
ఈ ప్రపంచంలో నన్ను నాన్సీ అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయన ఒక్కరే! ఇది నన్నెంతో భయానికి గురి చేస్తోంది. అదే సమయంలో బాధిస్తోంది కూడా! తన భార్యాపిల్లలు శశి, వంశికలకు ఇదెంతో కష్టకాలం. వారికి ఏ అవసరం వచ్చి నేనెప్పుడూ అండగా ఉంటాను. ఆ భగవంతుడు మీకు ధైర్యాన్ని ప్రసాదించాలని
ప్రముఖ దర్శకుడు సతీశ్ కౌశిక్ మరణంతో బాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. హోలీ వేడుకల్లోనూ సంతోషంగా పాల్గొన్న ఆయన బుధవారం గుండెపోటుతో మరణించారు. ఆయన మరణవార్తను అభిమానులు, సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో నటి నీనా గుప్తా సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించింది. 'బాధాకరమైన వార్తతో నిద్రలేచాను. ఈ ప్రపంచంలో నన్ను నాన్సీ అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయన ఒక్కరే! నేను తనను కౌశిఖాన్ అని పిలిచేదాన్ని. మా స్నేహం కాలేజీలో మొదలైంది, మేము తరచూ కలుసుకునేవాళ్లం. కానీ ఇప్పుడాయన లేరు. ఇది నన్నెంతో భయానికి గురి చేస్తోంది. అదే సమయంలో బాధిస్తోంది కూడా! తన భార్యాపిల్లలు శశి, వంశికలకు ఇదెంతో కష్టకాలం. వారికి ఏ అవసరం వచ్చి నేనెప్పుడూ అండగా ఉంటాను. ఆ భగవంతుడు మీకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా' అని రాసుకొచ్చింది.
కాగా గతంలో సతీశ్.. నీనాను పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. ఈ విషయాన్ని నీనా తన ఆత్మకథ 'సచ్ కహో తో'లో రాసుకొచ్చింది. నీనా గర్భంతో ఉన్న సమయంలో సతీశ్ ఆమెకు ఎంతగానో అండగా నిలబడ్డారు. 'ఒకవేళ పుట్టబోయే పాప ఛామనచాయతో ఉంటే అది నా బిడ్డే అని చెప్పు. మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు నిన్నెవరూ అనుమానించరు' అని సతీశ్ చెప్పినట్లు పుస్తకంలో రాసుకొచ్చింది నీనా. ఇకపోతే సతీశ్ చివరగా ఎమర్జెన్సీ అనే చిత్రంలో కనిపించారు.