Meenakshi Chaudhary Says I Am Comfortable With Liplock in Movies - Sakshi
Sakshi News home page

Meenakshi Chaudhary: నటించేందుకు నాకేం అభ్యంతరం లేదు

Published Tue, Feb 8 2022 8:02 PM | Last Updated on Thu, Oct 17 2024 1:09 PM

Khiladi Movie Heroine Meenakshi Chaudhary About Movies

‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది నటి మీనాక్షి చౌదరి. ఇక రెండవ సినిమాకే స్టార్‌ హీరో మాస్‌ మహారాజా రవితేజ సరసన నటించే చాన్స్‌ కొట్టేసింది. తాజాగా ఆమె నటించిన చిత్రం ఖిలాడి. రవితేజ హీరోగా రమేశ్ వర్మ రూపొందించిన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా మీనాక్షి చౌదరి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను పంచుకుంది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. ‘నా రెండవ సినిమానే రవితేజ గారితో కలిసి చేస్తానని అనుకోలేదు.

చదవండి: 2022 ఆగస్ట్‌ 7వ తేదీ ఉదయం 7గంటలకు బిడ్డకు జన్మనిస్తా: సామ్‌ కామెంట్స్‌ వైరల్‌

ఆయన టైమింగ్ మామూలుగా లేదు. తెలుగు అంతగా రాకపోవడం వలన నేను కాస్త ఇబ్బంది పడ్డాను. కానీ కంగారు పడొద్దంటూ రవితేజ గారు కంఫర్టును ఇచ్చారు. అందువల్లనే నేను నా పాత్రను సరిగ్గా చేయగలిగాను. ఈ సినిమాలో లిప్ లాక్ ఉంది .. కథకు అవసరం కనుకనే అలా చేశాను’ అని చెప్పుకొచ్చింది. అలాగే సినిమాలో తన పాత్ర నిడివి గురించి పెద్దగా పట్టించుకోను, అయితే కథకు తన పాత్రకు ప్రాముఖ్యత ఉండేలా చూసుకుంటానని ఆమె పేర్కొంది. ‘మొదటి నుండి ఇంటిమేట్ సన్నివేశాల గురించి నాకు తెలుసు. దర్శకుడు రమేష్ వర్మ కథ చెప్పినప్పుడు ఈ సన్నివేశాల గురించి నాకు తెలియజేసారు.

చదవండి: Karate Kalyani: మళ్లీ పెళ్లి చేసుకుంటా.. ఇప్పటికి ఆ ఆశ తీరలేదు

ఇలాంటివి కమర్షియల్ సినిమాల్లో భాగమేనని నాకు అర్థమైంది. ముద్దు సన్నివేశాల్లో నటించడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది మీనాక్షి చౌదరి. ఇక డింపుల్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని,  ఆమెకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అనే విషయాన్ని తాను గమనించానంది. ఈ సినిమా కోసం చాలామంది సీనియర్ ఆర్టిస్టులు పనిచేశారని, తప్పకుండా ఖిలాడి పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందంటూ ధీమా వ్యక్తం చేసింది. ఇక తాను చేసిన మరో తెలుగు మూవీ 'హిట్ 2', 'తమిళంలో చేసిన 'కొలై' సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement