక్టర్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ హోంమంత్రి బంధువైనందుకే ప్రీతిని వేధించిన సీనియర్ విద్యార్థి సైఫ్‌పై చర్యలు తీసుకొనేందుకు పోలీసులు వెనుకంజ వేస్తున్నారా? అని ప్రశ్నించారు. -
వేధింపులతో వైద్యవిద్యార్థిని ఆత్మహత్యాయత్నం
సీనియర్ విద్యార్థి ర్యాగింగ్, వేధింపులతో పీజీ వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపుతోంది. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ)లో అనస్థీషియా విభాగంలో పీజీ ఫస్టియర్ చదువుతున్న ధరావత్ ప్రీతి (26) బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎంజీఎం ఆస్పత్రిలో విధుల్లో ఉన్న ప్రీతి బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో తీవ్ర తలనొప్పి, అలసటగా ఉందని చెప్పి నర్సు వద్ద నుంచి ఓ ఇంజక్షన్ తీసుకుని వేసుకుంది. క్షణాల వ్యవధిలోనే తన గదిలో స్పృహ తప్పి పడిపోవడంతో ఆర్ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులే దీనికి కారణమని ఆమె తండ్రి ఆరోపించారు. దీనిపై విచారణ జరుపుతున్నామని వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్ రెడ్డి వెల్లడించారు. ఈ ఘటనపై మంత్రి హరీశ్‌రావు ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. హేళన చేస్తూ వేధించి.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గిర్ని తండాకు చెందిన ధరావత్ నరేందర్, శారద దంపతులకు ముగ్గురు కుమార్తెలు పూజా, ఉష, ప్రీతి, కుమారుడు వంశీ ఉన్నారు. నరేందర్ వరంగల్‌లోని ఆర్పీఎఫ్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే వీరి కుటుంబం హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు మకాం మార్చింది. పూజా, ఉషల పెళ్లిళ్లు అయ్యాయి. కుమారుడు వంశీ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. ఇంట్లో ఎప్పుడూ సరదాగా ఉండే ప్రీతి గాంధీ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేసింది. కేఎంసీలో పీజీ అనస్థీషియా కోర్సు చదువుతున్న ప్రీతి ఎంజీఎం ఆస్పత్రిలో సీనియర్ విద్యార్థులతో కలిసి అపరేషన్ థియేటర్లో విధులు నిర్వర్తిస్తోంది. అక్కడ పరిచయమైన సీనియర్ విద్యార్థి సైఫ్ ర్యాగింగ్ చేస్తూ ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించాడు. తక్కువ కులం అంటూ హేళన చేశాడు. దీనిపై ప్రిన్సిపాల్ ఆదేశానుసారం అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ నాగార్జున రెడ్డి సైఫ్, ప్రీతిలకు మంగళవారం సాయంత్రం కౌన్సెలింగ్ నిర్వహించారు. తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ప్రీతి ఆత్మహత్యకు యత్నించడంతో ఆమెకు వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోందని విద్యార్థులు అంటున్నారు. ఈఓటీలో ఏం జరిగిందంటే..: విధుల్లో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ అపరేషన్ థియేటర్ (ఈఓటీ)లో మంగళవారం సాయంత్రం 4 గంటలకు విధులకు హాజరైన ప్రీతి తోటి వైద్యులతో కలిసి రాత్రి 12 గంటల వరకు రెండు శస్త్రచికిత్సలు చేసింది. తిరిగి బుధవారం తెల్లవారుజామను 5 గంటల సమయంలో మరో శస్త్రచికిత్సకు సిద్ధమై ఆరు గంటలకల్లా పూర్తిచేసింది. ఈ క్రమంలో ప్రీతి తలనొప్పి, ఛాతీలో నొప్పిగా ఉందంటూ జోఫర్, ట్రెమడాల్ ఇంజక్షన్ కావాలని స్టాఫ్‌నర్సుకు చెప్పింది. శస్త్రచికిత్స పూర్తిచేసిన బాధితుడిని వార్డుకు తీసుకెళ్లి తిరిగి థియేటర్‌కు వచి్చన తోటి వైద్యులు ప్రీతి ఎక్కడ ఉందని అక్కడున్న సిబ్బందిని అడిగారు. డాక్టర్స్ రూమ్‌లో ఉందని చెప్పగానే అక్కడికి వెళ్లిన వారికి ప్రీతి ఆపస్మారకస్థితిలో ఉండటం గమనించారు. వద్దు డాడీ అంది.. ఇప్పుడింత పనైంది ‘కాలేజీ, ఆస్పత్రిలో ర్యాగింగ్ చేస్తూ వేధిస్తున్న సైఫ్‌పై ప్రిన్స్‌పాల్‌కు ఫిర్యాదు చేస్తా అంటే వద్దు డాడీ అంటూ నివారించింది. ప్రిన్సిపల్ కక్ష సాధింపు చర్యలకు దిగి మార్కులు తక్కువ వేస్తారంటూ భయపడేది. సైఫ్ అరాచకంపై ఏసీపీ కిషన్‌కు చెప్పాను. ఆ తర్వాత కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్ దాసు ఆదేశాల మేరకు డాక్టర్ నాగార్జునరెడ్డి మంగళవారం సాయంత్రం అతడిని మందలించారు. నాపై ఫిర్యాదు చేస్తావా అంటూ సైఫ్ మరోసారి నా బిడ్డను బెదిరించగా మనస్తాపానికి లోనై ఆత్మహత్యకు యతి్నంచింది’ అని తండ్రి నరేందర్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. నరేందర్ ఫిర్యాదుమేరకు సైఫ్‌పై వేధింపులు, ర్యాగింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద మట్టెవాడ పోలీసులు కేసులు నమోదు చేశారు. వరంగల్ ఏసీపీ కిషన్ దర్యాప్తు చేస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్‌తోనే... కార్డియాక్ అరెస్టు రావడంతో వైద్య బృందంతో సీపీఆర్ ద్వారా చికిత్స చేసి ట్రీట్మెంట్ ఇచ్చామని ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ చెప్పారు. గుండెకు సంబంధించి 28 శాతం ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఆఫ్ హార్ట్, గ్లోబల్ హిపోకైనేషియా, పాంక్రియాటైటిస్, అసైటీస్, ఊపిరితిత్తుల సమస్య ఉన్నట్టు తేలిందన్నారు. ప్రీతి థైరాయిడ్, కీళ్లవాతానికి సంబంధించి మందులు వాడుతున్నట్టు తేలిందన్నారు. సెల్ఫోన్లో అనస్థీషియాపై సెర్చ్ ప్రీతి ఆత్మహత్యకు యతి్నంచకముందు బుధవారం తెల్లవారుజామున తన సెల్ఫోన్లో గూగుల్ సెర్చ్‌లో సాధారణ వ్యక్తి అనస్థీషియా తీసుకుంటే ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో చూసినట్లు విద్యార్థులు చర్చించుకుంటున్నారు. అయితే ప్రీతి ట్రెమడాల్ తీసుకుందని కొందరు, అనస్థీషియా తీసుకుందని మరికొందరు చెబుతున్నారు. -
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
-
విజయనగరం వైద్య కళాశాలకు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్యలో సువర్ణాధ్యాయం లిఖించేలా కీలక ముందడుగు పడింది. విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 150 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్లు నిర్వహించేలా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్ఎంసీ నుంచి వైద్య శాఖకు మంగళవారం ఉత్తర్వులు అందాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏకంగా 17 వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల్లో అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐదుచోట్ల జిల్లా ఆస్పత్రులను యుద్ధప్రాతిపదికన బోధనాస్పత్రులుగా తీర్చిదిద్దడంతోపాటు ఒక్కోచోట 150 ఎంబీబీఎస్ సీట్లతో అడ్మిషన్లకు అనుమతులు కోరుతూ ఎన్‌ఎంసీకీ గత ఏడాది దరఖాస్తు చేసింది. దీంతో ఈ నెల మొదటి వారంలో 5చోట్ల ఎన్ఎంసీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. అనంతరం విజయనగరం వైద్య కళాశాలలో అడ్మిషన్లకు ఆమోదం లభించింది. మిగిలిన నాలుగు కళాశాలలకు ఆమోదం లభించాల్సి ఉంది. వీటికి కూడా ఆమోదం లభిస్తే వచ్చే విద్యా సంవత్సరంలో ఏకంగా 750 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూరుతాయి. తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో చివరిసారిగా 2014లో నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది. ఈ కళాశాల ఏర్పాటుకు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడే అడుగులు పడ్డాయి. అనంతరం టీడీపీ హయాంలో ఒక్కటి కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కాలేదు. అంతకుముందు చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లోనూ ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఏర్పాటుకు కృషి చేసిన దాఖలాలు లేవు. టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్ వైద్య కళాశాలల ఏర్పాటుకు కొమ్ముకాసింది. సీఎం వైఎస్ జగన్ కృషితో తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాల ఏర్పాటైంది. వైద్య రంగంలో మరో మైలురాయి విజయనగరం వైద్య కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లు ఇచ్చేందుకు ఎన్ఎంసీ ఆమోదం ఇవ్వడం శుభపరిణామం. దీంతో రాష్ట్ర వైద్య రంగంలో మరో మైలురాయి వచ్చి చేరింది. రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటును సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో తొలుత విజయనగరం కళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు లభించాయి. విజయనగరం వైద్య కళాశాలతో ఉత్తరాంధ్ర ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సంరక్షణ సమకూరుతుంది. మరో 4 కళాశాలలకు కూడా అనుమతులు లభిస్తాయని దృఢ నిశ్చయంతో ఉన్నాం. 2019లో రాష్ట్రంలో మొత్తం 911 పీజీ సీట్లు ఉండేవి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో ఆ సీట్లను 1,249 కు పెంచుకోగలిగాం. మరో 637 సీట్ల పెంపుదల కోసం చేస్తున్న కృషిలో భాగంగా ఇప్పటివరకు 90 సీట్లను అదనంగా సాధించగలిగాం. – విడదల రజని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి -
మహారాష్ట్రలో పరువు హత్య
ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో వైద్య విద్యార్థిని పరువు హత్యకు గురైంది. ప్రేమ వ్యవహారంతో తమ పరువు తీసిందనే కోపంతో తండ్రి, సోదరుడు ఇతర కుటుంబసభ్యులు కలిసి ఆమెను ఉరి వేసి చంపి, ఆపై దహనం చేశారు. లిబ్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పింప్రి మహిపాల్ గ్రామంలో ఈ నెల 22వ తేదీన ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. హోమియోపతి మెడిసిన్ అండ్ సర్జరీ(బీహెచ్ఎంఎస్) మూడో సంవత్సరం చదువుతున్న శుభాంగి జొగ్‌దండ్‌కు ఇటీవల కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం కుదిర్చారు. అయితే, తను గ్రామానికే చెందిన మరో వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని శుభాంగి వరుడికి తెలిపింది. పెళ్లి ఆగిపోవడంతో గ్రామంలో పరువు పోయిందని కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నెల 22 రాత్రి తండ్రి, సోదరుడు, మరో ముగ్గురు కుటుంబసభ్యులు కలిసి శుభాంగిని తమ పొలానికి తీసుకెళ్లి తాడుతో ఉరివేశారు. అనంతరం మృతదేహాన్ని కాల్చివేసి, మిగిలిన ఆనవాళ్లను నీళ్లలో పడవేశారు. ఈ మేరకు ఐదుగురిపై హత్య, తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. -
విదేశీ వైద్య విద్యార్థులకు వెసులుబాటు
సాక్షి, హైదరాబాద్: గతంలో భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) అనుమతి పొందిన, 2022 అక్టోబరు 21వ తేదీ లోపు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) గుర్తించిన విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు.. ఆయా దేశాల్లోనే ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేస్తే దాన్ని ఈ ఒక్క ఏడాది వరకు గుర్తిస్తామని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏ దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసినా కూడా భారత్‌లో అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, అనంతరం ఒక ఏడాది పాటు తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంది. ఈ నిబంధన తాజాగా అమల్లోకి రావడంతో 2022 అక్టోబర్‌కు ముందే ఇంటర్న్‌షిప్ విదేశాల్లో పూర్తి చేసిన వారు మళ్లీ ఇక్కడ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అలాంటి అభ్యర్థులు ఈ నిబంధనను సడలించాలని ఎన్ఎంసీని కోరారు. దీన్ని పరిశీలించిన ఎన్ఎంసీ తాజాగా వెసులుబాటు కల్పించింది. తాము అనుమతించిన కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో గతేడాది అక్టోబర్ 21కు ముందు ఎంబీబీఎస్, తత్సమాన అర్హతతో వైద్య విద్య పూర్తి చేసి, ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేసినట్లయితే వారికి ఈ ఒక్క ఏడాదికి సడలింపిస్తామని ఉత్తర్వులు జారీచేశారు. (క్లిక్ చేయండి: 20 కోట్ల ఆఫర్‌ని కాదన్నాడు.. రూ.100కోట్లు ఇచ్చినా కూడా..) -
ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు ప్రభుత్వం సాయం
-
ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులకు సాయమందించిన సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కడప ఫాతిమా కాలేజీ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. 2015లో ఇబ్బందులు పడిన 46 మంది ఫాతిమా కాలేజీ మెడికల్ విద్యార్థులకు ఫీజుల కింద రూ.9.12 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. విద్యార్థుల సమస్యలను డిప్యూటీ సీఎం అంజాద్ భాష.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించారు. దీంతో కాలేజీ ఆవరణలో విద్యార్థులు కేక్ కట్ చేసి, థ్యాంక్యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. చదవండి: (TDP Drama: ఛీ..ఛీ.. మరీ ఇంత అన్యాయమా!) -
సర్పంచ్‌గా ‘ఎంబీబీఎస్’ విద్యార్థిని.. ఎన్నికల్లో ఘన విజయం
ముంబై: యశోధరా షిండే.. 21 ఏళ్ల ఈ యువతి డాక్టర్ కావాలని కలలు కన్నది. అందుకు తగ్గట్లుగా జార్జియా వెళ్లి ఎంబీబీఎస్ చదువుతోంది. కానీ, ఆమెకు విధి మరో కొత్త రంగాన్ని అందించాలని తలపించింది. ఆమెను గ్రామానికి తిరిగి వచ్చేలా చేసింది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచింది యశోధరా. భారీ మెజారిటీతో సర్పంచ్‌గా ఘన విజయం సాధించింది. చిన్న వయసులోనే సర్పంచ్‌గా ఎన్నికై అందరి మన్ననలు పొందుతోంది. ఈ సంఘటన మహారాష్ట్ర, సంగ్లీ జిల్లాలోని మిరాజ్ తహసీల్ వడ్డి గ్రామంలో జరిగింది. యశోధరా సర్పంచ్‌గా పోటీ చేయాల్సి రావటంపై ఆమె మాటల్లోనే.. ‘జార్జియాలోని న్యూ విజన్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను నాలుగో సంవత్సరంలో ఉన్నా. ఇంకా ఏడాదిన్నర కోర్సు మిగిలి ఉంది. మా గ్రామంలో ఎన్నికలు ప్రకటించిన క్రమంలో మా ఇంటి నుంచి ఎవరైనా పోటీ చేయాలని స్థానికులు కోరారు. సర్పంచ్‌గా నన్ను బరిలో నిలపాలని మా కుటుంబంతో పాటు అంతా నిర్ణయించారు. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పడంతో వచ్చాను. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను.’ - యశోధరా షిండే, వడ్డి గ్రామ సర్పంచ్ తమ గ్రామం వడ్డి అభివృద్ధి కోసం పాటుపడతానని, మహిళలు స్వయంసమృద్ధిగా ఎదిగేందుకు, విద్యార్థుల కోసం ఈ లర్నింగ్, ఇతర మెరుగైన విద్యావిధాలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొంది యశోధరా. రైతుల సంక్షేమంతో పాటు యువతకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూస్తానని ధీమా వ్యక్తం చేశారు. మహిళలకు సమానమైన అవకాశాలు రావాలని, అందుకు తగినట్లుగా వారు చదువుకుని స్వతంత్రంగా జీవించేందుకు కృషి చేస్తానని నొక్కి చెప్పారు యశోధరా. మరోవైపు.. తన ఎంబీబీఎస్ చదువును కొనసాగిస్తానని, ఆన్లైన్ విధానంలో పూర్తి చేస్తానని వెల్లడించింది. మహారాష్ట్రలోని 7,682 గ్రామ పంచాయతీలకు డిసెంబర్ 18న ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ ఎన్నికల ఓటింగ్ ఫలితాలను గత మంగళవారం వెల్లడించారు. ఇదీ చదవండి: కోవిడ్ కేసుల పెరుగుదల ఆందోళనకరమే.. కానీ: అదర్ పూనావాలా -
జిల్లాల్లో వైద్య సేవలు తప్పనిసరి..
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్య కోర్సుల్లో డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ (డీఆర్పీ)ని అమలు చేయడానికి వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రూపొందించింది. డీఆర్పీని 2020–21లో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రవేశపెట్టింది. డీఆర్‌పీలో భాగంగా ఎండీ/ఎంఎస్ కోర్సులు చేసే పీజీ రెసిడెంట్లు మూడు, నాలుగు, ఐదో సెమిస్టర్ల సమయంలో మూడు నెలల పాటు ఆయా జిల్లాల్లోని 100 పడకలు పైబడిన ప్రభుత్వాస్పత్రుల్లో శిక్షణ పొందాలి. ఈ మూడు నెలలు వీరు ఆయా ఆస్పత్రుల్లో రెసిడెంట్లుగా సేవలు అందించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ప్రణాళిక, అమలు, పర్యవేక్షణపై పీజీ వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించడమే డీఆర్పీ ముఖ్య ఉద్దేశం. మూడు నెలల కాలంలో ప్రీ, పారా క్లినికల్ రెసిడెంట్లు రోగనిర్ధారణ/ప్రయోగశాలలు, ఫార్మసీ, ఫోరెన్సిక్ సేవలు, సాధారణ వైద్య విధులు, ప్రజారోగ్య కార్యక్రమాలపై శిక్షణ ఇస్తారు. క్లినికల్ స్పెషాలిటీ రెసిడెంట్లు ఆయా స్పెషాలిటీ ఔట్‌పేషెంట్, ఇన్ పేషెంట్, క్యాజువాలిటీ, ఇతర ప్రాంతాలలో సేవలు అందించడంతోపాటు రాత్రి విధులను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మూడు నెలల కాలంలో వసతి, స్టైపెండ్ అందిస్తారు. 17 జిల్లా, 53 ఏరియా ఆస్పత్రులు.. రాష్ట్రంలో వంద పడకలు పైబడినవాటిలో 17 జిల్లా, 53 ఏరియా ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. డీఆర్పీ 2020–21లోనే అమలులోకి వచ్చినప్పటికీ కరోనా కారణంగా అమలు చేయలేదు. దీంతో వచ్చే ఏడాది నుంచి అమలు చేయాలని వైద్య శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 2020–21లో పీజీ కోర్సుల్లో చేరిన 800 మంది ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మూడో సంవత్సరం చదువుతున్నారు. వీరందరికీ డీఆర్పీని వచ్చే జనవరి నుంచి అమలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. డీఆర్పీ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి జిల్లాకు ఒక కోఆర్డినేటర్‌ను నియమిస్తారు. పీజీ రెసిడెంట్లకు శిక్షణను కోఆర్డినేటర్ పర్యవేక్షిస్తుంటారు. పీజీ తుది పరీక్షలకు హాజరు కావడానికి ముందు డీఆర్పీని సంతృప్తికరంగా పూర్తి చేయడం తప్పనిసరి. ప్రతిపాదనలు సిద్ధం చేశాం.. పీజీ వైద్య విద్యలో డీఆర్పీ అమలుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రస్తుతం మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులకు వచ్చే జనవరి నుంచి అమలు చేయాలని నిర్ణయించాం. అదేవిధంగా రొటేçÙన్ పద్ధతిలో రెండో సంవత్సరం విద్యార్థులను డీఆర్పీ పరిధిలోకి తీసుకొస్తాం. వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులతో పోలిస్తే జిల్లా స్థాయిలోని ఆస్పత్రుల్లో వైద్య సేవలు భిన్నంగా ఉంటాయి. డీఆర్పీ అమలుతో జిల్లా స్థాయిలో వైద్య కార్యక్రమాల అమలు, క్లినికల్, ప్రీ, పారా క్లినికల్ సేవలపై విద్యార్థులకు అవగాహన ఏర్పడుతుంది. ఇది వారి భవిష్యత్‌కు ఎంతగానో తోడ్పడుతుంది. – డాక్టర్ వినోద్ కుమార్, డీఎంఈ -
క్రూరమృగంలా.. నా జీవితం నాశనం చేశాడు
రంగారెడ్డి : తనను కిడ్నాప్ చేసి క్రూరమృగంలా వ్యవహరించిన నవీన్‌రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని వైద్య విద్యార్థిని వైశాలి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌ను కోరింది. సోమవారం తన తండ్రి, మేనమామతో కలిసి సీపీకి ఫిర్యాదు చేసింది. తనకు నవీన్‌రెడ్డితో పరిచయం మాత్రమే ఉందని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగా అపఖ్యాతి పాల్జేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భవిష్యత్‌ను నాశనం చేశాడని విలపించింది. నవీన్‌రెడ్డితో తనకు వివాహం కాకపోయినా అయినట్టుగా ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇన్‌స్ట్రాగాంలో పెట్టాడని, తమ ఇంటి వద్ద పోస్టర్లు వేసి తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేశాడని వాపోయింది. ఈ నెల9న తమ ఇంటిపైకి రౌడీలను తీసుకొచ్చి విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డాడని, తన తల్లిదండ్రులను కర్రలతో కొట్టాడని చెప్పింది. ఓ మహిళ అని కూడా చూడకుండా కాళ్లు, చేతులు పట్టుకొని తనను కార్లో పడేశారని, కనీసం ఊపిరి ఆడకుండా చేశారని సీపీకి వివరించింది. కారులో గోర్లతో రక్కారని, చేతులు, కాళ్లు విరిచి, మెడపై గాయపరిచి ఘోరంగా ట్రీట్ చేశారని వాపోయింది. తనను వదిలిపెట్టమని ప్రాధేయపడగా, అమ్మనాన్నలను చంపేస్తానని బెదిరించాడని పేర్కొంది. నాలుగు రోజులైనా పోలీసులు అతడిని ఎందుకు అరెస్టు చేయడంలేదని ప్రశ్నించింది. ఈ కేసు విషయమై ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డిని త్వరలో పట్టుకుంటామని, ఎంతటివారైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని కమిషనర్ హామీ ఇచి్చనట్లు తెలిసింది. నవీన్‌రెడ్డి కారు లభ్యం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మన్నెగూడకు చెందిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఘటన జరిగి నాలుగు రోజులైనా ఆచూకీ ఇంకా దొరకలేదు. వైశాలిని కిడ్నాప్ చేసేందుకు వాడిన కారును మాత్రం పోలీసులు సోమవారం సాయంత్రం గుర్తించారు. శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి వద్ద ఆ కారును (టీఎస్ 07 హెచ్ఎక్స్ 2111) వదిలేశారు. పార్కింగ్ చేసి, లాక్ వేసుకొని నింది తులు పరారయ్యారు. కానీ కారు లైట్లు వెలుగు తూనే ఉన్నాయి. ఈ వాహనాన్ని ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, నవీన్‌రెడ్డిపై గతంలో రెండు కేసులు నమోదైనట్లు వెల్లడైంది. ఇందులో 2019లో వరంగల్ ఇంతియార్‌గంజ్ పీఎస్ పరిధిలో చీటింగ్, ఐటీ సెక్షన్ల కింద ఒక కేసు, కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో 2019లోనే యాక్సిడెంట్‌కు సంబంధించి మరో కేసు నమోదైంది. తాజాగా పీడీయాక్ట్ నమోదు చేసేందుకు పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఏపీలో నవీన్‌రెడ్డి?
ఇబ్రహీంపట్నం రూరల్: వైద్య విద్యార్థిని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి సహా పరారీలో ఉన్న మరో ముగ్గురి నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అతనితో పాటు మిగిలిన ముగ్గురు వాడిన కారు కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. నిందితులు సెల్ఫోన్లు వాడుతున్నట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవీన్‌రెడ్డి, పంజాబ్ ప్రాంతాల్లో రుమెన్, చందు, సిద్ధు ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇప్పటికే తెలంగాణ పోలీసులు నిందితులున్న ప్రాంతాలకు చేరుకున్నట్లు సమాచారం. నవీన్‌రెడ్డి మొదటి నుంచీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో దిట్ట అని తెలుస్తోంది. ఎప్పుడు ఫోన్లు వాడినా వాట్సాప్ ద్వారానే మాట్లాడే నవీన్‌రెడ్డి ఒకటి రెండు రోజుల్లో చిక్కే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ►ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధి మన్నెగూడలో నివసించే దామోదర్‌రెడ్డి, నిర్మల దంపతుల కూతురుపై దాడికి పాల్పడి, ఎత్తుకెళ్లిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించి, దాడికి పాల్పడిన 32 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కిడ్నాప్ కథ çసుఖాంతం అయినప్పటికీ ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి మాత్రం నేటికీ పోలీసులకు చిక్కలేదు. దీంతో రాచకొండ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ సీపీ సుధీర్‌బాబు నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎస్ఓటీ, టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానం ఉన్న చోట జల్లెడ పట్టారు. నవీన్‌రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. కాగా, నవీన్‌రెడ్డిపై అతని స్వగ్రామంలో చీటింగ్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాష్ట్ర సరిహద్దులు దాటిన నిందితులు వైద్య విద్యార్థిని కిడ్నాప్ చేసిన రోజు నవీన్ కుటుంబ సభ్యులను పోలీసులు గట్టిగా హెచ్చరించినట్టు తెలిసింది. కనిపిస్తే ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులు చెప్పడంతో నిందితుడు మాల్ నుంచి హాలియా మధ్యలో వైద్య విద్యార్థిని వదిలేసి వెళ్లాడు. నల్లగొండ జిల్లా సరిహద్దుల్లో 9న కారును స్నేహితులకు వదిలేసి ద్విచక్ర వాహనం లిఫ్ట్ అడిగి పారిపోయినట్లు సమాచారం. నవీన్‌తో ఉన్న చందు, సిద్ధు, రుమెన్ కారుతో ఉడాయించినట్టు పోలీసులు భావిస్తున్నారు. -
వైద్య విద్యార్థిని కిడ్నాప్ కేసులో 32 మంది అరెస్టు
ఇబ్రహీంపట్నం రూరల్: సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ ఘటనలో మొత్తం 36 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వారిలో 32 మంది నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి సహా మరో నలుగురు పరారీలో ఉన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సంపద హోమ్స్‌లోని ఓ ఇంటిపై దాడి చేసిన దుండగులు సినీఫక్కీలో వైద్య విద్య అభ్యసిస్తున్న యువతిని కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆదిభట్ల పోలీసుల విస్తృత గాలింపు నేపథ్యంలో కిడ్నాపర్లు వదిలి పెట్టడంతో, శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులను పట్టుకునేందుకు బృందాలుగా రంగంలోకి దిగారు. శనివారం 32 మంది నిందితులను అరెస్టు చేశారు. దాడికి పాల్పడిన వారందరూ మిస్టర్ టీ పాయింట్లలో పనిచేసే సిబ్బందిగా గుర్తించారు. నాగారం భాను ప్రకాశ్, రాథోడ్ సాయినాథ్, నాగారం కార్తీక్, గానోజీ ప్రసాద్, కొత్తి హరి, రాథోడ్ అవినాష్, అరిగేల రాజు, సోనుకుమార్ పాశ్వాన్, ఇర్ఫాన్, నీలేశ్‌కుమార్, బిట్టుకుమార్ పాశ్వాన్, పున్నా నిఖిల్, ఇస్లావత్ అనిల్, మహేశ్‌కుమార్ యాదవ్, రిజ్వాన్, ఇబారహార్, జావెద్ హుస్సేన్, బొడ్డుపల్లి సతీశ్, ముక్రమ్, బిశ్వజిత్ , అంగోతు యోగిందర్, నర్ర గోపీచంద్, బట్టు యశ్వంత్‌రెడ్డి, ముప్పాల మహేశ్, వంకాయలపాటి మణిదీప్, బోని విశ్వేశ్వర్రావు, శివరాల రమేశ్, మలిగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, జాదవ్ రాజేందర్, మిరాసాని సాయినాథ్, దామరగిద్ద శశికుమార్, గాదె కార్తీక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని వైద్య పరీక్షల అనంతరం శనివారం రాత్రి ఇబ్రహీంపట్నం 15వ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. పరారీలోనే ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డితో పాటు వాజిద్, సిద్దు, చందు పరారీలో ఉన్నారని ఆదిబట్ల సీఐ నరేందర్‌రెడ్డి తెలిపారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, త్వరలోనే అరెస్టు చేస్తామని అన్నారు. 36 మంది నిందితుల్లో ముగ్గురు అయ్యప్ప మాల ధరించిన వారు ఉండటం గమనార్హం. కాగా ఈ కేసులో రెండు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. రెండేళ్లు కలిసి తిరిగారు..దాడి తప్పే ఆ అమ్మాయి నా కొడుకు ప్రేమించుకున్నారు. రెండేళ్లుగా కలిసి తిరిగారు. మా ఇంటికి కూడా అమ్మాయి చాలా సార్లు వచ్చింది. కరోనా సమయంలో ఆమె ను రోజూ కారులో కళాశాల వద్ద దింపి వచ్చేవాడు. పెళ్లి చేసుకున్నట్లు కూడా చెప్పాడు. తన వ్యాపారానికి సంబంధించిన డబ్బులు కూడా అమ్మాయి తండ్రి దామోదర్‌రెడ్డికి ఇచ్చేవాడు. వాళ్ల కోసం కారు కూడా తీసుకున్నాడు. వాడిని అన్ని విధాలుగా వాడుకున్నారు. నిన్న అమ్మాయి ఇంటిపై జరిగిన దాడి తప్పే. కానీ అంతకుముందు జరిగిన విషయా లు కూడా పోలీసులు పరిగణనలోకి తీసుకోవాలి. కష్టపడి ఎదిగిన నా కుమారుడిని అమ్మాయి ఇష్టపడింది. గొడవలకు కారణం తెలియదు. ఆ అమ్మా యిని వదిలేయమని నవీన్‌కు చాలాసార్లు చెప్పాను. మంచి సంబంధాలు వస్తున్నాయని చెప్పినా వినిపించుకోలేదు. – నారాయణమ్మ, నవీన్‌రెడ్డి తల్లి ‘టీ టైమ్’తో సంబంధం లేదు బంజారాహిల్స్: మన్నెగూడకు చెందిన యువతి వైశాలిని కిడ్నాప్ చేసిన కేసులో ప్రధా న నిందితుడు నవీన్‌రెడ్డికి ‘టీ టైమ్’తో ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ డైరెక్టర్ అర్జున్ గణేష్ స్పష్టం చేశారు. నవీన్‌రెడ్డి టీ టైమ్ సంస్థ ఓనర్ అంటూ కొన్ని మీడియా సంస్థల్లో (సాక్షి కాదు) వార్తలు ప్రసారం అయ్యాయని, అయితే టీ టైమ్ సంస్థకు నవీన్‌రెడ్డితో ఎలాంటి సంబంధాలు, ఒప్పందాలు లేవని, అలాగే అతనికి తమ ఫ్రాంచైజీలు కూడా లేవని తెలిపారు. నవీన్‌రెడ్డికి చెందిన సంస్థ పేరు ‘మిస్టర్ టీ టైమ్’ అని శనివారం విలేకరులకు వివరించారు. -
మెడికల్ విద్యార్థులకు మంత్రి మల్లారెడ్డి క్షమాపణలు
-
MBBS: ‘బీ’ కేటగిరీ సీట్లకు తగ్గిన కటాఫ్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్లలో 85 శాతం కోటా రాష్ట్ర విద్యార్థులకే ఇవ్వడంతో నీట్లో పొందిన మార్కుల కటాఫ్ తగ్గినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. గతేడాది కంటే కటాఫ్ తగ్గడం వల్ల, ఈసారి కొత్తగా వెయ్యి మంది రాష్ట్ర విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినట్లు చెబుతున్నారు. గతేడాది ఒక ప్రైవేట్ కాలేజీలో చివరి బీ కేటగిరీ సీటు 399 మార్కుల వరకు కటాఫ్ వచ్చిన విద్యార్థికి వచ్చింది. ఇప్పుడు ఇంకా రెండు దశలున్నప్పటికీ మొదటి విడత బీ కేటగిరీ సీట్లలో ఒక ప్రైవేట్ కాలేజీలో 309 మార్కులు వచ్చిన విద్యార్థికి కూడా సీటు వచ్చిందని వర్సిటీ వర్గాలు చెప్పాయి. గతేడాది చివరి కౌన్సెలింగ్ నాటి పరిస్థితితో పోలిస్తే, ఇప్పుడు మొదటి విడత సీట్ల భర్తీలోనే కటాఫ్ తగ్గిందన్నాయి. ఈసారి 290 మార్కులొచ్చిన వారికీ బీ కేటగిరీలో సీటు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. 287 మార్కులొచ్చిన ముస్లిం విద్యార్థినికి మైనారిటీ కాలేజీలో బీ కేటగిరీలో సీటు వచ్చింది. ముస్లిం విద్యార్థులకు కూడా తాజా రిజర్వేషన్ల వల్ల న్యాయం జరిగిందని చెబుతున్నారు. గతేడాది 6,500 మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు బీ కేటగిరీ సీట్లకు దరఖాస్తు చేసుకోగా, ఈసారి రెండు వేల వరకు మాత్రమే వచ్చినట్లు అంచనా. ఇతర రాష్ట్రాలకు తగ్గిన వలసలు ప్రైవేట్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో బీ కేటగిరీలోని 35 శాతం సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కేలా వైద్య ఆరోగ్యశాఖ ఇటీవల అడ్మిషన్ల నిబంధనలు సవరించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే లభిస్తున్నాయి. రాష్ట్రంలో 20 నాన్ మైనార్టీ కాలేజీల్లో 3,200 సీట్లు ఉండగా ఇందులో బీ కేటగిరీ కింద 1,120 సీట్లు ఉన్నాయి. ఇప్పటివరకు వీటికి అన్ని రాష్ట్రాల విద్యార్థులు అర్హులుగా ఉన్నారు. తాజా సవరణతో బీ కేటగిరీలోని 85 శాతం సీట్లు అంటే 952 సీట్లు ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థుల కోసం కేటాయిస్తారు. మిగతా 15 శాతం సీట్ల(168)కు మాత్రమే ఓపెన్ కోటాలో ఇతర రాష్ట్ర విద్యార్థులు పోటీ పడతారు. ఓపెన్ కోటా కాబట్టి ఇందులో తెలంగాణ విద్యార్థులకూ అవకాశం ఉంటుంది. అలాగే 4 మైనార్టీ కాలేజీల్లో 25 శాతం బీ కేటగిరీ కింద ఇప్పటివరకు 137 సీట్లు ఉన్నాయి. తాజా సవరణతో ఇందులోనూ 85 శాతం అంటే 116 సీట్లు ఇక్కడి వారికే దక్కుతున్నాయి. ఇప్పటివరకు లోకల్ కోటా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువగా ఇక్కడి కాలేజీల్లో చేరేవారు. తద్వారా తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగేది. మన విద్యార్థులు ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడి విద్యార్థులకు సీటు రావడంతోపాటు తక్కువ మార్కులొచ్చిన వారూ సీట్లు పొందే వెసులుబాటు వచ్చింది. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఓపెన్ కోటా విధానమే లేదు. గతేడాది నుంచి అన్ని సీట్లు ఆయా రాష్ట్రాల విద్యార్థులకే దక్కేలా నిబంధనల్లో మార్పులు చేశారు. దీంతో మన విద్యార్థులు అక్కడ కూడా సీటు పొందే అర్హత ఉండేది కాదు. కానీ ఇప్పుడు స్థానిక కోటా తేవడంతో పరిస్థితి మారిందని తెలంగాణ ఎంబీబీఎస్ బీ కేటగిరీ సీట్ల స్థానిక సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రవిప్రసాద్ పేర్కొన్నారు. కటాఫ్ కూడా మారిందన్నారు. కటాఫ్ తగ్గుతుంది బీ కేటగిరీ సీట్లలో రాష్ట్ర విద్యార్థులకు 85 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల కటాఫ్ మార్కులు గతంతో పోలిస్తే తగ్గుతున్న మాట వాస్తవమే. ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా చాలా తక్కువగా దరఖాస్తు చేయడంవల్ల ఈ పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు బీ కేటగిరీ సీట్లకు ఇంకా రెండు విడతల కౌన్సెలింగ్ ఉన్నందున ఎంతమేరకు కటాఫ్ తగ్గే అవకాశాలున్నాయో ఇంకా స్పష్టత రాలేదు. – డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ -
విహారంలో విషాదం.. అమెరికాలో ఈతకు వెళ్లి వైద్య విద్యార్థి మృతి
తాండూరు: అమెరికాలోని మిస్సౌరిలో వైద్యవిద్య అ భ్యసిస్తున్న తాండూరు విద్యార్థి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన అపెక్స్ ఆస్పత్రి యజమాని వెంకటేశం, జ్యోతి దంపతుల రెండో కుమారుడు శివదత్తు (25) వైద్య విద్యను అభ్యసించేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు. శివదత్తు సెయింట్ లూయిస్ వర్సిటీలో డెంటల్ ఎంఎస్ విద్య అభ్యసిస్తున్నాడు. శనివారం దత్తు స్నేహితుడితో కలిసి ఓజార్క్ సరస్సుకు వెళ్లాడు. సరస్సులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు ఇద్దరూ మునిగిపోయారు. విషయం తెలిసి మృతుని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. (చదవండి: దంత ఆరోగ్యంపై తలసరి ఖర్చు 4 రూపాయలే!)