బేబి.. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ మూవీగా సూపర్ సక్సెస్ అందుకుంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల ప్రశంసలు అందుకుంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని దర్శకుడు సాయి రాజేశ్ తీశారు. అద్భుతమైన టాక్‌తో పాటు బాక్సాఫీస్ దగ్గర రూ.90 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది.
(ఇదీ చదవండి:'బిగ్‌బాస్' హౌసులోకి టీమిండియా స్టార్ క్రికెటర్!?)
అలా ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది 'బేబి'. ఈ సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు సాయి రాజేశ్‌కు నిర్మాత ఎస్కేఎన్.. ఖరీదైన బెంజ్ కారుని గిఫ్ట్‌గా ఇచ్చారు. సినిమా రిలీజ్ ముందే రషెస్ చూసిన ఎస్కేఎన్.. డైరెక్టర్‌కి ఓ కారు బహుమతిగా ఇచ్చారు. కానీ ఆ విషయం పెద్దగా హైలైట్ కాలేదు.
ఇప్పుడు బేబి సక్సెస్ అయిన సంతోషంలో బెంజ్ కారుని గిఫ్ట్‌గా అందించారు. దీని ధర సుమారు రూ.45 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇకపోతే థియేటర్‌లో హిట్ అయిన బేబి.. ఓటీటీలోనూ రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంటోంది. ఇదిలా ఉండగా సాయి రాజేశ్.. తన తర్వాతి సినిమా కూడా ఎస్కేఎన్‌తోనే చేస్తున్నాడు. త్వరలో ఆ వివరాలు వెల్లడించనున్నారు.
(ఇదీ చదవండి: సీరియల్ నటి రెండో పెళ్లి.. అసలు మేటర్ బయటపెట్టేసింది!)
Comments
Please login to add a commentAdd a comment