సాయి రాజేశ్‌ మోసం చేశాడు.. అందుకే బేబీ లీక్స్ రాశా: టాలీవుడ్‌ డైరెక్టర్‌ | Tollywood Director Shirin Sriram Allegations On Baby Movie Director Sai Rajesh | Sakshi
Sakshi News home page

Shirin Sriram: నా కథను కాపీ కొట్టి.. బేబీ సినిమా: సాయి రాజేశ్‌పై తీవ్ర ఆరోపణలు

Published Sun, May 26 2024 7:00 PM | Last Updated on Mon, May 27 2024 9:17 AM

Tollywood Director Shirin Sriram Allegations On Baby Movie Director Sai Rajesh

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేశ్‌  బేబి సినిమా తీశాడని దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సాక్ష్యాల‌తో స‌హా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్ అనే బుక్ అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బేబీ లీక్స్‌ పేరిట బుక్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టాపిక్‌ టాలీవుడ్‌లో చర్చనీయాశంగా మారింది. తాజాగా నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఈ విషయాలన్నీ శిరీన్‌ శ్రీరామ్ ప్రస్తావించారు.

శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందించారు. పాన్ ఇండియా చిత్రంగా 5  భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వర్షన్‌  జూన్ 7న  విడుదల కానుంది. ఈ క్రమంలో శిరీన్ శ్రీరామ్ తనకు సాయి రాజేష్ చేసిన అన్యాయం, తన కథను కాపీ కొట్టి బేబీ సినిమా తీయడంపై మరోసారి స్పందించాడు. సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ అంటూ పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ఈ బేబీ లీక్స్ బుక్‌ను మీడియా ముందుంచారు.

ఈ సందర్భంగా శిరీన్ శ్రీరామ్ మాట్లాడుతూ.. 'రవి కిరణ్ అనే వ్యక్తిని 2015లో కలిశాను. తరువాత రవి కిరణ్ ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్ చూసి ఓ పాయింట్ అనుకున్నా. ఓ అమ్మాయిని ఇద్దరబ్బాయిలు కలిసి చంపారనే పోస్ట్ చూసి కథ అనుకున్నాం. దాన్ని ఓ బస్తీ అమ్మాయి పాత్రతో లింక్ చేసి కథ రాసుకున్నా. ఆ టైంలో నిర్మాత సాయి రాజేశ్‌తో ఏడాది ప్రయాణం చేశా. నాకు దర్శకుడిగా అవకాశం ఇస్తూ.. ఆయనే సినిమాను నిర్మిస్తానని అన్నారు. అయితే ఆలస్యం అవుతూ వచ్చింది. కారణాలేమైనా ఉండొచ్చేమో అనిపించి.. ఆయన సినిమా నిర్మించడం లేదని నేను బయటకు వచ్చేశా. అప్పుడు మాకేం గొడవ జరగలేదు.' అని అన్నారు.

ఆ తర్వాత మాట్లాడుకూ..'నాకు ద‌ర్శ‌క‌త్వం అవ‌కాశం ఇస్తాన‌న్న‌వాడు.. నా క‌థ‌ను కాపీ కొట్టి అదే బస్తీ అమ్మాయి.. ఇద్దరబ్బాయిల్ని ప్రేమించే కథతో బేబీ అనే సినిమా తీశాడు. 2023 జూలైలో సినిమా రిలీజ్ అయినప్పుడు రచ్చ చేయలేదు. నాకు రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సాక్ష్యాలు అన్నీ సంపాదించి లాయర్ నిఖిలేశ్‌ను కలిశాను. కాపీరైట్ లీగల్ నోటీస్ పంపాం. కానీ నాకే ఆయన ఆ కథను చెప్పాడని ఆ నోటీసులో రిప్లై ఇచ్చాడు. హృదయ కాలేయం సినిమాకు ఫ్రీగా టీజర్ డైరెక్ట్ చేసి, ఎడిట్ చేసి ఇచ్చా. కానీ నన్నే మోసం చేశాడు. ఫిబ్రవరిలో రాయదుర్గంలో కేసు ఫైల్ చేశా. నన్ను బద్నాం చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో ఫిర్యాదులు చేశాడు. అందుకే ఆయన మీద బేబీ లీక్స్ అనే పుస్తకాన్ని కూడా రాశా. ఇవాళ దాన్ని మీడియా ముందుకు తీసుకొస్తున్నా. https://babyleaks2023.blogspot.com/ అనే ఆన్ లైన్లో మాధ్య‌మంలో పీడీఎఫ్, వెబ్ సైట్ కూడా ఉంది.' అని అన్నారు. 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement