డబ్బు కోసం ఏదిపడితే అది చేశా.. తర్వాతేమో దేవుడిని ప్రార్థించేదాన్ని: నటి | Neena Gupta says She Did Bad Roles For Money | Sakshi
Sakshi News home page

Neena Gupta: డబ్బు కోసం నచ్చని పాత్రలు కూడా ఒప్పుకున్నా.. ఒంటరిదాన్నని..​

Published Sat, May 25 2024 12:59 PM | Last Updated on Sat, May 25 2024 3:08 PM

Neena Gupta says She Did Bad Roles For Money

సినిమాల్లో కనిపించాలని కలలు కనడం బాగుంటుంది కానీ దాన్ని నిజం చేసుకునే క్రమంలో ఎన్నో కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా అలవాటు లేని ప్రదేశానికి వెళ్లి.. అక్కడ అడ్జస్ట్‌ అవడానికి టైం పడుతుంది. తాను కూడా కొత్తలో ముంబై నుంచి వెళ్లిపోవాలని అనుకున్నానని చెప్తోంది బాలీవుడ్‌ నటి నీనా గుప్తా.

వెళ్లిపోదామనుకున్నా..
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాది ఢిల్లీ. సినిమా కోసం అక్కడి నుంచి ముంబైకి వచ్చాను. కానీ ఈ వాతావరణానికి అలవాటు పడలేక ఎన్నోసార్లు వెళ్లిపోవాలనుకున్నాను. ప్రతి మూడు నెలలకోసారి బ్యాగు సర్దుకునేదాన్ని. ముందు పీహెచ్‌డీ చేసి ఆ తర్వాత వచ్చేద్దాం అనుకునేదాన్ని. కానీ ఈ సిటీ మనల్ని వెళ్లనివ్వదు.

దేవుడిని మొక్కేదాన్ని
అయితే మొదట్లో నాకు డబ్బు అవసరం చాలా ఉండేది. అందుకోసం నాకు నచ్చని పాత్రలు కూడా చేసేదాన్ని. తర్వాత ఆ సినిమాలు రిలీజవకూడదని దేవుడిని ప్రార్థించేదాన్ని. అప్పుడు దేనికీ నో చెప్పకపోయేదాన్ని. ఇప్పుడు ధైర్యంగా తిరస్కరిస్తాను. నాకు నచ్చిన స్క్రిప్టునే ఎంచుకుంటాను. నచ్చనివాటిని ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పుకొచ్చింది. 

గ్లామర్‌ రోల్స్‌ చేయను
తనను రెబల్‌ స్టార్‌ అని పిలవడంపై స్పందిస్తూ.. ఎందుకు నన్ను రెబల్‌ అని పిలుస్తారో అర్థం కాదు. పైగా నేను చాలా అమాయక పాత్రలు పోషించాను. పెద్దగా గ్లామర్‌ పాత్రలు, శక్తివంతమైన రోల్స్‌ కూడా చేయలేదు. నేను సింగిల్‌ మదర్‌ అని మీడియానే నాకు రెబల్‌ అన్న ట్యాగ్‌ ఇచ్చింది. నేను పోయినప్పుడు కూడా బోల్డ్‌ నీనా గుప్తా ఇక లేరు అనే రాస్తారు. నేను చనిపోయినా కూడా అలాంటి ట్యాగులు అంటగట్టడం ఆపరు. సరే, ఇంక దాన్ని నేను ఏం చేయలేను అని నీనా గుప్తా తెలిపింది. కాగా ఈమె ముఖ్య పాత్రలో నటిస్తున్న పంచాయత్‌ వెబ్‌ సిరీస్‌ మూడో సీజన్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మే 28 నుంచి ప్రసారం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement