Satish Kaushik
-
ఆయనను చంపేశారు.. బాలీవుడ్ నటుడి మృతిపై సంచలన ఆరోపణలు!
రెండు రోజుల క్రితమే బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు సతీశ్ కౌశిక్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతిపై రోజు రోజుకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆయన మరణంపై సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త కౌశిక్‌ను హత్య చేశారని తాజాగా ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆయన మరణాన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా మహిళ వ్యాఖ్యలతో ఈ కేసు మరిన్నీ మలుపులు తిరగనుంది. కాగా.. హోలీ వేడుకల్లో సతీష్ కౌశిక్ గుండెపోటుకు గురయ్యారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నా భర్తే చంపేశారు: మహిళ ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చింది ఆ మహిళ. అయితే ఆ మహిళ ఓ బిజినెస్ మ్యాన్ భార్య. తన భర్తకు సతీశ్ కౌశిక్ రూ.15 కోట్లు ఇచ్చారని ఫిర్యాదులో తెలిపింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకే ప్లాన్ చేసి చంపేశారంటూ మహిళ ఆరోపిస్తోంది. సతీష్ కౌశిక్‌ను చంపేందుకు తన భర్త కొన్ని ట్యాబ్లెట్స్ ఏర్పాటు చేశారని కూడా తెలిపింది. ఇప్పటికే సతీష్ కౌశిక్ మరణించిన ఫామ్ హౌజ్‌లో పోలీసులకు నిషేధ ఉత్ప్రేరక డ్రగ్స్ లభ్యమైన సంగతి తెలిసిందే. కాగా.. సతీష్ కౌశిక్ అదే వ్యాపారవేత్త ఫామ్‌హౌస్‌లో హోలీ పార్టీకి హాజరైన తర్వాతే మరణించాడు. ఫామ్‌హౌస్‌లో హోలీ పార్టీకి వచ్చిన అతిథుల జాబితాను కూడా పోలీసులు సిద్ధం చేశారు. మొత్తం 10 నుంచి 12 మంది పార్టీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఫామ్ హౌస్ సతీష్ కౌశిక్ స్నేహితుడు వికాస్ మాలూది కాగా.. అక్కడ లభ్యమైన ఔషధాలు ఎవరికోసం, ఎందుకు తీసుకొచ్చారన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా మహిళ ఫిర్యాదుతో సతీష్ కౌశిక్ మరణంపై అనుమానాలను మరింత పెరుగుతున్నాయి. అలాంటిదేం లేదు: సతీశ్ కౌశిక్ భార్య ఈ ఆరోపణలపై సతీష్ కౌశిక్ భార్య శశి కౌశిక్ స్పందించింది. తన భర్త హోలీ పార్టీకి హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చారని.. కానీ ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. వ్యాపారవేత్తను సమర్థిస్తూ సతీష్ కౌశిక్ మంచి స్నేహితులని అన్నారు. వ్యాపారవేత్త ధనవంతుడని..తన భర్త నుంచి డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొంది. ఆయన శాంపిల్స్‌లో మందులు లేవని పోస్ట్‌మార్టం నివేదిక నిర్ధారించిందని శశి కౌశిక్ తెలిపారు. మహిళను ఉద్దేశి శశి న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ తన భర్తను హత్య చేసినట్లు ఎందుకు చెబుతుందో నాకర్థం కావడం లేదని తెలిపింది.నా భర్త చనిపోయిన తర్వాత ఆమె పరువు తీయడానికి ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం కావడం లేదు. ఆమెకు తన భర్త నుంచి డబ్బు రాబట్టడం కోసం సతీష్ కౌశిక్‌ను లాగుతోందని శశి ఆరోపిస్తున్నారు. కాగా.. సతీష్ కౌశిక్ హరియాణాలోని మహేంద్రఘడ్‌లో 1956లో జన్మించారు. 1983లో వచ్చిన 'మాసూమ్'తో నటుడుగా కెరీర్ ప్రారంభించిన ఆయన అనుపమ్ ఖేర్‌తో కలిసి పలు సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా మారారు. సుమారు 15 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన తీసిన చివరి సినిమా 'కాగజ్'. -
ఫామ్‌హౌస్‌లో ఏం జరిగింది? నటుడి మరణానికి అసలు కారణం!
బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు సతీశ్ కౌశిక్ మరణంతో చిత్రపరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అప్పటిదాకా హోలీ వేడుకల్లో మునిగి తేలిన ఆయన తన గదికి వెళ్లిన కొన్ని గంటల్లోనే మృత్యు ఒడికి చేరారు. దీంతో ఆయన మరణంపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా ఆయన మరణించిన ఇంట్లో ఢిల్లీ పోలీసులు అనుమానాస్పద ఔషధాలను కనుగొన్నారు. అసలీ మందులు అక్కడికి ఎలా వచ్చాయి? సతీశ్ వాటిని వాడారా? వంటి అంశాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇటీవల జరిగిన హోలీ సెలబ్రేషన్స్ కోసం దాదాపు 10 నుంచి 12 మంది ఆ ఫామ్ హౌస్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వేడుకల్లో సతీశ్ కూడా పాల్గొన్నారు. వేడుక అనంతరం ఆయన ఫామ్‌హౌస్ లోపలకు వెళ్లిపోయారు. అంతలోనే ఆయనకు గుండెపోటుకు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా ఈ ఫామ్‌హౌస్ సతీశ్ మిత్రుడు, వ్యాపారవేత్త వికాస్ మాలుకు చెందినది. అతడు గతంలో అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో ఆ కేసుకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నారు పోలీసులు. మరోవైపు ఫామ్‌హౌస్‌లో మెడిసిన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి పోస్ట్‌మార్టమ్ రిపోర్టు వచ్చిన తర్వాతే సతీశ్ మరణానికి గల అసలు కారణంపై స్పష్టత రానుంది. -
సతీష్ కౌశిక్‌కు బాలీవుడ్ తారల కన్నీటి నివాళి (ఫొటోలు)
-
గర్భంతో ఉన్న నటిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన దర్శకుడు!
ప్రముఖ దర్శకుడు సతీశ్ కౌశిక్ మరణంతో బాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. హోలీ వేడుకల్లోనూ సంతోషంగా పాల్గొన్న ఆయన బుధవారం గుండెపోటుతో మరణించారు. ఆయన మరణవార్తను అభిమానులు, సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో నటి నీనా గుప్తా సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించింది. 'బాధాకరమైన వార్తతో నిద్రలేచాను. ఈ ప్రపంచంలో నన్ను నాన్సీ అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయన ఒక్కరే! నేను తనను కౌశిఖాన్ అని పిలిచేదాన్ని. మా స్నేహం కాలేజీలో మొదలైంది, మేము తరచూ కలుసుకునేవాళ్లం. కానీ ఇప్పుడాయన లేరు. ఇది నన్నెంతో భయానికి గురి చేస్తోంది. అదే సమయంలో బాధిస్తోంది కూడా! తన భార్యాపిల్లలు శశి, వంశికలకు ఇదెంతో కష్టకాలం. వారికి ఏ అవసరం వచ్చి నేనెప్పుడూ అండగా ఉంటాను. ఆ భగవంతుడు మీకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా' అని రాసుకొచ్చింది. కాగా గతంలో సతీశ్.. నీనాను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని నీనా తన ఆత్మకథ 'సచ్ కహో తో'లో రాసుకొచ్చింది. నీనా గర్భంతో ఉన్న సమయంలో సతీశ్ ఆమెకు ఎంతగానో అండగా నిలబడ్డారు. 'ఒకవేళ పుట్టబోయే పాప ఛామనచాయతో ఉంటే అది నా బిడ్డే అని చెప్పు. మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు నిన్నెవరూ అనుమానించరు' అని సతీశ్ చెప్పినట్లు పుస్తకంలో రాసుకొచ్చింది నీనా. ఇకపోతే సతీశ్ చివరగా ఎమర్జెన్సీ అనే చిత్రంలో కనిపించారు. View this post on Instagram A post shared by Neena Gupta (@neena_gupta) -
ప్రముఖ దర్శకనటుడి హఠాన్మరణం
బాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకనటుడు సతీష్ కౌశిక్(67) హఠాన్మరణం చెందారు. ఈ విషయాన్ని మరో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ట్వీట్ ద్వారా ధృవీకరించారు. తమది 45 ఏళ్ల స్నేహమని, ఇకపై సతీష్ లేకుండా జీవితంలో ముందుకు సాగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ ట్విటర్ ద్వారా విచారం వ్యక్తం చేశారు అనుపమ్ ఖేర్. మరోవైపు నటి కంగనా రనౌత్‌తోపాటు ఇతర బాలీవుడ్ ప్రముఖులు సైతం సతీష్ హఠాన్మరణంపై విచారం, సోషల్ మీడియా ద్వారా సంతాపాలు వ్యక్తం చేస్తున్నారు. సతీష్ కౌశిక్ తన నివాసంలోనే కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. जानता हूँ “मृत्यु ही इस दुनिया का अंतिम सच है!” पर ये बात मैं जीते जी कभी अपने जिगरी दोस्त #SatishKaushik के बारे में लिखूँगा, ये मैंने सपने में भी नहीं सोचा था।45 साल की दोस्ती पर ऐसे अचानक पूर्णविराम !! Life will NEVER be the same without you SATISH ! ओम् शांति! 💔💔💔 pic.twitter.com/WC5Yutwvqc — Anupam Kher (@AnupamPKher) March 8, 2023 13 ఏప్రిల్ 1956లో హర్యానాలో పుట్టి, పెరిగిన సతీష్ కౌశిక్.. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఇక్కడి నుంచే అనుపమ్ ఖేర్‌తో ఆయనకు అనుబంధం ఏర్పడింది. ఆపై బాలీవుడ్లో సతీష్ కౌశిక్‌కు బ్రేక్ దక్కింది. 1983లో వచ్చిన జానే భీ దో యారోన్ చిత్రానికి ఆయన సంభాషణలు అందించారు. కల్ట్ క్లాసిక్ చిత్రంగా గుర్తింపు పొందిన ఆ సినిమా సంభాషణలు చాలా కాలం పాటు హిందీ ప్రేక్షకులకు గుర్తుండి పోయాయి. ఆపై యాక్టర్‌గా కొనసాగారు. కమెడియన్‌గా, స్క్రీన్ రైటర్‌గా, దర్శకనిర్మాతగానూ ఆయన బాలీవుడ్లో రాణించారు. శ్రీదేవి లీడ్ రోల్లో నటించిన రూప్ కీ రాణి.. చోరో కా రాజా, టబు లీడ్ రోల్లో నటించిన ‘ప్రేమ్’ చిత్రాలకు ఈయనే దర్శకుడు. కానీ, ఈ రెండు చిత్రాలు ఆడలేదు. అయితే.. హమ్ ఆప్కే దిల్ మే రహ్తే హై, తేరే సంగ్ చిత్రాలు మాత్రం ప్రేక్షకులను అలరించాయి. మిస్టర్ ఇండియాలో ‘క్యాలెండర్’, దీవానా మస్తానాలో పప్పు పేజర్ పాత్రలు ఐకానిక్ రోల్స్‌గా హిందీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. రామ్ లఖన్(1990)తో పాటు సాజన్ చలే ససూరల్(1997) చిత్రానికి బెస్ట్ కమెడియన్‌గా ఆయన ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. -
నీనా గుప్తా ఆత్మకథ..‘నిజం చెప్పాలంటే’
తన జీవితాన్నితాను ఇష్టపడినట్టుగా జీవించడానికి తన మార్గాన్ని కొనసాగించడానికి ఎప్పుడూ ధైర్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన నటి నీనా గుప్తా తన ఆత్మకథ ‘సచ్ కహూ తో’ వెలువరించింది. సినిమా అభిమానుల కంటే స్త్రీలు తప్పక చదవాల్సిన ఆత్మకథ కావచ్చు ఇది. పెంగ్విన్ సంస్థ ఇటీవల ప్రచురించిన నటి నీనా గుప్తా ఆత్మకథ ‘సచ్ కహూ తో’ (నిజం చెప్పాలంటే) సినిమా అభిమానులను, పాఠకులను కుతూహల పరుస్తోంది. అందులో నీనా గుప్తా తన జీవితంలోని అనేక అంశాలను ‘దాదాపుగా నిజాయితీ’తో చెప్పే ప్రయత్నం చేసిందని విమర్శకులు అంటున్నారు. అందులో కొన్ని విశేషాలు: సతీష్ కౌశిక్‌తో పెళ్లి ‘నటుడు సతీష్ కౌశిక్ నాకు కాలేజీ రోజుల నుంచి తెలుసు. స్నేహితుడు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నేను చేరడానికి కారణం అతడే. ముంబైలో నాకు అండా దండగా ఉండేవాడు. నేను వివియన్ రిచర్డ్స్‌తో గర్భం దాల్చి మసాబాకు జన్మనిచ్చాక సతీష్ ‘నన్ను పెళ్లి చేసుకో. నీ బిడ్డకు తండ్రిగా నా పేరు ఉంటుంది’ అన్నాడు. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. సింగిల్ మదర్‌గా నేను, తండ్రి లేని పిల్లగా నా కూతురు మనలేరు అని అతడు నా కోసం బాధ పడ్డాడు.’ అని రాసింది నీనా. బయటపడ్డ ప్రాణాలు ‘మసాబా పుట్టిన మూడు నెలలకే నేను పని చేయడం మొదలెట్టాను. ది స్వోర్డ్ ఆఫ్ టిపూ సుల్తాన్ సీరియల్లో చిన్న పాత్ర దొరికింది. అది చేస్తున్నప్పుడే సెట్స్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సంజయ్ ఖాన్ సకాలంలో స్పందించి మంటలార్పే ప్రయత్నంలో తనూ సగం కాలిపోయాడు. సెట్ బయట మసాబా ఉందప్పుడు. తనకు ఆరోగ్యం బాగలేదు. ఎలా ఉందో చూద్దామని నేను బయటకు వెళ్లినప్పుడే ప్రమాదం జరగడంతో బతికిపోయాను. ఆ ప్రమాదంలో 55 మంది చనిపోయారు’ అని రాసిందామె. సుభాష్ ఘాయ్ ‘చోలీ’ ‘ఖల్ నాయక్ సినిమాలో చోలీ కే పీఛే క్యాహై పాటలో నేను, మాధురి నటించాలి. నాకు రాజస్థాని డ్రస్ వేసి తీసుకువెళ్లి చూపించారు. ఆయనను నన్ను చూసి హతాశుడై ‘నో.. నో.. ఏదైనా కొంచెం నింపి తీసుకురండి’ అన్నాడు. ఇది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అతడు నా వక్షం నిండుగా ఉండాలని సూచించాడు. ఇందులో వ్యక్తిగతం ఏమీ లేదు. దర్శకుడిగా తనకు ఏది కావాలో ఆ ఊహకు తగినట్టుగా నేను ఉండాలనుకున్నాడు. ఆ రోజు షూటింగ్ జరగలేదు. మరుసటి రోజు ప్యాడెడ్ బ్రా వేసి నా కాస్ట్యూమ్స్ సిద్ధం చేశారు. అప్పుడు అతను సంతృప్తి చెందాడు. మంచి దర్శకుడు రాజీపడడు. సుభాష్ ఘాయ్ అందుకే మంచి దర్శకుడు’ అని రాసిందామె. ఇలాంటివే అనేక విశేషాలు ఆమె ఆత్మకథలో ఉన్నాయి. ∙ -
బిగ్‌బాస్ ఫేం మోనాల్ కొత్త పాట వైరల్
బిగ్‌బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తున్నారు. బిగ్‌బాస్ రియాల్టీ షో నుంచి వచ్చాక ఈ బ్యూటీకి దర్శకనిర్మాతలు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్టుల్లో ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ నటించిన కాగజ్ సినిమాలోని ఓ పాట నెట్టింట హల్చల్ చేస్తుంది. ‘బైల్ గాడి’అంటూ సాగే ఈ పాటను ప్రవేశ్మల్లిక్ సంగీతం అందించగా, ఉదిత్ నారాయణ్ ఆలపించారు. ఇక కాగజ్ సినిమా విషయానికొస్తే.. బతికుండగానే చనిపోయినట్టు సర్టిఫికెట్ ఇచ్చిన లంచగొండి ప్రభుత్వ వ్యవస్థల మీద ఒక సామాన్యుడు చేసే పోరాటమే ఈ సినిమా కథ. అజంఘర్‌కు చెందిన భరత్ లాల్ బిహారీ అనే రైతు జీవిత కథ ఇది. తాను బతికే ఉన్నానని నిరూపించుకునేందుకు 18 ఏళ్లపాటు న్యాయపోరాటం చేశారు. ఇతర బాలీవుడ్ చిత్రాల్లా కాకుండా నాన్ గ్లామరస్ బ్యాక్‌డ్రాప్ చిత్రంగా ‘కాగజ్’ తెరకెక్కింది. ఈ చిత్రాన్నిసల్మాన్ఖాన్ నిర్మాతగా సొంత బేనర్లో నిర్మించారు.ఈ బయోగ్రఫికల్ డ్రామాకు సతీష్ కౌశిక్ దర్శకత్వం వహించారు. మోనాల్ గజ్జర్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా త్వరలో జీ5 ఓటీటీలో విడుదల కానుంది. -
‘తన ఆసక్తిని కరోనా ఏ మాత్రం తగ్గించలేదు’
ముంబై: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నివారించేందుకు గత కాలంగా సీనిమా షుటింగ్లను నిలిపివేశారు. తాజాగా సీనియర్ నటులకు సినిమా, షుటింగ్‌లో పాల్గొనవచ్చని బాంబే హైకోర్టు తీర్పు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ సినిమాలపై తమకున్న ఇష్టాన్ని, అభిరుచిని ఏ మాత్రం తగ్గించలేదని ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత సతీష్ కౌశిక్ సోషల్ మీడియాలో తెలిపారు. ఐదు నెలల తర్వాత పాల్గొన్న తాను పీపీఈ కిట్లను వేసుకుంటే ఏదో షూటింగ్లో పాల్గొన్న అనుభూతి కలుగుతుందని అన్నారు. మరోవైపు సీరియల్ నటుడు అనిరుద్ దవే స్పందిస్తూ.. సినిమాలపై దిగ్గజ నటుడుకున్న ఆసక్తిని అనిరుద్ అభినందించారు. అయితే తమిళ్ సేతు చిత్రం, తెలుగులో శేషుగా బాలీవుడ్లో తేరే నామ్‌గా రీమేక్ చేశారు. బాలీవుడ్లో సతీష్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తేరే నామ్’ చిత్రంలో కండల వీరుడు బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్‌ఖాన్ హీరోగా నటించాడు. 2003లో ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: అప్పుడు సల్మాన్ తటపటాయించాడు -
క్లైమాక్స్ గురించి సల్మాన్ భయపడ్డాడు
తమిళ్ సేతు చిత్రం, తెలుగులో శేషుగా, బాలీవుడ్లో తేరే నామ్‌గా రీమేక్ చేశారు. సతీష్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్‌ఖాన్ హీరోగా నటించాడు. 2003లో ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇందులో డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో, రాధే పాత్రలో ప్రేక్షకులను పలకరించిన సల్మాన్ ఖాన్ విశేషంగా ఆకట్టుకున్నాడు. అయితే సల్లూభాయ్‌కు ఎంతో పేరు తెచ్చిన ఈ సినిమా ముగింపు మాత్రం అతనికి అస్సలు నచ్చలేదట. ఈ విషయాన్ని దర్శకుడు సతీష్ కౌశిక్ స్వయంగా వెల్లడించాడు. ఈ చిత్ర క్లైమాక్స్ ద్వారా మనం యువతకు తప్పుడు సందేశం ఇస్తున్నామని ఆయన విచారం వ్యక్తం చేశాడని తెలిపాడు. (అది తెలిసి షాకయ్యాను: మాధురీ దీక్షిత్) తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఆనాటి విషయాలను పంచుకున్నాడు. "మీరు నమ్మరు గానీ, తేరే నామ్ షూటింగ్ సమయంలో సల్మాన్ ఓ మాట అన్నాడు. ఈ సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు, ఆ విషయం పక్కన పెడితే క్లైమాక్స్ సన్నివేశంలో యువతకు చెడు సందేశం ఇస్తున్నామని, దీని ద్వారా యువత ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందాడు. ఒక ప్రేక్షకుడిగా, దర్శకుడిగా చెప్పాలంటే... నెగెటివ్, పాజిటివ్ అన్ని రకాల పాత్రలు సినిమాలో ఉండాల్సిందే. కానీ క్లైమాక్స్‌లో మాత్రం తేరే నామ్ సినిమాలో లాగా చెడుదే విజయంగా చూపించకూడదు" అని సతీష్ పేర్కొన్నాడు. (25వేల మందికి సల్మాన్ సాయం) -
బాలీవుడ్‌కు ‘శివపుత్రుడు’
కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, విక్రమ్‌లు కలిసి నటించిన సూపర్ హిట్ సినిమా పితామగన్. తెలుగులో శివపుత్రుడు పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా ఘనవిజయం సాధించింది. 2003లో రిలీజ్ అయిన ఈ సినిమాను ఇన్నేళ్ల తరువాత బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. విక్రమ్‌కు నటుడిగా ఎంతో పేరుతో పాటు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టిన శివపుత్రుడు పాత్రను హిందీ లో ఎవరు చేయబోతున్నారన్న అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. దర్శకుడిగా బాలా ఇమేజ్ను కూడా శివపుత్రుడు తారా స్థాయికి తీసుకెళ్లింది. హిందీ రీమేక్‌కు సతీష్ కౌషిక్ దర్శకత్వం వహించే అవకాశం ఉంది. గతంలో బాలా దర్శకత్వంలో తెరకెక్కిన సేతు సినిమాను తేరే నామ్ పేరుతో రీమేక్ చేసిన సతీష్ ఇప్పుడు శివపుత్రుడును కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడు. -
అన్ని వివరాలు తెలుసుకున్నాకే...
ముంబై: అన్ని వివరాలు తెలుసుకున్నాకే పనిమనిషిని పెట్టుకోవాలని బాలీవుడ్ దర్శకుడు, నటుడు సతీష్ కౌశిక్ సూచించారు. ఇంట్లో పనిమనిషిగా పెట్టుకోవాలనే వారి గురించి క్షుణ్ణంగా తెలుకుంటే మంచిదని సలహాయిచ్చారు. తన ఇంట్లో పనిమనిషి విషయంలో పొరబడ్డానని ఆయన చెప్పారు. అతడి గురించి ఏమీ తెలుసుకోకుండా పనిలో పెట్టుకుని తప్పేచేశానని అన్నారు. సతీష్ కౌశిక్ ఇంట్లో పనిచేస్తున్న జార్ఖండ్ కు చెందిన సాజన్ కుమార్ ఆరు రోజుల క్రితం కోటి రూపాయలతో ఉడాయించాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి డబ్బును రికవరీ చేశారు. కోర్టు ద్వారా డబ్బు తనకు అందిందని కౌశిక్ వెల్లడించారు. అదృష్టవశాత్తు తన భార్య, కుమార్తెకు ఎటువంటి హాని జరగలేదన్నారు. -
దర్శకుడి ఇంట్లో కోటి రూపాయలు చోరీ
ముంబై: బాలీవుడ్ దర్శకుడు, నటుడు సతీష్ కౌశిక్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. 1.2 కోట్ల రూపాయలుపైగా చోరీ అయ్యాయి. ఈ మేరకు సతీష్ కౌశిక్, ఆయన భార్య ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వెర్సోవా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన క్రియేటిక్ వర్క్ కోసం ఈ డబ్బు తెచ్చానని, సోమవారం బ్యాంకులో వేద్దామనుకునేలోపు చోరీకి గురయ్యిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సతీష్ కౌశిక్ పనిమనిషి సాజన్ కుమార్‌ను పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనం జరిగిన నాటి అతడు కనిపించకపోవడంతో అనుమానాలకు బలమిస్తోంది.