ఢిల్లీకి చెందిన సింగర్ దివ్య ఇండోరా అలియాస్ సంగీత(29) హత్య కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. వారు మృతురాలితో కలిసి పనిచేసే రవి, అనిల్‌గా పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల హర్యాన్వీ సింగర్ దివ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మే 11న కనిపించకుండ పోయిన ఆమె 3 రోజుల తర్వాత రోహ్‌తక్ మెహమ్ సమీపంలో శవమై కనిపించిన ఘటన సంచలనం రేపింది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె స్నేహితులు రవి, అనిల్‌ను శనివారం అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
చదవండి: యువ గాయని అపహరణ.. ఆపై దారుణ హత్య!
ఈ నేపథ్యంలో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. ప్లాన్ ప్రకారమే సంగీతను హత్య చేశారని, చంపాడానికి ముందు ఆమెకు 10 నిద్ర మాత్రలు ఇచ్చినట్లు నిందితులు విచారణలో వెల్లడించారని పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం. సంగీత హత్య ఘటనలో సూత్రధారి రవి అని విచారణలో వెల్లడైంది. అతడి సూచన మేరకు అనిల్ ఢిల్లీకి వచ్చి మృతురాలిని కారులో ఎక్కించుకుని వచ్చాడు. మెహం వైపు వెళుతుండగా దారిలో చెరుకు రసంలో 10 నిద్ర మాత్రలు కలిపి ఆమెకు ఇచ్చాడు అనిల్.
చదవండి: కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీ, ఒకే రంగు దుస్తుల్లో మెరిసిన రష్మిక, విజయ్
హర్యానాలోని కలనౌర్ దగ్గరికి రాగానే రవి వారిని కలిశాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి అక్కడే సమీపంలోని గులాటి దాభాలో భోజనం చేశారు. మెహం సమీపానికి రాగానే సంగీత అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఆమె పీక నులిమి రవి హత్య చేశాడు. ఆ తర్వాత మెహం ప్రాంతంలో పాతి పెట్టినట్టు నిందితులు తెలిపినట్టు పోలీసులు పేర్కొన్నారు. కాగా రిలేషన్‌లో వచ్చిన మనస్పర్థల కారణంగానే ఈ హత్య జరిగిందని తమ ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు చెప్పారు. కాగా సంగీత అలియాస్ దివ్య ఇండోరా మే 11 నుంచి కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత ఆమె పేరెంట్స్.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ వ్యవహారంపై ఫిర్యాదు చేయడం విషయం వెలుగులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment