Neena Gupta Recalled Cleaning Her Mouth With Dettol After First Kissing Scene, Deets Inside - Sakshi
Sakshi News home page

Neena Gupta: ఆ ముద్దు నచ్చలే! ఇన్నేళ్ల తర్వాత బయటపెట్టిన నటి

Published Wed, Jun 28 2023 12:07 PM | Last Updated on Wed, Jun 28 2023 4:34 PM

 Neena Gupta Scene Mouth Clean With Dettol  - Sakshi

పలువురు లేడీ యాక్టర్స్.. కొన్ని విషయాలు బయటపెట్టడానికి అస్సలు మొహమాటపడట్లేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చెప్పేస్తున్నారు. బాలీవుడ్ నటి నీనా గుప్తా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ తెగ పాపులర్ అవుతోంది. కొన్నిరోజుల ముందు యువతని ఉద‍్దేశించి బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడేమో తన తొలిముద్దు అనుభవం గురించి షేర్ చేసుకుని, అందరికీ షాకిచ్చింది. అసలు అప్పుడు ఏం జరిగిందో పూసగుచ్చినట్లు బయటపెట్టింది.

రాత్రంతా నిద్రపోలే..!
'ఓ యాక్టర్ గా మనం అన్ని రకాల సీన్స్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బురదలో దిగాలి. మరికొన్నిసార్లు ఎండలో గంటల తరబడి నిలబడాలి. సరే ఇది పక్కనబెడితే చాలా ఏళ్ల క్రితం దిలీప్ ధావన్ తో కలిసి నేను ఓ సీరియల్ చేశాను. మనదేశ చరిత్రలోనే అదే తొలిసారి ఓ సీరియల్ లో కిస్ సీన్ ఉండటం. అందులో నటించిన తర్వాత రాత్రంతా నాకు నిద్రపట్టలేదు' అని నీనా గుప్తా చెప్పింది.

(ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్‌లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?)

డెటాల్ తో కడుక్కున్నా!
'అతడు(దిలీప్ ధావన్) చూడటానికి బాగానే ఉంటాడు. కానీ అలాంటి పరిస్థితిలో అదేం గుర్తుకురాదు. ఆ సీన్ జరిగే సమయానికి మానసికంగా నేను రెడీగా లేను. చాలా టెన‍్షన్ వచ్చేసింది. కానీ నాకు నేను చెప్పుకొని ఆ ముద్దు సన్నివేశాన్ని పూర్తిచేశాను. కొందరు నటులు కామెడీ చేయలేరు. కొందరు కెమెరా ముందు ఏడవలేరు. నేను మాత్రం చేసేయాలి అని అనుకుని ఆ సీన్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత మాత్రం డెటాల్ తో నోరు బాగా కడుక్కున్నాను. తెలియని వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం ఏదేమైనా చాలా కష్టం' అని నీనా అన్నారు.

సీక‍్వెల్‌లో బామ్మగా!
2018లో విడుదలైన 'లస్ట్ స్టోరీస్' ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. శృంగారం, దానికి సంబంధించిన చాలా విషయాల్ని ఓపెన్ గా మాట్లాడుకోవడం, చూపించడం లాంటివి అప్పట్లో ప్రేక్షకుల్ని నోటమాట రానీయకుండా చేశాయి. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా 'లస్ట్ స్టోరీస్ 2'ని సిద్ధం చేశారు. జూన్ 29 నుంచి నెట్‌‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇందులో మృణాల్ ఠాకూర్ పాత్రకు బామ్మగా నీనా గుప్తా నటించింది. 'పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్‌కి వెళ్లండి' లాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పి ఓరి బాబోయ్ అనుకునేలా చేసింది. ఇప్పుడు ఈమెనే తన తొలి ముద్దు గురించి బయటపెట్టి షాకిచ్చింది.

(ఇదీ చదవండి: నిధి అగర్వాల్‌కు కొత‍్త కష్టాలు.. అన్నీ ఉన్నాసరే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement