నిందితుల్లో ఒకరి అరెస్టు
బెంగళూరు: కామాంధులు ఓ పీజీ విద్యార్థిని(22)పై కారులో సామూహిక అత్యాచారానికి తెగబడిన ఘటన మంగళవారం బెంగళూరులో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫ్రేజర్ టౌన్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న విద్యార్థిని, శుక్రవారం రాత్రి తను నివసించే అపార్ట్‌మెంట్ ముందు కారులో కూర్చొని స్నేహితుడితో మాట్లాడుతోంది. ఆరుగురు ఆగంతకులు కారులో హఠాత్తుగా అక్కడకు చేరుకుని వీరిద్దరినీ బెదిరించి తాము వచ్చిన కారులోకి బలవంతంగా ఎక్కించుకుని తీసుకుపోయారు. కాక్స్‌టౌన్ సమీపంలోని రైలు పట్టాల దగ్గర్లో కారు ఆపి ఇద్దరు దుండగులు యువతి స్నేహితుడి గొంతు మీద కత్తుల పెట్టి చంపేస్తామని బెదిదించారు.
మిగిలిన నలుగురు ఆగంతకులు కారులోనే యువతి మీద అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత రూ.50 వేలు ఇస్తేనే ఇద్దరినీ వదిలి పెడతామని బెదిరించారు. చివరికి యువతి స్నేహితుడి పర్సును లాక్కుని పారిపోయారు.సోమవారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఆచూకీమేరకు ఆగంతకుల్లో ఒకరైన హైదర్ నజీర్‌ను పోలీసులు అరెస్టుచేశారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఆగంతకుల కోసం గాలిస్తున్నారు. నిందితులకు చెందిన స్కోడా కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
బెంగళూరులో పీజీ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్
Published Wed, Jul 16 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 10:20 AM
Advertisement
Advertisement