గ్యాంగ్‌రేప్ కేసులో 13 మందికి 20 ఏళ్ల జైలు | 13 to 20 years in prison for the gang rape case | Sakshi
Sakshi News home page

గ్యాంగ్‌రేప్ కేసులో 13 మందికి 20 ఏళ్ల జైలు

Published Sun, Sep 21 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM

గ్యాంగ్‌రేప్ కేసులో 13 మందికి 20 ఏళ్ల జైలు

గ్యాంగ్‌రేప్ కేసులో 13 మందికి 20 ఏళ్ల జైలు

బోల్‌పూర్: పశ్చిమ బెంగాల్‌లోని లాభ్‌పూర్‌లో ఓ గిరిజన యువతి(20)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 13 మంది కీచకులకు స్థానిక కోర్టు 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పుచెప్పింది. రూ. 5,000 చొప్పున జరిమానానూ చెల్లించాలని లేకపోతే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందంది.

వేరే కులపు  వ్యక్తితో యువతి సంబంధం పెట్టుకోవడంపై ఆగ్రహించిన కులపెద్దలు ఇందుకు శిక్షగా ఆమెపై సామూహిక అత్యాచారం జరపాలని తీర్పు చెప్పారు. దీంతో ఈ ఏడాది జనవరి 21న 13 మంది గ్రామస్తులు యువతిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement