Benz car
-
రూ. 458 కోట్ల 70ఏళ్ల నాటి బెంజ్ కారు ఇదే - ఫోటోలు
-
బంజారాహిల్స్‌లో బెంజ్ కారు బీభత్సం
బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లో ఆదివారం అర్ధరాత్రి ఒక బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం. ఆదివారం రాత్రి బంజారాహిల్స్ రోడ్డునెంబర్–1లోని సిటీ సెంట్రల్ వైపు నుంచి రోడ్డునెంబర్–10 వైపు వెళ్తున్న బెంజ్ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్ పోలీసుల సాయంతో కారు నడుపుతున్న నజీర్ అనే వ్యక్తికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించలేదని తేలింది. ప్రమాద సమయంలో కారు యజమానితో పాటు ఆయన భార్య కారులోనే ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మద్యం మత్తులో ఒక మహిళ ఈ ప్రమాదానికి పాల్పడినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో సీసీ ఫుటేజీలను పరిశీలించి కారు ఎవరు నడుపుతున్నారనేది తేలుస్తామని పోలీసులు స్పష్టం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భారత్‌లో రూ.1.11 కోట్ల జర్మన్ బ్రాండ్ కారు లాంచ్ - వివరాలు
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) దేశీయ మార్కెట్లో 'ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్' కూపే లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర రూ.1.11 కోట్లు (ఎక్స్ షోరూమ్).బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎం40ఐకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కొత్త ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్ 2.0 లీటర్, ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 421 హార్స్ పవర్, 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 4.7 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.కొత్త మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్ స్లోపింగ్ రూఫ్‌లైన్, స్పోర్టియర్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. ఈ కారు లోపల 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే, 11.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వంటి వాటితో పాటు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. -
అసౌకర్యంగా ఉండేందుకు ఎవరూ లగ్జరీ కార్లు కొనరు: సుప్రీంకోర్టు
వినియోగదారులు తమ అసౌకర్యం కోసం విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయరని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రముఖ లగ్జరీ కార్ల తయరీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఉత్పత్తుల్లో తలెత్తిన సమస్యల పరిష్కారంపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు సమర్థించింది. జస్టిస్ బేలా ఎమ్ త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం రెండు వేర్వేరు కేసుల అప్పీళ్లను పరిష్కరించింది.సంస్థ డైరెక్టర్ల కోసం కొనుగోలు చేసిన బెంజ్ కార్ల విషయంలో సమస్యలను ఎదుర్కొన్న రెండు కంపెనీలు వేర్వేరుగా జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)ను ఆశ్రయించాయి. మొదటి కేసులో కంట్రోల్స్ అండ్ స్విచ్ గేర్ కంపెనీ లిమిటెడ్ దాని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కోసం రెండు మెర్సిడెస్ కార్లను కొనుగోలు చేసింది. బెంజ్ అనేకసార్లు మరమ్మతులు చేసినప్పటికీ కార్లలోని హీటింగ్ సమస్యను తగ్గించలేకపోయింది. దాంతో కంపెనీ ఎన్సీడీఆర్సీని సంప్రదించింది. వినియోగదారుకు అనుకూలంగా తీర్పు రావడంతో దాన్ని సవాలు చేస్తూ బెంజ్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కారును వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లు కోర్టులో వాదించింది. కానీ అందుకు సరైన ఆధారాలు సమర్పించలేకపోయింది. దాంతో పూర్తి వివరాలు పరిశీలించిన కోర్టు ఎన్సీడీఆర్సీ తీర్పును సమర్థించింది. కస్టమర్ మెర్సిడెస్ కారుకు బదులుగా వేరే కొత్త కారు ఇవ్వాలని లేదా బెంజ్ కారు కొనుగోలుకు అయిన రూ.1.15 కోట్లలో సగం తిరిగి చెల్లించాలని ఆదేశించింది.రెండో కేసులో సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థ తన మేనేజింగ్ డైరెక్టర్ కోసం మెర్సిడెస్ ఈ-క్లాస్ కారును 2006లో కొనుగోలు చేసింది. ప్రమాదవశాత్తు ఈ కారు వేరే వాహనంతో ఢీకొట్టింది. అయితే సరైన రీతిలో ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చక పోవడంవల్ల డైరెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయంపై బెంజ్ కంపెనీను సంప్రదిస్తే డ్రైవర్ స్థానంలో ఉన్నవారికి సీట్ బెల్ట్ ఉండడంతో ప్రమాద తీవ్రత అంతగా ఉండదని చెప్పింది. ఈ ప్రమాదంలో ఎయిర్‌బ్యాగ్‌ని అమర్చడం అవసరం లేదని బెంజ్ వాదించింది. ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చకపోవడం వల్ల సర్వీస్‌లో లోపం ఉన్నందుకు ఎన్సీడీఆర్సీ రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని బెంజ్‌ను ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ మెర్సిడెస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఈ కేసులోనూ వినియోగదారుకు అనుకూలంగా ఎన్సీడీఆర్సీ ఇచ్చిన తీర్పును కోర్టు సమర్థించింది.ఇదీ చదవండి: ఒక వ్యక్తికి రూ.2 లక్షలే అప్పు ఇవ్వాలి: ఎంఫిన్ఈ కేసులు విచారించిన ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ..‘ఏదైనా ఉత్పత్తులు కొనేపుడు వినియోగదారులు కంపెనీలు ప్రచురించిన బ్రోచర్లు చూసి ఆకర్షితులవుతారు. సంస్థలు వాటిపై ఉన్న ప్రతి సౌకర్యాలను వినియోగదారులకు అందించాల్సిందే. దానిపై నమ్మకంతోనే కంపెనీ వస్తువులను కొనుగోలు చేస్తారు. కంపెనీలు కూడా ఆ విలాసాలను చూపించే తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తుంటాయి. ప్రజలు అసౌకర్యంగా ఉండేందుకు రూ.లక్షలు ఖర్చుపెట్టి అత్యాధునిక విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయరు’ అని స్పష్టం చేసింది. -
ఖరీదైన లగ్జరీ కారు కొన్న తెలుగు సీరియల్ బ్యూటీ.. రేటు ఎంతంటే?
సినిమా నటీనటులతో పోలిస్తే సీరియల్ యాక్టర్స్ కూడా ఈ మధ్య మంచి క్రేజ్ సంపాదిస్తున్నారు. ఓవైపు యాక్టింగ్ చేస్తూ మరోవైపు యూట్యూబ్, షోలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త ఇల్లు, కార్లు కొనేస్తున్నారు. ఇప్పటికే పలువురు సీరియల్ బ్యూటీస్ దగ్గర లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ లిస్టులో నటి లహరి కూడా చేరింది.(ఇదీ చదవండి: 'కల్కి' సీక్వెల్లో ప్రభాస్ పాత్ర చనిపోతుంది.. సీరియల్ కృష్ణుడు జోస్యం)'మొగలిరేకులు', గృహలక్ష్మి తదితర సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న లహరి.. ప్రస్తుతం ఒకటో రెండో సీరియల్స్ చేస్తోంది. మరోవైపు యూట్యూబ్ ఛానెల్లోనూ వీడియోస్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బెంబ్ ఈ-క్లాస్ కారు కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని తన ఇన్ స్టాలోనే పోస్ట్ చేసింది.ఇకపోతే ఈ కారు ధర మార్కెట్లో రూ.90 లక్షలకు పైనే ఉంది. ఎంత లేదన్నా ఇతరత్రా ఖర్చులతో కలిపి రూ.కోటికి పైనే ఉండొచ్చు. తెలుగు సీరియల్ నటి ఇంత లగ్జరీ కారు కొనడం అంటే మామూలు విషయం కాదని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'స్పిరిట్' కోసం కొరియన్ విలన్... సెట్ అయితే మాత్రం!) View this post on Instagram A post shared by Strikers (@strikersinsta) -
Banjarahills: బంజారాహిల్స్‌లో బెంజ్ కారు బీభత్సం...
హైదరాబాద్: అదుపు తప్పిన వేగంతో వచ్చిన బెంజ్ కారు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. అమెరికాలో నివసించే అయిదుగురు యువతీ యువకులు ఓ వివాహానికి హాజరయ్యేందుకు నాలుగు రోజుల క్రితం నగరానికి వచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్–45లో నివసించే వెంకటష్, అవినాష్‌తో పాటు జర్మనీ, అమెరికాలో నివసించే మ్యాక్స్మిలన్ హెన్రీ, ప్రీతమ్, ఓ యువతి బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో బస చేశారు.మంగళవారం రాత్రి వీరు బెంజ్ కారులో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్–45లోని దస్పల్లా హోటల్ పైన ఉన్న కారా పబ్‌కు వెళ్లారు. మద్యం తాగిన అనంతరం అర్ధరాత్రి కారులో మాదాపూర్,గచ్చిబౌలి, దుర్గంచెరువు ప్రాంతాలను చుట్టేసి పార్క్ హయత్ హోటల్ వైపు వెళ్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10/36 శ్రీజ్యువెలర్స్ వద్ద వీరు వెళ్తున్న కారు అదుపుతప్పి అంతే వేగంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పైకి దూసుకెళ్లింది. కాగా.. ఇందులోని అయిదుగురు యువతీ యువకులు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్టేషన్‌కు తరలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా కారు నడుపుతున్న వెంకటేష్ 44 ఎంజీ, అవినాష్ 173 ఎంజీతో పాటు మిగతావారు కూడా మద్యం తాగినట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్‌కు చెందిన చలసాని మాధవీదేవి పేరుతో కారు రిజిస్టరై ఉందని పోలీసులు గుర్తించారు. ఓ పెళ్లికి హాజరుకావడానికి వీరంతా నగరానికి వచ్చినట్లు తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు కారును సీజ్ చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్
చాలామంది హీరోహీరోయిన్లకు బైక్స్, కార్స్ అంటే కాస్త పిచ్చి ఉంటుంది. మార్కెట్ లోకి కొత్త మోడల్ వస్తే చాలు కొనేస్తుంటారు. లేదంటే మంచి సందర్భం చూసుకుని వాటిని సొంతం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఓ హీరోయిన్ ఖరీదైన కారు కొనేసేంది. ఇంతకీ ఎవరా బ్యూటీ? కారు కొనడం ఎందుకంత స్పెషల్? బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అంటే చాలామందికి గుర్తొచ్చే పేరు కంగన రనౌత్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది. బాలీవుడ్ బడా హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచింది. (ఇదీ చదవండి: 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు కామెడీ సినిమా) గత కొన్నేళ్ల నుంచి చూసుకుంటే రాజకీయంగానూ కంగనా రనౌత్.. పలు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు అందుకు తగ్గట్లే ఈమెకు బీజేపీ తరఫున మండి ఎంపీ టికెట్ కేటాయించారు. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భంగానే కంగన కొత్త కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తన నిర్మాణ సంస్థ మణికర్ణిక ప్రొడక్షన్స్ పేరుపై బెంజ్ మెబాజ్ జీఎల్ఎస్ ఎస్680 కారు కొనుగోలు చేసింది. అయితే దీని విలువ దాదాపు రూ.3 కోట్లు పైనే. మరోవైపు కంగన దగ్గర బీఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెజ్ బెంజ్, ఆడీ క్యూ8 కార్లు ఉన్నాయని తెలుస్తోంది. (ఇదీ చదవండి: Pushpa 2 Teaser: పుష్పరాజ్ మాస్ జాతర చూస్తారా?) -
కోట్లు విలువ చేసే కారు కొన్న 'ఆదిపురుష్' రైటర్.. రేటు ఎంతో తెలుసా?
ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా గురించి చెప్పగానే చాలామంది ఫ్యాన్స్ భయపడిపోతారు. ఎందుకంటే రామాయణం పేరు చెప్పి విచిత్రమైన సీన్స్ అన్నీ తీశారు. ఈ విషయంలో దర్శకుడు ఓం రౌత్ ఇప్పటికీ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు. అలానే ఇదే సినిమాకు రచయితగా చేసిన మనోజ్ ముంతాషిర్ అనే వ్యక్తిపై కూడా అప్పట్లో దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి సదరు మనోజ్ వార్తల్లో నిలిచాడు. ఎందుకో తెలుసా? (ఇదీ చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో చరణ్‌ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్) బాలీవుడ్‌లోని టాప్ రైటర్స్‌లో మనోజ్ ముంతాషిర్ ఒకరు. 'తేరే మిట్టి', 'గల్లియన్', 'కౌన్ తుజే' లాంటి కల్ట్ సాంగ్స్ రాసింది ఈయనే. అలానే 'బాహుబలి' హిందీ వెర్షన్ కోసం కూడా ఈయన పనిచేశారు. కానీ ఎప్పుడైతే 'ఆదిపురుష్' సినిమాలో హనుమంతుడి పాత్రకు వింత డైలాగ్స్ రాశారో.. ప్రేక్షకులు ఈయన్ని ఓ రేంజులో ఆడుకున్నారు. అప్పట్లో కొన్ని నెలల పాటు ఈయనపై ట్రోలింగ్ జరిగింది. దీంతో జనాలు ఈయన్ని దాదాపుగా మార్చిపోయారు. అలాంటిది రైటర్ మనోజ్ ముంతాషిర్.. తాజాగా ఖరీదైన మెర్సిడెజ్ మేబ్యాచ్ ఎస్-క్లాస్ బెంజ్ కారు కొనుగోలు చేశారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2.71 కోట్లు వరకు ఉంటుందని టాక్. మిగతా ఖర్చులన్నీ కలిపి చూసుకుంటే దాదాపు రూ.3 కోట్ల విలువైన కారు అనుకోవచ్చు. బాలీవుడ్లో అనిల్ కపూర్, షాహిద్ కపూర్, కంగనా రనౌత్, కియారా అడ్వాణీ, ప్రియాంక చోప్రా లాంటి టాప్ స్టార్స్ మాత్రమే ఈ కారుని ఉపయోగిస్తున్నారు. అలాంటిది రైటర్ మనోజ్ దీన్ని కొనుగోలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: ఆ మూడు సినిమాలే నా కెరీర్‌ని మలుపు తిప్పాయి: మహేశ్ బాబు) -
ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?
హీరోయిన్ ప్రియమణి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కథానాయికగా కొన్నేళ్ల పాటు వరస సినిమాలు చేసింది గానీ ఆ తర్వాత ఛాన్సులు తగ్గిపోయాయి. మరోవైపు పెళ్లి కూడా చేసుకుంది. దీంతో ఈమె పనైపోయిందనుకున్నారు. కానీ బంతిని గట్టిగా బౌన్స్ అయింది. ఓటీటీ, సహాయ పాత్రల్లో నటిస్తూ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. చేతినిండా అవకాశాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్ బ్యూటీ.. ఇప్పుడైన ఖరీదైన కారు కొనుగోలు చేసింది. కర్ణాటకకు చెందిన ప్రియమణి.. తెలుగు సినిమాతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. 2003లో నటిగా ఈమె కెరీర్ మొదలవగా.. తెలుగులో బోలెడన్ని చిత్రాలు చేసింది. మధ్యలో తమిళ, మలయాళంలోనూ నటించింది. 2012-13 మధ్యలో ఈమెకు ఛాన్సులు బాగా తగ్గిపోయాయి. దీంతో ఈమె కెరీర్ ఇక అయిపోయినట్లే అనుకున్నారు. దీంతో టీవీ షోలు చేస్తూ వచ్చింది. 2017లో ముస్తాఫా అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) అలా పెళ్లి చేసుకుని గృహిణి అయిన తర్వాత ప్రియమణి.. 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ దెబ్బకు ప్రియమణి దశ తిరిగిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఛాన్సులు వరసపెట్టి వచ్చాయి. 'భామా కలాపం' లాంటి సినిమాల్లో హీరోయిన్గా.. జవాన్, నెరు, కస్టడీ తదితర చిత్రాల్లో ప్రాధాన్యమున్న సహాయ పాత్రలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇలా అనుకోని విధంగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన ప్రియమణి.. తాజాగా ఖరీదైన జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్సీ కొనుగోలు చేసింది. మార్కెట్లో దీని ధర రూ.74 లక్షల వరకు ఉంది. ఇప్పటికే కొన్ని కాస్ట్ లీ కార్స్ ఈమె దగ్గర ఉండగా.. ఇప్పుడీ కారు ప్రియమణి గ్యారేజీలో చేరింది. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) View this post on Instagram A post shared by Mercedes-Benz Auto Hangar India Pvt Ltd (@autohangar) -
ఖరీదైన కారు కొన్న 'బిగ్‌బాస్' మానస్.. రేటు ఎంతో తెలుసా?
బిగ్‌బాస్ షో, తెలుగు సీరియల్ ప్రేక్షకులకు మానస్‌ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా హీరోగా కెరీర్ ప్రారంభించినప్పటికీ.. ఇప్పుడు సీరియల్స్‌లో నటిస్తూ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడేమో ఏకంగా ఖరీదైన బెంజ్ కారు కొనేశాడు. ఇంతకీ ఆ కారు రేటు ఎంతంటే? (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే) 'కాయ్ రాజా కాయ్', 'ప్రేమికుడు' తదితర సినిమాల్లో మానస్ హీరోగా నటించాడు. కానీ బిగ్ స్క్రీన్ పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత బిగ్‌బాస్ 5వ సీజన్లో పాల్గొని ఫినాలే వరకు వచ్చాడు కానీ విజేతగా నిలవలేకపోయాడు. అయితేనేం ఫేమ్ తెచ్చుకుని 'బ్రహ్మముడి' అనే సీరియల్‌తో బుల్లితెర హీరోగా మారిపోయాడు. నవంబరు 23న చెన్నెకి చెందిన శ్రీజ అనే అమ్మాయిని మానస్ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నెల తిరిగేలోపు ఖరీదైన బెంజ్ ఎఫ్220డీ కారుని కొనుగోలు చేశాడు. ఇదే విషయాన్ని తన ఇన్ స్టాలో షేర్ చేసుకున్నాడు. అయితే ఈ కారు ఖరీదు.. దాదాపు రూ.85-90 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనా సరే మొన్నే పెళ్లి చేసుకుని, ఇప్పుడు కారు కూడా కొనేశాడు. అదిరిందయ్యా చంద్రం! (ఇదీ చదవండి: మెగా క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఒక్కటిగా కనిపించిన ఆ ఇద్దరు!) -
చిరంజీవి సినిమాతో ఫేమస్ అయిన బ్యూటీ కొత్త కారు చూశారా? (ఫోటోలు)
-
చిరంజీవితో స్టెప్పులేసిన బ్యూటీ.. ఇప్పడు కారు కొన్న ఆనందంలో..
ప్రముఖ నటి 'గౌహర్ ఖాన్' (Gauahar Khan) ఇటీవల ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈమె కొన్న ఆ కారు ఏది? దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నా పేరే కాంచనమాలా పాటతో శంకర్ దాదా MBBS సినిమాలో చిరంజీవితో స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకులను అలరించిన 'గౌహర్ ఖాన్' కొనుగోలు చేసిన లగ్జరీ కారు 'మెర్సిడెస్ బెంజ్' కంపెనీకి చెందిన 'జీఎల్ఈ'. ఈ కారు ధర సుమారు రూ. కోటి కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఈ కారుని డెలివరీ చేసుకోవడానికి సంబంధించిన ఫోటోలను ముంబైలోని కంపెనీ అధీకృత మెర్సిడెస్-బెంజ్ డీలర్ అయిన ఆటోహంగర్ అండ్ గ్లామర్ డైరీస్ ఫోటోలను, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీడియోలో గమనించినట్లైతే గౌహర్ ఖాన్ తన భర్త జైద్ దర్బార్తో కలిసి ముంబైలోని మెర్సిడెస్-బెంజ్ డీలర్‌షిప్‌లోకి వెళ్లడాన్ని చూడవచ్చు. లగ్జరీ కారుని మాత్రమే కాకుండా వీరు తమ పిల్లల కోసం ఓ బొమ్మ బెంజ్ కారుని కొన్నట్లు తెలుస్తోంది. వీడియోలో ఈ చిన్న కారు కూడా పార్క్ చేసి ఉండటం చూడవచ్చు. గౌహర్ ఖాన్ తన భర్త జైద్ దర్బార్ ఇద్దరూ బొమ్మ కారుని ఆవిష్కరించిన తరువాత, బెంజ్ కారుని ఆవిష్కరించారు. ఇది బెంజ్ GLE300d LWB వెర్షన్ అని తెలుస్తోంది. ఇది మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇదీ చదవండి: ఆ రోజు మీటింగ్‌లో కూడా సత్య నాదెళ్లకు అదే ధ్యాస.. బ్లాక్ షేడ్‌లో కనిపించే ఈ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ కలిగి 245 పీఎస్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9జీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఉత్తమ పనితీరుని అందిస్తుంది. ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ కారు వాహన వినియోగదారుల భద్రతకు పెద్ద పీట వేస్తుంది. View this post on Instagram A post shared by Mercedes-Benz Auto Hangar India Pvt Ltd (@autohangar) -
నయనతార కోసం ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఫోటోలు వైరల్
Mercedes-Benz Maybach: ప్రముఖ నటి నయనతార నవంబర్ 18న తన 39వ పుట్టినరోజు జరుపుకుంది. బర్త్‌డే జరిగిన రెండు వారాల తరువాత తన భర్త శివన్ నుంచి ఓ ఖరీదైన గిఫ్ట్ అందుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నయనతార కోసం.. శివన్ సుమారు రూ. 3 కోట్ల జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఖరీదైన గిఫ్ట్ అందుకున్న నయన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలు షేర్ చేస్తూ.. వెల్కమ్ హోమ్ యూ బ్యూటీ అంటూ.. మై డియర్ హస్బెండ్, మధురమైన పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు, లవ్ యు అంటూ వెల్లడించింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమదైన రీతిలో శుభాకంక్షలు తెలియజేస్తున్నారు. నయనతార గిఫ్ట్‌గా పొందిన కారు మెర్సిడెజ్ బెంజ్ మేబ్యాచ్ అని తెలుస్తోంది. అయితే ఇందులో ఏ మోడల్ అనేది స్పష్టంగా తెలియడం లేదు. బెంజ్ మేబ్యాచ్ కార్లు జీఎల్ఎస్, ఎస్-క్లాస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తున్నాయి. ఈ రెండు లగ్జరీ కార్ల ధరలు రూ. 3 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఇదీ చదవండి: రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా! ఇప్పటికే ఈ లగ్జరీ కారుని దీపికా పదుకొణె, కృతి సనన్, రామ్ చరణ్ వంటి ప్రముఖ సినీతారలు కూడా కొనుగోలు చేశారు. భారతదేశంలో లభిస్తున్న అత్యంత ఖరీదైన బీవేంజ్ కార్లలో మేబ్యాచ్ కూడా ఒకటి. ఇది చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగి, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఈ కారణంగానే చాలామంది సెలబ్రిటీలు దీనిని ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
'బేబి' డైరెక్టర్‌కి బెంజ్ కారు గిఫ్ట్.. రేటు ఎంతో తెలుసా?
బేబి.. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ మూవీగా సూపర్ సక్సెస్ అందుకుంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరోల ప్రశంసలు అందుకుంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా దీన్ని దర్శకుడు సాయి రాజేశ్ తీశారు. అద్భుతమైన టాక్‌తో పాటు బాక్సాఫీస్ దగ్గర రూ.90 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకుంది. (ఇదీ చదవండి:'బిగ్‌బాస్' హౌసులోకి టీమిండియా స్టార్ క్రికెటర్!?) అలా ఈ మధ్య కాలంలో తెలుగులో వచ్చిన చిన్న సినిమాల్లో పెద్ద విజయాన్ని అందుకుంది 'బేబి'. ఈ సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు సాయి రాజేశ్‌కు నిర్మాత ఎస్కేఎన్.. ఖరీదైన బెంజ్ కారుని గిఫ్ట్‌గా ఇచ్చారు. సినిమా రిలీజ్ ముందే రషెస్ చూసిన ఎస్కేఎన్.. డైరెక్టర్‌కి ఓ కారు బహుమతిగా ఇచ్చారు. కానీ ఆ విషయం పెద్దగా హైలైట్ కాలేదు. ఇప్పుడు బేబి సక్సెస్ అయిన సంతోషంలో బెంజ్ కారుని గిఫ్ట్‌గా అందించారు. దీని ధర సుమారు రూ.45 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇకపోతే థియేటర్లో హిట్ అయిన బేబి.. ఓటీటీలోనూ రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంటోంది. ఇదిలా ఉండగా సాయి రాజేశ్.. తన తర్వాతి సినిమా కూడా ఎస్కేఎన్తోనే చేస్తున్నాడు. త్వరలో ఆ వివరాలు వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: సీరియల్ నటి రెండో పెళ్లి.. అసలు మేటర్ బయటపెట్టేసింది!) -
నాలుగేళ్లకే లగ్జరీ కారు మారుస్తున్నారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాలు 38.9 లక్షల యూనిట్లు రోడ్డెక్కాయి. 2023–24లో ఈ సంఖ్య 40 లక్షల యూనిట్లు దాటుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇందులో లగ్జరీ వాహన విభాగం 45,000 యూనిట్లను నమోదు చేయవచ్చని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో అన్ని బ్రాండ్లవి కలిపి 36,000 యూనిట్ల లగ్జరీ కార్లు అమ్ముడయ్యాయని చెప్పారు. మెర్సిడెస్ బెంజ్‌కు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తరువాత 10 శాతం వాటాతో అయిదవ స్థానంలో హైదరాబాద్ మార్కెట్ నిలిచిందన్నారు. 4–5 ఏళ్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టాప్–3 స్థానాన్ని కైవసం చేసుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వినియోగదార్లలో మహిళల వాటా 30 శాతం ఉందన్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు.. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రస్తుతం భారత్‌లో 14 మోడళ్లను విక్రయిస్తోంది. దేశీయంగా ఇవి తయారవుతున్నాయి. ఇవి కాకుండా 10 మోడళ్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుని అమ్ముతోంది. మొత్తం అమ్మకాల్లో వీటి వాటా 3 శాతం ఉంది. దేశవ్యాప్తంగా మెర్సిడెస్ బెంజ్ గత ఆర్థిక సంవత్సరంలో 16,497 యూనిట్లను విక్రయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి ఆశిస్తోంది. టాప్ ఎండ్ మోడళ్లపైనే ఫోకస్ చేస్తున్నట్టు అయ్యర్ తెలిపారు. ‘గతంలో వ్యాపారస్తులు మాత్రమే మా కార్లను కొనేవారు. ఇప్పుడు ఉద్యోగస్తులు సైతం కొంటున్నారు. కస్టమర్లలో వేతన జీవులు 13 శాతం ఉన్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఏటా 12 యూనిట్ల వరకు విక్రయిస్తున్నాం. వీటి ధర రూ.8–13 కోట్ల మధ్య ఉంటుంది. పూర్తిగా తయారైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను జర్మనీ నుంచి భారత్‌కు దిగుమతి చేసుకుంటున్నాం’ అని చెప్పారు. ఈవీల్లో తొలి స్థానంలో.. మెర్సిడెస్ మొత్తం విక్రయాల్లో 3–4 శాతం ఎలక్ట్రిక్ వాహనాల నుంచి సమకూరుతోంది. కంపెనీకి ఈవీ విభాగంలో 8–9 శాతం వాటాతో తెలుగు రాష్ట్రాలు తొలి స్థానంలో ఉంటాయని సంతోష్ తెలిపారు. ‘దేశవ్యాప్తంగా మెర్సిడెస్ బెంజ్ అమ్మకాల్లో ఎస్యూవీ, సెడాన్ విభాగాలు చెరి 50 శాతం ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌యూవీల వాటా ఏకంగా 70 శాతం ఉంది. ఈ మార్కెట్లో రూ.1.5 కోట్లు, ఆపైన ధర కలిగిన టాప్ ఎండ్ లగ్జరీ కార్ల వాటా 25 శాతం ఉంది. వృద్ధి 40 శాతం ఉండడం విశేషం. కొన్ని మోడళ్లకు వెయిటింగ్ పీరియడ్ 24 నెలల వరకు ఉంది. అయినా కస్టమర్లు వేచి చూస్తున్నారు. వినియోగదార్లు లగ్జరీ కారును నాలుగేళ్లకే మారుస్తున్నారు. గతేడాది 3,000 యూనిట్ల పాత కార్లను విక్రయించాం’ అని వివరించారు. -
రూ.80 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన 'బిగ్‌బాస్' బ్యూటీ!
సాధారణంగా సెలబ్రిటీలకు ఏదో ఓ వ్యసనం ఉంటుంది. కొందరు బట్టలంటే ఇష్టం. మరికొందరికి ట్రావెలింగ్ అంటే పిచ్చి. మరికొందరైతే కొత్త మోడల్ మార్కెట్లోకి రావడం లేటు వెంటనే ఆయా కార్, బైక్ లాంటివి కొనేస్తుంటారు. ప్రముఖ నట కూడా ఇప్పుడు అలానే రూ.80 లక్షల విలువైన బెంజ్ కార్ సొంతం చేసుకుంది. కాకపోతే దాన్ని మరో వ్యక్తికి బహుమతిగా ఇచ్చింది. (ఇదీ చదవండి: అతడితో డేటింగ్ వల్ల బరువు తగ్గాను: రాశీఖన్నా) పంజాబీ నటి అయిన షెహనాజ్ గిల్.. సొంత భాషలోనే పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. బిగ్‌బాస్ హిందీ 13లో పాల్గొంది. అదే సీజన్లో ఆడిన బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లాతో ప్రేమలో పడి రిలేషన్షిప్ మెంటైన్ చేసింది. బిగ్‌బాస్ జోడీగా అప్పట్లో వీళ్లు చాలా పాపులర్ అయ్యారు. అయితే సిద్ధార్థ్ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో చనిపోయాడు. అప్పటినుంచి షెహనాజ్ సింగిల్‌గానే ఉంటోంది. ఈ మధ్య సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్'తో ప్రేక్షకుల్ని పలకరించిన షెహనాజ్.. ఇప్పుడు రూ.80 లక్షలు విలువైన బెంజ్ కారుని తమ్ముడు షెహబాజ్ బాద్ షాకి గిఫ్ట్‌గా ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. షెహనాజ్ దగ్గర ఇప్పటికే రేంజ్ రోవర్, జాగ్వార్, బెంజ్ ఎస్ క్లాస్ కార్లు ఉన్నాయి. View this post on Instagram A post shared by SHEHBAZ BADESHA (@badeshashehbaz) (ఇదీ చదవండి: దేవుడి సినిమాకు 'A' సర్టిఫికెట్.. మరో కాంట్రవర్సీ?) -
ఫిలింనగర్లో కారు బీభత్సం.. ర్యాష్ డ్రైవింగ్‌తో రెచ్చిపోయిన మహిళ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో ఎలక్ట్రికల్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రికల్ బెంజ్ కారులో ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. ఓవర్ స్పీడ్‌లో చెట్టును ఢీకొట్టింది. తర్వాత కారు కంట్రోల్ అవ్వకపోవడంతో ఎలక్ట్రికల్ పోల్, గోడను ఢీ కొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో మహిళ ప్రాణాలతో బయటపడింది. కారు రెండు టైర్లు విడిపోయి.. కొంత దూరంలో ఎగిరి పడ్డాయి. అయితే కారును అక్కడే వదిలేసిన యువతి.. తన హై హీల్స్ భుజాన వేసుకుని సాఫీగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కాగా ప్రమాద స్థలంలో గుడిసెలో ఓ వాచ్ మెన్ కుటుంబం నివాసముంటోంది. గుడిసెకు అడుగుదూరంలో కారు ఆగడంతో సదరు కుటుంబం ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనలో కరెంట్ స్తంభం, గోడ కూలిపోయాయి. అంతా మట్టి,రాళ్లు గుట్టలుగా పేరుకుపోవడంతో గోడకు తగిలి కారు అయిపోయింది. లేదంటే నేరుగా ఎదురుగా గుడిసెలోకి దూసుకెళ్లేదని స్థానికులు అంటున్నారు. కారు అదే స్పీడ్‌లో వెళ్ళి ఉంటే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవని చెబుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు కారును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నెంబర్ ప్లేట్ ఆధారంగా మహిళను గుర్తించే పనిలో పడ్డారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న యువతి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కనురెప్ప కంటే తక్కువ బరువు.. వర్షానికి వాసన ఉంటుందా? -
హైదరాబాద్ ఫిలింనగర్ లో ఎలక్ట్రికల్ బెంజ్ కారు బీభత్సం
-
'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?
ప్రేక్షకుల్ని భయపెట్టడం అంత తేలికైన విషయమేం కాదు. వందల సినిమాల చూసేసుంటారు కాబట్టి సినిమాని కాస్త డిఫరెంట్ గా తీయాలి. అప్పుడే షాకవుతారు. ఆ చిత్రాన్ని హిట్ చేస్తారు. అలా ఈ ఏడాది సక్సెస్ కొట్టిన చిత్రం 'విరూపాక్ష'. రూ.100 కోట్ల వసూళ్లు కూడా సాధించిన ఈ మూవీ.. ఓటీటీలోనూ సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే దర్శకుడిని అందరూ మెచ్చుకున్నారు. మూవీ టీమ్ మాత్రం ఖరీదైన బెంజ్ కారుని బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేసింది. (ఇదీ చదవండి: జెట్ స్పీడ్‌లో శ్రీలీల కెరీర్.. ఆ అంశాలే కలిసొచ్చాయా?) 'విరూపాక్ష' సంగతేంటి? గతంలో తెలుగులో పూర్తిస్థాయి హారర్ సినిమాలు వచ్చేవి కానీ ఆ తర్వాత తర్వాత అవి కాస్త హారర్ కామెడీ చిత్రాలుగా మారిపోయాయి. అలాంటిది 'విరూపాక్ష'ని చేతబడి కాన్సెప్ట్ తో కేవలం హారర్ కథతో అద్భుతంగా తీశాడు యంగ్ డైరెక్టర్ కార్తీక్ వర్మ. స్క్రీన్ ప్లే విషయంలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ సహాయం చేసినప్పటికీ ఓవరాల్ క్రెడిట్ మాత్రం దర్శకుడికే దక్కుతుంది. దాన్ని ఏ మాత్రం మరిచిపోని నిర్మాతలు ఇప్పుడు కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. బెంజ్ బహుమతిగా తనకు బెంజ్ కారుని గిఫ్ట్ గా ఇచ్చారని చెబుతూ దర్శకుడు కార్తీక్ వర్మ ట్విట్టర్ లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేశాడు. వీటిలో బెంజ్ కారు సీ క్లాస్ మోడల్ కనిపించింది. మన దేశంలో దీని రోడ్ ప్రైస్ దాదాపు రూ.65-70 లక్షల వరకు ఉంటుంది. ఇలా హిట్ ఇచ్చిన దర్శకుడికి నిర్మాతలు కారుని బహుమతిగా ఇవ్వడం గతంలోనూ చాలాసార్లే జరిగింది. ఇప్పుడు 'విరూపాక్ష' దర్శకుడి విషయంలో మరోసారి నిజమైంది. ఇదంతా చూస్తే ప్రేక్షకుల్ని భయపెట్టాడు, ఖరీదైన కారుని పట్టేశాడు అనిపిస్తోంది. Virupaksha is a life time memory for me.. I would like to extend my gratitude to my guru @aryasukku sir, my hero @IamSaiDharamTej and my producers @BvsnP sir and @dvlns sir for this wonderful gift ….. pic.twitter.com/VbmT5Oeiqa — karthik varma dandu (@karthikdandu86) June 27, 2023 (ఇదీ చదవండి: ట్రైలర్ బాగుంది కానీ ఆ బూతు డైలాగ్ ఎందుకు పెట్టారో?) -
భారత్‌లో పవర్ఫుల్ కారు లాంచ్ చేసిన మెర్సిడెస్ బెంజ్ - ధర ఎంతంటే?
Mercedes Benz AMG SL 55: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్ ఇండియా' (Mercedes Benz India) ఎట్టకేలకు దేశీయ విఫణిలో 'AMG SL 55' అనే మరో ఖరీదైన కారుని అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు ధర, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మెర్సిడెస్ బెంజ్ 'ఏఎమ్‌జీ ఎస్ఎల్ 55' ప్రారంభ ధర రూ. 2.35 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది సీబీయు (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా మన దేశంలో అమ్ముడవుతుంది. రెండు డోర్లు కలిగిన ఈ కారు ఫోర్ సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. డిజైన్ & డైమెన్షన్ (కొలతలు) డిజైన్ విషయానికి వస్తే, ఇందులో పనామెరికానా ఫ్రంట్ గ్రిల్, యాంగ్యులర్ ఎల్ఈడీ హెడ్‌లైట్, రెండు పవర్ డోమ్లతో కూడిన పొడవైన బోనెట్, పెరిగిన విండ్‌స్క్రీన్, క్వాడ్ ఎగ్జాస్ట్‌లు, 20 ఇంచెస్ అల్లాయ్ వంటివి ఉన్నాయి. ఇందులో ట్రిపుల్-లేయర్ ఫాబ్రిక్ రూఫ్ ఉంటుంది. ఇది ఓపెన్ చేయడానికి లేదా క్లోజ్ చేయడానికి కేవలం 16 సెకన్ల సమయం పడుతుంది. ఇది బ్లాక్, డార్క్ రెడ్, గ్రే కలర్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. కాగా కారు మొత్తం అబ్సిడియన్ బ్లాక్, సెలెనైట్ గ్రే, హైపర్ బ్లూ, ఆల్పైన్ గ్రే, ఒపలైట్ వైట్ బ్రైట్, స్పెక్ట్రల్ బ్లూ మాగ్నో, పటగోనియా రెడ్ బ్రైట్, మోన్జా గ్రే మాగ్నో అనే ఎనిమిది కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఏఎమ్‌జీ ఎస్ఎల్ 55 పరిమాణం పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 4705 మిమీ, వెడల్పు 1915 మిమీ, ఎత్తు 1359 మిమీ వరకు ఉంటుంది. కావున వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇంటీరియర్ ఫీచర్స్ ఏఎమ్‌జీ ఎస్ఎల్ 55 ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 11.9 ఇంచెస్ వర్టికల్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇది లేటెస్ట్ MBUX ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పొందుతుంది. ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, దాని వెనుక ఆప్షనల్ హెడ్స్-అప్ డిస్ప్లే వంటి వాటితో పాటు అల్యూమినియం అండ్ కార్బన్ ఫైబర్ అనే రెండు ఇంటీరియర్ ట్రిమ్స్ మొదలైనవి లభిస్తాయి. (ఇదీ చదవండి: మూడు పదుల వయసుకే కోట్ల విలువైన కారు - ఎవరీ యంగెస్ట్ ఇండియన్?) ఇంజిన్ మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జీ ఎస్ఎల్ 55 4.0 లీటర్ లీటర్ ట్విన్ టర్బో, వి8 పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 476 హార్స్ పవర్ 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది కేవలం 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని చేరుకునే ఈ కారు గరిష్ట వేగం 295 కిమీ/గం. (ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కన్నా ముందు రోల్స్ రాయిస్ కల్లినన్ కొన్న ఫస్ట్ ఇండియన్ ఇతడే!) ప్రత్యర్థులు దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జీ ఎస్ఎల్ 55 కారు పోర్స్చే 911 కర్రెరా ఎస్ క్యాబ్రియోలెట్, లెక్సస్ 500హెచ్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమాంకాల పరంగా ఇది కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. -
మూడు పదుల వయసుకే కోట్ల విలువైన కారు - ఎవరీ యంగెస్ట్ ఇండియన్?
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) భారతీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో 'మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్ 680' (Mercedes Maybach S 680) ఒకటి. ధనవంతులు సైతం ఈ కారుని కొనుగోలు చేయడానికి వెనుకాడతారు, కానీ 33 ఏళ్ల వయసులోనే 'అభిషేక్ మాంటీ అగర్వాల్' మేబ్యాచ్ సెడాన్ కొనుగోలు చేసాడు. పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ ఫౌండర్ అభిషేక్ మాంటీ అగర్వాల్ రూ. 4 కోట్ల విలువైన 'మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్ 680' కారు కొనుగోలు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ భయాని అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు. అభిషేక్ మాంటీ అగర్వాల్ కొత్త బెంజ్ కారు భారత్ రిజిస్ట్రేషన్ ప్లేట్ కలిగి ఉండటం వల్ల భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ డ్రైవ్ చేయడానికి అర్హత కలిగి ఉంది. సాధారణ నెంబర్ ప్లేట్ అయితే ఈ అవకాశం ఉండదు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారినప్పుడు కొంత సమస్య ఉంటుంది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ సెడాన్.. పరిమాణం పరంగా చాలా విశాలంగా ఉంటుంది. దీని పొడవు ఏకంగా 5.5 మీటర్ల. భారతీయ మార్కెట్లో ఇప్పటి వరకు అత్యంత పొడవైన కారు ఇదే కావడం గమనార్హం. హెడ్ లైట్స్, విస్తరించి ఉండే గ్రిల్, బ్రాండ్ లోగో వంటివి ముందు భాగంలో చూడవచ్చు. రియర్ ప్రొఫైల్ టెయిల్ లైట్, రియర్ స్పాయిలర్ మొదలైనవి పొందుతుంది. (ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కన్నా ముందు రోల్స్ రాయిస్ కల్లినన్ కొన్న ఫస్ట్ ఇండియన్ ఇతడే!) ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే లెదర్ సీట్లు, స్టీరింగ్ వీల్, టాకొమీటర్, డిజిటల్ ఓడోమీటర్ వంటివి మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ మల్టి ట్రిప్ మీటర్, వెనుక వైపు ఫోల్డింగ్ టేబుల్, రెండవ వరుస ప్రయాణికుల కోసం డిస్ప్లే వంటి అనేక లగ్జరీ ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: అదిరిపోయే ఫీచర్స్ కలిగిన అద్భుతమైన 5 స్మార్ట్‌ఫోన్స్ - ధర కూడా తక్కువే!) మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్ 680 సెడాన్ 6.0 లీటర్ టర్బోచార్జ్డ్ V12 ఇంజన్ కలిగి 603.46 bhp పవర్, 900 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టం, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. -
జర్మన్ లగ్జరీ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ కపుల్స్ - ఫోటోలు
గత కొన్ని రోజులకు ముందు మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన బాలీవుడ్ లవ్‌బర్డ్స్ 'ఆదిత్య సీల్, అనుష్క రంజన్' ఇటీవల ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బాలీవుడ్ కపుల్ సొంతం చేసుకున్న ఈ కారు ధర ఎంత? దాని ప్రత్యేకతలు ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఆదిత్య సీల్, అనుష్క రంజన్ మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'న్యూ మెర్సిడెస్ ఈ-350డి ఏఎమ్‌జి' (Mercedes E-350d AMG) కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ లగ్జరీ సెడాన్ ధర సుమారు రూ. 1 కోటి వరకు ఉంటుంది. ఈ కారు డెలివరీకి సంబంధించిన ఫోటోలు డీలర్షిప్ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఇందులో ఆదిత్య సీల్, అనుష్క రంజన్ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక మెర్సిడెస్ ఈ-350డి ఏఎమ్‌జి విషయానికి వస్తే, ఇది దేశీయ మార్కెట్లో ఎక్కువమంది సెలబ్రిటీలు కోరుకునే బెస్ట్ మోడల్. ఇది మంచి ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ కలిగి, మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇందులో ఐకానిక్ మెర్సిడెస్ గ్రిల్, త్రీ-పాయింటెడ్ స్టార్ ఎంబ్లమ్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, టెయిల్‌లైట్స్ వంటివి ఉన్నాయి. క్యాబిన్ కూడా క్వాలిటీ మెటీరియల్ పొందుతుంది. ఇందులో ఖరీదైన లెదర్ సీట్లు, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్ మరియు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: ట్రక్కులందు ఈ ట్రక్కు వేరయా.. దీని గురించి తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తది!) మెర్సిడెస్ బెంజ్ 3 లీటర్ వి6 ఇంజిన్ కలిగి 286 hp పవర్ అండ్ 600 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఈ సెడాన్ టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ వరకు ఉంటుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా ఆధునికంగా ఉంటాయి, ఇవన్నీ వాహనం వినియోగదారుల భద్రతను నిర్ధరిస్తాయి. (ఇదీ చదవండి: సగం జీతానికి పనిచేసిన 'నారాయణ మూర్తి' బిలీనియర్ ఎలా అయ్యాడంటే?) View this post on Instagram A post shared by Mercedes-Benz Auto Hangar India Pvt Ltd (@autohangar) -
నిర్మాత బెల్లంకొండ కారు అద్దాలు ధ్వంసం
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ బెంజికారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న ఖరీదైన మద్యం సీసాలతో పాటు నగదు తస్కరించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్ నెం 70లోని జర్నలిస్టు కాలనీలో ఉంటున్న నిర్మాత బెల్లంకొండ సురేష్ తన ఇంటి ముందు టీఎస్ 09 ఈసీ 3033 నెంబర్ బెంజి కారును పార్కింగ్ చేశాడు. శుక్రవారం ఉదయం లేచి చూసేసరికి కారు అద్దాలు ధ్వంసమై ఉన్నాయి. అందులో ఉండాల్సిన 11 రాయల్ సెల్యూట్ లిక్కర్ బాటిళ్లు(ఒక్క బాటిల్ ధర రూ. 28 వేలు), రూ. 50 వేల నగదు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు బాధితుడు డయల్ 100కు ఫిర్యాదు చేయగా జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బెంజి కారు వెనుకాల అద్దం పగలగొట్టిన ఆగంతకులు డిక్కీలో ఉన్న మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లినట్లుగా గుర్తించిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఎకై ్సజ్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి వద్ద అనుమతి లేకుండా ఆరు కంటే ఎక్కువ మద్యం సీసాలు ఉండకూడదు. అయితే నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో 11 మద్యం సీసాలు ఎందుకు ఉన్నాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. డయల్ 100కు ఫోన్ చేసినప్పుడు 11 సీసాలు చోరీకి గురైనట్లు చెప్పగా ఫిర్యాదులో మాత్రం ఐదు బాటిళ్లు చోరీ అయ్యాయంటూ మాట మార్చిన విషయాన్ని పోలీసులు గమనించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భారత్‌లో విడుదలకానున్న జర్మన్ లగ్జరీ కార్లు, ఇవే
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ 'మెర్సిడెస్ బెంజ్' భారతీయ మార్కెట్లో అప్డేటెడ్ జిఎల్ఏ, జిఎల్బి SUVలను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సంవత్సరం చివరి నాటికి మార్కెట్లో అధికారికంగా అడుగుపెడతాయనికి, విక్రయాలు కూడా ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. డిజైన్ & ఫీచర్స్: దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త GLA, GLB రెండూ వాటి మునుపటి మోడల్స్ కంటే ఆధునికంగా ఉంటాయి. ఫ్రంట్ ఎండ్‌లో గ్రిల్, బంపర్, లైట్స్ వంటివి కొత్తగా కనిపించనున్నాయి. అయితే వీల్ ఆర్చెస్ ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్ పొందుతాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేసే ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, లెదర్ స్టీరింగ్ వీల్, హై-బీమ్ అసిస్ట్, రివర్సింగ్ పార్కింగ్ కెమెరా వంటి వాటితో పాటు యాంబియంట్ లైటింగ్ వంటివి ఉంటాయి. మొత్తం మీద డిజైన్, ఫీచర్స్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. పవర్‌ట్రెయిన్స్: కొత్త అప్డేటెడ్ బెంజ్ కార్లు రెండూ లైట్ వెయిట్ హైబ్రిడ్ ద్వారా శక్తిని పొందుతాయి. అయితే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్ట్రెయిన్లలో కొన్ని మార్పులు గమనించవచ్చు. కావున కంపెనీ రేంజ్ వంటి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ మంచి పనితీరుని అందిస్తాయని భావిస్తున్నాము. వీటి గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు కాగా, కేవలం 5.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతాయి. ధరలు: త్వరలో విడుదలకానున్న కొత్త జిఎల్ఏ, జిఎల్బి ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ GLA ప్రారంభ ధరలు రూ. 48.50 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య, GLB ధరలు రూ. 63.80 లక్షల నుంచి రూ. 69.80 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: 2023 Hyundai Verna: మొన్న విడుదలైంది.. అప్పుడే దిమ్మతిరిగే బుకింగ్స్) ప్రత్యర్థులు: భారతదేశంలో జిఎల్ఏ, జిఎల్బి విడుదలైన తరువాత ప్రత్యక్ష పోటీదారులు లేనప్పటికీ బిఎండబ్ల్యూ ఎక్స్1, వోల్వో ఎక్స్‌సి40 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది. కాగా వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
బెంజ్ కారు కొనాలంటే ఇప్పుడే కొనేయండి.. లేదంటే?
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' భారతదేశంలో 2023 ఏప్రిల్ 01 నుంచి తమ ఉత్పతుల ధరలను భారీగా పెంచనున్నట్లు ప్రకటించింది. కంపెనీ త్వరలో మోడల్ శ్రేణిలో సుమారు 5 శాతం వరకు ధరల పెరుగుదలను ప్రకటించింది. 2022 డిసెంబర్ నెలలో కంపెనీ 5 శాతం ధరలను పెంచింది. ఆ తరువాత 2023లో ధరలను పెంచడం ఇదే మొదటిసారి. యూరోతో పోలిస్తే ఇండియన్ కరెన్సీ విలువ తగ్గడంతో పాటు ఇన్పుట్, లాజిస్టికల్ ఖర్చులు పెరగడం వల్ల ధరల పెరుగుదల జరిగిందని కంపెనీ ప్రకటించింది. నిజానికి మెర్సిడెస్ బెంజ్ ఏ200 ధర రూ. 42 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ధరల పెరుగుదల తరువాత ఈ మోడల్ ధర రూ. 44 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంటుంది. జిఎల్ఎస్ 400డి 4మ్యాటిక్ ధర రూ. 10 లక్షలు పెరగనుంది. దీని కొత్త ధర రూ. 1.29 కోట్లు. అదే సమయంలో మేబ్యాచ్ ఎస్580 ధర రూ. 12 లక్షలు పెరగనుంది. (ఇదీ చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైకులు వెనక్కి: కారణం ఏంటంటే?) మెర్సిడెస్ బెంజ్ తమ ఉత్పత్తుల ధరలను పెంచడమే కాకుండా కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి కూడా తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ 2023లో 10 కొత్త మోడల్స్ విడుదల చేయడానికి సంకల్పించింది. ఇందులో క్యూ3 జిఎల్సి, జి-క్లాస్ వెర్షన్ వంటివి దేశీయ మార్కెటీలో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. -
వయసు పదకొండు, సంపాదన నెలకు కోటి.. ఎవరీ చిన్నారి?
హెడ్లైన్ చదివిన వెంటనే మీకు అనుమానం రావొచ్చు, 11 ఏళ్ల వయసేంటి, కోటి సంపాదన ఏంటి అని. అయితే ఇది అక్షరాలా నిజం. ఆస్ట్రేలియాకు చెందిన 'పిక్సీ కర్టిస్' (Pixie Curtis) నెలకు కోటి రూపాయలకంటే ఎక్కువ సంపాదిస్తోంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది. పిక్సీ కర్టిస్ తన తల్లి ఏర్పాటు చేసిన కంపెనీలో ఊహ తెలిసినప్పటి నుంచి పనిచేస్తోంది. ఈ కంపెనీలో చిన్నారి పిక్సీ.. నెలకు 1,33,000 ఆస్ట్రేలియన్ డాలర్లు జీతం తీసుకుంటోంది. నెలకు భారీ మొత్తంగా శాలరీ తీసుకున్న వారి జాబితాలో పిక్సీ కూడా స్థానం సంపాదించింది. ఈ అమ్మాయి ఇప్పుడు మైనరే అయినా.. ఖరీదైన కారు వాడుతోంది. సొంతంగా డ్రైవింగ్ రాకపోయినా రోజూ ఇంటికి, ఆఫీసుకి ఖరీదైన బెంజ్ కారులో తిరుగుతుంది. పిక్సీ కర్టిస్ ఆఫీసులో పిల్లలకు సంబంధించిన హెయిర్ క్లిప్‌లు, రకరకాల హెడ్ బ్యాండ్స్ డిజైన్ చేసి ఆన్లైన్లో విక్రయిస్తుంది. పిక్సీ డిజైన్ చేసిన క్లిప్ లకు భారీగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలను దృష్టిలో పెట్టుకుని పిక్సీ డిజైన్ చేస్తోన్న హెడ్ బ్యాండ్స్ అంటే చాలా మంది కొనేందుకు పోటీ పడతారు. ఇలాంటి వినూత్నమైన ప్రోడక్ట్స్ తయారీతో కంపెనీ పెద్ద ఎత్తున లాభాలను ఆర్జిస్తోంది, అంతే కాకుండా కంపెనీలో జరిగే బోర్డు మీటింగులకు కూడా ఈ చిన్నారి హాజరవుతుంది. ప్రస్తుతం చిన్నారి పిక్సీ కోట్లలో సంపాదిస్తున్నప్పటికీ చదువు ముఖ్యం కాబట్టి, ఆమె తల్లి పిక్సీని కొన్నాళ్ల పాటు ఉద్యోగానికి విరామం ఇవ్వమంటోంది. రోజూ ఆఫీసుకు వచ్చేకంటే కొన్నాళ్ల పాటు చదువుకోవాలని చెబుతోంది. ఇటీవల తన 10వ బర్త్‌డేని పిక్సీ.. దాదాపు 40,000 డాలర్ల ఖర్చుతో చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. బర్త్‌డే గిఫ్ట్‌గా తన తల్లి పిక్సీకి లగ్జరీ బెంజ్ కారు ఇచ్చింది. ఇదంతా చదివి పిల్ల కాదు పిడుగు అంటారా.. అది మీ ఇష్టం. -
Viral: బెంజ్కార్లో బీదవాడు.. ఇదీ అసలు సంగతి
వైరల్: దేశంలో సంక్షేమ ఫలితాలు అర్హులకే అందుతున్నాయా? లబ్ధిదారులకు పంపిణీ అంతా సజావుగానే సాగుతోందా?. కానీ, ఏదైనా ఘటన వెలుగు చూస్తేనే.. అవకతవకలంటూ ఆరోపణలు వినిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. బెంజ్ కారులో వచ్చిన ఓ వ్యక్తి రేషన్ సరుకులు తీసుకెళ్లడం.. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌లో ఈ ఘటన జరిగింది. నలోయన్ చౌక్‌లో ఉన్న ఓ ప్రభుత్వ రేషన్ దుకాణం ముందు ఓ లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన ఓ వ్యక్తి.. సరాసరి రేషన్ దుకాణంలోకి వెళ్లాడు. కాసేపటికి ఒక వ్యక్తితో రేషన్ సరుకుల సంచులు మోయించుకుని వచ్చి.. బెంజ్ కారు డిక్కీలో వాటిని పెట్టించుకుని వెళ్లిపోయాడు. ఇంకేం.. అక్కడే ఉన్న కొందరు ఆ ఘటనను వీడియో తీసి వైరల్ చేశారు. సరదా కోసం వాళ్లు చేసిన పని.. పెనుదుమారమే రేపింది. అర్హులు కానివాళ్లకు రేషన్ అందుతోందంటూ విమర్శలు మొదలయ్యాయి. దీంతో మీడియా సదరు రేషన్ డీలర్‌ను సంప్రదించింది. అయితే ఆ వ్యక్తికి బీపీఎల్(బిలో పావర్టీ లైన్) కార్డు ఉందని.. తాను కేవలం ఆ కార్డును పరిశీలించిన తర్వాతే రేషన్ ఇచ్చానని చెప్పాడు ఆ డీలర్. మరోవైపు బెంజ్ కారులో వచ్చిన వ్యక్తి సైతం స్పందించాడు. #Punjab person arrived in a Mercedes to buy free wheat under the Ata Dal scheme by Punjab Government. A video of #Hoshiarpur Naloyan Chowk is going viral @PMOIndia @NirmalaSitharaman @CMOPb @AamAadmiParty @ArvindKejriwal pic.twitter.com/7gFy589QAH — ASHOK VEMULAPALLI (@ashuvemulapalli) September 6, 2022 తన పేరు రమేష్ సైని అని, ఆ కారు తమ బంధువులదని, వారు విదేశాలకు వెళ్లడంతో కారును తమ ఇంటి దగ్గర పార్క్ చేశారని చెప్పాడు. డీజిల్ కారు కావడంతో అప్పుడప్పుడు దానిని వాడుతున్నట్లు చెప్పాడాయన. నేను బీదవాడినే. నాకు చిన్న వీడియోగ్రఫీ దుకాణం ఉంది. నా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. పిల్లలను ప్రైవేట్‌లో చదివించేంత డబ్బు కూడా నా దగ్గర లేదు అంటూ రమేష్ సైని వెల్లడించాడు. అయితే ఈ వివరణతో వివాదం చల్లారలేదు. పంజాబ్ ప్రభుత్వం అందిస్తున్న ఆటా దాల్ పథకంలో భాగంగా.. ఆ వ్యక్తి గోధుమల్ని రేషన్‌లో తీసుకెళ్లినట్లు తేలింది. దీంతో విమర్శల నేపథ్యంతో.. పంజాబ్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి లాల్ చంద్ కటారుచక్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇదీ చదవండి: అయ్యో.. జాలిలేకుండా చూస్తూ ఉండిపోయింది -
మితిమీరిన వేగం వల్లే... మిస్త్రీ మృతి
ముంబై: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) అంత్యక్రియలు మంగళవారం ముంబైలో జరగనున్నాయి. మృతదేహానికి సోమవారం అటాప్సీ పూర్తయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ అనాహిత పండోలే, ఆమె భర్త డేరియస్ పండోలే ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు ప్రయాణిస్తున్న బెంజ్ కారు ఆదివారం మధ్యాహ్నం ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురవడం తెలిసిందే. వెనక సీట్లో ఉన్న మిస్త్రీ, ఆయన మిత్రుడు జహంగీర్ పండోలే అక్కడికక్కడే మరణించారు. వాళ్లిద్దరూ సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు తెలిపారు. మితిమీరిన వేగం, మరో వాహనాన్ని రాంగ్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో కారు అదుపు తప్పడమే ప్రమాదానికి కారణమన్నారు. చరోటీ చెక్ పోస్టు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి కారు 9 నిమిషాల్లో చేరుకుందని వివరించారు. జర్మనీ నుంచి వచ్చిన బెంజ్ సంస్థ బృందం ఘటనా స్థలిని పరిశీలించింది. -
ఓఆర్ఆర్పై కారు ప్రమాదం.. టీఆర్ఎస్ నేత కుమారుడు దుర్మరణం
సాక్షి, రంగారెడ్డి: శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ను హ్యుందాయ్ వెర్నా కారు బలంగా ఢీకొట్టింది. కారు బోల్తాపడటంతో అందులోని యువకుడు మృత్యువాతపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. మాజీ ఎంపీపీ కొడుకు చనిపోయిన వ్యక్తిని నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ రెగట్టే మల్లికార్జున రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డిగా గుర్తించారు. దినేష్‌రెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. తమ కొడుకు కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు. నల్లగొండలోనీ వీటి కాలనీలోని రేగట్టే స్వగృహానికి ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాన్ని తరలించారు. మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శ టీఆర్ఎస్ నాయకుడు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి కుటుంబాన్ని మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి పరామర్శించారు. చదవండి: ఏడాదిన్నర కిందట పెళ్లి.. 9 నెలల బాబు.. చిన్న గొడవకే -
ఖరీదైన కారు కొన్న వెస్టిండీస్ హిట్టర్.. వీడియో వైరల్!
IPL 2022- Andre Russell: ‘‘పెద్ద పెద్ద కలలు కనాలి! అయితే, కఠిన శ్రమతో పాటు ఎన్నో త్యాగాలు చేస్తేనే వాటిని నిజం చేసుకోగలం. ఆ దేవుడు మంచివాడు! అందుకు ఆయనకు నేను రుణపడి ఉంటాను’’ అంటూ వెస్టిండీస్ హిట్టర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ తాను కారు కొన్న విషయాన్ని వెల్లడించాడు. తన పట్టుదల, కృషితో కలలను సాకారం చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022 నేపథ్యంలో కేకేఆర్ రసెల్‌ను 12 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా ఎడిషన్‌లో అతడు 12 ఇన్నింగ్స్‌లో 335 పరుగులు(అత్యధిక స్కోరు 70 నాటౌట్) చేసి ఆకట్టుకున్నాడు. ఇక 13 ఇన్నింగ్స్‌లో కలిపి 17 వికెట్లు పడగొట్టి తనకు వెచ్చించిన ధరకు న్యాయం చేశాడు ఈ ఆల్‌రౌండర్. ఇక క్యాష్ రిచ్ లీగ్ తాజా సీజన్ ముగింపు నేపథ్యంలో స్వదేశానికి చేరుకున్న రసెల్ వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించాడు. ఈ క్రమంలో ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ ఏమ్జీ(Mercedes-Benz AMG) కారును కొన్నాడు. కారులో ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేస్తూ ఆనందం పంచుకున్నాడు. ఇందుకు స్పందించిన క్రిస్ గేల్, డారెన్ సమీ, సూర్యకుమార్ యాదవ్ తదితరులు ఈ ఆల్‌రౌండర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రసెల్ కొన్న ఈ స్టైలిష్ కారు విలువ సుమారు 2 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. ఇక టీ20 ప్రపంచకప్-2021 తర్వాత జాతీయ జట్టుకు దూరమైన ఆండ్రీ రసెల్.. పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన విండీస్ జట్టులో లేకపోవడం గమనార్హం. చదవండి: Mohsin Khan: ‘4 నెలల సమయం ఇస్తే.. అతడిని ఇండియా బెస్ట్ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతా’ View this post on Instagram A post shared by Andre Russell🇯🇲 Dre Russ.🏏 (@ar12russell) -
బెంజ్ కారు కొన్న యంగ్ హీరో.. ఫోటోలు వైరల్
Aadi Sai Kumar Buys Benz Car, Pics Goes viral: ఆది సాయికుమార్ లేటెస్ట్ మూవీ 'అతిథి దేవోభవ' ప్రస్తుతం థియేటర్స్‌లో సందడి చేస్తుంది. లవ్, యాక్షన్ ఓరియెంటెండ్గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 7న థియేటర్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. పొలిమేర నాగేశ్వర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా ఈ ఏడాది కొత్త సినిమాతో పలకరించిన ఆది సాయికుమార్ ఇప్పుడు తన ఇంట్లోకి కూడా కొత్త కారును ఆహ్వానించాడు. ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేసి దానికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా భార్య, కూతురితో పాటు తండ్రి సాయికుమార్‌తో దిగిన ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఆది సాయికుమార్ చేతిలో ఆర డజనుకు పైగా సినిమాలున్నాయి. View this post on Instagram A post shared by ActorAadi (@aadipudipeddi) -
మరో కాస్ట్లీ కారు కొన్న రామ్ చరణ్, వీడియో వైరల్
Ram Charan New Car: మన స్టార్ హీరోలకు లగ్జరీ కార్లు అంటే మక్కువ ఎక్కువ. మార్కేట్లోకి వచ్చిన కొత్తరకం మోడల్ కార్లను ఎప్పుడెప్పుడు తమ ఇంటిముందు పార్క్ చేయాలాని ఎదురు చూస్తుంటారు. అందుకే కొత్తరకం కారు వచ్చిందంటే చాలు క్షణం అలస్యం చేయకుండా కొనేస్తారు. ఈ మధ్యే యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఇటలీకి చెందిన వోక్స్ వాగన్ కంపెనీ అనుబంధ సంస్థ ‘లంబోర్ఘిని’ ఊరూస్ మోడల్ లగ్జరీ కారును కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కూడా మరో న్యూ బ్రాండ్ బెంజ్ లగ్జరీ కారును సొంతం చేసుకున్నాడు. ఈ కారును చరణ్ ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నాడట. ఈ కారు పేరు మెర్సిడెస్ మేబాచ్ జీఎల్ఎస్ 600. చదవండి: ‘మా’ బాధ్యత పెద్ద హీరోల మీద కూడా ఉంది: ప్రకాశ్ రాజ్ కొద్దిసేపటి క్రితమే ఈ కారు డెలివరి కావడంతో చరణ్ దాన్ని హ్యండోవర్ చేసుకున్నాడు. అనంతరం తన టీంతో కలిసి గ్రాండ్‌గా ఓపెన్ చేసి తన కొత్త బ్లాక్ కలర్ బెంజ్ కారులోనే చరణ్ ఇంటికి బయలుదేరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ట్రక్ నుంచి దింపుతూ మొదలైన ఈ కారు వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. హై సెక్యూరిటీ, అధునాతన టెక్నాలజీతో చరణ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ కారు ధర రూ. 2.5 కోట్లు ఉంటుందట. అయితే చెర్రి దగ్గర ఇప్పటికే ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: జీవితమే పెద్ద ఛాలెంజ్, బాధగా ఉన్నా స్వీకరించాల్సిందే: అరియానా Megapower Star @AlwaysRamCharan receives his new Mercedes Maybach GLS 600 #RamCharan pic.twitter.com/AV6kK3K2UB — BA Raju's Team (@baraju_SuperHit) September 12, 2021 -
పాతబస్తీలో బెంజ్ కారు బీభత్సం ఘటన పై పోలీసులు దర్యాప్తు
-
బెంజ్ కారు బీభత్సం: ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని హుస్సేన్ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. పాదాచారులపై వేగంగా దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన శాలిబండలోని హరిబోలిలో చోటుచేసుకుంది. ఘటన జరిగిన వెంటనే కారులోని వ్యక్తి కారుతో పరారయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హరిబోలిలో రోడ్డు పనులు జరుగుతుండడంతో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో పాదాచారులు రోడ్డుకు అవతల నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో అతి వేగంగా దూసుకొచ్చిన బెంజ్ కారు వీరిని ఢీకొట్టుకుంటూ దూసుకెళ్లింది. ఆటోను కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో సలమ్మ అనే మహిళ మృతి చెందగా మరో ఏడుగురు గాయపడ్డారు. ఆటో నుజ్జునజ్జయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కారును గుర్తించే పనిలో పడ్డారు. బెంజ్ కారు యజమానిపై కేసు నమోదు చేసి శాలిబండ పోలీసులు విచారణ చేస్తున్నారు. -
హైదరాబాద్: కొత్త బెంజ్ కార్లో స్టార్ కపుల్ షికారు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ లిస్ట్‌లో అక్కినేని నాగచైతన్య-సమంత ముందు వరుసలో ఉంటారు. కెరీర్‌ని, లైఫ్‌ని బలేగా బ్యాలెన్స్ చేసుకుంటారు ఈ దంపతులు. ఇక ఏ మాత్రం టైం దొరికినా.. విదేశాలకు చెక్కేసి సేదదీరుతుంటారు. సిటీలో వీరిద్దరు జంటగా కనిపించడం చాలా అరుదు. ఒకవేళ అలా కనిపిస్తే.. ఇక ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. తాజాగా శుక్రవారం ఈ సీన్ చోటు చేసుకుంది. వీరిద్దరూ లగ్జరీ బెంజ్ కారులో సిటీలో షికారుకెళ్లారు. చై-సామ్ కారులో కార్లో వెళ్తోన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్నాయి. ఇక ఫోటోలను చూస్తే కొత్త కారు అనిపిస్తోంది. ‘‘కార్ సూపర్‌గా ఉంది.. కంగ్రాట్స్ చై-సామ్’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఇక సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్వకత్వంలో తెరకెక్కుతున్న ‘‘లవ్‌స్టోరీ’’తో బిజిగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన తరణ్ భాస్కర్ దర్వకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇక సమంత నటించిన ఫ్యామిలీ మాన్2 వెబ్ సిరీస్ విడుదల వేసవికి వాయిదా పడింది. ప్రస్తుతం సమంత విగ్నేష్ శివన్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న కాతు వాకుల రెండు కాదల్ చిత్రంలో నటిస్తున్నారు. దీనిలో నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: నా గురించే ఆలోచిస్తున్నావా?: సమంత -
2021 ప్రపంచ ఆటోమొబైల్ డే: టాప్-5 బెస్ట్ కార్స్
"కార్ల్ బెంజ్" తన మొదటి ఆటోమొబైల్ మూడు చక్రాల మోటర్వ్యాగన్ కోసం సుమారు 135 సంవత్సరాల క్రితం 1886 జనవరి 29న పేటెంట్ దాఖలు చేశారు. ఆటోమొబైల్ రంగానికి మార్గదర్శకత్వం వహించడంలో "కార్ల్ బెంజ్" కీలక పాత్ర పోషించినందున ఈ రోజును 'ప్రపంచ ఆటోమొబైల్ డే'గా జరుపుకుంటారు. ఆటోమొబైల్ చరిత్రలో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అని ఆటోమొబైల్ ప్రియులు నమ్ముతారు. ప్రపంచ ఆటోమొబైల్ డే సందర్భంగా ప్రస్తుతం మన దేశంలో ఉన్న టాప్-5 ఉత్తమ కార్లను మీకోసం అందిస్తున్నాము. (చదవండి: పాత కారు.. టాప్ గేరు!) ఆడి ఆర్ఎస్ క్యూ8 కూపే ఆడి ఆర్ఎస్ క్యూ8 కూపే ఎస్యూవీ జర్మన్ కార్ల తయారీ కంపెనీ. ప్రస్తుతం ఇది భారతదేశంలో కొనుగోలుకు సిద్ధంగా ఉంది. పనితీరు విషయానికి వస్తే- ఆడి ఆర్ఎస్ క్యూ 8 ఇంగోల్స్టాడ్ ఆధారిత కార్ల తయారీదారు నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన ఎస్యూవీ. ఇది 592 బిహెచ్పి వి8 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో తేలికపాటి-హైబ్రిడ్ వ్యవస్థను కలిగి ఉంది. ఐకానిక్ నూర్బర్గింగ్ సర్క్యూట్ ను 7 నిమిషాల 42 సెకన్ల ల్యాప్ టైమ్‌తో తిరిగిన రికార్డు దీని పేరిట ఉంది. ఇది 0 నుంచి 100కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 3.8 సెకన్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం వచ్చేసి 250 కి.మీ/గం. లంబోర్ఘిని ఉరుస్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీని మూడేళ్ల క్రితమే భారత్‌లోకి తీసుకొచ్చారు. ఇప్పటికి దీనిని తీసుకోవాలంటే 8-9 నెలల ముందు బుక్ చేసుకోవాల్సిందే. అంత క్రెజ్ ఉంది దీనికి. ఇది ఇటాలియన్ కి చెందిన కంపెనీ. దీనిలో అత్యధిక శక్తినిచ్చే 4.0-లీటర్ ట్విన్ టర్బో వి 8 ఇంజిన్ ఉంది. ఇది 641 బిహెచ్పి, 850ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 3.6 సెకన్ల సమయం తీసుకుంటే 200 కిలోమీటర్ల వేగానికి చేరుకోవడానికి 12.8 సెకెన్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం వచ్చేసి 305 కి.మీ/గం.(చదవండి: సరికొత్తగా అమెజాన్ లోగో) మసెరటి లెవాంటే లగ్జరీ కార్ల తయారీ కంపెనీ చరిత్రలో మసెరటి చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీదారు కంపెనీ. మసెరటి తన మొదటి కారు A6ను 1947సంవత్సరంలో తయారుచేసింది. ఇండియా లగ్జరీ కార్ల పోర్ట్‌ఫోలియోలో ఇది కూడా కనిపిస్తుంది. మన దేశంలో 2018 జనవరిలో విక్రయించిన మొట్టమొదటి మసెరటి ఎస్యూవీ ఇది. ఈ ఎస్యూవీ 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 271 బిహెచ్పి పీక్ పవర్, 600ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. లెవాంటే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 6.9 సెకన్ల సమయం తీసుకుంటుంది. ఇది 230 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళుతుంది. పోర్స్చే 911 టర్బో ఎస్ పోర్స్చే నుంచి వచ్చిన అన్ని కార్ల కంటే 911 టర్బో ఎస్ అందరిని ఎక్కువగా ఆకర్షించింది. భారతదేశంలో ఈ శక్తివంతమైన స్పోర్ట్స్ కారు ధర రూ. 3.08 కోట్లు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది 3.8-లీటర్, 6-సిలిండర్, ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. పోర్స్చే 911 641 బిహెచ్పి, 800 ఎన్ఎమ్ పవర్ ఫిగర్ వల్ల 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కు అనుగుణంగా ఉంటుంది. ఈ స్పోర్ట్స్ కారు 2.7 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. అలాగే 0 నుంచి 200 కిలోమీటర్లు చేరుకోవడానికి 8.9 సెకన్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం 330 కిలోమీటర్లు. రోల్స్ రాయిస్ ఘోస్ట్ రోల్స్ రాయిస్ గత సంవత్సరం భారతదేశంలో కొత్త ఘోస్ట్ యొక్క ఎక్స్టెండెడ్ వెర్షన్ ను ప్రవేశపెట్టింది. ఇది బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీదారుల కంపెనీ. దీని డెలివరీలు 2021 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఈ కారు 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి 12 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కారు మోటారు 563 బిహెచ్పి, 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రోల్స్ రాయిస్ కారులో సెల్ఫ్ లెవలింగ్ హై-వాల్యూమ్ ఎయిర్ సస్పెన్షన్ టెక్నాలజీతో పాటు ఆల్-వీల్-డ్రైవ్, ఆల్-వీల్ స్టీరింగ్‌ను అందించారు. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 250 కి.మీ. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 4.6 సెకన్ల సమయం తీసుకుంటుంది. -
తల్లిదండ్రులకు సందీప్ కానుక
హీరో సందీప్ కిషన్ తన తల్లిదండ్రులను ఓ కానుక అందజేశారు. బెంజ్ జీఎల్ఈ 350డీ మోడల్ కారును తన తల్లిదండ్రులకు అందజేసిన సందీప్.. వారిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. తనను, తన ఇష్టాలను ఎంతో ఓపికగా భరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘నన్ను, నా ఎంపికలను ఎంతో ఓపికగా భరించినందుకు అమ్మ, నాన్నకు ధన్యవాదాలు. నా వృతిల్లో ఉన్న ఒడిదుడుకులను అర్థం చేసుకోవడం ఎంతో కష్టమో నాకు తెలుసు. ఈ కానుకను మీకు అందజేయడానికి చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నాను.. లవ్ యూ. డాడీ మీరు ఎంతో జాగ్రత్తగా కారు డ్రైవ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు. కాగా, సందీప్ నటించిన తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ చిత్రం ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఏ1 ఎక్స్‌ప్రెస్ చిత్రంలో నటిస్తున్నారు. హాకీ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న ఈ చిత్రానికి డెన్నిస్ జీవన్ కనుకొల దర్శకత్వం వహిస్తున్నారు. -
గవర్నర్ కాన్వాయ్‌లో బెంజ్ కారు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కాన్వాయ్‌లో కొత్త కారు చేరింది. ఆయనకోసం ప్రభుత్వం బెంజ్ కారును కొనుగోలు చేసింది. రూ.1.69 కోట్లతో కొన్న ఎస్–450 మోడల్ బెంజ్ కారును జీఏడీ కార్యదర్శి అర్విందర్‌సింగ్ స్వయంగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు అప్పగించారు. కాగా, బెంజ్ కారు కోసం రాజ్‌భవన్ నుంచి వచ్చిన ప్రతిపాదనను ఆర్థిక శాఖ ఆమోదించి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచే ఈ మొత్తాన్ని వెచ్చిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఆ నంబర్ కోసం భారీగా చెల్లించిన బాలకృష్ణ
హైదరాబాద్ : ఎంత డబ్బు చెల్లించైనా సరే ఫ్యాన్సీ నంబర్ కోసం క్రేజీ కొనసాగుతూనే ఉంది. తాజాగా పలు ఫ్యాన్సీ నంబర్లపై రవాణా శాఖకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది. బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటల్లో పలు ప్రత్యేక నంబర్లపై రవాణాశాఖకు రూ.30.34 లక్షల ఆదాయం లభించింది. గవి కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ తమ బెంజ్ కారు కోసం 10.05 లక్షల రూపాయలు చెల్లించి వేలంలో ‘టీఎస్ 09 ఈటీ 9999’ నంబర్ సొంతం చేసుకుంది. ‘టీఎస్ 09 ఈయూ 0001’ నంబర్ కోసం సినీనటుడు నందమూరి బాలకృష్ణ రూ.7.77 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. తమ బెంట్లీ కారు కోసం ఆయన ఈ నంబర్‌ను వేలంలో గెలుచుకున్నారు. అలాగే ‘టీఎస్ 09 ఈయూ 0099’ నంబర్ కోసం ఆర్ఎస్ బ్రదర్స్ వస్త్రవ్యాపార సంస్థ రూ.2.70 లక్షలు చెల్లించింది. తమ ల్యాండ్‌రోవర్ కారు కోసం ఈ నెంబర్‌ను సొంతం చేసుకున్నారు. కాగా గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా రూ.11లక్షలు చెల్లించి ‘9999’ నంబర్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. -
కింగ్ ఖాన్ @ 50
విధి విచిత్రమైనది. ఎవరినైనా చల్లగా చూసిందంటే చాలు.. అథః పాతాళం నుంచి ఆకాశానికి ఎత్తేస్తుంది. షారుక్ ఖాన్ జీవితం అందుకు ఓ ఉదాహరణ. ఒకప్పుడు 50 రూపాయల కోసం పని చేసిన షారుక్ ఇప్పుడు కోటీశ్వరుడు. ఒకప్పుడు బతుకు బండిని లాగడానికి టీ బండి నడిపిన షారుక్ ఇప్పుడు బెంజ్ కార్లో తిరుగుతున్నాడు. ‘బాలీవుడ్ బాద్షా’, ‘కింగ్ ఖాన్’ అనే బిరుదులను సొంతం చేసుకుని, తిరుగులేని నటుడిగా దూసుకెళుతున్నాడు. నేడు ఈ బాలీవుడ్ బాద్షా 50వ పుట్టినరోజు. ఈ సందర్భంగా షారుక్ ఖాన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు. * షారుక్ ఖాన్ అసలు పేరు ‘అబ్దుల్ రహ్మాన్’. షారుక్‌కి అతని బామ్మ పెట్టిన పేరిది. అయితే, ఆ పేరుని అధికారికంగా ఎక్కడా వాడలేదు. ఐదారేళ్ల వయసు వరకూ బామ్మ దగ్గర, ఆ తర్వాత తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు ‘షారుక్ ఖాన్’. దాన్నే అధికారికంగా వాడుతున్నాడు. * ఆర్మీలో చేరాలన్నది షారుక్ కల. అందుకే ఆర్మీ స్కూల్లో చేరాడు. షారుక్ తల్లికి మాత్రం తన కొడుకు ఆర్మీలో చేరడం ఇష్టం లేదు. దాంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. * షారుక్ తండ్రి స్వాత్రంత్య సమరయోధుడు. కొంత కాలం తర్వాత చిన్న వ్యాపారం మొదలుపెట్టారాయన. ఢిల్లీలోని ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో ఓ టీ షాప్ నడిపేవారాయన. ఆ టీ షాప్‌కి వెళ్లినప్పుడే షారుక్‌కి యాక్టింగ్ మీద ఆసక్తి ఏర్పడింది. ఆ స్కూల్లోనే యాక్టింగ్ నేర్చుకున్నాడు. అప్పుడు బుల్లితెర నిర్మాతల దృష్టిలో పడ్డాడు. పలు టీవీ సీరియల్స్‌లో నటించాడు. వ్యాఖ్యాతగా కూడా చేశాడు. * షారుక్ తొలి సంపాదన 50 రూపాయలు. ప్రముఖ గాయకుడు పంకజ్ ఉదాస్ నిర్వహించిన ఓ సంగీత కచేరీలో ప్రేక్షకులకు సీట్స్ చూపించే వ్యక్తిగా పని చేసినందుకు షారుక్ తీసుకున్న జీతం అది. అప్పట్లో ఢిల్లీలో ఉండేవాడు. ఆ యాభై రూపాయలు పారితోషికం తీసుకుని ఆగ్రా వెళ్లి, తాజ్‌మహల్ చూశాడు. * స్పోర్ట్స్ అంటే షారుక్‌కి చాలా ఇష్టం. చదువుకునే రోజుల్లో ఫుట్‌బాల్, హాకీ టీమ్స్‌కి కెప్టెన్‌గా చేశాడు. జాతీయ స్థాయిలో క్రికెట్ కూడా ఆడాడు. * మధ్యతరగతి కుటుంబానికి చెందిన షారుక్ సినిమాల్లోకి రాకముందు ఢిల్లీలో ఓ రెస్టారెంట్ నడిపాడు. * షారుక్ తండ్రి 1981లో, ఆ తర్వాత పదేళ్లకు అతని తల్లి చనిపోయారు. తల్లి మరణాన్ని తట్టుకోలేక డిప్రెషన్‌కి గురయ్యాడు షారుక్. అందులోంచి బయటపడటానికి ఫుల్ టైమ్ ఆర్టిస్ట్‌గా చేయాలనుకున్నాడు. అప్పుడే ఢిల్లీ నుంచి ముంబయ్‌కి మకాం మార్చాడు. ‘దీవానా’ చిత్రంలో కథానాయికునిగా చేసే అవకాశం తెచ్చుకుని, తొలి చిత్రంలోనే మంచి గుర్తింపు సాధించారు. * ‘దీవానా’ తర్వాత వరుసగా సినిమాలు అంగీకరించేశారు. నాయకుడిగా మాత్రమే కాదు.. ‘డర్’, ‘బాజీగర్’, ‘అంజామ్’, ‘డాన్’, ‘డాన్ 2’ వంటి చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి, తనలో మంచి ప్రతినాయకుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నారు. * వ్యక్తిగతంగా షారుక్ ఖాన్ పేరు ఆయనకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. అలాగే, తెరపై ‘రాహుల్’ పేరుతో ఆయన చేసిన పాత్రలు హిట్టయ్యాయి. ‘దిల్ తో పాగల్ హై’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కభీ ఖుషీ కభీ గమ్’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’తో పాటు మరో ఐదారు చిత్రాల్లో షారుక్ పాత్ర పేరు ‘రాహుల్’. ఈ చిత్రాలన్నీ హిట్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే, ‘రాజు బన్ గయా జెంటిల్‌మేన్’, ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’,‘ చల్తే చల్తే’, ‘రబ్ నే బనా దీ జోడి’ చిత్రాల్లో ఆయన పాత్రల పేరు ‘రాజ్’ కావడం విశేషం. * దాదాపు పదహారు చిత్రాల్లో షారుక్ చనిపోతారు. వాటిలో ‘బాజీగర్’, ‘డర్’, ‘దిల్ సే’, ‘దేవ్‌దాస్’ వంటి చిత్రాలు ఉన్నాయి. * బాలీవుడ్లో ఉన్న ‘హ్యాపీ కపుల్స్’లో షారుక్, గౌరీఖాన్‌ల జంట ఒకటి. గౌరీని షారుక్ కలిసినప్పుడు అతని వయసు 18. అప్పుడు గౌరి వయసు 14. నాలుగైదేళ్లు ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లాడారు. ఈ దంపతులకు ఆర్యన్, సుహానా అనే కొడుకూ, కూతురూ ఉన్నారు. రెండేళ్ల క్రితం సరోగసీ విధానం ద్వారా పుట్టిన బాబుకి ‘అబ్రామ్’ అని పేరు పెట్టారు. * రాత్రి నిద్రపోయేటప్పుడు షారుక్ ఇస్త్రీ చేసిన పైజామాలనే వేసుకుంటారు. కలలో ఎవరైనా ప్రత్యేకమైన వ్యక్తి వస్తే.. అందుకే ఇస్త్రీ చేసిన పైజామా వేసుకుంటానని ఓ సందర్భంలో షారుక్ పేర్కొన్నారు. -
గ్రెనేడ్ల దాడిని తట్టుకునే బెంజ్ కారు
⇒ మెర్సిడెస్-బెంజ్ ఎస్ 600 గార్డ్ ⇒ ధర రూ.8.9 కోట్లు న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్, ఎస్ 600 గార్డ్ మోడల్లో అప్డేటెడ్ వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. రైఫిల్స్ దాడిని, గ్రెనేడ్, ఇతర పేలుడు పదార్ధాల దాడులను తట్టుకోగలిగే కారు ధరలు రూ.8.9 కోట్ల(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. అత్యున్నత స్థాయి అధికారులు, పారిశ్రామిక వేత్తలు లాంటి హై ప్రొఫైల్ కస్టమర్ల కోసం దీనిని రూపొందించామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ ఇబర్‌హర్డ్ కెర్న్ చెప్పారు. భారత్‌లో ఇప్పటికే ఇలాంటి రక్షణ కవచాన్ని కల్పించే గార్డ్ పోర్ట్‌ఫోలియో కార్లు.. ఈ-గార్డ్, ఎం-గార్డ్లను అందిస్తున్నామన్నారు. ఎస్ 600 గార్డ్ కారు కోసం ఇప్పటికే కొన్ని ఆర్డర్లు వచ్చాయని తెలిపారు. కారు ప్రత్యేకతలు...: అత్యున్నత రక్షణ ఫీచర్లతో ఈ కారును అందిస్తున్నామని గార్డ్ పోర్ట్‌ఫోలియో సేల్స్ అధిపతి మార్కస్ రుబెన్బర్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు ఇదని పేర్కొన్నారు. శక్తివంతమైన వీ12 ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారులో ఏర్మాటిక్ సస్పెన్షన్, ఇంటెలిజెంట్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ఆటోమేటిక్ యాక్టివేషన్‌తో కూడిన ఫైర్ ఎక్స్టింగిషర్ సిస్టమ్ వంటి ఫీచర్లున్నాయి. 350 లీటర్ల బూట్ స్పేస్, ఎనర్గైజింగ్ మస్సాజ్ ఫంక్షన్, నైట్ వ్యూ అసిస్ట్ ప్లస్, ఎల్ఈడీ ఇంటెలిజెంట్ లైట్ సిస్టమ్, 7జీ-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వంటి ఆకర్షణలున్నాయి. వెనక సీట్లను అవసరమైనప్పుడు మొబైల్ ఆఫీస్‌గా మార్చుకోవచ్చు. టైర్లు డ్యామేజీ అయినప్పటికీ, 80 కిమీ దూరం ప్రయాణించవచ్చు. 4 లేదా 5 సీట్ల వేరియంట్లలో లభ్యం.