ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, యూట్యూబర్ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబి. సాయి రాజేశ్ మొదట ఈ సినిమా కథను ఓ హీరోకు చెప్పేందుకు ప్రయత్నించగా అతడు కథ వినడానికి కూడా సుముఖత వ్యక్తం చేయలేదన్న సంగతి తెలిసిందే! దీంతో ఈ సినిమా కథ ఆనంద్ దేవరకొండ దగ్గరకు వెళ్లింది. ఇకపోతే ఇందులో రెండో హీరోగా నటించిన విరాజ్ అశ్విన్ స్థానంలో తాను ఉండాల్సింది అంటున్నాడు నటుడు అర్జున్ కల్యాణ్.
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నాకు జరిగిన ఓ సంఘటన వల్లే నేను బిగ్‌బాస్‌కు వెళ్లాను. ఇటీవలి కాలంలో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఓ సినిమాలో(బేబి చిత్రాన్ని ఉద్దేశిస్తూ) రెండో హీరోగా ప్రయత్నించాను. హీరోయిన్ నా స్నేహితురాలు కావడంతో తను నన్ను రిఫర్ చేసింది. డైరెక్టర్ కూడా నా స్నేహితుడే! నేను నటించిన రెండు, మూడు సినిమాల ఫంక్షన్స్‌కు కూడా వచ్చాడు. అయితే అతడి సినిమాకు నేను ట్రై చేశాను. ఆయన మాత్రం.. అర్జున్.. నీకింకా మార్కెట్ లేదు. దాదాపు రూ.4 కోట్లతో సినిమా తీయాలనుకుంటున్నాం. ఈ చిత్రాన్ని తన పాపులారిటీతో ముందుకు తీసుకెళ్లగలిగే వ్యక్తి కావాలనుకుంటున్నాం అని రిజెక్ట్ చేశాడు.
ఇలా జరిగిందేంటని నిరాశపడ్డాను. అందుకే నేను బిగ్‌బాస్ షోకి వెళ్లాను. నాకంటూ మార్కెట్ సృష్టించుకోవాలనే షోలో పాల్గొన్నాను. సొంతంగా మార్కెట్ వచ్చేంతవరకు మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. కానీ సినిమాలు చేయకుండా మార్కెట్ ఎలా వస్తుంది? సినిమాలు చేస్తే కానీ మార్కెట్ రాదు, మార్కెట్ ఉంటే కానీ సినిమాలు రావు. మార్కెట్ లేకపోయినా సరే.. నా టాలెంట్ చూసి పెళ్లికూతురు పార్టీ, ప్లేబ్యాక్ సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఆ డైరెక్టర్లకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అన్నాడు అర్జున్ కల్యాణ్.
చదవండి: జైలర్ సినిమాకు షాక్.. ఆన్‌లైన్‌లో HD ప్రింట్ లీక్.. కలెక్షన్స్‌కు దెబ్బ.. ఓటీటీలో..
Comments
Please login to add a commentAdd a comment