domestic help
-
మహిళా యజమాని బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టిన పనోడు..ఆ తర్వాత..
గురుగ్రాంలో షాకింగ్ ఘటన జరిగింది. పనిమనిషి తనకు తెలియకుండా బెడ్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టాడని ఓ మహిళ ఆరోపించింది. ఆపై తన ప్రైవేటు వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి రూ.2లక్షలు డిమాండ్ చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయంపై వారు విచారణ చేపట్టారు. యజమాని చెప్పిన వివరాల ప్రకారం.. కొద్దిరోజుల క్రితం ఓ ప్లేస్మెంట్ ఏజెన్సీ ద్వారా ఈమె పనిమనిషిని నియమించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అతడు బెడ్రూంలో స్పై కెమెరా ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత ఆమె ప్రైవేటు వీడియోలను సేకరించాడు. అయితే గతవారం ఇల్లు శుభ్రం చేసే సమయంలో యజమానికి సీక్రెట్ కెమెరా కన్పించింది. దీంతో వెంటనే పనిమనిషిని పనిలోనుంచి తీసేసింది. ఈ విషయం ఎవరికీ తెలియవద్దనే భయంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. కానీ.. పనిమనిషి డబ్బుకోసం యజమానిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. రూ.2 లక్షలు ఇవ్వకపోతే ఆమె ప్రైవేటు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. దీంతో గత్యంతరం లేక ఆమె ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు కేసు నమోదు చేసుకుని నిందితుడు శుభం కుమార్‌ను అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. చదవండి: ఇంటి ఓనర్ పాడు పని.. అమ్మాయిలకు తెలియకుండా బెడ్రూమ్, బాత్రూంలో... -
పనిమనిషితో సహా జంట అనుమానాస్పద మృతి..కానీ రెండేళ్ల చిన్నారి....
న్యూఢిల్లీ: అనుమానాస్పద స్థితిలో ఒక జంటతో సహా వారి పనిమనిషి మృతి. ఈ ఘటన న్యూఢిల్లీలోని ఆశోక విహార్ హోంలోని వారి నివాసంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....సమీర్ అహుజ్, అతని భార్య షాలు, వారి పనిమనిషి సప్నతో సహా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఐతే వారి రెండేళ్ల చిన్నారి మాత్రం సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. వారి పనిమనిషి ఆ దంపతుల ఇంటికి ఉదయం సుమారు 7.30 గంటల ప్రాంతంలో వచ్చి ఉండవచ్చన్నారు పోలీసులు. ఈ ఘటన కూడా ఆ సమయంలో జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు . ఐతే పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ తనిఖీ చేయగా బైక్ మీద సుమారు ఐదుగురు వ్యక్తుల బైక్ మీద ఆ దంపతుల నివాసానికి వచ్చినట్లు కనిపిస్తుందని చెప్పారు. ఈ మేరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: చాక్లెట్ల దొంగతనం వైరల్ కావడంతో... విద్యార్థిని ఆత్మహత్య) -
50 సార్లు అరెస్ట్ అయ్యింది.. అయినా కూడా
ముంబై: పని మనిషిగా చేరుతుంది.. ఓ పది రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత అందినకాడికి దోచుకుని జంప్ అవుతుంది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. పదుల సార్లు దొంగతనాలకు పాల్పడింది... ఏకంగా 50 సార్లు అరెస్ట్ అయ్యింది. అయినా కూడా ఆ మహిళ తన అలవాటును మార్చుకోవడం లేదు. తాజాగా మరోసారి దొంగతనం చేసి పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్ట్ చేసి చేసి పోలీసులకు అలుపొస్తుంది కానీ ఆమె మాత్రం మారడం లేదు. ఆ వివారలు.. ముంబైకి చెందిన వనితా గైక్వాడ్(38) అనే మహిళ ఇళ్లల్లో పని చేస్తుంటుంది. పది రోజుల క్రితం ఓ ఫ్యాషన్ డిజైనర్ ఇంట్లో పనికి కుదిరింది. ఈ క్రమంలో ఆమె ఇంట్లో నుంచి దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన వస్తువులతో పరారయ్యింది. ఫ్యాషన్ డిజైనర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలి ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వనితా గైక్వాడ్ చేతి వాటాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘‘నిందితురాలిని ఇప్పటికి 50 సార్లు అరెస్ట్ చేశాం. ప్రతి సారి ఆమె పేరు మార్చుకుని.. దొంగతనాలకు పాల్పడుతుంది. ఎన్ని సార్లు హెచ్చరించినా ఆమె తీరు మార్చుకోవడం లేదు. పనికి కుదిరిన ప్రతి చోట 10 రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను తస్కరిస్తుంది’’ అని తెలిపారు. చదవండి: పెళ్లి వేడుక: కట్టించాల్సిన తాళి కొట్టేశాడు -
ఆమె లేకుండా ‘పని’ అవుతుందా!
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్... ఈ పేరు ఎంతోమంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఎన్నో లక్షల కుటుంబాలకు జీవనోపాధి లేకుండా చేసింది. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. పనులు లేక వలస వచ్చిన ప్రాంతంలో ఉండలేక సొంత ఊర్లకు తిరుగుబాట పడుతున్నారు. లాక్డౌన్ కారణంగా అత్యవసర సేవలు మినహా దాదాపు అన్ని సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అనేక రంగాలలోని వారికి పూట గడవడమే కష్టంగా మారింది. ఎవరిని కదిపినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. (ఔను లాక్డౌన్లో ప్రజలు మారారు..! ) లాక్‌డౌన్‌తో కష్టాల పాలైన వారిలో తొలి స్థానంలో ఇంట్లో పనిచేసే వారు కూడా ఉన్నారు. పని మనుషులు లేనిదే చాలామందికి రోజు గడవడం అసాధ్యం. వీళ్లు మన జీవితాలను ఎంతో సులభతరం చేస్తున్నారు. ఉదయం లేస్తే ఇల్లు ఊడవటం నుంచి వంట చేయడం వరకు దాదాపు అన్ని పనులు వాళ్లే చేయాలి. లాక్‌డౌన్‌తో వీరు సైతం ఇంటి నుంచి బయటకు రాకుండా పోవడంతో సెలబ్రిటీలు కూడా ఇంట్లో నానా తంటాలు పడుతున్నారు. కరోనా వ్యాపిస్తుండటంతో వీరిని పిలవాలా? వద్దా అని చాలా మంది సంకోచిస్తున్నారు. చేసేదేం లేక ఇంటి పనులన్నీ తామే స్వయంగా చేసుకుంటారు. దీంతో పనిమనుషులు లేని లోటు, వాళ్ల సేవల విలువ మరింత తెలిసొచ్చింది. ఇటీవల లాక్డౌన్ సడలింపులతో కొంత మంది తిరిగి తమ పనులకు వెళుతున్నారు. కానీ ఎక్కువ కుటుంబాల్లో పని చేయడానికి అనుమతించడం లేదు. కేవలం ఒక వ్యక్తి ఒక ఇంటిలోనే పని చేయడానికి వీలవుతుంది. (భోజనం కోసం ప్రతిరోజూ 25 కిలోమీటర్లు.. ) కరోనా వైరస్ ధాటికి తమిళనాడులో ఎక్కువ ప్రభావితమైంది చెన్నై. ఇక్కడ 11 వేల కేసులు నమోదయ్యాయి. దీని కారణంగా చెన్నైలో ఎక్కువ సడలింపులు ఇవ్వలేదు. మహమ్మారి సంక్షోభం కారణంగా చెన్నైలో డొమెస్టిక్ వర్కర్ 46 ఏళ్ల ఈశ్వరి చాలా రోజులుగా పనికి వెళ్లలేదు. ఆమె అయిదు ఇళ్లల్లో గృహ సహాయకురాలుగా పని చేస్తోంది. సడలింపులతో ఆమె తిరిగి తన పనిని ప్రారంభించింది. అయితే ఒక కుటుంబం మాత్రమే ఆమెను వారి ఇంట్లోకి అనుమతించడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయంపై ఈశ్వరి మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నా ఇంట్లో ఉన్న ముగ్గురు మగవాళ్లకు ఇప్పుడు పని లేదు. నేను మాత్రమే సంపాదిస్తున్నాను, నేను పనిచేసే అయిదు ఇళ్ళలో ఒక ఇల్లు మాత్రమే నన్ను తిరిగి పని చేయడానికి అనుమతించింది. మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. నేను మహిళల సంక్షేమ పథకం నుంచి రుణం కోసం దరఖాస్తు చేసాను. కానీ దాని నుంచి ఎలాంటి స్పందన లేదు’. అంటూ తన కన్నీటిని తుడుచుకుంటూ ఈశ్వరి తన ఆవేదనను వెలిబుచ్చింది. ఈశ్వరి పని చేయడానికి అంగీకరించిన ఇంటి యజమాని లతా మాట్లాడుతూ.. ‘ఇది పరీక్షా కాలం. మనందరం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఇంట్లో పనిచేసే వాళ్లు కూడా మనుషులే. లాక్డౌన్ సమయంలో కూడా మేము వారికి జీతాలు చెల్లిస్తున్నాము. ఆమె తన పనిని తిరిగి ప్రారంభించాలనుకుంది. అందుకు నేను అంగీకరించాను. ఇంట్లోకి వచ్చే ముందు ఆమె తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలను నేను తనకు వివరించాను. మాస్కులు ధరించి వస్తుంది. అలాగే ఇంట్లోకి వచ్చే ముందు చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కొని వస్తుంది. ఇది కరోనా కాలం అందుకు నేను అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’ అని తెలిపారు.(ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ నివాళి ) అనేక ఇండిపెండెంట్ ఇల్లు కలిగిన వారు కూడా ఇంటి సహాయకురాలిని తిరిగి పనికి అనుమతించడం ప్రారంభించారు. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో పరిస్థితులు అలా లేవు. హౌసింగ్ సొసైటీల్లో సాధారణంగా కనీసం 300 నుంచి 400 మంది వరకు ఉంటారు. కాబట్టి సహాయకురాలిని అనుమతించే ముందు వారికి సరైన అనుకూల వాతావరణం కల్పించాల్సిన బాధ్యత రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌దే. ‘సహాయకురాలిని పని ప్రారంభించడానికి మేము ఇంకా అనుమతించలేదు. చెన్నైలో కేసులు రోజువారీగా పెరుగుతున్నాయి. ఈ సమయలో బయట నుంచి ప్రజలు లోపలికి అనుమతించడం అంత సురక్షితం కాదనిపిస్తుంది. వాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నారో మాకు తెలియదు. కాబట్టి, మేము ఇక్కడ అత్యవసర, అవసరమైన సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నాము. ప్రమాదం ఉన్న కాలంలో పనికి వచ్చే సిబ్బందికి మేము వారి జీతంలో 25 శాతం ప్రోత్సాహకంగా చెల్లిస్తున్నాము’ అని ఇంపీరియల్ టవర్ అసోసియేషన్ కార్యదర్శి ప్రసానా చార్లెస్ చెప్పారు. (కరోనా బాధితురాలికి కవల పిల్లలు ) ఫెడరేషన్ ఆఫ్ ఒఎంఆర్ రెసిడెంట్స్ అసోసియేషన్ (ఫోమ్రా) కోఆర్డినేటర్ హర్ష కోడా మాట్లాడుతూ: ‘చాలా మంది వృద్ధులకు నర్సులు, అత్యవసర సహాయం వంటివి అవసరం. ఈ డిమాండ్లను పరిశీలించి పని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము పని మనుషులను వారి టెంపరేచర్ పరీక్షించడం, చేతులు, కాళ్లు శుభ్ర పరుచుకున్న తర్వాతే అపార్ట్మెంట్లోకి అనుమతిస్తాం. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మా హౌస్హెల్పర్స్ను పంపిస్తున్నారు. వారికి క్రమం తప్పకుండా జీతం చెల్లిస్తున్నాం.’ అని తెలిపారు. చివరగా ఒక్క మాట.. కరోనావైరస్ సంక్షోభం నుంచి ఇప్పట్లో ఉపశమనం పొందేలా లేము. కావున అవసరమైన అన్ని జాగ్రత్తలను పాటిస్తూ ముందుకు సాగాల్సిందే. ఎల్లప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలి. భౌతిక దూరం పాటించండి. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు తప్పని సరిగా మాస్కులు ధరిద్దాం. మన చుట్టు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుందా. హెల్తీ ఆహరం తీసుకుందాం. కరోనాకు వ్యతిరేకంగా పోరాడి గెలుద్దాం. -
కేంద్రమంత్రి కంప్యూటర్ డేటా చోరీ
సాక్షి, ముంబై : కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఇంట్లో చోరీ వెలుగులోకి వచ్చింది. నమ్మకంగా వుంటూనే గత మూడేళ్లుగా గోయల్ నివాసం(ముంబైలోని నేపీన్సీ రోడ్‌లోని ఖరీదైన ఎత్తైన విల్లా ఓర్బ్)లో పనిచేస్తున్న విష్ణుకుమార్ విశ్వకర్మ (28)ఈ చోరీకి పాల్పడ్డాడు. గత నెల (సెప్టెంబరు) 16 -18 మధ్య మంత్రి ఇంట్లోని వెండి, ఇతర విలువైన వస్తువులు మాయం కావడంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొచి కూపీ లాగగా గుట్టు రట్టయింది. గోయల్ వ్యక్తిగత కంప్యూటర్లోని అధికారిక రహస్య పత్రాలను విష్ణుకుమార్ చోరీ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో అతని మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్న అధికారులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కూడా విచారణ మొదలుపెట్టారు. కంప్యూటర్ నుంచి ముఖ్యమైన ప్రభుత్వ డేటాను చోరీ చేసి ఆ రహస్య ఫైళ్లను గుర్తు తెలియని వ్యక్తులకు ఈమెయిల్ చేశాడు. అంతేకాదు ఈమెయిల్ చేసిన అనంతరం తన ఫోన్లోని సమాచారాన్ని విష్ణుకుమార్ డిలీట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో నిందితుడు కాల్ డేటాను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. మంత్రి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీ అయిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. -
పని మనిషిపై కన్నేసి.. కత్తితో బెదిరించి
లక్నో : ఇంట్లో పని చేస్తున్న యువతిని కత్తితో బెదిరించి 41ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లక్నోలోని మహానగర్‌కు చెందిన లవ్ శర్మ విగ్యాణ్పురి రెసిడెన్సిలో తండ్రి ఆర్కే శర్మతో కలిసి నివాసముంటున్నాడు. తల్లి రెండేళ్ల క్రితం చనిపోవటంతో ఆ ఇంట్లో 24ఏళ్ల యువతి పని చేస్తోంది. లవ్ శర్మకు పెళ్లి కాకపోవటంతో యువతిని పెళ్లి చేసుకోవాలని అడిగేవాడు. కొన్నిసార్లు ఇంట్లో ఎవరూ లేని సమమంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. అతని ప్రవర్తన నచ్చని యువతి పెళ్లిచేసుకోవటానికి నిరాకరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న అతడు ఎలాగైనా పగతీర్చుకోవాలని భావించాడు. బుధవారం తండ్రి ఆర్కే శర్మ ఏదో పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లగా, లవ్ శర్మ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. సాయంత్రం ఆ పని మనిషి వంట చేయడానికి వచ్చింది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న లవ్ శర్మ ఇదే అదునుగా భావించాడు. ఒంటరిగా ఉన్న యువతిపై లైంగిక దాడికి యత్నించాడు. యువతి ప్రతిఘటించటంతో కత్తితో బెదిరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గొంతుపై కత్తిపెట్టి బెదిరించి, పలుమార్లు ఆమెపై లైంగిక దాడి చేశాడు. గురువారం ఉదయం నిందితుడు గాఢనిద్రలో ఉండగా తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నేరం రుజువు కావటంతో లవ్ శర్మను జైలుకు తరలించారు. -
హీరోయిన్ల పరిస్థితి పనిమనుషుల కన్నా దారుణం!
ముంబై: ప్రముఖ బాలీవుడ్ సినీ దర్శక నిర్మాత మహేశ్ భట్ ఇండస్ట్రీలోని నటీమణుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలామంది టీవీ, సినిమా నటీమణులు బహిరంగంగా మహిళా సాధికారిత గురించి మాట్లాడుతున్నా, ఇంట్లో వారి పరిస్థితి పనిమనుషుల కంటే దారుణంగా ఉందని పేర్కొన్నారు. టీవీనటి ప్రత్యూష బెనర్జీ మృతి నేపథ్యంలో టీవీ, సినీ రంగాల్లో విజయవంతమవుతున్న మహిళలు కూడా భాగస్వాముల విషయంలో ఎందుకు బలహీనంగా మారిపోతున్నారనే చర్చ జరుగుతోంది. దీనిపై మహేశ్ భట్ మాట్లాడుతూ సినీ రంగుల ప్రపంచంలో వృత్తిపరమైన విజయం సాధించినంతమాత్రాన అది భావోద్వేగమైన స్వేచ్ఛను ఇవ్వలేదని అన్నారు. 'ఇది నిజంగా విషాదకరం. అసహనం వెళ్లగక్కే తమ భాగస్వాముల నుంచి మహిళలు విముక్తి పొందేందుకు ఆర్థిక స్వాతంత్ర్యం వారికి దోహద పడుతుందని ఒకప్పుడు నేను అనుకునేవాణ్ని. కానీ, చిత్రసీమలో నేను ఎంతోమంది నటీమణులను చూశాను. వారి వద్ద ఊహించలేనంత డబ్బు ఉంది. మహిళలు, మహిళల సాధికారిత గురించి వారు అద్భుతమైన అభిప్రాయాలు వెల్లడించేవారు. వాళ్లు చెప్పే సూక్తుల కోసం చాలామంది ఎదురుచూసేవాళ్లు. కానీ వ్యక్తిగత జీవితంలో వాళ్లు ఎంతగా హింస ఎదుర్కొన్నారంటే.. పనిమనుషులు కూడా అంతటి అరాచకాన్ని సహించేవాళ్లు కాదు' అని భట్ విలేకరులతో అన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న మహిళలు సైతం తమ భర్తలు పెట్టే హింస భరించలేక, తమ బంధాన్ని తెంపేసుకుంటున్నారని, కానీ చాలామంది నటీమణులు మాత్రం ఇప్పటికీ మునిగిపోయేందుకు సిద్ధంగా ఉన్న అనుబంధాలను పట్టుకొని వేలాడుతున్నారని, ఎంతటి ఆర్థిక స్వేచ్ఛ ఉన్నప్పటికీ పలువురు స్టార్ హీరోయిన్లు ఇదేరకమైన అనుబంధాల్లో కొనసాగుతున్నారని ఆయన చెప్పారు. వచ్చే శుక్రవారం విడుదలకానున్న 'లవ్ గేమ్స్' సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. -
'కీచక' ఐఏఎస్ అరెస్టు!
రాయగఢ్: తన ఇంట్లో పనిచేస్తున్న 16 ఏండ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్‌లో ఓ ఐఏఎస్ అధికారి అరెస్టయ్యాడు. ఐఏఎస్ ఏకే ధ్రిత్లారే (56)ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. ఖర్సియా ప్రాంత సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా ఉన్నప్పుడు ధ్రిత్లారే తన అధికారిక నివాసంలో పనిచేస్తున్న బాలికను పలుసార్లు లైంగికంగా వేధించారని, దీంతో బాధిత బాలిక గత జూన్ 15న రాయ్‌గఢ్ కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు నలుగురు అధికారులతో విచారణబృందాన్ని ఏర్పాటుచేశారు. ధ్రిత్లారేను కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. విచారణ బృందం దర్యాప్తులో వెలుగుచూసిన వివరాల ఆధారంగా పోలీసులు ధ్రిత్లారేను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో రూ. 25 వేల పూచీకత్తుపై ఛత్తీస్‌గఢ్ హైకోర్టు మధ్యంతర బెయిలు ఇచ్చింది. దీంతో ఆయన బెయిలుపై విడుదలయ్యారు. -
మాజీ క్రికెటర్ కు మళ్లీ చిక్కులు
ముంబై: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లితో మరోసారి చిక్కులు కొనితెచ్చుకున్నాడు. పనిమనిషిపై దాడి చేసి వేధింపులకు పాల్పర్డారనే ఆరోపణలతో కాంబ్లి, ఆయన ఆండ్రియాపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీతం అడినందుకు తనపై కాంబ్లి, ఆయన భార్య దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పనిమనిషి తెలిపింది. తనను మూడు రోజుల పాటు చీకటి గదిలో బంధించారని చెప్పింది. మళ్లీ తమ ఇంటి దరిదాపుల్లో కనబడొద్దని హెచ్చరించి విడిచిపెట్టారని వెల్లడించింది. తనకు రెండేళ్లుగా జీతం ఇవ్వం లేదని తెలిపింది. కాంబ్లి ఇంట్లో పనిచేస్తున్నా అక్కడే ఉంటున్నట్టు చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కాంబ్లి, ఆండ్రియాలపై ఐపీసీ సెక్షన్ 342, 504, 506, 34 కింద కేసులు నమోదు చేశారు. -
తుపాకీతో బెదిరించి పనమ్మాయిపై రేప్
న్యూఢిల్లీ: చట్టాన్ని కాపాడాల్సిన ఓ పోలీసు అధికారి కామాంధుడిగా మారాడు. మానవ మృగాల నుంచి ప్రజలకు రక్షణ కల్సించడానికి ప్రభుత్వం ఇచ్చిన తుపాకీతోనే యువతిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దేశరాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. పంజాబీబాగ్ పోలీస్ స్టేషన్లో జగ్వీర్ సింగ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మూడు రోజుల క్రితం తూర్పు ఢిల్లీలోని తన స్నేహితుడి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న జగ్వీర్ 23 ఏళ్ల పనమ్మాయిని తుపాకీతో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. జగ్వీర్ తుపాకీతో బెదిరించడం, భయంతో ఆ అమ్మాయి అతని పక్కన వచ్చి కూర్చోవడం అంతా అక్కడ ఉన్న ఒక సీసీ కెమెరాలో రికార్డయింది. బాధితురాలు శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. వైద్యపరీక్షల అనంతరం లైంగిక దాడి జరిగినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో డిపార్ట్ మెంటల్ ఎంక్వయిరీ కోసం వేచి చూడాల్సిన పనిలేదని, అతన్ని వెంటనే డిస్మిస్ చేస్తున్నట్టు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. మహిళలపై జరిగే ఎలాంటి దాడులనైనా ఉపేక్షించేది లేదన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పోలీసు అధికారిని శనివారం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతనికి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీని విధించింది. -
పనిమనిషిగా మారిన గోల్డ్ మెడలిస్ట్
చండీఘడ్: రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో బంగారు పతక విజేత రిషూ మిట్టల్ స్కూలు ఫీజు చెల్లించడం కోసం పనిమనిషిగా మారిపోయింది. ఒకప్పుడు బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్థులను మట్టికరిపించి విజేత గా నిలిచిన రిషూ పదవ తరగతి ఫీజు కూడా కట్టలేని పేదరికంతో కొట్టుమిట్టాడుతోంది. మేరీకోమ్ కావాలని కలలు కన్న ఈ బాక్సర్ పనిమనిషిగా మారడం సంచలనం సృష్టించింది. రిషూ మిట్టల్ కోచ్ రాజేందర్ సింగ్ అందించిన వివరాల ప్రకారం హర్యానా కైతాల్‌కు చెందిన రిషూ మిట్టల్ 2014లో స్టేట్ లెవల్ ఛాంపియన్ షిప్లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. గ్వాలియర్‌లో జరిగిన జాతీయపోటీల్లో కూడా హర్యానా తరపున ఆమె పాల్గొంది. ప్రస్తుతం ఆమె 10వ తరగతి ఫీజు కట్టలేని దయనీయ పరిస్థితిలో ఉంది. అందుకే ఆమె ఇపుడు నాలుగు ఇళ్లల్లో పాచిపని చేసుకోవడానికి సిద్ధపడింది. ఇదివరకే తల్లిదండ్రులను కోల్పోయిన మిట్టల్ అన్నయ్య కూడా ఓ చిరుద్యోగి. -
'ఉదయం 4 గంటల వరకు కొట్టుకున్నారు'
కేంద్ర మాజీమంత్రి శశి థరూర్.. ఆయన దివంగత భార్య సునందా పుష్కర్ మధ్య గొడవలు జరిగేవని అందరికీ తెలుసు. వాటి కారణంగానే ఆమె మరణించారని కూడా తెలుసు. అయితే.. వాళ్లు ఆ ముందురోజు రాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కొట్టుకున్నారని వాళ్ల ఇంట్లో పనిమనిషిగా చేసే నారాయణ్ సింగ్ చెప్పాడు. కేటీ అనే మహిళ పేరు ఆ గొడవలో తరచు వినిపించిందని కూడా అతడు తెలిపాడు. సునందాపుష్కర్ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన రోజున.. థరూర్ దంపతులు ఇంట్లో కాకుండా, ప్రభుత్వం కేటాయించే అధికార నివాసంలో కాకుండా.. లీలాప్యాలెస్ అనే హోటల్లో వాళ్లు ఉన్నారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు శశి థరూర్ వెళ్లిన తర్వాత అదే రోజు.. అంటే జనవరి 17వ తేదీన సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. పొలోనియం 210 లాంటి విషపదార్థం కారణంగా ఆమె హత్యకు గురయ్యారని ఎయిమ్స్ వైద్యులు తేల్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపైనే థరూర్ ఇంట్లో పనిచేసే నారాయణ్ సింగ్ వాంగ్మూలం ఇప్పుడు కీలకంగా మారింది. -
మా పనిమనిషిని హింసించారు!
-
అన్ని వివరాలు తెలుసుకున్నాకే...
ముంబై: అన్ని వివరాలు తెలుసుకున్నాకే పనిమనిషిని పెట్టుకోవాలని బాలీవుడ్ దర్శకుడు, నటుడు సతీష్ కౌశిక్ సూచించారు. ఇంట్లో పనిమనిషిగా పెట్టుకోవాలనే వారి గురించి క్షుణ్ణంగా తెలుకుంటే మంచిదని సలహాయిచ్చారు. తన ఇంట్లో పనిమనిషి విషయంలో పొరబడ్డానని ఆయన చెప్పారు. అతడి గురించి ఏమీ తెలుసుకోకుండా పనిలో పెట్టుకుని తప్పేచేశానని అన్నారు. సతీష్ కౌశిక్ ఇంట్లో పనిచేస్తున్న జార్ఖండ్ కు చెందిన సాజన్ కుమార్ ఆరు రోజుల క్రితం కోటి రూపాయలతో ఉడాయించాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి డబ్బును రికవరీ చేశారు. కోర్టు ద్వారా డబ్బు తనకు అందిందని కౌశిక్ వెల్లడించారు. అదృష్టవశాత్తు తన భార్య, కుమార్తెకు ఎటువంటి హాని జరగలేదన్నారు.