sentenced to prison
-
వెట్టి చాకిరి కేసులో 17 ఏళ్ల జైలు
యాకుత్‌పురా: బాలలతో వెట్టి చాకిరి చేయించిన కేసులో బిహార్‌కు చెందిన నిందితుడికి 17 ఏళ్ల జైలు శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నాంపల్లిలోని 4వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి డి.హేమంత్ కుమార్ బుధవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. భవానీ నగర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. బిహార్‌కు చెందిన షంషీర్ ఖాన్ (38) బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి నషేమాన్‌నగర్ ఒవైసీ పాఠశాల ప్రాంతంలో గాజుల తయారీ కార్ఖానా నిర్వహిస్తున్నాడు. బిహార్‌కు చెందిన మైనర్ బాలలను నగరానికి తీసుకొచ్చి తన కార్ఖానా లో పనిచేయించాడు. 2016 జనవరి 2న అప్పటి భవానీ నగర్ ఎస్ఐ ప్రసాద్‌రావు, కార్మిక శాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల్లో గాజుల కార్ఖానాలో 11 మంది మైనర్ బాలలు పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అప్పటినుంచి కోర్టులో కొనసాగుతున్న కేసుపై ఈ మేరకు తీర్పు వెలువడింది. దీంతో నిందితుడిని జైలుకు తరలించారు. -
భర్తను భుజాలపై మోసేలా శిక్ష
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఇంటినుంచి పారిపోయిన ఓ వివాహితను తన భర్తను భుజాలపై మోస్తూ నడిచేలా అక్కడ గ్రామస్తులు శిక్ష విధించారు. ఆమె వస్త్రాలను లాగడం వంటి చర్యలతో ఘోరంగా అవమానిం చారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో శనివారం రావడంతో పోలీసులు చర్యలు చేపట్టి ఇద్దరిని అరెస్టు చేశారు. ఝభువా జిల్లా దేవిగడ్‌కు చెందిన 27 ఏళ్ల వివాహిత తాను ప్రేమించిన వ్యక్తితో కలిసి రెండు వారాల క్రితం గుజరాత్‌కు పారిపోయింది. అత్తింటివారు ఆమెను కనిపెట్టి స్వగ్రామానికి తీసుకొచ్చారు. భర్తను వదిలేసి ప్రియుడితో పారిపోయినందుకు ఆమెను అవమానిం చారు. భర్తను భుజాలపై మోస్తూ నడవాల్సిందిగా శిక్ష విధించారు. ఎంతో కష్టంతో ఆమె నడుస్తుండగా ఆకతాయిలు ఆమె ముందు చేరి ఈలలు వేస్తూ, గోల చేశారు. ఇలాంటి ఘటనలు అమానవీయమని ఝభువా జిల్లా ఎస్పీ వినీత్ జైన్ అన్నారు. ఘటన సమయంలో ఆ ప్రదేశంలో ఉన్న వారినందరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకురావాల్సిందిగా తాను ఇప్పటికే ఆదేశించానని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 12 మందిపై కేసు నమోదు చేశామనీ, ఇద్దరిని అరెస్టు చేశామని అదనపు ఎస్పీ విజయ్ వెల్లడించారు. -
ఐఏఎస్ అధికారికి జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: కోర్టు స్టే ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించిన మహబూబ్‌నగర్ పూర్వపు జాయింట్ కలెక్టర్ కె.శివకుమార్ నాయుడుకు 30 రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. అధికారులు అకారణంగా జైలుపాలు చేసినందుకు పిటిషనర్‌కు ప్రభుత్వం రూ.50 వేలు చెల్లించాలని హెకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఆదేశించారు. ఈ తీర్పుపై అప్పీల్‌కు ఉత్తర్వులను 3 వారాలపాటు నిలిపేస్తున్నట్లు చెప్పారు. మహబూబ్‌నగర్‌లో బుచ్చయ్య అనే ప్రభుత్వ మాజీ ఉద్యోగికి చెందిన స్థలంలో కల్యాణ మంటపం నిర్మాణ పనులు చేపట్టారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు అప్పటి జేసీ పనులు చేయరాదని 2017 జూలై 1న ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులపై బుచ్చయ్య హైకోర్టు నుంచి ఆగస్టు 29న స్టే ఉత్తర్వులు పొంది నిర్మాణ పనులు ప్రారంభించారు. సెప్టెంబర్‌లో జేసీ ఆదేశాల మేరకు పోలీసులు బుచ్చయ్యను అరెస్టు చేసి 2 నెలల 29 రోజులు జైల్లో పెట్టారు. కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘించి తనను జైల్లో పెట్టారని బుచ్చయ్య హైకోర్టును ఆశ్రయించగా తాజా తీర్పునిచ్చింది. -
నవాజ్ షరీఫ్‌కు పదేళ్ల జైలు
ఇస్లామాబాద్: పనామా పేపర్ల కుంభకోణంలో ఓ కేసుకు సంబంధించి పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఓ కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు ఆయనకు 80 లక్షల పౌండ్ల (దాదాపు 73 కోట్ల రూపాయలు) జరిమానా కూడా విధిస్తూ పాకిస్తాన్‌లోని ఓ అవినీతి వ్యతిరేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పాక్‌లో ఈ నెల 25నే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్ (పీఎంఎల్–ఎన్) పార్టీకి ఈ తీర్పు గట్టి ఎదురుదెబ్బ కానుంది. షరీఫ్‌తోపాటు ఆయన కూతురు మరియంకు కూడా కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, 20 లక్షల పౌండ్ల (దాదాపు 18 కోట్ల రూపాయలు) జరిమానా విధించింది. విచారణకు సహకరించని కారణంగా షరీఫ్, మరియంతోపాటు ఆమె భర్త మహ్మద్ సఫ్దార్కు కూడా చెరో ఏడాది జైలు శిక్ష పడింది. అయితే శిక్షలన్నీ ఏకకాలంలో అమలవనున్నందున షరీఫ్ పదేళ్లు, మరియం ఏడేళ్లపాటు మాత్రమే జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఇస్లామాబాద్‌లోని ఓ అకౌంటబులిటీ కోర్టు, భారీ భద్రత నడుమ రహస్యంగా ఈ తీర్పును వెలువరించింది. అనంతరం తీర్పు వివరాలను నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో (ఎన్ఏబీ) న్యాయవాది మీడియాకు వెల్లడించారు. అంతకుముందు ఈ తీర్పును వారంపాటు వాయిదా వేయాలంటూ షరీఫ్ కుటుంబసభ్యులు కోరినా న్యాయమూర్తి పట్టించుకోలేదు. గతేడాది పాకిస్తాన్ సుప్రీంకోర్టు తీర్పుతో పదవీచ్యుతుడిగా మారిన నవాజ్ షరీఫ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. తాజా తీర్పులో ఆయన కూతురు, అల్లుడికి జైలు శిక్ష పడినందున వారు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అయితే ఈ తీర్పుపై వారు 10 రోజుల్లోపు పై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చని ఎన్ఏబీ న్యాయవాది చెప్పారు. అసలు కేసు ఏంటి? పనామా పేపర్ల కుంభకోణానికి సంబంధించి షరీఫ్ కుటుంబంపై మొత్తం 3 కేసులుండగా, అవెన్‌ఫీల్డ్ కేసులో శుక్రవారం తీర్పు వెలువడింది. 1990ల్లోనూ నవాజ్ షరీప్ పాకిస్తాన్ ప్రధానిగా పనిచేశారు. అప్పట్లో అవినీతి సొమ్మును కూడబెట్టి లండన్‌లోని పార్క్‌లేన్‌లో ఉన్న అవెన్‌ఫీల్డ్ హౌస్ అనే భవంతిలో ఖరీదైన నాలుగు ఫ్లాట్లను షరీఫ్ కుటుంబ సభ్యులు కొన్నారు. 1993 నుంచీ ఈ ఫ్లాట్లు వారి పేరనే ఉన్నాయి. గతేడాది సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎన్ఏబీ ఈ కేసులో విచారణ చేపట్టింది. షరీఫ్‌తోపాటు ఆయన కొడుకులు, కూతురు, అల్లుడిని కూడా ఎన్ఏబీ ఈ కేసులో నిందితులుగా చేర్చింది. 9 నెలలకు పైగా విచారించిన అనంతరం కోర్టు షరీఫ్, ఆయన కూతురిని దోషులుగా తేలుస్తూ తీర్పిచ్చింది. పాకిస్తాన్‌కు తిరిగొస్తారా? కేన్సర్‌కు చికిత్స పొందుతున్న తన భార్యకు తోడుగా నవాజ్ షరీఫ్ ప్రస్తుతం లండన్‌లోనే ఉన్నారు. కోర్టు తీర్పు వెలువరించిన సమయంలో ఆయన తన కూతురితో కలసి అవెన్యూఫీల్డ్లోని ఫ్లాట్‌లోనే ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు కోర్టు వీరిని దోషులుగా తేల్చి, శిక్ష విధించడంతో షరీఫ్, మరియంలు పాక్‌కు తిరిగొచ్చి జైలు శిక్షను అనుభవిస్తారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 25నే ఎన్నికలు జరగనున్నందున వారు దేశానికి తిరిగొచ్చి జైలుకు వెళితే సానుభూతితో పీఎంఎల్–ఎన్ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దొంగను కాదు.. తిరిగొస్తా: షరీఫ్ పాకిస్తాన్‌కు వలస పాలన నుంచి విముక్తి లభించినా, దేశ ప్రజలు మాత్రం ఇంకా బానిసత్వంలోనే ఉన్నారని నవాజ్ షరీఫ్ అన్నారు. తీర్పు అనంతరం ఆయన లండన్‌లో విలేకరులతో మాట్లాడారు. పాకిస్తాన్‌కు ఉన్న 70 ఏళ్ల చరిత్ర గతిని తాను మార్చాలనుకున్నందుకు, ఓటుకు గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేసినందుకే తనకు ఈ శిక్ష పడిందని నవాజ్ షరీఫ్ అన్నారు. తానేమీ దొంగను కాదనీ, పాకిస్తాన్‌కు తెరిగి వెళ్తానని స్పష్టం చేశారు. నిజం మాట్లాడినందుకు పాకిస్తానీలను బంధించడమనే ప్రక్రియ ఆగిపోయేంత వరకు, కొందరు ఆర్మీ జనరళ్లు, న్యాయమూర్తులు పాకిస్తానీలకు విధిస్తున్న బానిసత్వం తొలగిపోయేంత వరకు తన పోరాటం కొనసాగుతుందని షరీఫ్ పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్ సోదరుడు, పీఎంఎల్–ఎన్ పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ కూడా తమ వాళ్లను కోర్టు దోషులుగా తేల్చడాన్ని తిరస్కరించారు. కోర్టు నవాజ్ షరీఫ్, మరియంలను దోషులుగా తేల్చడం అన్యాయమనీ, రాజకీయ దురుద్దేశం వల్లే ఇలా జరిగిందని ఆయన ఆరోపించారు. జూలై 25న ప్రజా న్యాయస్థానంలో తమ వాళ్లు నిర్దోషులుగా బయటకొస్తారన్నారు. -
తల్లికి జైలు
కూతురికి ఇష్టం లేకుండా పెళ్లి చెయ్యాలని ప్రయత్నించిన ఒక తల్లిని బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘నిజమే, ఆమె ఆ ప్రయత్నం చేసింది’ అని నిర్ధారణ అయ్యాక కోర్టు ఆమెకు నాలుగున్నరేళ్ల జైలుశిక్ష విధించింది. ‘బలవంతంగా పెళ్లి చేయడం నేరం’ అని బ్రిటన్ తొలిసారిగా 2014లో ఒక చట్టం చేసింది. ఆ చట్టం కింద కేసు నమోదై, శిక్ష పడిన తొలి కేసు ఈ మాతృమూర్తిదే. అయితే ఆమె ఒకసారి ఈ నేరాన్ని చేయలేదు. రెండుసార్లు చేసింది. తల్లీకూతుళ్లు బర్మింగ్‌హామ్‌లో ఉండేవారు. ఐదేళ్ల క్రితం తన పదమూడేళ్ల కూతుర్ని పాకిస్తాన్ తీసుకెళ్లింది ఆ తల్లి. అక్కడ, పదహారేళ్లు పెద్దవాడైన వరుడితో కూతురికి ఇష్టం లేకుండా పెళ్లి జరిపించింది. ఆ తర్వాత ఆమె గర్భం దాల్చడంతో భర్త వదిలేశాడు. తిరిగి కూతుర్ని బ్రిటన్ తీసుకొచ్చి గర్భస్రావం చేయించింది. ఇటీవల కూతురి 18వ పుట్టిన రోజుకు కొన్నాళ్ల ముందు ‘ఫ్యామిలీ హాలిడే’ అని చెప్పి కూతుర్ని పాకిస్తాన్ తీసుకెళ్లింది. అక్కడ మళ్లీ ఇంకొకరికిచ్చి కట్టబెట్టడానికి సిద్ధపడినప్పుడు చుట్టుపక్కలవాళ్లు ఆ అమ్మాయిని కాపాడి, తల్లిని పోలీసులకు అప్పగించారు. ఇండియాలోనూ ఇలాంటి తల్లులు ఉన్నారు కానీ, ఇంత బలంగా చట్టాలు అమలు కావడం లేదు. -
బినామీ లావాదేవీలకు ఏడేళ్ల జైలు
న్యూఢిల్లీ: దేశంలో బినామీ లావాదేవీలు జరిపితే ఏడేళ్ల వరకు కఠిన జైలు శిక్షతో పాటు భారీ జరిమానా ఉంటుందని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ హెచ్చరించింది. వీరు బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ చట్టం – 1988తో పాటు ఐటీ చట్టం ప్రకారం కూడా శిక్షార్హులని పేర్కొంది. ఎవరూ బీనామీ లావాదేవీలు జరపడానికి వీల్లేదని, ఇది 2016 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిందని పేర్కొంది. ఈ చట్టం ప్రకారం బినామీగా వ్యవహరించిన వ్యక్తి, వాస్తవ ఆస్తిపరుడు, సహాయం చేసినవారు అందరూ శిక్షార్హులేనని, వారికి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, బినామీ ఆస్తి మార్కెట్ ధరలో 25 శాతం జరిమానా విధించాల్సి ఉంటుందని ఐటీ శాఖ తెలిపింది. ఒకవేళ అధికారులకు బినామీ ఆస్తులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష, ఆస్తి మార్కెట్ ధరలో 10 శాతం జరిమానా కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే సంబంధిత బినామీ ఆస్తిని గుర్తిస్తే ప్రభుత్వం దాన్ని జప్తు చేస్తుందని వెల్లడించింది. ఈ చట్టం గతేడాది అమల్లోకి వచ్చినప్పుటి నుంచి దేశవ్యాప్తంగా 230 కేసులు నమోదు కాగా, రూ. 55 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ అయ్యాయి. -
వీడని ఉత్కంఠ
రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టేదెవరో అన్న ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బుధవారం కూడా రాజ్‌భవన్ చుట్టూ రాజకీయం సాగింది. ఆపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా ఎన్నికైన కె పళనిసామి మరో మారు వేర్వేరుగా గవర్నర్ విద్యాసాగర్‌రావుతో భేటీ అయ్యారు. గార్డెన్ నుంచి బయలు దేరి అమ్మ సమాధి వద్ద నివాళులర్పించినానంతరం చిన్నమ్మ శశికళ బెంగళూరు కోర్టుకు వెళ్తున్న సమయంలో ఆమె శిబిరం తీవ్ర విషాదంలో మునిగింది. సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలో రాజకీయ పోరు ఉత్కంఠ భరితంగానే సాగుతోంది. చిన్నమ్మ శశికళకు జైలు శిక్ష పడడం ఆమె శిబిరాన్ని ఢీలా పడేలా చేసింది.అయినా, సేనలకు భరోసా, ధైర్యాన్ని ఇచ్చిన చిన్నమ్మ శశికళ పోయెస్ గార్డెన్ నుంచి బుధవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో బయటకు వచ్చారు. అక్కడున్న మద్దతుదారులు చిన్నమ్మకు ఎదురైన కష్టాన్ని తలచుకుని ఉద్వేగానికి గురయ్యారు. తన కంట నీరు సుడులు తిరుగుతున్నా, బయటకు రానివ్వకుండా, మద్దతుదారులకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నాన్ని చిన్నమ్మ చేశారు. చివరకు సెలవంటూ ముందుకు సాగుతున్న సమయంలో ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. నేరుగా మెరీనా తీరంలోని అమ్మ సమాధి వద్ద, రామాపురం తోట్టంలోని ఎంజీఆర్ ఇంటి వద్ద కాసేపు మౌనంగా కూర్చున్నారు. అక్కడి నుంచి ఆమె బెంగళూరుకు పయనం అవుతున్న వేళ, మద్దతు దారుల హృదయాలు బరువెక్కాయి. కంటి నుంచి నీటి ధార పొంగింది. ముందుగా, చిన్నమ్మ జైలుకు వెళ్లనుండడంతో పార్టీ పరంగా తమకు పెద్ద దిక్కుగా ఎవరు ఉంటారో అని మద్దతుదారులు ఎదురు చూస్తున్న సమయంలో హఠాత్తుగా టీటీవీ దినకరన్ తెర మీదకు రావడం ఆ శిబిరానికి ఊరట. దినకరన్ చేతిలో అధికారం: అధికారం తన విధేయుడు పళనిసామి చేతికి చేరిన పక్షంలో, జైలు నుంచే ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించేందుకు తగ్గ వ్యూహంతో చిన్నమ్మ బెంగళూరుకు బయలు దేరి వెళ్లారు. తన సోదరి వనిత వాణి కుమారుడు టీటీ దినకరన్ చేతిలో పార్టీని ఉంచడం, సర్వాధికారాల్ని అప్పగించి వెళ్లడంతో ఇక, శశికళ కుటుంబ రాజకీయ హవా చిన్నమ్మ శిబిరంలో మరింతగా పెరిగినట్టే. అదే సమయంలో దినకరన్‌కు చిన్నమ్మ శిబిరంలో వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మున్ముందు ఈ శిబిరంలో ఆసక్తికర మలుపులకు అవకాశాలు ఎక్కువే. ఇక, ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ, కిడ్నాప్‌నకు గురయ్యారంటూ వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించినానంతరం చిన్నమ్మ శిబిరంపై కేసుల మోత మోగించే పనిలో పోలీసులు పడటం గమనార్హం. పన్నీరు శిబిరంలో సందడి కరువు: చిన్నమ్మ శిబిరంలోఉద్వేగ భరిత వాతావరణం చోటు చేసుకుంటే, గ్రీన్‌వేస్ రోడ్డులోని పన్నీరు శిబిరంలో సందడి కరువు అయింది. నిన్నటి వరకు పెద్ద సంఖ్యలో మద్దతు దారులు తరలి రాగా, బుధవారం సంఖ్య తగ్గింది. సినీ నటి గౌతమి అక్కడికి వచ్చిన పన్నీరు మద్దతు పలికారు. ముఖ్య నేతలతో పన్నీరు సమాలోచనలో బిజీబిజీ అయ్యారు. కూవత్తూరులో ...: కూవత్తూరులోని క్యాంప్ ఆవరణలో మధ్యాహ్న సమయంలో హై టెన్షన్ వాతావరణం కాసేపు నెలకొంది. అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. పోలీసు బలగాలు క్యాంప్ వైపుగా దూసుకు రావడంతో శిబిరాన్ని ఖాళీ చేయిస్తారా..?అన్న ఉత్కంఠ తప్పలేదు. చిన్నమ్మ శిబిరంలోని ఎమ్మెల్యేలు కిడ్నాప్‌నకు గురయ్యారన్న ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేయడంతో, అందుకు తగ్గ చర్యలు ఏదేని చేపట్టనున్నారా అన్న ప్రశ్న బయలు దేరింది. చివరకు ఉత్కంఠ వీడినా, చిన్నమ్మకు విశ్వాసంగా ఉన్న ఎమ్మెల్యేలు ఒకరిద్దరు మీడియా ముందుకు వచ్చి, తాము ఆనందంగా, స్వతంత్రంగా ఉన్నామని, తమను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని ప్రకటించారు. గవర్నర్ నుంచి పిలుపు వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. రాజ్ భవన్ చుట్టూ: అన్నాడీఎంకే రాజకీయ సమరం రాజ్‌భవన్ చుట్టూ సాగింది. తమను ఆహ్వానిస్తారా...తమను ఆహ్వానిస్తారా..? అన్న ఎదురు చూపుల్లో రెండు శిబిరాలు సాయంత్రం వరకు నిమగ్నమయ్యాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటు విషయంగా న్యాయ నిపుణులతో గవర్నర్(ఇన్) సీహెచ్ విద్యాసాగర్ రావు సంప్రదింపుల్లోనే ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ సమయంలో సాయంత్రం పళనిస్వామి గవర్నర్‌తో భేటీ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ప్రభుత్వ ఏర్పాటు విషయంగా ఎలాంటి నిర్ణయాలు, హామీలు గవర్నర్ నుంచి రాలేదు. తదుపరి ఆపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వం, మంత్రి పాండియరాజన్ రాజ్‌భవన్‌లో అడుగు పెట్టడంతో ఎదురు చూపులు మరింతగా పెరిగాయి. అయితే, ఇవన్నీ కేవలం భేటీలుగా మిగిలినా, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కీలక మలుపులు తిరిగేనా అన్న చర్చ బయలు దేరింది. కొన సాగుతున్న ఉత్కంఠకు తెర పడేది ఎప్పుడో అన్న ఎదురు చూపుల్లో రాజకీయ వర్గాలు, రాష్ట్ర ప్రజలు నిమగ్నమయ్యారు. -
భారత పటంపై జోక్యం సరికాదు
న్యూఢిల్లీ: భారతపటం విషయంలో పాక్ జోక్యం సరికాదని భారత్ మండిపడింది. భారత పటాన్ని తప్పుగా చూపేవారికి భారీ జరిమానా, జైలు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లు విషయంలో ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకోవాలని మంగళవారం పాక్ విజ్ఞప్తి చేసింది. దీన్ని భారత్ తప్పుబట్టింది. భారత విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్మాట్లాడుతూ ప్రతిపాదిత బిల్లు పూర్తిగా భారత చట్టాలకు సంబంధించిన అంతర్గత అంశమన్నారు. పాకిస్తాన్‌కు, ఇతరులకు దీనిపై మాట్లాడటానికి అధికారం లేదన్నారు. కాగా, ఈ బిల్లుపై పాక్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్.అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం ఆపాలని ఐరాసను కోరింది. కశ్మీర్‌ను భారత్‌లో భాగంగా చూపొద్దని పేర్కొంది. -
కన్నడ నటి మైత్రేయిగౌడకు జైలు
ఆ వెంటనే బెయిల్ .. బెంగళూరు(బనశంకరి): ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో కన్నడ నటి మైత్రేయిగౌడకు రెండేళ్లు, ఆమె స్నేహితులు ముగ్గురికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ నగర మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం తీర్పువెల్లడించింది. ఆ వెంటనే బెంగళూరు ఐదో ఏసీఎంఎం కోర్టు ఈ నలుగురికీ బెయిల్ మంజూరైంది. 2011లో నటి మైత్రేయిగౌడ స్నేహితురాళ్లు సుప్రియ, రూపా, రేఖతో కలిసి నగరంలో ఓ వైపు కారు డ్రైవింగ్ చేస్తూ మరో వైపు సెల్ఫోన్లో మాట్లాడుతోంది. బసవేశ్వర ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్ శివకుమార్ కారును అడ్డుకోగా మైత్రేయిగౌడ ఆమె స్నేహితులు దాడికి పాల్పడ్డారు. ఘటనపై బసవేశ్వరనగర ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు శుక్రవారం బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టులో విచారణకు రాగా వీరి నలుగురి నేరం రుజువు కాడంతో జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. అయితే ఆ వెంటనే నగర 5 వ ఏసీఎంఎం కోర్డు నలుగురికి బెయిల్ మంజూరు చేసింది. -
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగికి 3 నెలల జైలుశిక్ష
అప్పు ఎగవేత, చెక్కుబౌన్స్ కేసులో కోర్టు తీర్పు సాక్షి, హైదరాబాద్: అవసరం నిమిత్తం రూ.30 లక్షలు అప్పు తీసుకుని ఎగవేసిన ఓ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగికి న్యాయస్థానం 3 నెలల జైలుశిక్ష విధిం చింది. దానిని అప్పిలేట్ కోర్టు కూడా సమర్థిస్తూ.. అప్పు వడ్డీతో సహా చెల్లిం చాలని ఆ విశ్రాంత ఉద్యోగికి స్పష్టం చేసింది. లేనిపక్షంలో అదనంగా జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందంది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఐదో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఇటీవల తీర్పునిచ్చారు. కూకట్‌పల్లిలోని వివేకానందనగర్ కాలనీకి చెందిన ఎల్.సుబ్బరామిరెడ్డి వద్ద కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన జి.వి.రమణారెడ్డి వ్యక్తిగత అవసరాల నిమిత్తం 2006లో రూ.30 లక్షలు తీసుకున్నారు.నెలకు 3శాతం వడ్డీ చెల్లించేటట్లు ఒప్పందం చేసుకున్న సుబ్బరామిరెడ్డి రూ.10 లక్షల చొప్పున 3 చెక్కులను రమణారెడ్డికి ఇచ్చారు. అప్పులో కొంత భాగాన్ని చెల్లించేందు కు రమణారెడ్డి 2009లో సుబ్బరామిరెడ్డికి కొన్ని చెక్కులు ఇచ్చారు. కానీ అవి బౌన్స్ అయ్యాయి. దీంతో సుబ్బరామిరెడ్డి కూకట్పల్లి స్పెషల్ మేజిస్ట్రేట్ కోర్టులో రమణారెడ్డిపై కేసు పెట్టారు. తాను సుబ్బరామిరెడ్డి నుంచి అప్పు తీసుకోలేదని, ప్లాట్ల కొనుగోలు లావాదేవీలకు సంబంధించి సర్దుబాటు నిమిత్తం తనకు చెక్కులు ఇచ్చారని రమణారెడ్డి కోర్టుకు చెప్పారు. కానీ ఆ సొమ్మును అప్పుగానే తీసుకున్నట్లు కోర్టు తేల్చింది. ‘నెగోషియబుల్ ఇన్స్ట్రుమెం ట్స్ యాక్ట్’ కింద రమణారెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ.. జైలు శిక్ష విధిం చింది. అసలు రూ.30లక్షలతో వడ్డీ, జరిమానా కింద మరో రూ.16 లక్షలు కలిపి మొత్తం రూ.46లక్షలను సుబ్బరామిరెడ్డికి చెల్లించాలంది. ఈ తీర్పుపై రమణారెడ్డి అప్పిలేట్ కోర్టుకు వెళ్లగా.. శిక్ష విధింపును సమర్థించింది. అయితే జరిమానాను మాత్రం కొంత తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
జైలులో ఉన్నత విద్య
పోచమ్మమైదాన్: జైలు శిక్ష అనుభవిస్తూ డిగ్రీ పట్టా సాధించారు పాపినేని సుధీర్‌కుమార్, నాగమణి దంపతులు. వీరు ప్రభుత్వంపెట్టిన క్షమాభిక్ష ద్వారా వరంగల్ కేంద్ర కారాగారం నుంచి మంగళవారం విడుదలయ్యా రు. వీరిది ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగలవంచ. వీరిద్దరు పదో తరగతి వరకు చదువుకున్నారు. వీరి భూమిని ఆక్రమిస్తుండటంతో జరిగిన గొడవలో ఒకరు చనిపోయారు. దీంతో వీరిద్దరికి జైలు శిక్ష పడింది. శిక్షా కాలంలో సమయం వృథా చేయవద్దని నిర్ణయానికి వచ్చారు. కేంద్ర కారాగారంలో చదువుకునే అవకాశం ఉండటంతో భార్యాభర్తలు ఇద్దరూ బీఏలో ప్రవేశం పొందారు. ఇద్దరూ డిగ్రీ పాస్ అయ్యారు. ఎంఏ సోషియాలజీ సైతం ఇటీవల పూర్తి చేశారు. వీరిద్దరు ఇప్పటికే డిగ్రీ పట్టా పొందగా.. మరో 10 రోజుల్లో పీజీ పట్టాను సైతం పొందనున్నారు. కేంద్ర కారాగారంలో శిక్షను అనుభవిస్త్తూనే చదువుపై ఉన్న పట్టుదలతో ఇద్దరు పీజీలు పూర్తి చేశారు. -
త్వరలో సినిమాలూ విడుదల...
సంజయ్ దత్ జైలుకెళ్లాడు. వచ్చాడు. జైలు కెళ్లాడు. వచ్చాడు. జైలుకి... ఇంటికి... ఈ ఆట ఇక ముగియనుంది. ముంబై పేలుళ్ల కేసులో ఐదేళ్ల జైలు శిక్ష పడి ఆ శిక్ష అప్పుడు కాస్తా అప్పుడు కాస్తా పూర్తి చేస్తూ గత కొంత కాలంగా పూణె ఎరవాడ జైలులో ఉంటున్న సంజయ్ దత్ నిజానికైతే నవంబర్ 2016 వరకూ లోపలే ఉండాలి. కాని సత్ప్రవర్తన రీత్యా శిక్షాకాలం తగ్గి రాబోయే నెలలో విడుదల కానున్నాడు. ఈ విషయం అధికారికంగా ప్రకటితం కాకున్నా ఇప్పటికే బాలీవుడ్‌కు అంది హుషారుగా స్పందిస్తోంది. సన్నిహితుడు విధు వినోద్ చోప్రా అయితే ఇప్పటికే స్క్రిప్ట్‌లు రెడీ చేసి పెట్టాను... సంజయ్ రావడమే తరువాయి అంటున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘మున్నాభాయ్ ఎంబిబిఎస్’, ‘లగే రహో మున్నాభాయ్’ వచ్చి ఘన విజయం సాధించాయి. మూడో సీక్వెల్‌గా ‘మున్నాభాయ్ ఇన్ ఫ్లయిట్’ స్క్రిప్ట్ సిద్ధమైంది. అది తెరకెక్కేలోపలే సంజయ్ లోపలికి వెళ్లాల్సి రావడంతో దానికి మెరుగులు పెడుతూ ఇన్నాళ్లు బృందం ఊరికే ఉండి పోయింది. సంజయ్ బయటకు రావడంతోటే మొదలుకావచ్చు. అది గాక సంజయ్ కూడా జైలులో దాదాపు పది సినిమాలకు కథలు తయారు చేసుకున్నాడట. వాటిలో ఏది ముందుకు వెళుతుందో చెప్పలేము. ఏమాటకా మాట- జైలులో సంజయ్ ప్రవర్తన నిజంగానే బాగుందట. రోజుకు 25 రూపాయల కూలీకి పేపర్ బ్యాగ్స్ తయారు చేయడం అతడి పని. ఆ తర్వాత అది మానేసి జైలు సిబ్బందితో క్లరికల్ పనులు చేస్తున్నాడు. కోరిన తిండి కోరిన వసతి లేకపోవడం వల్ల సంజయ్ ఇప్పటికి దాదాపు 18 కిలోలు తగ్గాడు. ఇది అతడి మీద సానుభూతిని పెంచింది. -
జాకీచాన్ కొడుక్కి ఆరునెలల జైలు శిక్ష
యాక్షన్ చిత్రాలతో ప్రపంచ ప్రేక్షకుల మన్నలను పొందిన హాలీవుడ్ సూపర్‌స్టార్ జాకీచాన్‌కు తన కుమారుడి వల్లే పరువు పోయే పరిస్థితి వచ్చింది. ఆర్టిస్ట్‌గా తండ్రి జాడల్లో నడుస్తున్న జైసీ చాన్‌కు మాదకద్రవ్యాల కేసులో ఆరునెలల జైలు శిక్ష పడింది. చైనా గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్న జాకీచాన్ ఇప్పటికే తన కొడుకు పాల్పడిన నేరానికి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పు వెలువరించే సమయంలో జాకీ చాన్ కుటుంబ సభ్యులు హాజరు కాలేదు. జైసీతో పాటు తైవాన్ నటి కొచెన్ టుంగ్కు కూడా శిక్ష పడింది. జైసీ చాన్ ఇప్పటివరకూ 20 చిత్రాల్లో నటించారు. -
హత్యకేసులో నలుగురికి జైలు
న్యూఢిల్లీ: ఓ వ్యక్తిని హత్యచేసిన నలుగురికి జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇనుపరాడ్స్ వినియోగించి దాడి చేయడ వలన తీవ్రంగా గాయపడిని వ్యక్తి పరిస్థితి విషమించడంలో మృతి చెందాడని రుజువైంది. అదనపు సెషన్స్ జడ్జి అశుతోష్ కుమార్ ఈ మేరకు నేరస్తులకు జైలు శిక్ష ఖరారు చేశారు. నైరుతి ఢిల్లీకి చెందిన మోహద్ నిషార్, ఇస్తకార్, రమీజ్‌లపై ఐపీసీలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. నిందితులు ఉద్దేశ పూర్వకంగా దండ, సారియ ఇనుప ఆయుధాలతో బాధితుడిపై దాడికి పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజుల తర్వాత మృతి చెందాడు. నిందితులు కొట్టిన గాయాల కారణంగానే అతడు మృతి చెందాడు. ఎలాంటి నేరం చేయకుండానే మధ్యలోనే జీవితాన్ని చాలించాడు, దాంతో అతడిపై ఆధారపడిన కుటుంబం వీధుల పాలైందని కోర్టు అభిప్రాపడిందని జడ్జి పేర్కొన్నారు. మహ్మద్ తన్వీర్‌ను కొడుతుండగా, రక్షించబోయిన మొహద్ గుఫ్రాన్ స్వల్పగాయాలకు గురైయ్యాడు. ఇతనితోపాటు పోలీసుల సాక్ష్యాన్ని పరిశీలించిన కోర్టు ఈ మేరకు దోషులుగా నిర్దారిస్తూ జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరు రూ. 15,000 జరిమానా విధిస్తూ ఆదే శించింది. ఆగస్టు 25, 2010లో ప్రత్యక్షసాక్షి మహ్మద్ గఫ్రాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కపషెహరాలో పనిచేసి ఇంటికి తిరిగి వస్తున్న తన్వీర్‌పై నలుగురు వ్యక్తులు ఇనుప రాడ్స్‌తో దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసు పూర్వాపరాలు పరీలించిన కోర్టు నేరస్తులకు కఠిన కారాగార శిక్ష విధించింది. -
పన్నీర్‌కే పట్టం..
నమ్మినబంటుకే సీఎంగా ఓటేసిన జయ పన్నీర్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నఅన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నేడు ప్రవూణస్వీకారం చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు జైలు శిక్ష పడిన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి, అమ్మకు అత్యంత నమ్మకస్తుడైన ఒ.పన్నీర్ సెల్వం(63) ఆమె వారసునిగా ఎన్నికయ్యారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆదివారం సమావేశమై పన్నీర్‌సెల్వంను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశం అనంతరం లెజిస్లేచర్ పార్టీ నిర్ణయుం గురించి పన్నీర్ గవర్నర్ కె.రోశయ్యను కలసి వివరించారు. దీంతో గవర్నర్ ఆయనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆయన సోమవారం ఉదయం తమిళనాడు తదుపరి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంతో.. ఎమ్మెల్యే సభ్యత్వాన్ని తద్వారా సీఎం పదవిని అమ్మ కోల్పోయారు. దీంతో కొత్త సీఎం ఎన్నిక అనివార్యమైంది. బెంగళూరు కోర్టులో 27న జయ కేసు విచారణ సమయంలోనే.. మధ్యలో వెలుపలకు వచ్చిన జయ, పన్నీర్‌ను పిలిపించుకుని కొద్దిసేపు మాట్లాడారు. అప్పుడే అమ్మ వారసుడు పన్నీర్ అనే ప్రచారం మొదలైంది. చివరికి అదే నిజమైంది. 2001లో జయ జైలుకు వెళ్లిన ఇటువంటి పరిస్థితుల్లోనే పన్నీర్ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఈసారి పన్నీర్ సెల్వం పేరుతోపాటూ రవాణా మంత్రి బాలాజీ, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్ పేర్లు వినిపించాయి. అయితే పిన్న వయసు, అనుభవ లోపం బాలాజీని వెనక్కునెట్టగా.. పార్టీవారిని కాదని మాజీ ఐఏఎస్‌ను సీఎంను చేస్తే క్యాడర్లో అసంతృప్తి బయలుదేరే అవకాశం ఉందనే అనుమానంతో షీలాను పక్కనపెట్టారు. జయ జైలుకెళ్లడంతో తమిళనాట వెల్లువెత్తిన ఆగ్రహజ్వాలలు ఆదివారానికి చల్లబడ్డాయి. చెన్నై: ఓ పక్క పొలం పనులు చూసుకుంటూనే రాజకీయ నేతగా రాణించిన ఓ.పన్నీర్‌సెల్వం(63) రెండోసారి తమిళనాడు సీఎం కాబోతున్నారు. పన్నీర్ 1951లో తేనీ జిల్లా పెరియకుళంలో జన్మించారు. ఆయన గతంలో టీ కొట్టు కూడా నడిపారు. ప్రస్తుతం దాన్ని ఆయన కుటుంబసభ్యులు నడుపుతున్నారు. పన్నీర్ 1990లో పెరియకుళం మునిసిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యూరు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో పెరియకుళం నుంచే ఎమ్మెల్యేగా గెలుపొంది జయ కేబినెట్లో మంత్రిగా చేరారు. టాన్సీ భూముల కేసులో జయ అదే ఏడాది జైలుకెళ్లడంతో ఆయన సీఎం అయ్యారు. 2001 సెప్టెంబరు నుంచి 2002 మార్చి దాకా ఆ పదవిలో ఉన్నారు. జయ జైలు నుంచి రాగానే రాజీనామా చేసి ఆమె కేబినెట్లో మంత్రిగా చేరారు. 2011లో తేనీ జిల్లా బోడీ స్థానం ఎమ్మెల్యేగా ఎన్నికై జయ కేబినెట్లో ఆర్థిక శాఖ చేపట్టారు. తమిళనాడులో రాజకీయంగా పలుకుబడి ఉన్న దేవర్ కులం నుంచి సీఎం పీఠాన్ని అధిరోహించిన తొలివ్యక్తిగా పన్నీర్ రికార్డు సృష్టించారు. -
గ్యాంగ్‌రేప్ కేసులో 13 మందికి 20 ఏళ్ల జైలు
బోల్పూర్: పశ్చిమ బెంగాల్‌లోని లాభ్పూర్లో ఓ గిరిజన యువతి(20)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 13 మంది కీచకులకు స్థానిక కోర్టు 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పుచెప్పింది. రూ. 5,000 చొప్పున జరిమానానూ చెల్లించాలని లేకపోతే మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందంది. వేరే కులపు వ్యక్తితో యువతి సంబంధం పెట్టుకోవడంపై ఆగ్రహించిన కులపెద్దలు ఇందుకు శిక్షగా ఆమెపై సామూహిక అత్యాచారం జరపాలని తీర్పు చెప్పారు. దీంతో ఈ ఏడాది జనవరి 21న 13 మంది గ్రామస్తులు యువతిపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. -
ఇద్దరు పోలీసులకు మూడేళ్ల జైలు
న్యూఢిల్లీ: నాటుసారా విక్రయదారు నుంచి రూ.100 చొప్పున లంచం తీసుకున్న ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లకు స్థానిక కోర్టు మూడేళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. హర్యానాలోని ఝజ్జర్‌కు చెందిన కానిస్టేబుల్ రామ్‌కుమార్, జింద్‌వాసి రామ్‌కుమార్‌కు శిక్ష ఖరారు చేస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎల్కే గౌర్ తీర్పు చెప్పారు. సారా విక్రేత నుంచి వీళ్లు లంచాలు తీసుకుంటున్నట్టు 2004లో వీడియోల్లో బయపడడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించి, ఇద్దరినీ సస్పెండ్ చేశారు. నిందితులు అధికార దుర్వినియోగానికి పాల్పడి లంచాలు తీసుకుంటున్నట్టు నిర్ధారణ అయిందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. శిక్షతోపాటు ఝజ్జర్‌వాసి రామ్‌కుమార్ రూ.40 వేలు, జింద్‌వాసి రామ్‌కుమార్‌కు రూ.60 వేలు జరిమానా విధించారు. ఈ వీడియో తీసిన చేతన్ ప్రకాశ్ అనే ఢిల్లీవాసి ఫిర్యాదు మేరకు సీబీఐ వీళ్లిద్దరిపై కేసులు నమోదు చేసింది. -
తన్నుకుంటే.. తగ్గిస్తారు..
సాధారణంగా ఖైదీల సత్ప్రవర్తనను చూసి, వారి జైలు శిక్షను తగ్గించడం లేదా విడుదల చేయడం వంటివి చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా జరిగేది ఇదే. కానీ.. థాయ్‌లాండ్‌లోని క్లాంగ్ప్రెమ్ సెంట్రల్ జైలులో మాత్రం అంతా రివర్స్. ఇక్కడ ఖైదీలు వేరొకరిని చితక్కొడితే.. జైలు శిక్షను తగ్గిస్తారు! నిజ్జంగా నిజం. ఇక్కడ ఖైదీలు తమ జైలు శిక్షను తగ్గించుకోవాలనుకున్నా.. పెరోల్ కావాలనుకున్నా జైలులో జరిగే కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొంటారు. విదేశీ కిక్బాక్సర్లపై విజయం సాధిస్తే.. వారి కోరిక నెరవేరినట్లే. అందుకే ఈ సెంట్రల్ జైలులో నిర్వహించే ‘ప్రిజన్ ఫైట్’కు తెగ డిమాండ్ ఉంటుంది. ఇందుకోసం ఖై దీలు కిక్ బాక్సింగ్‌ను నేర్చుకుంటారు. ఈ పోటీల్లో గెలుపొందితే.. వారికి ప్రైజుమనీని ఇవ్వడంతోపాటు అధికారులు జైలు శిక్షను కొంతకాలం తగ్గిస్తారు. అయితే.. ఈ శిక్ష తగ్గింపు ఎవరికిపడితే వారికి ఇవ్వరట. జైలులో మంచిగా ఉన్నవారికే అవకాశమట. 2013 జనవరిలో ఈ తరహా పోటీలు ప్రారంభమయ్యాయి. ఎందుకిదంతా అంటే.. 1774లో థాయ్‌లాండ్ వీరుడు నాయ్ ఖనోంటోమ్ బర్మా జైలులో ఉన్నప్పుడు అక్కడి రాజు ఆదేశానుసారం ఇలాగే 9 మంది వీరులను ఓడించి.. జైలు నుంచి విడుదల పొందాడట. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని వీరిక్కడ ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. -
మరుగుదొడ్ల శుభ్రతకు స్కావెంజర్లను వినియోగిస్తే జైలే
సాక్షి, హైదరాబాద్: మరుగుదొడ్లను, సీవరేజీ లేన్లను శుభ్రం చేయడానికి ఇకపై పారిశుద్ధ్య కార్మికుల(మాన్యువల్ స్కావెంజర్స్)ను వినియోగించుకుంటే అలాంటివారు ఏకంగా జైలు శిక్షను, జరిమానాలను ఎదుర్కోవలసి ఉంటుంది. స్కావెంజర్ల వినియోగంపై నిషేధం, కార్మికుల పునరావాసంకోసం తయారైన చట్టం ప్రభుత్వానికి ఈ అధికారాలు కల్పిస్తోంది. పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టం వచ్చే నెల 6నుంచి అమలుకానున్న నేపథ్యంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మాన్యువల్ స్కావెంజర్ల వివరాలను పురపాలక శాఖ సేకరించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. పారిశుద్ధ్య కార్మికులతో మరుగుదొడ్లను శుభ్రం చేయించే ఇళ్ల యజమానుల జాబితా సిద్ధం చేయాలని, వారికి నోటీసులు జారీ చేయాలని అన్ని మున్సిపాలిటీల కమిషనర్లను ఆదేశిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త చట్టంలోని ప్రధాన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ చట్టం ప్రకారం చేసిన తప్పులు మళ్లీ చేస్తే మొదసారి ఆరునెలలు ఉండే జైలుశిక్ష వ్యవధి ఐదేళ్లకు పెరుగుతుందన్నారు. యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చన్న అంశాన్ని స్పష్టం చేయాలన్నారు. పట్టణాలు, నగరాల్లోని లక్షా 73 వేల ఇన్‌శానిటరీ మరుగుదొడ్లలో లక్షా 40 వేల మరుగుదొడ్ల నుంచి వ్యర్థాలు ఓపెన్ డ్రెయిన్లలోకి వదిలేస్తున్నారని ఇందుకు బాధ్యులైన వారందరికీ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రంచేసే పనిని మనుషులతో కాకుండా యంత్రాలతో చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మాన్యువల్ స్కావెంజర్లకు పునరావాసం కల్పించే బాధ్యతను జిల్లా కలెక్టర్లు నిర్వర్తించాలని పేర్కొన్నారు. సఫాయి కర్మచారి కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. -
మరో 16 మంది ‘నిషా’చరులకు జైలు
హైదరాబాద్: ప్రమాదకర స్థాయిలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ గత వారాంతంలో ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన 328 మంది వాహనచోదకుల్లో మరో 16 మందికి గురువారం జైలు శిక్ష పడిందని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) అమిత్ గార్గ్ వెల్లడించారు. మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బి.చెంగల్రాయనాయుడు 28 మందికి మంగళవారం మూడు రోజుల చొప్పున శిక్ష వేయగా... తాజాగా ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.సుధ 16 మందికి ఒక రోజు చొప్పున జైలు శిక్ష విధించారు. వీరితో పాటు మిగిలిన వారికి సైతం రూ.2,600 వరకు జరిమానా విధించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు మద్యం తాగి వాహనం నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన వారి సంఖ్య 11,103కు, జైలు శిక్షపడిన వారి సంఖ్య 986కి చేరిందని అమిత్ గార్గ్ వివరించారు. గత వారాంతంలో చిక్కినవారిలో 251 మంది ద్విచక్ర వాహనచోదకులు, 24 మంది ఆటోడ్రైవర్లు, మరో 46 మంది తేలికపాటి వాహనచోదకులు, ఏడుగురు ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారితో పాటు ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడి పోలీసులకు చిక్కిన వారికి మంగళ-బుధవారాల్లో గోషామహల్, బేగంపేటల్లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ (టీటీఐ)ల్లో అవగాహన శిబిరాలు ఏర్పాటు చేశారు.