దర్శకుడి ఇంట్లో కోటి రూపాయలు చోరీ
ముంబై: బాలీవుడ్ దర్శకుడు, నటుడు సతీష్ కౌశిక్ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. 1.2 కోట్ల రూపాయలుపైగా చోరీ అయ్యాయి. ఈ మేరకు సతీష్ కౌశిక్, ఆయన భార్య ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వెర్సోవా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన క్రియేటిక్ వర్క్ కోసం ఈ డబ్బు తెచ్చానని, సోమవారం బ్యాంకులో వేద్దామనుకునేలోపు చోరీకి గురయ్యిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సతీష్ కౌశిక్ పనిమనిషి సాజన్ కుమార్ను పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనం జరిగిన నాటి అతడు కనిపించకపోవడంతో అనుమానాలకు బలమిస్తోంది.