‘కానిస్టేబుల్’గా వరుణ్ సందేశ్
హ్యాపీ డేస్’ ఫేమ్ వరుణ్ సందేశ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఒకప్పుడు వరుసగా ప్రేమ కథలు చేసిన ఈ యంగ్ హీరో ఇప్పుడు తన పంథాను మార్చుకున్నాడు. డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల ‘నింద’అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాడు. త్వరలోనే మరో డిఫరెంట్ మూవీతో అలరించడానికి రాబోతున్నాడు. అదే ‘కానిస్టేబుల్’.ఆర్యన్ సుభాన్ ఎస్కే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మధులిక వారణాసి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా పోస్టర్ని నెల్లూరు టౌన్ హాల్లో కలెక్టర్ కే. కార్తిక్, సినిమా రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చరవేగంగా జరుగుతున్నాయి అంటూ తెలిపారు. దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ, సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ చిత్రమిదని చెప్పగా చిత్రానికి సంబంధించిన పాటలు మరియు టీసర్ త్వరలో రిలీజ్ చేస్తామని తెలిపారు.