వరుణ్ సందేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. ఎస్‌కే ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ చిత్రంతో మధులిక వారణాసి హీరోయిన్. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన దర్శకుడు నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ– ‘‘టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది.
డిఫరెంట్ కాన్సెప్ట్ అని అర్థం అవుతోంది. ‘కానిస్టేబుల్’ చిత్రం హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ఈ మూవీ ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అని పేర్కొన్నారు వరుణ్ సందేశ్. ‘‘కానిస్టేబుల్’ వరుణ్ సందేశ్‌కి మంచి కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుంది’’ అని తెలిపారు బలగం జగదీష్. ‘‘ఈ చిత్రానికి అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు దర్శకుడు ఆర్యన్. ఈ సినిమాకు సంగీతం: సుభాష్ ఆనంద్.
Comments
Please login to add a commentAdd a comment