జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) భారతీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో 'మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్ 680' (Mercedes Maybach S 680) ఒకటి. ధనవంతులు సైతం ఈ కారుని కొనుగోలు చేయడానికి వెనుకాడతారు, కానీ 33 ఏళ్ల వయసులోనే 'అభిషేక్ మాంటీ అగర్వాల్' మేబ్యాచ్ సెడాన్ కొనుగోలు చేసాడు.
పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ ఫౌండర్ అభిషేక్ మాంటీ అగర్వాల్ రూ. 4 కోట్ల విలువైన 'మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్ 680' కారు కొనుగోలు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ భయాని అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు.
అభిషేక్ మాంటీ అగర్వాల్ కొత్త బెంజ్ కారు భారత్ రిజిస్ట్రేషన్ ప్లేట్ కలిగి ఉండటం వల్ల భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ డ్రైవ్ చేయడానికి అర్హత కలిగి ఉంది. సాధారణ నెంబర్ ప్లేట్ అయితే ఈ అవకాశం ఉండదు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారినప్పుడు కొంత సమస్య ఉంటుంది.
అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ సెడాన్.. పరిమాణం పరంగా చాలా విశాలంగా ఉంటుంది. దీని పొడవు ఏకంగా 5.5 మీటర్ల. భారతీయ మార్కెట్లో ఇప్పటి వరకు అత్యంత పొడవైన కారు ఇదే కావడం గమనార్హం. హెడ్ లైట్స్, విస్తరించి ఉండే గ్రిల్, బ్రాండ్ లోగో వంటివి ముందు భాగంలో చూడవచ్చు. రియర్ ప్రొఫైల్ టెయిల్ లైట్, రియర్ స్పాయిలర్ మొదలైనవి పొందుతుంది.
(ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కన్నా ముందు రోల్స్ రాయిస్ కల్లినన్ కొన్న ఫస్ట్ ఇండియన్ ఇతడే!)
ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే లెదర్ సీట్లు, స్టీరింగ్ వీల్, టాకొమీటర్, డిజిటల్ ఓడోమీటర్ వంటివి మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ మల్టి ట్రిప్ మీటర్, వెనుక వైపు ఫోల్డింగ్ టేబుల్, రెండవ వరుస ప్రయాణికుల కోసం డిస్ప్లే వంటి అనేక లగ్జరీ ఫీచర్స్ ఉన్నాయి.
(ఇదీ చదవండి: అదిరిపోయే ఫీచర్స్ కలిగిన అద్భుతమైన 5 స్మార్ట్‌ఫోన్స్ - ధర కూడా తక్కువే!)
మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్ 680 సెడాన్ 6.0 లీటర్ టర్బోచార్జ్డ్ V12 ఇంజన్ కలిగి 603.46 bhp పవర్, 900 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టం, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment