( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: ప్రైవేటు వైద్య కాలేజీల్లో పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నెలవారీ స్టయిఫండ్ ఇవ్వలేమంటే కుదరదని వైద్య ఆరోగ్యశాఖ తేల్చి చెప్పింది. కొన్ని నెలల క్రితం ప్రైవేటు వైద్య కళాశాలల అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ ఇచ్చింది. ఈ లేఖలో.. తమకు వైద్యకాలేజీల నిర్వహణ భారం పెరిగిందని, ఈ నేపథ్యంలో పీజీ చదువుకుంటున్న వారికి స్టయిఫండ్ కింద నిధులు చెల్లించలేమని, దీనిపై ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
కొన్ని నెలలుగా ఈ ఫైలు పెండింగ్‌లో ఉందంటూ ప్రైవేటు వైద్యకాలేజీల యాజమాన్యాలు స్టయిఫండ్ చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు యాజమాన్యాల లేఖను వైద్య ఆరోగ్యశాఖ తిరస్కరించింది. ప్రభుత్వ కాలేజీల్లో స్టయిఫండ్ ఎలా ఇస్తున్నామో, ప్రైవేటులోనూ అంతేనని, దీన్ని ఇవ్వలేమని చెప్పడం కుదరదని స్పష్టం చేసింది. వ్యయ నిర్వహణకు సంబంధించిన ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చిన నివేదికను అనుసరించే ఫీ రెగ్యులేటరీ కమిటీ స్టయిఫండ్ ఇవ్వాలని నిర్ణయించిందని, దీన్ని ఇప్పుడు కాదనేందుకు లేదని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment