పరారీలో ఓం పురి, బాలీవుడ్ నటుడిపై గృహ హింస కేసు!
బాలీవుడ్ నటుడు ఓం పురిపై గృహ హింస కేసును ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్ లో నమోదైంది. ఓం పురిపై ఆయన భార్య నందితా ఆగస్టు 23 తేదిన వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో నందితా పురిని కూపర్ హాస్పిటల్ కు పంపామని, ఆతర్వాత తమకు మెడికల్ రిపోర్టు కూడా ఇచ్చిందని పోలీసులు తెలిపారు. ఓం పురి తనపై కర్రతో దాడి చేశాడని నందితా పురి ఫిర్యాదులో తెలిపిందని పోలీసులు తెలిపారు.
కేసు నమోదైనప్పటి నుంచి ఓంపురి కనిపించకుండా పోయాడని, ఆయన కోసం వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు. ఓం పురిపై నందితా రాసిన జీవిత కథ తర్వాత వారి మధ్య విభేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 'అన్ లైక్లీ హీరో: ది స్టోరి ఆఫ్ ఓం పురి' అనే పుస్తకాన్ని 2009లో ప్రచురించింది.
ఈ పుస్తకంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శృంగార సంఘటనలను ప్రచురించడంతో ఓం పురి ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి వారి మధ్య విభేధాలు కొనసాగుతునే ఉన్నాయి. ఆక్రోష్, ఆర్ధ సత్య, హెరా ఫెరీ చిత్రాల్లో తన నటనతో అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.