Baby Director Sai Rajesh Helps To Child For Treatment - Sakshi
Sakshi News home page

Sai Rajesh: సాయి రాజేశ్ మంచి మనసు.. పిల్లాడి వైద్యానికి ఆర్థిక సాయం!

Published Wed, Aug 2 2023 7:07 PM | Last Updated on Wed, Aug 2 2023 7:35 PM

Baby Director Sai Rajesh Helps To Child For Treatment - Sakshi

ఎలాంటి అంచనాలు లేకుండా ఇటీవల సెన్సేషన్ సృష్టించిన సినిమా ఏది అంటే అందరినోట వినిపించే పేరు 'బేబీ'. ఈ సూపర్ హిట్ చిత్రానికి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పెద్ద స్టార్స్ లేకుండానే రిలీజై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిన్న సినిమా అయినా కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని బేబీ మరోసారి రుజువు చేసింది. 

(ఇది చదవండి: హీరో విశ్వక్ సేన్‌తో గొడవపై 'బేబీ' డైరెక్టర్ క్లారిటీ!)

అయితే తాజాగా బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ తన గొప్పమనసును చాటుకున్నారు. ఓ కుటుంబానికి అండగా నిలిచారు. ఏడాది వయసున్న పిల్లవాడి వైద్యానికి తన వంతు సాయంగా రూ.50 వేల రూపాయలు సాయం చేశారు. ఏపీలోని అంబాజీపేట మండలం గంగలకుర్రు గ్రామానికి చెందిన ఏడాది వయసున్న బాలుడు వేడి నూనెలో పడిపోవడంతో ఒళ్లంతా గాయాలయ్యాయి. ఈ విషయాన్ని మహేశ్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెంటనే స్పందించిన బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ యాభై వేల రూపాయల సాయం అందించి మానవత్వం చాటుకున్నారు.   

(ఇది చదవండి: నేను మద్యం, సిగరెట్లు తాగుతా.. బిగ్‌ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement