‘‘అష్టదిగ్బంధనం’ పవర్‌ఫుల్ టైటిల్. ట్రైలర్‌లో మంచి సస్పెన్స్ కనపడుతోంది. అలాగే ప్రేక్షకులను అష్టదిగ్బంధనం చేసే అంశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి’’ అని ‘బేబీ’ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ అన్నారు. సూర్య, విషిక జంటగా బాబా పీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అష్టదిగ్బంధనం’.
ఎంకేఏకేఏ ఫిలిం ్ర΄÷డక్షన్స్ సమర్పణలో మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని సాయి రాజేష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బాబా పీఆర్ మాట్లాడుతూ– ‘‘నా మొదటి సినిమా ‘సైదులు’.. రెండో చిత్రం ‘అష్టదిగ్బంధనం’. క్రైమ్, యాక్షన్, థ్రిల్, పజిల్ లాంటి సినిమా ఇది’’ అన్నారు. ‘‘కథను నమ్మి ఈ సినిమా నిర్మించాను’’ అన్నారు మనోజ్ కుమార్ అగర్వాల్. ‘‘సినిమా పక్కా హిట్ అని
నమ్ముతున్నాం’’ అన్నారు సూర్య.
అష్టదిగ్బంధనం.. ఓ పజిల్
Published Thu, Sep 14 2023 12:53 AM | Last Updated on Thu, Sep 14 2023 12:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment