
వరుణ్ సందేశ్, మధులిక జంటగా చిత్రం కానిస్టేబుల్. ఈ మూవీకి ఆర్యన్ సుభాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై బలగం జగదీష్ నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ మూవీ నుంచి 'మేఘం కురిసింది' అనే క్రేజీ సాంగ్‌ను విడుదల చేశారు. హైదరాబాద్‌లోని వెస్ట్ మారేడ్ పల్లిలోని తన కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..' శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పాత్ర ప్రధానమైxof. పోలీసు శాఖలో కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, కుటుంబ నేపథ్యం, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో నిర్మించిన ఈ చిత్రం విజయవంతం కావాలి. ప్రేక్షకుల ఆదరణ పొందాలి. సినీ పరిశ్రమలో రాణించాలనే లక్ష్యంతో కొత్త నటీనటులు వస్తున్నారని.. వారిని ప్రోత్సహించాలని' సూచించారు.
సందేశాత్మక చిత్రాలను తెలుగు ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశంలోనే హైదరాబాద్ నగరం సినీ హబ్‌గా మారిందని చెప్పారు. చిత్ర నటీనటులు, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ మధులిక, డైరెక్టర్ ఆర్యన్ సుభాన్, నిర్మాత బలగం జగదీశ్, నాయకులు జగ్గయ్య, రమణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment