సతీష్ కౌశిక్
ముంబై: అన్ని వివరాలు తెలుసుకున్నాకే పనిమనిషిని పెట్టుకోవాలని బాలీవుడ్ దర్శకుడు, నటుడు సతీష్ కౌశిక్ సూచించారు. ఇంట్లో పనిమనిషిగా పెట్టుకోవాలనే వారి గురించి క్షుణ్ణంగా తెలుకుంటే మంచిదని సలహాయిచ్చారు. తన ఇంట్లో పనిమనిషి విషయంలో పొరబడ్డానని ఆయన చెప్పారు. అతడి గురించి ఏమీ తెలుసుకోకుండా పనిలో పెట్టుకుని తప్పేచేశానని అన్నారు.
సతీష్ కౌశిక్ ఇంట్లో పనిచేస్తున్న జార్ఖండ్ కు చెందిన సాజన్ కుమార్ ఆరు రోజుల క్రితం కోటి రూపాయలతో ఉడాయించాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి డబ్బును రికవరీ చేశారు. కోర్టు ద్వారా డబ్బు తనకు అందిందని కౌశిక్ వెల్లడించారు. అదృష్టవశాత్తు తన భార్య, కుమార్తెకు ఎటువంటి హాని జరగలేదన్నారు.