trailer release
-
లవ్, రిలేషన్ షిప్, గొడవలు..ఆసక్తికరంగా ‘ప్రేమిస్తావా’ ట్రైలర్
ఆకాష్ మురళి, అదితి శంకర్ జంటగా ‘పంజా’ఫేం విష్ణు వర్ధన్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. జనవరి 30న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్. ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్ లాంచ్ వేడుకను మంగళవారం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు మేకర్స్.ట్రైలర్ విషయానికి వస్తే ప్రేమజంట మధ్య లవ్, రిలేషన్ షిప్, గొడవలు ఇలా ఎంతో ఆసక్తికరంగా ట్రైలర్‌ను డిజైన్ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీస్‌కు డిఫరెంట్‌గా ఈ సినిమా ఉందని చెప్పేలా ట్రైలర్ ఉంది. ఆకాష్ మురళి ఎంతో అనుభవం ఉన్న నటుడిగా తొలి సినిమాతోనే అదరగొట్టాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక అదితి శంకర్ విషయానికి ప్రేమికురాలిగా తనలోని కొత్త కోణాన్ని చూపించారు. శరత్ కుమార్, ఖుష్బూ ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా సినిమాపై అంచనాలు పెంచేలా ట్రైలర్‌ను కట్ చేశారని తెలుస్తోంది.ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో డైరెక్టర్ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ..‘‘ఏడెనిమిదేళ్ల తర్వాత తెలుగువారిని కలుస్తున్నా. నేను తెలుగులో మాట్లాడితే మా అమ్మ సంతోషపడుతుంది. మా సినిమాను సపోర్ట్ చేసి రిలీజ్ చేస్తున్నందుకు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌కు చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఆకాష్-అదితి మధ్య ప్రేమ గురించి చెబుతుంది. ప్రస్తుతం సమాజంలో రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నాయి అనేది చూపిస్తుంది. అదితి, ఆకాష్ చాలా చక్కగా నటించారు. కొన్ని సీన్స్‌లో వాళ్ల నటన చూసి ఎమోషనల్ అయ్యాను. లవ్ స్టోరీలో సాలిడ్ డ్రామా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ డ్రామాని సపోర్ట్ చేస్తూ మిగతా క్యారెక్టర్స్ చేసిన శరత్ కుమార్, ఖుష్బూ, ప్రభుగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి స్క్రిప్ట్‌ను నిర్మాతలు ఒప్పుకోవడం సాహసమనే చెప్పాలి. యువన్ శంకర్ రాజా నా స్కూల్ మేట్. అప్పటి నుంచి అతని సంగీతం తెలుసు. నా సినిమాలన్నింటికీ ఆయనే సంగీతం చేస్తారు. యువన్ సంగీతం కోసమే సినిమాకు వచ్చే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. ఈ సినిమా కోసం ఎంతోమంది గొప్ప టెక్నీషియన్స్ పని చేశారు. ఎప్పటిలాగే మీ అందరి సపోర్ట్ నాకు, ఈ సినిమాకు ఇవ్వాలని కోరుకుంటున్నా. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు ఇప్పటికీ అంతే ఎనర్జీతో ఉన్నారు. ఆయన చాలా ఎత్తుకు ఎదుగుతారని పంజా సినిమా టైమ్‌లోనే నాకు అర్థమైంది. ఆయన మనసు నిజంగా చాలా మంచిది. ఆప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అవడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది’’ అని చెప్పారు.హీరో ఆకాష్ మురళి మాట్లాడుతూ..‘‘నా ఫస్ట్ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయడం నిజంగా నా అదృష్టం. ప్రేమిస్తావా సినిమాకు అందరి సపోర్ట్ కావాలి. అదితి నిజంగా బెస్ట్ కోస్టార్. డైరెక్టర్ హర్ష వర్ధన్ గారు ఈ సినిమాను చాలా బాగా తీశారు. అందరూ తప్పకుండా ప్రేమిస్తావా సినిమాను చూడండి’’ అని చెప్పారు.హీరోయిన్ అదితి శంకర్ మాట్లాడుతూ..‘‘ప్రేమిస్తావా సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఫస్ట్ లవ్ స్టోరీ. ఇందులో లవ్ ఉంది.. యాక్షన్ ఉంది.. రొమాన్స్ ఉంది.. డైరెక్టర్ విష్ణు వర్ధన్ గారి స్టైలిష్ మేకింగ్ ఉంది. ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడండి. మా నాన్నగారికి ఇస్తున్న ప్రేమను నాకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు. -
ఒక పథకం ప్రకారం....
సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ కుమార్ విజయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతీ సోది, ఆషిమా నర్వాల్ హీరోయిన్లుగా నటించారు. సముద్ర ఖని కీలక పాత్ర చేశారు. వినోద్ కుమార్ విజయన్, గార్లపాటి రమేశ్ నిర్మించారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది. శుక్రవారం ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. వినోద్ కుమార్ విజయన్ మాట్లాడుతూ– ‘‘ఇదొక విభిన్నమైన కథ. అడ్వొకేట్ పాత్రలో సాయిరామ్ శంకర్, పోలీసు పాత్రలో సముద్ర ఖని నటన పోటాపోటీగా ఉంటుంది. ఊహించని మలుపులతో సాగే క్రైమ్, మిస్టరీ కథనాలతో మా సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది’’ అని పేర్కొన్నారు. -
సస్పెన్స్... థ్రిల్
వరుణ్ సందేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కానిస్టేబుల్’. ఎస్కే ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్న క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ చిత్రంతో మధులిక వారణాసి హీరోయిన్. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన దర్శకుడు నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ– ‘‘టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ అని అర్థం అవుతోంది. ‘కానిస్టేబుల్’ చిత్రం హిట్ కావాలి’’ అన్నారు. ‘‘ఈ మూవీ ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అని పేర్కొన్నారు వరుణ్ సందేశ్. ‘‘కానిస్టేబుల్’ వరుణ్ సందేశ్‌కి మంచి కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుంది’’ అని తెలిపారు బలగం జగదీష్. ‘‘ఈ చిత్రానికి అవకాశం కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు దర్శకుడు ఆర్యన్. ఈ సినిమాకు సంగీతం: సుభాష్ ఆనంద్. -
'మేరీని ఎవరు హత్య చేశారో డిసెంబర్ 25న తెలుస్తుంది'
‘పులిదండి మేరి... మే 22వ తారీఖున పన్నెండు... ఒంటిగంట మధ్య హత్యకు గురైంది’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ సినిమా ట్రైలర్. ‘వెన్నెల’ కిశోర్ టైటిల్ రోల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. రవితేజ మహాదాస్యం, అనన్య నాగళ్ల జంటగా నటించిన ఈ సినిమాలో సీయా గౌతమ్ పోలీస్ కానిస్టేబుల్‌గా నటించారు. రైటర్ మోహన్ దర్శకత్వంలో శ్రీ గణపతి సినిమాస్ పతాకంపై లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం రిలీజ్ చేశారు.‘మూడు నెలల మధ్యలో మూడు చావులు... ఇంకెన్ని చావులు చూడాలయ్యా ఈ బీచ్‌లో’, ‘ఇంద్ర ధనస్సులో కలర్లు ఏడు... ఈ క్రైమ్ సస్పెక్ట్‌లు కూడా ఏడే’, ‘నా కాడ ఇన్ఫర్మేషన్ ఉన్నాది... కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాను... ఇక తీగ లాగడమే...’, అనే డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ టైటిల్‌కు వెన్నెల కిశోర్ జీవం పోశారు. షెర్లాక్ ప్రవర్తనలో హ్యుమర్ ఉన్నప్పటికీ, కేసును పరిష్కరించడంలో అతని తెలివితేటలు ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంటాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
అతను రాక్షసుడా?
‘అతను రాక్షసుడా?.., కాదు... రాక్షసుడు కాదు.., అయితే అతను దేవుడే...’ అనే అర్థం వచ్చే హిందీ సంభాషణలతో హిందీ చిత్రం ‘జాట్’ ట్రైలర్ విడుదలైంది. సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ఇది. శుక్రవారం ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఈ యాక్షన్ ΄్యాక్డ్ టీజర్లో విలన్లను రఫ్ఫాడించారు సన్నీ డియోల్. ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో టీజర్ స్పష్టం చేస్తోంది. సన్నీ డియోల్, రణదీప్ హుడా తదితరులతో ఈ టీజర్ సాగుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా తది తరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: రిషి పంజాబీ. -
మాస్ మెకానిక్
‘ఓ నటుడిగా నేనింత దూరం వచ్చానంటే ఇద్దరే కారణం. ఒకటి నేను... రెండు... మీరు (అభిమానులు, ప్రేక్షకులను ఉద్దేశించి). ‘మెకానిక్ రాకీ’ సినిమా చూసుకున్నాను. చాలా బాగా వచ్చింది. రెండోసారి కూడా చూడాలనుకునేలా ఈ సినిమా ఉంటుంది.’’ అని విశ్వక్ సేన్ అన్నారు. విశ్వక్ సేన్ హీరోగా, మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం నవంబరు 22న విడుదల కానుంది. ఈ సినిమా తొలి ట్రైలర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. మాస్ యాక్షన్, లవ్, సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమా ఉంటుందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘రిలీజ్ సమయంలో మరో ట్రైలర్‌ను విడుదల చేస్తాం. అలాగే ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తాం. నిర్మాత రామ్ తాళ్లూరి బాగా స΄ోర్ట్ చేశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు రామ్ తాళ్లూరి, శ్రద్ధా శ్రీనాథ్, రవితేజ. -
నీడల్లే నేను తోడు ఉండనా...
‘అంకుర్ నువ్వు ఏమన్నా చేశావా? నువ్వు ఏదన్నా టచ్ చేశావా? ఏదన్నా తిన్నావా ఓకే... కబీర్ నీ ఫోన్‌తో ఏమైనా కాల్స్ చేశాడా? లేదుగా? బ్లడ్ శాంపిల్స్ తీస్తే క్లీన్ వస్తుంది కదా... నువ్వేం భయపడకు... నీకేం కానివ్వను’ అని ఆలియా భట్ పలికే సంభాషణలతో ‘జిగ్రా’ సినిమా తెలుగు ట్రైలర్ విడుదల అయింది. ఆలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘జిగ్రా’. అక్కాతమ్ముళ్ల సెంటిమెంట్‌తో వాసన్ బాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. ఈ చిత్రంలో సత్య పాత్రలో ఆలియా, అంకుర్ పాత్రలో వేదాంగ్ నటించారు. కరణ్ జోహార్, అపూర్వా మెహతా, ఆలియా భట్, షాహిన్ భట్, సోమెన్ మిశ్రా నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 11న విడుదల కానుంది. ‘జిగ్రా’ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ద్వారా హీరో రానా విడుదల చేస్తున్నారు. ఆదివారం ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను హీరో రామ్‌చరణ్ షేర్ చేశారు. ఇంకా ఈ ట్రైలర్లో ‘దారే లేకున్నా... నీ వెంట నీడల్లే నేను తోడు ఉండనా... ఏమైనా కానీ... ఏ పిడుగే రానీ నేను తోడు ఉండనా...’ అనే పాట కూడా వినిపిస్తుంది. -
గొర్రె మీద కేసా?
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గొర్రె పురాణం’. బాబీ దర్శకత్వంలో ప్రవీణ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.‘గొర్రె మీద కేసా? ఎవడా కేసుపెట్టిన గొర్రె? మనం బతకడం కోసం వాటిని చంపేయొచ్చు... మనది ఆకలి... మరి అవి బతకడం కోసం మనల్ని చంపేస్తే అది ఆత్మరక్షణే కదా సార్...’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. -
వినోదం... పోరాటం
కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘుతాత’. సుమన్‌కుమార్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. హోంబలే ఫిలింస్ తమ బేనర్‌పై నిర్మించిన ఈ తొలి తమిళ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. తెలుగులోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమా తమిళ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.‘ఒక అమ్మాయిలా నువ్వు ఎందుకు డ్రెస్సింగ్ చేసుకోవు?’, ‘ఒక అచ్చమైన అమ్మాయిలా ఉండేందుకు నాకు ఆసక్తి లేదు’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఓ భాష నేర్చుకోవడానికి ఓ యువతి పడే ఇబ్బందులు, ఆమె ముందు ఉన్న సవాళ్లు, ఆమె పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం వినోదాత్మకంగా ఉంటుందని సమాచారం. -
హారర్... థ్రిల్
అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘డీమాంటీ కాలనీ 2’. అజయ్ ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్.సి.రాజ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది. రాజ్ వర్మ ఎంటర్టైన్మెంట్– శ్రీ బాలాజీ ఫిలింస్ తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రిలీజ్ చేసి, ‘ట్రైలర్ ఆసక్తిగా ఉంది.సినిమా హిట్టవ్వాలి’ అన్నారు. కాగా అజయ్ ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వంలో వచ్చిన ‘డీమాంటీ కాలనీ’కి సీక్వెల్‌గా ‘డీమాంటీ కాలనీ 2’ రూపొందింది. ‘‘హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఇది. డీమాంటీ ఇంట్లో అనూహ్యమైన ఘటనలు జరుగుతుంటాయి. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వెళ్లిన వారు చనిపోతుంటారు. ఇంతకీ ఆ ఇంట్లో ఉన్న ఆ శక్తి ఏంటి? చివరగా వెళ్లినవారు ఎలా ప్రాణాలు కాపాడుకున్నారు?’ అనేది ‘డీమాంటీ కాలనీ 2’లో ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు మేకర్స్. -
ఆ హంతకుడు ఎవడు.. ఆసక్తికరంగా ‘ఆపరేషన్ రావణ్’
రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. రాధికా శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంతో రక్షిత్ తండ్రి వెంకట సత్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని మాస్కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశారు.‘ఈ చదరంగంలో కపటత్వం, అసత్యం, అతి తెలివితేటలు ఒక్క సెగ్మెట్తో ముగిసిపోతాయి. ఆ దేవుడి ఆట ముగిస్తే అన్ని ఒక్క చోటుకి చేరిపోతాయి..’ అని ఓ గంభీరమైన గొంతుతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. సిటీలో వరుస హత్యలు జరగడం.. ఆ సీరియల్ కిల్లర్ పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం.. హీరో ఛేజింగ్.. రాధికా శరత్‌కుమార్ డిఫరెంట్ లుక్‌తో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? దారుణ హత్యల వెనుక ఉన్న కారణం ఏంటి? అనేది తెలియాలంటే ‘ఆపరేషన్ రావణ్’ మూవీ చూడాల్సిందే. ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆగస్ట్ 2న తెలుగుతో పాటు తమిళ్లో కూడా విడుదల కానుంది. -
పారిపోలేరు... దాక్కోనూలేరు
‘ఊరారా ఇది... చదువుకు తగ్గ జాబ్ లేదు... జాబ్‌కి తగ్గ జీతం లేదు... కట్టిన ట్యాక్స్‌కి తగినట్టు ఫెసిలిటీస్ దొరకడం లేదు’, ‘దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉంటాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు’ అంటూ ఓ మహిళ ఆవేదనతో చెప్పే డైలాగులతో ‘భారతీయుడు 2’ ట్రైలర్ ఆరంభమైంది.కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భారతీయుడు 2’. వీరిద్దరి కాంబినేషన్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘భారతీయుడు’ (1996)కి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2, భారతీయుడు 3’ చిత్రాలు రూపొందాయి. సిద్ధార్థ్, ఎస్జే సూర్య, బాబీ సింహా, కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, గుల్షన్ గ్రోవర్ ఇతర పాత్రల్లో నటించారు. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ చిత్రం తెలుగులో ‘భారతీయుడు 2’, తమిళంలో ‘ఇండియన్ 2’, హిందీలో ‘హిందుస్థానీ 2’ పేరుతో జూలై 12న విడుదల కానుంది.కాగా మంగళవారం ముంబైలో ‘భారతీయుడు 2’ ట్రైలర్ లాంచ్ వేడుకని నిర్వహించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ట్రైలర్స్‌ని విడుదల చేశారు మేకర్స్. ‘ఇది రెండో స్వాతంత్య్ర పోరాటం... గాంధీజీ మార్గంలో మీరు... నేతాజీ మార్గంలో నేను’, ‘సో పారిపోలేరు... దాక్కోనూలేరు’, ‘టామ్ అండ్ జెర్రీ ఆట ఆరంభమైంది’ అంటూ కమల్‌హాసన్ చెప్పే డైలాగులు ట్రైలర్ ఉన్నాయి. ఇదిలా ఉంటే... ‘భారతీయుడు 2’ మూవీ తెలుగు హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ, సీడెడ్ హక్కులను శ్రీ లక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. -
ట్రైలర్ రెడీ
హీరో కమల్ హాసన్ , దర్శకుడు శంకర్ కాంబోలో రూపొందిన సినిమా ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’). 1996లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాతిక సంవత్సరాల తర్వాత ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను తెరకెక్కించారు కమల్‌హాసన్ అండ్ శంకర్. లైకాప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ‘భారతీయుడు 2’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న విడుదల కానుంది.‘భారతీయుడు 2’ మూవీ తెలుగు హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ, సీడెడ్ హక్కులను శ్రీ లక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. తాజాగా ‘ఇండియన్ 2’ ట్రైలర్‌ను ఈ నెల 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ముంబైలో జరగనున్న ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘ఇండియన్ 2’ ట్రైలర్ విడుదలవుతుందని ఫిల్మ్‌నగర్ సమాచారం.సిద్ధార్థ్, ఎస్జే సూర్య, సముద్ర ఖని, బాబీ సింహా, కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, జయరాం, గుల్షన్ గ్రోవర్, బ్రహ్మానందం ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘ఇండియన్ 2’ సినిమాకు అనిరుధ్ రవిచందర్ స్వరకర్త. కాగా ‘ఇండియన్ 3’ సినిమా వచ్చే ఏడాది ్రపారంభంలో విడుదల కానుందని కోలీవుడ్ టాక్. -
ఈసారి ప్రిపేరై వచ్చాను!
ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ, శోభన, అన్నా బెన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. భైరవ పాత్రలో ప్రభాస్, సుమతి పాత్రలో దీపిక, అశ్వత్థామ పాత్రలో అమితాబ్, సుప్రీమ్ యాక్సిన్గా కమల్ కనిపిస్తారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వినీదత్ నిర్మించిన ‘కల్కి 2898 ఏడీ’ ఈ నెల 27న రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘సమయం వచ్చింది. భగవంతుడి లోపల సమస్త సృష్టి ఉంటుందంటారు. అలాంటిది మీ కడుపున భగవంతుడే ఉన్నాడు, నేను కాపాడతా..’ (అమితాబ్), ‘ఎన్ని యుగాలైనా... ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు... మారలేడు’ (కమల్) ‘ఒక పెద్ద బౌంటీ... వన్ షాట్... కాంప్లెక్స్‌కి వెళ్లిపోతా..., సరే... ఇంక చాలు, ఈసారి ప్రిపేరై వచ్చాను... దా’ అనే డైలాగ్స్‌తో పాటు ‘మాధవా...’ అనే పాట కూడా ఈ ట్రైలర్లో వినిపిస్తుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ స్వరకర్త. -
వేటాడితే ఎలా ఉంటుందో చూపిద్దాం!
‘ఈ బంగ్లాలో ఒక అమ్మాయిని చంపేశారు.. ఆ అమ్మాయే దెయ్యంగా మారి అందర్నీ చంపేస్తోందని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు’ అనే డైలాగ్‌తో ‘ఓఎమ్‌జీ’(ఓ మంచి ఘోస్ట్) సినిమా ట్రైలర్ ఆరంభమైంది. నందితా శ్వేత, ‘వెన్నెల’ కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓఎమ్‌జీ’. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. మార్క్‌సెట్ నెట్వర్క్స్ బ్యానర్‌పై డా. అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ మూవీ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.‘అందరి సమస్యలు వేరే అయినా వాటికి పరిష్కారం మాత్రం డబ్బు’, ‘ఇప్పటి వరకు ఆటాడితే ఎలా ఉంటుందో చూశారు.. ఇప్పుడు వేటాడితే ఎలా ఉంటుందో చూపిద్దాం’ వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ‘‘హారర్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో సూపర్ నేచురల్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ చిత్రానికి మేజర్ అస్సెట్ కానుంది. మా సినిమా ప్రేక్షకులను నవ్వించడంతో పాటు భయపెడుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. రఘుబాబు, ‘షకలక’ శంకర్, నాగినీడు, ‘బాహుబలి’ ప్రభాకర్, నవమి గాయక్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఐ ఆండ్రూ. -
బేబీ హీరోయిన్ హారర్ థ్రిల్లర్.. ట్రైలర్ చూశారా?
ఆశిష్, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ మీ. ఇఫ్ యు డేర్ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ట్రైలర్ చూస్తే హారర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దెయ్యంతో హీరో ప్రేమలో పడడం అనే కాన్సెప్ట్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. హీరో, దెయ్యం మధ్య సన్నివేశాలు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. -
Darshini Trailer: భవిష్యత్తులో జరిగేది ముందే తెలిస్తే..?
వికాస్, శాంతి జంటగా నటించిన తాజా చిత్రం దర్శిని. డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌కి డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని కే ఎల్ దామోదర్ ప్రసాద్ విడుదల చేశారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందనే విషయాన్ని ముందే చూడగలిగే టెక్నాలజీ వస్తే ఎలా ఉంటుంది? దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. దర్శిని కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తక్కువ బడ్జెట్లో చాలా మంచి సినిమా తీశారు. ఈ చిత్రం కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.‘జీవితం మీద అసంతృప్తిగా ఉన్న ముగ్గురు కి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనేదే మా చిత్ర కథ. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అని అంశాలు మా చిత్రాల్లో ఉన్నాయి. మే నెలలో విడుదల చేస్తాం’ ని నిర్మాత ఎల్ వి సూర్యం అన్నారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు, హీరో వికాస్, నటుడు సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలోచింపజేసే కాప్
ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ రవిశంకర్ ప్రధాన పాత్రలో, నిఖిల్, రాజశేఖర్, తేజ హీరోలుగా రూపొందిన చిత్రం ‘కాప్’. రాధా సురేష్ సమర్పణలో మాధవన్ సురేష్ నిర్మించారు. బి. సోము సుందరం దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌ని తిరుపతి ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో విడుదల చేశారు. ఎస్వీ కాలేజ్ డైరెక్టర్ డా.యన్. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మా కళాశాల విద్యార్థి మాధవన్ సురేష్ యూఎస్ వెళ్లి అంచలంచెలుగా ఎదిగి సినిమా నిర్మించే స్థాయికి రావడం హ్యీపీ. నితిన్ కూడా మా కాలేజ్ కుర్రాడే’’ అన్నారు. ‘‘శత్రుపురం, మన్యం రాజు’ చిత్రాల తర్వాత నేను డైరెక్ట్ చేసిన మూడో చిత్రం ఇది’’ అన్నారు సోము సుందరం. ‘‘మా సినిమాని హిట్ చేయాలి’’ అన్నారు రాధా సురేష్. ‘‘పోలిటికల్ సెటైర్‌తో పాటు కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో మంచి సందేశం ఉంది’’ అన్నారు మాధవన్ సురేష్. -
జనతా బార్ సందేశం
రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జనతా బార్’. రోచిశ్రీ మూవీస్ పతాకంపై అశ్వథ్ నారాయణ సమర్పణలో రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం మేలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. రాయ్ లక్ష్మి మాట్లాడుతూ– ‘‘బార్ గర్ల్‌గా ప్రారంభమయ్యే నా పాత్ర సమాజంలోని మహిళలు గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎలా ఎదిగింది? అన్నదే ఈ చిత్రం కథాంశం. ఈ సినిమాలో మంచి సందేశం కూడా ఉంది’’ అని అన్నారు. ‘‘కుస్తీ పోటీల నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ సినిమాతో సమాజంలో స్త్రీల ప్రాధాన్యతను మరోసారి చాటి చెప్పే ప్రయత్నం చేశాం’’ అన్నారు రమణ మొగిలి -
Family Star Trailer HD Stills: విజయ్ చెంప చెళ్లుమనిపించిన మృణాల్.. ట్రైలర్ అదిరిపోయింది (ఫోటోలు)
-
బ్యాడ్ బాయ్స్ రెడీ
హాలీవుడ్ బ్యాడ్ బాయ్స్ మళ్లీ వస్తున్నారు. హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీలో ఒకటైన ‘బ్యాడ్ బాయ్స్’ నుంచి రానున్న తాజా చిత్రం ‘బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై’. ‘బ్యాడ్ బాయ్స్’ ఫ్రాంచైజీలో వస్తోన్న నాలుగో చిత్రం ఇది. విల్ స్మిత్, మార్టిన్ లారెన్స్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. మూడో భాగానికి దర్శకత్వం వహించిన అదిల్–శ్రీశ్రీబిలాల్ దర్శకత్వ ద్వయమే ‘బ్యాడ్ బాయ్స్ 4’ను డైరెక్ట్ చేశారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమాను జూన్ 7న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సిటీలో జరుగుతున్న డ్రగ్ మాఫియా ఆగడాలను ఇద్దరు డిటెక్టివ్లు ఏ విధంగా అడ్డుకున్నారు? అనే ఇతివృత్తంతో ఈ సినిమా కథనం ఉంటుందని హాలీవుడ్ సమాచారం. -
ఆ రోజులు గుర్తొస్తున్నాయి
‘‘లక్కీ మీడియా బ్యానర్ ఎంతో అదృష్టంగా భావిస్తాను. ఈ సంస్థతో నాకున్న అనుబంధం గొప్పది. ‘రోటి కపడా రొమాన్స్’ టీమ్‌ను చూస్తుంటే నేనీ బ్యానర్లో సినిమా చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ఈ చిత్రం టీజర్ చూస్తుంటే యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా అనిపిస్తోంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు హీరో శ్రీవిష్ణు. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘా లేఖ, ఖుష్బూ చౌదరి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదల కానుంది. ఈ చిత్రం ఎమోషనల్ డోస్ ప్రీ ట్రైలర్‌ను శ్రీవిష్ణు రిలీజ్ చేశారు. ‘‘కంటెంట్‌ను నమ్మి చేసిన సినిమా ఇది’’ అన్నారు బెక్కెం వేణుగోపాల్, సృజన్‌కుమార్ బొజ్జం, విక్రమ్ రెడ్డి. -
పాన్ ఇండియా సినిమా 'రికార్డ్ బ్రేక్' ట్రైలర్ లాంచ్
నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్య కృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్న కుమార్, శాంతి తివారీ, సోనియా, కాశీ విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రికార్డ్ బ్రేక్’. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్‌పై చదలవాడ పద్మావతి నిర్మించారు. ఈ సినిమా గ్లింప్స్‌ని ‘మాతృదేవోభవ’ ఫేమ్ దర్శకుడు అజయ్ కుమార్, టీజర్‌ని నిర్మాత రామ సత్యనారాయణ, ట్రైలర్‌ని తెలుగు ఫిలింప్రోడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ విడుదల చేశారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ–‘‘వేటగాడు, అడవి రాముడు, దేవదాసు’ వంటి సినిమాల స్ఫూర్తితో ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. ఇప్పటి వరకు నాకున్న అనుభవంతో సమాజానికి ఉపయోగపడే ఓ మంచి కథతో సినిమా తీయాలని ‘రికార్డ్ బ్రేక్’ తీశా. ఇందులో చివరి 45 నిమిషాలు చాలా భావోద్వేగాలు ఉంటాయి. ఈ సినిమాకి విజయం అందించాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు నిహార్ కపూర్, రగ్ధ ఇఫ్తాకర్, సత్య కృష్ణ, సంజన, సోనియా, నాగార్జున, కథా రచయిత అంగిరెడ్డి శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ సాబు వర్గీస్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కంతేటి శంకర్, నిర్మాణం: చదలవాడ బ్రదర్స్. -
నేటి భారతం
ఒకే ఒక్క పాత్రతో సామాజిక సందేశంతో రూపొందిన చిత్రం ‘నేటి భారతం’. యర్రా శ్రీధర్ రాజు నటించి, నిర్మించిన ఈ సినిమాకు భరత్ పారేపల్లి దర్శకత్వం వహించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘కరోనా తర్వాత ఏర్పడ్డ ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో నేను జర్నలిస్టు పాత్ర చేశాను. సింగిల్ క్యారెక్టర్‌తో వస్తోన్న మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు శ్రీధర్. -
యుద్ధానికి పిలుపు
అమెరికన్ ఫిల్మ్స్ ‘గాడ్జిల్లా’ ఫ్రాంచైజీలో వస్తున్న తాజా చిత్రం ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్’ (2024). రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ, డన్ స్టీవెన్స్, కైలీ హోట్లీ, అలెక్స్ ఫెర్న్స్, ఫలా చెన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఆడమ్ విన్గార్డ్ దర్శకుడు. భారీ బడ్జెట్‌తో లెజండరీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాను వార్నర్ బ్రదర్స్ రిలీజ్ చేస్తున్నారు. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్’ చిత్రం అంతర్జాతీయంగా మార్చి 27న, యునైటెడ్ స్టేట్స్లో మార్చి 29న, జపాన్‌లో ఏప్రిల్ 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్’ నుంచి లేటెస్ట్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘మేము ఓ సిగ్నల్‌ని కనుగొన్నాం’, ‘ఏదో ఊహించనది జరగబోతోంది’, ‘అది కేవలం సిగ్నల్ మాత్రమే కాదు.. యుద్ధానికి పిలుపు’ వంటి డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఇక 2021లో వచ్చిన ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’కి సీక్వెల్‌గా ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్’ చిత్రం తెరకెక్కింది. -
స్పైడర్ మేన్‌ను దాటిన డెడ్ పూల్!
హాలీవుడ్ సూపర్ హీరోస్ ఫిల్మ్స్‌లో ‘డెడ్ పూల్’ ఫ్రాంచైజీ ఒకటి. 2016లో వచ్చిన ‘డెడ్ పూల్’, 2018లో వచ్చిన ‘డెడ్ పూల్ 2’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. ప్రేక్షకులను అమితంగా అలరించాయి. తాజాగా ‘డెడ్ పూల్’ సిరీస్‌లోని మూడో భాగం ‘డెడ్ పూల్ అండ్ వోల్వరైన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ర్యాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్మెన్ ప్రధాన పాత్రల్లో, ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ కీలక పాత్రల్లో నటించారు. షాన్ లెవీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జూలై 26న ‘డెడ్ పూల్ అండ్ వోల్వరైన్’ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 365 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. 24 గంటల్లో ఇన్ని వ్యూస్ రావడంతో ఇదే ప్రపంచ రికార్డు అని మేకర్స్ పేర్కొన్నారని హాలీవుడ్ అంటోంది. గతంలో ఈ రికార్డు 2021లో విడుదలైన ‘స్పైడర్‌మేన్: నో వే హోమ్’ ట్రైలర్ పేరిట ఉండేది. 24 గంటల్లో ‘స్పైడర్ మేన్: నో వే హోమ్’ ట్రైలర్ 355.5 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పుడు ‘డెడ్ పూల్ అండ్ వోల్వరైన్’ ట్రైలర్ రాకతో ‘స్పైడర్‌మేన్: నో వే హోమ్’ సెకండ్ ప్లేస్‌లోకి వెళ్లింది. - పోడూరి నాగ ఆంజనేయులు -
ఏంట్రా ఒక్కదానికేనా?.. రేపు పెళ్లయ్యాక ఏం చేస్తావ్?.. ఆసక్తిగా ట్రైలర్!
సూర్య, ధన్య బాలకృష్ణ జంటగా రాబోతున్న చిత్రం రామ్(ర్యాపిడ్ యాక్షన్ మిషన్). దేశభక్తి కథాంశంగా ఈ చిత్రాన్ని మిహిరామ్ వైనతేయ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఓఎస్ఎం విజన్‌తో దీపికాంజలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సూర్య హీరోగా పరిచయం కానున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. సైంధవ్ డైరెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో దేశభక్తి చాటి చెప్పే కథాంశంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో దేశ భక్తిని చాటే ఎన్నో డైలాగ్స్ చాలా ఉన్నాయని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. త్రివర్ణ పతాకాన్ని చూపించే గన్ షాట్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ట్రైలర్‌లోని సన్నివేశాలు చూస్తే ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు, అమిత్ కుమార్ తివారీ, భాషా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. -
మహేశ్ బాబు ‘గుంటూరు కారం, HD మూవీ స్టిల్స్
-
‘గుంటూరు కారం’ ట్రైలర్‌తో హార్ట్ బీట్ పెంచిన మహేశ్ బాబు
‘‘మీరు మీ పెద్దబ్బాయిని అనాథలా వదిలేసారని అంటున్నారు.. దానికి మీరు ఏం చెబుతారు..’ (రమ్యకృష్ణకు ఎదురయ్యే ప్రశ్న)’ అనే డైలాగ్‌తో ‘గుంటూరు కారం’ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ‘అతడు, ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్స్ గా నటించారు. సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. ‘చూడంగానే మజా వచ్చిందా’, ‘హార్ట్ బీట్ పెరిగిందా’, ‘ఈల వేయాలనిపించిందా’, ‘ఆట చూస్తావా..! అంటూ మహేశ్ బాబు చెప్పే డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, జయరాం కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. -
సంక్రాంతికి సైంధవ్ అసలైన ట్రీట్
‘‘సైంధవ్’ ట్రైలర్ అద్భుతంగా వచ్చింది. సినిమా కూడా అందరికీ బాగా నచ్చుతుంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఎప్పటిలానే మీ (ప్రేక్షకులు, అభిమానులు) అందరి ప్రేమ, అభిమానం, ్ర΄ోత్సాహం కావాలి. నా కెరీర్లో 75వ చిత్రంగా ‘సైంధవ్’ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం ‘సైంధవ్’. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా, బేబీ సారా, జయప్రకాశ్ కీలక ΄ాత్రల్లో నటించారు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘సైంధవ్’ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘న్యూ ఏజ్ థ్రిల్లర్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ‘సైంధవ్’తో అది నెరవేరింది. ఈ సినిమా ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభూతిని ఇస్తుంది. నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్. సంక్రాంతికి అసలైన ట్రీట్. తప్పకుండా అలరిస్తుంది’’ అన్నారు. శైలేష్ కొలను మాట్లాడుతూ– ‘‘వెంకటేశ్‌గారి 75వ చిత్రం ‘సైంధవ్’ నేను చేయడం నా అదృష్టం. ఇది నా బెస్ట్ ఫిల్మ్. నాకు వచ్చిన ఫిల్మ్ మేకింగ్ అంతా ఈ సినిమా కోసం వాడేశా. ఈ పండక్కి మా సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు. ‘‘వెంకటేశ్‌గారితో సినిమా చేయడం నా కల నెరవేరినట్లయింది. మా సినిమా విందు భోజనంలా ఉంటుంది’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. -
నవరసాల రాఘవ రెడ్డి
శివ కంఠమనేని హీరోగా, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై కేఎస్ శంకర్ రావ్, జి. రాంబాబు యాదవ్, ఆర్. వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా జనవరి 4న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు, నిర్మాత మురళీ మోహన్ విడుదల చేశారు. సంజీవ్ మేగోటి మాట్లాడుతూ– ‘‘యాక్షన్, డ్రామా, థ్రిల్లర్ అంశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘మధురపూడి గ్రామం అనే నేను’ చిత్రంలో నా పాత్ర రగ్డ్గా ఉంటుంది. ‘రాఘవ రెడ్డి’లో సిన్సియర్, స్ట్రిక్ట్ ప్రోఫెసర్‌గా నటించాను. చక్కటి విందు భోజనంలా నవరసాలున్న సినిమా ఇది’’ అన్నారు శివ కంఠమనేని. ‘‘మా బ్యానర్ నుంచి వస్తోన్న మూడో సినిమా ఇది. మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు వెంకటేశ్వరరావు. ఈ ట్రైలర్ విడుదల వేడుకలో నటి అన్నపూర్ణ, దర్శకుడు నీలకంఠ, సంగీతదర్శకుడు సుధాకర్ మారియో, ఎడిటర్ ఆవుల వెంకటేశ్, వరా ముళ్లపూడి, నటుడు అజయ్ ఘోష్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: సంజీవ్ మేగోటి– సుధాకర్ మారియో, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు. -
రాసి పెట్టుకోండి.. అందర్నీ నవ్విస్తాం
‘‘నటుడిగా నా 21 ఏళ్ల కెరీర్లో ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ నా 32వ సినిమా. నేను చేసిన మంచి పాత్రల్లో ఈ చిత్రం నంబర్ వన్ అవుతుంది. వక్కంతం వంశీగారు కథ అందించిన ‘కిక్, రేసు గుర్రం, టెంపర్’ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఈ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ ఉంటుంది. ప్రేక్షకులందర్నీ నాన్ స్టాప్‌గా నవ్విస్తాం’’ అని హీరో నితిన్ అన్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్ మెంట్స్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 8న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో నితిన్ మాట్లాడుతూ– ‘‘ఈ మూవీలో స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. మంచి కథ, పాటలు, చక్కని డ్యాన్స్ కూడా ఉంటాయి. డిసెంబర్ 8న హిట్ సాధించబోతున్నాం.. ఇది కచ్చితం.. రాసి పెట్టుకోండి’’ అన్నారు. ‘‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి మమ్మల్ని సపోర్ట్ చేయటానికి వచ్చిన అభిమానులు, ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు ఎన్. సుధాకర్ రెడ్డి. ‘‘అద్భుతమైన ఔట్పుట్ ఇవ్వటానికి నేను, నితిన్ రెండేళ్లు కష్టపడ్డాం. అందర్నీ ఎంటర్టైన్ చేయాలని రెండేళ్లు కష్టపడి చాలా జాగ్రత్తగా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేశాం’’ అన్నారు వక్కంతం వంశీ. -
నవ్వులే నవ్వులు
చంద్రశేఖర్, సోనాలి పాణిగ్రాహి, అశోక్ వర్ధన్ , యాదమ్మ రాజు, అప్పారావు, బేబీ ప్రేక్షిత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్లాంట్ మ్యాన్’. కె.సంతోష్ బాబు దర్శకత్వం వహించారు. డీఎం యూనివర్సల్ స్టూడియోస్‌పై పన్నా రాయల్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్లో విడుదలకానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. పన్నా రాయల్ మాట్లాడుతూ–‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ‘ప్లాంట్ మ్యాన్’. ప్రారంభం నుంచి చక్కని వినోదం ఉంటుంది. ఒక కొత్త అంశం కూడా ఉంది.. అందుకే ఈ సినిమాకి ‘ప్లాంట్ మ్యాన్ ’ అనే టైటిల్ నిర్ణయించాం. ఈ చిత్రం తర్వాత కూడా మా బేనర్లో కొత్తవారిని పరిచయం చేస్తూ సినిమాలు నిర్మిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పీఎస్. మణికర్ణన్ , నేపథ్య సంగీతం: వినోద్ యాజమాన్య, సంగీతం: ఆనంద బాలాజీ, నిర్మాత–దర్శకత్వ పర్యవేక్షణ: పన్నా రాయల్. -
అక్కడ మొదలైంది వేట!
‘‘ఓపెన్ చేస్తే ఓ పెద్ద సముద్రాన్ని చూపిస్తున్నాం. అందులో ఒక బుల్లి చేప. దాని వయసు పదేళ్లు. ఈ బుల్లి చేప.. అమ్మ చేప కోసం ఓ కన్నం వేసింది. అక్కడ మొదలైంది బుల్లి చేప వేట.. ఎండ్రకాయకో కన్నం, రొయ్యకో కన్నం, మొసలికో కన్నం... కన్నాల మీద కన్నాలేసి ఆ బుల్లి చేప ఓ పెద్ద తిమింగలమైపోయింది’’ అంటూ మొదలైంది ‘జపాన్ ’ సినిమా తెలుగు ట్రైలర్. కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వంలో ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న చిత్రం ఇది. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సునీల్, విజయ్ మిల్టన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘జపాన్ ’ సినిమా దీపావళి సందర్భంగా విడుదల కానుంది. కార్తీ కెరీర్లో 25వ సినిమా తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుక చెన్నైలో జరిగింది. తెలుగు వెర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. ట్రైలర్ రిలీజ్ వేడుకలో హీరోలు సూర్య, విశాల్, ఆర్య, ‘జయం’ రవి, దర్శకులు లోకేశ్ కనకరాజ్, పా. రంజిత్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్. -
‘గుణసుందరి కథ’కు ఆడవాళ్లు కనెక్ట్ అవుతారు: ఓం ప్రకాశ్ మార్త
నేటి సమాజంలో స్త్రీ ఎదురుకుంటున్న సమస్యల నేపథ్యంలో ‘గుణ సుందరి కథ’ సినిమాను తెరకెక్కించామని అన్నారు చిత్ర దర్శకుడు ఓం ప్రకాశ్ మార్త. సునీత సద్గురు, కార్తీక్ సాహస్, రేవంత్, ఆనంద చక్రపాణి, అశోక్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శక నిర్మాత ఓం ప్రకాశ్ మాట్లాడుతూ.. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ముందుగా సెన్సార్ వారు అభినందించడం మా మొదటి విజయంగా భావిస్తున్నాం అన్నారు. అలాగే ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లో నిలదోక్కుకుంటున్న నటినటులతో చేసిన ఈ ప్రయత్నం అందరికి మంచి పేరు.. గుర్తింపు తెస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు. సీరియస్ కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా ఆడవాళ్లకు బాగా కనెక్ట్ అవుతుందని నమ్మకంతో ఉన్నామన్నారు. అక్టోబర్ 13 న రిలీజ్ కాబోతున్న గుణ సుందరి కథ చిత్రాన్ని అందరూ ఆదరించాలని, అలాగే కంటెంట్ ని నమ్ముకుని చేసే మాలాంటి చిన్న చిత్రాలను కూడా అందరూ సపోర్ట్ చేయాలని కోరారు. -
హారర్ కామెడీ
శివ, గోవా జ్యోతి, స్వర్ణలత, పూజిత, సుమన్ శెట్టి, అప్పారావు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యజ్ఞ’. చిత్తజల్లు ప్రసాద్ దర్శకత్వంలో ఆర్ఆర్ మూవీ క్రియేషన్స్‌పై చిలుకోటి రఘురామ్, చలపల్లి విఠల్ గౌడ్, చిత్తజల్లు ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్, పాటల విడుదల వేడుకలో తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, నిర్మాత సాయివెంకట్, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు.‘‘వినోదం, ప్రేమ, యాక్షన్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతోంది’’అన్నారు చిత్తజల్లు ప్రసాద్. ‘‘మా చిత్రంలోని నటీనటులకు మంచి పేరు వస్తుంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సమర్పణ: దేశ్‌పాండే, సుభాష్, రావ్(దొర) ముళ్లవరం, కెమెరా: జి.కృష్ణనాయుడు, సంగీతం: లక్ష్మణ సాయి. -
'అమెరికాలో అందరూ ఇండియన్ అని అనుకుంటున్నారు'.. ఆసక్తిగా ట్రైలర్!
కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర జంటగా నటించిన చిత్రం మంత్ ఆఫ్ మధు. ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిపుర సినిమాలో జంటగా నటించిన వీరిద్దరు మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే భార్య, భర్తల మధ్య జరిగే గొడవలే కథాశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సరికొత్త కాన్సెప్ట్ కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో శ్రేయ నవిలే, మంజుల ఘట్టమనేని, హర్ష చెముడు, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, రాజా చెంబోలు, రాజా రవీంద్ర, రుద్ర రాఘవ్, రుచితా సాదినేని, మౌర్య సిద్దవరం, కంచెరపాలెం కిషోర్ కీలక పాత్రలు పోషించారు. కాగా.. మంత్ ఆఫ్ మధు అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అష్టదిగ్బంధనం.. ఓ పజిల్
‘‘అష్టదిగ్బంధనం’ పవర్ఫుల్ టైటిల్. ట్రైలర్లో మంచి సస్పెన్స్ కనపడుతోంది. అలాగే ప్రేక్షకులను అష్టదిగ్బంధనం చేసే అంశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి’’ అని ‘బేబీ’ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ అన్నారు. సూర్య, విషిక జంటగా బాబా పీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అష్టదిగ్బంధనం’. ఎంకేఏకేఏ ఫిలిం ్ర΄÷డక్షన్స్ సమర్పణలో మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని సాయి రాజేష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బాబా పీఆర్ మాట్లాడుతూ– ‘‘నా మొదటి సినిమా ‘సైదులు’.. రెండో చిత్రం ‘అష్టదిగ్బంధనం’. క్రైమ్, యాక్షన్, థ్రిల్, పజిల్ లాంటి సినిమా ఇది’’ అన్నారు. ‘‘కథను నమ్మి ఈ సినిమా నిర్మించాను’’ అన్నారు మనోజ్ కుమార్ అగర్వాల్. ‘‘సినిమా పక్కా హిట్ అని నమ్ముతున్నాం’’ అన్నారు సూర్య. -
‘సిరివెన్నెల’ చివరి పాట మా సినిమాలో ఉండడం అదృష్టం: నిర్మాత
‘‘ప్రేక్షకుడిగా నేనో సినిమా చూసినప్పుడు కథలో కొత్తదనం ఉండాలని కోరుకుంటాను. ‘బెదురులంక 2012’ కథలో అలాంటి కొత్తదనాన్ని చూపించారు క్లాక్స్’’ అని నిర్మాత బెన్నీ ముప్పానేని అన్నారు. కార్తికేయ గుమ్మకొండ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బెదురులంక 2012’. సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ– ‘‘సినిమాలపై ఉన్న ఆసక్తితో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి, నిర్మాతగా మారాను. ఓ ఊహాజనిత గ్రామంలో 2012లో 21 రోజులు ఏం జరిగింది? అనేది ‘బెదురులంక 2012’ చిత్రకథ. మనం చని΄ోతాం అని తెలిస్తే చివరి క్షణాల్లో ఎలా ఉంటాం? అనేది సినిమా కోర్ పాయింట్. కార్తికేయ చాలా ప్రొఫెషనల్. అతనితో మరో సినిమా చేద్దామనుకుంటున్నాం. నేహా శెట్టి పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగి΄ోయారు. మణిశర్మగారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు రాసిన చివరి పాట మా సినిమాలో ఉండటం మా అదృష్టం. మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్‌చరణ్‌గారు కథని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మా బ్యానర్లో మూడు ్రపాజెక్ట్స్ ఓకే చేశాం’’ అన్నారు. -
జాతి రత్నాలు తర్వాత ఒత్తిడికి గురయ్యాను
‘‘ఒక యాక్సిడెంట్లో గాయాలైన ఒక మహిళా అభిమాని డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు నా ‘జాతి రత్నాలు’ సినిమాని రోజూ చూస్తానని చెప్పింది. ఇంతకంటే సంతృప్తి నటుడిగా నాకు దొరకదు. అందుకే ‘జాతి రత్నాలు’ హిట్ తర్వాత ఎలాంటి సినిమా చేయాలా అని ఒత్తిడికి గురయ్యాను. ఆ క్రమంలో మహేశ్ చెప్పిన కథ చాలా ఎగ్జయిట్ చేసింది. మానవ సంబంధాల మీద మంచి ఎంటర్టైనింగ్ స్టోరీ రాసుకున్నాడు మహేశ్. స్టాండప్ కామెడీ క్యారెక్టర్‌తో ఫుల్ లెంగ్త్ సినిమా తెలుగులో రాలేదు. అది నచ్చింది. అలాగే అనుష్క హీరోయిన్ అనగానే హ్యాపీ ఫీలయ్యా’’ అన్నారు నవీన్ పొలిశెట్టి. మిస్ శెట్టిగా అనుష్కా శెట్టి, మిస్టర్ పొలిశెట్టిగా నవీన్ పొలిశెట్టి నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. మహేష్ బాబు పి. దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. సోమవారం ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘‘పెళ్లి ఒక్కటే కాదు.. ప్రతి రిలేషన్లో యువత ఆలోచించే తీరు ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అన్నారు పి. మహేశ్ బాబు. -
అందుకే గాండీవధారి అర్జున చేశాను – వరుణ్ తేజ్
‘‘ప్రవీణ్ సత్తారు ‘గాండీవధారి అర్జున’ కథ చెప్పినప్పుడు బాగా నచ్చేసింది. ఓ సమస్య గురించి సినిమా తీస్తున్నప్పుడు ఓ నటుడిగా అలాంటి సినిమా చేయటం నా బాధ్యత అనిపించింది.. అందుకే ఈ మూవీ చేశాను’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాక్షీ వైద్య జంటగా నటించిన చిత్రం ‘గాండీవధారి అర్జున’. బాపినీడు .బి సమర్పణలో ఎస్వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. గురువారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘గాండీవధారి అర్జున’ ట్రైలర్ చూసి యాక్షన్ మాత్రమే ఉంటుందనుకోవద్దు.. మంచి ఎమోషన్స్ ఉంటాయి. దేశానికి వచ్చే సమస్య ఏంటి? అనేది చూపించాం’’ అన్నారు. ‘‘వరుణ్ తేజ్‌తో మేం చేసిన మొదటి సినిమా ‘తొలి ప్రేమ’, సాయితేజ్‌తో చేసిన ‘విరూ పాక్ష’ హిట్ అయ్యాయి. ఇప్పడు ‘గాండీవధారి అర్జున’ కూడా సూపర్ హిట్ అవుతుంది’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. ‘‘భూమిపై ఉన్న వనరులను ఇష్టానుసారం వాడేస్తున్నాం. భవిష్యత్ తరాల గురించి ఆలోచించటం లేదు. పర్యావరణ పరిరక్షణ గురించి ఈ సినిమా తీశాం’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. -
ఒక చరిత్రను వెతుక్కుంటూ వెనక్కి వెళ్లే కథే ‘హిడింబ’
‘‘కథని బలంగా నమ్మి చేసిన చిత్రం ‘హిడింబ’. స్క్రీన్‌ప్లే, విజువల్స్ రెగ్యులర్‌గా కాకుండా మా మూవీలో కొత్తగా ఉంటాయి. సినిమా బాగా వచ్చింది.. ప్రేక్షకులకు మా చిత్రం నచ్చుతుంది’’ అని హీరో అశ్విన్ బాబు అన్నారు. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు, నందితా శ్వేత జంటగా నటించిన చిత్రం ‘హిడింబ’. అనిల్ సుంకర సమర్పణలో గంగపట్నం శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న రిలీజవుతోంది. ఈ సందర్భంగా సోమవారం ‘హిడింబ’ రివర్స్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. అనిల్ కన్నెగంటి మాట్లాడుతూ– ‘‘ఒక చరిత్ర వెతుక్కుంటూ వెనక్కి వెళ్లే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘హిడింబ’. నాకు గొప్ప తృప్తి ఇచ్చిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘మా సినిమాని థియేటర్లో చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి’’ అన్నారు గంగపట్నం శ్రీధర్. ఈ కార్యక్రమంలో నటులు శ్రీనివాస్ రెడ్డి, రఘు కుంచె పాల్గొన్నారు. -
భారత్‌లో బస్సు ఎక్కితే.. ఆస్ట్రేలియాలో దిగాడు
‘‘7:11 పీఎం’ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. సౌండ్, విజువల్స్, వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి’’ అని డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నారు. సాహస్, దీపిక జంటగా చైతు మాదాల దర్శకత్వం వహించిన చిత్రం ‘7:11 పీఎం’. నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించిన ఈ సినిమా జూలై 7న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హరీష్ శంకర్ రిలీజ్ చేశారు. చైతు మాదాల మాట్లాడుతూ–'ఒక టౌన్, రెండు గ్రహాలు, మూడు కాలాలు.. ఇదీ మా సినిమా లైన్. వీటిని ఎలా కనెక్ట్ చేశామనేది ఆసక్తిగా ఉంటుంది. మా సినిమాని విడుదల చేస్తున్న రవిశంకర్, నవీన్‌గార్లకు థ్యాంక్స్' అన్నారు. 'ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది' అన్నారు వై. రవిశంకర్. ట్రైలర్ విషయానికొస్తే.. కథానాయకుడు తనకు తెలియకుండానే టైమ్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. ముందు రోజు రాత్రి బస్ ఎక్కిన అతడు.. తర్వాతి రోజు ఉదయాన్నే ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సముద్ర తీరంలో నిద్రలేస్తాడు. పలు ఆసక్తికరమైన సన్నివేశాలను ట్రైలర్లో చూపిస్తూ.. చివరికి ఓ టైమ్ మిషన్‌తో ముగించారు. మొత్తంగా ఓ గ్రామం, రెండు గ్రహాలు, మూడు వేర్వేరు కాలాల.. చుట్టూ ఈ కథ నడుస్తుందని అర్థమవుతోంది. -
O Saathiya Trailer: సరికొత్త ప్రేమకథగా ‘ఓ సాథియా’
ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా దివ్య భావన దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ సాథియా’. చందన కట్టా, సుభాష్ కట్టా నిర్మించిన ఈ చిత్రం జూలై 7న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని నిర్మాత కేఎస్ రామారావు విడుదల చేసి, ‘‘సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘ఆర్యన్ గౌర తన గురించి చెప్తుంటే నా తొలి సినిమా కష్టాలు గుర్తొచ్చాయి’’ అన్నారు డైరెక్టర్ త్రినాథరావు నక్కిన. ‘‘మా సినిమా చూసి ప్రేక్షకులు చక్కని చిరునవ్వుతో థియేటర్ నుంచి బయటికొస్తారు’’ అన్నారు ఆర్యన్ గౌర. ‘‘నా గురువు విజయేంద్ర ప్రసాద్ గారివల్లే నేను ఇక్కడ ఉన్నాను. సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’’ అన్నారు దివ్య భావన. ‘‘మా సినిమా చూశాక అందరికీ తమ తొలి ప్రేమ గుర్తుకొస్తుంది’’ అన్నారు సుభాష్ కట్టా. -
సర్కిల్లోనూ ఆ ప్రయత్నం కొనసాగించా
‘‘నా సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యత ఇస్తాను. ‘షో’లో మంజుల, ‘మిస్సమ్మ’లో లయ, భూమిక, ‘సదా మీ సేవలో’ చిత్రంలో శ్రియ.. ఇలా నా హీరోయిన్ల క్యారెక్టర్స్ బాగుంటాయని అందరూ చెబుతారు. ‘సర్కిల్’లోనూ ఆ ప్రయత్నాన్ని కొనసాగించాను. ఈ సినిమాలో అరుంధతి పాత్రలో రిచా పనై కొత్తగా కనిపిస్తుంది. అర్షిణ్, సాయి రోనక్, బాబా భాస్కర్ కూడా చక్కగా నటించారు’’ అని డైరెక్టర్ నీలకంఠ అన్నారు. సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా, రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సర్కిల్’. నీలకంఠ దర్శకత్వంలో ఎమ్.వి శరత్ చంద్ర, టి. సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించిన ఈ చిత్రం జూలై 7న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘నీలకంఠగారితో పని చేయడం ఒక ఛాలెంజ్. ఈ సినిమా షూటింగ్‌ని ఎంజాయ్ చేశాను’’ అన్నారు సాయి రోనక్. ‘‘ఇదొక డిఫరెంట్ మూవీ.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు శరత్ చంద్ర. -
ట్రైలర్ చూస్తుంటే కన్నీళ్లొచ్చాయి
‘విమానం’ ట్రైలర్ చూస్తుంటే మంచి భావోద్వేగాలతో సినిమా ఉంటుందని తెలుస్తోంది. తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ని దర్శకుడు శివ ప్రసాద్ ట్రైలర్లో అద్భుతంగా చూపించాడు. ట్రైలర్ నా మనసును కదిలించింది.. నాకు కన్నీళ్లొచ్చాయి’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు అన్నారు. సముద్ర ఖని, అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, మాస్టర్ ధ్రువన్ కీలక పాత్రల్లో శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహించిన చిత్రం ‘విమానం’. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ–‘‘తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ‘విమానం’ సినిమా చూడాలి.. అప్పుడే పిల్లల కోసం తల్లిదండ్రులు పడే తపన ఎలా ఉంటుందో తెలుస్తుంది’’ అన్నారు. జీ స్టూడియో సౌత్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ప్రసాద్, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వివేక్ కాలేపు. -
ప్రియమైన థ్రిల్
అశోక్ కుమార్, లీషా ఎక్లెయిర్స్ హీరో హీరోయిన్గా ఏజే. సుజిత్ దర్శకత్వం వహించిన సైకో థ్రిల్లర్ ‘ప్రియమైన ప్రియ’. గోల్డెన్ గ్లోరి బ్యానర్ పై సీతారామ్ యాదవ్ నిర్మాణ నిర్వహణ సారథ్యంలో సుజిత్, బాబు నిర్మించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఆడియో, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ వేదికపై హీరో అశోక్ మాట్లాడుతూ– ‘‘మంచి సైకో థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో నేనే హీరో, నేనే సైకో. యాక్టర్‌గా నన్ను నేను ప్రూవ్ చేసుకునే చిత్రమిది’’ అన్నారు. ‘‘మ్యూజిక్ డైరెక్టర్‌గా నా కెరీర్లో వందో చిత్రం ఇది’’ అన్నారు శ్రీకాంత్ దేవా. నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఎల్ దామోదర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: షా, సహ–నిర్మాత: కె. లక్ష్మీకాంత్. -
ఓ రైతు కథ
సన్నీ నవీన్ , రోహిణీ రేచల్ జంటగా తోట మల్లికార్జున దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైత్ర’. అల్లం సుభాష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. అనంతరం తోట మల్లికార్జున మాట్లాడుతూ– ‘‘మట్టితో చుట్టరికం చేసే ఓ రైతు కథే ఈ చిత్రం. రాయలసీమ యాస, నేపథ్యంతో తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘సాధారణంగా రాయలసీమ నేపథ్యంలో సినిమా అంటే ఫ్యాక్షన్ అనుకుంటారు. కానీ, ఇందుకు విభిన్నంగా రాయలసీమలో నివసించే ఒక రైతు కుటుంబానికి చెందిన కథ, కథనాలతో ‘జైత్ర’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది’’ అన్నారు సన్నీ నవీన్. ‘‘ఓ రైతు కథతో చాలా సహజంగా మంచి రాయలసీమ స్లాంగ్‌తో ఈ సినిమా రాబోతోంది’’ అన్నారు అల్లం సుభాష్. -
ఆసక్తిని రేకెత్తిస్తున్న 'బిచ్చగాడు-2' ట్రైలర్ చూశారా?
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తెలుగులోనూ ఆయనకు సూపర్ క్రేజ్‌ను తెచ్చిపెట్టిందీ సినిమా. దీంతో ఇప్పుడు రానున్న బిచ్చగాడు-2పై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై మాంచి హైప్‌ను క్రియేట్ చేస్తోంది. మే 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.చదవండి: ‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..? లక్ష కోట్లకు వారసుడైన ధనవంతుడిగా విజయ్ ఇంట్రడక్షన్ అదిరిపోతుంది. బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంట్ చుట్టూ కథను నడిపించినట్లు ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. కావ్య థాపర్, దేవ్ గిల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
‘మిస్సయిన 1.5 లక్షలమంది ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు’
నాంది వంటి హిట్ చిత్రం తర్వాత హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల కాంబినేషన్లో రూపొందించిన మరో చిత్రం ఉగ్రం. ఈ చిత్రంలో మీర్నామీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాని మే5న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఖమ్మంలో రిలీజ్ చేసింది చిత్రబృందం. ట్రైలర్ చూస్తే యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. మిస్సింగ్ కేసులను పరిష్కరించే పోలీసు పాత్రలో అల్లరి నరేశ్ కనిపించనున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేశ్ ఫుల్ యాక్షన్ సీన్స్‌తో అలరించనున్నారు. ట్రైలర్ చివర్లో 'ఒక మనిషి పోతే నాలుగు రోజులు బాధపడతాం.. అదే మనిషి కనిపించకుండా పోతే మనం పోయేంత వరకు గుర్తు చేసుకుంటూ బాధపడతాం.' డైలాగ్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. కాగా.. ఇప్పటికే రిలీజైన మూవీ టీజర్‌కి, దేవరి అనే తొలి పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రానికి కెమెరామెన్‌గా సిద్.. శ్రీ చరణ్ పాకాల సంగీతమందించారు. (ఇది చదవండి: రోమ్ వీధుల్లో రొమాన్స్.. పబ్లిక్‌లో స్టార్ కపుల్ లిప్ లాక్!) ఈవెంట్లో అల్లరి నరేశ్ మాట్లాడుతూ.. 'ఇది నా కెరీర్లో 60వ సినిమా. మహర్షిలో నేను పోషించిన పాత్ర నచ్చడంతో అలాంటి రోల్లో ఓ సినిమా చేద్దామన్నారు దర్శకుడు విజయ్. అలానే నాందిని తెరకెక్కించాం. మంచి విజయం సాధించింది. మళ్లీ ఉగ్రం సినిమాతో మీ ముందుకొస్తున్నాం. ఈ చిత్రం నాందికి మించి ఉంటుంది. మిస్సింగ్ కేసుల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నాం. సినిమా తీస్తున్నప్పుడు లాక్డౌన్ సమయంలో 1.5 లక్షల మంది కనిపించకుండా పోయారనే విషయం తెలిసింది. వారంతా ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు.' అంటూ ఎమోషనలయ్యారు. -
ఏజెంట్ నన్ను పూర్తిగా మార్చేసింది: అఖిల్
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఏజెంట్’. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్గా నటించగా, మమ్ముట్టి కీలక పాత్ర చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి 2 పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో అఖిల్ కంప్లీట్ డిఫరెంట్ మేకోవర్ లుక్‌లో కనిపించనున్నారు. తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో అఖిల్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఏజెంట్ మూవీ ట్రైలర్‌ను ఈనెల 18న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రెస్ మీట్లో అఖిల్ మాట్లాడుతూ.. 'ఇది రెండేళ్ల జర్నీలో ఏజెంట్ నన్ను పూర్తిగా మార్చేసింది. ఈ జర్నీలో సగటు మనిషిగా నేను అలసిపోయా. అయితే సినిమాకు ఏం కావాలో అది చేశానన్న ఆనందం ఉంది. ఈ సినిమాతో మానసికంగా దృఢంగా మారిపోయా. ఒక నటుడిగా సరికొత్త ఫేజ్‌లోకి వచ్చాను. సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మమ్ముటి సర్‌తో నటించడం నా అదృష్టం. ఆయన విలువ చాలా గొప్పది. నాలో స్ఫూర్తి నింపారు. చాలా విషయాలు నేర్చుకున్నా. నాకు యాక్షన్ జోనర్ అంటే ఇష్టం. అందుకే కథ చెప్పగానే కమిట్ అయిపోయా' అని అన్నారు. కాగా.. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, పోస్టర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచేశాయి. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. Let's begin the #AGENT ACTION HEAT to beat the summer wave!!#AgentTrailer out on APRIL 18th Stay Excited for the Massive Launch..#AGENTonApril28th@AkhilAkkineni8 @mammukka #DinoMorea @sakshivaidya99 @AnilSunkara1 @AKentsOfficial @LahariMusic @shreyasgroup pic.twitter.com/wpsJirNUFK — SurenderReddy (@DirSurender) April 15, 2023 -
మీ అంచనాలను మించి ఉంటుంది.. 'విరూపాక్ష' ట్రైలర్‌పై అప్డేట్
సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా నటిస్తున్న చిత్రం విరూపాక్ష. SDT15 ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్, టీజర్ ఆడియెన్స్‌ను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ న్యూస్ తెరమీదకి వచ్చింది. ప్రేక్షకులను మరింత థ్రిల్‌కి గురిచేసేందుకు రేపు (ఏప్రిల్ 11) ఉదయం 11:07 నిమిషాలకు ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నాం అంటూ మేకర్స్ తెలిపారు. ఇది ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందంటూ సాయితేజ్ సైతం ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూను కూడా ఫిక్స్ చేశారు. ఈనెల 16న ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో ఈ మూవీ ప్రీ రిలీజ్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. This will surprise you beyond your imagination#VirupakshaTrailer https://t.co/Q5DcGuH0Gm — Sai Dharam Tej (@IamSaiDharamTej) April 10, 2023 -
అంచనాలు పెంచుతున్న పొన్నియన్ సెల్వన్ 2 ట్రైలర్
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ 1 ఎంతటి సంచనాలు సృష్టించిందో మనందరికీ తెలిసిందే! గతేడాది సెప్టెంబర్ 30న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజైన ఈ చిత్రానికి ఊహించని స్పందన లభించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్లు సాధించింది. దీంతో సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు ముస్తాబవుతోంది. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్ర బృందం ట్రైలర్ రిలీజ్ చేసింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ..సముద్రంలో జరిగే ఫైట్ సీన్‌తో మొదలైంది. వారసుడు అయిన ‘అరుల్మొళి వర్మన్ (జయం రవి)’ చనిపోయాడనుకుని చోళ రాజ్యాన్ని ముక్కలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. చోళ రాజు ‘అరుల్మొళి వర్మన్’ చనిపోయాడని వార్త అందుకున్న పాండ్యులు ‘ఆదిత్య కరికాలుడు (విక్రమ్)’ని కూడా చంపాలని ప్రణాళిక వేస్తారు. ఆ తర్వాత జరిగే ఊహించని మలుపుల నేపథ్యంలో ట్రైలర్ ఆసక్తిగా సాగింది. ఈ ట్రైలర్ మూవీ మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. -
నన్ను హీరోగా సినిమా తీస్తానంటే వద్దని చెప్పా: సుమన్
యోగేశ్వర్, అతిథి జంటగా నటిస్తోన్న చిత్రం 'పరారి'. ఈ చిత్రానికి సాయి శివాజీ దర్శకత్వం వహిస్తున్నారు. జీవీవీ గిరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శంకర ఆర్ట్స్ బ్యానర్‌పై గాలి ప్రత్యూష సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ చిత్రం మార్చి 30న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా సీనియర్ నటులు సుమన్, ప్రసన్న కుమార్, కాంగ్రెస్ లీడర్ అంజన్ కుమార్ యాదవ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. సుమన్ మాట్లాడుతూ.. 'మన తెలుగు సినిమాకు ఆస్కార్ వచ్చేలా కృషి చేసిన ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్. తెలుగు వారందరూ గర్వించే రోజు. ఇలాగే మన తెలుగు వారు మంచి సినిమాలు తీసి మరిన్నీ ఆస్కార్ అవార్డులు తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిర్మాత గిరి నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానంటే వద్దని తన కుమారుడిని హీరోగా పరిచయం చేయడం జరిగింది. యోగేష్ చాలా బాగా నటించాడు. ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి.' అని అన్నారు నటి కవిత మాట్లాడుతూ.. 'ఈ సినిమా పాటలు చాలా బాగున్నాయి. ఇందులో హీరో చాలా చక్కటి నటనను ప్రదర్శించాడు. మంచి కథతో ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పరారి చిత్రం గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. 'యోగేష్ హీరోగా బాగా నటించారు. గిరి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్' అని అన్నారు. ఈ చిత్రంలో సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హనుమంత రావు(మాజీ రాజ్య సభ) , గాలి అనిల్ కుమార్, రవతు కనకయ్య, పొన్నం ప్రభాకర్, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. -
'చూసిన ప్రతి అమ్మాయిని హేట్ చేస్తున్నాడు'.. ఆసక్తిగా 'భారీ తారాగణం' ట్రైలర్
సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష నటీ నటులుగా శేఖర్ ముత్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భారీ తారాగణం’. బీవీఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై బీవీ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, కమెడియన్ ఆలీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ..' దర్శకుడు శేఖర్, నిర్మాత బివి.రెడ్డి మంచి కథను తెరకెక్కించారు..ఈ సినిమాకు సుక్కు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు అలీ ఏ పాత్ర ఇచ్చినా ఒదిగిపోతారు. నాకు ఇష్టమైన బాబా కుమారుడు హీరోగా చేయడం చాలా సంతోషం. ఈ చిత్రంలో అందరూ కూడా చాలా బాగా నటించారు. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. 'ట్రైలర్ చూస్తుంటే చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తోంది. ఆలీ ఈ సినిమాలో చాలా చక్కగా నటించాడు. దర్శక నిర్మాతలకు ఈ చిత్రం ద్వారా మంచి పేరు వస్తుంది. ప్రతి ఒక్కరూ చాలా చక్కగా నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు ఆలీ మాట్లాడుతూ.. 'మంచి కంటెంట్‌తో తీసిన ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ చిత్రంలో మా అన్న తమ్ముడు సదన్ హీరోగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో నాకు మంచి పాత్ర లభించింది. ఇలాంటి మంచి సినిమాలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉంది.' అని అన్నారు. -
మిస్టర్ కల్యాణ్ ట్రైలర్‌ను విడుదల చేసిన ధమాకా డైరెక్టర్
ఉషశ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న సినిమా మిస్టర్ కల్యాణ్.ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంతో పండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలె పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను ధమాకా మూవీ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన బెస్ట్ విషెస్ తెలియజేశారు. మిస్టర్ కళ్యాణ్ ట్రైలర్ బాగుందని, మేకింగ్, లొకేషన్స్, డైలాగ్స్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని పేర్కొన్నారు. -
'వినరో భాగ్యము విష్ణు కథ' మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు.. సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్
కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. ఈ చిత్రానికి మురళి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా విడుదల చేశారు. అయితే ఈవెంట్లో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ అభిమానులపై సీరియస్ అయ్యారు. ఈవెంట్లో సాయి ధరమ్‌ను పెళ్లి ఎప్పుడని ఫ్యాన్స్ ఆసక్తిగా అడిగారు. దీనికి కాస్తా గట్టిగానే కౌంటరిచ్చారు. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ..' మీరెప్పుడైతే అమ్మాయిలను గౌరవించడం నేర్చుకుంటారో అప్పుడవుద్ది. ఇది మీవల్ల అవుతుందా. నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది. ఇప్పటికే నాలుగుసార్లు పెళ్లి అయింది అంటూ నవ్వుతూనే' ఫ్యాన్స్‌కు కౌంటరిచ్చారు. దీంతో ఈవెంట్లో వేదికపై ఉన్న సినీతారలు, అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. -
'మనిషిని పోలిన మనుషులు ఎదురుపడితే'.. అమిగోస్ ట్రైలర్ అవుట్
నందమూరి కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'అమిగోస్'. బింబిసార తర్వాత సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తే డోపుల్ గ్యాంగర్ అంటే మనిషి పోలిన మనుషులు కాన్సెప్ట్‌తోనే సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో యాక్షన్ సీన్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ట్రైలర్ చూస్తే సినిమాతో సరికొత్త థ్రిల్ పొందడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇటీవలే ఈ చిత్రం నుంచి ఓ వీడియో సాంగ్ కూడా విడుదల చేశారు మేకర్స్. ఫిబ్రవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. జిబ్రాన్ సంగీతం సమకూర్చారు. -
విలేజ్ లవ్‌స్టోరీగా బుట్టబొమ్మ.. ట్రైలర్ వచ్చేసింది
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో అవార్డులు అందుకున్న అనిఖ సురేంద్రన్ తెలుగులో హీరోయిన్గా నటిస్తున్న చిత్రం బుట్టబొమ్మ. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శౌరీ చంద్రశేఖర్ రమేష్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఫిబ్రబరి4న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మాస్ కా దాస్ విశ్వక్సేన్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. విలేజ్ లవ్‌స్టోరీగా విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. -
హైవోల్టేజ్ యాక్షన్స్‌తో‘ పఠాన్’.. ట్రైలర్ అదిరిపోయింది!
బాలీవుడ్ ‘బాద్షా’ షారుక్ ఖాన్, బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్. ఎన్నో వివాదాల అనంతరం ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ఈ నెల(జనవరి) 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించాడు. చదవండి: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న దళపతి విజయ్ కుమారుడు! హీరోగా కాదు! ఇక ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్రం బృందం తాజాగా హిందీతో పాటు తెలుగు, తమిళంలో ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. హాలీవుడ్ రేంజ్లో ఫుల్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఎంటర్టైన్ చేయబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మొత్తం యాక్షన్ సీక్వెన్స్‌తో ట్రైలర్‌ను మలిచారు. ఇక ఇందులో షారుక్ అజ్ఞాతవాసంలో ఉండే గుఢాచారి అని తెలుస్తోంది. చదవండి: కోర్టు మెట్లు ఎక్కిన శిల్పా శెట్టి.. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కోరిన హైకోర్టు ఆయన రీఎంట్రీ ఇస్తూ ‘ఒక సైనికుడు తనకోసం దేశం ఏం చేసిందని అడగడు.. దేశం కోసం తాను ఏం చేయగలనా అని ఆలోచిస్తాడు’ అని షారుక్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. చాలా గ్యాప్ తర్వాత షారుక్ ఈ చిత్రంలో మంచి కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నాడని చెప్పవచ్చు. ఇక దీపికా సైతం యాక్షన్స్‌లో హీరోకు, విలన్‌కు పోటీ పడి నటించందని చెప్పవచ్చు. కాగా ఇందులో జాన్ అబ్రహం విలన్‌గా నటించగా.. డింపుల్ కపాడియా ప్రధాన పాత్రలో కనిపించింది. -
నాది ఫ్యాక్షన్ కాదు.. సీమపై ఎఫెక్షన్.. వీరసింహారెడ్డి ట్రైలర్ అవుట్
అఖండ విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. ఇందులో శృతిహాసన్ కథానాయికగా నటించింది. బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది. ఇవాళ ఒంగోలులో జరగుతున్న ప్రీరిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. 'సీమలో ఏ ఒక్కడు కత్తి పట్టకూడదని నేనే కత్తి పట్టా.. పరపతి కోసమో.. పెత్తనం కోసమో కాదు' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తే రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్ ఫైట్స్ అభిమానులను అలరించనున్నాయి. 'పుట్టింది పులిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్' అనే డైలాగ్ హైలెట్‌గా నిలవనుంది. ట్రైలర్ చూస్తే సీమ నేపథ్యంలోనే సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది ఈ చిత్రం. -
బ్యాంక్‌కు వచ్చి బీర్, బ్రాందీ అడుగుతారా?.. అదిరిపోయిన ట్రైలర్
తమిళ స్టార్ నటుడు అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'తునివు'. తెలుగులో ఈ చిత్రాన్ని తెగింపు పేరుతో విడుదల చేస్తున్నారు. జీ సినిమా సంస్థతో కలిసి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న చిత్రం ఇది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. నేర్కండ పారై్వ, వలిమై వంటి సక్సెస్ఫుల్ చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్లో రూపొందుతున్న మూడో చిత్రం తునివు షూటింగ్ పూర్తి చేసుకుని ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన తెలుగు ట్రైలర్ విడుదలైంది. 'ప్రజల డబ్బు దోచుకుంటున్నావే.. సిగ్గుగా లేదు' అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్ చూస్తే ఈ మూవీ మొత్తం బ్యాంక్ రాబరీ నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. సముద్రంలో ఫైట్స్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మంజు వారియర్ ఇందులో నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా విజయ్ కథానాయకుడిగా నటించిన వారీసు చిత్రం కూడా పొంగల్ రేస్‌కే సిద్ధమవుతుంది. రష్మిక మందన్నా నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్నారు. -
'యుద్ధం గెలవాలంటే, మృత్యువుతో పోరాడే గెలవాలి'.. 'టాప్ గేర్'లో ట్రైలర్
యంగ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్, రియా సుమన్ జంటగా తెరకెక్కిన చిత్రం 'టాప్ గేర్'. ఈ చిత్రానికి కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందించారు. కేవీ శ్రీధర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను ముందుకొస్తున్నారు ఆది సాయి కుమార్. 'టాప్ గేర్'తో మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మాస్ హీరో రవితేజ చేతులమీదుగా రిలీజ్ చేశారు. డిసెంబర్ 30న ఈ సినిమా విడుదల చేయనున్నారు. అసలు కథేంటంటే..: కథలోని పాత్రలందరూ డేవిడ్, అతడి ఆచూకీ గురించి అడుగుతూ కనిపించారు. మరి ఇంతకీ డేవిడ్ ఎవరు? హైదరాబాద్‌లో జరిగిన పలు హత్యలకు, డేవిడ్కూ సంబంధం ఏంటి? క్యాబ్ డ్రైవర్ అయిన ఆదిని ఎందుకు పోలీసులు వెంటాడారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆద్యంతం ఉత్కంఠభరిత కథ, కథనాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఈ ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం కూడా ఉత్కంఠ భరితంగా ఉంది. ఈ ట్రైలర్లో ఆది యాక్షన్ సీన్స్ అబ్బురపరుస్తున్నాయి. హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ ప్రేమలో ట్విస్టులు, విలన్స్ అటాక్, హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచాయి. ఎవర్రా మీరు.. నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? అని హీరో ఆది చెప్పే డైలాగ్ సినిమాలో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలోబ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్రలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
రవితేజ 'ధమాకా' ట్రైలర్ అవుట్.. మాస్ యాక్షన్ అదిరిపోయింది
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'ధమాకా'. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రినాథ రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఇవాళ విడుదల చేశారు. డిసెంబర్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన మాస్ పాటలు, టీజర్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ట్రైలర్ చూస్తే ఫుల్ మాస్ యాక్షన్ సినిమాలా ఉంది. రవితేజ అభిమానులకు ఫుల్ మాస్ యాక్షన్‌ను చూపించబోతున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతమందించారు. ట్రైలర్ రిలీజ్‌పై రవితేజ ట్వీట్ చేశారు. ఈనెల 23 థియేటర్లలో కలుద్దాం అంటూ పోస్ట్ చేశారు. Here it is! The #Dhamaka Trailer 🔥 This DEC 23rd is going to be an entertaining one for you all 😊 థియేటర్స్ లో కలుద్దాం 😎 - https://t.co/t2SOj2VNi4#DhamakaFromDec23 pic.twitter.com/FW1nvjWN2d — Ravi Teja (@RaviTeja_offl) December 15, 2022 -
గ్రామీణ ఫ్యాక్షన్ నేపథ్యంగా 'ఏపీ04 రామాపురం' .. ట్రైలర్ విడుదల
రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్ రాజ్, సునీల్ మల్లెం, నటీనటులుగా హేమ రెడ్డి దర్శత్వంలో రామ్ రెడ్డి అందూరి నిర్మించిన చిత్రం 'ఏపీ 04 రామాపురం'. ఆర్ఆర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్వీ శివారెడ్డి సమర్పిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్లను సినీ, రాజకీయ ప్రముఖ అవిష్కరించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్‌లో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్, జెస్సీ, నటుడు పృథ్వి కూడా పాల్గొన్నారు. బిగ్ బాస్ నటుడు జెస్సీ మాట్లాడుతూ.. ' ఈ మూవీ ట్రైలర్ చాలా బాగుంది. టీం అందరికి అల్ ది బెస్ట్.' అన్నారు. నటుడు పృథ్వి రాజ్ మాట్లాడుతూ.. 'ఈ సినిమా డైరెక్టర్ మోస్ట్ డేడికేటడ్ వర్కర్. చాలా తక్కువ బడ్జెట్లో హీరో ఎలివేషన్స్ బాగా తీశారు. డిసెంబర్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా'. అని అన్నారు. హీరో నందు మాట్లాడుతూ.. 'ఒక టాలెంట్‌ను నమ్మి ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ అందరికి థాంక్స్. కడపలో సినిమాకు సంబంధించి ఎటువంటి సపోర్ట్ ఉందో నాకు తెలియదు. అదే ఇక్కడ తీసుంటే ఇంకా బాగా తీసేవాళ్లేమే. ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. సోహెల్ మాట్లాడుతూ... 'నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్స్. డైరెక్టర్ చాలా పనులు చేసుకుని ఈ స్థాయికి వచ్చారు.ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. ఈ సినిమాను దర్శకుడు తక్కువ బడ్జెట్లో తీశారు. ఈ సినిమాను చూసి ఎంకరేజ్ చెయ్యండి.' అని అన్నారు. దర్శకుడు హేమ రెడ్డి మాట్లాడుతూ..'19 ఏళ్లప్పుడు కథ రాయడం స్టార్ట్ చేశా. 23 ఏళ్లకు డైరెక్షన్ చేశా. సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ ఉండదంటారు. కానీ నా సినిమాకోసం ఇంతమంది వచ్చి ఎంకరేజ్ చేశారు. అందరికి చాలా పెద్ద థాంక్స్.' అని అన్నారు. చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. 'మా సినిమాను ఎంకరేజ్ చెయ్యడానికి వచ్చిన మీ అందరికి చాలా పెద్ద థాంక్స్. మాకు ఉన్న చిన్న బడ్జెట్లో సినిమాను చేశాం. మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాం.' అని అన్నారు. -
కళ్లు చెదిరే విజువల్ వండర్స్‌తో అవతార్-2 కొత్త ట్రైలర్
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా అవతార్-2. 9ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ చిత్రానికి సీక్వెల్ ఇది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 16న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ భారీ అంచనాలు క్రియేట్ చేయగా తాజాగా మరో కొత్త ట్రైలర్‌ను లాంచ్ చేశారు. కళ్లు మిరిమిట్లు గొలిపే హంగులతో, ఆశ్చర్యానికి గురిచేసే విజువల్ ఎఫెక్ట్స్‌తో ‘అవతార్-ది వే ఆఫ్ వాటర్' ఎలా ఉండబోతుందో ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు డెరెక్టర్. ఇప్పటికే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. మరి విడుదలకు ముందే వండర్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. On December 16, experience the motion picture event of a generation. Watch the brand-new trailer and experience #AvatarTheWayOfWater in 3D. Get tickets now: https://t.co/9NiFEIpZTE pic.twitter.com/UitjdL3kXr — Avatar (@officialavatar) November 22, 2022 -
డేంజరస్ ట్రైలర్.. ఆ అమ్మాయిలిద్దరూ ఎందుకు ప్రేమించుకున్నారు?
అప్సరా రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో కంపెనీ పతాకంపై రామ్‌గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డేంజరస్’. ‘మా ఇష్టం’ అనేది క్యాప్షన్. ఈ సినిమా డిసెంబరు 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రామ్‌గోపాల్ వర్మ, నట్టి కుమార్, ఏబీ శ్రీనివాస్ రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘నా సినిమాల్లో మరో కొత్త కోణం ఈ సినిమా. మగవాళ్లతో ఇద్దరు అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఆ అమ్మాయిలిద్దరూ ఎందుకు ప్రేమించుకున్నారు? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అని అన్నారు. ఈ కార్య క్రమంలో నిర్మాత– డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్, నిర్మాత ఏబీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
'అమాయకమైన ఆంధ్రప్రదేశ్ అబ్బాయిలు ఎక్కడా దొరకరమ్మా'.. ఆసక్తిగా ట్రైలర్
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా తెరకెక్కిన చిత్రం 'మట్టి కుస్తీ'. ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ చూస్తే.. ' ఇంకోసారి పిల్లను చూడమని నన్ను అడక్కు. మన అల్లుడికి పెళ్లయిందా రత్నం. ఈ జన్మలో అవ్వదు.' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథతో పాటు కామెడీ ఎంటర్టైనర్ను తలపించేలా ఉంది. హీరో ఈ సినిమాలో రెజ్లర్‌గా కనిపించనున్నారు. కేరళ అమ్మాయితో ఆంధ్ర అబ్బాయి మధ్య ప్రేమకథ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా డిసెంబర్2న థియేటర్లలో ఈ మూవీ సందడి చేయనుంది. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరణ్ సంగీతమందిస్తున్నారు. -
అతనికి సినిమా అంటే ఫ్యాషన్.. యంగ్ హీరోకు బాలకృష్ణ ప్రశంస
యంగ్ హీరో విశ్వక్సేన్ స్వీయ దర్శకత్వంలో నివేదా పేతురాజు జంటగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'దాస్ కా దమ్కీ'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రీలీజ్ చేసింది చిత్రబృందం. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో నిర్వహించిన నందమూరి బాలకృష్ణ చేతులమీదుగా ట్రైలర్ విడదల చేశారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. (చదవండి: అర్జున్ సర్జా-విశ్వక్ సేన్ వివాదం.. తెరపైకి మరో యంగ్ హీరో!) ట్రైలర్ విషయానికొస్తే.. 'ఆరేళ్ల వయసున్న కంపెనీ, పదివేల కోట్ల టర్నోవర్, ఇవన్నీ ఒక్కరాత్రిలో స్టేట్‌లో పడిపోయాయి. సాయానికి ఒక గడ్డిపోచైనా దొరకపోతుందా. ఆదుకోవడానికి ఒక మనిషైనా ఉండకపోతాడా' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఈ ట్రైలర్ చూస్తే ఫుల్ రొమాంటిక్ అండ్ కామెడీతో పాటు మాస్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..' ట్రైలర్ చాలా కనువిందుగా ఉంది. విశ్వక్ సేన్‌కి సినిమా అంటే ఫ్యాషన్. ఎన్నో ఒడిదొడుకులను దాటి రిలీజ్ చేస్తున్నాడు. ఇలాంటి సినిమా చేస్తే నన్ను నేను ఊహించేసుకుంటాను. నాకు అన్ని జోనర్స్ చేయాలని ఉంటుంది. వచ్చే ఏడాది ఆదిత్య 999 ఉంటుంది. అందుకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.' అని అన్నారు. హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..' బాలకృష్ణ ఎంత పవర్ ఫుల్లో అంత స్వీట్ కూడా. నేను ఎంతో నమ్మిన సినిమా అందరికీ నచ్చుతుంది.' అని అన్నారు. -
ఒక మాతృభాష కథ
‘‘సూపర్ గుడ్ ఫిల్మ్స్‌లో చాలామంది నటీనటులు, సాంకేతిక నిపుణులను పరిచయం చేశాం. ఇప్పుడు ‘చెప్పాలని ఉంది’ తో యష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాం. యూనిక్ సబ్జెక్ట్‌తో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని నిర్మాత ఆర్బీ చౌదరి అన్నారు. యష్ పూరి, స్టెఫీ పటేల్ ప్రధాన పాత్రల్లో అరుణ్ భారతి ఎల్.దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ అనేది ఉపశీర్షిక. ఆర్బీ చౌదరి సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘చెప్పాలని ఉంది’. వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదలలో ఆర్బీ చౌదరి మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథలని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అందుకే ఈ చిత్రాన్ని ముందుగా తెలుగులోనే తీశాం. ఆ తర్వాత తమిళ్‌తో పాటు మిగతా భాషల్లో రీమేక్ చేస్తాం’’ అన్నారు. ‘‘యాక్షన్, రొమాన్స్, కామెడీ అంశాలున్న చిత్రమిది’’ అన్నారు యష్ పూరి. ‘‘ఈ సినిమా చూశాను.. చాలా బాగుంది’’ అన్నారు నిర్మాత వాకాడ అప్పారావు. ‘‘చెప్పాలని ఉంది’ కి ప్రేక్షకుల సహకారం ఇవ్వాలి’’ అన్నారు అరుణ్ భారతి. ఈ వేడుకలో హమ్స్ టెక్ ఫిలిమ్స్ యోగేష్, మాటల రచయిత విజయ్ చిట్నీడి మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్పీ డీఎఫ్టీ, సంగీతం: అస్లాంకీ. -
'ప్రతి అధికారి సమాధానం చెప్పాలి'.. ఆసక్తిగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ట్రైలర్
అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కించిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ కెరీర్లో 59వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. (చదవండి: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'.. కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది) ట్రైలర్ విషయానికొస్తే.. 'ఇంకో నాలుగు రోజుల్లో ఎలక్షన్స్ మీ ఊర్లో జరగబోతున్నాయి' అనే అల్లరి నరేశ్ డైలాగ్‌తో ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తే పూర్తి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఫ్య్సాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్నికల నిర్వహణకు ఓ మారుమూల పల్లెలో గిరిజన ప్రజలు నివసించే మారేడుమిల్లి గ్రామానికి వెళ్లే అధికారి పాత్రలో 'అల్లరి నరేశ్ కనిపిస్తారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ 25న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. -
ట్రైలర్ అద్భుతంగా ఉంది.. 'మసూద'పై విజయ్ దేవరకొండ ప్రశంస
సీనియర్ నటి సంగీత, తిరువీర్, సాయికిరణ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మసూద'. హారర్ డ్రామా నేపథ్యంలో దర్శకుడు రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్బస్టర్ల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ తన మూడో చిత్రంగా ‘మసూద’ను ప్రకటించింది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు విజయ్ దేవరకొండ ట్వీట్ చేస్తూ..' ట్రైలర్ అద్భుతంగా ఉంది. టీమ్ అందరికీ నా అభినందనలు. ఈ సినిమాకు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఇలాంటి కొత్త కథలను, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్న నిర్మాత రాహుల్ యాదవ్‌గారికి ప్రత్యేకంగా నా అభినందనలు. వారి కలలు నిజం కావాలని కోరుకుంటున్నా.' అంటూ పోస్ట్ చేశారు. (చదవండి: పాన్ ఇండియా చిత్రంగా 'మసూద') ట్రైలర్ విషయానికి వస్తే.... 'భవిష్యత్తు అనేది మనం ఈరోజు ఏం చేస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తే పూర్తిస్థాయి హారర్ మూవీని తలిపించేలా ఉంది. దెయ్యం పట్టిన అమ్మాయి చుట్టు కథ మొత్తం తిరుగుతోందని ట్రైలర్లో అర్థమవుతోంది. తల్లీకూతుళ్ల మధ్య ప్రేమ, మధ్య తరగతి కుటుంబాల బాధలు, స్నేహం, ప్రేమ వంటి అన్ని కోణాలను టచ్ చేస్తూ సాగిన ట్రైలర్.. ఒక్కసారిగా హర్రర్ సీన్స్‌తో భయపెట్టేస్తోంది. ‘అప్పుడే భయపడాల్సిన అవసరం లేదు.. అసలు భయం ముందుంది’ అని చిత్ర బృందం చెబుతున్న తీరు చూస్తుంటే.. హారర్ మూవీ చెప్పకనే చెప్పేశారు ఇప్పటికే విడుదలైన టీజర్‌కి, పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళంలో ఈనెల 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ఎస్వీసీ బ్యానర్ ద్వారా విడుదల చేస్తున్నారు. -
ఆసక్తికరంగా ‘హలో మీరా’ ట్రైలర్
గార్గేయి ఎల్లాప్రగడ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హలో..మీరా. ఈ చిత్రానికి శ్రీనివాస్ కాకరాల కథ, స్క్రీన్‌ప్లే అందించడంతోపాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ చిన్నా సంగీతం అందిస్తున్నాడు. ల్యూమిరే సినిమా బ్యానర్‌పై తెరకెక్కుతున్న హలో..మీరా ట్రైలర్‌ను డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేస్తూ ఈ సినిమా బిగ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 2 నిమిషాల 26 సెకనుల నిడివితో కట్ చేసిన ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా ఉంది. సినిమాలోని మీరా అనే సింగిల్ క్యారెక్టర్ ని చూపిస్తూ జీవితంలో చేసిన ఓ చిన్న తప్పు ఆమెకు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? కుటుంబం, పెళ్లి, స్నేహితులు, పోలీసులు ఇలా డిఫరెంట్ యాంగిల్స్ లో మీరాకు వచ్చిన చిక్కులేంటి? అనేది ఈ సినిమాలో చూపించనున్నారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న మీరా అనే క్యారెక్టర్ తోనే ఈ ట్రైలర్ రూపొందించి సినిమాపై ఆసక్తి మరింత పెంచేశారు మేకర్స్. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో మీరాగా గార్గేయి యల్లాప్రగడ నటించారు. డా : లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల నిర్మాతలుగా వ్యవహరించగా.. ఎస్ చిన్న సంగీతం అందించారు. -
సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ మూవీ ట్రైలర్ వచ్చేసింది
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘గాలోడు’. గెహ్నా సిప్పి హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహించారు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ నిర్మించిన ఈచిత్రం నవంబర్ 18న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసింది. రెండున్నర నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్‌తో సినిమా ఎలా ఉండబోతుందో ముందే హింట్ ఇచ్చారు మేకర్స్. చదవండి: అంత తెలిగ్గా నిందలు ఎలా వేస్తారు? భర్త ఆరోపణలపై నటి ఆవేదన ‘‘వయసు తక్కువ ‘షో’లు ఎక్కువ.. నువ్వు శనివారం పుట్టావా? శనిలా తగులుకున్నావ్, రామాయణంలో ఒక్కటే మాయ లేడీ ఇక్కడ అందరు మాయ లేడీలే’’ డైలాగ్స్ ఆసక్తిగా ఉన్నాయి. ‘రాక్షసుల గురించి పుస్తకాల్లో చదివాను, విన్నాను మొట్టమొదటి సారి వీడిలో చూశాను సార్’ వంటి పవర్ఫుల్ డైలాగ్ సినిమాలపై అంచాలను పెంచేస్తున్నాయి. అలాగే ఇందులో సుధీర్ మాస్‌లుక్‌లో చేసే యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. గెహ్నాసిప్పి గ్లామర్, సప్తగిరి కామెడీ టైమింగ్ ట్రైలర్‌కు అదనపు ఆకర్షణలుగా నిలిచాయి. -
సినిమా ఇండస్ట్రీ ఓ కుటుంబం
‘‘సినిమా ఇండస్ట్రీ అనేది ఓ కుటుంబం. మనుషుల జీవితాల్లో సినిమా కూడా నిత్యసాధనం అయిపోయింది. ఇలాంటి సమయాల్లో ప్రేక్షకులకు మంచి సినిమాలు అందేలా దర్శక–నిర్మాతలు కృషి చేయాలి’’ అన్నారు హీరో బాలకృష్ణ. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న విడుదల కానుది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బాలకృష్ణ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం బిగ్ టికెట్‌ను బాలకృష్ణకు అందించారు అల్లు అరవింద్. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ–‘‘అరవింద్‌గారి అసోసియేషన్‌తో నేను చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’కు మంచి స్పందన లభిస్తోంది. అల్లు రామలింగయ్యగారితో వర్క్ చేసే అవకాశం దక్కడం నా అదృష్టం. ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా టీజర్, ట్రైలర్ బాగున్నాయి. శిరీష్, అను, దర్శకుడిగా రాకేశ్ బాగా చేశారనిపిస్తోంది. ప్రతి మనిషిలో విభిన్నకోణాలు ఉంటాయి. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందంటారు. ఓ కుటుంబాన్ని నిలబెట్టాలన్నా, కూల్చాలన్నా ఆ తాలూకు బరువు, బాధ్యతలన్నీ మహిళల చేతుల్లోనే ఉంటాయి. కాలంతో ఇప్పుడు కొన్ని పరిస్థితులు, అభిరుచులు కూడా మారుతున్నాయి. సహజీవనం, ఎఫైర్స్ అనేవి కూడా నడుస్తున్నాయి. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ‘ఊర్వశివో రాక్షసివో..’ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘శిరీష్ మిడిల్ క్లాస్ అబ్బాయిలా ఈ మూవీలో నటించాడు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యల నుంచి పుట్టిన సినిమా ఇది. మంచి ఎంటర్టైనర్ అండ్ ఓ ఇన్‌డెప్త్ డిస్కషన్ ఈ సినిమాలో ఉంది.. దాన్ని తెరపైనే చూడాలి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారి 60వ బర్త్ డే వేడుకల్లో బాలకృష్ణగారు పాల్గొన్నారు. కొంత సమయం తర్వాత ఆ ఫంక్షన్లో మా జోష్ తగ్గింది కానీ బాలకృష్ణగారి జోష్ తగ్గలేదు. ‘కొత్తజంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాల తర్వాత నాన్నగారితో ముచ్చటగా మూడోసారి నేను చేసిన ఈ చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అల్లు శిరీష్. ‘‘శిరీష్‌గారు, అను వల్ల ఈ సినిమా మేకింగ్ చాలా సాఫీగా జరిగింది’’ అన్నారు రాకేష్ శశి. ఈ కార్యక్రమంలో నటుడు సునీల్, కొరియోగ్రాఫర్ విజయ్, దర్శకులు మారుతి, పరశురామ్, చందూ మొండేటి, వశిష్ఠ్, వెంకటేశ్ మహా, దర్శక–నిర్మాత, రచయిత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శక–నిర్మాత సాయిరాజేష్, నిర్మాత ఎస్కేఎన్, ‘గీతాఆర్ట్స్’ బాబు, సత్య, పూర్ణా చారి, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధులు మాధవ్, నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మనిషి తోడేలుగా మారితే ఏమవుతుంది.. ఆసక్తిగా భేడియా ట్రైలర్
వరుణ్ ధావన్, కృతిసనన్ జంటగా తెరకెక్కుతున్న హారర్ కామెడీ చిత్రం 'భేడియా'. తాజాగా చిత్రబృందం ఇవాళ ట్రైలర్ విడుదల చేసింది.. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, అభిషేక్ బెనర్జీ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమర్ కౌశిక్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు నేపథ్యంలో రూపొందించిన చిత్రమే 'భేడియా'. ట్రైలర్ చూస్తే.. 'తోడేలుగా మారిన వరుణ్ ధావన్ పాత్ర ఆకట్టుకునేలా ఉంది. తోడేలుగా మారాక అతని జీవితం తలకిందులవుతుంది పగలు సాధారణ మనిషిలా కనిపిస్తూ రాత్రి వేళల్లో తోడేలుగా మారడం లాంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తిని కలిగిస్తోంది. దీంతో అతని స్నేహితులు డాక్టర్ కృతి సనన్ వద్దకు తీసుకొస్తారు. అతడు మళ్లీ సాధారణమైన మనిషిగా మారాడా? లేదా? సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే. వరుణ్ తదుపరి చిత్రం ఎక్కిస్, సాజిద్ నడియాడ్వాలా సాంకిలో కనిపించనున్నాడు. అతను రాజ్,డీకే దర్శకులుగా తెరకెక్కుతున్న రస్సో బ్రదర్స్ వెబ్ సిరీస్ సిటాడెల్లో కనిపించనున్నారు. కృతి సనన్ ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్‌లతో కలిసి ఆదిపురుష్‌లో కనిపించనుంది. ఈ సినిమా ట్రైలర్ విపరీతమైన హైప్ క్రియేట్ చేయడంతో పాటు విమర్శలకు కూడా గురైంది. అయితే ఈ సినిమాలో కృతి లుక్‌ని అభిమానులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. -
లవ్వే లేని లవ్ మ్యారేజ్.. కామెడీతో అదరగొడుతున్న 'ఓరి దేవుడా' ట్రైలర్
యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఓరి దేవుడా'. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా దిల్ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించగా..లియోన్ జేమ్స్ సంగీతం, తరుణ్ భాస్కర్ డైలాగ్స్ సమకూరుస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ను తలపించేలా ఉంది. పూరి జగన్నాధ్ 'బ్రేకప్.. ఐ లవ్ బ్రేకప్స్' అంటూ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చివర్లో వచ్చే డైలాగ్ 'వైఫ్లో ఫ్రెండ్‌ను చూడొచ్చు సార్.. కానీ ఫ్రైండే వైఫ్‌లాగా వచ్చిందా..' విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 21న థియేటర్లలో కనువిందు చేయనుంది ఈ చిత్రం. -
దసరాకు మంచు విష్ణు సర్ప్రైజ్.. జిన్నా ట్రైలర్ అవుట్
మంచు విష్ణు హీరోగా తెరెకెక్కుతున్న తాజా చిత్రం 'జిన్నా'. ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడులైన టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ను వదిలారు మేకర్స్. దసరా కానుకగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృదం. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు. ఇవాళ విడుదలై ట్రైలర్ చూస్తే కామెడీ, హార్రర్‌ను తలపిస్తోంది. ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో కనిపించనున్నారు. కామెడీ, హారర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. -
ఆస్కార్ నామినేషన్ చిత్రం ‘ఛెల్లో షో’ ట్రైలర్ విడుదల
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మనదేశం తరఫున ఆస్కార్ నామినేషన్ పోటీకి గుజరాతీ ఫిల్మ్ ‘ఛెల్లో షో’ (ఇంగ్లీష్‌లో ‘లాస్ట్ ఫిల్మ్ షో’) ఎంపికైన విషయం తెలిసిందే. భవిన్ రాబరి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావల్, పరేష్ మెహతా ప్రధాన పాత్రల్లో నటించారు. పాన్ నలిన్ (నలిన్ కుమార్ పాండ్య) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాయ్‌కపూర్ ఫిల్మ్స్, ఆరెంజ్ స్టూడియో సమర్పణలో సిద్ధార్థ్ రాయ్ కపూర్, ధీర్ మోమయ్య, పాన్ నలిన్, మార్క్ డ్యూలే నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ‘మా నాన్న నన్ను కొట్టారు. నేను సినిమా చూడటానికి వెళ్లానని’, ‘భవిష్యత్ స్టోరీ టెల్లర్స్దే’ వంటి డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఇక ‘లాస్ట్ ఫిల్మ్ షో’ చిత్రం అక్టోబరు 14న విడుదల కానుంది. సినిమాల పట్ల ఎంతో ప్రేమ ఉన్న తొమ్మిదేళ్ల అబ్బాయి సామీ (భవిన్ రాబరి) ఎలా ఫిల్మ్‌మేకర్ అయ్యాడు? అన్నదే చిత్ర కథ. -
GOD FATHER Pre Release: అభిమానులే నాకు గాడ్‌ఫాదర్స్
‘‘మీరు(అభిమానులు) నన్ను ‘గాడ్‌ఫాదర్’ అని అంటున్నారు. కానీ, ఏ గాడ్‌ఫాదర్ లేకుండా వచ్చిన నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించి, ఈ స్థాయి ఇచ్చిన ప్రతి అభిమాని నాకు ‘గాడ్‌ఫాదర్’. చిరంజీవి వెనకాల ఏ గాడ్‌ఫాదర్ లేరని అంటుంటారు.. కానీ నేను ఇప్పుడు అంటున్నాను.. నా వెనకాల లక్షలమంది గాడ్‌ఫాదర్స్ ఉన్నారు.. నా అభిమానులే నా ‘గాడ్‌ఫాదర్స్’’ అని చిరంజీవి అన్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందిన చిత్రం ‘గాడ్ ఫాదర్’. నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, పూరి జగన్నాథ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం అనంతపురంలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాతలు ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ‘గాడ్‌ఫాదర్’ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ– ‘‘నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా ఈ నేల తడుస్తుంది. ఈ రోజు కూడా ఇలా వర్షం కురవడం శుభ పరిణామంగా అనిపిస్తోంది. ఇక ‘గాడ్‌ఫాదర్’ విషయానికొస్తే.. మలయాళ హిట్ మూవీ ‘లూసిఫర్’ చిత్రాన్ని నేను తెలుగులో ‘గాడ్‌ఫాదర్’గా చేయడానికి ప్రధాన కారణం రామ్‌చరణ్. దర్శకుడు మోహన్ రాజా పేరును కూడా చరణే సూచించాడు. మాపై నమ్మకం, ప్రేమ, గౌరవంతో ‘గాడ్‌ఫాదర్’ కథ వినకుండా నటించిన సల్మాన్‌ఖాన్‌గారికి థ్యాంక్స్. నయనతార ఈ సినిమా ఒప్పుకోవడం మా విజయానికి తొలిమెట్టు. ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాలో భాగస్వాములవడంసంతోషం. తెలుగువారికి జాతీయ అవార్డులు రావడం అరుదు. అలాంటిది చిన్న వయసులోనే జాతీయ అవార్డు సాధించిన తమన్‌కు అభినందనలు. మా సినిమాకి రీ రికార్డింగ్ అద్భుతంగా ఇచ్చాడు. పొలిటికల్ అండ్ ఫ్యామిలీ డ్రామా సినిమా ఇది.. ప్రేక్షకులను అలరిస్తుందని నేను గ్యారంటీ ఇస్తున్నాను. నేను సినిమా చూశాను కాబట్టే ఇంత ఆత్మ విశ్వాసంతో మాట్లాడుతున్నాను. కానీ, ప్రేక్షకుల తీర్పును ఎప్పుడూ గౌరవిస్తాం. మా సినిమాతో పాటు విడుదలవుతున్న నా మిత్రుడు నాగార్జున ‘ది ఘోస్ట్’, గణేష్ ‘స్వాతిముత్యం’ సినిమాలు కూడా విజయం సాధించాలి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు.. రెండూ ప్రేక్షకులచేత ఆదరించబడినప్పుడే పరిశ్రమ పచ్చగా ఉంటుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో తమన్, ఫైట్‌మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో కాస్త స్తబ్ధత ఏర్పడింది. జయాపజయాలు మన చేతుల్లో ఉండవని తెలుసు. కానీ ప్రేక్షకులను అలరించలేకపోయామే, వారిని అసంతృప్తికి గురిచేశామే అనే బాధ ఉంది. దానికి సమాధానం, నాకు ఊరట ఈ ‘గాడ్‌ఫాదర్’. ఈ సినిమా కచ్చితంగా నిశ్శబ్ధ విస్ఫోటనం అవుతుంది.. ఇందుకు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలి. బుధవారం ఉదయం ఓ విషాదం చోటు చేసుకుంది. సూపర్‌స్టార్ కృష్ణ గారి సతీమణి, సోదరుడు మహేశ్‌బాబుగారి మాతృమూర్తి ఇందిరాదేవిగారు మృతిచెందారు. ఆ కుటుంబం విషాదంలో ఉంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. -
ఆకట్టుకుంటున్న 'స్వాతి ముత్యం' ట్రైలర్
గణేశ్ ,వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. ఈ చిత్రాన్ని 'సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవున్నారు. వినోద భరితమైన ఈ కుటుంబ కథా చిత్రం విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. "నిన్న నైట్ ఒక మూవీ చూశానండీ.. దాంట్లో కూడా హీరో, హీరోయిన్ మనలాగే కాఫీ షాప్‌లో కలుస్తారు" అంటూ కథానాయిక వర్ష బొల్లమ్మ పలికే సంభాషణతో ట్రైలర్ మొదలవుతుంది. ఓవరాల్‌గా ప్రేమకథ సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ చూస్తుంటే దసరాకు కుటుంబ సమేతంగా చూసేలా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. "ముందుగా నేను గణేశ్‌కు థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్టోరీ రాశాక నేను ముందు కలిసింది అతన్నే. ఈ కథ అంగీకరించినందుకు బిగ్ థాంక్స్. ఈ సినిమాలో కొత్త పాయింట్ ఉంది. చిన్న టౌన్లో ఒకబ్బాయికి గవర్నమెంట్ జాబ్ వచ్చిన వెంటనే పెళ్లి, ఆ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఈ చిత్రంలో చూపించబోతున్నాం. ఈ కథ చాలా విచిత్రంగా ఉంటుంది' అని అన్నారు. హీరో గణేశ్ మాట్లాడుతూ.. '2020లో కరోనా టైంలో ఒక సినిమా స్టార్ట్ చేద్దామనుకుంటుండగా లక్ష్మణ్ వచ్చి ఈ కథ చెప్పాడు. కథ వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నాను. నన్ను నేను మొదటిసారి బిగ్ స్క్రీన్ మీద చూసుకుంటున్నాను. కానీ ట్రైలర్ లాగే సినిమా చాలా సరదాగా ఉంటుంది. ఈ సినిమాను థియేటర్స్ లో మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాన' అని అన్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
చిక్కుల్లో 'థ్యాంక్ గాడ్'.. కేసు నమోదు.. ట్రైలర్లో ఏముంది?
బాలీవుడ్ నటులు అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ మల్హోత్రా నటించిన చిత్రం 'థ్యాంగ్ గాడ్' చిక్కుల్లో పడింది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ విడుదల కాగా.. అదే ఇప్పుడు సమస్యను తెచ్చిపెట్టింది. దర్శకుడు ఇంద్ర కుమార్ తెరకెక్కిస్తున్న ‘థ్యాంక్ గాడ్’ సినిమాపై న్యాయవాది హిమాన్షు శ్రీవాస్తవ యూపీలోని జాన్పూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కేసు నమోదైంది. నవంబర్ 18న పిటిషనర్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నట్లు కోర్టు తెలిపింది. (చదవండి: అజయ్‌తో నేను చేసిన తొమ్మిదో చిత్రం ఇది: టబు) ఇటీవల విడుదలైన 'థ్యాంక్ గాడ్' ట్రైలర్ ఓ మతం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పిటిషనర్ హిమాన్షు శ్రీవాస్తవ కోర్టుకు వివరించారు. ఓ సన్నివేశంలో అజయ్ దేవగణ్ సూటు ధరించి చిత్రగుప్తుని పాత్రలో జోకులు పేల్చడం, అభ్యంతరకరమైన పదజాలం కనిపించిందని శ్రీవాస్తవ తన పిటిషన్లో పేర్కొన్నారు. చిత్రగుప్తుడు మంచి, చెడులను లెక్కిస్తాడు. దేవుళ్లను ఇలా వర్ణించడం వల్ల ఓ మతం మనోభావాలను దెబ్బతీస్తుందని న్యాయవాది పిటిషన్లో వివరించారు. దీంతో అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ్ మల్హోత్ర, దర్శకుడు ఇంద్ర కుమార్‌పై కేసు నమోదైంది. ఈ చిత్రం అక్టోబర్ 24న విడుదల కానుంది. -
విక్రమ్ కోబ్రా ట్రైలర్ వచ్చేసింది.. అదిరిపోయిందంతే!
చియాన్ విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోబ్రా. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను సెవెన్ స్టూడియోస్ - రెడ్ జెయింట్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ‘కేజీఎఫ్’ భామ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈనెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. గణిత శాస్త్రవేత్తగా విక్రమ్ కనిపించనున్నారు. ట్రైలర్‌ను బట్టి మొత్తం ఐదు ఢిపరెంట్ క్యారెక్టర్స్‌లో విక్రమ్ కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్ ,మృణాలిని రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెమమాన్ ఈ సినిమాను సంగీతం అందించారు. -
టైటిల్ పాజిటివ్‌గా ఉంది
‘‘హైవే’ టైటిల్ పాజిటివ్‌గా ఉంది. ట్రైలర్ చూడగానే ‘ఆవారా, రాక్షసుడు’ చిత్రాలు చూసినట్టుంది. ఇలాంటి మంచి సినిమాలు తీస్తున్నందుకు నిర్మాత వెంకట్‌గారికి థ్యాంక్స్’’ అని హీరో నాగశౌర్య అన్నారు. ఆనంద్ దేవరకొండ, మానస జంటగా కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హైవే’. నార్త్‌స్టార్ సమర్పణలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, వెంకట్ తలారి ప్రొడక్షన్స్‌లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న ‘ఆహా’ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను నాగశౌర్య విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘నాకు లవర్ బాయ్ అని ప్రేక్షకులు ట్యాగ్ ఇచ్చారు. కానీ ఆనంద్కి ఎలాంటి ట్యాగ్ లేకపోవడంతో వేర్వేరు జానర్ల సినిమాలను చేస్తున్నారు.. అది చాలా గొప్ప లక్షణం’’ అన్నారు. ‘‘హైవే’ చక్కని ప్రయోగాత్మక చిత్రం’’ అన్నారు ఆనంద్ దేవరకొండ. ‘‘సరికొత్త కథాంశంతో రూపొందిన మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తా రని ఆశిస్తున్నాను’’ అన్నారు కేవీ గుహన్. ‘‘అద్భుతమైన థ్రిల్లర్ చిత్రం ఇది’’ అన్నారు నిర్మాత శరత్ మరార్. ‘ఆహా’ మార్కెటింగ్ హెడ్ కార్తీక్, హీరోయిన్ మానస మాట్లాడారు. -
రాజమౌళి చేతుల మీదుగా ‘హ్యాపీ బర్త్‌డే’ ట్రైలర్
హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘హ్యాపీ బర్త్ డే’. ఈ మూవీకి ‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహించారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ వై. సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. ఈ చిత్రం విడుదల జులై 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా హ్యాపీ బర్త్‌డే ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. దర్శకు ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా బుధవారం ట్రైలర్ లాంచ్ అయ్యింది. కాగా థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. సరికొత్త పాత్రలు, విభిన్న కథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం తూపాకీల చూట్టు తిరగనుందని తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. -
అడవి శేష్ 'మేజర్' ట్రైలర్ వచ్చేది అప్పుడే..
Adivi Sesh Major Movie Trailer Release Date Announced: దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను యంగ్ హీరో అడివి శేష్ పోషించాడు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం జూన్ 3న మేజర్ విడుదలవుతున్నట్లు ఇటీవల చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలో 'మేజర్' సినిమా ట్రైలర్ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. ఓ వీడియో రూపంలో మే 9న ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించారు. చిత్రంలో హీరోయిన్లుగా సయూ మంజ్రేకర్, శోభిత ధూళిపాళ కనిపించనున్నారు. ఓ ప్రత్యేకమైన పాత్రలో రేవతి అలరించనున్నారు. చదవండి: ప్రజలను ప్రేమించడమే దేశభక్తి! -
ఇట్స్ అఫిషియల్: చిరంజీవి 'ఆచార్య' ట్రైలర్ వచ్చేది ఆరోజే..
Chiranjeevi Acharya Trailer To Be Released On This Date: 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం 'ఆచార్య'. దర్శకుడు కొరటాల శివ, చిరంజీవి క్రేజీ కాంబినేషనల్లో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకు చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిచండమే కాకుండా ఇందులో నటిస్తుండటంతో మరింత హైప్ పెరిగింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ 'సిద్ధ' పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆచార్య' మూవీ ట్రైలర్ విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. చదవండి: ఆచార్య: కీలక పాత్రలో అనసూయ.. రెమ్యునరేషన్ ఎంతంటే ? ఏప్రిల్ 12న ఆచార్య సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ తెలిపారు. ఇదివరకు ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్స్, పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరింజీవికి సరసన చందమామ కాజల్ హీరోయిన్గా చేయగా, రామ్ చరణ్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. ఇందులో సోనూసూద్ కీలక పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. అలాగే 'ఆచార్య'కు మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. చిరు-మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సాంగ్స్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. The date is set for the arrival of the MEGA PHENOMENA 🔥🔥 Witness the Mighty #AcharyaTrailer on 12th April 💥💥#AcharyaOnApr29 Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @MatineeEnt @KonidelaPro @adityamusic pic.twitter.com/84fP1bXa2k — Matinee Entertainment (@MatineeEnt) April 9, 2022 చదవండి: మెగా ఫాన్స్‌కు గుడ్ న్యూస్.. అక్కడ కూడా రిలీజ్ కానున్న 'ఆచార్య'! -
రాధేశ్యామ్ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 11న విడుదల కానుంది. 1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుంది. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంగా యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చదవండి: ఆదిపురుష్ రిలీజ్ డేట్ వచ్చేసింది ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ ట్రైలర్ ఈవెంట్‌గా చిత్రం బృందం గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా బాలీవుడ్ నటి భాగ్యశ్రీ నటిస్తుండగా.. కృష్ణం రాజు, జగపతి బాబులు కీలక పాత్రలో కనిపంచనున్నారు. Celebrate love in the grandest way possible! The release trailer of #RadheShyam out on March 2nd at 3 PM.#RadheShyamReleaseTrailer#Prabhas @hegdepooja @director_radhaa@UV_Creations #BhushanKumar @TSeries @GopiKrishnaMvs@AAFilmsIndia @RedGiantMovies_ #RadheShyamOnMarch11 pic.twitter.com/BrowtdSjUL — Radhe Shyam (@RadheShyamFilm) February 28, 2022 -
ఆమె ఏ భాషకైనా సరిపోతారు: విజయ్ దేవరకొండ
‘‘ప్రియమణిగారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఏ భాషలో చేసినా ఆ భాషకి సరిపోతారు. ఇప్పుడు ఆమె చేస్తున్న ‘భామా కలాపం’ అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ప్రియమణి నటించిన ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘భామా కలాపం’. అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించారు. ‘డియర్ కామ్రేడ్’ చిత్రదర్శకుడు భరత్ కమ్మ ఈ షోకి రన్నర్. ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై సుధీర్ ఈదర, భోగవల్లి బాపినీడు నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఈ నెల 11 నుంచి∙‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ‘భామా కలాపం’ ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నలభై ఏళ్లుగా ఇండస్ట్రీలో అందరూ నన్ను ఆదరించారు.. ఇప్పుడు మా అబ్బాయి బాపినీడు, సుధీర్ తీసిన ఈ వెబ్ సిరీస్‌ని కూడా ఆదరించాలి’’ అన్నారు. ‘‘భామా కలాపం’లో అనుపమ అనే చాలా అమాయకమైన గృహిణి పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు ప్రియమణి. ‘‘మేము అనుకున్న దాని కంటే అభిమన్యు బాగా డైరెక్ట్ చేశాడు’’ అన్నారు భరత్ కమ్మ. ‘‘ఏడాది క్రితం సరదాగా రాసుకున్న కథ ఇక్కడివరకు రావడం హ్యాపీ’’ అన్నారు అభిమన్యు తాడిమేటి. -
రాధే శ్యామ్ ట్రైలర్ రిలీజ్
-
ఆకట్టుకుంటున్న ‘కొండపొలం’ ట్రైలర్, వైష్ణవ్‌ను ఆటపట్టిస్తున్న రకుల్..
Vaishnav Tej Kondapolam Trailer Out: మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్‌లు జంటగా నటిస్తున్న చిత్రం ‘కొండపొలం’. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్, టీజర్, లిరికల్ సాంగ్‌కు విశేష స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ‘కొండపొలం’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటోంది. Embark on the Astounding Journey of #KondaPolam - "An Epic Tale of Becoming" ▶️ https://t.co/qlLNaZIJ9C#KondaPolamTrailer Out Now!#KondaPolamOct8#PanjaVaisshnavTej @Rakulpreet @mmkeeravaani @YRajeevReddy1 #JSaiBabu @FirstFrame_ent @MangoMusicLabel — Krish Jagarlamudi (@DirKrish) September 27, 2021 ట్రైలర్ విషయానికొస్తే.. ట్రైలర్ విషయానికొస్తే.. వైష్ణవ్, రకుల్‌ల జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్ కనిపించాడు. అడవి నేపథ్యం నుంచి బాగా చదువుకున్న యువకుడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో అతడు ఎదుర్కొ అవమానాలను ట్రైలర్లో చూపించారు. ఇక రకుల్, వైష్ణవ్ మధ్య సాగే సన్నివేశాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. ‘చదువుకున్న గొర్రె చదువురాని మరో గొర్రెతో మాట్లాడటం చూశావా?’ అంటూ రకుల్.. వైష్ణవ్ ఆటపట్టిస్తూ చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకుంటోంది. ఇక గొర్రెల కోసం వైష్ణవ్ చేసే సాహస సన్నివేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. చదవండి: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అడివి శేష్ వర్షంలో సైక్లింగ్ చేసిన సమంత.. వీడియో వైరల్ -
'లాభం' ట్రైలర్ విడుదల చేసిన సేతుపతి
విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా నటించిన చిత్రం లాభం. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. లాయర్ శ్రీరామ్ సమర్పణలో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎస్.పి.జననాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. తాజాగా విజయ్ సేతుపతి ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ... "ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సినిమాను నా సొంత బ్యానర్ లో నిర్మించాను. కథ చాలా యూనిక్ గా ఉండి... ఓ మెసేజ్ ఇచ్చేలా సినిమాను తీశాము. రైతులు ఎదుర్కొంటున్న గిట్టుబాటు ధర సమస్య... వ్యవసాయ భూముల పైనా... పంటల పైనా కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యం... ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపైనా చాలా కూలంకషంగా ఇందులో చూపించడం జరిగింది. ట్రైలర్ లో కూడా అదే చూపించాము. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాతలకు నా అభినందనలు" అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాను అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ బ్యానర్‌పై తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండటం హ్యాపీగా ఉంది. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది ' అన్నారు. -
ఆసక్తిగా నితిన్ ‘మాస్ట్రో’ మూవీ ట్రైలర్, సరికొత్తగా తమన్నా..
హీరో నితిన్- నభా నటేశ్ జంటగా రూపొందుతున్న చిత్రం మాస్ట్రో. నితిన్ 30వ సినిమాగా మేర్లపాక గాంధీ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో సెప్టంబర్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో సాగిని ఈ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. అంధుడిగా నితిన్ నటన మెప్పిస్తోంది. చదవండి: ‘కాంచన 3’ మూవీ హీరోయిన్ అనుమానాస్పద మృతి.. ఇక తమన్నా ఇందులో నెగిటివ్ రోల్లో భయపెట్టనుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ‘సినిమాల్లోనే మర్డర్ చూసి భయపడే నేను.. ఇప్పుడు నిజంగా మర్డర్ చేయాల్సి వచ్చింది’ అంటూ తమన్నా చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో ముఖ్యం నితిన్-తమన్నా మధ్య సాగే సన్నివేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇలా ఎన్నో ఆసక్తికర సన్నివేశాలతో సాగిన ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తోంది. కాగా మాస్ట్రో హిందీ చిత్రం ‘అంధాధున్’కు రీమేక్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డిలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. (చదవండి: నాని బాటలోనే హీరో నితిన్.. ‘మాస్ట్రో’ నిర్మాతల క్లారిటీ) చదవండి: ఫుట్‌బోర్డ్ చేస్తూ సమంత, నయన్, విజయ్.. వీడియో వైరల్ -
ఇదో కొత్త అనుభూతిని ఇస్తుంది
తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్ హీరో హీరోయిన్లుగా యస్.యస్. రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇష్క్’. ఆర్బీ చౌదరి సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సమష్టిగా నిర్మించిన ‘ఇష్క్’ సినిమా ట్రై లర్‌ను సోషల్ మీడియాలో హీరో సాయితేజ్ విడుదల చేశారు. ఈ సినిమాను ఈ నెల 23న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో హీరో తేజ సజ్జా మాట్లాడుతూ – ‘‘జాంబీరెడ్డి’ వంటి డిఫరెంట్ సినిమా తర్వాత నేను చేసిన సినిమా ‘ఇష్క్’. ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రోత్సహించే మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థవారు కొంత గ్యాప్ తర్వాత తెలుగులో చేసిన ఈ సినిమాలో నేను హీరోగా నటించడం సంతోషంగా ఉంది’’ అని అన్నారు. ‘‘యూనిట్లో అందరి సహకారంతో తక్కువ రోజుల్లో మంచి క్వాలిటీతో ఈ సినిమాను పూర్తి చేశాను. హీరోహీరోయిన్లు తేజ, ప్రియలతో పాటు ఆర్టిస్టు రవీందర్ కూడా బాగా నటించారు’’ అన్నారు యస్.యస్. రాజు. ‘‘సూపర్‌గుడ్ ఫిలింస్, మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ రెండూ ఒక్కటే. మా బ్యానర్ నుంచి వచ్చిన ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులు సూపర్‌హిట్ చేశారు. అనివార్య కారణాల వల్ల ఆరేడేళ్ల నుంచి తెలుగులో సినిమాలు చేయలేకపోయాం. ఇప్పుడు ‘ఇష్క్’ చేశాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు వాకాడ అప్పారావు. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీతదర్శకుడు మహతి స్వరసాగర్, నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, పి. కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
నా నటన చూసి షాక్ అవుతారు
‘‘క్లైమాక్స్’ చిత్రంలో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటి వరకూ నేను ఎప్పుడూ చేయని పాత్రలో నటించాను. ఈ సినిమాలో నా నటన చూసి షాక్‌కు గురవుతారు’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ‘డ్రీమ్’ ఫేమ్ భవానీ శంకర్. కె. దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్, సాషా సింగ్, శ్రీ రెడ్డి, పృధ్వీ, శివ శంకర్ మాస్టర్, రమేష్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘క్లైమాక్స్’. కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై కరుణాకర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను తెలంగాణ యఫ్.డి.సి.చైర్మన్ రామ్మోహన్ రావు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మన సినిమాను ఎన్ని థియేటర్లలో విడుదల చేశామనే దానికంటే, మన కంటెంట్ ఎంత మందికి రీచ్ అయింది అనేది ముఖ్యం. ‘క్లైమాక్స్’ సినిమా ప్రేక్షకులందరికీ రీచ్ అవ్వాలి.. అప్పుడే భవానీ శంకర్‌లాంటి క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్లు వెలుగులోకి వస్తారు’’ అన్నారు. భవాని శంకర్ మాట్లాడుతూ– ‘‘ రాజేంద్ర ప్రసాద్‌గారు గొప్ప నటుడు. 40 సంవత్సరాల నుండి ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఎస్.వి.రంగారావు తర్వాత నాకు రాజేంద్ర ప్రసాద్‌గారే కనిపిస్తున్నారు’’ అన్నారు. హీరోయిన్ సాషా సింగ్ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రాజేష్, నిద్వాన, కెమెరా: రవి కుమార్ నీర్ల. -
ఉప్పెన పెద్ద విజయం సాధించాలి
‘‘ఉప్పెన’ ట్రైలర్ చాలా బాగుంది. సినిమా కూడా అంతే బాగుంటుందని ఆశిస్తున్నాను. ఈ చిత్రం తప్పకుండా పెద్ద విజయం సాధించాలి’’ అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. పంజా వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ పతాకాలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ని జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. బుచ్చిబాబు సానా మాట్లాడుతూ –‘‘ఈ కథను నేను మొదటగా చెప్పింది ఎన్టీఆర్గారికే. ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫోన్ చేసి ఎలా వస్తోంది? అని అడిగేవారు. కథ విని ఆయన ఇచ్చిన ఎనర్జీతో ఈ కథని చిరంజీవి, విజయ్ సేతుపతి, దేవిశ్రీ ప్రసాద్‌గార్లకు కూడా చెప్పాను. అందమైన, ఉద్వేగభరితమైన ప్రేమకథగా తెరకెక్కిన చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అదనపు ఆకర్షణ’’ అన్నారు. ఈ చిత్రానికి సీఈవో: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: అనిల్ వై, అశోక్ బి. -
వైరల్ అవుతున్న రష్మిక ‘పొగరు’ డైలాగ్స్
ధృవ్ సర్జా, రష్మికా మందన్నా జంటగా నందన్ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘పొగరు’. ఈ చిత్రాన్ని ఇదే పేరుతో తెలుగులో సాయి సూర్యా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డి.ప్రతాప్ రాజు అందిస్తున్నారు. తెలుగులో రష్మికకు వున్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ‘కరాబు మైండు కరాబు.. మెరిసే కరాబు నిలబడి చూస్తావా రుబాబు..’ అంటూ సాగే ఈ చిత్రంలోని పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌ని రాబట్టి రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా నూతన సంవత్సరం సందర్భంగా ఈ మూవీ డైలాగ్ ట్రైలర్‌ని చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసింది. ‘అడ్రస్ కనుక్కుని సర్వీస్ చేయడానికి కొరియర్ బాయ్‌ని అనుకున్నార్రా.. ఫైటర్.. కొడితే ఎవడి అడ్రస్ అయినా గల్లంతవ్వాల్సిందే’, ‘వాడు చేసేదంతా చూస్తూ ఉండటానికి నేను శివుడి ముందు నందిని కాదు.. దుర్గమ్మను మోసుకు తిరిగే సింహాన్ని’, ‘కండల్లో బలం ఉందని రౌడీయిజం చేయను, గుండెల్లో ధైర్యం ఉందని గుండాగిరి చేయను.. గిత్త సైలెంట్‌గా ఉందని కొమ్ములాగితే..గుద్దితే గూగుల్ వెతికినా ట్రీట్మెంట్ దొరకదు’ అంటూ హీరో ధృవ్ సర్జా చెబుతున్న పవర్ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో హీరో దృవ్ సర్జా ఫైటర్‌గా మాస్ లుక్‌లో కనిపిస్తుండగా హీరోయిన్ రష్మిక మందన్నమాత్రం అతని వల్ల ఇబ్బందులు పడే అమాయకపు అమ్మాయిగా కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. త్వరలో మరో ట్రైలర్ తో రాబోతున్నామని ట్రైలర్ చివరిలో పేర్కొన్నారు. చందన్ శెట్టి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. -
క్రాక్ పెద్ద హిట్ కావాలి
‘‘థియేటర్లకు వచ్చి సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘క్రాక్’ సినిమాలోని అందరూ నాకు బాగా కావాల్సిన వారే.. రవితేజ, గోపి అన్న, మధుగార్లకు ఈ సినిమా గుర్తుండిపోయేంత పెద్ద హిట్ కావాలి’’ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. రవితేజ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్’. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించారు. జనవరి 9న విడుదలకానున్న ఈ సినిమా ట్రైలర్‌ని అనిల్ రావిపూడి విడుదల చేశారు. గోపీచంద్ మలినేని మాట్లాడుతూ–‘‘మేం అడగ్గానే వాయిస్ ఓవర్ ఇచ్చిన వెంకటేష్‌గారికి థ్యాంక్స్. ఒక మంచి కథకి మంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, మంచి ప్రొడ్యూసర్.. అన్నీ కుదిరిన సినిమా ‘క్రాక్’. రవితేజ అభిమానులకు, ప్రేక్షకులకు ఈసారి సంక్రాంతి కొంచెం ముందుగానే వస్తోంది’’ అన్నారు. చిత్ర నిర్మాత బి.మధు, నిర్మాత సునీల్ నారంగ్, సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు, రచయిత వివేక్ పాల్గొన్నారు. -
ఇది అలాంటి సినిమా కాదు!
‘‘శృంగారానికి, బూతుకు చాలా తేడా ఉంది. ‘డర్టీ హరి’ అనేది ఎం. ఎస్. రాజు ఫిల్మ్. బూతు ఫిల్మ్ కాదు. ఈ సినిమాలో మంచి హ్యూమన్ డ్రామా ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాత ఎం.ఎస్. రాజు. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ హీరో హీరోయిన్లుగా ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘డర్టీ హరి’. గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్ సెలగం శెట్టి, వంశీ కారుమంచి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఫ్రైడే మూవీస్ అనే ఏటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సినిమా సెకండ్ ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ– ‘‘నాకు క్లీన్ ప్రొడ్యూసర్‌గా పేరు ఉంది. కానీ ఒక బోర్డర్ దాటి నేను ‘డర్టీ హరి’ లాంటి సినిమాను ఎందుకు తీయాల్సి వచ్చిందనే విషయం ఈ నెల 18న తెలుస్తుంది. ఎం.ఎస్. రాజు వివాదాస్పద సినిమా తీశారేంటి? అనుకునేవారికి సమాధానం దొరుకుతుంది’’ అన్నారు. ‘‘ఇది మంచి ఎంటర్టైనింగ్ మూవీ’’ అన్నారు శ్రవణ్. ‘‘నా ముందు సినిమాలో నేను సంప్రదాయంగా ఉండే పాత్ర చేశాను. కానీ ఇందులో ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. యాక్టర్‌గా అన్ని రకాల పాత్రలు చేయాలి. వందశాతం కష్టపడాలని మా అమ్మగారు అనడంతో ఈ సినిమాకు ఓకే చెప్పాను’’ అన్నారు సిమ్రత్ కౌర్. ‘‘ఇదొక రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్’’ అన్నారు నిర్మాత వంశీ. ‘‘మా ఫ్రైడే మూవీస్ యాప్‌లో ప్రతి శుక్రవారం ఓ సినిమాను రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. ‘డర్టీ హరి’ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం’’ అన్నారు విజయ్. ఈ కార్యక్రమంలో కేదార్, మదన్, భాస్కర్, అనురాగ్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
సీన్ తొలగించాల్సిందే
అనిల్ కపూర్, పాపులర్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘ఏకే వర్సెస్ ఏకే’. విక్రమాదిత్యా మోత్వానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 24న ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్లో అనిల్ కపూర్ ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ డ్రస్‌లో కనిపిస్తారు. అలాగే ఆయన మాట్లాడిన డైలాగుల్లో అభ్యంతరకర పదజాలం ఉంది. ఈ విషయంలో ‘ఐఏఎఫ్’ (భారత వైమానిక దళం) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎఫ్ అధికారిగా అనిల్ కపూర్ ధరించిన డ్రెస్ కోడ్ సరిగ్గా లేదని ఐఏఎఫ్ పేర్కొంది. అలాగే ట్రైలర్లో ఉపయోగించిన పదజాలం ఇబ్బందికరంగా ఉందని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ విషయంపై అనిల్ కపూర్ క్షమాపణ కోరుతూ వీడియో విడుదల చేశారు. -
సూపర్ కప్పు ఎవరిది?
‘మాస్ పవర్, పోలీస్ పవర్’ సినిమాల తర్వాత శివ జొన్నలగడ్డ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘సూపర్ çపవర్’. ప్రియా ఆగస్టీన్, మీర హీరోయిన్లుగా నటించారు. కొండేకర్ బాలాజీ, రమేష్ కడూరి ఈ సినిమాకు సహనిర్మాతలు. ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన సురేశ్ కొండేటి . ‘‘మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ‘సూపర్ పవర్’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఎన్నో అడ్డంకులను అధిగమించి సూపర్ పవర్ కప్పును హీరో ఎలా గెలుచుకున్నాడు? అన్నదే కథ’’ అని అన్నారు. సినిమా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత బసవప్ప. -
ఐశ్వర్య చాలెంజ్
‘కౌసల్యా కృష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి చిత్రాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఐశ్వర్యా రాజేష్. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఐశ్వర్య చాలెంజ్’. కె.ఎ. సూర్యనిధి దర్శకత్వంలో పద్మశ్రీ డా. కూటికుప్పల సూర్యారావు సమర్పణలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ బ్లెసింగ్స్‌తో విడుదల చేశారు. చిత్రనిర్మాణ, నిర్వాహకుడు వెల్లూరు మధుబాబు మాట్లాడుతూ– ‘‘మా సినిమా చిత్రీకరణ అంతా మలేసియాలో జరిగింది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. నన్ను నమ్మి రెండో సినిమాకు నిర్మాణ నిర్వహణ బాధ్యతలు ఇచ్చిన రామసత్యనారాయణగారికి రుణపడి ఉంటాను. సినీ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజిగారు ఈ చిత్రానికి మాటలు రాశారు. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలో థియేటర్లలోనే విడుదల చేస్తాం’’ అన్నారు. -
బిజినెస్ అంటే ఆడపిల్లల ఆట కాదు..
సాక్షి, హైదరాబాదు : మహానటి సినిమాతో జాతీయ అవార్డు కొట్టేసిన కీర్తి సురేష్ మరో అదిరిపోయే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కీర్తి నటించిన మిస్ ఇండియా ట్రైలర్ శనివారం రిలీజ్ అయ్యింది. చదువు, చిన్న ఉద్యోగం, కుటుంబం, వీటన్నింటికీ భిన్నంగా ఒక మధ్యతరగతి యువతి చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలనే ఆలోచనతో పెరగడం, ఇండియన్ చాయ్ బిజినెస్ ద్వారా ఉన్నతంగా ఎదిగిన తీరును ఈ ట్రైలర్ లో అద్భుతంగా చూపించారు. మిస్ ఇండియా అంటే ఒక బ్రాండ్ అంటూ మరో లేడీ ఓరియంటెడ్ పాత్రతో ఎప్పటిలాగానే కీర్తి సురేష్ నటన, బిజినెస్ అనేది ఆడపిల్లల ఆట కాదంటున్న జగపతి బాబు విలనిజం, థమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నరేంద్ర నాథ్ దర్శకత్వంలో మహేష్ కోనేరు నిర్మించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర,రాజేంద్ర ప్రసాద్, నదియా, కమల్ కామరాజు, నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 4న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. మొదటినుంచీ భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం తాజా ట్రైలర్ తో మరిన్ని అంచనాలను పెంచేస్తోంది. ఈ మధ్యకాలంలో ఓటీటీలో రిలీజ్ అయిన పెంగ్విన్ సినిమాతో ప్రశంసలందుకుంది కీర్తి. అటు వరుస హిట్ లను అందిస్తున్న ఓటీటీ ప్లాట్ ఫాంలో మరో సాలిడ్ హిట్ ఖాయమంటున్నారు. -
కామెడీతో నవ్విస్తూనే భయపెట్టేశాడు..
ముంబై: బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'లక్ష్మీ బాంబ్' ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఈ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ఈ ట్రైలర్లో అక్షయ్ హార్రర్-కామెడీ చేస్తూ తన నటనతో అందరిని ఫిదా చేశాడు. దీంతో ఆ సినిమాపై బీ-టౌన్ ప్రేక్షకులు అంచనాలు మరింత పెరిగయాని సోషల్ మీడియాలో ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూస్తే అర్థం అవుతోంది. ఒకవైపు లక్ష్మణ్‌గా కామెడీ పిండిస్తూ.. మరోవైపు లక్ష్మీగా హార్రర్‌తో భయపెడుతు అక్కి అద్బుతంగా నటించాడు. దక్షిణాదిన సూపర్ హిట్‌గా నిలిచిన ‘కాంచన’ను హిందీలో ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో రాఘవ లారెన్స్ రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తున్నారు. తెలుగులో ట్రాన్స్ జెండర్‌గా సినీయర్ నటుడు శరత్ కుమార్ నటించగా.. హీరోగా రాఘవ లారెన్స్ నటించారు. కానీ ‘లక్ష్మీ బాంబ్’లో మాత్రం అక్షయ్ ద్విపాత్రలలో నటించాడు. లక్ష్మణ్ పేరుతో లవర్ బాయ్‌గా... ట్రాన్స్ జెండర్ లక్ష్మీగా భయపెడుతూ తన నటనతో ఆకట్టుకున్నాడు. (చదవండి: రికార్టు సృష్టించిన ‘లక్ష్మిబాంబ్’ మోషన్ పోస్టర్) Jahan kahi bhi hain, wahi ruk jaayyein aur taiyyaar ho jaayyein dekhne #LaxmmiBomb ka trailer, kyunki barasne aa rahi hai Laxmmi! #LaxmmiBombTrailer out now. #YeDiwaliLaxmmiBombWali! 💥 #FoxStarStudios #DisneyPlusHotstarMultiplex @advani_kiara @offl_Lawrence pic.twitter.com/oJM6YljkBX — Akshay Kumar (@akshaykumar) October 9, 2020 అయితే రాఘవ లారెన్స్ దర్వకత్వం వస్తున్న ఈ సినిమాకు తనీష్ బాగ్చీ, శశీ-ఖుషీ, అనూప్ కుమార్‌లు సంగీతం అందించారు. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇటీవల సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో లక్ష్మీ బాంబు షూటింగ్ పూర్తి చేసుకుని దిపావళికి సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. దిపావళికి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైంలో ఈ సినిమా విడుదల కానుంది. రూ. 120 కోట్లకు ఆమెజాన్ ఈ సినిమా హక్కులను కొనుక్కుంది. అలాగే ఈ నెల 15 నుంచి థీయోటర్లు తిరిగి తెరుచుకోవడానికి కేంద్రం అనుమతి ఇవ్వడంతో సినిమాను థీయోటర్లలో కూడా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు స్ఫష్టత లేదు. కాగా ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో రికార్డు సృష్టిస్తోంది. విడుదల చేసిన 24 గంటల్లోనే 21 మిలియన్ వ్యూస్‌ను సంపాదించింది. (చదవండి: ‘బెల్ బాటమ్’ టీజర్ విడుదల చేసిన అక్షయ్) -
ఐదు భాషల్లో ‘మర్డర్’ : ట్రైలర్ డేట్ ఫిక్స్
సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇప్పటికే పవర్ స్టార్ చిత్రం విడుదలకు రెడీగా ఉండగా.. మరో సినిమా విడుదలకు సిద్దమయ్యాడు. ఆర్జీవీ కొద్ది రోజుల కిందట మిర్యాలగూడకు చెందిన అమృత, ఆమె తండ్రి మారుతిరావుల కథ ఆధారంగా వర్మ ‘మర్డర్’(కుటుంబ కథా చిత్రం అనేది ట్యాగ్ లైన్) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పలు పోస్టర్లు కూడా విడుదల చేశారు.(ఆర్జీవీ ‘మర్డర్’: మరో పోస్టర్ రిలీజ్) తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల తేదిని ఆర్జీవీ ట్విటర్ వేదికగా ప్రకటించారు. జూలై 28వ తేదీ ఉదయం 9.08 గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఐదు భాషల్లో ఈ చిత్రం రూపొందిస్తున్నట్టు చెప్పారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకే సారి ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రంలో అమృత పాత్రలో ఆవంచ సాహితి, మారుతిరావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్నారు. ఆర్జీవీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.(ఆర్జీవీపై ప్రణయ్ తండ్రి ఫిర్యాదు..) కాగా, ప్రేమ వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ హత్యకు గురికావడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ప్రణయ్ భార్య అమృత తండ్రి మారుతిరావు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే ఇటీవల హైదరాబాద్‌లోని ఓ హోటల్ గదిలో మారుతి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘మర్డర్’ సినిమాపై ఇప్పటికే ప్రణయ్ తండ్రి బాలస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ కోర్టును ఆశ్రయించారు. -
సుశాంత్ చివరి చిత్రం ట్రైలర్ అప్డేట్
ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరిగా నటించిన ‘దిల్ బేచారా’ ట్రైలర్ సోమవారం విడుదల కానుంది. ఇందకు సంబంధించి ఆ చిత్ర బృందం సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ చిత్రంలో సుశాంత్‌కు జోడిగా నటించిన సంజనా సంఘి కూడా ట్రైలర్ విడుదలకు సంబంధించిన పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తనకు ఎంతో ఇష్టమైన సీన్లలో ఇది ఒకటి అని పేర్కొన్నారు. ఈ సినిమా ఒక అందమైన జర్నీ అని పేర్కొన్న సంజన.. మన్నీని(సుశాంత్) మిస్ అవుతున్నట్టు తెలిపారు. కాగా, ఈ చిత్రం జూలై 24న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. అయతే ఎలాంటి సబ్స్క్రిప్షన్ చార్జీలు లేకుండా ఉచితంగా అందరికి అందుబాటులో ఉండనుంది.(చదవండి : ఆ సినిమాలను బాయ్‌కాట్ చేయండి) సుశాంత్ సన్నిహితుడు ముఖేష్ చబ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జాన్ గ్రీన్ రచించిన ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో సంజన, సైఫ్ అలీఖాన్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించారు. గతంలోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఈలోపే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడం అందరిని షాక్‌కు గురిచేసింది. (చదవండి : సుశాంత్‌సింగ్ ఆత్మహత్య) View this post on Instagram Kizie is just so incomplete without Manny. This, is one of my favourite shots, so surreal and dreamlike✨The #DilBechara trailer will be out tomorrow. You all? Just stay tuned! 🙏 #SushantSinghRajput @castingchhabra #SaifAliKhan @arrahman @shashankkhaitan @swastikamukherjee13 @sahilvaid24 @saswatachatterjeeofficial @suprotimsengupta @amitabhbhattacharyaofficial @foxstarhindi @disneyplushotstarvip @sonymusicindia @mukeshchhabracc A post shared by Sanjana Sanghi (@sanjanasanghi96) on Jul 5, 2020 at 1:30am PDT -
మంచి చిత్రాలను ఆదరించాలి
‘‘చిత్రం ఎక్స్’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఇటువంటి మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా. హీరో రాజ్‌బాల, యూనిట్‌కి ఆల్ ద బెస్ట్’’ అన్నారు శ్రీకాంత్. రాజ్‌బాల, మానస జంటగా రమేష్ వీభూది దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘చిత్రం ఎక్స్’. శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి దేవీ మూవీ క్రియేషన్స్ పతాకంపై పొలం గోవిందయ్య నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను శ్రీకాంత్ విడుదల చేశారు. రమేష్ వీభూది మాట్లాడుతూ– ‘‘14 సంవత్సరాలు దర్శకత్వ శాఖలో చేశాను. తేజాగారివద్ద సహాయ దర్శకుడిగా చేశా. మా సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘కరోనా కష్టకాలంలో పెద్ద మనసుతో శ్రీకాంత్‌గారు మా ట్రైలర్‌ని విడుదల చేసి, మమ్మల్ని ఆశీర్వదించడం హ్యాపీ. మా సినిమా అవుట్‌పుట్ చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను ’’ అన్నారు పొలం గోవిందయ్య. ‘‘40 రోజులు భయంకరమైన అడవిలో మేం పడ్డ కష్టాన్ని శ్రీకాంత్‌గారి అభినందనలతో మరిచిపోయాం’’ అన్నారు రాజ్‌బాల. ఈ చిత్రానికి సంగీతం: శివప్రణయ్, కెమెరా: ప్రవీణ్. కె. కావలి. -
గొడవ ఏంటి?
దిలీప్ రాథోడ్, డా. పూనమ్ శర్మ జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఘాఠి’. తెలుగు, బంజార భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో వాల్మీకి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. వాల్మీకి మాట్లాడుతూ– ‘‘రాజస్థాన్‌లో ‘ఘాఠి’ అనే ప్రాంతంలో బంజార వారికి, మార్వాడీలకు మధ్య జరిగిన వాస్తవ గొడవను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న చిత్రమిది. ఆ గొడవలో బంజారా వారు ఘాఠి ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ల మధ్య గొడవ ఏంటి? వాళ్లు మళ్లీ ‘ఘాఠి’కి చేరుకున్నారా? అనే అంశానికి లవ్, యాక్షన్, ఎమోషన్ని మేళవించి ఈ చిత్రాన్ని తీస్తున్నాం’’ అన్నారు. ‘‘మంచి సినిమాలో నటిస్తున్నందుకు హ్యాపీ. షూటింగ్ సగానికి పైగా పూర్తయింది’’ అన్నారు దిలీప్. ప్రతాని రామకృష్ణ గౌడ్, ఎ.గురురాజ్, అద్దంకి దయాకర్, బంజార జాతీయ అధ్యక్షుడు బెల్లం నాయక్ పాల్గొన్నారు. ∙దిలీప్, పూనమ్ -
సినిమాలోని అది మనం ట్రై చేద్దామా..
ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో యన్‌ఎస్‌సీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎంఎంఓఎఫ్. ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్, జేకే క్రియేషన్స్ బ్యానర్‌పై రాజశేఖర్, జేడీ ఖాసీంలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో బెనర్జీ, అక్షత, అక్షిత ముద్గల్, మనోజ్ నందన్, చమ్మక్ చంద్ర ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్లో మధ్యలో ఇంటర్మిషన్ అని పేర్కొని.. ఒకే కథను రెండు రకాలు చెప్పారు. ‘ఒక రోజు నేను అడవిలో వెళ్తూ ఉంటే సడెన్‌గా పులి ఎదురైంది. భయంతో పరిగెట్టాను. పులి నా వెంట పడింది. పులి నా వెంట పడుతుంది నేను పరిగెడుతున్నాను. పులి నా వెంట పడుతూనే ఉంది.. నేను పరిగెడుతూనే ఉన్నాను. అలా పరిగెత్తి ఓ కొండపైకి ఎక్కి చూస్తే...’అని కథను రెండు వెర్షన్లలో చూపించారు. ఓ థియేటర్లో జరిగే ఘటనలను ప్రధానంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ‘సినిమాలో లిప్ టూ లిప్ సీన్ చూశావా.. అది మనం ట్రై చేద్దామా’ అంటూ హీరోయిన్ పలికే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ట్రైలర్లో ఇంటర్మిషన్ తర్వాత చూపించిన సీన్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. 2 నిమిషాలకు పైగా నిడివి గల ఈ ట్రైలర్‌ను ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా తీర్చిదిద్దారు. కాగా, ఈ చిత్రానికి సాయి కార్తీక్ అందిస్తున్నారు. -
‘సిస్టమ్‌ను మార్చడానికి హీరో కావాలి’
కౌసల్యాకృష్ణమూర్తి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘హీరో’. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘శక్తి.. ది సూపర్ హీరో’ పేరుతో విడుదల చేయనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్, ఇవానా ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రయూనిట్ సోమవారం విడుదల చేసింది. యాక్షన్, ఎమోషన్, డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలతో సాగే ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. చదువు ప్రాముఖ్యత చెప్తూ, విద్య పేరుతో జరిగే వ్యాపారం నేపథ్యంలో సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 'చదువుతో వ్యాపారం చేసేవాడిని కాదు .. చదువుకున్న వాళ్లతో వ్యాపారం చేసేవాడిని'. 'స్వయంగా ఆలోచించగలిగే ప్రతి ఒక్కడూ సూపర్ హీరోనే', ‘మన విద్యావిధానంలో అందరు చదువుకోవచ్చు కానీ అందరు సాధించలేరు. ఈ సిస్టమ్‌ను మార్చడానికి ఒక కామన్ మ్యాన్‌గా ఉండే సరిపోడు.. ఒక హీరో కావాలి’, ‘ఒక మనిషిని నాశనం చేయవచ్చు.. వాడి శిలా విగ్రహాన్ని నాశనం చేయవచ్చు.. కానీ వాడి ఐడియాలను, ఐడియాలజీస్ని ఎవడూ నాశనం చేయలేదు’ వంటి డైలాగ్స్ ఆకట్టుకునేలా వున్నాయి. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంఈ నెల 20న సినిమా విడుదల కానుంది. -
చిత్రం పేరు మాత్రమే నిశ్శబ్దం..
భాగమతి తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని హీరోయిన్ అనుష్క నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, అంజలి, షాలిని పాండే ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ప్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం హీరో నాని విడుదల చేశారు. చిత్రబృందానికి బెస్ట్ విషేస్ తెలియజేశారు. ఈ చిత్రంలో అనుష్క మూగ చిత్రకారిణి పాత్రలో కనిపించనున్నారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో చీకట్లో జరిగే దాడులపై విచారణ చేపట్టే అధికారిణిగా అంజలి కనిపించనున్నారు. (చదవండి : శింబుతో సెట్ అవుతుందా?) చిత్రం పేరు నిశ్శబ్దం అయినప్పటికీ.. ప్రేక్షకులను మాత్రం థ్రిల్‌కు గురిచేస్తుందని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ‘నిన్న నీ బెస్ట్ ఫ్రెండ్ సోనాలి ఎందుకు రాలేదు?’, ‘ఒక ఘోస్ట్ ఇదంతా చేసిందని యాక్సెప్ట్ చెయ్యడానికి నా సెన్సిబిలిటీస్ ఒప్పుకోలేదు’, ‘ఇదంతా ఓ పాతికేళ్ళ అమ్మాయి ఒక్కత్తే చేసిందంటారా?’ అనే డైలాగ్‌లు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. కాగా, టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్లు నిర్మిస్తున్న ఈ చిత్రం.. ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుండి. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, కోన వెంకట్ డైలాగ్ రైటర్‌గా ఉన్నారు. (చదవండి : అతడితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క) -
ఆలోచింపజేసే పాయింట్‌తో
‘‘పెద్ద సినిమా, చిన్న సినిమా అనేది నేను నమ్మను. మంచి సినిమానా? కాదా? అనేది నమ్ముతాను. ‘మిస్టర్ అండ్ మిస్’ ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. శైలేష్ సన్నీ, జ్ఞానేశ్వరి జంటగా అశోక్ రెడ్డి దర్శకత్వంలో క్రౌడ్ ఫండెడ్ సినిమాగా తెరకెక్కిన ‘మిస్టర్ అండ్ మిస్’ ట్రైలర్‌ని నాగ్ అశ్విన్ విడుదల చేశారు. అశోక్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా నిర్మించాం. ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. సుధీర్ వర్మ రైటింగ్, మనోహర్ కెమెరావర్క్, కార్తీక్ ఎడిటింగ్, యశ్వంత్ నాగ్ మ్యూజిక్ మా సినిమాకి హైలైట్స్. ఈ నెలాఖరులో సినిమా విడుదల కానుంది’’ అన్నారు. ‘‘మా సినిమాకు క్రౌడ్ సపోర్ట్ ఉంది.. సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల సపోర్ట్ కూడా ఉంటుందని నమ్ముతున్నా’’ అన్నారు శైలేష్ సన్నీ. ‘‘మా ట్రైలర్ చూస్తుంటే భావోద్వేగంగా ఉంది. ఈ సినిమాలోని పాయింట్ అందర్నీ ఆలోచింపజేస్తుంది. అశోక్‌గారు సినిమా చాలా బాగా తీశారు’’ అన్నారు జ్ఞానేశ్వరి. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: ప్రవీణ్ సాగి. -
నా చివరి ప్రేమ కథ ఇదే
‘‘నా గత చిత్రాలన్నింటిలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా కోసమే ఎక్కువ కష్టపడ్డా. ఈ సినిమాకి నేనేం హడావిడి చెయ్యలేదు. ఈ ట్రైలర్‌తో బయట హడావిడి స్టార్ట్ అవుతుంది. నా చివరి ప్రేమ కథా చిత్రమిది’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లే లెయితే కథానాయికలుగా నటించారు. కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘మనిషిగా కొంచెం మారుతున్నా.. టేస్టులు కొంచెం మారుతున్నాయి. లైఫ్‌లో కొత్త దశలోకి వెళ్తున్నా. ఈ సినిమా చేస్తున్నప్పుడే ఇదే నా చివరి ప్రేమకథా చిత్రం అని తెలిసిపోయింది. అందుకే ఈ సినిమాని పూర్తిగా ప్రేమతో నింపేశాం. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. క్రాంతి మాధవ్‌కు పెద్ద సక్సెస్ రావాలి’’ అన్నారు. ‘‘వరల్డ్ ఫేమస్ లవర్’ తెలుగు ప్రేక్షకుల సినిమాలా ఉండదు.. హాలీవుడ్, హిందీ సినిమాలా ఉంటుంది. ప్రతి సినిమా లవర్‌కి మా చిత్రం నచ్చుతుంది’’ అన్నారు కె.ఎస్. రామారావు. ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ తర్వాత ఈ బ్యానర్లో ఇది నా రెండో సినిమా. ఈ సినిమాలో అందరూ తమ పాత్రల్లో జీవించారు’’ అన్నారు క్రాంతి మాధవ్. ‘‘ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాల్లో, చేసిన పాత్రల్లో ఈ సినిమాలోని యామిని పాత్ర బెస్ట్’’ అన్నారు రాశీఖన్నా. ‘‘ఈ సినిమాలో స్మిత అనే భిన్నమైన పాత్ర చేశా’’ అన్నారు కేథరిన్. ‘‘ఈ చిత్రంలో నటించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు ఇజా బెల్లా. -
తల్లిదండ్రుల ప్రేమను వెలకట్టలేం
నటుడు ఎం.ఎస్ చౌదరి నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఆది గురువు అమ్మ’. ‘సురభి’ ప్రభావతి, వేమూరి శశి, గోపరాజు విజయ్ కీలక పాత్రధారులు. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన రచయిత వి. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘దైవసమానులుగా భావించే తల్లిదండ్రుల ప్రేమను వెలకట్టలేం. తల్లి ప్రేమ చాలా గొప్పది. ఆమె తొలి గురువుగా బిడ్డకు అన్నీ నేర్పిస్తుంది. అలాంటి అమ్మపై రూపొందిన ‘ఆది గురువు అమ్మ’ ట్రైలర్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ట్రైలర్ బాగుంది’’ అన్నారు. ‘‘ట్రైలర్‌ను విడుదల చేసిన విజయేంద్ర ప్రసాద్‌గారికి «ధ్యాంక్స్. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు ఎం.ఎస్. చౌదరి. -
ఉదయం ఆట ఉచితం
‘రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్‌ర్యాంక్ రాజు’ చిత్రాల్లో హీరోగా నటించిన చేతన్ మద్దినేని తొలిసారి దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం ‘బీచ్ రోడ్ చేతన్’. తేజారెడ్డి కథానాయికగా నటించారు. చేతన్ మద్దినేని ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. హీరో–దర్శక–నిర్మాత– చేతన్ మద్దినేని మాట్లాడుతూ– ‘‘ఒక ప్రయోగాత్మకమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. టీజర్ అందరికీ నచ్చింది. ట్రైలర్‌కి కూడా మంచి స్పందన లభిస్తోంది. మా సినిమా మొదటి రోజు మొదటి ఆట టికెట్స్‌ని ఏపీ, తెలంగాణలో ప్రేక్షకులకు ఉచితంగా ఇస్తున్నాం. దాదాపు 200 థియేటర్స్‌లో మా సినిమా విడుదల కాబోతోంది. మొదటి ఆట నుంచి మా చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుందని భావిస్తున్నా’’ అన్నారు. ‘‘అందరికీ కల ఉంటుంది. వాటిని సాకారం చేసుకోవాలంటే సరైన వ్యక్తి కావాలి. ఈ సినిమాలో విలన్‌గా నాకు మంచి పాత్ర ఇచ్చారు చేతన్. ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం.. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు నటుడు నిర్మల్ భాను. ‘‘150 మంది కొత్త నటీనటులు ఈ సినిమాలో నటించారు. అందరూ బాగా చేశారు’’ అన్నారు కో డైరెక్టర్ ఈశ్వర్. ఈ చిత్రానికి కెమెరా: నిశాంత్ రెడ్డి, సంగీతం: శామ్యుల్ జె. బెనయ్య. -
యాక్షన్ పెద్ద హిట్ అవుతుంది
‘‘యాక్షన్’ సినిమా ట్రైలర్ చూశా.. చాలా చాలా బాగుంది. విశాల్, తమన్నా తమ నటనతో, సుందర్ సి. తన డైరెక్షన్‌తో చింపేశారు. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. విశాల్, తమన్నా జంటగా సుందర్ సి. దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యాక్షన్’. ‘ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, హుషారు, రాజుగారి గది 3’ వంటి హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీనివాస్ ఆడెపు ‘యాక్షన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘ఇస్మార్ట్ శంకర్’ డిస్ట్రిబ్యూటర్ శ్రీను ‘యాక్షన్’ సినిమాతో నిర్మాతగా మారాడు. ఈ సినిమా సూపర్‌హిట్ కావాలి.. మంచి డబ్బులు రావాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ విశాల్ అద్భుతంగా చేశారు. ఈ నెలలోనే సినిమాను విడుదల చేయనున్నా’’ అన్నారు శ్రీనివాస్ ఆడెపు. -
లవ్ థ్రిల్లర్
కల్వకోట సాయితేజ, తరుణిక జంటగా తెరకెక్కిన చిత్రం ‘శివన్’. ‘ది ఫినామినల్ లవ్ స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. శివన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్.ఆర్. సినీ ఎంటర్టైన్మెంట్పై వ్యాపారవేత్త సంతోష్ రెడ్డి లింగాల నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. శివన్ మాట్లాడుతూ– ‘‘లవ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. మా చిత్రం టీజర్లో కొంత బోల్డ్ కంటెంట్ ఉంది. అయితే ట్రైలర్ అలా లేదు, కొత్తగా కట్ చేశాం. నిర్మాత డి.ఎస్. రావుగారి పాత్ర ఓ హైలెట్. సాయితేజ మంచి హీరోగా ఎదుగుతాడు. తరుణిక బాగా నటించింది. మీరన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. -
ఖాకీ వేస్తే పోలీస్... తీస్తే రౌడీ
‘‘ప్రతి సినిమా విజయం సాధించాలనే కష్టపడి చేస్తాం. ఆ ఒత్తిడి మాపై ఉంటుంది. కానీ ప్రేక్షకుల ఆశీర్వాదం ఉంటేనే విజయం దక్కుతుంది. మేం స్టార్స్ కావడానికి వారి ఆశీర్వాదమే కారణం’’ అని సల్మాన్ ఖాన్ అన్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ హీరోగా ‘దబాంగ్’ సిరీస్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘దబాంగ్ 3’. సోనాక్షీ సిన్హా హీరోయిన్గా నటించారు. అర్బాజ్‌ఖాన్, నిఖిల్ ద్వివేది, సల్మాన్‌ఖాన్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ హిందీ, కన్నడ భాషల్లో డిసెంబరు 20న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘ఖాకీ వేస్తే పోలీస్.. తీస్తే రౌడీ.. టోటల్‌గా ఆల్ రౌండర్ని’ అనే డైలాగ్స్‌తో ట్రైలర్ కిక్ ఇచ్చేలా ఉంది. ముంబై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిమానులు, విలేకరులతో ‘దబాంగ్ 3’ కీలక చిత్రబృందం మాట్లాడారు. ఈ సందర్భంగా సల్మాన్‌ఖాన్ మాట్లాడుతూ– ‘‘ఇది క్లాస్ మాస్ ఫిల్మ్. సౌత్ సినిమా ఫార్మాట్‌కు దగ్గరగా ఉంటుంది. గతంలో ప్రభుదేవా దర్శకత్వంలో నేను చేసిన ‘వాంటెడ్’ తెలుగు ‘పోకిరి’ చిత్రానికి రీమేక్. ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ చిత్రాలకు బాలీవుడ్లో మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం సౌత్ సినిమాలు హిందీలో అనువాదం అవుతున్నాయి. అందరూ చూస్తున్నారు. హిట్ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. త్వరలో హైదరాబాద్‌కు వస్తాను’’ అన్నారు. ప్రభుదేవా ద్వారా దర్శకుడు పూరి జగన్నాథ్‌ను కలిసే ప్రయత్నం చేస్తా అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు సల్మాన్. ‘‘దబాంగ్ 3’పై ఏర్పడ్డ అంచనాలను అందుకుంటామనే నమ్మకం ఉంది’’ అన్నారు ప్రభుదేవా. -
భయపెడుతూ నవ్వించే దెయ్యం
‘‘రాజుగారి గది’ రెండు భాగాలు మంచి సక్సెస్ అయ్యాయి. సెకండ్ పార్ట్‌లో కామెడీ మిస్ అయింది అన్నారు. అది దృష్టిలో ఉంచుకొని ‘రాజుగారి గది 3’ కథ రెడీ చేశా’’ అన్నారు దర్శకుడు ఓంకార్. ‘రాజుగారి గది’ సిరీస్ నుంచి వస్తున్న మూడో సినిమా ‘రాజుగారి గది 3’. అశ్విన్‌బాబు, అవికా గోర్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో వెంకటేశ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఓంకార్ మాట్లాడుతూ– ‘‘రెండు నెలల్లో సినిమా పూర్తి చేశాం. అందరూ సొంత సినిమాలా భావించి పని చేశారు. మా సినిమా వందశాతం ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు. ‘‘మూడేళ్ల తర్వాత నేను చేస్తున్న తెలుగు సినిమా ఇది. ఓంకార్‌గారు కథ చెప్పగానే థ్రిల్ అయ్యాను’’ అన్నారు అవికా గోర్. ‘‘ఓంకార్ అన్నయ్య నన్ను కొత్త కోణంలో చూపించాడు’’ అన్నారు అశ్విన్‌బాబు. ‘‘ఈ సినిమాలో దెయ్యం ఆహ్లాదంగా నవ్విస్తుంది. భయపెడుతూ నవ్విస్తుంది. ఓంకార్ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు’’ అన్నారు మాటల రచయిత బుర్రా సాయిమాధవ్. ‘‘భయపడుతూ, నవ్విస్తూ ఉండే సినిమా ఇది. ఆర్టిస్టులకు గౌరవం ఇచ్చి నటన రాబట్టుకుంటారు ఓంకార్’’ అన్నారు నటుడు బ్రహ్మాజీ. ‘‘చిన్నప్పుడు విఠాలాచారి సినిమాలు చూసేవాణ్ణి. ఇప్పుడు ఓంకార్ అలాంటి దర్శకుడు’’ అన్నారు నటుడు అలీ. -
కొత్త డైరెక్టర్లు నన్ను కలవొచ్చు
‘‘ఒకప్పుడు కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, రవిరాజా పినిశెట్టి.. లాంటి దర్శకులు నాకు ఇచ్చిన నమ్మకాన్ని ఇప్పుడు ప్రవీణ్ సత్తారు, ప్రశాంత్ వర్మ అందిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ‘గరుడవేగ’తో మా ముందు ఒక లక్ష్యాన్ని ఉంచారు. ‘కల్కి’ సినిమాతో దాన్ని అందుకుంటామనే నమ్మకముంది’’ అన్నారు హీరో రాజశేఖర్. ‘అ!’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కల్కి’. శివానీ–శివాత్మిక సమర్పణలో సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలకానుంది. ‘కల్కి’ మూవీ హానెస్ట్ ట్రైలర్‌ని డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు విడుదల చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘కొత్త తరహా కథలతో కొత్త దర్శకులు నన్ను సంప్రదించొచ్చు. సి.కళ్యాణ్ నిర్మాతగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గరుడవేగ–2’ తెరకెక్కబోతోంది. చిరంజీవిగారి సినిమాలను కొడుకు రామ్‌చరణ్ నిర్మిస్తున్నట్టు నా సినిమాలకు నా కూతుర్లు సపోర్ట్ ఇవ్వడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘1983 నేపథ్యంలో సాగే పీరియాడికల్ చిత్రమిది. కొత్త ఫార్మాట్లో ఉంటుంది. సాయితేజ కథ ఇచ్చాడు. ఎవరి కథనీ కాపీ కొట్టలేదు’’ అన్నారు ప్రశాంత్ వర్మ. ‘‘ఓ సాధారణ ప్రేక్షకుడిలా క్లైమాక్స్ కోసం ఉత్కంఠగా చూశాను. థియేట్రికల్ రైట్స్ ఒక్కరే తీసుకోవడం విశేషం. రిలీజ్‌కి ముందే సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాను’’ అన్నారు సి.కళ్యాణ్. ‘‘గరుడవేగ’ కన్నా ‘కల్కి’ పెద్ద విజయం సాధిస్తే.. దీన్ని మించి ‘గరుడవేగ–2’ తీస్తాం’’ అన్నారు ప్రవీణ్ సత్తారు. -
47 రోజుల సస్పెన్స్
పూరి జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన చిత్రం ‘47 డేస్’. ‘ది మిస్టరీ అన్ ఫోల్డ్స్’ అనేది ఉపశీర్షిక. సత్యదేవ్ హీరోగా, పూజా ఝవేరీ, రోషిణి ప్రకాష్ హీరోయిన్లుగా నటించారు. టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చూస్తుంటే బాలచందర్‌గారి ‘47 డేస్’ గుర్తుకు వచ్చింది. ఆ సినిమా కోసం చిరంజీవి ‘నాకు మొగుడు కావాలి’ సినిమా వాయిదా వేసి మరీ చేశాడు. ఏది ఏమైనా ఈ సినిమా కూడా మా ‘నాకు మొగుడు కావాలి’ అంత హిట్ అవ్వాలి’’ అన్నారు. ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ– ‘‘సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉన్న నేను సినిమా రంగంలోకి వస్తానన్నప్పుడు నాకు అండగా నిలిచిన నా తల్లిదండ్రులకు థ్యాంక్స్. ఈ సినిమా ట్రైలర్ రఫ్ కట్ చూసిన రామ్‌గోపాల్ వర్మగారు.. ‘మీరు విజువల్స్‌తో స్టోరీ చెప్పారు’ అనడం పెద్ద ప్రశంసలా అనిపించింది’’ అన్నారు. ‘‘ఒక చిన్న ప్రయత్నంగా ఈ సినిమా మొదలు పెట్టాం. చాలా ఓర్పుతో ఈ చిత్రాన్ని ఇక్కడి వరకూ తీసుకొచ్చాం. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారు’’ అన్నారు రఘు కుంచె. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. సినిమా మొత్తం చాలా గ్రిప్పింగ్ ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు శశి భూషణ్, శ్రీధర్, విజయ్. ‘‘ఈ సినిమా హిట్ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాను’’ అన్నారు సత్యదేవ్. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజ్ కందుకూరి, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, దర్శకుడు బీవీయస్ రవి, దర్శకుడు వెంకటేష్ మహా, సతీష్ కాశెట్టి, కత్తి మహేష్, లక్ష్మీ భూపాల్, భాస్కరభట్ల పాల్గొన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అనిల్ కుమార్ సొహాని, సంగీతం: రఘు కుంచే, కెమెరా: జీకే. -
స్వయంవద ట్రైలర్ లాంచ్ చేసిన కోదండ రామిరెడ్డి
ఆదిత్య అల్లూరి, అనికా రావు జంటగా తెరకెక్కిన సినిమా ‘స్వయంవద’. ఈ సినిమాను లక్ష్మి చలన చిత్ర పతాకంపై వివేక్ వర్మ దర్శకత్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు A. కోదండరామిరెడ్డి విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ ఆకట్టుకునేలా ఉంది. పెద్ద ఆర్టిస్టులు కలసి నటించిన ఈ సినిమా ఏప్రిల్ 26న రిలీజ్ అవుతోంది. వివేక్ మొదటి సినిమానే అయినా ఎంతో బాగా తెరకెక్కించారు’ అన్నారు. దర్శకులు వివేక్ వర్మ మాట్లాడుతూ ‘మా స్వయంవధ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను కోదండరామిరెడ్డి గారు ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయినాయి.U A సర్టిఫికెట్ వచ్చింది. సినిమా చూసి సెన్సార్ సభ్యులు మంచి సినిమా తీశారు అని ప్రశంసించారు’ అని తెలిపారు. నిర్మాత రాజా దుర్వాసుల మాట్లాడుతూ.. ‘మా ట్రైలర్ ను ఆవిష్కరించి మా యూనిట్ ని ఆశీర్వదించిన దర్శకులు కోదండరామిరెడ్డి గారికి ధన్యవాదము. ఏప్రిల్ 26న దాదాపు 200లకు పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాము మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు. -
ఒంటరి కాదు
చింగ్ హీరోగా, పూర్విటక్కర్ హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓన్లీ నేను ... బట్ నాట్ ఎలోన్’. సర్కడమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సర్కడమ్ స్టోరీస్ బ్యానర్‌పై శేషగిరిరావు నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. శరకడం శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘నేను వ్యాపారవేత్తని. కొంతమంది పెద్దవాళ్ల సలహా మేరకు సర్కడమ్ స్టోరీస్ అనే బ్యానర్ పెట్టాను. ప్రపంచం మొత్తంలో టాప్‌టెన్ బిలియనీర్స్‌లో మహిళలు లేరు. ఈ అంశంపైనే ఈ చిత్ర కథ సాగుతుంది. నేనెందుకు పదిమందిలో ఒక్కరిగా ఉండకూడదు అనే లక్ష్యం ఆ అమ్మాయిది. అందులో భాగంగానే సొంత స్నేహితురాలిని సైతం చంపడానికి వెనకాడదు’’ అన్నారు. ‘‘మా సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. ఈ చిత్రం ద్వారా సర్కడమ్ శ్రీనివాస్‌తో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. డిసెంబర్ 6కి ఈ చిత్రం పూర్తవుతుంది’’ అన్నారు శేషగిరిరావు. ‘‘నేను లాయర్ని. నన్ను నమ్మి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు చింగ్. ‘‘ఈ సినిమా విడుదల కోసం నేను కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు పూర్వి టక్కర్. ‘‘గతంలో నేను ‘జెనీలియా కథ’ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశాను. తర్వాత నాకు తమిళ్లో ఆఫర్స్ వస్తే వెళ్లాను. ఇప్పుడు తిరిగి తెలుగు ఇండస్ట్రీకి రావడం సంతోషంగా ఉంది’’ అని సంగీత దర్శకుడు బాలచందర్ అన్నారు. -
తెలంగాణ ఉద్యమంతో...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఉద్యమ సింహం’. నటరాజన్, మాధవీ రెడ్డి, జలగం సుధీర్, లత, పీఆర్ విటల్ బాబు, సూర్య ముఖ్య పాత్రల్లో నటì ంచారు. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వంలో పద్మనాయక ప్రొడక్షన్స్ పతాకంపై కల్వకుంట్ల నాగేశ్వర రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. కల్వకుంట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఉద్యమ సింహం’ సినిమా కేసీఆర్ జీవితకథ కాదు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ నేతృత్వంలో సాగిన అంశాల నేపథ్యంగా తెరకెక్కించిన కథ. కేసీఆర్ పాత్రలో నటరాజన్ చక్కగా నటించారు’’ అన్నారు. ‘‘ప్రత్యేక తెలంగాణ కోసం ఎందరో ఉద్యమాలు నడిపారు కానీ ఒక్క కేసీఆర్‌గారు మాత్రమే పోరాడి తెలంగాణాను సాధించారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని కృష్ణంరాజు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దిలీప్ బండారి. -
సడన్‌గా సంక్రాంతికి రిలీజ్ అంటే ఎలా?
‘‘నిన్న ఒక సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్లో వాళ్లు తొందరపడి స్టేట్మెంట్ ఇచ్చారేమో నాకు తెలియదు. పండక్కి›వస్తున్న 3 సినిమాలు 6 నెలల క్రితం అనౌన్స్ అయ్యాయి. 3 పెద్ద సినిమాలకు థియేటర్స్ ఎలా సెట్ చేసుకోవాలని స్ట్రగుల్ అవుతున్నాం. అలాంటిది 20 రోజుల ముందు సినిమాను కొనుక్కొచ్చి సంక్రాంతికి రిలీజ్ అంటే ఎలా? 3 తెలుగు సినిమాలున్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి వచ్చే సినిమాకు థియేటర్స్ ఎలా అడ్జస్ట్ అవుతాయి?’’ అని ‘దిల్’ రాజు అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). తమన్నా, మెహరీన్ కథానాయికలు. ‘దిల్’ రాజు నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానున్న సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేసి, ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘రాజా ది గ్రేట్’ తర్వాత అనిల్ ఈ ఐడియా చెప్పాడుæ. బాగా నచ్చింది. జర్నీ అంతా ఫన్‌గా సాగిపోయింది. మొన్న ఇద్దరం మాట్లాడుకుంటూ ‘ఏంటి అనిల్.. 3 సినిమాలు చేసేశాం. చిన్న క్లాష్ కూడా రాలేదు’ అని నవ్వుకున్నాం. తను అనుకున్నట్టు సినిమా చేశాడు. పండక్కి మా సినిమా ఫన్ ఇస్తుందని నమ్ముతున్నాం. అలాగే థియేటర్స్ ఇష్యూలో రెండో పాయింట్.. ఆ నిర్మాతే గత నాలుగు నెలల్లో ‘నవాబ్, సర్కార్’ సినిమాలు రిలీజ్ చేశారు. ‘సర్కార్’కు ఎన్ని థియేటర్స్ కావాలో అన్ని థియేటర్స్‌లో వేసుకున్నారు. ఇప్పుడు దొరకడం లేదంటే? తెలుగు సినిమాలను తగ్గించుకుని రిలీజ్ చేయలేం కదా. ఈ సీజన్లో మన తెలుగు సినిమా కాకుండా వేరే భాష చిత్రాలకు థియేటర్స్ ఇచ్చే పరిస్థితి లేదు. 18న రిలీజ్ చేయొచ్చుగా? అలా చేస్తే రెండు రాష్ట్రాల్లో థియేటర్స్ దొరుకుతాయిగా. ఇలాంటివి ఆలోచించకుండా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇచ్చి, నోరు జారారు. అలా మేమూ మాట్లాడగలం. కానీ ఇక్కడ మనం చేస్తున్నది వ్యాపారం. డబ్బు సంపాదించడానికే. డిస్ట్రిబ్యూషన్లో ఎన్నో డబ్బులు పోయాయి. అయినా సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో సినిమాలు చేస్తున్నాం. ఎవరి మీదా స్టేట్మెంట్లు ఇవ్వాలన్నది నా ఉద్దేశం కాదు. 6 నెలల క్రితం అనౌన్స్ అయిన సినిమాలకు థియేటర్స్ ఉండాలా వద్దా? మూడూ క్రేజీ సినిమాలకు థియేటర్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాం. అది తెలియకుండా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు’’ అన్నారు. ‘‘ఈ మధ్యలో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్’ స్టైల్లో ఫుల్ కామెడీ సినిమా చేయలేదు. అనిల్ కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. మల్టీస్టారర్ అయితే ఇంకా ఫన్ ఉంటుందనుకుని చేశాం. వరుణ్‌తో పని చేయడం మంచి ఎక్స్పీరియన్స్. ఎంటర్టైన్ చేసిన ప్రతిసారీ నన్ను ఆదరించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు వెంకటేశ్. ‘‘నా కెరీర్లో చేయాల్సిన కామెడీ అంతా ఈ సినిమాలో చేయించాడు అనిల్. ఇలాంటి టీమ్‌తో పని చేయడం హ్యాపీగా ఉంది. వెంకీగారితో పని చేయాలంటే టెన్షన్ పడ్డా. ఫ్రేమ్‌లో ఆయనతో పోటీపడటం పెద్ద చాలెంజ్. ఆయన ఇచ్చిన కంఫర్ట్ వల్లే బాగా చేయగలిగాను. సీట్లో కూర్చోకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ ఆన్నారు వరుణ్ తేజ్. ‘‘ఈ బ్యానర్లో ఇది నాకు మూడో సినిమా. నిర్మాతలు ఫ్యామిలీలా మారిపోయారు. వాళ్లతో ఓ ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. మా కాంబినేషన్ మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. రెండు నిమిషాల ట్రైలర్లో కొన్ని నవ్వులే. రెండు గంటల ఇరవై నిమిషాల సినిమాలో చాలా నవ్వులుంటాయి. వెంకటేశ్, వరుణ్, తమన్నా మెహరీన్‌లు ఈ సినిమాకు 4 పిల్లర్స్’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘కెరీర్ స్టార్టింగ్‌లో రాజుగారు నాదో సినిమా చూసి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ రోజు నుంచి నా లైఫ్‌లో ‘హ్యాపీడేస్’ వచ్చేశాయి. అప్పటి నుంచి ఆయనతో ఎప్పుడు సినిమా చేస్తానా అనుకున్నాను. ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. అనిల్‌గారు ఓన్లీ ఫన్ నో ఫ్రస్ట్రేషన్. వెంకీ సార్ ఎన్ని పాత్రలు చేసినా అంత ఫ్రెష్‌గా, ముద్దుగా ఎలా కనిపిస్తారో అర్థం కాదు. వరుణ్ చేస్తున్న సినిమాలు నాకు ఇష్టం. మెహరీన్ నా హనీ’’ అన్నారు తమన్నా. ‘‘200 శాతం ఈ సినిమాకు ఇచ్చాను. వెంకటేశ్ సార్, వరుణ్, తమన్నాలతో కలసి పని చేయడం మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైమ్ డబ్బింగ్ చెప్పుకున్నాను’’ అన్నారు మెహరీన్. -
ఈ క్షణం.. ఓ హైలైట్
ధ్రువ, అశ్విని జంటగా జైరామ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యమ్ 6’. విశ్వనాథ్ ఫిలిం ఫ్యాక్టరీ, శ్రీలక్ష్మీ వెంకటాద్రి క్రియేషన్స్ బ్యానర్స్‌పై విశ్వనాథ్ తన్నీరు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు వీవీ వినాయక్ ఆవిష్కరించి, చిత్రబృందాన్ని అభినందించారు. విశ్వనాథ్ తన్నీరు మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ఎక్కడా బోర్ ఫీల్ అవకుండా ఉత్కంఠ కలిగించేలా ఈ చిత్రం రూపొందించాం. ‘యమ్ 6’ అనే డిఫరెంట్ టైటిల్‌ని ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్థమవుతుంది. మా చిత్రానికే హైలైట్‌గా నిలిచే ‘ఈ క్షణం...’ అనే మెలోడి సాంగ్‌ను మంగళూరు, అరకులోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ధ్రువ సర సన మిస్ బెంగళూరు అశ్విని హీరోయిన్గా నటించింది. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘హీరోగా ఇది నా తొలి చిత్రం. అందర్నీ అలరించే విభిన్నమైన పాత్రలు పోషించి, ఇండస్ట్రీలో నటుడిగా నాకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలన్నది నా చిరకాల కోరిక’’ అని ధ్రువ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బాలాజీ, కెమెరా: మహ్మద్, రియాజ్, సహ నిర్మాత: సురేశ్. -
ప్రేమలో మునిగిపోయా
హర్షిత్, వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, బిశ్వజిత్‌నాధ్, రుద్రప్రకాశ్, వేల్పుల సూరి, యుగంధర్ ముఖ్య పాత్రల్లో రామ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేను లేను’. ‘లాస్ట్ ఇన్ లవ్’ అనేది ఉపశీర్షిక. ఓ.యస్.యం విజన్, దివ్యాషిక క్రియేషన్స్ పతాకంపై సుక్రి కుమార్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. రామ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టిస్తుంది. ఇప్పటి వరకూ ఎవరూ తీయని సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ఇదే అని గర్వంగా ఫీలవుతున్నా. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి అనూహ్య స్పందన వచ్చింది. కొత్త నటీనటులతో సినిమా తీసినా థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్, సహనిర్మాత: యషిక. -
నవతరంలో ప్రతిభ దాగి ఉంది
‘‘నవతరంలో బోలెడంత ప్రతిభ దాగి ఉంది. ‘మెహబూబా’తో నటుడిగా కెరీర్ ఆరంభించిన అజయ్ హీరోగా నిరూపించుకునేందుకు హార్డ్‌వర్క్ చేస్తున్నాడు. తను పెద్ద స్థాయికి ఎదగాలి. ‘మాయం’ చిత్రాన్ని దర్శక, నిర్మాతలు ప్యాషనేట్‌గా తెరకెక్కించారనిపిస్తోంది’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. అజయ్ కతువార్ హీరోగా నటించిన చిత్రం ‘మాయం’. ఇషితా షా కథానాయిక. నిషాంత్ దర్శకుడు. జయశ్రీ రాచకొండ, లక్ష్మీ హుసేన్, సందీప్ బోరెడ్డి ముఖ్య తారలుగా ధీమాహి ప్రొడక్షన్స్ పతాకంపై డి.ఏ.రాజు నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని పూరి జగన్నాథ్ ఆవిష్కరించారు. అజయ్ కతువార్ మాట్లాడుతూ– ‘‘పూరి సార్ ప్రోత్సాహంతో ‘మెహబూబా’లో నటించాను. ఇంతకుముందు హాలీవుడ్‌లోనూ నటించాను. నేను నటించిన ‘ది ఇండియన్ పోస్ట్‌మేన్’ మూడేళ్ల క్రితం 8 దేశాల్లో వివిధ సినిమా పండగల్లో ప్రదర్శనకు పంపగా మూడు దేశాల్లో నామినేట్ అయ్యింది. ‘స్పైసెస్ ఆఫ్ లిబర్టీ’ అనే చిత్రం అమెరికాలో థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. నేను నటించిన మరో చిత్రం ‘ప్రేమదేశం’ కూడా త్వరలో రిలీజ్ కానుంది’’ అన్నారు. ‘‘ఇదొక డిఫరెంట్ మూవీ’’ అన్నారు నిషాంత్. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రేమకథ
‘ఈ వర్షం సాక్షిగా’ ఫేం రమణ దర్శకత్వం వహించిన చిత్రం ‘కొత్తగా మా ప్రయాణం’. ఈ సినిమాతో ప్రియాంత్ హీరోగా పరిచయం అవుతున్నారు. యామినీ భాస్కర్ కథానాయిక. నిశ్చయ్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. రమణ మాట్లాడుతూ– ‘‘నెలకు 2లక్షల జీతం తీసుకుంటూ పదిమందికీ సాయపడుతూ ఓపెన్ మైండెడ్‌గా ఉండే ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రేమకథ ఇది. అందరికీ సాయపడే తత్వం ఉన్నా ప్రేమ, పెళ్లి, కుటుంబం వంటి విలువలపై అతనికి అంతగా నమ్మకం ఉండదు. అలాంటివాడు మన సంప్రదాయం గొప్పతనం తెలుసుకున్న తర్వాత ఎలా మారాడు? అన్నది ఈ చిత్రంలో చూపించాం. ప్రియాంత్‌కి తొలి సినిమానే అయినా చక్కగా నటించాడు. త్వరలో ఆడియో రిలీజ్ చేయనున్నాం. నిర్మాణానంతర పనులు పూర్తవుతున్నాయి. ఈ చిత్రాన్ని త్వరలో రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, సాయి కార్తీక్, కెమెరా: అరుణ్ కుమార్. -
టీనేజ్ లవ్‌స్టోరీ
‘‘కేర్ ఆఫ్ వాట్సప్’ ట్రైలర్ చూస్తుంటే టీనేజ్ లవ్‌స్టోరీ అని అర్థం అవుతోంది. యాక్షన్, ఎమోషన్స్ ఉన్నప్పుడే సినిమా బాగా ఆడుతుంది. అవి ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫైట్స్, సాంగ్స్ బాగున్నాయి. టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అని డైరెక్టర్ సముద్ర అన్నారు. ‘బాహుబలి’ చిత్రంలో చిన్నప్పటి ప్రభాస్ పాత్ర చేసిన నిఖిల్ హీరోగా, సాహితి హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం ‘కేర్ ఆఫ్ వాట్సప్’. నీరజ ప్రధాన పాత్రలో నటించారు. అల్లాడి రవీందర్ రెడ్డి దర్శకత్వంలో లక్ష్మికాంత్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్ సముద్ర రిలీజ్ చేయగా, ఆడియో సీడీలను నటుడు నోయల్ విడుదల చేశారు. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘వాట్సప్‌తోనే రోజు మొదలవుతుంది.. వాట్సప్‌తోనే రోజు ముగుస్తుంది. ఇలాంటి తరుణంలో మా సినిమా అందరికీ ప్రతి రోజూ గుర్తుకు రావాలనే ఈ టైటిల్ పెట్టాం. అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘నిర్మాతగా ఇది నా మొదటి సినిమా. మంచి కథాం శంతో తెరకెక్కింది. అతి త్వరలోనే సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు లక్ష్మీకాంత్ రెడ్డి. ఈ చిత్రానికి సమర్పణ: రామ్ రెడ్డి, సహ నిర్మాత: కొండా రాఘవేంద్ర రెడ్డి (దేవ కర్ర), సంగీ తం: రాజేష్ తేలు, కెమెరా: భాస్కర్ దోర్నాల. -
ప్రేక్షకులను నిరాశపరచదు
‘‘వాస్తవ కథలతో సహజత్వం ఉట్టిపడేలా సినిమాలు నిర్మించాలంటే ధైర్యం ఉండాలి. ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’ చిత్రంతో నిర్మాత మహంకాళి శ్రీనివాస్ అలాంటి సాహసం చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశప రచదు’’ అని డైరెక్టర్ ఎన్. శంకర్ అన్నారు. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా గోరేటి వెంకన్న కీలక పాత్రలో నాగసాయి మాకం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’. మహంకాళి శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని ఎన్.శంకర్ విడుదల చేశారు. మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘సినిమా కథలు మన జీవితాల్లో నుంచే పుడతాయి. ‘బిలాల్పూర్ పోలీస్ స్టేషన్’ కథ మన చుట్టూ ఉన్న ప్రజలను దగ్గర నుంచి చూసిన స్ఫూర్తితో రాసుకున్నాను. ఈ నెల రెండో వారంలో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఒక ఊరిలోని పోలీస్ స్టేషన్‌కు ఎలాంటి వింత కేసులు వస్తాయన్నదే ఈ చిత్ర కథాంశం. సరదాగా, సందేశాత్మకంగా ఉంటుంది’’ అన్నారు నాగసాయి మాకం. -
బాహుబలి తర్వాత శరభ
‘‘నరసింహారావు నా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘శరభ’ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ‘బాహుబలి’ తర్వాత నాకు విజువల్ పరంగా బాగా నచ్చిన చిత్రం ‘శరభ’’ అని నటుడు–దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. డా.జయప్రద, ఆకాశ్‌కుమార్, మిస్తి చక్రవర్తి, నెపోలియన్, నాజర్, పునీత్ ఇస్సార్, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్, పొన్వణ్ణన్, సాయాజీ షిండే, అవినాష్, పృథ్వీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘శరభ’. యన్. నరసింహారావు దర్శకత్వంలో అశ్వనీకుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ చిత్రం మేకింగ్ వీడియోను ఆర్.నారాయణమూర్తి, ట్రైలర్‌ను నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు రిలీజ్ చేశారు. నరసింహారావు మాట్లాడుతూ– ‘‘కొత్త తరహా చిత్రమిది. ‘భక్త ప్రహ్లాద’ తర్వాత అంత గొప్పగా ఆడుతుందని నమ్ముతున్నా. ఈ సినిమా టెక్నీషియన్లందరూ కలిసి నన్ను శంకర్ స్థాయిలో నిలబెట్టేలా కృషి చేశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా’’ అన్నారు అశ్వనీకుమార్ సహదేవ్. ‘‘సినిమా వాడిగా పుట్టడం గొప్ప విషయం. నా బ్యానర్లో తొలి సినిమాగా ఎన్టీఆర్‌గారి ‘జీవిత ఖైదు’ విడుదల చేశాను. ఏఎన్నార్గారితోనూ చేశాను. మధ్యలో చాలా సినిమాలు చేశా. ఇప్పుడు ‘శరభ’ రిలీజ్ చేస్తున్నా. నేను జయప్రదగారికి పెద్ద ఫ్యాన్’’ అని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. ‘‘నేను ఫోన్ చేయగానే నా మీద నమ్మకంతో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న చదలవాడ శ్రీనివాసరావుగారికి ధన్యవాదాలు. నేను తెలుగమ్మాయిని అని చెప్పుకోవడానికి గర్వపడతాను. ఎన్ని భాషల్లో నటించినా తెలుగులో నటించినప్పుడు ప్రత్యేకమైన సంతృప్తి ఉంటుంది. నాకు తెలుగు ఇండస్ట్రీ అమ్మలాంటిది’’ అన్నారు జయప్రద. మిస్తి చక్రవర్తి పాల్గొన్నారు. -
రహస్యం హిట్ అవ్వాలి
‘‘సినిమాల మీద మంచి అభిరుచి ఉన్న నిర్మాత రామసత్యనారాయణగారు. చిన్న సినిమాలు తీసి, విజయవంతంగా విడుదల చేయటంలో ఆయనకు ఆయనే సాటి. తాజాగా ఆయన నిర్మించిన ‘రహస్యం’ సినిమా మంచి హిట్ అవ్వాలి’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. సాగర్ శైలేష్, శ్రీ రితిక జంటగా ‘జబర్దస్త్’ అప్పారావు ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘రహస్యం’. సాగర శైలేశ్ దర్శకత్వంలో భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా రెండో ట్రైలర్‌ని మారుతి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాని శైలేష్ స్టైల్‌గా తెరకెక్కించాడు. ట్రైలర్ చూస్తుంటే డైరెక్టర్, అతని టీమ్ బాగా కష్టపడ్డారని తెలుస్తోంది. దర్శకునిగా తనకు మంచి భవిష్యత్తు ఉంది’’ అన్నారు. రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘నూతన దర్శకులకు మార్గదర్శి మా ఆర్జీవీగారు (రామ్‌గోపాల్ వర్మ). ప్రతి కొత్త డైరెక్టర్ తమ చిత్రాలను ఆర్జీవీగారి చేతుల మీదుగా ప్రారంభించాలని కోరుకుంటారు. సాగర్ శైలేష్ తన శక్తిని, యుక్తిని, ప్రాణాన్ని పణంగా పెట్టి ‘రహస్యం’ సినిమా తీసాడు’’ అన్నారు. సాగర్ శైలేష్, శ్రీ రితిక పాల్గొన్నారు. -
లవ్ అండ్ వార్
కమల్ కామరాజ్, మౌర్యాణి, పూజా రామచంద్రన్ ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘లా’ (లవ్ అండ్ వార్). గగన్ గోపాల్ ముల్క దర్శకత్వంలో రమేష్ బాబు మున్నా నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని రాజ్ కందుకూరి విడుదల చేశారు. ‘‘కమల్ హీరోగానే కాదు.. కథ బాగా రావడానికి సహకరించారు. సినిమా బాగుంటే పదిమందికి చెప్పండి.. బాగోకపోతే వందమందికి చెప్పండి... కానీ సినిమాని చూడండి’’ అన్నారు గగన్ గోపాల్. ‘‘లా’తో హీరోగా నేను రీ లాంచ్ అంటున్నారు. అవేమీ పెద్దగా నమ్మను. ఈ సినిమాకి మొదటి హీరో స్క్రీన్‌ప్లే. ‘లా’ని ఫాలో చేయకపోవడం హీరోయిజం అనుకుంటాం. బేసిక్ కామన్ సెన్స్ వాడితే అందరూ ‘లా’ని ఫాలో అయినట్లే’’ అని కమల్ కామరాజ్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: పి. అమర్ కుమార్, సంగీతం: సత్య కశ్యప్, సహ నిర్మాత: మద్దిపాటి శివ. -
‘బిచ్చగాడు’లా హిట్ అవ్వాలి
‘‘మా సంస్థ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన అన్ని సినిమాలకంటే వైవిధ్యంగా ‘కర్త కర్మ క్రియ’ ఉండబోతోంది. నాగు గవర కథ ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్‌కు గురి చేసేలా ఉంటుంది. ట్రైలర్ ఎంత గ్రిప్పింగ్‌గా ఉందో సినిమా అంతకుమించి ఉంటుంది’’ అని సమర్పకులు చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. వసంత్ సమీర్, సెహర్లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ‘వీకెండ్ లవ్’ ఫేం నాగు గవర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కర్త కర్మ క్రియ’. శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో చదలవాడ పద్మావతి నిర్మించిన ఈ సినిమా ఈనెల 8న విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేసిన అనంతరం చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘నాగు గవర కథ చెప్పిన దాని కంటే ది బెస్ట్‌గా ఈ సినిమాను బాధ్యతగా తీశారు. మా బ్యానర్లో సూపర్ హిట్ అయిన ‘బిచ్చగాడు’ సినిమా తరహాలో ‘కర్త కర్మ క్రియ’ హిట్ కావాలి’’ అన్నారు. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న కల్పిత కథ ఇది. రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఉంటుంది. పక్కా ప్లానింగ్‌తో అనుకున్న సమయానికి ఈ సినిమాను పూర్తి చేశాం. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెర కెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నాగు గవర. ‘‘ఓ మంచి చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది’’ అని వసంత్ సమీర్, సెహర్ అన్నారు. -
9 మంది ప్రముఖుల చేతుల మీదుగా..!
తెలుగులో ఇప్పటి వరకూ ఎన్నో కథలు చూశాం. చూస్తున్నాం. కానీ ప్రస్తుతం జానర్ బేస్డ్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటోంది. ఏ జానర్ లో వస్తోన్న సినిమా అయినా హానెస్ట్ గా రాసుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలా తెలుగులో వస్తోన్న మరో జానర్ బేస్డ్ మూవీ ‘హవా’. ఇటీవల రానా చేతుల మీదుగా విడుదల చేసిన ఈసినిమా మోషన్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ‘హవా’ కాన్సెప్ట్ పోస్టర్‌ను సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల విడుదల చేశారు. సస్సెన్స్, క్రైమ్, కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ మూవీకి ‘9 గంటలకు 9 నేరాలు 9 బ్రెయిన్స్’ అంటూ పెట్టిన క్యాప్షన్ కూడా ఆసక్తికరంగా ఉంది. మరి ఆ తొమ్మిదిమంది ఎవరు.. ఏం నేరాలు చేశారు.. అదీ తొమ్మిదిగంటల్లోనే.. తద్వారా వాళ్ల లైఫ్ లో జరిగిన మార్పులేంటీ అనేది థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో సాగే కథ. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకూ ఎవరూ చిత్రీకరించని లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకున్న ఈ మూవీ ట్రైలర్ ను సినిమా ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమానికి 9 మంది సినీ ప్రముఖులు హాజరై చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. నందిని రెడ్డి, బీవీయస్ రవి, మధురా శ్రీధర్, వేణు ఊడుగుల, రాజ్ కందుకూరి, జానీ మాస్టర్లు కార్యక్రమానికి అతిథులుగా హాజరయ్యారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. -
ఎదిరిస్తే అంతే
అతనొక కార్పొరేట్ దిగ్గజం. ఏ దేశానికి వెళ్లినా తనను ఎదిరించిన వాళ్లను అంతం చేస్తాడు. ఓటు వేయడం కోసం ఇప్పుడతను ఇండియాకి వచ్చాడు. పనిగట్టుకుని ఎన్నికల కోసం భారత్‌కి రావడానికి కారణమేంటి? ఇక్కడ ఏం చేశాడు? అన్నది తెరపైనే చూడాలంటున్నారు అశోక్ వల్లభనేని. విజయ్ హీరోగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మించిన చిత్రం ‘సర్కార్’. కీర్తీ సురేష్, వరలక్ష్మీ శరత్‌కుమార్ కథానాయికలు. ఈ చిత్రాన్ని అశోక్ వల్లభనేని తెలుగులో విడుదల చేస్తున్నారు.నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. అశోక్ వల్లభనేని మాట్లాడుతూ– ‘‘నవాబ్’ లాంటి సూపర్‌హిట్ సినిమా తర్వాత మేం విడుదల చేస్తున్న చిత్రం ‘సర్కా ర్’. ‘కత్తి, తుపాకీ’ వంటి హిట్ చిత్రాల తర్వాత మురుగదాస్–విజయ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు హ్యాపీగా ఉంది. రెహమాన్ చక్కని స్వరాలు అందించారు’’ అన్నారు. -
కథ బాగుంటేనే ఆదరిస్తారు
‘‘24 కిస్సెస్’ సినిమా గురించి నరేష్‌గారు చెప్పేశారు. రావురమేష్‌గారు కానీ, సీనియర్ నరేష్‌గారు కానీ ఏదన్నా సినిమా ఒప్పుకుని చేశారంటే అవి విషయం లేని సినిమాలు మాత్రం కాదు’’ అని దర్శకుడు అయోధ్య కుమార్ అన్నారు. అదిత్ అరుణ్, హెబ్బాపటేల్ జంటగా సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో అనీల్, సంజయ్ నిర్మించిన చిత్రం ‘24 కిస్సెస్’. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. అయోధ్య కుమార్ మాట్లాడుతూ–‘‘ముద్దు ఇవ్వడమనేది గొప్పకాదు.. ముద్దుకు ముందు, తర్వాత ఇవ్వాల్సిన ఎమోషన్స్ పండటం చాలా అవసరం. ఈ సినిమాలో ముద్దులు ఉన్నాయని ప్రేక్షకులు సినిమాకి రారు. కథ బాగుంటే తప్పకుండా ఆదరిస్తారు’’ అన్నారు. ‘‘ముద్దు అనగానే ప్రతిఒక్కరూ తప్పుగానే ఆలోచిస్తారు. రొమాన్స్ అన్నది పూర్వకాలం నుంచే మొదలైంది. అందమైన ప్రేమ కావ్యం ‘24 కిస్సెస్’. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు నటుడు నరేష్. ‘‘బ్యానర్‌కి తగ్గట్టుగా మా సినిమా ఉంటుంది. ఈ చిత్రానికి నరేష్‌గారు, రావు రమేష్‌గారు రెండు పిల్లర్లు. వీరిద్దరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు’’ అన్నారు అదిత్ అరుణ్. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ థ్యాంక్స్’’ అన్నారు హెబ్బాపటేల్. నటి కీర్తన పాల్గొన్నారు. -
ఎన్నో రంగులు
సమాజంలో యువత బాధ్యత ఏంటి? సమాజాన్ని కాపాడాల్సిన పోలీసుల బాధ్యత ఏంటి? ఇలాంటి కథాంశంతో నల్లస్వామి సమర్పణలో యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తనీష్, ప్రియాసింగ్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘రంగు’. కార్తికేయ.వి దర్శకత్వంలో ఎ. పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో రచయిత, నటులు పరుచూరి వెంకటేశ్వర రావు ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా తనీష్ మాట్లాడుతూ– ‘‘నేను బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా మా ‘రంగు’ సినిమాకు సంబంధించిన ట్రైలర్, మూడు పాటలను విడుదల చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో నా పాత్ర విషయానికి వస్తే విజయవాడకి చెందిన లారా అనే కుర్రాడి పాత్ర పోషిస్తున్నాను. 17–28 సంవత్సరాల మధ్య ఉండే వ్యక్తిగా నాలుగు వేరియేషన్లలో నా పాత్ర ఉంటుంది. సోషల్ మెసేజ్ ఉన్న సినిమా’’ అన్నారు. కార్తికేయ మాట్లాడుతూ– ‘‘న్యూస్ పేపర్లో ఓ విషయాన్ని చదివి నేరుగా అక్కడికి వెళ్లి లారా అనే వ్యక్తిని కలిసి తయారు చేసుకున్న కథ ఇది. రియలిస్టిక్‌గా ఉంటూనే కమర్షియల్ పంథాలో ఎలా సినిమా చేయాలో పరుచూరి బ్రదర్స్ చెప్పారు. ఓ చిన్న కుర్రాడి పాత్ర నుండి ఇరవై ఎనిమిదేళ్ల యువకునిగా కనపడే పాత్ర కోసం తనీష్ ఎంతో కష్టపడ్డారు’’ అన్నారు. ఎ.పద్మనాభరెడ్డి మాట్లాడుతూ– ‘‘యు అండ్ మీ సంస్థను స్థాపించటం వెనక ్రçపధాన కారణం ఆశయాన్ని బతికించటం. కృష్ణానగర్‌లో ఎంతో మంది దర్శకులు వారి ఆకలిని మరిచిపోయి ఆశయం కోసం బతుకుతుంటారు. నిర్మాతలెందరో వస్తుంటారు, పోతుంటారు. కానీ ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా చనిపోయే దాకా నిర్మాతగానే ఉంటాను’’ అన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం: సిరివెన్నెల, సంగీతం: యోగేశ్వర శర్మ. -
నిర్మాతలు సినిమాకి ఊపిరిలాంటోళ్లు
2005లో విడుదలైన సూపర్‌హిట్ చిత్రం ‘పందెం కోడి’తో అటు తమిళ్లోను ఇటు లె లుగులోను విశాల్ మాస్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నారు. పదమూడేళ్ల తర్వాత మళ్లీ ఆ హిట్ ఫీట్‌ని సాధించటానికి రెడీ అయ్యారు చిత్రదర్శకుడు లింగుస్వామి, హీరో విశాల్. ‘పందెం కోడి’కి సీక్వెల్‌గా ఈ హిట్ కాంబినేష్న్లో రూపొందిన ‘పందెం కోడి 2’ అక్టోబర్ 18న తమిళ్, తెలుగులో రిలీజ్ కానుంది. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ప్రముఖ పంపిణీదారుడు నారాయణదాస్ నారంగ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో 25 సినిమాలు పూర్తయ్యాయి. నేనీ రోజు మీ (ప్రేక్షకులు) ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే అందుకు కారణం నా తల్లిదండ్రులు, మా అన్నయ్య విశాల్‌కృష్ణ. వారి ప్రోత్సాహంతోనే హీరోగా కెరీర్ ప్రారంభించాను. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు నన్ను ఇప్పటికీ ఆదరిస్తూనే ఉన్నారు. నా 25 సినిమాల ప్రయాణంలో ప్రతి చిత్రం మంచి విజయాన్ని సాధించాలనే కష్టపడ్డాను. నిర్మాతలు సినిమాలకు ఊపిరిలాంటోళ్లు. ‘పందెం కోడి 2’ కథ విషయానికొస్తే... ఏడు రోజుల పాటు జరిగే జాతర నేపథ్యంలో ఈ సీక్వెల్ రూపొందింది. ‘మహానటి’తో జాతీయ అవార్డు గెలుచుకునే స్థాయిలో నటనను ప్రదర్శించిన కీర్తీ సురేశ్ మా సినిమాలో అద్భుతమైన పాత్రను పోషించింది. ‘పందెం కోడి’ పార్ట్ 3 చేస్తే అందులో కూడా కీర్తీనే హీరోయిన్. వరలక్ష్మీ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. రాజ్‌కిరణ్‌గారు చాలా హుందాగా నటించారు. తెలుగులో మా సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్న ‘ఠాగూర్’ మధు గారికి థ్యాంక్స్’’ అన్నారు. లింగుస్వామి మాట్లాడుతూ– ‘‘విశాల్‌లోని ఎన ర్జీ లెవెల్స్‌ను ‘పందెం కోడి’లో చూపించాను. ఈ సీక్వెల్లో కూడా అవి కంటిన్యూ అవుతాయి. ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. సీక్వెల్‌కి ఇంత గ్యాప్ రావటానికి కారణం మీరా జాస్మిన్లా నటించే హీరోయిన్, లాల్లా విలనిజమ్ చూపించే నటులు కోసం వెయిట్ చేయడమే’’ అన్నారు. ‘‘మహానటి’ తర్వాత ఆ రేంజ్లో తృప్తినిచ్చిన చిత్రమిది. అక్టోబర్ 17 నా బర్త్‌డే, సినిమా 18న విడుదలవుతుంది. నా బర్త్‌డేకి పెద్ద గిఫ్ట్‌గా భావిస్తున్నాను’’ అన్నారు కీర్తీ సురేశ్. ‘‘ఇది నాకు స్పెషల్ మూవీ’’ అన్నారు వరలక్ష్మీ. ‘‘విశాల్ అసోసియేషన్‌లో చేస్తున్న తొలి సినిమా ఇది. మొదటి భాగం కంటే రెండో భాగం ఇంకా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ‘ఠాగూర్’ మధు. నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, అనిల్ సుంకర, బీవీయస్ఎన్ ప్రసాద్, సుధాకర్ రెడ్డి, టీయంసి సుమన్, వీరినాయుడు, ముత్యాల రామదాస్ తదితరులు పాల్గొన్నారు. -
సీక్వెల్‌కి 15 ఏళ్లు పట్టింది
‘‘తెలుగులో నేను చేస్తున్న కొత్త ప్రయత్నం ‘సామి’ చిత్రం. కమర్షియల్, ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ‘సామి’తో నాకు పెద్ద హిట్ ఇచ్చి, నన్ను కమర్షియల్ హీరోగా నిలబెట్టాడు హరి. ఎప్పటి నుంచో ‘సామి’ చిత్రానికి సీక్వెల్ చేయాలనుకున్నా... 15 ఏళ్లు పట్టింది. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే కనిపించాల్సి వచ్చింది. అందుకు కెమెరామెన్ వెంకటేశ్ కష్టపడ్డారు’’ అని హీరో విక్రమ్ అన్నారు. విక్రమ్ హీరోగా, Mీ ర్తీ సురేష్, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సామి’. బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. విక్రమ్ మాట్లాడుతూ– ‘‘కీర్తీ సురేష్‌కి ‘మహానటి’ సినిమా ఎంతటి గౌరవాన్ని తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. మా చిత్రంలో ఆమె కామెడీ ట్రాక్‌లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలైట్. అందరం కష్టపడి సినిమా చేశాం. ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నా. తెలుగు, తమిళంలో అతి త్వరలో సినిమా రిలీజ్ అవుతుంది’’ అన్నారు. ‘‘నేను చేసిన ప్రతి సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు హరి. ‘‘విక్రమ్‌గారి సినిమాలను మేం వదల్లేకపోతున్నాం. 4 రోజుల్లో ఆడియో వేడుక నిర్వహించనున్నాం’’ అన్నారు బెల్లం రామకృష్ణా రెడ్డి. నిర్మాత శిబు, ఆర్ఆర్ సినిమాస్ మహేష్, నిర్మాతలు కేవీవీ సత్యనారాయణ, శోభారాణి, బాబీ సింçహా (విలన్), దుర్గం గిరీష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
మాఫియా నేపథ్యంలో...
మణిరత్నం.. ఈ పేరు చెప్పగానే ‘గీతాంజలి, బాంబే, రోజా, సఖి, ఘర్షణ, దళపతి, యువ’ వంటి ఎన్నో హిట్ చిత్రాలు గుర్తొస్తాయి. ప్రేమకథలే కాదు.. మెసేజ్ ఓరియంటెడ్ ఎమోషనల్ చిత్రాలను తెరకెక్కించడంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘నవాబ్’. అరవింద స్వామి, జ్యోతిక, అరుణ్ విజయ్, ఐశ్వర్యా రాజేశ్, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్. త్యాగరాజన్ ప్రధాన తారలుగా లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో నాగార్జున విడుదల చేశారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ– ‘‘మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. మంచి యాక్షన్ ప్యాక్డ్గా ఉంటూనే ఎమోషనల్ కంటెంట్‌తో సాగుతుంది. నాగార్జునగారు రిలీజ్ చేసిన ట్రైలర్ ఇప్పటికే వన్ మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుని సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. టాప్ టెక్నీషియన్స్ సహకారంతో తెరకెక్కిన ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను మించేలా సినిమా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ పకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, కెమెరా: సంతోష్ శివన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ ఆనంది, నిర్మాతలు: మణిరత్నం, సుభాష్ కరణ్. -
బర్త్‌డే ట్రీట్
షారుక్ ఖాన్ తన బర్త్‌డే సందర్భంగా సినిమా అభిమానులందరికీ మంచి ట్రీట్ ప్లాన్ చేశారు. తన లేటెస్ట్ మూవీ ‘జీరో’ సినిమా ట్రైలర్‌ను ఆయన బర్త్‌డే నవంబర్ 2న రిలీజ్ చేయనున్నారట. షారుక్ ఖాన్ హీరోగా ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జీరో’. ఇందులో షారుక్ మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నారు. అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటించారు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన రెండు టీజర్స్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. టైటిల్ అనౌన్స్మెంట్, ఈద్ సందర్భంగా రిలీజ్ చేసిన ఈ టీజర్స్ సినిమాపై మంచి అంచనాలను ఏర్పరచాయి. ‘జీరో’ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. -
మూఢ నమ్మకాలపై సందేశం
నందు, అనురాధా, బాలాజీ, ప్రమీల ముఖ్య తారలుగా ఫణిరామ్ తూఫాన్ దర్శకత్వంలో శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘ఐందవి’. ఎస్ఏ అర్మాన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నటుడు కాదంబరి కిరణ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఫణిరామ్ తూఫాన్ మాట్లాడుతూ– ‘‘కొందరు యువతీ యువకులు సరదాగా గడుపుదామని ఇంటి నుంచి వెళతారు. అనుకోకుండా వారు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నారన్నదే ఈ సినిమా కథాంశం. మంచి సస్పెన్స్ థ్రిల్లర్. మూఢ నమ్మకాలను ఆశ్రయించొద్దనే సందేశాన్ని ఇస్తున్నాం’’ అన్నారు. ‘‘ఓ సక్సెస్ఫుల్ ఫార్ములాను అనుసరించి ఈ సినిమా నిర్మించాం. అతీంద్రియ శక్తులు, హారర్ అంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చుతుంది. త్వరలో రిలీజ్ చేయనున్నాం’’ అన్నారు శ్రీధర్. ∙బాలాజీ, ప్రమీల -
ఉన్నది ఒకటే జీవితం
సూపర్ గుడ్ ఫిలింస్ అధినేత ఆర్.బి. చౌదరి తనయుడు జితన్ రమేష్ హీరోగా పరిచయం కానున్న సినిమా ‘ఒకటే లైఫ్’. ‘హ్యాండిల్ విత్ కేర్’ అనేది ఉప శీర్షిక. శృతియుగల్ కథానాయికగా నటించారు. ఎమ్.వెంకట్ దర్శకత్వంలో నారాయణ్ రామ్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను తెలంగాణ భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీష్‌రావు విడుదల చేసి మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. పాటలు బాగున్నాయి. అనుభవం ఉన్న దర్శకునిలా వెంకట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా హిట్ సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు.‘‘హారీష్రావుగారు మా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో రిలీజ్ అనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత. ‘‘ఈ టెక్నాలజీ యుగంలో హ్యూమన్ రిలేషన్స్‌కు ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది’’ అన్నారు వెంకట్. సుమన్, నల్ల వేణు, జబర్దస్త్ రామ్, బాబి, రిషి తదితరులు నటించిన ఈ సినిమాకు అమ్రీష్ సంగీతం అందించారు. -
బ్రేకప్ లవ్‌స్టోరీ
అర్జున్ రెడ్డి, నేహాదేశ్ పాండే జంటగా కేఎస్ నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ‘ఏ బ్రేకప్ లవ్‌స్టోరీ’ అనేది ఉప శీర్షిక. ఎస్.ఏ. రెహమాన్ సమర్పణలో ఆల్ వెరైటీ మూవీ మేకర్స్ పతాకంపై బి. చంద్రశేఖర్ నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. రిలీజ్ తర్వాత ఇందులోని మెసేజ్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఇలాంటి వినోదాత్మక చిత్రాలను కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు ప్రోత్సహించాలి’’ అన్నారు. ‘‘వినాయక్ వంటి దర్శకులు మా చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసి మెచ్చుకోవడం గర్వంగా ఉంది. ‘కష్టపడి జీవితంలో పైకి వచ్చేవాడు లక్కీ ఫెలో. ఇతరుల కష్టంతో ఓసీగా బతుకుతూ పేదవాడిగా, బిచ్చవాడిగా జీవించేవాడు అన్ లక్కీఫెలో’ అనే ఫిలాసఫీ ఆధారంగా సినిమాను తెరకెక్కించాం. సెన్సార్ పూర్తయింది. త్వరలో విడుదల చేస్తాం’’ అని బి. చంద్రశేఖర్‌రావు అన్నారు. -
తొలి ప్రేమ గుర్తొస్తుంది
సంపత్ నంది టీమ్ వర్క్స్ , బిఎల్ఎన్ సినిమాస్, ప్రచిత్ర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంతోష్ శోభన్, రియా సుమన్ జంటగా నటించిన ఈ చిత్రానికి జయశంకర్ దర్శకుడు. భీమ్స్ సిసిరేలియో సంగీతాన్ని అందించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. సెప్టెంబరు 7న సినిమా విడుదలవుతుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ చిత్రం ట్రైలర్‌ను చూసి యూనిట్‌ను అభినందించారు. పేపర్‌బాయ్‌గా పనిచేసే రవి, బాగా రిచ్ ఫ్యామిలీలోని అమ్మాయి ధరణిల ప్రేమకథే ఈ సినిమా. ఈ సందర్భంగా జరిగిన విలేఖరుల సమావేశంలో దర్శకుడు–చిత్రనిర్మాతల్లో ఒకరైన సంపత్ నంది మాట్లాడుతూ– ‘‘మా చిత్రం టీజర్‌కు 36 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. మేం మంచి సినిమా తీశామని గట్టిగా నమ్ముతున్నాను. ‘పేపర్‌బాయ్’ మంచి ప్రేమకథ. ఈ సినిమాలో నాతో పాటు ఉన్న రాములు, వెంకట్, నరసింహాకు థ్యాంక్స్. వాళ్లు ఈ సినిమాకు వెన్నెముకలా నిలబడ్డారు’ అన్నారు. దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ – ‘‘సంపత్ నంది చెప్పిన కథ విన్న వెంటనే కనెక్ట్ అయిపోయాను. ఈ విషయంలో నన్ను నమ్మినందుకు సంపత్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ– ‘సంపత్ నంది గారితో పనిచేయటం నాకు చాలా ప్రత్యేకంతో పాటు మంచి అనుభవం కూడా. సినిమాను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు. హీరోయిన్ రియా సుమన్ మాట్లాడుతూ– ‘‘దరణి‘ పాత్రలో నటించాను నేను. ఈ పాత్ర కోసం నన్ను నమ్మినందుకు దర్శకుడు జయశంకర్‌కు థ్యాంక్స్. కెమెరామెన్ సౌందర్యరాజన్గారు మంచి విజువల్స్ అందించారు. ‘పేపర్‌బాయ్’ సినిమా అందరికీ తమ ఫస్ట్‌లవ్‌ను గుర్తు చేసే మంచి ప్రేమకథ’’ అన్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ మాట్లాడుతూ – ‘‘ముందుగా నాకు సినీ జీవితాన్నిచ్చిన సంపత్ నందికి కృతజ్ఞతలు. ఈ సినిమాకు ఆత్మ ఆయనే. మీడియా పర్సన్ సురేశ్ ఉపాధ్యాయ్ ఈ చిత్రంలో మూడు పాటలు రాశారు. చిన్న సినిమాను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
కొత్తవాళ్లు ఎలా చేస్తారో అనుకున్నా
‘‘యు టర్న్’ టీమ్ అంతా ఫ్రెండ్సే. ఓ ఫ్యామిలీలాగా కలిసిపోయి ఈ సినిమా చేశాం. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ‘లూసియా’ సినిమాతో దర్శకుడు పవన్‌కుమార్‌కి పెద్ద ఫ్యాన్ అయ్యాను’’ అని సమంత అన్నారు. ఆమె లీడ్ రోల్లో, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యు టర్న్’. శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. సమంత మాట్లాడుతూ – ‘‘అందరం సిన్సియర్‌గా చేసిన ప్రయత్నం ‘యు టర్న్’. నిర్మాతలు కొత్తవాళ్లు ఎలా చేస్తారో అనుకున్నా. కానీ, వాళ్లు చక్కగా డీల్ చేశారు. మా ప్రయత్నాన్ని అందరూ సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా’’ అన్నారు. ‘‘సమంత మంచి నటే కాదు.. మంచి మనిషి కూడా. నా చిత్రాల్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన చిత్రమిది’’ అన్నారు ఆది పినిశెట్టి. ‘‘ఒకప్పుడు సమంతకు, ఇప్పటి సమంతకు చాలా తేడా కనపడుతోంది. నటిగా ఇంకా ఎదిగింది’’ అన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘ఇంత మంచి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వడం హ్యాపీగా ఉంది. ఈ జర్నీ చాలా విషయాలను నేర్పింది. సమంతగారు మంచి నటి. ఆవిడతో పనిచేయడం హ్యాపీ’’ అన్నారు పవన్‌కుమార్. -
అమ్మాయిలు జలగల్లాంటోళ్లు!
‘ఏ ఫీలింగ్స్ లేనప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఫీలింగ్స్ మొదలయ్యాక అలా ఉండలేకపోతున్నాను’..., ‘లవ్‌కి ఆప్షన్స్ ఉంటాయి.. లైఫ్‌కి ఉండవ్’... ‘ప్రతి మగాడికి లవర్ గుండెల్లో ఉంటుంది.. పెళ్లాం పక్కనుంటుంది’..., ‘అమ్మాయిలు జలగల్లాంటోళ్లు రా.. పట్టుకుంటే వదలరు.. తీసేస్తే పోరు’... వంటి డైలాగులు ‘సమీరమ్’ చిత్రంపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. యశ్వంత్, అమృత ఆచార్యలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ రవి గుండబోయిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమీరమ్’. అనిత క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో అనిత దేవేందర్‌రెడ్డి, సురేశ్ కేశవన్, జి.రుక్మిణి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనిత దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్, షూటింగ్ మొత్తం బ్యాంకాక్‌లో చేశాం. నా స్నేహితుడు సురేశ్ కేశవన్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. త్వరలో సినిమాని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. యూనిట్ అందరికీ సినిమా విజయంపై మంచి నమ్మకం ఉంది’’ అన్నారు రవి గుండబోయిన. యశ్వంత్, అమృత ఆచార్య, సంగీత దర్శకుడు యాజమాన్య, ‘జబర్దస్త్’ రాము, ‘గెటప్’ శ్రీను, పాటల రచయిత రాంబాబు గోశాల తదితరులు పాల్గొన్నారు.