న్యూఢిల్లీ: నాటుసారా విక్రయదారు నుంచి రూ.100 చొప్పున లంచం తీసుకున్న ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లకు స్థానిక కోర్టు మూడేళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. హర్యానాలోని ఝజ్జర్‌కు చెందిన కానిస్టేబుల్ రామ్‌కుమార్, జింద్‌వాసి రామ్‌కుమార్‌కు శిక్ష ఖరారు చేస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎల్‌కే గౌర్ తీర్పు చెప్పారు. సారా విక్రేత నుంచి వీళ్లు లంచాలు తీసుకుంటున్నట్టు 2004లో వీడియోల్లో బయపడడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించి, ఇద్దరినీ సస్పెండ్ చేశారు. నిందితులు అధికార దుర్వినియోగానికి పాల్పడి లంచాలు తీసుకుంటున్నట్టు నిర్ధారణ అయిందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. శిక్షతోపాటు ఝజ్జర్‌వాసి రామ్‌కుమార్ రూ.40 వేలు, జింద్‌వాసి రామ్‌కుమార్‌కు రూ.60 వేలు జరిమానా విధించారు. ఈ వీడియో తీసిన చేతన్ ప్రకాశ్ అనే ఢిల్లీవాసి ఫిర్యాదు మేరకు సీబీఐ వీళ్లిద్దరిపై కేసులు నమోదు చేసింది.
ఇద్దరు పోలీసులకు మూడేళ్ల జైలు
Published Tue, Jul 1 2014 11:03 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement