
న్యూఢిల్లీ: అనుమానాస్పద స్థితిలో ఒక జంటతో సహా వారి పనిమనిషి మృతి. ఈ ఘటన న్యూఢిల్లీలోని ఆశోక విహార్ హోంలోని వారి నివాసంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....సమీర్ అహుజ్, అతని భార్య షాలు, వారి పనిమనిషి సప్నతో సహా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఐతే వారి రెండేళ్ల చిన్నారి మాత్రం సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు.
వారి పనిమనిషి ఆ దంపతుల ఇంటికి ఉదయం సుమారు 7.30 గంటల ప్రాంతంలో వచ్చి ఉండవచ్చన్నారు పోలీసులు. ఈ ఘటన కూడా ఆ సమయంలో జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు . ఐతే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ తనిఖీ చేయగా బైక్ మీద సుమారు ఐదుగురు వ్యక్తుల బైక్ మీద ఆ దంపతుల నివాసానికి వచ్చినట్లు కనిపిస్తుందని చెప్పారు. ఈ మేరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు.
(చదవండి: చాక్లెట్ల దొంగతనం వైరల్ కావడంతో... విద్యార్థిని ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment