mass rape
-
యూపీలో ‘ఉన్నావ్’ వేడి!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఇటీవల యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఆయన భార్య మద్దతుగా నిలిచింది. నిజానిజాలు తెలియాలంటే తన భర్తకు, బాధితురాలకి నార్కో పరీక్షలు నిర్వహించడంతో పాటు కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది. అంత్యక్రియలు నిర్వహించకుంటే బాధితురాలి తండ్రి మృతదేహాన్ని భద్రపరచాలని అలహాబాద్ హైకోర్టు యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు, చనిపోయే ముందు ఎమ్మెల్యే మనుషులు యువతి తండ్రిని కొడుతున్న వీడియో ఒకటి వెలుగుచూసింది. ఉన్నావ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం, ఆ వెంటే ఆమె తండ్రి కస్టడీలోనే మృతిచెందడం అత్యంత భయానక వాతావరణాన్ని సూచిస్తున్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉదంతంపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని సూచించింది. -
వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం
అడవిదేవులపల్లి (మిర్యాలగూడ): నల్లగొండ జిల్లాలో సోమవారం ఓ వికలాంగురాలిపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడవిదేవుల పల్లి మండలం చాంప్లాతండా హమ్‌తండాలో ఇటీవల దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆదివారం రాత్రి కోలాట ప్రదర్శన జరిగింది. దీనిని చూసేందుకు పక్కనే ఉన్న గోన్యా తండాకు చెందిన వికలాంగురాలు (40) వెళ్లింది. ఈ క్రమంలో ఆమె చెట్ల పొదల మాటుకు బహిర్భూమికి వెళ్లింది. అడవిదేవులపల్లికి చెందిన గొడుగు సతీశ్, గొడుగు హనుమయ్య, బిల్లకంటి మహేశ్‌లు ఆమెను అనుసరించారు. ఆ వికలాంగురాలిని బలవంతంగా చేలోకి తీసుకువెళ్లి సామూహిక లైంగికదాడి జరిపారు. అభాగ్యురాలిని అక్కడే వదిలేసి తిరిగి కోలాట ప్రదర్శన వద్దకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు కేకలు వేస్తూ కోలాటం వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని రోదిస్తూ బంధువులకు తెలిపింది. అక్కడే ఉన్న గొడుగు సతీశ్‌ను గుర్తించి చూపించడంతో గిరిజనులు అతడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. -
ముజఫర్‌నగర్ అత్యాచారాలపై ఆమ్నెస్టీ నివేదిక
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో 2013 నాటి అల్లర్ల సమయంలో మహిళలపై జరిగిన సామూహిక అత్యాచారాలపై జరుగుతున్న విచారణలో జాప్యం.. బాధితుల దయనీయ స్థితిని తెలియజేస్తోందంటూ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత విభాగం గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. ‘లాసింగ్ ఫెయిత్: ద ముజఫర్‌నగర్ గ్యాంగ్‌రేప్ సరై్వవర్స్’పేరుతో తీసుకువచ్చిన ఈ నివేదిక, మహిళలను దాడుల నుంచి రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. ఆ తర్వాత కేసుల విచారణ స్థితి గురించి బాధితులకు సమాచారం అందించడంలోనూ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆక్షేపించింది. మత, కుల ఘర్షణల్లో మహిళలపై అత్యాచారాలు జరిగినట్లు ఎఫ్ఐఆర్లో నమోదు కావడం ఇదే తొలిసారి కాబట్టి, ఈ కేసులను ప్రభుత్వమే నీరుగారుస్తోందని కొందరు ఆరోపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నివేదికకు ప్రాధాన్యం ఏర్పడింది. -
యువతిపై సామూహిక అత్యాచారం
- బయటకు చెబితే చంపుతామని బెదిరింపులు - ఈ నెల 4న ఘటన 13 రోజుల తర్వాత వెలుగులోకి.. భీమదేవరపల్లి: నానమ్మతో కలసి నిద్రిస్తున్న యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం బయటకు చెబితే చంపుతామని బెదిరించారు. దీంతో బాధితురాలు జరిగిన సంఘటన ఎవరికీ చెప్పుకోలేక 13 రోజులుగా కుమిలిపోరుుంది. విషయం బయటకు పొక్కడంతో గ్రామపెద్దలు సైతం కేసు కాకుండా బేరసారాలు నడిపారు. పోలీసులకు తెలియడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హసన్ పర్తి సీఐ రవి కుమార్, ముల్కనూర్ ఎస్సై సంతోష్‌కుమార్ కథనం ప్రకారం.. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లికి చెందిన 21 ఏళ్ల యువతి డిగ్రీ పూర్తి చేసింది. పై చదువులు చదివే ఆర్థిక స్థోమత లేకపోవడంతో , కుటుంబ పోషణ నిమిత్తం కూలీ పని చేస్తోంది. సదరు యువతి తల్లిదండ్రులు 15 ఏళ్ల క్రితమే మృతి చెందారు. యువతి అక్కకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. దీంతో ఆమె తన నానమ్మ వద్ద ఉంటుంది. ఇదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పిట్టల నరేశ్ కొద్ది రోజులుగా యువతితో స్నేహంగా ఉంటున్నాడు. యువతి నానమ్మ ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆటోలో ఆమెను అప్పుడప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్లేవాడు. ఈ నెల 4న రాత్రి 9 గంటల ప్రాంతంలో నరేశ్ యువతికి ఫోన్ చేసి తనకు రూ. 500 కావాలి.. ఇంటికి వస్తున్నానని చెప్పాడు. అతడికి సదరు యువతి డబ్బులివ్వడంతో నరేశ్, అతడి స్నేహితులు బస్వ శ్రీకాంత్, పోలు ప్రేమ్‌కుమార్ మద్యం తాగారు. అదే రోజు అర్ధరాత్రి 12 గంటలకు శ్రీకాంత్ తన సెల్ నుంచి యువతికి ఫోన్ చేశాడు. అనంతరం సుమారు ఒంటి గంట ప్రాంతంలో నరేశ్, శ్రీకాంత్, ప్రేమ్కుమార్లు యువతి ఇంటికెళ్లి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికై నా చెబితే చంపుతామంటూ బెదిరించారు. భయపడి విషయం ఎవరికి చెప్పకుండా యువతి భయంతో గడిపింది. వారం అనంతరం విషయం బయటకు రావడంతో గ్రామ పెద్దలు రాయబేరాలు నడుపుతున్నారు. అయితే, సామూహిక అత్యాచారం జరిగినట్లు సోమవారం రాత్రి పోలీసులకు తెలియడంతో వెలుగులోకి వచ్చింది. యువతి ఫిర్యాదు మేరకు ప్రేమ్‌కుమార్, శ్రీకాంత్, నరేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు. కాగా సదరు యువతిని హోమ్‌కు తరలించారు. విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించిన పెద్దలపై కేసు నమోదు కానున్నట్లు సమాచారం. ముగ్గురు యువకులు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. -
హిమబిందు హత్య కేసు కొట్టివేత
అభియోగాలు నిరూపించలేకపోవడమే కారణం తొలి నుంచీ సరిగా స్పందించని పోలీసులు విజయవాడ సిటీ: సంచలనం కలిగించిన ఏపీలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఎం.సాయిరామ్ భార్య హిమబిందు(41)పై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య, దోపిడీ కేసులో నిందితులపై పోలీసులు మోపిన అభియోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోవడంతో కేసును కొట్టివేస్తూ మహిళా సెషన్స్‌కోర్టు న్యాయమూర్తి అనుపమాచక్రవర్తి మంగళవారం తీర్పు చెప్పారు. నిందితులపై ఇతర కేసులు లేనిపక్షంలో వారిని విడుదల చేయాలంటూ జైలు అధికారులను ఆదేశించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. విజయవాడ పటమట శాంతినగర్‌లోని ఎంటీఎస్ టవర్స్‌కు చెందిన సాయిరామ్ యనమలకుదురు సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌గా పని చేస్తున్నారు. గతేడాది మార్చి 15న విధుల నిర్వహణ కోసం సాయిరామ్ బ్యాంకుకు, పిల్లలు చదువుకునేందుకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన సాయిరామ్‌కి భార్య కనిపించకపోవడంతో పలుచోట్ల విచారించారు. ప్రయోజనం లేకపోవడంతో ఆమె కనిపించ డం లేదంటూ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే గోశాల వద్ద బందరు కాల్వలో మహిళ మృతదేహం స్వాధీనం చేసుకొని పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను అదృశ్యమైన హిమబిందుగా కుటుంబసభ్యులు గుర్తించారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరగడంతోపాటు నిందితులు ఇంట్లోని నగలు, నగదు దోచుకుపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో పక్క ప్లాటు యజమాని కారు డ్రైవర్ మహ్మద్ సుభాని సహా సోమన గోపీకృష్ణ, వేల్పూరి దుర్గాప్రసాద్, జనపాల కృష్ణ, లంకపల్లి రమణ, మహ్మద్ గౌస్‌లను నిందితులుగా పేర్కొం టూ పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. చార్జిషీటులో 54 మంది సాక్షులను పేర్కొనగా 36 మందిని ప్రాసిక్యూషన్ తరఫున విచారించారు. నిందితులపై పోలీసులు మోపిన నేరాభి యోగాలు నిరూపించలేకపోవడంతో కేసును కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. తీర్పుపై పైకోర్టుకు అప్పీలుకు వెళ్లనున్నట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. న్యాయమూర్తి తీర్పు వెలువరించిన తర్వాత హిమ బిందు కుటుంబసభ్యులు హతాశులయ్యారు. అడుగడుగునా పోలీసుల వైఫల్యం... హిమబిందు కేసును కోర్టు కొట్టేయడం వెనుక పోలీసుల వైఫల్యం అడుగడుగునా బయటపడింది. ఫిర్యాదువేళ ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా వ్యవహరించారు. అత్యాచారం జరిగే సమయంలో ఆమె అరవకుండా నోటికి ఖర్చీఫ్ అడ్డుపెట్టారని, తర్వాత మెడకు చీర బిగించి చంపేశారని ప్రాసిక్యూషన్ అభియోగం మోపింది. ఆధారాలను సేకరించి కోర్టుకు అందజేయడంలో వైఫల్యం చెందారు. ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్య పరీక్షల్లో తేలినప్పటికీ ఆధారాలతో నిరూపించలేకపోయారు. -
బాలికపై గ్యాంగ్‌రేప్
నాలుగు రోజులుగా మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో బంధించి పోలీసుల అదుపులో ఓ నిందితుడు పరారీలో మరో ముగ్గురు బెంగళూరు(బనశంకరి): ఓ బాలికను కిడ్నాప్ చేసి మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నాలుగు రోజుల పాటు బాలికను నిర్బంధించి నిరంతరంగా అత్యాచారం జరిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వివరాల్లోకి వెళితే... ఈ నెల 7న ఓ బాలిక(13)ను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి మాజీ ఎమ్మెల్యే బి.డి. బసవరాజుకు చెందిన ఫాంహౌస్‌లోని ఇంటిలో బంధించారు. ఆమె కనిపించకుండాపోయిన రోజు తల్లిదండ్రులు ఆలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక కోసం తీవ్రంగా గాలించినా ఫలితం లేకుండా పోయింది. నాలుగు రోజుల అనంతరం బాలికను తోటలో వదిలి దుండగులు పారిపోయారు. అతి కష్టంపై తల్లిదండ్రులను చేరుకున్న ఆ బాలిక తనపై జరిగిన దారుణాన్ని వివరించింది. నాలుగు రోజుల పాటు తనను గదిలో నిర్బంధించి ఒకరి తరువాత ఒకరు ముసుగులు వేసుకుని నిరంతరంగా అత్యాచారం జరిపినట్లు బాధితురాలు వాపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఫాంహౌస్‌ను చేరుకుని ఆధారాలు సేకరించారు. ఫాంహౌస్ మేనేజర్‌తో పాటు అక్కడే పనిచేస్తున్న మరో ముగ్గురు ఈ దుశ్చర్యలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫాంహౌస్ మేనేజర్ లోకేష్ అలియాస్ బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. -
బాలికపై సామూహిక అత్యాచారం
మేడిపల్లిలో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి.. ముగ్గురు యువకులు రిమాండ్ హైదరాబాద్: ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ బాలిక సామూహిక అత్యాచారానికి గురైన ఘటన హైదరాబాద్ పరిధిలోని మేడిపల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు కేసును దర్యాప్తు చేసి ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు యువకులను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బోడుప్పల్‌కు చెందిన ఓ మైనర్ బాలిక (16) తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఇంటర్మీడియట్ చదువుతోంది. ఈమెకు ఉప్పల్ భరత్‌నగర్‌లో ఉండే పి.రవి(27)తో పరిచయం ఏర్పడింది. దీంతో ఈ నెల 20న రవి సదరు బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించి తాను నివాసం ఉండే భరత్‌నగర్ కు తీసుకొచ్చాడు. అదే కాలనీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని తన స్నేహితులు కస్తూరి లక్ష్మణ్ అలియాస్ సింధు (25), ఆసాల సురేశ్ అలియాస్ సూరి (24)తో కలసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి పారిపోయాడు. కాగా, బాలిక తల్లిదండ్రులు అదే రోజు సాయంత్రం తమ కూతురు కనిపించడం లేదని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తల్లి దండ్రుల ఫిర్యాదు అనంతరం పోలీసులు విచారణ చేపట్టి వరంగల్‌లో ఉన్న బాధితురాలిని మేడిపల్లికి తీసుకొచ్చి విచారించారు. ఆమె అందించిన వివరాలతో ముగ్గురు యువకులను పోలీసులను అరెస్టు చేశారు. -
అబార్షన్‌కు అనుమతివ్వండి
కోర్టును ఆశ్రయించిన సామూహిక అత్యాచార బాధితురాలు అహ్మదాబాద్: సామూహిక అత్యాచారం కారణంగా గర్భం దాల్చిన ఓ మహిళ, తన గర్భాన్ని తొలగించుకోవటానికి అనుమతించాల్సిందిగా అహ్మదాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. తాను శిశువుకు జన్మనిచ్చినట్లయితే.. తన భర్త తనను స్వీకరించడని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. మార్చి 16న రాంపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం 2014లో సదరు మహిళను ఏడుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టారు. దాదాపు 8 నెలల పాటు వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఆమె 26వారాల గర్భవతి. ముందుగా కిందికోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను మార్చి 26న కొట్టివేశారు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. -
అమానుషం
మేకలు మేపే యువతిపై అత్యాచారం, హత్య స్థానికులే అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని అనుమానం తెల్లవారితే మహిళా దినోత్సవ సంబరాలు.. ఇదే సమయంలో అభం శుభం తెలియని యువతి బతుకు తెల్లారిపోయింది. సామూహిక అత్యాచారం చేసిన కామాంధులు.. అంతటితో ఆగకుండా గొంతునులిమి చంపేశారు. సభ్య సమాజానికి తలవంపులు తెచ్చారు. -పెనుమూరు తండ్రి లేడు.. తల్లికి మతిస్థిమితం లేదు. ఆసరా లేని ఆడపిల్ల పిన్ని ఇంట్లో పెరిగింది. మేకలు కాసేందుకు వెళ్లి కామాంధుల అకృత్యానికి బలైంది. కలవగుంట పంచాయతీ దిగువపూనేపల్లెలో అంతులేని విషాదం అలముకుంది. గ్రామానికి చెందిన సుబ్రమణ్యం, గిలిజ దంపతులకు నలుగురు ఆడ సంతానం. సుబ్రమణ్యం పిల్లలు చిన్నతనంలో చనిపోయాడు. దీంతో బాలికలు తండ్రి లేనివారయ్యారు. భర్త మృతితో గిలిజకు మతిస్థిమితం లేకుం డాపోయింది. దీంతో బాలికలు పిన్నమ్మ కుట్టెమ్మ, చిన్నాన్న జగన్నాథం వద్ద పెరిగారు. మొదటి ముగ్గురికీ పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపారు. చివరి అమ్మాయి రీటా (18) చదువుకోలేదు. శనివారం ఉదయం తొమ్మిది గంటలకు మేకలు తోలుకుని ఊరి పొలిమేరకు వెళ్లింది. ఇదే సమయంలో కొందరు కామాంధులు ఆమెపై కన్నేశారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో రీటాను వివస్త్రను చేసి ఆత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమె గొంతు నులిపి చంపేశారు. నాలుగు గంటల వరకు ఈ విషయం ఎవ్వరికీ తెలియ లేదు. ఆ వైపుగా వెళ్తున్న కొందరు పొదల మధ్య పడి ఉన్న మృతదేహం చూసి బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జాగిలాలను రప్పించి తీవ్ర స్థాయిలో పరిశోధన ప్రారంభించారు. రాత్రి 10 గంటల వరకు ఎస్పీ స్థానికులను విచారించి నిందితుల సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించారు. పోలీసు జాగిలాలు ఘటన జరిగిన మొత్తం ప్రాంతాన్ని తనిఖీచేసి అనుమానం ఉన్న చోట ఆగిపోయాయి. తెలిసిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులను త్వరలో పట్టుకుంటాం ఎస్పీ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. యువతిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణకు వచ్చామని తెలిపారు. నిందితులు ముగ్గురు, నలుగురు కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉం డవచ్చని అనుమానం వ్యక్తంచేశారు. సంఘటన స్థలం నుంచి జాగిలాలు ప్రధాన రహదారి వరకు వచ్చి ఆగిపోవడంతో నిందితులు అక్కడి వరకు మాత్రమే ద్విచక్రవాహనంలో వచ్చి ఉంటారనే అనుమానం కలుగుతోందని తెలిపారు. మాయని మచ్చ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబరాలు చేసుకోవడానికి తయారవుతున్నాం. ఇంతలో పెనుమూరు మండలంలో ఘటన తెలిసి షాక్‌కు గురయ్యాను. ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. చట్టాలు చేయడం తేలిక అయితే వాటి అమలు చేసి మహిళల ప్రాణాలు కాపాడాల్సినబాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. నిందితులను వెంటనే పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. -గాయత్రీదేవి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు -
ప్రధాని మోదీని కలిసిన ‘నిర్భయ’ తల్లిదండ్రులు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ‘నిర్భయ’ తల్లిదండ్రులు బుధవారమిక్కడ కలుసుకున్నారు. మహిళల భద్రత, సంక్షేమం కోసం తాము నడుపుతున్న నిర్భయ జ్యోతి ట్రస్ట్ గురించి వివరించారు. వారి చర్యను అభినందించిన ప్రధాని...మహిళా భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కుమార్తెను కోల్పోయినందుకు నిర్భయ తల్లిదండ్రులను మోదీ ఓదార్చారు. ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న నిర్భయపై ఆరుగురు కీచకులు కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారం చేయడం, ఆమె సింగపూర్ ఆస్పత్రిలో కన్నుమూయడం తెలిసిందే. -
నారీ గర్జనతో నిర్భయకు నివాళి
రెండేళ్ల క్రితం దేశరాజధానిలో నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన మన జాతి మూలాలను కదిలించింది. తమ ఉనికితో, జీవన సర్వస్వంతో ఆడుకుంటున్న మృగాళ్లపై మహిళలు గొంతు విప్పేందుకు ఇది ప్రేరేపించింది. అయితే బహిరంగ స్థలాల్లో స్త్రీల రక్షణకు ఇది నాంది మాత్రమే. జాతి అంతశ్చేతనను కది లించివేసిన నిర్భయ ఉదం తానికి రెండేళ్లు కావస్తోంది. ఢిల్లీలో 2012 డిసెం బర్ 16 కాళరాత్రి మానవ రూప మృగాల కాటు కు పారామెడికల్ విద్యార్థిని గురై రెండువారాలు జీవితం కోసం పోరాడి ఓడిపోయిన ఘటన యావత్ప్రపంచాన్ని మూగబోయేలా చేసింది. ఈ దారుణ అత్యాచారానికి వ్యతిరేకంగా ప్రపంచం ఏక గొంతుకతో నినదించడం ఒక పురాజ్ఞాపకమై నిలిచింది కానీ రెండేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నేటికీ బహిరంగ స్థలాలు మహిళ లకు సురక్షితం కావని అనునిత్యం రుజువవుతూ నే ఉంది. అయితే నాటి నిర్భయ జీవన్మరణ పో రాటం వృథా కాలేదు. తమ శరీరంతో, మనస్సు తో, ఉనికితో మృగాళ్లు ఆడుకుంటుంటే నిస్సహా యంగా తలదించుకుని అణిగిపోయిన వారు ఈ రెండేళ్లలో తమ గొంతెత్తడం మొదలెట్టారు. దీని ఫలితంగా అత్యాచారాల పాలైనప్పటికీ ధై ర్యంగా ముందుకొచ్చి ప్రకటిస్తున్న, పోలీసు స్టేష న్లలో ఫిర్యాదు చేస్తున్న బాధిత మహిళల సంఖ్య స్వాతంత్య్రానంతరం తొలిసారిగా పెరిగింది. ఒక చిన్న ఉదాహరణ. గత ఏడాది నవంబ ర్లో ముంబైలో 14 ఏళ్ల బాలిక సోషల్ మీడియా లో 16 ఏళ్ల అబ్బాయి చేసిన వేధింపుకు తట్టుకో లేక ఆత్మహత్యకు పాల్పడింది. ఆ ఘటనను త మ రాత అనీ, ఖర్మ అనీ భరించి ఊరుకోకుండా ఆ అమ్మాయి కుటుంబం జరిగినదాన్ని మీడియా కు చెప్పేసింది. జీవితం పొడవునా బాధిస్తూ ఉం డే ఇలాంటి దారుణ ఘటనకు గురయ్యాక భారతీయ మహిళ న్యాయం కోసం వీధులకెక్క డం, తన వంటి మరొక బాధితురాలికి మద్దతు గా నిలబడటం మన దేశంలో చాలా అరుదు. నిర్భయ ఉదంతం తర్వాతి పరిణామాలే ఈ మార్పుకు కారణమయ్యాయి. ఢిల్లీ బస్సు ఘటనలో జ్యోతిసింగ్ సామూ హిక అత్యాచారానికి గురై తీవ్రగాయాలతో సింగ పూర్ ఆసుపత్రిలో మరణించిన తర్వాత ప్రతి డిసెంబర్ 16న ప్రపంచం ఆమెను నిర్భయగా, బ్రేవ్హార్ట్గా స్మరించుకుంటూ వస్తోంది. ఆసు పత్రిలో నరకయాతన అనుభవిస్తూనే తనపై అత్యాచార దాడికి పాల్పడిన వారి గురించి జ్యోతి సింగ్ నిర్భయంగా చాటి చెప్పింది. దాంతో జాతి మొత్తం స్పందించి అత్యాచారాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చింది. జ్యోతి విషాద మరణం నేపథ్యంలో ఇండియా ఎగెనైస్ట్ రేప్ వంటి ఆన్లై న్ వేదికలు ఏర్పడ్డాయి. 2013లో నేర చట్టానికి సవరణ కూడా చేశారు. రేపిస్టులకు యావజ్జీవ కారాగారం, కొన్ని సందర్భాల్లో మరణ శిక్షకు కూడా చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. అయితే ఈ స్పందనలు, చట్ట సవరణలు బహిరంగ స్థలాలను మహిళలకు సురక్షిత మైనవిగా మార్చాయా? 2012తో పోలిస్తే మహి ళలపై అత్యాచారాలు 2013లో 35.2 శాతం పెరి గాయని, వారిపై నేరాలు 26.7 శాతం పెరిగాయ ని అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ సంవత్సరం మొదట్లో పశ్చిమబెంగాల్లోని ఒక గ్రామ పంచాయతీ తీర్పుతో ఒక గిరిజన బాలి కపై సామూహిక అత్యాచారం చేశారు. తన తెగ కు చెందని వ్యక్తితో సంబంధం పెట్టుకున్నందుకు ఆమెకు పడిన శిక్ష ఇది. తర్వాత ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిపి, చంపి చెట్టుకు ఉరితీసిన ఘటన ప్రస్తుతం వివాదా స్పదమైంది. తర్వాత బెంగళూరులోని ఒక పాఠ శాలలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. నిర్భయ ఘటనకు రెండేళ్లు పూర్తి కావస్తుండగా ఒక ఐటీ ప్రొఫెషనల్‌పై ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఘాతుక చర్య వెలుగులోకి వచ్చింది. గ్రామాల్లో, పట్టణాల్లో, ఇళ్లలో, వీధుల్లో, వాహనాల్లో, పాఠశాలల్లో, హాస్టళ్లలో పార్కుల్లో, ఎక్కడా భారతీయ యువతులకు రక్షణ లేదన్నది నేటికీ నిజమే. ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లపై కాకుండా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోనిదే వాహ నాల్లో ఘాతుక చర్యలకు అడ్డుకట్ట పడదని మహి ళా సంఘాలు ఘోషిస్తున్నాయి. అయితే ఏ చర్యలు తీసుకున్నా కంటితుడుపు చర్యలే అవుతు న్నాయి. ప్రజారవాణా వ్యవస్థలన్నింటినీ జీపీ ఎస్ పరిధిలోకి తీసుకురావాలని, 24 గంటలూ వాటి కదలికలపై నిఘా పెట్టాలని, 50 శాతం వాహనాల్లో మహిళా డ్రైవర్లను నియమించాలని, మహిళలకు ప్రత్యేకంగా సీట్లు, కంపార్టుమెంట్లు కేటాయించాలని ప్రతిపాదనలొస్తున్నాయి. నిర్భయ ఘటన తరువాత నేర చట్టంలో మార్పులను ప్రభుత్వం తీసుకొచ్చినా నేరస్థులకు సంబంధించిన డేటా బేస్‌ను రూపొందించడం లో ఘోర వైఫల్యం చెందింది. ఉబర్క్యాబ్ డ్రైవర్ గతంలో డజనుసార్లు అత్యాచారాలకు పాల్పడి నా, జైలుపాలైనా, ఇప్పటికీ కేసులు నడుస్తూనే ఉన్నా అతడి వివరాలు నిఘా సంస్థల ద్వారా వాహన నిర్వాహకులకు అందకపోవడం మరో ఘోరానికి దారి తీసింది. అతి చిన్న అంశాలలో ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం పదే పదే దారుణాల పునరావృత్తికి కారణమవుతోంది. మరోవైపు ఈ ప్రపంచాన్ని తమకు సురక్షిత స్థలంగా మార్చడానికి వ్యవస్థ ప్రయత్నాలు ప్రా రంభించేంత వరకు మహిళలు వేచి ఉండదల్చు కోవడం లేదు. తమపై నేర చర్యలకు పాల్పడిన ఘటనలను వారు నిర్భయంగా నివేదించడమే కాదు, దుండుగలను పట్టుకోవడంలో వారు పో లీసులకు సహకరిస్తున్నారు కూడా. ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఫొటో తీయడం ద్వారా బాధితురాలు పోలీసులు అతడిని గుర్తించే పనిని సులువు చేశారు. తమను మాటల రూపంలో, శారీరకంగా కూడా వేధించడానికి ప్రయత్నించిన వారిని యువతులు చితకబాదుతున్న ఘటనలు కూడా వార్తలవుతున్నాయి. హరియాణాలోని రోహతక్ కు చెందిన అక్కాచెల్లెళ్లు బస్సులో తమ పట్ల అస భ్యంగా ప్రవర్తించిన వారిని బెల్టుతో బాదిన ఘటన వెనుక ఉద్దేశాలను ఇప్పుడు ప్రశ్నిస్తున్నా రు కానీ, ఆ అమ్మాయిల సాహసాన్ని చాలా మంది ఆరాధనగా చూస్తున్నారు. పురుషుల కం టే తాము బలహీనులమనే భావాన్ని మన సమా జంలో యువతులకు, మహిళలకు నూరిపోస్తూ వస్తున్నారు. తాము బలహీనులమని, బాధితుల మని భావించకూడదు. మహిళలందరికీ స్వీయ రక్షణ తరగతులను సుదీర్ఘ కాలంపాటు ఐచ్ఛికం చేయడం ద్వారానే అబలలం అనే భావాన్ని పో గొట్టగలం. దానికి తోడు అవమానం, శిక్ష అనేవి నేరస్తుడికే కాని బాధితులకు విధించకూడదని సమాజం ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా మహిళా భద్రత వాస్తవ రూపం దాలుస్తుంది. (నిర్భయ ఉదంతానికి రేపటితో రెండేళ్లు) - కె.రాజశేఖరరాజు -
మహిళపై సామూహిక అత్యాచారం
హిందూపురం : చిలమత్తూరు మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన ఓ మహిళ (56)పై బుధవారం రాత్రి గుర్తు తెలియని ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి వేళ వాకింగ్ చేస్తుండగా ముఖానికి గుడ్డ కట్టుకున్న ముగ్గురు యువకులు బలవంతంగా తనను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసినట్లు తెలిపింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను 108 వాహనంలో స్థానికులు హిందూపురం ఆస్పత్రికి తరలించారు. రూరల్ సీఐ శివనారాయణ స్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించి ఘటనపై విచారణ చేపట్టారు. -
‘బదౌన్’ సోదరీమణులది ఆత్మహత్యే: సీబీఐ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌కు చెందిన ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారనీ వారిపై సామూహిక అత్యాచారం, హత్య జరగలేదని సీబీఐ గురువారం తేల్చి చెప్పింది. దీనిపై సీబీఐ ప్రతినిధి కాంచన్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఘటనపై శాస్త్రీయ పద్ధతుల్లో 40 రకాల పరీక్షలు చేయించామన్నారు. మెడికల్ బోర్డు బాలికలపై లైంగిక దాడి జరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేయడంతో దీన్ని నిర్ధారించేందుకు హైదరాబాద్‌లోని డీఎన్ఏ నిపుణుల సాయం తీసుకున్నామన్నారు. వారు పరీక్షలు జరిపి అత్యాచారం, హత్య జరిగిందనడానికి ఎలాంటి అధారాలు లేవని తేల్చినట్లు పేర్కొన్నారు. ఈ నివేదికను శుక్రవారం బాదావున్ కోర్టుకు సమర్పించనున్నారు. ఇందులో నిందితులుగా భావి స్తున్న ఐదుగురిని గతంలోనే యూపీ పోలీసులు అరెస్టు చేశారు. వారిపై చార్జిషీటును కూడా దాఖలు చేయరాదని సీబీఐ భావిస్తోంది. దగ్గర బంధువులైన ఈ బాలికలు గత మే నెలలో తమ గ్రామానికి సమీపంలోనే ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకొని అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. కాగా, మృతిచెందిన బాలికల కుటుంబీకులు సీబీపై దర్యాప్తును తప్పుపట్టారు. తమ పిల్లలు ఆత్మహత్యచేసుకోలేదని, దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. -
బీహార్‌లో విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్
పాట్నా: బీహార్‌లో ఓ పాఠశాల విద్యార్థినిపై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాట్నాకు 38 కిలోమీటర్ల దూరంలోని బిహ్తా ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాదళిత్ సామాజిక వర్గానికి చెందిన బాలిక పరీక్షల సన్నద్ధత కోసం ఆమె బిహ్తాలోని బంధువుల ఇంటికి వచ్చింది. గురువారం తోటి విద్యార్థినిని కలిసేందుకు ఆమె గ్రామానికి సమీపంలోని వంతెన వద్దకు వెళ్లింది. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఆరుగురు యువకులు వీరిద్దరినీ సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి అరుపులు విన్న స్థానికులు అక్కడికి వచ్చి ఆమెను రక్షించారు. మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. -
హైస్కూల్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
శివమొగ్గ : కామాంధుల అకృత్యానికి మరో ఓ విద్యాసుమం రాలిపోయింది. నిర్భయ తరహా సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి రావడంతో శివమొగ్గ ప్రాంతం అట్టుడికిపోయింది. శివమొగ్గ జిల్లాలోని ఓ పట్టణంలో ముగ్గురు కామాంధులు ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర అస్వస్తతకు గురైన విద్యార్థిని ఉడుపి మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే..... తీర్థహళ్లి తాలూకాకు చెందిన బాలిక (14) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అక్టోబరు 29న పాఠశాలకు వెళ్లడానికి బస్సుకోసం బస్టాపు వద్ద వేచి ఉన్న సమయంలో మారుతి కారులో వచ్చిన యువకుల బృందం బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకుని అపహరించుకుపోయారు. అనంతరం తుంగా కాలేజీ వెనుకభాగంలోని అనవేరికొండ ప్రాంతంలోని నిర్జనప్రదేశానికి తీసుకెళ్లి బాలికపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సమయంలో బాలిక గట్టిగా కేకలు వేయడంతో కొండలో ఆకులు కత్తరించే కార్మికులు సంఘటనా స్థాలానికి రావడంతో కామాంధులు బాలికను వదిలి కారులో పారిపోయారు. తీవ్రఅస్వస్తతకు గురైన బాలికను స్థానికులు విచారించి బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాధితురాలిని మొదట ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు, అనంతరం తీవ్ర అస్వస్ధతకు గురి కావడంతో తక్షణమే అక్కడి తాలూకా ఆసుపత్రిలో చేర్పించారు. బాలిక పరిస్థితి విషమించడంతో శివమొగ్గ ప్రభుత్వ మగ్గాన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా చికిత్సకు స్పందించకపోవడంతో మెరుగైన వైద్యం కోసం మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి మృతి చెందింది. దురదృష్టకర సంఘటన : పోలీస్‌శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బాలికకు పరిచయం ఉన్న ఓ యువకుడు పాఠశాలలో వదిలిపెడతానని నమ్మించి కారులో పిలుచుకెళ్లి అనంతరం తన స్నేహితులతో కలిసి బాలికను బెదిరించి నిర్జీన ప్రదేశంలోకి తీసుకెళ్లి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. స్థానికులు అక్కడికి చేరుకోవడంతో యువకులు బాలికను వదిలిపారిపోయినట్లు తెలిసింది. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకులు తీర్థహళ్లి పట్టణానికి చెందినవారని తెలుస్తోంది, ఇందులో బాధితురాలి స్వగ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కూడా భాగస్వాములైనట్లు సమాచారం అందడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసు విషయమై ఒక అనుమానుతిడి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. తీర్ధహళ్లి పట్టణంలో బంద్ : హైస్కూల్ విద్యార్థిని మృతితో తీర్థహళ్లి పట్టణంలో ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి. తీవ్ర కోపోద్రిక్తులైన గ్రామస్తులు లైంగిక దాడికి పాల్పడిన యువకులకు చెందినదిగా భావిస్తున్న కారును ధ్వంసం చేశారు. శనివారం పట్టణంలో బంద్వాతావరణం కనబడింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో పట్టణవ్యాప్తంగా భారీపోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ.కౌశలేంద్రకుమార్ అక్కడి పరిస్థితులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. -
దౌలా కాన్ గ్యాంగ్ రేప్ కేసులో ఐదుగురు దోషులుగా నిర్ధారణ
న్యూఢిల్లీ: నాలుగేళ్ల కిందట ఢిల్లీలోని దౌలా కాన్‌లో ఓ కాల్ సెంటర్ ఉద్యోగినిని అపహరించి, సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఢిల్లీ కోరు ఐదుగురు నిందితులను మంగళవారం దోషులుగా నిర్ధారించింది. షంషాద్, ఉస్మాన్, చోటా బిల్లీ, ఇక్బాల్, కమ్రుద్దీన్‌ను అదనపు సెషన్స్ కోర్టు జడ్జి వీరేందర్ భట్ దోషులుగా తేల్చారు. వీరు బాధితురాలిని కిడ్నాప్ చేసి కదులుతున్న వాహనంలో, తర్వాత మరోచోట అఘాయిత్యానికి పాల్పడినట్లు డీఎన్ఏ నివేదిక స్పష్టం చేస్తోందన్నారు. బాధితురాలి, ఆమె సహోద్యోగుల సాక్ష్యాలు బలంగా ఉన్నాయన్నారు. పరేడ్‌లో ఇద్దరు నిందితులను గుర్తించించిన బాధితు రాలు మిగతా ముగ్గురి అరెస్టుకూ సాయపడిందన్నారు. శిక్ష విధింపుపై విచారణను ఈ నెల 17కు వాయిదా వేశారు. 2010 నవంబర్‌లో దౌలా కాన్‌లో ఈశాన్య రాష్ట్రానికి 30 ఏళ్ల కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌ను ఈ ఐదుగురు కిడ్నాప్ చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు. -
నిందితులను శిక్షించాల్సిందే
దుబ్బాక: దుబ్బాక మండలం రామక్కపేటలో గిరిజనులైన తల్లీ కూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలంటూ ఆదివారం అఖిల పక్షం నేతలు ఇచ్చిన పిలుపు మేరకు దుబ్బాక బంద్ పిలుపు ప్రశాంతంగా జరిగింది. అఖిల పక్ష నాయకులు ఉదయమే దుబ్బాక బస్ డిపో ఎదుట ఆందోళన చేపట్టి డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు పలికారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన మహిళలు దుబ్బాక ప్రధాన వీధుల్లో నిరసన ర్యాలీ చేపట్టారు. ఏకలవ్య ఎరుకల సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం దుబ్బాక పోలీస్‌స్టేషన్ ఎదుట మహిళలు బైఠాయించి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మద్దుల ఉమాదేవి మాట్లాడుతూ గిరిజన మహిళలపై అత్యాచారం జరిగి 24 గంటలు గడిచినా నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కేసును తప్పు దోవ పట్టించేందుకే దుండగులను అరెస్టు చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ డెమోక్రటిక్ టీచర్స ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రభాను మాట్లాడుతూ నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాల్సి ఉన్నా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు. బాధితులకు తక్షణ సాయంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పెన్షన్, వంట పాత్రలు, మూడు నెలలకు సరిపోయే రేషన్ ఇవ్వాలన్నారు. బాధితులను ప్రలోభపెట్టి కేసును తారుమారు చేసేందుకు నిందితులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిరసన కార్యక్రమంలో తెలంగాణ సామాజిక వేదిక జిల్లా కన్వీనర్ జాన్‌వెస్లీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్. రాంరెడ్డి, నాయకులు సెంట్రింగ్ దుర్గయ్య, చెక్కపల్లి పద్మయ్య, టీడీపీ ఎస్సీ, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కరికె శ్రీనివాస్, నాయకులు కాశయ్య, దుబ్బాక రాజయ్య, ఏకలవ్వ, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిందితుల దిష్టిబొమ్మ దహనం దుబ్బాక రూరల్: గిరిజన మహిళలపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత మహిళా సమఖ్య ఆధ్వర్యంలో పలువురు మహిళలు ఆదివారం దుబ్బాక బస్టాండ్ ప్రధాన రహదారిపై నిందితుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా మండల నాయకురాలు నవీన మాట్లాడుతూ నిర్భయ వంటి కఠినమైన చట్టాలను ప్రభుత్వాలు తీసుకు వస్తున్నా మహిళల పట్ల అరాచకాలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మద్యాన్ని సంపూర్ణంగా నిషేధించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహిళలతో కలిసి బెల్టుషాపులపై దాడులు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు జమున, భారతమ్మ, రాధిక, బాల్‌లక్ష్మి, మమత, బాలమల్లవ్వ, సిద్దవ్వ పాల్గొన్నారు. కేసును సీబీసీఐడీకి అప్పగించాలి రామక్కపేట గ్రామానికి చెందిన గిరిజన తల్లి కూతళ్లపై దసరా పండుగ రోజున జరిగిన అత్యాచార కేసును సీబీసీఐడీకి అప్పజెప్పాలని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుతాడి రాములు, లోకిని రాజు తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరమార్శించిన అనంతరం వారు ఆదివారం దుబ్బాక విలేకరులతో మాట్లాడారు. సభ్య సమాజం తల దించుకునేలా జరిగిన సంఘటనపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. స్థానిక పోలీసులు కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని, కేసు పక్కదారి పట్టకుండా ఉండాలంటే సీబీసీఐడీకి అప్పజెప్పాలన్నారు. సీఎంతో పాటు హోంమంత్రి, రాష్ట్ర డీజీపీలకు విజ్ఞాపన పత్రాలను అందజేసినట్లు తెలిపారు. కఠినంగా శిక్షించాలి మిరుదొడ్డి: అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డీబీఎఫ్ రాష్ట్ర నాయకుడు ముత్యాల భూపాల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అత్యాచారానికి గురైన బాధితులకు నష్ట పరిహారంతోపాటు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గజ్వేల్ మండలం పిడిచెడ్‌లో హిందూ దేవాలయంలోకి పూజలు చేసేందుకు వెళ్లిన దళిత ఉపాధ్యాయుడిపై కొందరు అగ్రవర్గాల నేతలు కులం పేరుతో దూషించి దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. కార్యక్రమంలో డీబీఎఫ్ నాయకులు నక్క రాజయ్య, బిట్ల కుమార్, ఆర్ రాజయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. దాడులను అరికట్టడంలో విఫలం జోగిపేట: ఎస్సీ, ఎస్టీలపై రోజురోజుకు పెరిగిపోతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని సీపీఎం డివిజన్ కార్యదర్శి పి.మొగులయ్య ఆరోపించారు. దుబ్బాక మండలం రామక్కపేటలో గిరిజన కులానికి చెందిన తల్లీకూతళ్లపై అమానుషంగా అత్యాచారం చేసిన దుండగుల దిష్టిబొమ్మను జోగిపేటలోని తహశీల్ కార్యాలయం వద్ద ఆదివారం దహనం చేశారు. ఈ సందర్భంగా మొగులయ్య మాట్లాడుతూ ఈ సంఘటనలో బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సంతోష్, గంగ, సంజీవులు, శివకుమార్, గంగారాంలతో పాటు పలువురు పాల్గొన్నారు. దుండగులను శిక్షించాలి టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ జగదేవ్‌పూర్: రామక్కపేటలో తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కామల్ల భూమయ్య, తెలుగు యువత జిల్లా నాయకుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం వారు జగదేవ్‌పూర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ తల్లీకూతుళ్లపై అత్యచారం జరగడం దారుణమన్నారు. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలన్నారు. సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ మండలాధ్యక్షులు శివలింగం, నాయకులు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం
ఎనిమిది మంది నిందితులు పాల్గొన్నట్లు అనుమానం పోలీసుల అదుపులో ఇద్దరు మెదక్ జిల్లా రామక్కపేటలో దారుణం దుబ్బాక: తల్లీకూతుళ్లపై అత్యాచారం చేశారు. ఈ సంఘటన మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గిరిజన బాలిక (17) దసరా పండగను పురస్కరించుకుని రాత్రి తోటి మిత్రులకు జమ్మీ ఇవ్వడానికి వెళ్లింది. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన కరుణాకర్ బైక్‌పై వచ్చాడు. తాను కూడా అటే వెళుతున్నానని చెప్పి ఆమెను ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమె ముక్కు వద్ద మత్తు మందు పూసిన కర్చీఫ్‌ను ఉంచడంతో ృ్పహ కోల్పోయింది. అక్కడి నుంచి సమీపంలోని నీలగిరి తోటలోకి తీసుకెళ్లాడు. అప్పటికే మాటు వేసి ఉన్న కొంత మందితో కలసి కరుణాకర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి నుంచి వెళ్లిన కుమార్తె ఎంతకీ రాకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలో వెతక సాగారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన దిలీప్.. బాలిక తల్లి(40) వద్దకు మీ కుమార్తెను చూపుతానని చెప్పి ఆమెను బైక్‌పై సదరు నీలగిరి తోట వద్దకు తీసుకెళ్లగానే అదే గ్యాంగ్ ఈమెపై కూడా సామూహిక అత్యాచారానికి పాల్పడింది. అనంతరం ఆమెను దిలీప్ మళ్లీ బైక్‌పై ఎక్కించుకుని వస్తుండగా భర్త కనిపించడంతో బైక్‌పై నుంచి దూకి విషయాన్ని చెప్పింది. దీంతో ఇద్దరూ నీలగిరి తోటలోకి వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న కూతురుని చూసి నిశ్చేష్టులయ్యారు. బాధితులు శనివారం ఉదయం దుబ్బాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లీకూతుళ్లను వైద్య పరీక్షల నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా సామూహిక అత్యాచారంలో మొత్తం ఎనిమిది మంది పాల్గొన్నారని, వీరి వయస్సు సుమారు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండవచ్చని సమాచారం. సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ రెడ్డి గ్రామానికి వచ్చి విచారణ చేశారు. కాగా, నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలిసింది. నిందితులను కఠినంగా శిక్షించాలి: బలరాం నాయక్ మెదక్ జిల్లా దుబ్బాకలో ఇద్దరు గిరిజన మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ డిమాండ్ చేశారు. గతంలో వరంగల్ జిల్లాలో కాలేజీ అమ్మాయిలపై యాసిడ్దాడి చేసిన వారిని పోలీసులు కాల్చి చంపినట్లుగా శిక్ష ఉండాలని పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనను సీఎం, హోంమంత్రి సీరియస్‌గా తీసుకోవాలన్నారు. తెలంగాణలోని గిరిజనులు ఆ నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ఈ ఘటనను తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో విఫలం: పొంగులేటి రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్‌నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి విమర్శించారు. హోంశాఖ నిర్వహణ కోసం వేలకోట్లు ఖర్చు చేస్తున్నా శాంతి, భద్రతల పరిరక్షణలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. ఈ వైఫల్యం కారణంగా తాజాగా మెదక్ జిల్లా దుబ్బాకలో ఇద్దరు గిరిజన మహిళలు అత్యాచారానికి గురయ్యారని ఆరోపించారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విపత్కర పరిస్థితుల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఉద్దేశించిన 108 సర్వీసు వాహనాలకు డీజిల్ కొరత ఏర్పడిందని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు రావడం లేదని, ఈ విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్నారు. -
మహిళపై సామూహిక అత్యాచారం
కోహీర్: ఓ మహిళను కిడ్నాప్ చేసి సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లా కోహీర్ మండలం చింతల్‌ఘాట్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. జహీరాబాద్ సీఐ సాయిఈశ్వర్ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొరంగ్‌పల్లికి చెందిన మహిళ (32)ను సోమవారం సరుకులు కొనడానికి మునిపల్లి మండలం బుధేరా సంతకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆటో కోసం ఎదురుచూస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా చింతల్‌ఘాట్ శివారులోకి తీసుకెళ్లారు. మధ్యలో వారికి మరో వ్యక్తి జత కలిశాడు. తొమ్మిదో నంబర్ జాతీయ రహదారికి కొద్ది దూరంలో ఆమెను తీసుకెళ్లి ముగ్గురూ అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయి తెలిపారు. -
గ్యాంగ్‌రేప్ కేసులో 13 మందికి 20 ఏళ్ల జైలు
బోల్పూర్: పశ్చిమ బెంగాల్‌లోని లాభ్పూర్లో ఓ గిరిజన యువతి(20)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 13 మంది కీచకులకు స్థానిక కోర్టు 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పుచెప్పింది. రూ. 5,000 చొప్పున జరిమానానూ చెల్లించాలని లేకపోతే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందంది. వేరే కులపు వ్యక్తితో యువతి సంబంధం పెట్టుకోవడంపై ఆగ్రహించిన కులపెద్దలు ఇందుకు శిక్షగా ఆమెపై సామూహిక అత్యాచారం జరపాలని తీర్పు చెప్పారు. దీంతో ఈ ఏడాది జనవరి 21న 13 మంది గ్రామస్తులు యువతిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. -
నమ్మించి గ్యాంగ్ రేప్
రంగియా: ప్రేమ పేరుతో నమ్మించాడు. పేరు మార్చి ఏమార్చాడు. ఏడుగురు స్నేహితులతో కలిసి ప్రియురాలిని సామూహికంగా అత్యాచారం చేశాడు. అస్సాంలోని రంగియా జిల్లాలో శనివారం ఈ ఘాతుకం జరిగింది. 25 ఏళ్ల మహిళతో నల్బరీవాసి ఫక్రుద్దీన్ ఫోన్ ద్వారా స్నేహం చేశాడు. తన పేరు రాహుల్ బోస్‌గా చెప్పుకున్నాడు. శనివారం ఆమె సినిమాకు తీసుకెళ్లాడు. ఇంటి దగ్గర వదిలేస్తానంటూ ఆమెను ఓ పాఠశాల వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న అతని ఏడుగురు మిత్రులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలి అరుపులు విని స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను కాపాడారు. ఎనిమిది మందిలో ముగ్గురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఫకృద్దీన్ పరారయ్యాడు. మహిళకు జరిపిన వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయిందని పోలీసులు చెప్పారు. -
స్నేక్ గ్యాంగ్ కేసులో మరో నలుగురి అరెస్టు
హైదరాబాద్: యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన స్నేక్‌గ్యాంగ్ వీడియో క్లిప్పింగ్‌లను మొబైల్ అప్లికేషన్ ‘వాట్సాప్’ ద్వారా షేర్ చేసుకుంటున్న నలుగురు వ్యక్తులను సైబరాబాద్ సీసీఎల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. జూలై 31న పహాడీషరీఫ్ షాయిన్ నగర్లో స్నేక్ ముఠా సభ్యులు యువతిపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను నిందితులు వీడియో తీసుకున్నారు. వాటిని గత నెల 31న ఒక లోకల్ టీవీ చానల్లో ప్రసారం చేయడంతో దానికి అందజేసిన మహ్మద్ అక్బర్ షరీఫ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అతనితో పాటు ఈ నెల 8న వీడియో క్లిప్పింగ్స్ షేర్ చేసినందుకు సయ్యద్ ఇమ్రాన్ అలీ (26), మహ్మద్ అలీముద్దీన్ (45)లను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా కింగ్‌కోఠికి చెందిన సయ్యద్ బిన్ సాలం (34), మహ్మద్ బిన్ ఇబ్రహీం (40), మోసిన్ బిన్ అల్ జాబ్రీ (50), హబీబ్ ఉస్మాన్ అల్కాప్ (45)లను సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. -
విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
మూడు రోజుల పాటు నిర్బంధం బెంగళూరు : బాలికపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఇక్కడి హెబ్బాళ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హెబ్బాళలో నివాసముంటున్న బాలిక (15), ఇక్కడి పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. మూడు రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి ఓ ఇంటిలో నిర్బంధించి సామూహిక అత్యాచారం చేశారని బాలిక సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏడాది క్రితం కూడా ఆనందనగరలో నివాసం ఉంటున్న మునిరాజు అనే యువకుడు తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదులో తెలిపింది. ఇప్పుడు అతని స్నేహితులే తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు మునిరాజును ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. బాలికతో పాటు మునిరాజును వైద్య పరీక్షలకు తరలించినట్లు హెబ్బాళ పోలీసులు తెలిపారు. -
నగరంలో మృగాళ్లు
నారపల్లిలో వివాహితపై సామూహిక అత్యాచారం హైదరాబాద్: పహాడీషరీఫ్‌లో స్నేక్ గ్యాంగ్ పాల్పడిన దారుణ ఉదంతాన్ని మరిచిపోక ముందే మరో అకృత్యం చోటుచేసుకుంది. ఉపాధి కోసం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి నగరానికి వచ్చిన ఓ అమాయక గిరిజన వివాహితపై ఐదుగురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె వెంట ఉన్న భర్త, మరిదిలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసి ఈ అకృత్యానికి ఒడిగట్టారు. రాత్రింబవళ్లు వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే హైదరాబాద్-వరంగల్ హైవేకు సమీపంలోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నారపల్లిని ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో మంగళవారం ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎల్లంకి రవికిరణ్‌రెడ్డి కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా లింగాల గ్రామానికి చెందిన వివాహిత(21), ఆమె భర్త, మరిది కూలీ పని కోసం తమ పొరుగు గ్రామానికి చెందిన శ్రీనివాస్ సహకారంతో భువనగిరికి వచ్చారు. శ్రీనివాస్ వారం రోజుల క్రితం ఈ ముగ్గురుతోపాటు మరో నలుగురిని నగరంలోని ఉప్పల్‌కి తీసుకొచ్చాడు. ఏడుగురిని భువనగిరికి చెందిన బాలస్వామి అనే కాంట్రాక్టర్ వద్ద పనికి కుదిర్చాడు. మంగళవారం భువనగిరిలో పనిలో చేరాల్సి ఉండడంతో, సోమవారం నలుగురు వెళ్లిపోయారు. మిగిలిన ముగ్గురు సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఒక ఆటోలో భువనగిరికి బయలుదేరారు. ఉప్పల్‌లో వీరి కదలికలను గమనిస్తున్న ఐదుగురు వ్యక్తులు ఆటోను వెంబడించినట్లు సమాచారం. నారపల్లికి చేరుకోగానే ఆ ఐదుగురు ఆటోను చుట్టుముట్టారు. ఆటోలో ఉన్న ముగ్గురిని బయటకు లాగారు. మరో ఆటోలో ఎక్కించుకొని కొంత దూరం వెళ్లాక, భర్త, మరిదిని రోడ్డు పక్కకు తోసేశారు. అంతేగాక తీవ్రంగా భయపెట్టారు. యువతిని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఐదుగురు యువకులు ఆమెపై అత్యాచారం చేసి పారిపోయారు. సంఘటన స్థలం నుంచి తిరిగి వచ్చిన ఆ యువతి తమ భర్త, మరిది ఉన్న స్థలానికి చేరుకుంది. జరిగిన దారుణాన్ని భర్త, మరిదిల సహాయంతో బోరున విలపిస్తూ స్థానికులకు చెప్పింది. దీంతో వారు మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లిన మేడిపల్లి పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
మిజోరంలో బాలికపై గ్యాంగ్ రేప్
ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరంలో దారుణం జరిగింది. లుంగ్లేయి జిల్లాలో ఓ బాలికపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో నలుగురు మైనర్లే అని పోలీసులు వెల్లడించారు. ఆదివారం రాత్రి తన స్నేహితుడు, మరో ఏడుగురితో కలసి బాధితురాలు తన గ్రామం నుంచి లుంగ్లేయికి బయలుదేరింది. అయితే బాలిక స్నేహితుడు పర్స్ మరచిపోవడంతో.. ఆమెను అక్కడే వదిలి గ్రామానికి వెనుదిరిగాడు. అతడు తిరిగి వచ్చేలోగా నలుగురు మైనర్లతో పాటు మరో ముగ్గురు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.