Kiss scene
-
హీరోయిన్‌కు ముద్దు.. ఘాటుగానే స్పందించిన డైరెక్టర్!
రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'తిరగబడరాసామీ'. ఈ చిత్రానికి ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో పలువురు చిత్ర యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. (ఇది చదవండి: కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోన్న రాజ్ తరుణ్ హీరోయిన్!) ముద్దు సీన్‌తో వివాదం అయితే ఈ ఈవెంట్‌కు హాజరైన ప్రేక్షకులకు ఊహించని సంఘటన ఎదురైంది. ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్ మన్నారా చోప్రాకు దర్శకుడు రవికుమార్ బహిరంగంగా ముద్దుపెట్టడం వివాదానికి దారితీసింది. ఆయన తీరుపై పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డైరెక్టర్ తీరును నెటిజన్స్ విమర్శించారు. కాగా.. గతంలో ఇలానే కాజల్ స్టేజీపై మాట్లాడుతుండగా సినిమాటోగ్రాఫర్ చోటా. కె. నాయుడు ముద్దుపెట్టేశాడు. మీకేం ఇబ్బంది? అయితే తాజాగా ఈ విషయంపై స్పందించారు. తాను హీరోయిన్‌కు ముద్దుపెట్టడంతో తప్పేంటని రవికుమార్ ప్రశ్నిస్తున్నారు. ఆమె పట్ల అప్యాయతతోనే అలా చేశానని చెప్పుకొచ్చారు. నా కూతురికి కూడా అలాగే ముద్దుపెడతా అంటూ వివరణ ఇచ్చారు. అయినా ఆమెకు, మా ఫ్యామిలీకి లేని ఇబ్బంది మీకేంటని నెటిజన్లను నిలదీశారాయన. నా సినిమాలో మన్నారా చోప్రా ఆమె చేసిన వర్క్ నచ్చడం వల్లే అలా చేశానని రవికుమార్ వెల్లడించారు. ఏదేమైనా ఈవెంట్లో అందరిముందు అలా ముద్దులు పెట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. (ఇది చదవండి: రాఖీ సంబురాల్లో కాబోయే మెగా కోడలు.. సోషల్ మీడియాలో వైరల్!) Director kisses an actress earlier today!pic.twitter.com/JzyBbau45d — Manobala Vijayabalan (@ManobalaV) August 28, 2023 -
మొదటి ముద్దు.. డెటాల్‌తో నోరు కడుక్కున్నా: ప్రముఖ నటి
పలువురు లేడీ యాక్టర్స్.. కొన్ని విషయాలు బయటపెట్టడానికి అస్సలు మొహమాటపడట్లేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా చెప్పేస్తున్నారు. బాలీవుడ్ నటి నీనా గుప్తా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ తెగ పాపులర్ అవుతోంది. కొన్నిరోజుల ముందు యువతని ఉద్దేశించి బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడేమో తన తొలిముద్దు అనుభవం గురించి షేర్ చేసుకుని, అందరికీ షాకిచ్చింది. అసలు అప్పుడు ఏం జరిగిందో పూసగుచ్చినట్లు బయటపెట్టింది. రాత్రంతా నిద్రపోలే..! 'ఓ యాక్టర్ గా మనం అన్ని రకాల సీన్స్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు బురదలో దిగాలి. మరికొన్నిసార్లు ఎండలో గంటల తరబడి నిలబడాలి. సరే ఇది పక్కనబెడితే చాలా ఏళ్ల క్రితం దిలీప్ ధావన్ తో కలిసి నేను ఓ సీరియల్ చేశాను. మనదేశ చరిత్రలోనే అదే తొలిసారి ఓ సీరియల్ లో కిస్ సీన్ ఉండటం. అందులో నటించిన తర్వాత రాత్రంతా నాకు నిద్రపట్టలేదు' అని నీనా గుప్తా చెప్పింది. (ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?) డెటాల్ తో కడుక్కున్నా! 'అతడు(దిలీప్ ధావన్) చూడటానికి బాగానే ఉంటాడు. కానీ అలాంటి పరిస్థితిలో అదేం గుర్తుకురాదు. ఆ సీన్ జరిగే సమయానికి మానసికంగా నేను రెడీగా లేను. చాలా టెన్షన్ వచ్చేసింది. కానీ నాకు నేను చెప్పుకొని ఆ ముద్దు సన్నివేశాన్ని పూర్తిచేశాను. కొందరు నటులు కామెడీ చేయలేరు. కొందరు కెమెరా ముందు ఏడవలేరు. నేను మాత్రం చేసేయాలి అని అనుకుని ఆ సీన్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత మాత్రం డెటాల్ తో నోరు బాగా కడుక్కున్నాను. తెలియని వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం ఏదేమైనా చాలా కష్టం' అని నీనా అన్నారు. సీక్వెల్లో బామ్మగా! 2018లో విడుదలైన 'లస్ట్ స్టోరీస్' ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. శృంగారం, దానికి సంబంధించిన చాలా విషయాల్ని ఓపెన్ గా మాట్లాడుకోవడం, చూపించడం లాంటివి అప్పట్లో ప్రేక్షకుల్ని నోటమాట రానీయకుండా చేశాయి. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా 'లస్ట్ స్టోరీస్ 2'ని సిద్ధం చేశారు. జూన్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇందులో మృణాల్ ఠాకూర్ పాత్రకు బామ్మగా నీనా గుప్తా నటించింది. 'పెళ్లికి ముందు టెస్ట్ డ్రైవ్‌కి వెళ్లండి' లాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పి ఓరి బాబోయ్ అనుకునేలా చేసింది. ఇప్పుడు ఈమెనే తన తొలి ముద్దు గురించి బయటపెట్టి షాకిచ్చింది. (ఇదీ చదవండి: నిధి అగర్వాల్‌కు కొత్త కష్టాలు.. అన్నీ ఉన్నాసరే!) -
ముద్దు సీన్ కావాలని చేసింది కాదు: మాళవిక నాయర్
‘ఎవడే సుబ్రమణ్యం’తో టాలీవుడ్ పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ మాళవిక నాయర్. ప్రస్తుతం నాగశౌర్యకు జంటగా ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి సినిమాలో నటిస్తోంది. అవసరాస శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక సినిమాకు సంబంధించి పలు ఆసక్తిసకర విషయాలను పంచుకున్నారు. సినిమాల్లో బోల్ట్ సీన్ అంటే హీరోయిన్లకు కాస్తా కష్టంగానే ఫీలవుతారు. ఈ సినిమాలో అలాంటి సీన్లలో నటించడంపై మాళవిక స్పందించింది. ఈ చిత్రంలో బోల్డ్ సీన్స్ చేసి ఆడియన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది ముద్దుగుమ్మ. ఈ సినిమాలో తొలిసారి మాళవిక ముద్దు సీన్లలో నటించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ముద్దు సీన్‌పై మాళవిక మాట్లాడుతూ..'ముద్దు సీన్లో నటించినందుకు నాకు ఎలాంటి ఇబ్బందిగా లేదు. ఎందుకంటే అది కావాలని పెట్టిన సీన్ కాదు. కథలో భాగమే. ఆ సీన్ కథకు చాలా అవసరమైన సన్నివేశం. అందుకే ముద్దు సీన్లో నటించాల్సి వచ్చింది. సాధారణ ప్రేమ కథా చిత్రాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుంది. ఇందులో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. ఈ సినిమాలో నా అనుపమ పాత్ర ఎంతో నచ్చింది. నటిగా నన్ను నేను నిరూపించుకునే పాత్రలో నటించడం ఆనందంగా ఉంది.' అని అన్నారు. -
ముద్దు వద్దు.. ఆ హీరోలతో మాత్రమే నటిస్తా: స్టార్ హీరోయిన్ల డిమాండ్
క్రియేటివ్ ఫీల్డ్‌లోని క్రేజీనెస్ ఎంత హైలో ఉంటుందో.. ఆ రంగాన్ని ఏలుతున్న సెలెబ్రిటీల డిమాండ్స్ కూడా అంతే హెచ్చుగా ఉంటాయి. స్క్రీన్ మీద స్క్రిప్ట్‌ను.. సెట్స్‌లో ప్రొడ్యూసర్స్నూ అంతే బ్యాలెన్స్డ్గా డిమాండ్ చేస్తూంటారు. ఆ జాబితాలో సోనాక్షీ సిన్హా, కరీనా కపూర్ ఉన్నారు.. దబాంగ్ నాయిక సోనాక్షీ సిన్హా.. వైవిధ్యమైన పాత్రలు పోషించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. తాను సినిమాల్లోకి వచ్చేముందే ఓ నిర్ణయం తీసుకుందట.. ఎంత అద్భుతమైన సినిమా అవనీ.. ఎంతలా స్క్రిప్ట్ డిమాండ్ చేయనీ.. ముద్దు సన్నివేశంలో నటించకూడదని. తన దగ్గరకు సినిమా ఆఫర్లతో వచ్చిన నిర్మాత, దర్శకులు అందరికీ ఆ నిర్ణయాన్ని చెప్పి.. ముద్దు సన్నివేశాలు లేకుండా ముందే జాగ్రత్తపడుతుందట. ఇప్పటి వరకైతే ఇలా సాగుతోంది.. మున్ముందు ముద్దు డిమాండ్ చేస్తే సినిమా వద్దనుకుంటుందో.. తన నిర్ణయాన్ని మూట కడుతుందో తెలీదు అంటారు బాలీవుడ్ వర్గీయులు. రాజ్‌కపూర్ మనవరాలు అనే ప్రివిలేజ్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టినా.. తన నటనాకౌశలాన్ని నిరూపించుకుంటూ కొనసాగుతున్న నటి కరీనా కపూర్. తమ సినిమాల్లో కథానాయికగా కరీనాయే కావాలి అని హీరోలు పట్టుబట్టే స్థాయికి రాగానే తానూ ఓ డిమాండ్ లిస్ట్‌ను ప్రొడ్యూసర్స్‌కు పంపడం మొదలుపెట్టింది కరీనా. ‘ఏ గ్రేడ్ ఆర్టిస్ట్‌ల సరసనే నటిస్తా.. బి గ్రేడ్ ఆర్టిస్ట్‌ల సరసన నటించను. సో నన్ను తమ సినిమాల్లో హీరోయిన్గా కావాలి అనుకుంటున్న హీరోల రేంజ్ చూసుకున్నాకే నాకు చెప్పండి’ అంటూ. దాంతో మంచి మంచి సినిమాలెన్నింటిలోనో నటించే చాన్స్‌ను కోల్పోయిందట కరీనా. అయినా నో రిగ్రెట్స్.. గ్రేడ్ ఓన్లీ మ్యాటర్స్ అంటూ ముందుకెళ్లిపోతోంది ఇప్పటికీ! చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే మా నాన్న కల నిజం అయినందుకు హ్యాపీ: కేతికా శర్మ -
ఆమెకు ముద్దు పెట్టారా?.. పిల్లాడి ప్రశ్నకు తడబడ్డ స్టార్ హీరో, వీడియో వైరల్
Ryan Reynolds Goes Speechless When A Kid Ask About Kiss Scene: హాలీవుడ్ స్టార్ హీరో జాబితాలో ఒకరిగా చేరాడు ర్యాన్ రేనాల్డ్స్. ఆయన నటించిన డెడ్‌పూల్ 1, డెడ్‌పూల్ 2, ఫ్రీ గాయ్, రెడ్ నోటీస్ చిత్రాలు మంచి ప్రేక్షాదరణ పొందాయి. ఇందులో ఎప్పుడూ వాగుతూ, వ్యంగంగా మాట్లాడే హీరోగా అలరించాడు ర్యాన్. సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా ర్యాన్ది పెద్ద నోరేనట. ఎప్పుడూ తనదైన శైలీలో చమత్కారంగా కౌంటర్లు ఇస్తుంటాడు. అతని హాస్య చతురతని ఎవరూ బీట్ చేయలేరని కూడా ఓ టాక్ ఉంది. అయితే అందరినీ ఆటపట్టించే ర్యాన్ రేనాల్డ్స్కు ఓ పిల్లాడు వేసిన ప్రశ్న నోటి మాట రాకుండా చేసింది. సరదాగా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ర్యాన్ రేనాల్డ్స్ తాజాగా నటించిన చిత్రం 'ది ఆడమ్ ప్రాజెక్ట్'. ఈ సినిమాకు సంబంధించి విలేకరులు సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ప్రశ్నలు-సమాధానాలు సెషన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒక చిన్న పిల్లవాడు (10 సంవత్సరాలు) మైక్ తీసుకుని సినిమాలో జో సల్దానాతో ముద్దు సీన్ గురించి ఆసక్తిగా అడిగాడు. 'మీరు ఆ అమ్మాయిని నిజంగానే ముద్దు పెట్టుకున్నారా ?' అని ర్యాన్‌ను ఆ పిల్లాడు ప్రశ్నించాడు. ఈ ప్రశ్నతో సమావేశంలోని అందరూ నవ్వడం ప్రారంభించారు. ఆ ప్రశ్నతో ఆశ్చర్యానికి గురైన ర్యాన్ కొద్దిసేపు ఆగి సమాధానం ఇచ్చాడు. 'ఒక రకంగా నిజమే అని అనుకుంటున్నాను. అయినా ఈ ప్రశ్నకు నేను ఎలా సమాధానం చెప్పగలను ? ఇక ఇది ప్రతీ చోటా ప్రసారం చేస్తారు. అంటే.. అది నా ఉద్దేశం కాదు.' అని చెప్పిన ర్యాన్ సమాధానానికి అందరూ అతన్ని చూసి నవ్వారు. తర్వాత తన సిగ్గును కొంచెం దాచిపెడుతూ 'నా సొంత పిల్లలకు ఈ విషయం గురించి ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఒకవేళ వారు ఇది చూసి, డాడీ.. మీరేం చేస్తున్నారు? అని అడిగితే ఇలానే స్పందిస్తానేమో. కోపం ఏం లేదు. కొద్దిగా నిరాశ మాత్రమే.' అని ర్యాన్ రేనాల్డ్స్ చెప్పాడు. ఆ పిల్లాడు అడిగిన ప్రశ్నకు చప్పట్లు కొట్టి.. సెటైరికల్‌గా అతనితో 'ఆ విధంగా ముగిసిందన్నమాట' అని అన్నాడు ర్యాన్ రేనాల్డ్స్. View this post on Instagram A post shared by Netflix Geeked (@netflixgeeked) -
రవితేజతో సీన్, వివరణ ఇచ్చిన హీరోయిన్
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది నటి మీనాక్షి చౌదరి. ఇక రెండవ సినిమాకే స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ సరసన నటించే చాన్స్ కొట్టేసింది. తాజాగా ఆమె నటించిన చిత్రం ఖిలాడి. రవితేజ హీరోగా రమేశ్ వర్మ రూపొందించిన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా మీనాక్షి చౌదరి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను పంచుకుంది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ‘నా రెండవ సినిమానే రవితేజ గారితో కలిసి చేస్తానని అనుకోలేదు.చదవండి: 2022 ఆగస్ట్ 7వ తేదీ ఉదయం 7గంటలకు బిడ్డకు జన్మనిస్తా: సామ్ కామెంట్స్ వైరల్ఆయన టైమింగ్ మామూలుగా లేదు. తెలుగు అంతగా రాకపోవడం వలన నేను కాస్త ఇబ్బంది పడ్డాను. కానీ కంగారు పడొద్దంటూ రవితేజ గారు కంఫర్టును ఇచ్చారు. అందువల్లనే నేను నా పాత్రను సరిగ్గా చేయగలిగాను. ఈ సినిమాలో లిప్ లాక్ ఉంది .. కథకు అవసరం కనుకనే అలా చేశాను’ అని చెప్పుకొచ్చింది. అలాగే సినిమాలో తన పాత్ర నిడివి గురించి పెద్దగా పట్టించుకోను, అయితే కథకు తన పాత్రకు ప్రాముఖ్యత ఉండేలా చూసుకుంటానని ఆమె పేర్కొంది. ‘మొదటి నుండి ఇంటిమేట్ సన్నివేశాల గురించి నాకు తెలుసు. దర్శకుడు రమేష్ వర్మ కథ చెప్పినప్పుడు ఈ సన్నివేశాల గురించి నాకు తెలియజేసారు.చదవండి: Karate Kalyani: మళ్లీ పెళ్లి చేసుకుంటా.. ఇప్పటికి ఆ ఆశ తీరలేదుఇలాంటివి కమర్షియల్ సినిమాల్లో భాగమేనని నాకు అర్థమైంది. ముద్దు సన్నివేశాల్లో నటించడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది మీనాక్షి చౌదరి. ఇక డింపుల్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని, ఆమెకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అనే విషయాన్ని తాను గమనించానంది. ఈ సినిమా కోసం చాలామంది సీనియర్ ఆర్టిస్టులు పనిచేశారని, తప్పకుండా ఖిలాడి పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందంటూ ధీమా వ్యక్తం చేసింది. ఇక తాను చేసిన మరో తెలుగు మూవీ 'హిట్ 2', 'తమిళంలో చేసిన 'కొలై' సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. -
ఆమెను కిస్ చేసినప్పుడు రోబోలా ఫీల్ అయ్యాను..
బాలీవుడ్ బ్యూటీ కీర్తీ కుల్హారీ, సీనియర్ నటి షెఫాలీ షా కలిసి నటించిన హిందీ వెబ్ సిరీస్ 'హ్యూమన్'. మెడికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో ఇద్దరు మహిళా వైద్యులు డ్రగ్ ట్రయల్స్, దాని చుట్టూ ఉండే రాజకీయ కోణం, నేరం, చంపేస్తామనే బెదిరింపులను ఎలా ఎదుర్కొన్నారనేదే కథ. ఇందులో కీర్తి కుల్హారీ స్వలింగ సంపర్కురాలైన డాక్టర్ సైరా సబర్వాల్ పాత్రలో నటించింది. అయితే కథలో భాగంగా తన సహనటి షెఫాలీ షాతో కీర్తి ముద్దు సీన్లో నటించాల్సి ఉంది. అప్పుడు వారు ముద్దు పెట్టుకున్న సీన్ గురించి తన మనసులోని మాటను బయటపెట్టింది కీర్తి. ఆ కిస్ సీన్‌ను తీసేటప్పుడు డైరెక్టర్ మోజెజ్ సింగ్ చాలా నెర్వస్ అయ్యారని చెప్పుకొచ్చింది. అలాగే ' ఆ సమయంలో నాకు ఒకే ఒక ఆలోచన నా మనసులో మెదిలింది. ఆమెను కిస్ చేస్తే ఏమైనా అనుభూతికి లోనవుతానా ? ఒకేవేళ నాకు మూడొచ్చేస్తే ? మళ్లీ కాస్తా ఆగి వెనక్కి వెళ్లి ఆలోచించాను. ఏంటీ ? నేను మరో స్త్రీని ఇష్టపడుతున్నానా ? ముద్దు సన్నివేశం అయ్యాక హమ్మయ్యా అనిపించింది. షెఫాలీతో నేను రిహార్సల్స్ వంటివి ఏం చేయలేదు. కానీ ముద్దు సన్నివేశాన్ని విభిన్న కోణాల్లో తీసేందుకు 8-10 సార్లు ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది. మొదటి రెండు టేక్‌ల తర్వాత మేము మాకు రోబోల్లాగా అనిపించాం. ఎందుకంటే తెరపైన కిస్, శృంగార సన్నివేశాలు వస్తే ప్రజలు అనుభూతి చెందుతారేమో కానీ మాకు మాత్రం చాలా బోరింగ్‌గా ఉంటుంది. మీ చుట్టూ 100 మంది ఉంటారు. ఎలాంటి ప్రైవసీ ఉండదు. కేవలం డైరెక్టర్ చెప్పే యాక్షన్, కట్ వంటి దయాదాక్షిణ్యాల మధ్య ఆ సన్నివేశాల్లో నటించాలి కాబట్టి. అలాంటి సమయంలో మీరు మీరు అస్సలు అనుభూతి చెందలేరు. నన్ను నమ్మండి.' అని కీర్తి చెప్పింది. ఈ సన్నివేశంతో తాను ఆన్‌స్క్రీన్ వర్జినిటీ కోల్పోయానని షెఫాలీ షా పేర్కొంది. ఇంతకుముందు తాను ఇలాంటి సీన్లలో ఎప్పుడూ నటించలేదని స్పష్టం చేసింది. ఈ మెడికల్ థ్రిల్లర్ జనవరి 14 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ తెచ్చుకుంటుంది. ఇదీ చదవండి: దేవుడి ప్రసాదం అని చెప్పి ట్రిక్ ప్లే చేశారు.. చివరిగా -
షణ్నూకి ముద్దుపెట్టడంపై సిరి బాయ్‌ఫ్రెండ్ కామెంట్స్ వైరల్..
Siri Boyfriend Reaction After She Kissed Shanmukh Jaswanth: తెలుగు బిజ్బాస్ సీజన్-5 రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఇక నిన్నటి ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్‌లో సన్నీ, శ్రీరామచంద్ర మాటల యుద్ధం ఒక ఎత్తైతే, షణ్ముక్‌కి సిరి ముద్దు పెట్టడం ఎపిసోడ్ హైలైట్‌గా మారింది. ‘మానసికంగా డిస్ట్రబ్ అయినప్పుడు ఎమోషనల్‌గా అటాచ్ అయిపోతాం’ అని షణ్నూ సిరికి హితభోద చేయగా..నీ వల్లే మెంటల్‌గా ఎక్కువ ఇబ్బంది పడుతున్నా అని సిరి బదులిస్తుంది. దీంతో చిరాకుగా అనిపిస్తే దూరం పెట్టు అని షణ్నూ సింగిల్ డైలాగ్‌తో తేల్చేశాడు. తర్వాత ఏమైందో ఏమో కానీ సిరి సడన్‌గా షణ్నూకి ముద్దు పెట్టి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో షాకైన షణ్ను ముసిముసిగా నవ్వుతూనే కెమెరాల వంక చూస్తూ జాగ్రత్తగా రికార్డ్ చేశారా? నాకు ఉంటదిపుడు అంటూ పేర్కొన్నాడు. ఈ మొత్తం ఎపిసోడ్‌ను చూసిన నెటిజన్లు సిరి-షణ్నూకి ముద్దు పెట్టడం ఏంటని ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఆల్రెడి శ్రీహాన్‌తో రిలేషన్లో ఉన్న సిరి కెమెరాలు చూస్తుండగానే ముద్దు పెట్టుకోవడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయంపై తాజాగా సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ స్పందించాడు. ఇప్పుడేంట్రా నేనే ఏడవాలా? షార్ట్ ఫిల్మ్స్, సినిమాల్లో చేస్తే ఓకే కదా మీకు అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ముద్దు ఎపిసోడ్‌పై పలువురు నెటిజన్లు ట్రోల్స్, మెసేజ్‌లు చేస్తుండటంతో శ్రీహాన్ ఇలా స్పందించాడు. ప్రేయసి సిరికి మద్దతుగా నిలిచాడు. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
‘లవ్‌స్టోరీ’: ముద్దు సీన్‌పై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు
కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెరుచుకున్న థియేటర్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’. మహమ్మారి కాలంలో కూడా అధిక శాతం ప్రేక్షకులను థియేటర్లోకి రప్పించిన చిత్రంగా లవ్‌స్టోరీ మార్క్ తెచ్చుకుంది. శుక్రవారం(సెప్టెంబర్ 24) విడుదలైన ఈ చిత్రం భారత్‌లోనే కాదు అమెరిక బాక్సాఫీసు వద్ద కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇందులో సాయి పల్లవి డ్యాన్స్, నాగ చైతన్య నటనకు సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. ఈ మూవీ వరుసగా సక్సెస్, మ్యాజికల్ సక్సెస్ మీట్ వేడుకులను కూడా జరుపుకుంది. ఈ మూవీ సక్సెస్‌తో హీరోహీరోయిన్లు వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా మారారు. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి పల్లవి లవ్‌స్టోరీ విశేషాలను పంచుకుంది. అయితే ఈ సినిమాలో ఓ చోట సాయి పల్లవి, నాగ చైతన్య మధ్య లిప్‌లాక్ సీన్ ఉంటుంది. ఇక్కడ హీరోయిన్.. హీరోకు ముద్దు పెట్టి పరుగెత్తుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో ఈ ముద్దు సీన్‌పై సాయి పల్లవి స్పందిస్తూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఆ సన్నివేశంలో నాగచైతన్యను నేను నిజంగా ముద్దు పెట్టుకోలేదు. కెమెరామెన్ ఆ సన్నివేశాన్ని నిజం అనిపించేలా కెమెరా యాంగిల్ పెట్టి సెట్ చేశారు. ఎందుకంటే ముద్దు సన్నివేశాల్లో నేనేప్పుడు నటించలేదు. సినిమాకు డేట్స్ ఇచ్చేటప్పుడే ఇలాంటి సీన్లలో నటించనని డైరెక్టర్లకు ముందే స్పష్టం చేస్తాను. అలాగే ఈ సినిమాలో ముద్దు సీన్లో నటించమని డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. పాత్ర బాగుంటే పర్ఫార్మెన్స్ దానికదే ఉత్తమంగా వచ్చేసిస్తుందనేది నా అభిప్రాయం’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. -
కిస్ సీన్.. కట్ అంటే కట్ అంతే: హీరోయిన్
రోజులు మారాయి. సినిమా రంగంలో అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ముద్దు సీన్స్ అంటే ముక్కున వేలేసుకొని వింతగా చూసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. లిప్‌లాక్ సీన్స్ సర్వసాధారణం అయిపోయాయి. బాలీవుడ్లో ఇప్పుడు ప్రతి సినిమాలోనూ చుంబన దృశ్యం తప్పనిసరి అయిపోయింది. అయితే, ముద్దు సీన్లు తీయడం కూడా అంత ఈజీ కాదు. ఆ సీన్ చేస్తున్నప్పుడు నటీనటులు ఇద్దరు మానసికంగా సిద్ధం కావాలి. అది కేవలం నటనలో భాగంగానే భావిస్తూ ముద్దు పెట్టుకోవాలనే సూత్రాన్ని పక్కాగా పాటించాలి. లిప్ కిస్ సీన్స్ చిత్రీకరణ సమయంలో ఎలాంటి ఫిలింగ్ కలుగుతుందో తాజాగా బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా వివరించింది. ‘రొమాంటిక్ సీన్స్ కూడా సాధారణ సీన్‌లాగే అనిపిస్తుంది. కిస్ సీన్స్ చిత్రీకరణ సమయంలో కట్ అంటే కట్ అంతే. అంతకు మించి ఎలాంటి ఫీలింగ్ కలగదు. జస్ట్ సినిమా కోసమే అలా చేస్తాం. ఆ తర్వాత దానికి సంబంధించిన ఎలాంటి ఫిలింగ్స్ ఉండవు’అని పరిణీతి చెప్పుకొచ్చింది. పరిణీతి చోప్రా.. 'లేడీస్ వర్సెస్ రికీ భాల్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఇటీవల సైనా అనే సినిమాతో వచ్చింది. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన చిత్రం చిత్రం ‘సైనా’. అమోల్ గుప్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. చదవండి: Bollywood: విభేదాలు.. విడాకులు.. కోట్లలో నష్ట పరిహారం షారుక్, సల్మాన్‌లో ఎవరు కావాలి? విద్యాబాలన్ రిప్లై ఇదే! -
హీరోయిన్ మూతికి ప్లాస్టర్, ఫ్యాన్స్‌ను మోసం చేసిన సల్మాన్!
కంటికి కనిపించేదంతా నిజం కాదు.. 'అరుంధతి' సినిమాలోలో నాజర్ అనుష్కకు చెప్పే డైలాగ్ ఇది. నిజమే.. సినిమాల్లో కనిపించేందంతా నిజమే అని చెప్పలేం. ముఖ్యంగా హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ చాలావరకు నటనే ఉంటుంది. కానీ అన్ని సన్నివేశాల్లో చాలా సహజంగా, అవలీలగా నటించేస్తారు. అయితే కొందరు హీరోహీరోయిన్లు మాత్రం లిప్‌లాక్ సీన్లలో నటించబోం అని కండీషన్లు కూడా పెడతారు. అందులో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఒకరు. 30 ఏళ్లకు పైగా కెరీర్లో ఒక్కసారి కూడా హీరోయిన్‌కు ముద్దు పెట్టని ఈ హారో తాజాగా 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్' సినిమాలో మాత్రం తన హద్దును తనే చెరిపేసుకున్నాడు. దిశా పటానీకి లిప్‌లాక్ ఇచ్చినట్లు ట్రైలర్లో చూపించారు. అయితే ఈ కండల వీరుడు తన పాలసీకి కట్టుబడి ఉన్నారని కొందరు అభిమానులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. రాధే ట్రైలర్లో చూపించిన ముద్దు సన్నివేశం ఫేక్ అని తేల్చారు. ఆ సీన్‌ను స్క్రీన్సాట్ తీసి జూమ్ చేసి చూస్తూ హీరోయిన్ నోటికి ప్లాస్టర్ వేసి ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. This Is Not Any Kiss . Tape On #DishaPatani Mouth 😑 #SalmanKhan pic.twitter.com/tekCmGgzJp — Rahul Meena (@BeingRahulMeena) April 22, 2021 కాగా ప్రభుదేవా దర్శకత్వం వహించిన యాక్షన్ సినిమా 'రాధే'లో జాకీ ష్రాఫ్, రణ్‌దీప్ హుడా ముఖ్య పాత్రల్లో నటించారు. మే 13న ఈ చిత్రం ఓ వైపు థియేటర్లలో, మరోవైపు ఓటీటీలో విడుదలవుతోంది. అయితే ఓటీటీలో పే పర్ వ్యూ విధానంలో అందుబాటులోకి రానుంది. #DishaPatani Ke Lips Per Tape 😂😆 pic.twitter.com/oVltcfvKP7 — Captain Tushar 🎭 (@CaptainOfAkshay) April 22, 2021 చదవండి: 'సల్మాన్ ఆ రొమాన్స్ ఆఫ్-స్క్రీన్‌లో చేస్తాడు..అందుకే'.. కమెడియన్ చేసిన పనికి నెటిజన్ల ప్రశంసలు -
మొదటిసారి హీరోయిన్‌కు ముద్దు పెట్టిన సల్మాన్‌ఖాన్
ముంబై : కండల వీరుడు సల్మాన్ ఖాన్ నుంచి సినిమా వచ్చి చాలా రోజులే అవుతోంది. దీంతో రాధే సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యారు సల్లూ భాయ్. ప్రభుదువా దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. ఇందులో సల్మాన్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సాదారణంగా ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉండే సల్మాన్.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 32 ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఒక్క హీరోయిన్‌తోనూ ముద్దు సీన్లో నటించలేదు. అలాంటిది రాధే ట్రైలర్లో హీరోయిన్ దిశా పటానీతో సల్మాన్ లిప్‌లాక్ సీన్ చూసిన ఆయన ఫ్యాన్స్ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. గతంలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ గురించి కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు..తనకు ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇబ్బందిగా అనిపిస్తుందని సల్మాన్ బదులిచ్చాడు. దీంతో సల్మాన్ ఇవన్నీ ఆఫ్-స్క్రీన్‌లో చేస్తుంటాడు కాబట్టి ఆన్ స్క్రీన్ రొమాన్స్ అవసరం లేదని ఆయన సోదరుడు అర్బాజ్ ఖాన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 33 ఏళ్లుగా ఉన్న కండీషన్స్‌ని దిశా కోసం సల్మాన్ పక్కన పెట్టేశారా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial) చదవండి : అల్లు అర్జున్ను కాపీ కొట్టిన సల్మాన్.. సేమ్ టు సేమ్! జిమ్ ట్రైనర్‌తో మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న నటి -
హీరోయిన్‌తో ముద్దు సీన్.. తండ్రికి ఫోన్ చేసిన ప్రభాస్
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు హీరో ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రభాస్ అంటే ఆరడుగుల మంచితనం..ఇదీ ప్రభాస్‌ను దగ్గరనుంచి చూసిన వాళ్లు చెప్పే మాట. ప్రభాస్ ఎంతో మొహమాటస్తుడని అంటుంటారు వాళ్లు. అంతేకాకుండా కొత్త వాళ్లతో మాట్లాడాలన్నా చాలా సిగ్గుపడుతుంటారని ప్రభాస్ సన్నిహితులు చెబుతుంటారు. రియల్ లైఫ్‌లోనే కాదు, రీల్ లైఫ్‌లోనూ ప్రభాస్ సిగ్గరి. హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించేనప్పుడు ప్రభాస్ చాలా మొహమాటపడుతుంటాడని, డైరెక్టర్ రాజమౌళి సైతం ఓ సందర్భంలో చెప్పారు. బాహుబలి సినిమా సమయంలో తనకు యాక్షన్ సీన్లు డైరెక్ట్ చేయడం కంటే ప్రభాస్‌తో రొమాన్స్ చేయించడానికి చాలా కష్టపడ్డాను అని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్‌కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే.. 2003లో ఆర్తి అగర్వాల్‌తో కలిసి ప్రభాస్ అడవి రాముడు అనే సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమాలో ఓ ముద్దు సన్నివేశంలో నటించాల్సి వచ్చినప్పుడు ప్రభాస్.. వాళ్ల నాన్నకు ఫోన్ చేశాడట. ముద్దు సీన్ చేయడానికి తండ్రి వద్ద నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే నటించాడట. ఈ విషయాన్ని ప్రభాస్ మేనేజర్, నటుడు ప్రభాస్ శ్రీను ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రభాస్‌కు వాళ్ల నాన్న గారంటే ఎంతో గౌరవం అని, ఏ చిన్న విషయాన్నైనా ఆయన అనుమతి తీసుకునేవారని తెలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇంత పేరొచ్చినా, ఎంతో ఒదిగి ఉండే వ్యక్తిత్వం ప్రభాస్‌దని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. చదవండి : ప్రభాస్ లగ్జరీ కారు! ఖరీదు ఎంతంటే? ప్రభాస్ ‘ఆదిపురుష్’: కేవలం ఈ ఒక్క పార్ట్‌కే రూ.300 కోట్లు ఖర్చు! -
'ముద్దు సన్నివేశం నాకు తెలియకుండానే తీశారు'
చెన్నై : విలక్షణ నటుడు, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ఈ మధ్యన వివాదాల్లో నిలుస్తూ తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళ సీనియర్ హీరోయిన్ రేఖకు కమల్ క్షమాపణ చెప్పాలంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొనడం ఆసక్తిని రేకెత్తించింది. వివరాలు.. కె. బాల చందర్ దర్శకత్వంలో 1986లో 'పున్నగై మన్నన్' సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కమల్ హాసన్, రేఖల హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా సినిమాలో కమల్, రేఖల మధ్య ఒక ముద్దుసన్నివేశం ఉంటుంది. అయితే రేఖ16 ఏళ్ల వయసులో ఆమె అనుమతి లేకుండానే సినిమాలో ఈ సన్నివేశం చిత్రీకరించినట్లు తెలిసింది. (కమల్ హాసన్, దర్శకుడు శంకర్లకు పోలీసు నోటీసులు) ఇదే విషయమై సీనియర్ నటి రేఖ స్పందిస్తూ.. ' నేను ఈ విషయాన్ని ఇప్పటికే వంద సార్లు చెప్పాను. డైరెక్టర్ బాలచందర్ నాకు తెలియకుండానే సన్నివేశాన్ని చిత్రీకరించారు. మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడుగుతుంటే నాకు సమాధానం చెప్పడానికి విసుగు అనిపిస్తుంది. కథలో బావోద్వేగం నింపడం కోసం ముద్దు సన్నివేశం పెట్టినట్లు ఆ షాట్ చిత్రీకరణ తర్వాత నాకు చెప్పారు. కాగా షూటింగ్ ముగిసిన తర్వాత అప్పటి అసోసియేట్ డైరెక్టర్లుగా ఉన్న సురేశ్ కృష్ణ, వసంత్‌ల దగ్గర ముద్దు విషయం తన అనుమతి లేకుండా ఎందుకు చిత్రీకరించారని అడిగాను. దానికి వారు ఒక చిన్న పిల్లను ముద్దు పెట్టుకుంటే తప్పేం కాదు.. అయినా ఈ సీన్‌కు సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలుపుతుందని వారంటే.. సెన్సార్ అంటే ఏమిటని అడిగినట్లు నాకు గుర్తుంది. కాగా ఆ షాట్ ముగిసిన తర్వాత డైరెక్టర్ బాలచందర్, కమల్ హాసన్‌లు ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు. అయితే సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత నాకు మంచి అవకాశాలు రావడంతో ఈ విషయాన్ని అందరూ మరిచిపోయారు' అంటూ వెల్లడించారు. (కోటి రూపాయలు ప్రకటించిన కమల్‌హాసన్) తాజాగా సోషల్ మీడియాలో మరోసారి ఈ విషయం వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది. ' ఇప్పుడు ఆ సినిమా తీసిన డైరెక్టర్ కె.బాలచందర్ మన మధ్య లేరు. కమల్ హాసన్‌తో పాటు సినిమా యూనిట్ మాత్రమే ఉన్నారు. అయినా వారికి క్షమాపణ చెప్పాలనిపిస్తే చెప్పొచ్చు.. లేదంటే లేదు. ఎందుకంటే ఇదంతా ఎప్పుడో జరిగిపోయిన విషయం. మళ్లీ ఇప్పుడు ఈ అంశం లేవనెత్తడం నాకు ఇష్టం లేదు' అని రేఖ చెప్పుకొచ్చారు. -
ఆరంభమే ముద్దులతో..
సినిమా: కార్తీతో ఆరంభంలోనే ముద్దు సన్నివేశంలో నటించానని నటి నికిలా విమల్ చెప్పుకొచ్చింది. ఈ మలయాళీ కుట్టి ఇంతకు ముందు కిడారి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తరువాత తంబి చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కార్తీ, నటి జ్యోతిక అక్కా, తమ్ముడుగా నటిస్తున్న చిత్రం తంబి. నటుడు సూర్య తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జీతు జోసఫ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఇది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం 20వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. తంబి చిత్రంలో నటుడు కార్తీతో నటించిన అనుభవం గురించి నటి నికిల విమల్ పేర్కొంటూ జీతూజోసప్ దర్శకత్వంలో ఇంతకు ముందే ఒక మలమాళ చిత్రంలో నటించాల్సిందని, కాల్షీట్స్ సమస్య కారణంగా నటించలేకపోయినట్లు చెప్పింది. అప్పుడు మరో చిత్రంలో నటించే అవకాశం ఇస్తానని దర్శకుడు తెలిపారంది. అలా ఒక సారి ఫోన్ చేసి తమిళంలో ఒక చిత్రం చేస్తున్నానని, అందులో జ్యోతిక, కార్తీ, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారని చెప్పారని తెలిపింది. ఈ చిత్రంలో కార్తీకి జంటగా ఒక పాత్ర ఉంది, నువ్వు నటిస్తావా? అని అడిగారని చెప్పింది. దర్శకుడు అంత నిజాయితీగా చెప్పడంతో తాను వెంటనే తంబి చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు చెప్పింది. ఉత్తమ కళాకారులతో నటించాలని తాను కోరుకుంటానని, అలాంటి మంచి అవకాశం ఈ చిత్రంలో లభించిందని అంది. తనకు తమిళ భాష తెలియడంతో ఈ చిత్రంలో నటించడం సులభం అనిపించిందని చెప్పింది. చాలామంది మాదిరిగానే తానూ నటుడు సూర్య, జ్యోతికలను తెరపై చూసి ఆనందించానని చెప్పింది. అలాంటిది ఇప్పుడు నటి జ్యోతకతో కలిసి ఈ తంబి చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని పేర్కొంది. సాధారణంగా చాలా చిత్రాల్లో ఆరంభంలో చిన్నచిన్న సన్నివేశాల్లో నటింపజేస్తారని అంది. అలాంటిది ఈ చిత్రంలో తాను తొలి రోజే డ్యూయెట్ సాంగ్‌లో నటించాల్సిన పరిస్థితి అని చెప్పింది. అదీ కాకుండా తొలి షాట్‌లోనే కార్తీతో లిప్‌లాక్ సన్నివేశంలో నటించాల్సి రావడంతో చాలా భయపడ్డానని చెప్పింది. కార్తీ చాలా కూల్‌గా మాట్లాడి సహజంగా నటించమని చెప్పడంతో అలానే నటించినట్లు పేర్కొంది. -
‘ముద్దు సీన్ చూసి మా అమ్మ ఏడ్చింది’
ప్రజెంట్ బాలీవుడ్ సెన్సేషన్‌గా నిలిచాడు హీరో కార్తిక్ ఆర్యన్. వరుస సినిమాలతో దూసుకుపోతున్న కార్తిక్ తాజాగా ‘లుకా చుప్పా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో ఓ టీవీ చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించాడు కార్తిక్. అదేంటంటే.. తొలిసారి స్క్రీన్ మీద తాను హీరోయిన్ను ముద్దు పెట్టుకోవడం చూసి కార్తిక్ తల్లి ఏడ్చేశారట. ఈ విషయం గురించి కార్తిక్ మాట్లాడుతూ.. ‘మా అమ్మ, అమ్మమ్మ ఆన్‌స్ర్కీన్ మీద నా ప్రవర్తన చూసి చాలా బాధపడ్డారు. అయ్యో వీడు చదువును గాలికొదిలేసి పనికిమాలిన వేశాలు వేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను స్క్రీన్ మీద హీరోయిన్ను ముద్దు పెట్టుకోవడం చూసి మా అమ్మ ఏడ్చేసింది’ అంటూ చెప్పుకొచ్చారు. కార్తిక్ నటించిన ‘సోను కే టిటూ కీ స్వీటి’ బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాక రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. త్వరలోనే కార్తిక్ ఇంతియాజ్ అలీ చిత్రంలో నటించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. -
ముద్దుకు ఓకే అన్నాడు!
హీరో, హీరోయిన్ తెరపై రొమాన్స్ పండిస్తుంటే చూసేవాళ్లకి కనువిందుగా ఉంటుంది. ముఖ్యంగా కుర్రకారు ఇలాంటి సన్నివేశాలకు జై కొడతారు. త్వరలో విడుదల కానున్న ‘కి అండ్ కా’ అనే హిందీ చిత్రంలో అలాంటి కమనీయ దృశ్యం ఒకటుంది. విశేషం ఏంటంటే.. సయీఫ్ అలీఖాన్‌తో పెళ్లయ్యాక కరీనా కపూర్ పెదవి ముద్దు సన్నివేశంలో నటించిన చిత్రం ఇదే. సయీఫ్ను పెళ్లాడాక ‘ఇక ముద్దు సీన్స్‌లో నటించకూడదు అనుకుంటున్నా’ అని స్టేట్మెంట్ ఇచ్చిన కరీనా ఈ సినిమా కోసం తన నిర్ణయం మార్చుకున్నారు. ‘కి అండ్ కా’లో అర్జున్ కపూర్‌తో లిప్ లాక్ చేసేశారు. దీని గురించి కరీనా మాట్లాడుతూ- ‘‘పెళ్లయిన కొత్తలో ఉండే భావోద్వేగాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. కానీ, ఏళ్లు గడిచేకొద్దీ అవి పాత పడి పోతాయి. ఇంకాస్త అప్డేటెడ్గా, మరింత మెచ్యూర్డ్‌గా ఉండా లనుకుంటాం. అలా అనుకుని తీసుకున్న నిర్ణయంలో భాగం గానే నేనీ ముద్దు సీన్లో నటించాను. స్క్రిప్ట్‌లో మన క్యారెక్టర్ని ఫాలో కావాలి తప్పితే ‘అది చేయను... ఇది చేయను’ అనకూడదని నా అభిప్రాయం. ఈ చిత్రం ఓ భార్యా భర్తల మధ్య సాగుతుంది కాబట్టి ముద్దు సీన్లుంటాయని సయీఫ్కూ తెలుసు. అందుకే ఈ సీన్ చేయడానికి ఓకే అన్నాడు. దర్శకుడు చెప్పింది చేయాలని తనే చెబుతుంటాడు. ఆలాగే సయీఫ్ ఎవరితోనైనా లిప్‌లాక్ సీన్స్‌లో నటిస్తే నాకు అభ్యంతరం లేదు’’ అని చెప్పారు. -
అక్కడ ఆయనను ముద్దు పెట్టుకోవడం అవసరం!
-మధుశాలిని ‘‘ ‘చీకటి రాజ్యం’లో కమల్‌హాసన్ గారితో ముద్దు సీన్లో నటించా. సాధారణంగా ప్రతి సినిమాలో కిస్ అనేది రొమాంటిక్ సీన్లో చూపిస్తుంటారు. కానీ ఈ సినిమాలో అక్కడ కమల్ గారిని ముద్దు పెట్టుకోవడం కథకు అవసరం. ఈ సినిమా చూసిన వాళ్లందరికీ ఆ ముద్దు సీన్ కన్విన్సింగ్‌గా అనిసిస్తుంది’’ అని నటి మధుశాలిని చెప్పారు. ఇటీవల విడుదలైన ‘చీకటి రాజ్యం’లో మధుశాలిని కీలకపాత్ర పోషించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ -‘‘ కమల్ హాసన్ గారంటే ఇష్టం. ఆయన సినిమాకు ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసి వెళ్లాను. వెంటనే ఓకే చెప్పారు. ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా. నేను త్వరలో తమిళ, మలయా ళాల్లో సినిమాలు చేయ నున్నా. తెలుగులో మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్నా’’ అని తెలిపారు.