PG student
-
ఉన్నత చదువు ఆశ తీరక..
ఫర్టిలైజర్ సిటీ(రామగుండం): ఉన్నత చదువులు చదువుదామని ఆశపడిన యువతి కుటుంబ ఆర్థిక పరిస్థితులతో మనస్తాపం చెంది ఉరేసుకుని తనువు చాలించింది. వివరాలిలా ఉన్నాయి. ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ ప్రగతినగర్‌కు చెందిన ఆషాడపు కొమురయ్యకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమార్తె ఆషాడపు రమ్య(22) పీజీ వరకు విద్యనభ్యసించింది.ఇంకా ఉన్నత చదువులు చదువుకుందామని ఆశపడింది. తాను చదువుకుంటానని ఇంట్లో తెలిపింది. అయితే, ఆర్థిక పరిస్థితులతో ఉన్నత చదువులు చదవలేకపోతున్నానని మనస్తాపం చెంది శుక్రవారం ఇంట్లో ఉరేసుకుని మృతి చెందింది. మృతురాలి తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై సతీశ్ కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రమ్య మృతితో ప్రగతినగర్ కాలనిలో విషాదం అలముకుంది. -
సీబీఐ దర్యాప్తే సరైంది!
దేశవ్యాప్తంగా వైద్యవర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రగిల్చిన కోల్‌కతా వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రి ఉదంతంపై సీబీఐ దర్యాప్తునకు కోల్‌కతా హైకోర్టు మంగళవారం ఆదేశాలివ్వటం అన్ని విధాలా సబబైనది. జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్న పీజీ విద్యార్థిని మొన్న శుక్రవారం వేకువ జామున ఒక దుండగుడి అఘాయిత్యానికి బలైంది. ఈ కేసు విషయంలో గత అయిదురోజులుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో సందేహాలు తీర్చకపోగా... మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. దుండగుడిని అరెస్టు చేశామంటున్న పోలీసుల ప్రకటనపై అటు మెడికో కుటుంబ సభ్యులు, ఇటు వైద్య విద్యార్థులు, సిబ్బంది సంతృప్తి చెందలేదు. హత్య, అత్యాచారం ఉదంతంలో కచ్చితంగా ఇతరుల ప్రమేయం ఉందని మొత్తుకున్నారు. కానీ పోలీసులు పట్టనట్టే ఉన్నారు. అసలు ఆస్పత్రి పాలకవర్గం, లేదా ప్రిన్సిపాల్ ఇంతవరకూ ఈ ఉదంతంలో ఫిర్యాదు దాఖలు చేయలేదు. కనీసం వారిని పిలిచి ప్రశ్నించినవారూ లేరు. ఆరు రోజుల్లో... అంటే వచ్చే ఆదివారంలోగా నిగ్గు తేల్చకపోతే కేసును సీబీఐకి అప్పగిస్తానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చ రించారు. కానీ హైకోర్టు భిన్నంగా ఆలోచించింది. ఇందులో జాప్యం జరిగినకొద్దీ సాక్ష్యాధారాలు మాయమవుతాయని, దోషులు తప్పించుకునే అవకాశం ఉన్నదని భావించింది.కొన్ని నేరాలు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తాయి. మనుషులుగా అసలు మన ఉనికిపైనే సందేహం రేకెత్తిస్తాయి. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఉదంతం అటువంటిదే! ప్రజలంతా ఉద్యమించిన పర్యవసానంగా ఆ విషయంలో నాటి కేంద్ర ప్రభుత్వం చురుగ్గా కదిలి కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది. నేరగాళ్లకు ఉరితో సహా కఠినశిక్షలు అమలుచేసింది. కానీ ఆ తర్వాత కూడా నేరాలు తగ్గలేదు. దీనికి కారణం కేవలం ప్రభుత్వాల అలసత్వం మాత్రమే! నేరగాళ్లను వెనువెంటనే శిక్షించేలా పకడ్బందీ దర్యాప్తు జరగకపోవటం అన్ని చోట్లా కనబడుతోంది. కేవలం చట్టాలు మాత్రమే సరిపోవనీ, వాటిపై అవగాహన కల్పించి, ఆపత్కాలంలో మహిళలు తక్షణం ఆశ్రయించే సదుపాయం అమల్లోకి తేవాలని ప్రభుత్వాలు అను కోలేదు. తెలంగాణలో షీ టీమ్స్ అయినా, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన దిశ యాప్, దిశ చట్టమైనా మహిళలకు ఎంతో తోడ్పాటుగా నిలిచాయి. ముఖ్యంగా ఏపీలో దిశ యాప్ వల్ల నేరాలను నివారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కోల్‌కతా ఆస్పత్రిలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకపక్క దేశవ్యాప్తంగా లైంగిక నేరాలు పెరిగాయని తెలుస్తూనే ఉన్నా మహిళా సిబ్బంది భద్రతకూ, రక్షణకూ ఆస్పత్రి ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అక్కడి పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. నేరగాడు సంజయ్ రాయ్ పోలీస్ వలంటీర్‌గా ఉంటూ ఆస్పత్రిలో ఎక్కడికైనా యథేచ్ఛగా వెళ్తాడని అందరూ చెబుతున్న మాట. ఆఖరికి మహిళా వైద్య సిబ్బంది విశ్రాంతి తీసుకునే ప్రాంతానికి కూడా నిశిరాత్రి అతగాడు వెళ్లగలిగాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ జూనియర్ డాక్టర్ 36 గంటలు అవిశ్రాంతంగా రోగులకు సేవలందించి అలసి నిదిరిస్తున్న వేళ నేరగాడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తోటి సిబ్బంది అంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు జరిగినప్పుడు సేవలందించటానికి నమోదు చేసుకున్న నేరగాడికి ఆస్పత్రిలో సంచరించే స్వేచ్ఛ ఎవరిచ్చారో తేలాల్సివుంది. గర్భిణి అయిన భార్యను హింసించిన ఉదంతంలో వచ్చిన ఫిర్యాదుపై రెండేళ్లుగా పోలీసులు పట్టించుకోలేదంటే అతగాడి పలుకుబడిని అంచనావేయొచ్చు. అప్పుడే చర్య తీసుకుంటే ఈ ఘోరం జరిగేదా? తమ కుటుంబాల్లో వైద్య అవస రాలున్నప్పుడల్లా ఆస్పత్రిలో అన్నీ అందేలా చూస్తున్నాడన్న ఏకైక కారణంతో పోలీసులు అతడిని చూసీచూడనట్టు వదిలేశారని చాలామంది చెబుతున్న మాట. తాము తీసుకున్న వలంటీర్ల నడవడి ఎలావుంటున్నదో, వారిని కొనసాగించాలో లేదో సమీక్షించుకునే సంస్కృతి లేకపోవటం ఎటువంటి ఘోరాలకూ, నేరాలకూ దారితీస్తుందో అంచనా వేయలేనంత స్థితిలో పోలీసులుండటం ఆశ్చర్య కరం. నిజానికి లోతైన దర్యాప్తు జరిగితే తమ లోపాలు కూడా బయటపడతాయన్న ఏకైక కారణంతోనే గత అయిదురోజులుగా కోల్‌కతా పోలీసులు దర్యాప్తు డ్రామా కొనసాగిస్తున్నారనుకోవాలి. చదువు పూర్తయ్యాక ఇతర రంగాల్లో వెనువెంటనే స్థిరపడే అవకాశం ఉన్నా దాన్ని కాదనుకుని పలువురు విద్యార్థులు ఎన్నో సవాళ్లతో కూడిన, దీర్ఘకాలం పట్టే వైద్యవిద్యకు మొగ్గుచూపుతారు. సమాజం పట్లా, మనుషుల పట్లా ఎంతో సేవాభావం, ప్రేమ ఉంటే తప్ప ఇది సాధ్యంకాదు. కానీ అలాంటివారికి ఆ రంగంలో సరైన గౌరవ మర్యాదలు లభిస్తున్నాయా? వారి భద్రతకు సక్రమమైన చర్యలు తీసుకుంటున్నారా? ఈ విషయంలో జూనియర్ డాక్టర్లు తరచు చెప్పే అంశాలు అంత సంతృప్తికరంగా లేవు. వారి శ్రమకు తగ్గ వేతనాలు అందవు. అవి కూడా నిర్దిష్ట సమయానికి రాని దుఃస్థితి చాలాచోట్ల ఉంటున్నది. వేళకాని వేళల్లో సైతం అవిశ్రాంతంగా పనిచేసేవారికి కనీసం కాసే పయినా భద్రంగా నిద్రపోయే సౌకర్యం ఆస్పత్రి పాలకవర్గం కల్పించలేకపోయిందంటే, ఆ విష యంలో సీనియర్లు శ్రద్ధ పెట్టలేదంటే ఏమనుకోవాలి? పెత్తనం చలాయించటానికి ఉబలాటపడే వారు తాము కూడా ఒకప్పుడు జూనియర్లమనీ, వారిని కంటికి రెప్పలా చూసుకోవాలనీ భావించక పోవటం విషాదం. సహ సిబ్బంది పట్లా, వారి దురవస్థలపట్లా సహానుభూతి లేనివారి వల్లే ఇలాంటి దురంతాలు చోటు చేసుకుంటున్నాయి. కోల్‌కతా ఆస్పత్రి ఉదంతమైనా అటువంటి వారి కళ్లు తెరిపించాలి. వైద్యసిబ్బంది రక్షణకూ, భద్రతకూ దేశవ్యాప్తంగా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. -
లారీ ఢీకొని పీజీ విద్యార్థిని మృతి
పెనుమంట్ర: పెనుగొండ రోడ్డులోని నెగ్గిపూడి లాకుల సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవగానుగుల గీతావాణి(23) మృతిచెందింది. మార్టేరు శివరావుపేటకు చెందిన గీతావాణి పరీక్షలు రాసేందుకు స్కూటర్‌పై పెనుగొండ వెళ్తుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గీతావాణికి వేలివెన్నుకు చెందిన వెంకటేశ్వరరావుతో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఎంబీఏ చదువుతున్న గీతావాణి పరీక్షలు రాసేందుకు వారం రోజుల క్రితం పుట్టింటికి వచ్చి పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలలో పరీక్షలు రాస్తోంది. భర్త వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ రజనీ కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు పెనుమంట్ర ఇన్చార్జి ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. -
రూ.46 కోట్లు కట్టు! పీజీ విద్యార్థికి ఐటీ నోటీసు
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రమోద్ దండోతియా(25) అనే పీజీ విద్యార్థి ఏకంగా రూ.46 కోట్ల ఆదాయ పన్ను నోటీసు అందుకున్నాడు! దాంతో షాకై పోలీసులను ఆశ్రయించాడు. తన పాన్ కార్డు వివరాల ద్వారా ఎవరో ఢిల్లీ, ఫుణేల్లో తన పేరిట ఓ కంపెనీని సృష్టించి ఈ లావాదేవీలు జరిపినట్లు ఐటీ, జీఎస్టీ అధికారుల ద్వారా తెలిసిందని బాధితుడు చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారతనికి సూచించారు. ఐటీ నోటీసులు, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ప్రమోద్‌కు చెప్పినట్టు ఏఎస్పీ షియాజ్ తెలిపారు. దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. -
సైఫ్ రిమాండ్ రిపోర్ట్ లో పలు కీలక అంశాలు
-
ప్రీతి బ్రెయిన్‌డెడ్!.. నిమ్స్ వద్ద భారీగా పోలీసులు
సాక్షి, హైదరాబాద్: కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని ఇవాళ(ఆదివారం) మధ్యాహ్నం నిమ్స్ వైద్యులు బులిటెన్ విడుదల చేశారు. ర్యాంగింగ్ పెనుభూతంతో వణికిపోయిన ఆమె.. ఆత్మహత్యాయత్నం చేయడం, గత ఐదురోజులుగా నగరంలోని నిమ్స్‌లో ఆమె చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం సాయంత్రం ప్రీతి తండ్రి నరేందర్ ఆమె ఆరోగ్య స్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రీతి బ్రెయిడ్ డెడ్ అయ్యిందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటివరకు కొంత ఆశ ఉండేది. కానీ, ఆమె బ్రతికే అవకాశం లేదని వైద్యులు తేల్చారు. ఆశలు వదిలేసుకున్నాం ఆయన మీడియా సాక్షిగా తెలిపారు. ‘‘ప్రీతిని సైఫే హత్య చేశాడు. సైఫ్‌ను కఠినంగా శిక్షించాలి. ఈ ఇష్యూను హెచ్‌వోడీ సరిగా హ్యాండిల్ చేయలేదు. ప్రీతి జోలికి రాకుండా సైఫ్‌ను నియంత్రించలేకపోయారు. సరికదా.. ఘటన తర్వాత కూడా మాకు టైంకి సమాచారం అందించలేదు. ప్రీతి మొబైల్లో వాళ్లకు కావాల్సినట్లుగా సాక్ష్యాలు క్రియేట్ చేసుకున్నారు. ఇది ముమ్మాటికీ హత్యే. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల’’ని డిమాండ్ చేశారాయన. కాసేపట్లో ప్రీతి హెల్త్ బులిటెన్‌పై నిమ్స్ వైద్యులు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని నిమ్స్ డైరెక్టర్, పోలీసులకు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు సిబ్బంది భారీగా మోహరించారు. అంతకు ముందు మంత్రి ఎర్రబెల్లి సైతం ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమే! అని ప్రకటించారు. ప్రీతి ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని ప్రకటించారాయన. ఇక ప్రీతి ఘటన బాధాకరమన్న మంత్రి.. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. -
తల్లితో ప్రీతి మాట్లాడిన ఆడియో కాల్ కలకలం
-
ఇంకా విషమంగానే ఎంజీఎం మెడికో ప్రీతి ఆరోగ్యం
-
సైఫ్ ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
-
అత్యంత విషమంగానే ప్రీతి ఆరోగ్యం
-
సీనియర్ల వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యా యత్నం : తండ్రి నరేందర్
-
వరంగల్ మెడికల్ పీజీ స్టూడెంట్ ప్రీతి పరిస్థితి అత్యంత విషమం
-
PG Student Preethi: అతడి వల్లే ప్రీతి ఆత్మహత్యాయత్నం!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. కాగా, ప్రీతి ఆరోగ్యం మరింత విషమించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. మత్తు ఇంజక్షన్ వల్లే ప్రీతి అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ ఘటనపై ప్రీతి తండ్రి నరేందర్ స్పందించారు. నరేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రీతి నవంబర్‌లో పీజీ కాలేజీలో జాయిన్ అయ్యింది. డిసెంబర్ నుంచి సైఫ్ అనే సీనియర్ విద్యార్థి ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ప్రీతి ఈ విషయం మాకు చెబితే ధైర్యం చెప్పాము. స్థానికంగా అధికారులు, పోలీసులకు సమాచారం కూడా ఇచ్చాము. ఈ విషయం యూనివర్సిటీ అధికారులకు తెలియడంతో పోలీసు కంప్లెంట్ ఎందుకు ఇచ్చారని వారు మందలించారు. అయితే, ఈ రోజు ఉదయం ప్రీతి ఫోన్ నుంచి తన ఫ్రెండ్ కాల్ చేసి.. ప్రీతి కళ్లు తిరిగి పడిపోయిందని చెప్పారు. వెంటనే మేమంతా ఆసుపత్రికి వెళ్లాము. అప్పటికే కాలేజీ ప్రిన్సిపాల్, అధికారులందరూ అక్కడికి వచ్చారు. ప్రీతి కరోనా సమయంలో కూడా ప్రాణాలు లెక్కచేయకుండా ధైర్యంగా సేవ చేసింది. చదువుల్లో మెరిట్ స్టూడెంట్. ఇలా ఆత్మహత్యాయత్నం చేసిందంటే మాకు చెప్పని విధంగా ఇంకా ఎన్ని రకాలుగా హింసించాడో తెలియడం లేదు. వెంటనే సైఫ్‌ను కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగానే ప్రతీ తమ్ముడు పృధ్వీ కూడా ఈ ఘటనపై కీలక విషయాలు వెల్లడించారు. పృధ్వీ మీడియాతో మాట్లాడుతూ.. ‘సీనియర్ల వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సీనియర్ల వేధింపులపై ఫిర్యాదు చేసినా మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. ఇంజక్షన్‌తో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రస్తుతం ప్రీతి కోమాలో ఉంది. సైఫ్.. పేషంట్స్ ముందే డ్యూటీలో నోటికి వచ్చినట్టు మాట్లాడటం, తిట్టడం చేసేవాడు. ఎక్స్ట్రా డ్యూటీలు చేసి కావాలనే టార్చర్ చేసేవాడు. నిన్న రాత్రి నాతో మాట్లాడినప్పుడు అంతా నార్మల్‌గా ఉంది అన్నట్టుగానే మాట్లాడింది. కానీ, ఇలా చేస్తుందనుకోలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు.. ఇప్పటికే వేధింపులకు గురిచేసిన వైద్య విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. సీనియర్ వైద్య విద్యార్థిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు వేధింపుల కేసు నమోదైంది. సీనియర్ విద్యార్థి సైఫ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. -
స్టయిఫండ్ ఇవ్వలేమంటే కుదరదు: ఏపీ వైద్య ఆరోగ్యశాఖ
సాక్షి, అమరావతి: ప్రైవేటు వైద్య కాలేజీల్లో పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నెలవారీ స్టయిఫండ్ ఇవ్వలేమంటే కుదరదని వైద్య ఆరోగ్యశాఖ తేల్చి చెప్పింది. కొన్ని నెలల క్రితం ప్రైవేటు వైద్య కళాశాలల అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ ఇచ్చింది. ఈ లేఖలో.. తమకు వైద్యకాలేజీల నిర్వహణ భారం పెరిగిందని, ఈ నేపథ్యంలో పీజీ చదువుకుంటున్న వారికి స్టయిఫండ్ కింద నిధులు చెల్లించలేమని, దీనిపై ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరింది. కొన్ని నెలలుగా ఈ ఫైలు పెండింగ్‌లో ఉందంటూ ప్రైవేటు వైద్యకాలేజీల యాజమాన్యాలు స్టయిఫండ్ చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు యాజమాన్యాల లేఖను వైద్య ఆరోగ్యశాఖ తిరస్కరించింది. ప్రభుత్వ కాలేజీల్లో స్టయిఫండ్ ఎలా ఇస్తున్నామో, ప్రైవేటులోనూ అంతేనని, దీన్ని ఇవ్వలేమని చెప్పడం కుదరదని స్పష్టం చేసింది. వ్యయ నిర్వహణకు సంబంధించిన ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చిన నివేదికను అనుసరించే ఫీ రెగ్యులేటరీ కమిటీ స్టయిఫండ్ ఇవ్వాలని నిర్ణయించిందని, దీన్ని ఇప్పుడు కాదనేందుకు లేదని చెప్పింది. చదవండి: విజయవాడలో అరుదైన పిల్లి హల్చల్.. ఎలా వచ్చింది? -
ప్రేమించిన యువతితో పెళ్లి వద్దన్నారని..
సాక్షి, హైదరాబాద్ (సైదాబాద్): ప్రేమించిన యువతితో పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఓ యువకుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సైదాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ రామ్‌లాల్ నాయక్ తెలిపిన వివరాలు.. మాధవనగర్‌లో నివసించే జి.నాగేశ్వర్ కుమారుడు ప్రజ్వల్ (28) ఎంబీఏ చదువుతున్నాడు. తాను ప్రేమించిన యువతితో పెళ్లి చేయమని ఇంట్లో తల్లిదండ్రులను కోరాడు. అయితే తండ్రి ఇప్పుడు కాదు తర్వాత చూద్దామని చెప్పడంతో అలిగిన ప్రజ్వల్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కుమారుని గురించి బంధు మిత్రుల దగ్గర విచారించినా ఫలితం లేకపోవటంతో తండ్రి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రజ్వల్ గతంలోనూ ఇలా ఇంటి నుంచి అలిగివెళ్లి తిరిగివచ్చాడని ఫిర్యాదులు పేర్కొన్నాడు. సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ( చదవండి: పెళ్లి చేసుకుంటావా.. లేదా అంటూ యువతిని నడిరోడ్డుపై ) -
తిరుపతి రుయా ఆస్పత్రిలో కీచకపర్వం
-
రుయాలో కీచక పర్వం: గవర్నర్‌కు నివేదిక
సాక్షి, తిరుపతి: తిరుపతిలోని రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో కీచకపర్వం పై ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రమణయ్య స్పందించారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. లైంగిక వైధింపులపై ఎస్వీ మెడికల్ కళాశాల పీడియాట్రిక్ పీజీ ఫైనలియర్ విద్యార్థిని ఫిర్యాదు చేసిన మాట వాస్తవేనన్నారు. తనను ముగ్గురు ప్రొఫెసర్లు లైంగికంగా వేధిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలంటూ గవర్నర్‌కు ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దీనిపై స్పందించిన గవర్నర్... విచారణ చేపట్టాల్సిందిగా హెల్త్ యూనివర్సిటీ వీసీకి ఆదేశాలు జారీ చేశారన్నారు. దీంతో వర్సిటీ వీసీ ఆదేశాల మేరకు విచారణ చేశామని ఆయన తెలిపారు. రేపు ఈ ఘటనపై నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. కాగా, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ రవికుమార్, ప్రొఫెసర్ కిరీటి, ప్రొఫెసర్ శశికుమార్‌లు తన పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని బాధితురాలు గవర్నర్‌కు పంపిన లేఖలో పేర్కొంది. ప్రతిరోజు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, అభ్యంతరకర పదాలతో హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రాక్టికల్ పరీక్షలు వారి చేతుల్లో ఉన్నాయని వేధిస్తున్నారని ఆరోపించింది. ఓ పాపకు తల్లినైన తాను వారి బాధలు భరించలేక ఓ సారి ఆత్మహత్యకు యత్నించగా, తన భర్త కాపాడినట్లు వివరించింది. పలుమార్లు ఎస్వీ మెడికల్ కళాశాల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. దీనిపై స్పందించిన గవర్నర్... లైంగిక వేధింపులపై విచారణ చేపట్టాలని హెల్త్ వర్సిటీ వీసీని ఆదేశించారు. రుయాఆస్పత్రి అనస్థీషియా విభాగాధిపతి జమున, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జయా భాస్కర్, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్‌లతో విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ 4 రోజులుగా అత్యంత గోప్యంగా విచారణ చేపట్టింది. -
రుయాలో కీచక వైద్యులు
తిరుపతి (అలిపిరి): రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో కీచకపర్వం వెలుగుచూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే లైంగిక వేధింపులకు దిగారు. వారి వేధింపులు భరించలేని ఎస్వీ మెడికల్ కళాశాల పీడియాట్రిక్ పీజీ ఫైనలియర్ విద్యార్థిని ఇటీవల గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. తనకు రక్షణ కల్పించాలంటూ ఈ మెయిల్ ద్వారా మొరపెట్టుకుంది. దీనిపై స్పందించిన గవర్నర్... విచారణ చేపట్టాల్సిందిగా హెల్త్ యూనివర్సిటీ వీసీకి ఆదేశాలు జారీ చేశారు. పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ రవికుమార్, ప్రొఫెసర్ కిరీటి, ప్రొఫెసర్ శశికుమార్‌లు తన పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని బాధితురాలు లేఖలో పేర్కొంది. ప్రతిరోజు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, అభ్యంతరకర పదాలతో హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రాక్టికల్ పరీక్షలు వారి చేతుల్లో ఉన్నాయని వేధిస్తున్నారని ఆరోపించింది. ఓ పాపకు తల్లినైన తాను వారి బాధలు భరించలేక ఓ సారి ఆత్మహత్యకు యత్నించగా, తన భర్త కాపాడినట్లు వివరించింది. పలుమార్లు ఎస్వీ మెడికల్ కళాశాల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. దీనిపై స్పందించిన గవర్నర్... లైంగిక వేధింపులపై విచారణ చేపట్టాలని హెల్త్ వర్సిటీ వీసీని ఆదేశించారు. రుయాఆస్పత్రి అనస్థీషియా విభాగాధిపతి జమున, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జయా భాస్కర్, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్‌లతో విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ 4 రోజులుగా అత్యంత గోప్యంగా విచారణ చేస్తోంది. -
వ్యవసాయ కూలీగా మారిన పోస్ట్ గ్రాడ్యుయేట్
-
దొంగతనం ‘చూసి’ నేర్చుకుంది!
‘బ్యాగ్ దొంగ’గా మారిన పీజీ విద్యార్థిని - ఓ చోరీ చూసి దొంగతనాలు నేర్చుకున్న యువతి - రద్దీ బస్సుల్లో ప్రయాణికులే టార్గెట్ - గత ఆరు నెలల్లో 3 దొంగతనాలు - అరెస్టు చేసిన ఎస్సార్‌నగర్ పోలీసులు హైదరాబాద్: ఆమె పేరు అర్చన.. దూర విద్యా విధానంలో సైకాలజీలో పీజీ చేస్తోంది.. తరచూ సిటీకి వచ్చి వెళ్లే ఈమె ఓ చోరీని చూసి తానూ దొంగగా మారింది.. రద్దీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల్ని టార్గెట్ చేసుకుంది.. వారి బ్యాగుల్లోని విలువైన వస్తువులు, బంగారం తస్కరించేది.. గత ఆరు నెలల్లో మూడు దొంగతనాలు చేసింది.. చివరకు మంగళవారం ఎస్సార్‌నగర్ క్రైమ్ పోలీసులకు చిక్కిందని వెస్ట్‌జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు విలేకరులకు వెల్లడించారు. చోరీ చూసి అదే పని.. మెదక్‌కు చెందిన పి.అర్చన(27) ఉస్మానియా నుంచి దూరవిద్యలో సైకాలజీలో పీజీ చేస్తోంది. కూకట్పల్లి వివేకానంద కాలనీలో నివసించిన ఆమె ఓ ఫిజియోథెరపిస్ట్ వద్ద సహాయకురాలిగా పనిచేసింది. గత కొన్నాళ్లుగా స్వస్థలమైన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో కుటుంబం తో కలసి ఉంటోంది. ఈమె తండ్రి ప్ర భుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా రు. సిటీకి వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న అర్చనను ఓ ‘సీన్’ఆకర్షించింది. ఓ మహిళా దొంగ రద్దీ బస్సులో చోరీ చేయడం చూసి తానూ అదే పని చేయాలని నిర్ణయించుకుంది. తల్లి మందుల కోసం వచ్చి వెళ్తూ.. అర్చన తల్లికి కొన్నాళ్ల క్రితం గుండె జబ్బుకు సంబంధించిన చికిత్స జరిగింది. తల్లికి అవసరమైన మందుల కోసం అర్చన తరచుగా హైదరాబాద్‌కు వచ్చి వెళుతోం ది. ఇలా వచ్చినప్పుడు అదును చిక్కితే ఓ చోరీ చేస్తోం ది. రద్దీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల వెనుక నిల్చునే అర్చన అదును చూసుకుని వారి హ్యాండ్ బ్యాగ్ జిప్ తెరుస్తుంది. అందులోని విలువైన వస్తువులు, పర్సులు, బంగారం తీసుకుని వెంటనే బస్సు దిగిపోతోంది. కూకట్పల్లి–ఈఎస్ఐ, ఈఎస్ఐ–మైత్రీవనం, మైత్రీవనం–పంజగుట్ట మధ్య గత ఆరు నెలల్లో 3 చోరీలు చేసిన అర్చన 51.6 గ్రాముల బంగారం తస్కరించింది. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో.. ఏటీఎం కార్డు పోగొట్టుకున్న బాధితురాలికి.. సీసీ టీవీ దృశ్యాలను చూపించి బస్సులో ఎప్పుడైనా అనుమానితురాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. మంగళవారం అర్చనను బస్సులో చూసిన బాధితురాలు నిలదీసింది. ఓ ఆంటీ కోరడంతో ఏటీఎం కార్డు నుంచి డబ్బు డ్రా చేసి ఇచ్చానని, తనకు సంబంధం లేదని తప్పించుకోవాలని ప్రయత్నించింది. బాధితురాలు ఎస్సార్‌నగర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి అర్చనను అదుపులోకి తీసుకున్నారు. తాను పీజీ విద్యార్థినని, తమది సంప్రదాయ కుటుంబమని, తనపై అనవసరంగా నేరం మోపుతున్నారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి న అర్చన.. వారితో వాగ్వాదానికి దిగింది. పోలీసులు ఆధారాలు చూపడంతో చివరికి నేరం అంగీకరించింది. అర్చనను అరెస్టు చేసిన పోలీసులు.. ఆమె నుంచి 8.6 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో కొంత.. స్నేహితునికి కొంత అర్చనకు ఎలాంటి అలవాట్లు లేవని, జల్సాలు సైతం చేయదని పోలీసులు చెప్తున్నారు. తస్కరించిన సొత్తును విక్రయించగా వచ్చిన సొమ్ములో కొంత ఇంట్లోనే ఇస్తూ.. తాను ఫిజియోథెరపీకి సంబంధించి పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నానంటూ తల్లిదండ్రులను నమ్మించింది. మిగిలిన మొత్తాన్ని ఫిజియోథెరపీ చేస్తున్న సమయంలో పరిచయమైన ఓ స్నేహితునికి ఇస్తున్నట్లు వెల్ల డైంది. అర్చన చేసిన నేరాలకు సంబంధించి ఎస్సార్‌నగర్ ఠాణాలో రెండు, పంజగుట్ట ఠాణాలో ఒక కేసు నమోదయ్యాయి. ఎస్సార్‌నగర్‌లో ఓ మహిళ బ్యాగ్ నుంచి అర్చన తస్కరించిన వాటిలో ఏటీఎం కార్డు సైతం ఉంది. కార్డుతో పాటే పిన్ నంబర్ ఉండటంతో.. మూసాపేటలోని ఓ ఏటీఎం నుంచి రూ.10 వేలు డ్రా చేసింది. ఏటీఎంలోని సీసీ కెమెరా ఫీడ్ ఆధారంగా అనుమానితురాలిని గుర్తించారు. -
కోచింగ్‌కు డబ్బుల్లేక పీజీ విద్యార్థి ఆత్మహత్య
లేపాక్షి: బ్యాంకు పరీక్షల కోచింగ్‌కు వెళ్లేందుకు డబ్బుల్లేక పీజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా లేపాక్షి మండలం శిరివరం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. మృతుడి తండ్రి కథనం ప్రకారం... రామచంద్రప్ప కుమారుడు రఘువర్దన్(23) ఎంకామ్ చ దివాడు. బ్యాంకు ఉద్యోగం కోసం మూడు సార్లు పరీక్షలు రాశారు. కోచింగ్ లేకపోవడం వల్లే ఉద్యోగం రావడంలేదని ఇంట్లో చెప్పేవాడు. పేద కుటుంబం కావడం, ఇటీవల తల్లి చనిపోవడంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో కర్నూలులో బ్యాంకు పరీక్ష రాసి మంగళవారం రాత్రి ఇంటికి వచ్చాడు. అందరూ నిద్రపోతున్న సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రామచంద్రప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
మళ్లీ దద్ధరిల్లిన అసెంబ్లీ
అత్యాచార ఘటనపై ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహజ్వాల పాలక, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం బీజేపీ సభ్యుల వాకౌట్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని ఫ్రేజర్ టౌన్లో పీజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచార సంఘటన శాసన సభను రెండో రోజూ కుదిపేసింది. కేసు దర్యాప్తు జరుగుతున్న తీరుపై ప్రతిపక్ష బీజేపీ ప్రభుత్వాన్ని దులిపేసింది. ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం చోటు చేసుకుంది. బీజేపీ సభ్యుల ధాటికి పాలక పక్షం ఆత్మ రక్షణలో పడింది. ఈ సంఘటనపై జరుగుతున్న దర్యాప్తు తీరును హోం మంత్రి కేజే. జార్జ్ వివరిస్తున్నప్పుడు బీజేపీ సభ్యులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. వారిని నిలువరించడానికి మంత్రులు టీబీ. జయచంద్ర, కృష్ణ బైరేగౌడ, దినేశ్ గుండూరావు ప్రభృతులు చేసిన ప్రయత్నాలతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు గంటన్నర సేపు సభ హోరెత్తింది. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించడం లేదని ఆరోపించారు. బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వస్తున్నా, వారికి రక్షణ కల్పించడం లేదని విమర్శించారు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు ఇంకా సఫలం కాలేదని దెప్పి పొడిచారు. ఇతర బీజేపీ సభ్యులు కూడా ఆయనకు మద్దతుగా మాట్లాడారు. హోం మంత్రి వారి ఆరోపణలను తిప్పి కొడుతూ, తామీ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, చట్ట రీత్యా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మొత్తం సభ తనకు అధికారాన్ని ధారాదత్తం చేస్తే మీరు చెప్పినట్లే చేస్తానని అన్నారు. బీజేపీ సభ్యుడు కేజీ. బోపయ్య మాట్లాడుతూ... ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించినట్లయితే ఇన్స్పెక్టర్ ఇప్పటికే జైలుకు వెళ్లాల్సి ఉండేదని అన్నారు. మరో బీజేపీ సభ్యుడు అరవింద లింబావళి మాట్లాడుతూ తన నియోజక వర్గంలో ఓ బాలికపై లైంగిక దాడి జరిగిందంటూ విబ్‌గ్యార్ స్కూలు సంఘటనను ప్రస్తావించారు. దీనిపై ఇంకా చర్యలు చేపట్టలేదని విమర్శించారు. మీ హయాంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయని, కేవలం ప్రచారం కోసం మాట్లాడవద్దని హోం మంత్రి ప్రత్యుత్తరమిచ్చారు. ప్రభుత్వం ఎవరినీ రక్షించడం లేదని, చట్ట పరంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బాధిత యువతి కుటుంబానికి బెదిరింపు కాల్స్ వచ్చి ఉంటే, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే సందర్భంలో పాలక, ప్రతిపక్ష సభ్యులు పలుసార్లు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవేవీ రికార్డుల్లోకి వెళ్లవని తెలిపారు. అనంతరం మంత్రి ఈ సంఘటనపై సభలో ప్రకటన చేశారు. దీనిపై సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు వాకౌట్ చేశారు. -
నైట్‌లైఫ్ వద్దు
నగరంలో శాంతిభద్రతలు లోపిస్తున్నాయని పోలీసుల ఆందోళన పునరాలోచనలో ప్రభుత్వం బెంగళూరు : నగరంలో నైట్ లైఫ్ విస్తరణకు ఆరు నెలల కిందట అయిష్టంగానే ఒప్పుకున్న పోలీసులు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. గత శుక్రవారం ఓ పీజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరపడంతో తాము భయపడినంతా జరిగిందని సీనియర్ పోలీసు అధికారులు వాపోతున్నారు. నగరంలో సాధారణంగా బార్లు, రెస్టారెంట్లను రాత్రి 11 గంటలకు మూసివేసే వారు. అయితే నగరంలో నైట్ లైఫ్ అనేదే లేకుండా పోయిందని, దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా నైట్ లైఫ్ ఉందని పలువురు వాదిస్తూ వచ్చారు. తర్జన భర్జన అనంతరం గత డిసెంబరులో ప్రభుత్వం నైట్ లైఫ్‌కు అనుమతినిచ్చింది. దీని ప్రకారం...బార్లు, మద్యం షాపులు శుక్ర, శనివారాల్లో రాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచుతారు. రెస్టారెంట్లు, హోటళ్లు వారమంతా ఒంటి గంట వరకు వ్యాపారం చేసుకునే అవకాశాలున్నాయి. బార్లు, మద్యం షాపులను రాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం వద్ద పోలీసు శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది, సుదీర్ఘ మంతనాల అనంతరం ఆరు నెలల ప్రయోగాత్మక నైట్ లైఫ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గత జూన్‌లో మరో ఏడాదికి విస్తరించింది. పీజీ విద్యార్థినిపై శుక్రవారం అర్ధ రాత్రి దాటాక సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కాకపోయినా రానున్న రోజుల్లో నైట్ లైఫ్‌కు మంగళం పాడేలా ప్రభుత్వాన్ని ఒప్పించాలని సీనియర్ పోలీసు అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. మరో వైపు ప్రభుత్వం కూడా నైట్ లైఫ్‌పై తన నిర్ణయం సమంజసమేనా అన్న పునరాలోచనలో పడింది. ప్రధానంగా సిబ్బంది కొరత కారణంగా నైట్ లైఫ్‌ను పోలీసు అధికారులు వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే ప్రభుత్వ ఆదేశాల కారణంగా హోం గార్డులతో శాంతి భద్రతలను పర్యవేక్షించాలని నిర్ణయించారు. సున్నితమైన చోట్ల హోం గార్డులకు తోడు పోలీసులను కూడా నియమిస్తున్నారు. వద్దు...మహాప్రభో నైట్ లైఫ్‌ను కొనసాగిస్తే తమ పనై పోతుందని నగర పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సిబ్బంది కొరత ఉన్నందున, వివిధ పోలీసు స్టేషన్లలో పని చేస్తున్న వారిని వీకెండ్ సందర్భాల్లో బార్ అండ్ రెస్టారెంట్ల వద్ద భద్ర త కోసం నియమిస్తున్నామని బెంగళూరు నగర అదనపు పోలీసు కమిషనర్ కమల్ పంత్ చెబుతున్నారు. బెంగళూరులో 40కి పైగా యువతులు పని చేసే బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వారికి ఆయా యాజమాన్యాలు ప్రైవేట్ భద్రతను కల్పిస్తున్నాయి. మద్యం మత్తులో ఎవరు, ఏ క్షణంలో ఎలా ప్రవరిస్తారో తెలియదు కదా...అనేది పోలీసుల అభిప్రాయం అప్పుడే వారించిన కమిషనర్ నగరంలో నైట్ లైఫ్ వల్ల లేని పోని సమస్యలు వస్తాయని గతంలో నగర పోలీసు అధికారిగా పని చేసిన నీలం అచ్చుతరావు హెచ్చరించారు. తన హయాంలో నైట్ లైఫ్‌ను ప్రవేశ పెట్టడానికి జరిగిన ప్రయత్నాలన్నిటినీ ఆయన అడ్డుకున్నారు. బార్లలో యువతలు, పాటలకు అనుగుణంగా డ్యాన్స్ చేసే ‘లైవ్ బ్యాండ్’ను కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకానొక సందర్భంలో ఆయనపై ఒత్తిడి వచ్చినప్పుడు, తనను బదిలీ చేసి వాటిని ప్రవేశ పెట్టవచ్చని కరాఖండిగా చెప్పారు. తదుపరి కమిషనర్ శంకరి బిదరి సైతం నైట్ లైఫ్ వల్ల నగరంలో ఏర్పడే దుష్పరిణామాలను వివరిస్తూ, అది వద్దే వద్దని పట్టుబట్టారు. -
బెంగళూరులో పీజీ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్
నిందితుల్లో ఒకరి అరెస్టు బెంగళూరు: కామాంధులు ఓ పీజీ విద్యార్థిని(22)పై కారులో సామూహిక అత్యాచారానికి తెగబడిన ఘటన మంగళవారం బెంగళూరులో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫ్రేజర్ టౌన్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసముంటున్న విద్యార్థిని, శుక్రవారం రాత్రి తను నివసించే అపార్ట్మెంట్ ముందు కారులో కూర్చొని స్నేహితుడితో మాట్లాడుతోంది. ఆరుగురు ఆగంతకులు కారులో హఠాత్తుగా అక్కడకు చేరుకుని వీరిద్దరినీ బెదిరించి తాము వచ్చిన కారులోకి బలవంతంగా ఎక్కించుకుని తీసుకుపోయారు. కాక్స్‌టౌన్ సమీపంలోని రైలు పట్టాల దగ్గర్లో కారు ఆపి ఇద్దరు దుండగులు యువతి స్నేహితుడి గొంతు మీద కత్తుల పెట్టి చంపేస్తామని బెదిదించారు. మిగిలిన నలుగురు ఆగంతకులు కారులోనే యువతి మీద అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత రూ.50 వేలు ఇస్తేనే ఇద్దరినీ వదిలి పెడతామని బెదిరించారు. చివరికి యువతి స్నేహితుడి పర్సును లాక్కుని పారిపోయారు.సోమవారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఆచూకీమేరకు ఆగంతకుల్లో ఒకరైన హైదర్ నజీర్‌ను పోలీసులు అరెస్టుచేశారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఆగంతకుల కోసం గాలిస్తున్నారు. నిందితులకు చెందిన స్కోడా కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.