mercedes benz
-
ఆ కార్లలో సాఫ్ట్వేర్ సమస్య.. కంపెనీ కీలక నిర్ణయం
కొరియన్ కంపెనీ కియా మోటార్స్.. ఈవీ 6 కార్లకు రీకాల్ ప్రకటించిన తరువాత, జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz).. సీ-క్లాస్, ఈ-క్లాస్ కార్లకు రీకాల్ ప్రకటించింది.రీకాల్ ప్రకటించిన కార్ల జాబితాలో.. 2022 ఏప్రిల్ 29 నుంచి 2024 ఆగస్టు 20 మధ్య తయారైన 2,543 యూనిట్ల E-క్లాస్ కార్లు & 2021 ఆగస్టు 31 నుంచి 2021 అక్టోబర్ 31 మధ్య తయారైన 3 యూనిట్ల సీ-క్లాస్ కార్లు ఉన్నాయి. ఈ కార్లలో ఇంజిన్ కంట్రోల్ యూనిట్ (ECU) సాఫ్ట్వేర్ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ ఈ రీకాల్ ప్రకటించింది.ఈసీయూ సాఫ్ట్వేర్ సమస్య కారణంగా.. ఎటువంటి హెచ్చరిక లేకుండా కారు ప్రొపల్షన్ కోల్పోయే అవకాశం ఉంది. అప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. పెట్రోల్ వేరియంట్లలో మాత్రమే ఈ సమస్య ఉన్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. కాబట్టి దీనిని సంస్థ ఉచితంగానే పరిష్కరిస్తుంది. -
70 ఏళ్ల నాటి కారు: ధర రూ. 458 కోట్లు
1954 నాటి మెర్సిడెస్ బెంజ్ కారు (Mercedes-Benz W196 R Stromlinienwagen) ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా.. సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ కారు ఫిబ్రవరి 1, 2025న జర్మనీలోని స్టుట్గార్ట్లోని మెర్సిడెస్ బెంజ్ మ్యూజియంలో ఆర్ఎమ్ సోథెబీ నిర్వహించిన వేలంలో 51 మిలియన్ యూరోలకు లేదా సుమారు 458 కోట్లకు అమ్ముడైంది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫార్ములా 1 కారుగా నిలిచింది.బెంజ్ డబ్ల్యు196 ఆర్ అనేది ఫ్యాక్టరీ నిర్మిత స్ట్రీమ్లైన్డ్ బాడీవర్క్‌తో కలిగిన నాలుగు మోడల్‌లలో ఒకటి. అయితే ఈ కారును ఎవరు కొనుగోలు చేసారు అనేదానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి వెల్లడికాలేదు. అయితే ఈ కారు 1955 మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్‌హాట్ కూపే తర్వాత ప్రపంచంలోనే రెండవ అత్యంత విలువైన కారు. ఇది (ఉహ్లెన్‌హాట్ కూపే) 2022లో సుమారు రూ. 1,266 కోట్లకు వేలం అమ్ముడైంది.సర్ స్టిర్లింగ్ మోస్ 1955 ఇటాలియన్ గ్రాన్ ప్రిక్స్‌లో W196 Rతో అత్యంత వేగవంతమైన ల్యాప్‌ను రికార్డ్ చేశాడు. ఇది డైరెక్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో 2.5-లీటర్ స్ట్రెయిట్ ఎయిట్ ఇంజన్‌ను కలిగి.. 290 హార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఇండియానాపోలిస్ మోటార్ స్పీడ్వే మ్యూజియమ్‌కు 1965లో విరాళంగా ఇచ్చింది. అప్పటి నుంచి ఆ కారు బెంజ్ మ్యూజియంలోనే ఉంది. -
సరికొత్త బెంజ్ కారు లాంచ్.. ధర ఎంతంటే?
బీఎండబ్ల్యూ ఇండియా (BMW India) తన నాల్గవ తరం ఎక్స్3 (X3)ని ఆటో ఎక్స్పో 2025లో లాంచ్ చేసింది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్ల రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 75.80 లక్షలు, రూ. 77.80 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ మోడల్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఏప్రిల్‌లో ప్రారంభమవుతాయి.2025 బీఎండబ్ల్యూ ఎక్స్3 రెండు మోడల్స్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతాయి. పెట్రోల్ మోడల్ 190 హార్స్ పవర్, 310 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డీజిల్ వెర్షన్ 197 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.లేటెస్ట్ డిజైన్ కలిగిన బీఎండబ్ల్యూ ఎక్స్3 కారు.. స్లిమ్ హెడ్‌లైట్స్, కిడ్నీ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇందులో 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్, 14.9 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే వంటివి ఉంటాయి. హీటెడ్ స్పోర్ట్స్ సీట్లు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, పార్క్ అసిస్ట్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేషన్ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, రిక్లైనింగ్ రియర్ బెంచ్ వంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి. -
ఈ ఏడాది బెంజ్ ఎనిమిది కొత్త మోడళ్లు
లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈ ఏడాది కొత్తగా ఎనిమిది మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. వీటిలో బ్యాటరీ మోడళ్లు కూడా ఉంటాయని తెలిపింది. గతేడాది 14 మోడళ్లను పరిచయం చేసినట్టు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. 2,000 యూనిట్లకుపైగా ఆర్డర్ బుక్‌తో నూతన సంవత్సరం ప్రారంభం అయిందని, ఇది కంపెనీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు. సంస్థ మొత్తం విక్రయాల్లో 50 శాతం యూనిట్లకు మెర్సిడెస్ బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రుణం సమకూర్చిందని చెప్పారు. ఇప్పటి వరకు కస్టమర్లకు రూ.10,000 కోట్ల పైచిలుకు రుణాలు మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. రెండు కొత్త మోడళ్లు..మెర్సిడెస్ భారత మార్కెట్లో గురువారం రెండు బ్యాటరీ మోడళ్లను విడుదల చేసింది. ఇందులో ఈక్యూ టెక్నాలజీతో జీ580, అలాగే అయిదు సీట్లతో కూడిన ఈక్యూఎస్ ఎస్యూవీ 450 ఉన్నాయి. ఎక్స్‌షోరూంలో జీ580 ధర రూ.3 కోట్ల నుంచి ప్రారంభం. ఒకసారి చార్జింగ్‌తో 473 కిలోమీటర్లు పరుగెడుతుంది. ఈక్యూఎస్ ఎస్యూవీ 450 ధర రూ.1.28 కోట్లు ఉంది. భారత్ మొబిలిటీ షో వేదికగా మెర్సిడెస్ మైబహ్ ఈక్యూఎస్ ఎస్యూవీ నైట్ సిరీస్ తళుక్కుమనేందుకు రెడీ అవుతోంది.ఇదీ చదవండి: అపోహలు వీడితేనే మంచి స్కోరురెండింతలైన ఈవీలు..2024లో సంస్థ దేశవ్యాప్తంగా 19,565 యూనిట్లను విక్రయించింది. 2023తో పోలిస్తే గతేడాది కంపెనీ అమ్మకాల్లో 12.4 శాతం వృద్ధి నమోదైంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ విక్రయాలు దాదాపు రెట్టింపు అయ్యాయని సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘మొత్తం అమ్మకాల్లో ఈవీల వాటా ఏడాదిలో 2.5 నుంచి 2024లో 6 శాతానికి ఎగసింది. ఇక మొత్తం అమ్మకాల్లో రూ.1.5 కోట్లకుపైగా విలువ చేసే టాప్ ఎండ్ కార్ల వాటా 25 శాతం ఉంది. వీటి సేల్స్ 30 శాతం దూసుకెళ్లాయి. ప్రస్తుతం సంస్థకు 50 నగరాల్లో 125 ఔట్లెట్స్ ఉన్నాయి. ఈ ఏడాది మరో 20 లగ్జరీ కేంద్రాలు తోడవనున్నాయి. ఫ్రాంచైజ్ భాగస్వాములు మూడేళ్లలో రూ. 450 కోట్లకుపైగా పెట్టుబడులకు కట్టుబడి ఉన్నారు’ అని అయ్యర్ వెల్లడించారు. భారత్‌లో ఎంట్రీ ఇచి్చన తొలి రెండు దశాబ్దాల్లో 50,000 పైచిలుకు మెర్సిడెస్ కార్లు రోడ్డెక్కాయి. గత 10 ఏళ్లలో కస్టమర్ల చేతుల్లోకి వెళ్లిన కార్ల సంఖ్య 1.5 లక్షల యూనిట్లు. ఇదీ భారత మార్కెట్ ప్రస్థానం అని ఆయన వివరించారు. -
మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 లాంచ్: ధర ఎంతంటే?
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) మార్కెట్లో 'ఈక్యూఎస్ 450' (EQS 450) లాంచ్ చేసింది. దీని ధర ఇప్పటికే అమ్మకానికి అందుబాటులో ఉన్న ఈక్యూఎస్ కంటే తక్కువ. ఇది 5 సీటర్ మోడల్.. కేవలం సింగిల్ మోటార్ సెటప్‌తో వస్తుంది. ఈ కారు డెలివరీలు ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.రూ. 1.28 కోట్ల ధర వద్ద లాంచ్ అయిన కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది. కానీ ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఈ కారు రేంజ్ కూడా దాని 580 మోడల్ కంటే 11 కిమీ కంటే ఎక్కువ. రేంజ్ కొంత ఎక్కువ ఉంది కాబట్టి మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు.. ముందు బంపర్, అల్లాయ్ వీల్స్ వంటి వాటిలో కొన్ని చిన్న మార్పులు చూడవచ్చు. ఇంటీరియర్ కూడా కొంత అప్డేట్స్ పొందుతుంది. ఇందులో MBUX హైపర్‌స్క్రీన్ చూడవచ్చు. లోపల గమనించాల్సిన అతిపెద్ద మార్పు మూడో వరుస సీట్లు లేకపోవడం. అయితే రెండవ వరుస సీట్లు పవర్ అడ్జస్టబుల్గా కొనసాగుతాయి. ఎక్కువ సౌలభ్యం కోసం స్లైడ్ అండ్ రిక్లైన్ రెండూ చేయవచ్చు.ఈ కొత్త లగ్జరీ కారులో 360 డిగ్రీ కెమెరా, ఎయిర్ వెంట్స్, 4 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సాఫ్ట్ క్లోజ్ డోర్లు, పుడ్ ల్యాంప్స్, ఇల్యూమినేటెడ్ రన్నింగ్ బోర్డ్‌లతో పాటు లెవల్ 2 ఏడీఏఎస్, తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు మొదలైనవి ఉన్నాయి.బెంజ్ ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు వెనుక యాక్సిల్‌పై సింగిల్ మోటార్ సెటప్ ఉంటుంది. ఇది 355 Bhp పవర్, 800 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు 6.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేహవంతం అవుతుంది. ఇందులోని 122 కిలోవాట్ బ్యాటరీ.. సింగిల్ ఛార్జీతో 671 కిమీ రేంజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: భారత్‌లోని బెస్ట్ డీజిల్ కార్లు.. ధర కూడా తక్కువే!ఈక్యూఎస్ 450 ఎలక్ట్రిక్ కారు 200 కేడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేయడానికి 31 నిమిషాల సమయం పడుతుంది. అయితే 22 కేడబ్ల్యు వాల్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి పట్టే సమయం 6.25 గంటలు. ఈ కారు డెలివరీలు కూడా ఫిబ్రవరిలోనే జరుగుతాయి.ఇండియన్ మార్కెట్లో బెంజ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ.. ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తోంది. ఇందులో భాగంగానే మెర్సిడెస్ బెంజ్ జీ క్లాస్ ఎలక్ట్రిక్ కారును కూడా లాంచ్ చేసింది. దీని ధర రూ. 3 కోట్ల కంటే ఎక్కువ. ఇది ఒక సింగిల్ చార్జితో 473 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. -
భర్తకు తెలియకుండా చేసిన పని.. బెంజ్ కంపెనీ బతికేలా చేసింది
మెర్సిడెస్ బెంజ్.. ప్రపంచ మార్కెట్లో పరిచయం అవసరంలేని బ్రాండ్. ఈ రోజు లగ్జరీ కార్ల విభాగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్న ఈ కంపెనీ ఒకప్పుడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లు, బహుశా చాలా మందికి తెలిసుండకపోవచ్చు. అయితే ఓ మహిళ తీసుకున్న నిర్ణయమే కంపెనీ నేడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..మెర్సిడెస్ బెంజ్ ఈ రోజు ఆటోమోటివ్ పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన సంస్థగా గుర్తింపు పొందింది అంటే.. దానికి కారణం 'బెర్తా బెంజ్' అనే చెప్పాలి. మొదటిసారిగా ప్రపంచానికి కార్లను పరిచయం చేసిన ఘనత కూడా ఈమె సొంతమే. ఈమె మరెవరో కాదు.. కార్ల్ ఫ్రెడరిక్ బెంజ్ భార్య.కార్ల్ ఫ్రెడరిక్ బెంజ్.. జర్మనీకి చెందిన ప్రొఫెషనల్ ఆటోమోటివ్ ఇంజనీర్, ఇంజన్ డిజైనర్ కూడా. ఈయన 1885లో బెంజ్ పేటెంట్ మోటర్‌వాగన్‌ను సృష్టించారు. ఇదే అతని మొదటి ఆటోమొబైల్. అయితే ఇది రోడ్డుపై ఎలా పనిచేస్తుందనే విషయం మీద కొంత అనుమానం మాత్రం కార్ల్ బెంజ్ మనసులో ఉండేది. కానీ బెర్తా బెంజ్ మాత్రం ఆ వాహనం మీద పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. ఈ కారణంగానే భర్తకు తెలియకుండానే ఓ పెద్ద నిర్ణయం తీసుకుంది.1888లో ఒకరోజు ఉదయం.. బెర్తా నిద్రలేచి, కార్ల్ బెంజ్‌కి తెలియజేయకుండా తన ఇద్దరు కుమారులు యూజెన్, రిచర్డ్‌లతో కలిసి కారులో ప్రయాణాన్ని ప్రారంభించింది. రోడ్డుపై వస్తున్న ఆ వాహనం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే దాన్ని మహిళ నడపడం చూసి చాలామంది మరింత ఆశ్చర్యపోయారు.నిజానికి కార్ల్ బెంజ్ తన మొదటి వాహనాన్ని రూపొందించినప్పుడు, దానిని విక్రయించడానికి చాలా కష్టపడ్డాడు. దాదాపు మూడేళ్ళ పాటు దాని అమ్మకాలు జరగలేదు. ఈ వాహనంలో బెర్తా 106 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత.. పేటెంట్ మోటర్‌వాగన్‌ను ప్రపంచం గుర్తించింది. ఆ తరువాత కంపెనీ అమ్మకాలు మొదలయ్యాయి.ఇదీ చదవండి: పెద్ద బ్యాటరీలు కలిగిన టూ వీలర్స్ ఇవే!.. రేంజ్ కూడా ఎక్కువే..బెంజ్ పేటెంట్ మోటర్వాగన్ అమ్మకాలు మొదలైన తరువాత కూడా కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీనిని కంపెనీ విజయవంతంగా పరిష్కరించింది. బెర్తా తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే.. బెంజ్ కారును ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేసింది. నేడు ఈ కంపెనీ ఏ స్థాయిలో ఉందో.. ఎంతలా ఎదిగిందో అందరికీ తెలుసు. -
జనవరి 1 నుంచి బెంజ్ కార్ల ధరలు పెంపు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. కొత్త ఏడాది జనవరి 1 నుంచి తన అన్ని రకాల కార్ల ధరల్ని 3 శాతం వరకు పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జీఎల్సీ మోడల్ నుంచి టాప్ఎండ్(ఖరీదు శ్రేణి) మేబాక్ ఈక్యూఎస్ 680 మోడల్ వరకు కారు ధరను బట్టి రూ.2 లక్షల నుంచి రూ.9 లక్షల మేర ఈ పెంపు ఉంటుందని పేర్కొంది.‘‘అధిక ఇన్పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణ పెరుగుదల వ్యాపార కార్యకలాపాలపై ఒత్తిళ్లు పెంచుతున్నాయి. కమోడిటీ ధరల్లో హెచ్చుతగ్గులు, రవాణా ఖర్చులతో గత మూడు త్రైమాసికాల నుంచి నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో ధరల పెంపు నిర్ణయం తప్పలేదు’’ అని మెర్సిడెజ్ బెంజ్ ఇండియా సీఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు. అయితే ఈ ఏడాది డిసెంబర్ 31 లోపు బుక్ చేసుకునే వాహనాలకు మాత్రం పెంపు వర్తించదని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: కేటీఎం దూకుడు.. ఒకేసారి మార్కెట్లోకి 10 కొత్త బైక్‌లు -
809కిమీ రేంజ్ అందించే బెంజ్ కారు లాంచ్: ధర ఎంతంటే?
భారతీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ తన ఈక్యూఎస్ ఎస్యూవీ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త లగ్జరీ కారు ప్రారంభ ధర రూ. 1.41 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 2 లక్షలు ఎక్కువ ఖరీదు.బీఎండబ్ల్యూ ఐఎక్స్, ఆడి క్యూ8 ఈ-ట్రాన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. కాబట్టి.. ఇది ఒక బ్లాంక్డ్ ఆఫ్ బ్లాక్ ప్యానెల్ గ్రిల్ పొందుతుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ముందు భాగంలో విస్తరించి ఉన్న లైట్బార్కు కనెక్ట్ అయి ఉంటుంది. వెనుక భాగంలో కూడా ఎల్ఈడీ టెయిల్ లాంప్ ఉంటుంది.విలాసవంతమైన క్యాబిన్ కలిగిన ఈ కారు 12.3 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 17.7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ ఫ్రంట్ ప్యాసింజర్ స్క్రీన్‌తో కూడిన హైపర్‌స్క్రీన్ సెటప్ పొందుతుంది. వీటితో పాటు ఫైవ్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఇల్యూమినేటెడ్ రన్నింగ్ బోర్డులు, 15 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్: 20 లక్షల ఉద్యోగాలు! కొత్త మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 122 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ ద్వారా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన ఈ కారు 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 809 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. -
గిన్నిస్ రికార్డుల్లోకి బెంజ్ కారు.. ఫుల్ చార్జింగ్‌తో 949 కిమీ
సింగిల్ చార్జితో 949 కిలోమీటర్ల ప్రయాణం. ఇంకేముంది గతంలో ఉన్న రికార్డును తిరగరాసి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది మెర్సిడెస్ బెంజ్ ఇండియా. ఆటోకార్ ఇండియా సహకారంతో మెర్సిడెస్ బెంజ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్ వెహికిల్ అయిన ఈక్యూఎస్ 580 4మేటిక్ బెంగళూరు నుంచి నవీ ముంబై వరకు ప్రయాణించి ఈ ఘనతను సాధించింది.ఒక వైపు భారీ వర్షాలు, రోడ్డు విస్తరణ పనులు.. మరోవైపు నగరాలు, పట్టణాల ట్రాఫిక్‌ను చేధించుకుంటూ ఏకధాటిగా ప్రయాణం సాగిందని మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. ఈ ప్రయాణినికి ఉపయోగించిన కారు మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 4మ్యాటిక్. ఇది 107.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది.ఇదీ చదవండి: వైకల్యాన్ని జయించి.. బిలియనీర్‌గా నిలిచి: జీవితాన్ని మార్చే స్టోరీసింగిల్ చార్జితో 916.74 కిమీ ప్రయాణించిన యూకేలో ‘ఫోర్డ్ మస్టాంగ్ మ్యాక్ ఈ’ కారు పేరిట ఈ గిన్నిస్ రికార్డు ఉంది. ఇప్పుడు ఈ రికార్డ్ మెర్సిడెస్ బెంజ్ సొంతం చేసుకుంది. ఈ రికార్డ్ పొందిన సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ సంతోష్ అయ్యర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీనికి కారణమైన ఆటోకార్ ఇండియా బృందానికి అభినందించారు. -
సింగిల్ ఛార్జీతో 611 కిమీ రేంజ్.. కొత్త బెంజ్ కారు వచ్చేసింది
మెర్సిడెస్ బెంజ్ ఇండియా భారతీయ మార్కెట్లో కొత్త 'మేబ్యాచ్ ఈక్యూఎస్' ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధర రూ.2.25 కోట్లు (ఎక్స్ షోరూమ్). 'లోటస్ ఎలెట్రే' ఎలక్ట్రిక్ కారు తరువాత అత్యంత ఖరీదైన కారుగా మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్ నిలిచింది.కొత్త మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ ఎలక్ట్రిక్ కారు.. బ్లాక్ గ్రిల్ ప్యానెల్ పొందుతుంది. బానెట్ మీద బ్రాండ్ లోగో, డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ అన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. హెడ్ లైట్, టెయిల్ లైట్ అన్నీ కూడా స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగా ఉన్నాయి. 11.6 ఇంచెస్ ట్రిపుల్ స్క్రీన్ డిస్ప్లే కలిగిన బెంజ్ ఈక్యూఎస్.. ముందు సీట్ల వెనుక భాగంలో కూడా 11.6 ఇంచెస్ డిస్ప్లే కూడా ఉంది. కప్ హోల్డర్లు, నాలుగు యూఎస్బీ-సీ పోర్ట్స్, కూలింగ్ కంపార్ట్మెంట్స్ మొదలైనవన్నీ ఇందులో చూడవచ్చు.మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ 680 ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. ఇది డ్యూయెల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ పొందుతుంది. ఇది 658 హార్స్ పవర్, 950 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 4.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 210 కిమీ. ఇది ఒక ఫుల్ చార్జితో 611 కిమీ రేంజ్ అందిస్తుంది.ఇదీ చదవండి: ట్యాక్స్ తక్కువ, నిరుద్యోగ నిధి.. చిన్న దేశంలో బెంగళూరు జంటమెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ ఈక్యూఎస్ కారులోని 122 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ 31 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ కారు 20 నిమిషాల చార్జితో 300 కిమీ ప్రయాణించడానికి కావాల్సిన ఛార్జ్ చేసుకుంటుంది. ఈ కారుకు ప్రస్తుతం దేశీయ విఫణిలో ప్రధాన ప్రత్యర్థులు లేదు. -
సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు
పండుగ సీజన్లో దేశీయ మార్కెట్లో లాంచ్ కావడానికి కొత్త ఎలక్ట్రిక్ కార్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్, ఎంజీ విండ్సర్ ఈవీ, బీవైడీ ఈ6 ఫేస్‌లిఫ్ట్ ఉన్నాయి. త్వరలో లాంచ్ కానున్న ఈ కొత్త కార్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన మేబ్యాచ్ ఈక్యూఎస్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటిగా నిలువనుంది. సరికొత్త ఈక్యూఎస్ సీబీయూ మార్గం ద్వారా భారతదేశానికి రానుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్ ప్రత్యేకమైన కలర్ ఆప్షన్ కలిగి ఒక సింగిల్ చార్జితో 600 కిమీ రేంజ్ అందించేలా రూపొందించారు. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 649 Bhp పవర్, 950 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు 4.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 210 కిమీ.ఎంజీ విండ్సర్ ఈవీసెప్టెంబర్ 11న ఎంజీ విండ్సర్ ఈవీ లాంచ్ కానుంది. ఇది మార్కెట్లో అడుగుపెట్టనున్న కంపెనీ మూడో ఎలక్ట్రిక్ కారు. లాంచ్ తరువాత బుకింగ్స్ ప్రారంభమవుతాయని సమాచారం. దీని ధర రూ. 20 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది.త్వరలో లాంచ్ కానున్న కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ.. కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఒక పెద్ద 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 135-డిగ్రీల రిక్లైనింగ్ ఫంక్షన్లతో రియర్ సీట్లు, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.బీవైడీ ఈ6 ఫేస్లిఫ్ట్బీవైడీ ఈ6 ఫేస్‌లిఫ్ట్ వచ్చే నెలలో లాంచ్ కానుంది. ఈ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి ఇటీవలే గ్లోబల్ మార్కెట్లో ఎం6గా లాంచ్ అయింది. కంపెనీ ఈ కారుకు సంబంధించిన టీజర్‌ను ఇప్పటికే రిలీజ్ చేసింది. ఈ కొత్త కారు 55.4 కిలోవాట్, 71.8 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ ఉంటాయి. ఇవి వరుసగా 420 కిమీ, 530 కిమీ రేంజ్ అందిస్తాయి. -
నిబంధనలు పాటించని మెర్సిడెస్ బెంజ్!.. ఎంపీసీబీ
పూణె తయారీ కేంద్రంగా ఉన్న లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్ ఇండియా' పర్యావరణ ప్రమాణాలను పాటించడం లేదని మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (MPCB) ఆరోపించింది. ప్లాంట్ కార్యకలాపాలను సమగ్రంగా సమీక్షించాలని కోరింది.మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎలాంటి వ్రాతపూర్వక నోటీసు అందుకోలేదని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. అవసరమైతే ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కంపెనీ పేర్కొంది.2024 ఆగస్టు 23న నిర్వహించిన సాధారణ తనిఖీలో.. పూణేలోని చకాన్లోని మెర్సిడెస్ బెంజ్ అసెంబ్లీ ప్లాంట్ మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (MPCB) నిర్దేశించిన కాలుష్య నియంత్రణ మార్గదర్శకాలకు కట్టుబడి లేదని గుర్తించినట్లు బోర్డు తెలిపింది. దీంతో బెంజ్ అసెంబ్లీ ప్లాంట్ మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ అధికారులను ఆదేశించింది. తక్షణ చర్యగా.. రూ. 25 లక్షల బ్యాంక్ గ్యారెంటీని జప్తు చేసినట్లు వెల్లడించింది.ఆటోమోటివ్ ఇన్నోవేషన్‌లో అగ్రగామిగా ఉన్న మెర్సిడెస్ బెంజ్ స్థిరమైన ఉత్పత్తి పద్ధతుల్లో పర్యావరణ ప్రమాణాలను పాటించకపోవడం అనేది ఆందోళన కలిగించే విషయం. ఇది బ్రాండ్ మీదున్న నమ్మకాన్ని ఒమ్ముచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్యావరణం, సుస్థిరత పద్ధతులను నిలబెట్టడానికి.. తప్పనిసరి నిబంధనలను పాటిస్తామని, ప్రమాణాలకు కట్టుబడి ఉండటానికి కంపెనీ అధిక ప్రాధాన్యతనిస్తుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా తెలిపింది. -
భారత్‌లో సరికొత్త జర్మన్ బ్రాండ్ కారు లాంచ్: వివరాలు
మెర్సిడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లో 'జీఎల్ఈ 300డీ 4మ్యాటిక్ ఏఎంజీ లైన్' లాంచ్ చేసింది. సంస్థ లాంచ్ చేసిన ఈ లగ్జరీ కారు ధర రూ. 97.85 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది.కొత్త మెర్సిడెస్ బెంజ్ కారు త్రీ-పాయింటెడ్ స్టార్ ప్యాటర్న్‌తో కూడిన డైమండ్ గ్రిల్, స్పోర్టియర్ ఎయిర్ ఇన్లెట్లు, క్రోమ్ ఇన్సర్ట్ & బ్లాక్ సరౌండ్‌తో మ్యాట్ డార్క్ గ్రేలో పెయింట్ చేసి ఉండటం చూడవచ్చు. ఇందులోని అప్డేటెడ్ ఫీచర్స్ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 300డీ 4మ్యాటిక్ ఏఎంజీ లైన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 269 హార్స్ పవర్, 550 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 48వీ మైల్డ్-హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్-జెనరేటర్ కూడా పొందుతుంది. ఇది 20 హార్స్ పవర్, 200 న్యూటన్ మీటర్ టార్క్ అదనంగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లగ్జరీ కారు టాప్ స్పీడ్ గంటకు 230 కిమీ. -
భారత్‌లో రూ.1.11 కోట్ల జర్మన్ బ్రాండ్ కారు లాంచ్ - వివరాలు
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) దేశీయ మార్కెట్లో 'ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్' కూపే లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ధర రూ.1.11 కోట్లు (ఎక్స్ షోరూమ్).బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎం40ఐకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కొత్త ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్ 2.0 లీటర్, ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 421 హార్స్ పవర్, 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది 4.7 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.కొత్త మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీఎల్సీ 43 4మ్యాటిక్ స్లోపింగ్ రూఫ్‌లైన్, స్పోర్టియర్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. ఈ కారు లోపల 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే, 11.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వంటి వాటితో పాటు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. -
ఇదే జరిగితే.. జర్మన్ బ్రాండ్ కార్ల ధరలు తగ్గుతాయి
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలోని తన తయారీ కర్మాగారంలో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను అసెంబ్లింగ్ చేయాలని యోచిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కొంత తక్కువ ఖర్చుతో కూడుకున్నదయినా.. జీరో ఎమిషన్ మొబిలిటీ సాధ్యమవుతుంది. తద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గుముఖం పడతాయి.మెర్సిడెస్ బెంజ్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ విభాగంలో.. దేశీయ విఫణిలో ఈక్యూఎస్ కారును మాత్రమే తయారు చేస్తోంది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను స్థానీకరించడానికి కావలసిన ఏర్పాట్లను చేయనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ సంతోష్ అయ్యర్ పేర్కొన్నారు.భారతదేశంలోని చకన్ ప్లాంట్‌లో కంపెనీ 2022 నుంచి బెంజ్ ఈక్యూఎస్ అసెంబ్లింగ్ ప్రారంభించింది. మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ విభాగంలో ఈక్యూఎస్ మాత్రమే కాకుండా ఈక్యూఏ, ఈక్యూబీ, ఈక్యూఈ వంటివి ఉన్నాయి. అయితే ఇండియాలో ఈక్యూఎస్ అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ కార్ల ఉత్పత్తి కూడా మన దేశంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ దేశీయ విఫణిలో తయారవుతోంది, కాబట్టి దీని ధర కొంత తక్కువగా ఉంది. లేకుంటే దీని ధర చాలా ఎక్కువగా ఉండేదని సంతోష్ అయ్యర్ వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే కంపెనీ తన ఉత్పత్తులను ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తే ధరలు తగ్గుతాయి.ఇదీ చదవండి: గౌతమ్ అదానీ కొత్త ప్లాన్.. వియత్నాంలో పోర్ట్!ధరల విషయం పక్కన పెడితే.. దేశంలో కాలుష్య భూతం ప్రజలను పట్టిపీడిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కార్బన్ ఉద్గారాలు భారీగా పెరిగిపోతాయి. ఇది జీవరాశి మనుగడకే ప్రమాద హేతువు అవుతుంది. కాబట్టి కచ్చితంగా పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయాలు పుట్టుకురావాలి. దీనిని దృష్టిలో ఉంచుకునే పలు కంపెనీలు ఇప్పటికే CNG, ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. -
మెర్సిడెస్ ఈవీ @ 66 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో ఈక్యూఏ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఆవిష్కరించింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.66 లక్షలు. కంపెనీ నుంచి చిన్న, అందుబాటు ధరలో లభించే ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే. 70.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 560 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 8.6 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 160 కిలోమీటర్లు. ఏడు ఎయిర్‌బ్యాగ్స్ ఏర్పాటు చేశారు. జీఎల్ఏ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న ఈ కాంపాక్ట్ క్రాస్ఓవర్ మెర్సిడెస్ నుంచి భారత్‌లో నాల్గవ బ్యాటరీ ఎలక్ట్రిక్ కారు. 2024 చివరినాటికి మరో రెండు ఈవీలు రానున్నాయి. తొలిసారిగా లగ్జరీ కార్ల కొనుగోలుదారులను ఆకర్షించడానికి ఎలక్ట్రిక్ ఎంట్రీ–లెవల్ మోడళ్లను కంపెనీ పరిచయం చేస్తోందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. -
ఫుల్ ఛార్జ్‌తో 560 కిమీ రేంజ్.. సరికొత్త ఎలక్ట్రిక్ కారు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' భారతీయ మార్కెట్లో సరికొత్త ఎలక్ట్రిక్ కారు 'ఈక్యూఏ' లాంచ్ చేసింది. ఈ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు 2025 జనవరి నుంచి ప్రారంభమవుతాయి.దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త 'మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ' 250 ప్లస్ అనే ట్రిమ్‌లో మాత్రమే లభిస్తుంది. దీని ధర రూ. 66 లక్షలు (ఎక్స్ షోరూమ్). మంచి డిజైన్ కలిగిన ఈ కారు పోలార్ వైట్, కాస్మోస్ బ్లాక్, మౌంటైన్ గ్రే, హై-టెక్ సిల్వర్, స్పెక్ట్రల్ బ్లూ, పటగోనియా రెడ్ మెటాలిక్, మౌంటైన్ గ్రే మాగ్నో అనే ఏడు కలర్ ఆప్షన్స్ పొందుతుంది.మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, హెడ్స్-అప్ డిస్ప్లే, ఆగ్మెంటెడ్ రియాలిటీ మావిగేషన్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా వంటి వాటితో పాటు లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ 70.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 560 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 190 హార్స్ పవర్, 385 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 8.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 160 కిమీ.ఈక్యూఏ ఎలక్ట్రిక్ కారు 100 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 35 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. స్టాండర్డ్ 11 కిలోవాట్ ఏసీ ఛార్జర్ ద్వారా 10 నుంచి 80 శాతం ఛార్జ్ కావడానికి 7:15 గంటకు పడుతుంది. మొత్తం మీద ఈ కారు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.The wait is almost over! We are ready to introduce the new all-electric Mercedes-Benz EQA to India. Get ready for a new generation of electric luxury. #SwitchOnToStandOut#EQA #MercedesBenzIndia pic.twitter.com/50EqWDwKAA— Mercedes-Benz India (@MercedesBenzInd) July 8, 2024 -
భారత్‌లో మరో బెంజ్ కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?
మెర్సిడెస్ బెంజ్ దేశీయ విఫణిలో 'మేబ్యాక్ జీఎల్ఎస్ 600 ఫేస్‌లిఫ్ట్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ. 3.35 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అప్డేటెడ్ కాస్మొటిక్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.మేబ్యాక్ GLS 600 సరికొత్త బంపర్‌ను పొందింది. ఎయిర్ ఇన్టేక్స్లోని గ్రిల్ మేబ్యాక్ లోగో నమూనాను కూడా పొందుతుంది. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ పొందుతుంది. ఇది పోలార్ వైట్, సిల్వర్ మెటాలిక్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే డ్యూయెల్ పెయింట్ స్కీమ్ అనేది ఆప్షనల్ అని తెలుస్తోంది.ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో పెద్దగా గమనించదగ్గ అప్డేట్స్ లేదు. అయితే కొత్త స్టీరింగ్ వీల్, ఏసీ వెంట్స్, అప్డేటెడ్ టెలిమాటిక్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటివి ఇందులో లభిస్తాయి. ఇందులో అదే 11.6 ఇంచెస్ ఎంబీయూఎక్స్ స్క్రీన్స్ మొదలైనవి ఉంటాయి.మెర్సిడెస్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600 ఫేస్‌లిఫ్ట్ 4.0 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 557 హార్స్ పవర్ మరియు 770 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 22 హార్స్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 48వీ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్‌ను కూడా పొందుతుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి, 4మ్యాటిక్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. -
రూ.3000 కోట్లకు జర్మన్ కంపెనీ పెట్టుబడులు?
న్యూఢిల్లీ: నూతన ఉత్పత్తులు, తయారీ కార్యకలాపాలు, డిజిటలీకరణకు ఈ ఏడాది రూ.200 కోట్లు వెచ్చించనున్నట్టు మెర్సిడెస్ బెంజ్ వెల్లడించింది. దీంతో సంస్థ భారత్‌లో పెట్టుబడి రూ.3,000 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. 2023లో కంపెనీ భారత్‌లో రికార్డు స్థాయిలో 10 శాతం వృద్ధితో 17,408 యూనిట్లను విక్రయించింది. 2024లో మూడు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తో కలిపి 12 కొత్త మోడళ్లు, వేరియంట్లను పరిచయం చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో రూ.1.5 కోట్లకుపైగా ఖరీదు చేసే టాప్ ఎండ్ మోడళ్లు సగం ఉంటాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘2024లో రెండంకెల వృద్ధి సాధిస్తాం. ఆర్డర్ బుక్ 3,000 యూనిట్లు ఉంది. అమ్మకాల్లో ఈవీల వాటా ప్రస్తుతం 4 శాతం. ఈవీల వాటా నాలుగేళ్లలో 20–25 శాతానికి చేరుకుంటుంది. ఎస్‌యూవీల వాటా 55 శాతం ఉంది. 10 నగరాల్లో కొత్తగా 20 వర్క్‌షాప్స్ ఏర్పాటు చేస్తున్నాం’ అని వివరించారు. భారత్‌లో అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్లాంట్‌ను నెలకొల్పడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలను కోరుతున్నట్లు వచ్చిన నివేదికలపై అయ్యర్ స్పందిస్తూ.. ప్రభుత్వం ఏదైనా పాలసీని ప్రకటిస్తే అది భారత్‌లో పెట్టుబడి పెట్టిన ప్రస్తుత తయారీ కంపెనీలకు కూడా ప్రయోజనకారిగా ఉంటుందని మాకు చాలా నమ్మకం ఉంది. ఈవీ విభాగంలోకి కొత్త కంపెనీని స్వాగతిస్తున్నాం. మార్కెట్లో ఈవీల స్వీకరణను ఇది మరింత తీవ్రతరం చేస్తుంది’ అని అన్నారు. కాగా, పెట్రోల్, డీజిల్ వర్షన్స్‌లో రూ.1.32 కోట్ల ప్రారంభ ధరతో జీఎల్ఎస్ లగ్జరీ ఎస్‌యూవీని మెర్సిడెస్ విడుదల చేసింది. -
ఈ నెలలో లాంచ్ అయ్యే కొత్త కార్లు.. ఇవే!
2024 మొదలైపోయింది, ఈ ఏడాది కొత్త కార్లు లాంచ్ అవ్వడానికి రెడీ అయిపోతున్నాయి. ఈ ఏడాది ఈ నెలలో దేశీయ మార్కెట్లో విడుదలయ్యే 5 కార్లు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ 2024 జనవరి 8న మెర్సిడెస్ బెంజ్ కంపెనీ తన జీఎల్ఎస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేయనుంది. అప్డేటెడ్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు సిల్వర్ షాడో ఫినిషింగ్, ఎయిర్ ఇన్లెట్ గ్రిల్స్, హై-గ్లోస్ బ్లాక్ సరౌండ్‌లతో కూడిన కొత్త ఫ్రంట్ బంపర్ వంటివి పొందుతుంది. ఇందులో 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 4 మ్యాటిక్ AWD పొందుతాయి. హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ దేశీయ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా ఆధునిక హంగులతో 'ఫేస్‌లిఫ్ట్'గా మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఇది ఈ నెల 16న అధికారికంగా మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ SUV కోసం బుకింగ్స్ ప్రారంభించిన కంపెనీ.. ధరలను లాంచ్ సమయంలో వెల్లడించనున్నట్లు సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా కొన్ని అప్డేట్స్ ఉండే అవకాశం ఉంది. కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ భారతీయ విఫణిలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న కియా సోనెట్ కూడా ఫేస్‌లిఫ్ట్ రూపంలో ఈ నెల చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ అప్డేటెడ్ కారు కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా స్టార్ట్ చేసింది. మూడు ఇంజిన్ ఎంపికలతో రానున్న ఈ కారు డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. మార్కెట్లో టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజ్జా, నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది. మహీంద్రా ఎక్స్యువీ300 ఫేస్‌లిఫ్ట్ మహీంద్రా కంపెనీ పాపులర్ కారు ఎక్స్యువీ300 కూడా ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ఈ నెల చివరి నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ 1.2 లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లకు పొందనుంది. పనితీరు పరంగా కూడా దాని స్టాండర్డ్ మోడల్‌కు ఏ మాత్రం తీసిపోదని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఎలక్ట్రిక్ ఆటోలో కనిపించిన సీఈఓ - ఆనంద్ మహీంద్రా రియాక్షన్ ఇలా.. మహీంద్రా ఎక్స్యువీ400 ఈవీ ఫేస్‌లిఫ్ట్ జనవరి చివరి నాటికల్లా దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న కార్ల జాబితాలో మహీంద్రా ఎక్స్యువీ400 ఈవీ ఫేస్‌లిఫ్ట్ కూడా ఉంది. ఇది కూడా దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఉత్తమంగా ఉండే అవకాశం ఉంది. ఇందులో వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్ చేసే 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ వంటివి ఉన్నాయి. ధరలు, రేంజ్ వంటి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. -
కొత్త కారు కష్టమే..! పెరగనున్న ఆ బ్రాండ్ ధరలు
2023 ముగియడానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. రానున్న కొత్త సంవత్సరంలో ఆటోమొబైల్ సెక్టార్‌లోని చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచడానికి చూస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2024 ప్రారంభం నుంచి 'హోండా కార్స్ ఇండియా' (Honda Cars India) కార్ల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. ముడిసరుకుల ధరలు పెరగటం వల్ల ధరల పెరుగుదల తప్పడం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ధరల పెరుగుదల ఎంత శాతం అనే వివరాలు ఈ నెల చివరి నాటికి వెల్లడించనున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ 'కునాల్ బెహ్ల్' వెల్లడించారు. భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు వెళుతున్న హోండా.. తమ ఉత్పత్తుల ధరలను పెంచినట్లయితే అమ్మకాల మీద ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు, కానీ హోండా బాటలోనే మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆడి వంటి కంపెనీలు నడుస్తుండటంతో సేల్స్ మీద ప్రభావం పెద్దగా ఉండక పోవచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: చైనా వద్దు భారత్ ముద్దు.. ఇండియాపై పడ్డ అమెరికన్ కంపెనీ చూపు.. దేశీయ దిగ్గజం టాటా మోటార్స్, జర్మన్ బేస్డ్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కూడా తమ ఉత్పత్తుల ధరలను 2024 ప్రారంభం నుంచి పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదే నిజమైతే టాటా, బెంజ్ కార్లు కొత్త సంవత్సరంలో ఖరీదైనవిగా మారతాయి. -
చిరంజీవి సినిమాతో ఫేమస్ అయిన బ్యూటీ కొత్త కారు చూశారా? (ఫోటోలు)
-
చిరంజీవితో స్టెప్పులేసిన బ్యూటీ.. ఇప్పడు కారు కొన్న ఆనందంలో..
ప్రముఖ నటి 'గౌహర్ ఖాన్' (Gauahar Khan) ఇటీవల ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈమె కొన్న ఆ కారు ఏది? దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నా పేరే కాంచనమాలా పాటతో శంకర్ దాదా MBBS సినిమాలో చిరంజీవితో స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకులను అలరించిన 'గౌహర్ ఖాన్' కొనుగోలు చేసిన లగ్జరీ కారు 'మెర్సిడెస్ బెంజ్' కంపెనీకి చెందిన 'జీఎల్ఈ'. ఈ కారు ధర సుమారు రూ. కోటి కంటే ఎక్కువ అని తెలుస్తోంది. ఈ కారుని డెలివరీ చేసుకోవడానికి సంబంధించిన ఫోటోలను ముంబైలోని కంపెనీ అధీకృత మెర్సిడెస్-బెంజ్ డీలర్ అయిన ఆటోహంగర్ అండ్ గ్లామర్ డైరీస్ ఫోటోలను, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీడియోలో గమనించినట్లైతే గౌహర్ ఖాన్ తన భర్త జైద్ దర్బార్తో కలిసి ముంబైలోని మెర్సిడెస్-బెంజ్ డీలర్‌షిప్‌లోకి వెళ్లడాన్ని చూడవచ్చు. లగ్జరీ కారుని మాత్రమే కాకుండా వీరు తమ పిల్లల కోసం ఓ బొమ్మ బెంజ్ కారుని కొన్నట్లు తెలుస్తోంది. వీడియోలో ఈ చిన్న కారు కూడా పార్క్ చేసి ఉండటం చూడవచ్చు. గౌహర్ ఖాన్ తన భర్త జైద్ దర్బార్ ఇద్దరూ బొమ్మ కారుని ఆవిష్కరించిన తరువాత, బెంజ్ కారుని ఆవిష్కరించారు. ఇది బెంజ్ GLE300d LWB వెర్షన్ అని తెలుస్తోంది. ఇది మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇదీ చదవండి: ఆ రోజు మీటింగ్‌లో కూడా సత్య నాదెళ్లకు అదే ధ్యాస.. బ్లాక్ షేడ్‌లో కనిపించే ఈ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ కలిగి 245 పీఎస్ పవర్, 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9జీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఉత్తమ పనితీరుని అందిస్తుంది. ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ కారు వాహన వినియోగదారుల భద్రతకు పెద్ద పీట వేస్తుంది. View this post on Instagram A post shared by Mercedes-Benz Auto Hangar India Pvt Ltd (@autohangar) -
నయనతార కోసం ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఫోటోలు వైరల్
Mercedes-Benz Maybach: ప్రముఖ నటి నయనతార నవంబర్ 18న తన 39వ పుట్టినరోజు జరుపుకుంది. బర్త్‌డే జరిగిన రెండు వారాల తరువాత తన భర్త శివన్ నుంచి ఓ ఖరీదైన గిఫ్ట్ అందుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నయనతార కోసం.. శివన్ సుమారు రూ. 3 కోట్ల జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఖరీదైన గిఫ్ట్ అందుకున్న నయన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలు షేర్ చేస్తూ.. వెల్కమ్ హోమ్ యూ బ్యూటీ అంటూ.. మై డియర్ హస్బెండ్, మధురమైన పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు, లవ్ యు అంటూ వెల్లడించింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు తమదైన రీతిలో శుభాకంక్షలు తెలియజేస్తున్నారు. నయనతార గిఫ్ట్‌గా పొందిన కారు మెర్సిడెజ్ బెంజ్ మేబ్యాచ్ అని తెలుస్తోంది. అయితే ఇందులో ఏ మోడల్ అనేది స్పష్టంగా తెలియడం లేదు. బెంజ్ మేబ్యాచ్ కార్లు జీఎల్ఎస్, ఎస్-క్లాస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తున్నాయి. ఈ రెండు లగ్జరీ కార్ల ధరలు రూ. 3 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఇదీ చదవండి: రతన్ టాటా మేనేజర్ కొత్త కారు ఇదే.. చూసారా! ఇప్పటికే ఈ లగ్జరీ కారుని దీపికా పదుకొణె, కృతి సనన్, రామ్ చరణ్ వంటి ప్రముఖ సినీతారలు కూడా కొనుగోలు చేశారు. భారతదేశంలో లభిస్తున్న అత్యంత ఖరీదైన బీవేంజ్ కార్లలో మేబ్యాచ్ కూడా ఒకటి. ఇది చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగి, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఈ కారణంగానే చాలామంది సెలబ్రిటీలు దీనిని ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) -
సైనా నెహ్వాల్ గ్యారేజిలో చేరిన కొత్త అతిథి - వీడియో వైరల్
ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ 'సైనా నెహ్వాల్' ఇటీవల తన గ్యారేజిలో ఓ ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని చేర్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సైనా నెహ్వాల్ కొన్న కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'AMG GLE 53 4MATIC+ Coupe'. దీని ధర రూ.1.8 కోట్లు. బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తరువాత ఈ కారుని కొన్న వ్యక్తి 'సైనా నెహ్వాల్' కావడం విశేషం. కారు డెలివరీకి సంబంధించిన ఫోటోలను ఈమె తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేసింది. మెర్సిడెస్ ఏఎంజీ జీఎల్ఈ దేశీయ మార్కెట్లో ఖరీదైన కార్ల జాబితాలో ఒకటైన 'మెర్సిడెస్ ఏఎంజీ జీఎల్ఈ' మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 3.0 లీటర్ 6 సిలిండర్ ఇన్లైన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది. ఇంజన్ గరిష్టంగా 435 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు 5.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 249 కిమీ. ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడం.. ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో రెండు 12.3 ఇంచెస్ డిస్ప్లేలు ఉంటాయి. ఒకటి ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, మరొకటి డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. వీటితో పాటు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, 13 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి. View this post on Instagram A post shared by SAINA NEHWAL (@nehwalsaina) -
ఇలాంటి బెంజ్ కారు ఎప్పుడైనా చూసారా! ఇండియాలో ఇదే ఫస్ట్ టైమ్..
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇప్పటికే భారతీయ మార్కెట్లో అనేక ఆధునిక మోడల్స్ ప్రవేశపెట్టి అత్యధిక ప్రజాదరణ పొందింది. కాగా ఇటీవల ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్లో విజన్ మేబ్యాక్ 6 ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. మెర్సిడెస్ బెంజ్ ప్రదర్శించిన ఈ కొత్త కారు దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉండటం గమనించవచ్చు. 2016లో కాలిఫోర్నియాలోని పెబుల్ బీచ్‌లో అడుగుపెట్టి ఈ కారు దాదాపు 7 సంవత్సరాలకు దేశీయ విఫణిలో కనిపించింది. దాదాపు 6 మీటర్ల పొడవున్న ఈ కారు డిజైన్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. కావున ఇది ఒక్క చూపుతోనే చూపరులను ఆకట్టుకుంటుంది. ఎల్ఈడీ లైట్స్, ఇంటిగ్రేటెడ్ డిఫ్యూజర్, 24 ఇంచెస్ వీల్స్ వంటివి ఇందులో కనిపిస్తాయి. అయితే ఇంటీరియర్ ఫీచర్స్ గురించి కంపెనీ వెల్లడించలేదు. ఇదీ చదవండి: ఆ ఒక్క కారణంతో ఇస్రోలో పని చేసేందుకు ఇష్డపడట్లేదు.. నిజాలు బయటపెట్టిన ఛైర్మన్ 80 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ కారు నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లతో 750 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక చార్జితో ఏకంగా 500 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ లేటెస్ట్ లగ్జరీ బెంజ్ కారు గురించి చాలా వివరాలు తెలియాల్సి ఉంది. -
భారత్ మీదే ఆశలన్నీ.. జర్మన్, జపనీస్ కంపెనీల తీరిది!
భారతదేశంలో పండుగ సీజన్ ఇప్పటికే ప్రారంభమైపోయింది. ఈ సందర్భంగా చాలా మంది కొత్త కార్లను లేదా బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీంతో మార్కెట్లో ఆటోమొబైల్ విక్రయాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. లగ్జరీ వాహన తయారీ సంస్థలు ఈ సమయం కోసం వేచి చూస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, ఆడి కంపెనీలతో పాటు జపనీస్ కంపెనీ లెక్సస్ కూడా పండుగ సీజన్లో తమ అమ్మకాలు పెరుగుతాయని భావిస్తున్నాయి. ఈ ఏడాది పండుగ సీజన్ నాలుగు నెలల పాటు ఉంటుందని ఈ సమయంలో అమ్మకాల వృద్ధి ఎక్కువగా ఉంటుందని బెంజ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ 'సంతోష్ అయ్యర్' తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో సాధారణ కార్లతో పాటు హై ఎండ్ కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఖరీదైన కార్లు దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేస్తున్నాయి. గతం కంటే దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ వృద్ధి చెందుతోందని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ 'నవీన్ సోనీ' అన్నారు. ఇదీ చదవండి: దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ ఎందుకు పెరుగుతోంది? కారణం ఇదేనా! 2022 పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏట లగ్జరీ కార్ల బుకింగ్స్ & అమ్మకాలు తప్పకుండా పెరుగుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు. ఆడి ఇండియా హెడ్ 'బల్బీర్ సింగ్ ధిల్లాన్' ఈ ఏడాది ప్రథమార్థంలో కంపెనీ 3,474 యూనిట్లను రిటైల్ చేసి 97 శాతం వృద్ధిని సాధించిందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: కష్టాలు భరించలేక ఆత్మహత్యాయత్నం.. నెలకు రూ.60 అందుకునే స్థాయి నుంచి వందల కోట్లు.. ఆడి ఏ4, ఏ6, క్యూ3 అండ్ క్యూ5 వంటి మోడళ్లకు దేశీయ విఫణిలో బలమైన డిమాండ్ ఉందని ధిల్లాన్ వెల్లడించారు. వీటితో పాటు క్యూ8 ఈ-ట్రాన్, క్యూ8 స్పోర్ట్‌బ్యాక్ ఈ-ట్రాన్లతో ఈవీ పోర్ట్‌ఫోలియో రోజు రోజుకి విస్తరిస్తోంది. ఇటీవల కంపెనీ క్యూ8 లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసింది. ఈ ఏడాది పండుగ సీజన్ మొత్తంలో దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు 10 లక్షల యూనిట్లు దాటవచ్చని అంచనా. -
నటి తాప్సీ కొత్త కారు ఇదే.. ధర తెలిస్తే అవాక్కవుతారు!
'ఝుమ్మంది నాదం'తో తెలుగు చలన చిత్ర సీమలో అడుగుపెట్టిన 'తాప్సీ' ఆ తరువాత షాడో, వీర వంటి సినిమాలతో తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈమె గణేష్ చతుర్థి సందర్భంగా ఒక ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నటి తాప్సీ కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'జిఎల్ఎస్ 600'. దీని ధర రూ. 3 కోట్లు కంటే ఎక్కువే. దీనిని కంపెనీ ఆదివారం ఆమె ముంబై నివాసంలో డెలివరీ చేసింది. పల్లాడియం సిల్వర్ కలర్ ఆప్షన్ కలిగిన ఈ కారు తన గ్యారేజిలో చేరిన రెండవ బెంజ్ కారు. తాప్సీ గ్యారేజిలో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ, జీప్ కంపాస్, బీఎండబ్ల్యూ 3-సిరీస్, ఆడి ఏ8ఎల్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి జిఎల్ఎస్ 600 చేరింది. ఈ కొత్త కారు చాలా లగ్జరీ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇక మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 600 విషయానికి వస్తే.. 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 పెట్రోల్ ఇంజన్ కలిగి 550 హెచ్‌పి పవర్ అండ్ 730 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఇది EQ బూస్ట్ టెక్నాలజీ కూడా పొందుతుంది. కావున అదనపు పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇదీ చదవండి: ఇదే జరిగితే 'డిస్నీ ఇండియా' ముఖేష్ అంబానీ చేతికి! జిఎల్ఎస్ 600 పెద్ద 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే & 12.3 ఇంచెస్ డ్రైవర్ డిస్ప్లే కలిగి కారుకి సంబంధించిన అన్ని వివరాలు డ్రైవర్‌కి అందిస్తుంది. అంతే కాకుండా నప్పా లెదర్ అపోల్స్ట్రే, రిక్లైనింగ్ రియర్ సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, రిఫ్రిజిరేటర్ కంపార్ట్మెంట్ కలిగిన రియర్ సీట్లు మొదలైన ఆధునిక ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. ఇదీ చదవండి: గడ్కరీ చెప్పినా అప్పటివరకు తప్పదు.. టాటా ఎండీ శైలేశ్ చంద్ర ఇప్పటికే ఈ ఖరీదైన లగ్జరీ కారుని ఆయుష్మాన్ ఖురానా, దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్, కృతి సనన్, అజయ్ దేవగన్, ఆదిత్య రాయ్ కపూర్, అర్జున్ కపూర్, శిల్పా శెట్టి మాత్రమే కాకుండా ఆర్ఆర్ఆర్ నటుడు రామ్ చరణ్ కూడా కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ కారుపై సెలబ్రిటీలకు ఎంత మక్కువ ఉందో ఇట్టే అర్థమైపోతోంది. -
మెర్సిడెస్ బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..సింగిల్ ఛార్జ్‌తో 550 కిలోమీటర్లు..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఈ 500 4మేటిక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1.39 కోట్లు. బ్యాటరీపై 10 ఏళ్లు లేదా 2,50,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఉంది. 90.56 కిలోవాట్ అవర్ బ్యాటరీ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 465–550 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు గరిష్ట వేగం 210 కిలోమీటర్లు. పొడవు 4,863 మిల్లీమీటర్లు ఉంది. సీమ్‌లెస్ గ్లాస్ కవర్‌తో 12.3 అంగుళాల డ్రైవర్ డిస్ప్లే, 17.7 అంగుళాల ఓలెడ్ సెంట్రల్ డిస్ప్లే, 12.3 అంగుళాల ఓలెడ్ ఫ్రంట్ ప్యాసింజర్ డిస్ప్లే ఏర్పాటు చేశారు.థర్మోట్రానిక్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాక్టివ్ స్టీరింగ్ అసిస్ట్, యాక్టివ్ లేన్ కీపింగ్ అసిస్ట్, ట్రాన్స్పరెంట్ బానెట్, 360 డిగ్రీల కెమెరా వంటి హంగులు ఉన్నాయి. కాగా, మెర్సిడెస్కు చెందిన చార్జింగ్ కేంద్రాల్లో ఇతర బ్రాండ్ల కార్లకు సైతం చార్జింగ్ సదుపాయం కల్పిస్తారు. -
చంద్రయాన్-3 బడ్జెట్ కంటే ఖరీదైన కారు.. ఓ లుక్కేసుకోండి!
1955 Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupe: చంద్రయాన్-3 ఇటీవల చంద్రుని మీద అడుగుపెట్టి భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా చరిత్రలో 'ఇండియా' పేరు సువర్ణాక్షరాలతో లికించడానికిది దోహదపడింది. అరుదైన గొప్ప రికార్డుని సొంతం చేసుకున్న చంద్రయాన్-3 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు రూ.615 కోట్ల బడ్జెట్ వెచ్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు విక్రయించిన అత్యంత ఖరీదైన ఒక బెంజ్ కారు భారతీయ చంద్రయాన్-3 బడ్జెట్ కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ కారు ఏది? దాని ఖరీదెంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1955 మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్‌హాట్ కూపే.. నివేదికల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు 1955 మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ 'ఉహ్లెన్‌హాట్ కూపే' (1955 Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupe) అని తెలుస్తోంది. ఈ కారుని వేలం పాటలో 143 మిలియన్ డాలర్లకు విక్రయించారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది దాదాపు రూ. 1203 కోట్లు. జర్మనీలో స్టుట్గార్ట్లోని మెర్సిడెస్ బెంజ్ మ్యూజియంలో ఆర్ఎమ్ సోథెబీస్ నిర్వహించిన ఒక ప్రైవేట్ వేలంలో ఈ కారు కనీవినీ ఎరుగని ధరకు అమ్ముడైంది. ఈ కారు ఎందుకు ఇంత ఖరీదైనదంటే? ఇలాంటి మోడల్స్ ప్రపంచంలో కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న పుష్ప నటుడు - ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు! నిజానికి ఈ కార్లు లే మాన్స్‌లో రేసింగ్‌కు వెళ్ళడానికి అనుకూలంగా బెంజ్ కంపెనీ తయారు చేయడం జరిగింది. దీని సృష్టించిన సృష్టికర్త పేరునే ఈ కారుకి పెట్టడం ఇక్కడ గమనించవలసిన విషయం. ఈ కారు గరిష్ట వేగం 180 మైల్స్/గం (గంటకు 289.6 కిమీ) అని తెలుస్తోంది. ఈ కారు చాలా రేసుల్లో ఉపయోగించిన తరువాత కేవలం సెలబ్రిటీలను రవాణా చేయడానికి ఉపయోగించారు. -
Shriya Saran: మెర్సిడస్ బెంజ్ కారు ప్రారంభోత్సవంలో ర్యాంపుపై శ్రియా హొయలు (ఫొటోలు)
-
భారత్‌లో మరో బెంజ్ కారు లాంచ్ - ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: లగ్జరీ వాహనాల తయారీలో ఉన్న మెర్సిడెస్–బెంజ్ ప్రీమియం ఎస్యూవీ జీఎల్సీ కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ఈ కారు ప్రారంభ ధర రూ.73.5 లక్షలు. పెట్రోల్, డీజిల్ పవర్‌ట్రెయిన్స్‌తో లభిస్తుంది. ఇప్పటికే 1,500ల పైచిలుకు బుకింగ్స్ నమోదయ్యాయని కంపెనీ ప్రకటించింది. భారత్‌లో మెర్సిడెస్కు అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్యూవీ ఇదే. తొలిసారిగా మెర్సిడెస్ కార్లలో ఎన్టీజీ 7 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను పొందుపరిచారు. 2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో తయారైన జీఎల్సీ 300 4మేటిక్ గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు. -
భారత్‌లో పవర్ఫుల్ కారు లాంచ్ చేసిన మెర్సిడెస్ బెంజ్ - ధర ఎంతంటే?
Mercedes Benz AMG SL 55: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్ ఇండియా' (Mercedes Benz India) ఎట్టకేలకు దేశీయ విఫణిలో 'AMG SL 55' అనే మరో ఖరీదైన కారుని అధికారికంగా విడుదల చేసింది. ఈ కారు ధర, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మెర్సిడెస్ బెంజ్ 'ఏఎమ్‌జీ ఎస్ఎల్ 55' ప్రారంభ ధర రూ. 2.35 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది సీబీయు (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా మన దేశంలో అమ్ముడవుతుంది. రెండు డోర్లు కలిగిన ఈ కారు ఫోర్ సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. డిజైన్ & డైమెన్షన్ (కొలతలు) డిజైన్ విషయానికి వస్తే, ఇందులో పనామెరికానా ఫ్రంట్ గ్రిల్, యాంగ్యులర్ ఎల్ఈడీ హెడ్‌లైట్, రెండు పవర్ డోమ్లతో కూడిన పొడవైన బోనెట్, పెరిగిన విండ్‌స్క్రీన్, క్వాడ్ ఎగ్జాస్ట్‌లు, 20 ఇంచెస్ అల్లాయ్ వంటివి ఉన్నాయి. ఇందులో ట్రిపుల్-లేయర్ ఫాబ్రిక్ రూఫ్ ఉంటుంది. ఇది ఓపెన్ చేయడానికి లేదా క్లోజ్ చేయడానికి కేవలం 16 సెకన్ల సమయం పడుతుంది. ఇది బ్లాక్, డార్క్ రెడ్, గ్రే కలర్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. కాగా కారు మొత్తం అబ్సిడియన్ బ్లాక్, సెలెనైట్ గ్రే, హైపర్ బ్లూ, ఆల్పైన్ గ్రే, ఒపలైట్ వైట్ బ్రైట్, స్పెక్ట్రల్ బ్లూ మాగ్నో, పటగోనియా రెడ్ బ్రైట్, మోన్జా గ్రే మాగ్నో అనే ఎనిమిది కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఏఎమ్‌జీ ఎస్ఎల్ 55 పరిమాణం పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 4705 మిమీ, వెడల్పు 1915 మిమీ, ఎత్తు 1359 మిమీ వరకు ఉంటుంది. కావున వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇంటీరియర్ ఫీచర్స్ ఏఎమ్‌జీ ఎస్ఎల్ 55 ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 11.9 ఇంచెస్ వర్టికల్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇది లేటెస్ట్ MBUX ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పొందుతుంది. ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్, దాని వెనుక ఆప్షనల్ హెడ్స్-అప్ డిస్ప్లే వంటి వాటితో పాటు అల్యూమినియం అండ్ కార్బన్ ఫైబర్ అనే రెండు ఇంటీరియర్ ట్రిమ్స్ మొదలైనవి లభిస్తాయి. (ఇదీ చదవండి: మూడు పదుల వయసుకే కోట్ల విలువైన కారు - ఎవరీ యంగెస్ట్ ఇండియన్?) ఇంజిన్ మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జీ ఎస్ఎల్ 55 4.0 లీటర్ లీటర్ ట్విన్ టర్బో, వి8 పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 476 హార్స్ పవర్ 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది కేవలం 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని చేరుకునే ఈ కారు గరిష్ట వేగం 295 కిమీ/గం. (ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కన్నా ముందు రోల్స్ రాయిస్ కల్లినన్ కొన్న ఫస్ట్ ఇండియన్ ఇతడే!) ప్రత్యర్థులు దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జీ ఎస్ఎల్ 55 కారు పోర్స్చే 911 కర్రెరా ఎస్ క్యాబ్రియోలెట్, లెక్సస్ 500హెచ్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమాంకాల పరంగా ఇది కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. -
మూడు పదుల వయసుకే కోట్ల విలువైన కారు - ఎవరీ యంగెస్ట్ ఇండియన్?
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) భారతీయ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో 'మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్ 680' (Mercedes Maybach S 680) ఒకటి. ధనవంతులు సైతం ఈ కారుని కొనుగోలు చేయడానికి వెనుకాడతారు, కానీ 33 ఏళ్ల వయసులోనే 'అభిషేక్ మాంటీ అగర్వాల్' మేబ్యాచ్ సెడాన్ కొనుగోలు చేసాడు. పర్పుల్ స్టైల్ ల్యాబ్స్ ఫౌండర్ అభిషేక్ మాంటీ అగర్వాల్ రూ. 4 కోట్ల విలువైన 'మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్ 680' కారు కొనుగోలు చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ భయాని అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు. అభిషేక్ మాంటీ అగర్వాల్ కొత్త బెంజ్ కారు భారత్ రిజిస్ట్రేషన్ ప్లేట్ కలిగి ఉండటం వల్ల భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ డ్రైవ్ చేయడానికి అర్హత కలిగి ఉంది. సాధారణ నెంబర్ ప్లేట్ అయితే ఈ అవకాశం ఉండదు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారినప్పుడు కొంత సమస్య ఉంటుంది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ సెడాన్.. పరిమాణం పరంగా చాలా విశాలంగా ఉంటుంది. దీని పొడవు ఏకంగా 5.5 మీటర్ల. భారతీయ మార్కెట్లో ఇప్పటి వరకు అత్యంత పొడవైన కారు ఇదే కావడం గమనార్హం. హెడ్ లైట్స్, విస్తరించి ఉండే గ్రిల్, బ్రాండ్ లోగో వంటివి ముందు భాగంలో చూడవచ్చు. రియర్ ప్రొఫైల్ టెయిల్ లైట్, రియర్ స్పాయిలర్ మొదలైనవి పొందుతుంది. (ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కన్నా ముందు రోల్స్ రాయిస్ కల్లినన్ కొన్న ఫస్ట్ ఇండియన్ ఇతడే!) ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్ ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే లెదర్ సీట్లు, స్టీరింగ్ వీల్, టాకొమీటర్, డిజిటల్ ఓడోమీటర్ వంటివి మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ మల్టి ట్రిప్ మీటర్, వెనుక వైపు ఫోల్డింగ్ టేబుల్, రెండవ వరుస ప్రయాణికుల కోసం డిస్ప్లే వంటి అనేక లగ్జరీ ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: అదిరిపోయే ఫీచర్స్ కలిగిన అద్భుతమైన 5 స్మార్ట్‌ఫోన్స్ - ధర కూడా తక్కువే!) మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్ 680 సెడాన్ 6.0 లీటర్ టర్బోచార్జ్డ్ V12 ఇంజన్ కలిగి 603.46 bhp పవర్, 900 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. కావున అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఇందులో మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టం, ట్రాక్షన్ కంట్రోల్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. -
మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్ల చరిత్రకు ఇదే నిదర్శనం (ఫోటోలు)
-
జర్మన్ లగ్జరీ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ కపుల్స్ - ఫోటోలు
గత కొన్ని రోజులకు ముందు మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన బాలీవుడ్ లవ్‌బర్డ్స్ 'ఆదిత్య సీల్, అనుష్క రంజన్' ఇటీవల ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బాలీవుడ్ కపుల్ సొంతం చేసుకున్న ఈ కారు ధర ఎంత? దాని ప్రత్యేకతలు ఏంటి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఆదిత్య సీల్, అనుష్క రంజన్ మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'న్యూ మెర్సిడెస్ ఈ-350డి ఏఎమ్‌జి' (Mercedes E-350d AMG) కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ లగ్జరీ సెడాన్ ధర సుమారు రూ. 1 కోటి వరకు ఉంటుంది. ఈ కారు డెలివరీకి సంబంధించిన ఫోటోలు డీలర్షిప్ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఇందులో ఆదిత్య సీల్, అనుష్క రంజన్ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక మెర్సిడెస్ ఈ-350డి ఏఎమ్‌జి విషయానికి వస్తే, ఇది దేశీయ మార్కెట్లో ఎక్కువమంది సెలబ్రిటీలు కోరుకునే బెస్ట్ మోడల్. ఇది మంచి ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ కలిగి, మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇందులో ఐకానిక్ మెర్సిడెస్ గ్రిల్, త్రీ-పాయింటెడ్ స్టార్ ఎంబ్లమ్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్, టెయిల్‌లైట్స్ వంటివి ఉన్నాయి. క్యాబిన్ కూడా క్వాలిటీ మెటీరియల్ పొందుతుంది. ఇందులో ఖరీదైన లెదర్ సీట్లు, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్ మరియు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: ట్రక్కులందు ఈ ట్రక్కు వేరయా.. దీని గురించి తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తది!) మెర్సిడెస్ బెంజ్ 3 లీటర్ వి6 ఇంజిన్ కలిగి 286 hp పవర్ అండ్ 600 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. ఈ సెడాన్ టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ వరకు ఉంటుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా ఆధునికంగా ఉంటాయి, ఇవన్నీ వాహనం వినియోగదారుల భద్రతను నిర్ధరిస్తాయి. (ఇదీ చదవండి: సగం జీతానికి పనిచేసిన 'నారాయణ మూర్తి' బిలీనియర్ ఎలా అయ్యాడంటే?) View this post on Instagram A post shared by Mercedes-Benz Auto Hangar India Pvt Ltd (@autohangar) -
రూ. 2.55 కోట్ల మెర్సిడెస్ జీ–క్లాస్ - పూర్తి వివరాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో జీ–క్లాస్ ఎస్‌యూవీని విడుదల చేసింది. జీ–400డీ అడ్వెంచర్ ఎడిషన్, జీ–400డీ ఏఎంజీ లైన్ వేరియంట్లలో ఈ కారును ప్రవేశపెట్టింది. ప్రారంభ ధర రూ.2.55 కోట్లు. అక్టోబర్–డిసెంబర్లో డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. గతేడాదితో పోలి స్తే 2023 జనవరి–మార్చిలో 17 శాతం వృద్ధితో కంపెనీ భారత్‌లో 4,697 యూనిట్లను విక్రయించింది. -
మీరెప్పుడూ చూడని మెర్సిడెస్ బెంజ్ కార్లు (ఫోటోలు)
-
సంపాదనలో మాత్రమే కాదు లగ్జరీ కార్ల విషయంలో అంతకు మించి
Kumar Mangalam Birla Car Collection: భారతదేశంలో ఉన్న అగ్రశ్రేణి ధనవంతులలో ఒకరైన 'కుమార్ మంగళం బిర్లా' (Kumar Mangalam Birla) గురించి దాదాపు అందరికి తెలుసు. ఈయన ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ మాత్రమే కాకుండా.. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌కి ఛాన్సలర్ కూడా. గతంలో ఈయన సక్సెస్ సీక్రెట్, నికర ఆస్తులు వంటి వాటిని గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ కథనంలో మంగళం బిర్లా ఉపయోగించే లగ్జరీ కార్లను గురించి తెలుసుకుందాం. రోల్స్ రాయిస్ ఘోస్ట్ (Rolls Royce Ghost) ప్రముఖ పారిశ్రామిక వేత్త కుమార్ మంగళం బిర్లా ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కారుని (రోల్స్ రాయిస్ ఘోస్ట్) కలిగి ఉన్నారు. ఈ కారు ఖరీదు రూ. 8 కోట్లు (ఎక్స్-షోరూమ్). అయితే ఇది కొంత కస్టమైజేషన్ పొందినట్లు తెలుస్తోంది. సుమారు రూ. 9 కోట్లు వరకు ఉండవచ్చు. ఈ కారుని ఆయన అప్పుడప్పుడు మాత్రమే వినియోగిస్తారని సమాచారం. ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత విలాసవంతమైన కార్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ రోల్స్ రాయిస్ ఘోస్ట్ ముఖేష్ అంబానీ వంటి పారిశ్రామిక వేత్తల గ్యారేజిలో కూడా ఉంది. ఇందులో 6.7 లీటర్ వి12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 520 బిహెచ్పి పవర్, 780 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గరిష్ఠ వేగం గంటకు 250 కిమీ. మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్500 (Mercedes-Maybach S500) జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థకు మెర్సిడెస్ కంపెనీకి చెందిన అత్యంత ఖరీదైన కారు 'మేబ్యాచ్ ఎస్500' సెడాన్ కూడా కుమార్ మంగళం బిర్లా గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 1.86 కోట్లు. ఇందులో 4663 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 453 బిహెచ్పి పవర్, 700 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సెడాన్ కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ వరకు ఉంది. భారతదేశంలోని సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఇది ప్రధానమైనదని. బీఎండబ్ల్యూ 760ఎల్ఐ (BMW 760LI) కుమార్ మంగళం బిర్లా గ్యారేజిలో ఉన్న కార్లలో బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 760ఎల్ఐ ఒకటి. దీని ధర రూ. 2.46 కోట్లు. రోల్స్ రాయిస్ ఘోస్ట్ కొనుగోలు చేయడానికి ముందు ఈయన ఎక్కువగా ఈ కారునే ఉపయోగించేవారని సమాచారం. ఇది బుల్లెట్ ప్రూఫ్ సెడాన్. కావున వినియోగదారులకు పటిష్టమైన భద్రతను అందిస్తుంది. ఇందులోని 3.0 లీటర్ 6 సిలిండర్ డీజిల్ 850 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ సెడాన్ టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. ఇది కేవలం 3.8 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతమవుతుంది. (ఇదీ చదవండి: పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, హెలికాఫ్టర్స్.. ఇంకా ఎన్నో..!) జాగ్వార్ ఎక్స్ఎఫ్ (Jaguar XF) బ్రిటీష్ వాహన తయారీ సంస్థకు చెందిన జాగ్వార్ ఎక్స్ఎఫ్ 'కుమార్ మంగళం బిర్లా' గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 55.67 లక్షలు. ఇందులోని 2.0 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్ 247 బిహెచ్పి పవర్ & 365 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లగ్జరీ కారు కేవలం 7.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవతమవుతుంది. టాప్ స్పీడ్ గంటకు 365 కిమీ. (ఇదీ చదవండి: అమ్మేది పాత బూట్లు.. సంపాదన రూ. కోట్లు - ఓ యువకుని సక్సెస్ స్టోరీ) బీఎండబ్ల్యూ 5 సిరీస్ (BMW 5-Series) బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన మరో కారు 5 సిరీస్ కుమార్ మంగళం బిర్లా గ్యారేజిలో ఉంది. దీని ధర రూ. 62.90 లక్షలు. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉండే ఈ కారు 2993 ఇంజిన్ కలిగి 261 బిహెచ్పి పవర్ పవర్, 620 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం కాగా, టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. 28 సంవత్సరాల వయసులో తండ్రి మరణించిన తరువాత ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేప్పట్టిన కుమార్ మంగళం బిర్లా 47 బ్రాండ్లు, 27 ఎంటర్ప్రైజెస్, 14 పరిశ్రమ రంగాలను విజయపథంలో నడిపిస్తున్నాడు. ప్రస్తుతం కంపెనీ ఆదాయం రూ.50000 కోట్ల కంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
మెర్సిడెస్ కొత్త వర్షన్స్ భారత్‌కు వచ్చేశాయ్! ధరలు ఇవే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ 2023 వర్షన్ ఎంట్రీ లెవెల్ సెడాన్ అయిన ఏ–క్లాస్ లిమోసిన్‌ను రూ.45.80 లక్షల ధరలో ప్రవేశపెట్టింది. ఎనిమిదేళ్ల వారంటీ ఉంది. 10.25 అంగుళాల ఎంబీయూఎక్స్ డిజిటల్ డిస్ప్లే, 17 అంగుళాల 5 స్పోక్ అలాయ్ వీల్స్, కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్స్, 7 ఎయిర్‌బ్యాగ్స్ పొందుపరిచారు. అలాగే ఎంట్రీ లెవెల్ పెర్ఫార్మెన్స్ హ్యాచ్‌బ్యాక్ ఏ 45 ఎస్ ఏఎంజీ 4మేటిక్ ప్లస్‌ను రూ.92.5 లక్షల ధరలో పరిచయం చేసింది. 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ ఏఎంజీ పెట్రోల్ ఇంజన్‌తో తయారైంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.9 సెకన్లలో అందుకుంటుంది. ఇదీ చదవండి: ర్యాపిడో బైక్ కెప్టెన్లకు గుడ్ న్యూస్.. ఇకపై మరింత ఆదాయం -
నిండా 18 ఏళ్ళు లేవు..! రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన కారు కొనేసాడు
ఆధునిక కాలంలో ప్రజల జీవన శైలి, వారి జీవన విధానం మారిపోయాయి. చాలా మంది విలాసవంతమైన జీవితం గడపడానికి అలవాటు పడుతున్నారు. ఇందులో యువత మరింత వేగంగా ఉన్నారు. ఇటీవల ఒక యువకుడు ఏకంగా రూ. 1 కోటి కంటే ఎక్కువకా ఖరీదైన కారుని కొనుగోలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇటీవల వెల్లడైన ఒక వీడియోలో కనీసం 18 సంవత్సరాలు కూడా నిండని ఒక బాలుడు జర్మన్ లగ్జరీ కారు మెర్సిడెస్ బెంజ్ కొనుగోలు చేసాడు. ఇందులో కేవలం ఆ యువకుడు తన బాడీ గార్డ్స్ మాత్రమే ఉన్నారు. ఇందులో అతని కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించకపోవడం గమనార్హం. ఈ కారుని అతడే కొన్నాడా? లేక వారి తల్లిదండ్రులెవరైనా గిఫ్ట్‌గా ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. శ్రీనివాస్ రెడ్డి అనే యువకుడు హైదరాబాద్‌లోని కంపెనీ అధీకృత డీలర్ అవుట్లెట్ నుంచి బ్లాక్ కలర్ Mercedes-Benz GLS 400 డెలివరీ చేసుకున్నాడు. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. లైసెన్స్ కూడా పొందలేని వయసులో కారు కొనటం విడ్డూరంగా ఉందని చెబుతున్నారు. (ఇదీ చదవండి: ప్రైవేట్ చేతుల్లోకి ఆధార్ అథెంటికేషన్ - ప్రజలు సమ్మతిస్తారా..?) ఇక మెర్సిడెస్ బెంజ్ జిఎస్ఎస్ 400డి విషయానికి వస్తే దీని ధర దేశీయ మార్కెట్లో సుమారు రూ. 1.29 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది 3.0-లీటర్ ఇన్లైన్-సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజిన్ 326 bhp పవర్, 700 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది, కావున అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. -
భారత్‌లో విడుదలైన రూ. 3.30 కోట్ల జర్మన్ లగ్జరీ కారు - పూర్తి వివరాలు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారతీయ మార్కెట్లో కొత్త కారు 'ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్' (AMG GT 63 S E Performance) లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ కారు డిజైన్, ఫీచర్స్, పర్ఫామెన్స్ వంటి విషయాలతో పాటు ధరల గురించి కూడా పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ధర: దేశీయ విఫణిలో విడుదలైన కొత్త బెంజ్ ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్ ధర రూ. 3.30 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది AMG పోర్ట్‌ఫోలియోలో కొత్త ఫ్లాగ్షిప్ మోడల్‌గా నిలుస్తుంది. ఇది 2021లోనే గ్లోబల్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. అయితే ఇప్పటికి ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టింది. డిజైన్: కొత్త బెంజ్ ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్ చూడగానే ఆకర్శించే అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇది కొత్త ఎగ్జాస్ట్ అవుట్లెట్లు కలిగి, రీడిజైన్డ్ ఫ్రంట్ బంపర్ పొందుతుంది. వెనుక భాగంలో ఛార్జింగ్ పోర్ట్ ఉండటం కూడా మీరు గమనించవచ్చు. బ్యాడ్జింగ్ కొత్త ట్విన్ ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్ వంటివి మరింత అట్రాక్టివ్‌గా ఉంటాయి. (ఇదీ చదవండి: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం ఎంతనుకున్నారు?) ఫీచర్స్: ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్ డ్యాష్‌బోర్డ్‌లో 12.4 ఇంచెస్ డ్యూయెల్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇందులో బకెట్ సీట్లు, AMG స్టీరింగ్ వీల్, కార్బన్ ఫైబర్ ఇన్సర్ట్లు వంటి లగ్జరీ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఈ లగ్జరీ కారు గురించి మరిన్ని వివరాలను ఈ డిస్ప్లేల ద్వారా చూడవచ్చు. ఇంజిన్ & పర్ఫామెన్స్: కొత్త ఏఎమ్‌జి జిటి 63 ఎస్ ఈ పర్ఫామెన్స్ కారు 4.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్ V8 ఇంజన్ పొందుతుంది. ఇది 639 హెచ్‌పి పవర్ అందిస్తుంది. అయితే ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 204 హెచ్‌పి పవర్ అందిస్తుంది. ఈ రెండు కలయికతో 843 హెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే టార్క్ 1,470 ఎన్ఎమ్ వరకు ఉంటుంది. ఇది కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గంటకు 316 కిలోమీటర్లు. ఈ సూపర్ సెడాన్‌లో 6.1kWh, 400V బ్యాటరీ ప్యాక్‌తో కేవలం 89 కేజీల బరువుతో ఉంటుంది. ఇది మోటారుకు శక్తినిస్తుంది. దీని పరిధి 12 కిమీ వరకు వస్తుంది. కానీ EV మోడ్‌లో గరిష్ట వేగం గంటకు 12 కిలోమీటర్లు. ఇందులో ఏడు డ్రైవ్ మోడ్లు & ఫోర్ లెవెల్ రీజెనరేటివ్ బ్రేకింగ్అందుబాటులో ఉంటుంది. రెండోది కొన్ని పరిస్థితులలో వన్-పెడల్ డ్రైవింగ్‌ను కూడా అనుమతిస్తుంది. -
ఈ నెలలో విడుదలయ్యే కొత్త కార్లు, ఇవే!
కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలైపోయింది. కొత్త కార్లు దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మారుతి సుజుకి ఫ్రాంక్స్, మెర్సిడెస్ బెంజ్ GT63 S ఈ-పెర్ఫార్మెన్స్ మొదలైనవి ఉన్నాయి. ఈ కార్లు మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతాయి, ఇతర వివరాలేంటి అనే సమాచారం ఈ కథనంలో.. మారుతి సుజుకి ఫ్రాంక్స్: 2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన మారుతి ఫ్రాంక్స్ ఈ నెల రెండవ వారంలో దేశీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ కొత్త మోడల్ కోసం ఇప్పటికే మంచి సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 1.0-లీటర్ టర్బో, 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఆప్షన్స్ పొందనుంది. దీని ధర సుమారు రూ. 8 లక్షల నుంచి రూ. 11 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి63 ఎస్ ఈ-పర్ఫామెన్స్: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ దేశీయ విఫణిలో ఈ నెల 11న ఏఎమ్‌జి జిటి63 ఎస్ ఈ-పర్ఫామెన్స్ విడుదల చేయనుంది. ఇది 4-డోర్ కూపే నుంచి వచ్చిన ఫస్ట్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు కావడం విశేషం. ఇది 4.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 ఇంజన్ & 204 హెచ్‌పి ఎలక్ట్రిక్ మోటారు పొందుతుంది. ఈ లగ్జరీ కారు ఫ్రంట్ బంపర్‌పై పెద్ద గ్యాపింగ్ ఎయిర్ ఇన్‌టేక్‌లు, పనామెరికానా గ్రిల్, బెస్పోక్ అల్లాయ్ వీల్స్, బూట్ లిడ్‌పై స్పాయిలర్ పొందుతుంది. దీని ధర కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు, కానీ సుమారు రూ. 3 కోట్ల (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. లంబోర్ఘిని ఉరస్ ఎస్: ఇటలీకి చెందిన సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని దేశీయ మార్కెట్లో ఉరస్ ఎస్ SUVని విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఇది 2023 ఏప్రిల్ 13న అధికారికంగా విడుదలకానుంది. దీని ధర సుమారు రూ. 4.22 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కంటే ఎక్కువ ఉండవచ్చని అంచనా. ఇది 4.0 లీటర్, V8 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి అద్బుతంగా పర్ఫామెన్స్ అందిస్తుంది. ఎంజి కామెట్ ఈవీ: భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎంజి మోటార్ ఈ నెల చివరిలో కామెట్ EV అనే ఎలక్ట్రిక్ కారుని విడుదలచేయనుంది. దీనిని నగర ప్రయాణాల కోసం అనుకూలంగా ఉండటానికి ప్రత్యేకంగా రూపొందించారు. కాంపాక్ట్ డైమెన్షన్లు, టూ-డోర్ బాడీ స్టైల్, ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఎలిమెంట్స్ వంటివి దీనిని చాలా ఆకర్షణీయంగా కనపడేలా చేస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 250 కిమీ రేంజ్ అందిస్తుందని, ధర రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. -
కవలల కల నెరవేరింది.. కొత్త కారు కొన్న సంతోషం కళ్ళల్లో - వీడియో వైరల్
టిక్‌టాక్ ద్వారా ఫేమస్ అయిన వ్యక్తులలో 'చింకి మింకి' కవలలు కూడా ఉన్నారు. అంతే కాకుండా షార్ట్ ఫామ్ (short-form) వీడియోస్ చేస్తూ ప్రసిద్ధి చెందిన ఈ ట్విన్స్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియన్స్ కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాగా వీరు ఇటీవల ఒక ఆధునిక లగ్జరీ కారుని కొనుగోలు చేశారు. చింకి మింకీగా ప్రసిద్ధి చెందిన వీరి అసలు పేర్లు 'సురభి మెహ్రా & సమృద్ధి మెహ్రా'. 2016లో టిక్‌టాక్ ద్వారా మొదలైన వీరి ప్రయాణం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా తార స్థాయికి చేరింది. కొన్ని టీవీ షోల ద్వారా కూడా వీరు మరింత పేరు సంపాదించుకున్నారు. ఇటీవల ఈ ట్విన్స్ కొన్న చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'ఏఎంజి జిఎల్సి 43'. దీని ధర రూ. 87 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో వారు కారు ముందర డ్యాన్స్ చేయడం చూడవచ్చు. భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన, ఖరీదైన కార్ల జాబితాలో AMG GLC 43 ఒకటి. ఇది పోలార్ వైట్, అబ్సిడియన్ బ్లాక్, గ్రాఫైట్ గ్రే, డిజైనో హైసింత్ రెడ్, డిజైనో సెలెనైట్ గ్రే మాగ్నో, బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. (ఇదీ చదవండి: బోరు బావి నుంచి బంగారం.. భారీగా ఎగబడుతున్న జనం) మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి 43 లగ్జరీ ఫీచర్స్ కలిగి, వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇది 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. అంతే కాకుండా.. బ్లాక్ నప్పా లెదర్ స్టీరింగ్ వీల్, మెమరీ ఫంక్షన్, లంబర్ సపోర్ట్‌తో ఎలక్ట్రానిక్ ఫ్రంట్ సీట్లు, డ్రైవ్ మోడ్లు, మెర్సిడెస్ మీ కనెక్ట్, 64 కలర్డ్ యాంబియంట్ లైటింగ్, ప్రీమియం బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, హీటెడ్ ఫ్రంట్ సీట్లు ఇందులో లభిస్తాయి. (ఇదీ చదవండి: నాగ చైతన్య కొత్త ఇంటి ఖరీదు ఎంతో తెలుసా?) ఈ జర్మన్ లగ్జరీ కారులో 3.0 లీటర్ వి6 టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 390 హెచ్‌పి పవర్, 520 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కాగా టాప్ స్పీడ్ 250 కిమీ/గం. View this post on Instagram A post shared by Chinki Minki♥️ (@surabhi.samriddhi) -
భారత్‌లో విడుదలకానున్న జర్మన్ లగ్జరీ కార్లు, ఇవే
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ 'మెర్సిడెస్ బెంజ్' భారతీయ మార్కెట్లో అప్డేటెడ్ జిఎల్ఏ, జిఎల్బి SUVలను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సంవత్సరం చివరి నాటికి మార్కెట్లో అధికారికంగా అడుగుపెడతాయనికి, విక్రయాలు కూడా ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది. డిజైన్ & ఫీచర్స్: దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త GLA, GLB రెండూ వాటి మునుపటి మోడల్స్ కంటే ఆధునికంగా ఉంటాయి. ఫ్రంట్ ఎండ్‌లో గ్రిల్, బంపర్, లైట్స్ వంటివి కొత్తగా కనిపించనున్నాయి. అయితే వీల్ ఆర్చెస్ ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్ పొందుతాయి. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేసే ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, లెదర్ స్టీరింగ్ వీల్, హై-బీమ్ అసిస్ట్, రివర్సింగ్ పార్కింగ్ కెమెరా వంటి వాటితో పాటు యాంబియంట్ లైటింగ్ వంటివి ఉంటాయి. మొత్తం మీద డిజైన్, ఫీచర్స్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. పవర్‌ట్రెయిన్స్: కొత్త అప్డేటెడ్ బెంజ్ కార్లు రెండూ లైట్ వెయిట్ హైబ్రిడ్ ద్వారా శక్తిని పొందుతాయి. అయితే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్ట్రెయిన్లలో కొన్ని మార్పులు గమనించవచ్చు. కావున కంపెనీ రేంజ్ వంటి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ మంచి పనితీరుని అందిస్తాయని భావిస్తున్నాము. వీటి గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు కాగా, కేవలం 5.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతాయి. ధరలు: త్వరలో విడుదలకానున్న కొత్త జిఎల్ఏ, జిఎల్బి ధరలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ GLA ప్రారంభ ధరలు రూ. 48.50 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య, GLB ధరలు రూ. 63.80 లక్షల నుంచి రూ. 69.80 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: 2023 Hyundai Verna: మొన్న విడుదలైంది.. అప్పుడే దిమ్మతిరిగే బుకింగ్స్) ప్రత్యర్థులు: భారతదేశంలో జిఎల్ఏ, జిఎల్బి విడుదలైన తరువాత ప్రత్యక్ష పోటీదారులు లేనప్పటికీ బిఎండబ్ల్యూ ఎక్స్1, వోల్వో ఎక్స్‌సి40 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది. కాగా వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
బెంజ్ కారు కొనాలంటే ఇప్పుడే కొనేయండి.. లేదంటే?
ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'మెర్సిడెస్ బెంజ్' భారతదేశంలో 2023 ఏప్రిల్ 01 నుంచి తమ ఉత్పతుల ధరలను భారీగా పెంచనున్నట్లు ప్రకటించింది. కంపెనీ త్వరలో మోడల్ శ్రేణిలో సుమారు 5 శాతం వరకు ధరల పెరుగుదలను ప్రకటించింది. 2022 డిసెంబర్ నెలలో కంపెనీ 5 శాతం ధరలను పెంచింది. ఆ తరువాత 2023లో ధరలను పెంచడం ఇదే మొదటిసారి. యూరోతో పోలిస్తే ఇండియన్ కరెన్సీ విలువ తగ్గడంతో పాటు ఇన్పుట్, లాజిస్టికల్ ఖర్చులు పెరగడం వల్ల ధరల పెరుగుదల జరిగిందని కంపెనీ ప్రకటించింది. నిజానికి మెర్సిడెస్ బెంజ్ ఏ200 ధర రూ. 42 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ధరల పెరుగుదల తరువాత ఈ మోడల్ ధర రూ. 44 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంటుంది. జిఎల్ఎస్ 400డి 4మ్యాటిక్ ధర రూ. 10 లక్షలు పెరగనుంది. దీని కొత్త ధర రూ. 1.29 కోట్లు. అదే సమయంలో మేబ్యాచ్ ఎస్580 ధర రూ. 12 లక్షలు పెరగనుంది. (ఇదీ చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైకులు వెనక్కి: కారణం ఏంటంటే?) మెర్సిడెస్ బెంజ్ తమ ఉత్పత్తుల ధరలను పెంచడమే కాకుండా కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి కూడా తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ 2023లో 10 కొత్త మోడల్స్ విడుదల చేయడానికి సంకల్పించింది. ఇందులో క్యూ3 జిఎల్సి, జి-క్లాస్ వెర్షన్ వంటివి దేశీయ మార్కెటీలో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. -
బాలీవుడ్ బ్యూటీ 'హ్యుమా ఖురేషి' కొత్త లగ్జరీ కారు: ధర ఎంతంటే?
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ 'హ్యుమా ఖురేషి' ఇటీవల ఖరీదైన జర్మన్ బ్రాండ్ కారు మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ (Mercedes Benz GLS 400d) మోడల్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హ్యుమా ఖురేషి కొన్న ఈ కారు ధర రూ. 1.19 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది 3.0 లీటర్ సిక్స్ సిలీండర్ డీజిల్ ఇంజిన్ కలిగి 325 బీహెచ్పీ పవర్, 700 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లగ్జరు కారు కేవలం 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది, అదే సమయంలో దీని టాప్ స్పీడ్ గంటకు 238 కిలోమీటర్లు. మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ మోడల్ మల్టీ బీమ్ ఎల్ఈడీ హెడ్ లైట్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, 360 డిగ్రీల కెమెరా, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఎలక్ట్రల్లీ అడ్జస్టబుల్ వెంటిలేటెర్డ్ ఫ్రంట్ సీట్లు, ఫైవ్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి వాటితో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, 12 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం వంటి వాటిని పొందుతుంది. (ఇదీ చదవండి: ట్విటర్ నుంచి నన్ను ఎందుకు తొలగించారన్న ఉద్యోగి.. ఎలాన్ మస్క్ రీప్లే ఇలా) వరుస సినిమాలతో ముందుకు దూసుకెళ్తున్న హ్యుమా ఖురేషి ఎప్పటికప్పుడు తన గ్యారేజిని ఆధునిక కార్లతో అప్డేట్ చేసుకుంటూనే ఉంటుంది. ఈమె మొదటి కారు మారుతీ సుజుకీ స్విఫ్ట్ కావడం గమనార్హం. ఆ తరువాత ల్యాండ్ రోవర్ ఫ్రీ ల్యాండర్, మెర్సిడెజ్ బెంజ్ జీఎల్ఈ 250డీ వంటి వాటిని కొనుగోలు చేసింది. తాజాగా ఇప్పుడు మరో లగ్జరీ కారుని తన గ్యారేజిలో చేర్చింది. -
నీతూ కపూర్ కారు ధర అన్ని కోట్లా!
గతంలో సెలబ్రెటీలు, పారిశ్రామిక వేత్తలు కొనుగోలు చేసిన లగ్జరీ కార్లను గురించి చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇలాంటి సంఘటనే మళ్ళీ వెలుగులోకి వచ్చింది. రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ ఇటీవల ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. నీతూ కపూర్ కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన Maybach GLS600. దీని ధర సుమారు రూ. 3 కోట్లు. ఈ కొత్త లగ్జరీ కారు కొనుగోలుతో ఈమె మేబ్యాచ్ కారుని కలిగి ఉన్న ఓనర్ల జాబితాలో చేరిపోయింది. ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్‌గా భారతదేశానికి దిగుమతవుతుంది. కావున ఇది లిమిటెడ్ ఎడిషన్ రూపంలో మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. మెర్సిడెస్ మేబ్యాచ్ సెలెనైట్ సిల్వర్, బ్రిలియంట్ బ్లూ, ఎమరాల్డ్ గ్రీన్, కావాన్‌సైట్ బ్లూ, ఇరిడియం సిల్వర్, పోలార్ వైట్ వంటి మల్టిపుల్ కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ధర కొంత ఎక్కువైనప్పటికీ ఈ కారు ఆధునిక డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. మెర్సిడెస్ మేబ్యాచ్ జిఎల్ఎస్600 ఎస్‌యూవీలోని 4.0 లీటర్ వి8 ఇంజన్ గరిష్టంగా 550 బిహెచ్పి పవర్, 730 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఈ ఇంజన్ 21 బిహెచ్పి పవర్, 249 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఇంటిగ్రేటెడ్ ఈక్యూ బూస్ట్ స్టార్టర్-జనరేటర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇంజన్ 9 జి-ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కు జతచేయబడి ఉంటుంది. (ఇదీ చదవండి: మెరిసిన మారుతి.. పడిపోయిన ఎమ్‌జి మోటార్: సేల్స్‌లో టాటా స్థానం ఎంతంటే?) మేబ్యాచ్ జిఎల్ఎస్ 600 కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. కావున ప్రయాణికుల భద్రతకు ఏ డోకా ఉండదు. -
MBA Chai Wala: అపుడు టీ బిజినెస్‌తో కోట్లు, ఇపుడు మళ్లీ వార్తల్లోకి..విషయం ఏమిటంటే..!
సాక్షి, ముంబై: కష్టపడి పనిచేసేవారు బాగుపడటానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే అది ఏ రంగంలో అయినా కావచ్చు, నీకున్న నిబద్దత నిన్ను తప్పకుండా గొప్పవాడిగా ఎదిగేలా చేస్తుంది అనటానికి 'ప్రఫుల్ బిల్లోర్' అలియాస్ 'MBA చాయ్ వాలా' మంచి ఉదాహరణ. ప్రఫుల్ బిల్లోర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ 'ఎంబీయే చాయ్ వాలా' అంటే మాత్రం ఎక్కువ మందికి తెలుసు. MBA మధ్యలోనే ఆపేసి IIM అహ్మదాబాద్ వెలుపల ఎనిమిది వేల రూపాయలతో టీ స్టాల్ ప్రారంభించి ఈ రోజు రూ. 90 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన లగ్జరీ కార్ కొనుగోలు చేసే స్థాయికి ఎదిగాడు. అసలు ఎవరీ MBA చాయ్ వాలా మధ్యప్రదేశ్‌లో బీకామ్ పూర్తి చేసిన 'ప్రఫుల్ బిల్లోర్' ఎంబీఏ చేయాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ మంచి ర్యాంక్ రాకపోవడంతో ఉపాధికోసం అంట్లు తోమే పనిలో చేరాడు. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే పట్టుదల అతణ్ణి నిద్ర పోనీయలేదు. అంతే...తాను ఎంబీఏ చేయాలనుకున్న క్యాంపస్ పక్కెనే టీ స్టాల్ ప్రారంభించి అంచలంచెలుగా ఎదుగుతూ కోట్ల బిజినెస్‌ను సాధించాడు. తనలాంటివారికి ఎంతోమంది స్ఫూర్తిగా నిలిచాడు. అలా చిన్న టీ స్టాల్ తో ప్రారంభమైన ప్రఫుల్ దేశవ్యాప్తంగా ‘ఎంబీయే చాయ్ వాలా’ పేరుతో పాపులర్ అయ్యాడు. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు కోట్లలో టర్నోవర్ సాధిస్తున్నాడు. అంతేకాదు ఎంబీఏ చాయ్‌వాలా అకాడమీని ప్రారంభించి ఆంట్రప్రెన్యూర్షిప్లో స్పెషల్ కోర్స్ అందిస్తూ.. పెద్ద పెద్ద కాలేజీల్లో స్టూడెంట్స్‌కి సైతం క్లాసులు కూడా చెబుతున్నాడు. అలాగే మోటివేషనల్ స్పీకర్‌గా కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. తాజాగా అతను ఖరీదైన బెంజ్ కారు కొనుగోలు చేయడం విశేషంగా నిలిచింది. కేవలం ఎనిమిది వేలతో ప్రారంభమైన ప్రఫుల్ ప్రయాణం ఈ రోజు మెర్సిడెస్ బెంజ్ GLE 300డి కొనుగోలు చేసే స్థాయికి చేరింది. GLE 300d అనేది బ్రాండ్ హై-ఎండ్ మోడల్, ఆధునిక డిజైన్, అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కారులోని 2.0-లీటర్, ఫోర్ సిలిండర్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 245 పిఎస్ పవర్ & 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 7.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగాన్ని అందుకుంటుంది. View this post on Instagram A post shared by Prafull Billore (@prafullmbachaiwala) -
బెంజ్‌కారులో వచ్చి.. డబ్బులు నేలకేసి కొట్టాడు
Viral Video: డబ్బు మనిషికి అవసరం. కానీ, ఆ డబ్బుతో ఏమైనా చేయొచ్చనే ఆలోచన ఎంతమాత్రం సరికాదనే మంచి మాట ఒకటి ఉంది. డబ్బుంది కదా అని తలపొగరు ప్రదర్శిస్తే.. దానికి కాలమే సమాధానం చెబుతుంది కూడా. తాజాగా ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెర్సిడెజ్ బెంజ్‌కారులో వచ్చిన ఓ వ్యక్తి.. ఇంధనం కోసం ఓ బంక్ వద్దకు వచ్చాడు. తీరా ఇంధనం నిండాక.. డబ్బుల్ని అక్కడున్న సిబ్బంది చేతికి ఇవ్వకుండా నేలకేసి విసిరికొట్టాడు. అయితే.. ఆ సిబ్బంది మహిళ మాత్రం సహనం కోల్పోలేదు. నిదానంగా.. ఆ డబ్బులు ఏరి తన బ్యాగ్‌లో వేసుకుంది. ఆపై ఆ కారు ముందుకు వెళ్లిపోగా.. బాధతో కన్నీళ్లు కార్చింది. చైనాలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే రెడ్డిట్ ద్వారా ఈ వీడియో వైరల్ కాగా, పని హడావిడిలో తాను డబ్బు అలా వదిలేసి పోయానే తప్ప.. ఆమెను అవమానించడం తన అభిమతం కాదని ఆ కారు ఓనర్ వివరణ ఇచ్చినట్లు స్థానిక మీడియా ఓ కథనం ప్రచురించింది. కానీ, నెటిజన్లు మాత్రం ఆ సమాధానంతో సంతృప్తి చెందకుండా ఆ కారు ఓనర్‌ను ఏకిపడేస్తున్నారు. -
ఖరీదైన కారు కొన్న బిగ్ బాస్ నటి.. ధరెంతో తెలుసా?
ప్రముఖ బుల్లితెర నటి ఖరీదైన కారును కొనుగోలు చేసింది. బాలీవుడ్ భామ, అనుపమ నటి రూపాలీ గంగూలీ దాదాపు రూ.90 లక్షల విలువైన మెర్సిడెస్ బెంజ్ కారును కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తన కల నిజమైందని రూపాలీ తెలిపింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు అంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అత్యధిక పారితోషికం రూపాలీ తన భర్త అశ్విన్ వర్మ, కుమారుడు రుద్రాంశ్ వర్మతో కలిసి షోరూమ్‌లో ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా.. రూపాలీ అత్యధిక పారితోషికం తీసుకునే టీవీ నటిగా పేరు సంపాదించింది. 'సారాభాయ్ వర్సెస్ సారాభాయ్','మోనిషా సారాభాయ్' 'అనుపమ'లో సీరియల్స్‌లో రూపాలి నటించారు. రూపాలీ ప్రారంభంలో రోజుకు రూ.1.5 లక్షలు తీసుకోగా.. ప్రస్తుతం రోజుకు రూ. 3 లక్షలు తీసుకుంటోంది.'సంజీవని'లో డాక్టర్ సిమ్రాన్ చోప్రా పాత్రను కూడా పోషించారు. ఆ తరువాత 2006లో రియాల్టీ షో బిగ్ బాస్‌లో పోటీదారుగా పాల్గొన్నారు. అనుపమ సీరియల్లో రూపాలి పరిపూర్ణ గృహిణి, తల్లిగా నటిస్తోంది.'అనుపమ'లో సుధాన్షు పాండే, గౌరవ్ ఖన్నా, అనేరి వజని, మదాల్సా శర్మ, అల్పనా బుచ్, అరవింద్ వైద్య నటించారు. View this post on Instagram A post shared by Rups (@rupaliganguly) -
మెర్సిడెస్ నుంచి 10 కొత్త మోడళ్లు.. ధర ఎంతంటే?
న్యూఢిల్లీ: జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో ఈ ఏడాది 10 నూతన మోడళ్లను ప్రవేశపెట్టనుంది. వీటిలో అత్యధికం రూ.1 కోటికిపైగా ధరల శ్రేణిలో ఉంటాయని కంపెనీ తెలిపింది. 2022లో భారత్‌లో కంపెనీ నూతన రికార్డు సాధించి 15,822 యూనిట్లను విక్రయించింది. 2021లో 11,242 యూనిట్లు రోడ్డెక్కాయి. గతేడాది అమ్ముడైన కార్లలో రూ.1 కోటిపైన ధర కలిగిన టాప్ ఎండ్ మోడళ్లు 3,500 యూనిట్లకుపైమాటే. ఈ విభాగం అంత క్రితం ఏడాదితో పోలిస్తే 69 శాతం వృద్ధి చెందడం విశేషం. ఇప్పటి వరకు కంపెనీ ఖాతాలో 2018లో అ మ్ముడైన 15,583 యూనిట్లే అధికం. టాప్ ఎండ్ మోడళ్ల వాటా 2018లో 12 % ఉంటే గతేడాది ఇది ఏకంగా 22 శాతానికి చేరిందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. -
కార్ల కొనుగోలు దారులకు భారీ షాక్!
న్యూఢిల్లీ: కార్ల ధరలు జనవరి నుంచి ప్రియం కానున్నాయి. ధరలను పెంచుతున్నట్టు మెర్సిడెస్ బెంజ్, ఆడి, రెనో, కియా ఇండియా, ఎంజీ మోటార్ బుధవారం ప్రకటించాయి. ముడిసరుకు వ్యయాలు, రవాణా ఖర్చులు అధికం అవుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి. కార్ల ధరలను సవరిస్తున్నట్టు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ ఇప్పటికే ప్రకటించాయి. కంపెనీ, మోడల్‌నుబట్టి ఎక్స్‌షోరూం ధర 5 శాతం వరకు దూసుకెళ్లనుంది. ధరలు పెంచే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని హ్యుండై మోటార్ ఇండియా, హోండా కార్స్ తెలిపాయి. -
‘నువ్వు గెలిస్తే ఆ కారును నేనే బహుమతిగా ఇస్తా’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్టార్ బాక్సర్, డిఫెండింగ్ చాంపియన్ (ఫ్లయ్ వెయిట్) నిఖత్ జరీన్ టైటిల్ నిలబెట్టుకుంటే ఖరీదైన ‘మెర్సిడెజ్ బెంజ్’ కారు కొంటానని చెప్పింది. అయితే అక్కడే ఉన్న అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్ ఆమె గెలిస్తే కొనాల్సిన అవసరం లేకుండా నిఖత్ కోరుకున్న కారును బహుమతిగా ఇస్తానని చెప్పారు. భారత్‌కు 2023 మహిళల చాంపియన్‌షిప్ ఆతిథ్య హక్కులు కట్టబెట్టిన సందర్భంగా ఈ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఈ మేరకు ఐబీఏ చీఫ్ క్రెమ్లెవ్, భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) అజయ్ సింగ్‌లు ఆతిథ్య హక్కుల ఒప్పందంపై సంతకాలు చేశారు. వచ్చే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ బాక్సింగ్ మెగా ఈవెంట్ జరగనుంది. తేదీలను తర్వాత ఖరారు చేయనున్నారు. టోర్నీ ప్రైజ్‌మనీ పెరగడంతో విజేతకు రూ. 81 లక్షలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాల్గొన్న నిఖత్ మాట్లాడుతూ ‘ప్రస్తుత టైటిల్ ప్రైజ్‌మనీతో హైదరాబాద్‌లో ఇల్లు కొనే ప్రయత్నంలో ఉన్నాను. వచ్చే ఏడాది కూడా గెలిస్తే దాంతో బెంజ్ కారు కొంటాను. అందులో క్రెమ్లెవ్తో హైదరాబాద్‌లో సిటీ రైడ్‌కు వెళ్తాను’ అని తెలిపింది. -
‘కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సెటైర్లు’
కేంద్ర రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లగ్జరీ కార్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జర్మనీకి చెందిన ప్రీమియం కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్.. దేశీయంగా ఎక్కువ కార్లను తయార చేయాలని, అదే సమయంలో కొనుగోలు దారుల స్థోమతకు తగ్గట్లు వాటి ధరల్ని తగ్గించాలని కోరారు. జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ పూణే జిల్లాలోని చకాన్ అనే పట్టణంలో కార్ల మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. ఆ కార్ల తయారీ యూనిట్లో ఉత్పత్తి చేసిన తొలి ఎలక్ట్రిక్ కారు ‘ఈక్యూఎస్ 580 4మేటిక్’ ను నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మెర్సిడెస్ సంస్థ కార్ల ఉత్పత్తిని పెంచితే వాటి ధరల్ని తగ్గించే అవకాశం ఉంది. మేం మధ్య తరగతి ప్రజలం, కార్ల ధరల్ని తగ్గించినప్పటికీ.. నేను మీ కార్లను కొనలేని’ నితిన్ గడ్కరీ అన్నారు. అంతకు ముందు నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పేద ప్రజలున్న ధనిక దేశం భారత్ అంటూ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చాంశనీయ మయ్యాయి. పేద ప్రజలున్న ధనిక దేశం నాగపూర్‌లో భారత్ వికాస్ పరిషత్ అనే సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడారు. ప్రపంచంలోనే మన దేశం అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరించి ధనిక దేశంగా నిలిచింది. కానీ ప్రజలు మాత్రం ఇంకా పేదలుగానే ఉన్నారు. వాళ్లంతా ఆకలి, నిరుద్యోగం, కులతత్వం, అంటరాని తనం , ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించారు. చదవండి👉 కేంద్రం కీలక ఆదేశాలు : కార్లలో 6 ఎయిర్ బ్యాగ్‌లు..తగ్గే ప్రసక్తే లేదు -
బెంజ్ సీఈవోకు తప్పని ట్రాఫిక్ కష్టాలు.. కిలోమీటర్లు నడిచి, ఆటో ఎక్కి
ప్రతి ఒక్కరూ నిత్యం ఏదో ఒక పని నిమిత్తం రోడ్డు మీదకు వస్తుంటారు. ఆటో, కారు, బైక్, బస్సు.. లేదా నడక మార్గాన తమ గమ్యాలను చేరుకుంటారు. రోడ్డుపై జర్నీ అంటే తప్పక ట్రాఫిక్ సమస్య ఉంటుంది. కామన్ మ్యాన్ నుంచి కోటిశ్వరుడి వరకు ఎవరైనా ట్రాఫిక్‌లో ఇరుక్కోవాల్సిందే. ఇందుకు ఎవరూ అతీతులు కాదు. అచ్చం ఇలాంటి అనుభవమే లగ్జరీ కార్ల తయారీ సంస్థ సీఈఓకు కూడా తప్పలేదు. మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈఓ మార్టిన్ ష్వేంక్ గురువారం రాత్రి సమయంలో పుణెలో తన ఎస్-క్లాస్ కారులో ప్రయాణిస్తుండగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. ఎంతకీ ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో ఖరీదైన ఎస్-క్లాస్ కారు నుంచి దిగి నడక బాటపట్టారు. ఇలా కిలోమీటర్లు నడిచి.. ఆటోలో తన గమ్య స్థానానికి చేరుకున్నారు. ఈ మొత్తం సంఘటనను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించారు. ఆటోలో ప్రయాణిస్తుండగా తీసిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘ మీ ఎస్-క్లాస్ కారు పూణె రోడ్లలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఉంటే మీరు ఏమి చేస్తారు? బహుశా కారు దిగి, కొన్ని కిలోమీటర్లు నడిచి, ఆపై రిక్షా పట్టుకుంటారా’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ పోస్టు వైరల్‌గా మారింది. సీఈఓ సింప్లిసిటీ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అంత కోటీశ్వరుడై ఉండి ఆటోలో వెళ్లడాన్ని పలువురు అభినందిస్తున్నారు. చదవండి: 16 ఏళ్ల ప్రస్థానాన్ని సెప్టెంబర్ గుర్తు చేసింది: కేటీఆర్ View this post on Instagram A post shared by Martin Schwenk (@martins_masala) -
మెర్సిడెస్ ఈవీ,మేడ్ ఇన్ ఇండియా.. ఒకసారి చార్జింగ్ చేస్తే 857 కిలోమీటర్లు రయ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో ఈక్యూఎస్ 580 4మేటిక్ తయారీ ప్రారంభించింది. జర్మనీ వెలుపల భారత్‌లోనే ఈ లగ్జరీ ఈవీని తయారు చేస్తున్నారు. కంపెనీ నుంచి భారత్‌లో రూపుదిద్దుకున్న తొలి ఎలక్ట్రిక్ వాహనం ఇదే కావడం విశేషం. 14వ మేడిన్ ఇండియా మోడల్‌గా ఈక్యూఎస్ 580 4మేటిక్ నిలిచింది. ఏఆర్ఏఐ ధ్రువీకరణ ప్రకారం ఈ కారు ఒకసారి చార్జింగ్ చేస్తే 857 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. భారత్‌లో అత్యధిక దూరం ప్రయాణించే కారుగా ఇది స్థానం దక్కించుకుంది. ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లో 15 నిముషాల్లో 300 కిలోమీటర్లు ప్రయాణించ గలిగే స్థాయిలో చార్జింగ్ పూర్తి అవుతుంది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1.55 కోట్లు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెన్నైలో ఈ కారును ఆవిష్కరించారు. చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త సేవలు రాబోతున్నాయ్! -
చిన్న పొరపాట్లే మిస్త్రీ ప్రాణాలు తీశాయా? ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..!
పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. మిస్త్రీ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశీయ వ్యాపార దిగ్గజాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన రోడ్డు ప్రమాదంపై పాల్ఘర్ జిల్లా పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. రోడ్డు పక్కనే ఓ గ్యారేజీలో పనిచేస్తున్న వ్యక్తి సైరస్ మిస్త్రీ కారు ప్రమాదం ఎలా జరిగిందో వివరించారు. ‘నా కళ్లెదురుగా ఓ మహిళ అతివేగంతో మిస్త్రీ కారును నడుపుతుంది. ఎడమ నుంచి మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ఆమె ప్రయత్నించారు. ఆ సమయంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న మహిళ వాహనంపై నియంత్రణ కోల్పోయి డివైడర్‌కు ఢీకొట్టారు’ అని అతను వెల్లడించాడు. ఎవరీ అనిహిత పండోలే సైరస్ మిస్త్రీ తన మెర్సిడెజ్ బెంజ్ కారులో గుజరాత్ ఉడవాడ నుంచి ముంబైకి ప్రయాణిస్తున్నారు. అదే కారులో మిస్త్రీతో పాటు ముంబైకి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ అనిహిత పండోలే, ఆమె భర్త డారియస్ పండోలే.. డారియస్ పండోలే సోదరుడు జహంగీర్ పండోలేలు కూడా ఉన్నారు. అనిహిత పండోలే కారు నడుపుతుండగా.. పక్క సీట్లో ఆమె భర్త డారియస్ పండోలే కూర్చుకున్నారు. వెనక సీట్లలో సైరస్ మిస్త్రీ ఆయన పక్కన జహంగీర్ పండోలేలు ఉన్నారు. సరిగ్గా ఆదివారం మధ్యాహ్నం మహరాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో సూర్య నది వంతెనపై మిస్త్రీ కారు ఘోర ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో కారు సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఎయిర్ బెలూన్లు ఓపెన్ కాలేదు. దీంతో సైరస్ మిస్త్రీ ఆయన పక్కనే ఉన్న జహంగీర్ పండోలేలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనిహిత పండోలే, ఆమె భర్త డారియస్ పండోలే తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రుల్ని స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం మిస్త్రీ కారుప్రమాదానికి గల కారణాల్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా చరోటీ నాకా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. కారులో ఏదైనా మెకానికల్ సమస్యలు ఉన్నాయా అని నిర్ధారించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు ఆ కారులో బ్లాక్ బాక్స్ తరహాలో అసెంబుల్ చేసిన చిప్ నుండి డేటాను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి👉 టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కన్నుమూత -
మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 53
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తాజాగా పూర్తి ఎలక్ట్రిక్ కారు మెర్సిడెస్–ఏఎంజీ ఈక్యూఎస్ 53 4మ్యాటిక్‌ను దేశీ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ. 2.45 కోట్ల (ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. ఈ కారు ఒక్కసారి చార్జి చేస్తే 529–586 కి.మీ. వరకూ నడుస్తుంది. 3.4 సెకన్లలో గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. భారత్‌లో తమ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిని పెంచుకునే దిశగా నాలుగు నెలల్లో మూడు విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్దేశించుకున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా వచ్చే నెలలో ఈక్యూఎస్ 580, ఆ తర్వాత నవంబర్‌లో సెవెన్ సీటర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈక్యూబీని తేనున్నట్లు వివరించారు. రాబోయే అయిదేళ్లలో తమ వాహన విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 25 శాతంగా ఉండగలదని అంచనా వేస్తున్నట్లు మార్టిన్ చెప్పారు. -
ఖరీదైన కారు కొన్న టీమిండియా బ్యాటర్.. ధర రూ. 2 కోట్ల పైమాటే!
Suryakumar Yadav Brings Home Mercedes-Benz SUV: కెరీర్లో ఉత్తమ దశలో ఉన్నాడు టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. ఇటు ఆట.. అటు వ్యక్తిగత జీవితాన్నీ బాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా భార్య దేవిషా శెట్టితో ట్రిప్పులకు వెళ్తాడు సూర్య. ఇక ఈ ముంబై బ్యాటర్‌కు కార్లు అంటే మహా క్రేజ్. ఇప్పటికే అతడి గ్యారేజ్‌లో బీఎండబ్ల్యూఈ 5 సిరీస్, ఆడీ ఏ6, రేంజ్ రోవర్, హుండాయ్ ఐ20, ఫార్చూనర్ వంటి కార్లు ఎన్నో ఉన్నాయి. తాజాగా మరో ఖరీదైన కారును కొనుగోలు చేశాడు సూర్య. దాదాపు 2.15 కోట్ల రూపాయల విలువైన మెర్సిడెజ్ బెంజ్ స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్(ఎస్యూవీ)ను ఇంటికి తీసుకువచ్చాడు. (PC: autohangar Instagram) ముందు విఫలమైనా.. ఆ తర్వాత అదరగొట్టి! ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌లో టీమిండియా ఓపెనర్‌గా బరిలోకి దిగిన నాలుగో నెంబర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. మొదటి రెండు మ్యాచ్‌లలో విఫలమైనా ఆ తర్వాత మెరుగ్గా రాణించాడు. ముఖ్యంగా మూడో టీ20 సందర్భంగా సరికొత్త రికార్డు సృష్టించాడు. (PC: autohangar Instagram) ఆ మ్యాచ్‌లో 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు సాధించాడు. అలా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి సత్తా చాటాడు. అంతకు ముందు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసి తన విలువ చాటుకున్నాడు. ఇక ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్.. ఆసియా కప్-2022 ఆడనున్న భారత జట్టుకు ఎంపికయ్యాడు. (PC: autohangar Instagram) ఇదిలా ఉంటే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు సుదీర్ఘ కాలంగా ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. భారత టీ20 జట్టులో కీలక ఆటగాడిగా.. ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్‌గా సూర్య ఏడాదికి దాదాపు 20 కోట్లపైనే సంపాదిస్తున్నట్లు అంచనా. చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ సాధించిన ఈ 3 రికార్డులు బద్దలు కొట్టడం కోహ్లికి సాధ్యం కాకపోవచ్చు! View this post on Instagram A post shared by Mercedes-Benz Auto Hangar India Pvt Ltd (@autohangar) -
ఉద్యోగులు మెచ్చే సంస్థ ‘మైక్రోసాఫ్ట్’
న్యూఢిల్లీ: భారత్‌లో ఉద్యోగులు మెచ్చే అత్యంత ఆకర్షణీయ సంస్థగా (అట్రాక్టివ్ ఎంప్లాయర్ బ్రాండ్) మైక్రోసాఫ్ట్ ఇండియా నిలిచింది. రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2022 ర్యాంకుల జాబితా విడుదలైంది. ఆర్థిక ఆరోగ్యం విషయంలో మైక్రోసాఫ్ట్ ఇండియా చాలా ఎక్కువ స్కోరు సాధించింది. బలమైన పేరు, గుర్తింపు, ఉద్యోగులకు ఆకర్షణీయమైన వేతనాలు, ఇతర ప్రయోజనాలు.. ఈ మూడు అంశాలు మైక్రోసాఫ్ట్‌ను నంబర్ 1 స్థానంలో నిలిపాయి. ఈ జాబితా లోని టాప్–10లో హ్యూలెట్ ప్యాకార్డ్ నాలుగో స్థానంలో, ఇన్ఫోసిస్ ఐదో స్థానంలో ఉన్నాయి. విప్రో, టీసీఎస్, టాటా స్టీల్, టాటా పవర్ కంపెనీ, శామ్సంగ్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రాండ్‌స్టాడ్ రీసెర్చ్ సర్వే కోసం 5,944 కంపెనీలకు చెందిన 1,63,000 మంది నుంచి (31 దేశాల వారు) అభిప్రాయాలు తెలుసుకున్నారు. కెరీర్లో పురోగతి కీలకం.. భారత్‌లో ప్రతి 10 మంది ఉద్యోగుల్లో 9 మంది (88%) శిక్షణ, వ్యక్తిగత కెరీర్ పురోగతి తమకు చాలా ముఖ్యమైనవిగా చెప్పారు. అదే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇలా చెప్పిన ఉద్యోగులు 76%. 2021 చివరి ఆరు నెలల్లో భారత్‌లో 24% ఉద్యోగులు తమ కంపెనీని మార్చుకున్నారని రాండ్‌స్టాడ్ తెలిపింది. సంస్థను ఎంపిక చేసుకునే విషయంలో పని–వ్యక్తిగత జీవితం మధ్య బ్యాలన్స్ తమకు ముఖ్యమని 63% మంది తెలిపారు. -
మెర్సిడెజ్ బెంజ్: విధుల నుంచి రోబోట్ల తొలగింపు, ఉద్యోగుల నియామకం!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్ల తయారీలో రోబోట్ల కంటే మనుషులే మేలని నమ్ముతుంది. అందుకే ప్రస్తుతం కార్ల మ్యానిఫ్యాక్చరింగ్లో ఉన్న రోబోట్లను తొలగించింది. వాటి స్థానంలో మనుషుల్ని నియమించనుంది. జర్మన్ ఆటోమేకర్ మెర్సిడెజ్ బెంజ్ ఎస్-క్లాస్ లిమోసిన్, ఎలక్ట్రిక్ అవతార్ మెర్సిడెస్ ఈక్యూఎస్, మేబాక్, ఏఎంజీ వెహికల్స్ తయారు చేసిన ఫ్యాక్టరీ 56లో, అలాగే ఓల్డ్ ఫ్యాక్టరీ 46లో గతంలో ఉన్న 25-30శాతం రోబోట్లలో 10 కంటే తక్కువకు తగ్గించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ కారణంగా, లగ్జరీ కార్ల తయారీదారు ఇప్పుడు కంబస్టివ్-ఇంజిన్, అలాగే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను అదే స్థాయిలో ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎందుకంటే రోబోట్లు కార్ల తయారీని ఒక్కో పని మాత్రమే చేస్తాయి. అదే మనుషులైతే ఒకే సారి పలు మోడళ్లను తయారు చేసే సామర్ధ్యం ఉందని నమ్ముతుంది. ఈ సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ ప్లాంట్ సైట్ మేనేజర్ మైఖేల్ బాయర్ మాట్లాడుతూ..రోబోట్లను మనుషులు భర్తీ చేయడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. కానీ సామర్ధ్యం పెంచుతుందని బౌయర్ వివరించాడు. వినియోగదారుల డిమాండ్ పెరిగే కొద్ది కార్ల తయారీలో ఉపయోగించే టెక్నాలజీల్లో మార్పులు చోటు చేసుకోవడం సర్వసాధారణమని అన్నారు. -
అమ్మకాల్లో దూసుకెళ్తున్న మెర్సిడెస్ బెంజ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఏప్రిల్–జూన్‌లో దేశవ్యాప్తంగా 3,551 యూనిట్లు విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలకుపైగా వృద్ధి సాధించింది. కంపెనీకి ఇప్పటి వరకు అత్యధిక అమ్మకాలు నమోదైన రెండవ త్రైమాసికం కూడా ఇదే. జనవరి–జూన్‌లో 56 శాతం వృద్ధితో 7,573 యూనిట్ల అమ్మకాలను రికార్డు చేసింది. సరఫరా సమస్యలు ఉన్నప్పటికీ ఈ ఘనత సాధించడం విశేషమని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో మార్టిన్ ష్వింక్ తెలిపారు. సెమికండక్టర్ల కొరత మరికొన్ని నెలలపాటు కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుతం 6,000లకుపైగా కార్లకు ఆర్డర్లు ఉన్నాయని వెల్లడించారు. భారతీయ కస్టమర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న అంతర్జాతీయ మోడళ్లు కొన్ని మూడవ త్రైమాసికంలో అడుగు పెట్టనున్నాయని వివరించారు. -
ఖరీదైన కారు కొనుగోలు చేసిన టీమిండియా క్రికెటర్
టీమిండియా స్టార్.. కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. మెర్సీడెస్కు చెందిన ఎస్యూవీ లగ్జరీ మెర్సీడెస్-ఏంఎంజీ జి 63ని రూ. 2.45కోట్లు పెట్టి కొన్నాడు. అయ్యర్ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయ్యర్ కొనుగోలు చేసిన కారు కేవలం 4.5 సెకన్లలో 100కిమీ వేగాన్ని అందుకుంటుంది. కాగా అయ్యర్ కారుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన మెర్సిడెస్ లగ్జరీ కార్ల కంపెనీ ట్వీట్ చేసింది. ''కంగ్రాట్స్ టూ టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్. అలాగే మా మెర్సిడెస్ బెంజ్ ఫ్యామిలీలోకి మీకు స్వాగతం. మెర్సిడెస్ బెంజ్‌లో కొత్త మోడల్ కారును కొనుగోలు చేసినందుకు ధన్యవాదాలు. మీ బ్యాటింగ్‌లో కవర్ డ్రైవ్స్ మేము బాగా ఎంజాయ్ చేస్తాం.. ఇప్పుడు మీరు మా కారు డ్రైవింగ్‌ను ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక ఐపీఎల్ 2022 సీజన్లో కేకేఆర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్ జట్టును విజేతగా నిలపడంలో విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లోనూ అంతగా రాణించని శ్రేయాస్ అయ్యర్.. కెప్టెన్‌గానూ మెరవలేదు. రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్ అయిన కేకేఆర్ ఐపీఎల్ 15వ సీజన్‌ను ఏడో స్థానంతో ముగించింది. జూన్ 9 నుంచి ప్రారంభం కానున్న సౌతాఫ్రికా సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ ఎంపికయ్యాడు. సీనియర్ల గైర్హాజరీలో శ్రేయాస్ అయ్యర్ జట్టుకు కీలకం కానున్నాడు. ఈ సిరీస్ ద్వారా శ్రేయాస్ తన ఫామ్‌ను తిరిగి అందుకుంటాడని క్రికెట్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బిగ్స్క్రీన్పై చారిత్రక టెస్టు సిరీస్.. రోమాలు నిక్కబొడుచుకునేలా ట్రైలర్ Liam Livingstone: బౌలర్లు అయిపోయారు.. పనిచేసేవాళ్లను కూడా వదిలిపెట్టవా! -
మెర్సిడెస్ బెంజ్ @ మేడ్ ఇన్ ఇండియా!
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ అయిదవ తరం సి–క్లాస్ సెడాన్ తయారీని భారత్‌లో ప్రారంభించింది. ఈ మోడల్ వచ్చే నెలలో మార్కెట్లో అడుగుపెట్టనుంది. సి200, సి200డి, సి300డి వేరియంట్లలో లభిస్తుంది. మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఉన్న చకన్ వద్ద కంపెనీకి ప్లాంటు ఉంది. 2001లో భారత్‌లో సి–క్లాస్ రంగ ప్రవేశం చేసింది. 37 వేల పైచిలుకు కార్లు రోడ్లపై పరుగెడుతున్నాయి. గతేడాది 43 శాతం అధికంగా అమ్మకాలు సాధించిన ఈ సంస్థ 2022లో రెండంకెల వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. 2022 జనవరి–మార్చిలో విక్రయాలు అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 26 శాతం అధికమై 4,022 యూనిట్లు నమోదైంది. ఈ ఏడాది 10 కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టాలన్నది సంస్థ ధ్యేయం. ఈక్యూఎస్ సెడాన్ ఎలక్ట్రిక్ మోడల్‌ను సైతం కంపెనీ ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ నుంచి దేశీయంగా అసెంబుల్ చేయనుంది. 2020 అక్టోబర్ నుంచి పూర్తిగా తయారైన ఈ ఎలక్ట్రిక్ కారును మెర్సిడెస్ భారత్‌కు దిగుమతి చేసుకుంటోంది. -
సంచలనం! ఎలన్ మస్క్‌కు ఎదురు దెబ్బ..ఈ ఎలక్ట్రిక్ కార్ రేంజ్ వెయ్యి కిలోమీటర్లు!
ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో ప్రథమ స్థానంలో ఉన్న ఎలన్ మస్క్‌కు ఎదురు దెబ్బ తగలనుంది. ఈవీ మార్కెట్లో టెస్లా కంటే మెర్సిడెజ్ బెంజ్ దూసుకొస్తుంది. మెర్సిడెజ్ బెంజ్‌కు చెందిన ఏజీ ఎలక్ట్రిక్ కార్ వెయ్యికంటే ఎక్కువ కిలోమీటర్ల రేంజ్లో మార్కెట్‌కి పరిచయం కానుందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. మెర్సిడెస్ బెంజ్ ఏజి ఈక్యూఎక్స్ఎక్స్ ఎలక్ట్రిక్ కారు సింగిల్ ఛార్జింగ్‌తో జర్మనీ నుండి ఫ్రెంచ్ రివేరాకు 1000 కిలోమీటర్ల (621 మైళ్ళు) పైగా ప్రయాణించిందని, ఈ విషయంలో మెర్సిడెజ్ బెంజ్ టెస్లాను అధిగమించినట్లు బ్లూమ్ బెర్గ్ నివేదిక హైలెట్ చేసింది. ఈక్యూఎక్స్ఎక్స్ ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ కారు జర్మనీ నుండి బయలుదేరి, స్విట్జర్లాండ్, ఇటలీ మీదుగా ఒకేసారి 12 గంటలు నాన్ స్టాప్ గా ప్రయాణించి, దాని బ్యాటరీ ప్యాక్ లో ఇంకా 140 కిలోమీటర్ల పరిధి ఉండగా ఫ్రాన్స్ కు చేరుకున్నట్లు మెర్సిడెస్ తెలిపింది. మెర్సిడెస్ ప్రకారం..ఫ్రాన్స్ చేరుకున్నప్పుడు బ్యాటరీ ప్యాక్ ఛార్జ్ సుమారు 15శాతం. ఇది 140 కిలోమీటర్ల (87 మైళ్ళు) మిగిలిన పరిధికి సమానం. సగటు వినియోగం 100 కిలోమీటర్లకు 8.7 కిలోవాట్ (62 మైళ్లకు 7.1 కిలోవాట్ల) రికార్డు స్థాయి కనిష్ట స్థాయికి చేరుకుంది. "మేం సాధించాం. 1000 కిలోమీటర్లకు పైగా ఒకే బ్యాటరీ ఛార్జ్ పై తేలికగా, సాధారణ రోడ్లమీద ట్రాఫిక్ లో సైతం కేవలం 8.7 కేడ్ల్యూహెచ్ /100 కేఎం (ప్రతి 62 మైళ్లకు 7.1 కేడ్ల్యూహెచ్) మాత్రమే వినియోగించింది. విజన్ ఈక్యూఎక్స్ఎక్స్ ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత సమర్థవంతమైన మెర్సిడెస్ అని మెర్సిడెస్ బెంజ్ గ్రూప్ ఎజి బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్మన్ ఓలా కాల్లెనియస్ చెప్పారు. మెర్సిడెస్ 2026నాటికి 60 బిలియన్ యూరోలు (65 బిలియన్ డాలర్లు) ఖర్చు చేసి టెస్లాను అధిగమించడానికి, దాని ప్రత్యర్థి బీఎండబ్ల్యూఎజి నుండి ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన లగ్జరీ కార్ల తయారీదారు అనే బ్రాండ్‌ను తిరిగి పొందాలని చూస్తుంది. ఈ దశాబ్దం చివరి నాటికి సాధ్యమైనంత వరకు ఈవీలను మాత్రమే విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భాగస్వాములతో ఎనిమిది బ్యాటరీ కర్మాగారాలను ఏర్పాటు చేయాలని మెర్సిడెజ్ బెంజ్ యాజమాన్యం యోచిస్తోంది. -
అమ్మకాల్లో దూసుకెళ్తున్న మెర్సిడెస్ బెంజ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది జనవరి–మార్చిలో 4,022 యూనిట్లు విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 26 శాతం అధికం. సెమికండక్టర్ల కొరత, సరఫరా అడ్డంకులు, ముడి సరుకు, రవాణా వ్యయాలు పెరిగినప్పటికీ ఎస్‌యూవీలు, సెడాన్స్‌కు విపరీత డిమాండ్ ఉందని కంపెనీ తెలిపింది. 4,000 యూనిట్లకు పైగా ఉన్న అత్యధిక ఆర్డర్ బుక్ రాబోయే నెలల్లో సానుకూల దృక్పథానికి దారి తీస్తుందని వివరించింది. అమ్మకాల్లో ఈ–క్లాస్ లాంగ్ వీల్‌బేస్ సెడాన్, జీఎల్సీ, జీఎల్ఏ, జీఎల్ఈ ఎస్‌యూవీలు టాప్‌లో నిలిచాయి. ఏఎంజీ, సూపర్ లగ్జరీ కార్ల విభాగం 35 శాతం వృద్ధి చెందింది. ప్రస్తుతం మోడల్‌నుబట్టి వెయిటింగ్ పీరియడ్ అత్యధికంగా 11 నెలల వరకూ ఉంది. చదవండి: యజమానులు ఉద్యోగులకు కార్లు గిప్ట్ గా ఇస్తారా? ఇదిగో ఈయన ఇస్తున్నాడు!! -
మెర్సిడెస్ బెంజ్ ప్రియులకు షాక్..!
ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన కారు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి తన మొత్తం మోడల్ కార్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు నేడు సంస్థ తెలిపింది. ఇన్ పుట్ ఖర్చుల పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణం అని కంపెనీ పేర్కొంది. కారు మోడల్ బట్టి రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. "మెర్సిడెస్ బెంజ్ వినియోగదారులకు సాటిలేని అనుభూతిని అందించడం కోసం అత్యంత అధునాతన సాంకేతికతను అందిస్తున్నాము. అయితే, వ్యాపారాన్ని స్థిరంగా నడపడానికి ఇన్ పుట్, కార్యాచరణ ఖర్చులలో నిరంతర పెరుగుదలను భర్తీ చేయడానికి ధరల దిద్దుబాటు అవసరం" అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండి & సీఈఓ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఆడి ఇండియా ఏప్రిల్ 1 నుంచి 3 శాతం వరకు తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. (చదవండి: హ్యాకర్ల దెబ్బకు వణికిపోతున్న రష్యా.. వెబ్సైట్లు డౌన్.!) -
బెంజ్ కారు బీభత్సం.. వాయువేగంతో దూసుకెళ్లి..
బనశంకరి(బెంగళూరు): వాయువేగంతో దూసుకువచ్చిన బెంజ్‌కారు అదుపుతప్పి వరుసగా వాహనాలను ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం హలసూరు పరిధిలో జరిగింది. నందితా చౌదరి అనే మహిళ కారు నడుపుతూ అదుపుతప్పి వేగంగా జనాల మీదకు దూసుకెళ్లింది. ముందు వెళ్తున్న రెండుకార్లు, ఆటో, టాటా ఏస్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహంత (35) అనేవ్యక్తి మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. బెంజ్ కారు కూడా నుజ్జునుజ్జయింది. గాయపడిన వారిని స్దానిక ఆసుపత్రికి తరలించారు. హలసూరు ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి.. మూడు రోజులుగా.. -
టెస్లాకు పోటీగా మెర్సిడిజ్ బెంజ్ సంచలన నిర్ణయం
ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో దూసుకుపోతున్న టెస్లా కంపెనీకి పోటీగా మెర్సిడిజ్ బెంజ్ సంచలనం నిర్ణయం తీసుకుంది. మెర్సిడెస్ బెంజ్‌తయారీదారు డైమ్లెర్ 2030 నాటికి 40 బిలియన్ల యూరోలను(సుమారు రూ. 3, 50,442 కోట్లు ) ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తోంది. డైమ్లెర్ నిర్ణయంతో టెక్నాలజీ మార్పులో భాగంగా ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై కోత విధించే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెర్సిడిజ్ బెంజ్ తన ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తు ప్రణాళికలను ప్రకటించింది. ఇతర భాగస్వాములతో సుమారు ఎనిమిది బ్యాటరీ ప్లాంట్లను ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకుంది. 2025 నుంచి, అన్ని కొత్త వాహన ప్లాట్‌ఫాంలలో ఈవీలను మాత్రమే తయారు చేస్తామని జర్మన్ లగ్జరీ వాహన తయారీ సంస్థ బెంజ్ పేర్కొంది. 2025 వరకు సాంప్రదాయ పెట్రోలు వాహనాల ఉత్పత్తిని జీరో చేయాలని భావిస్తోందని కంపెనీ చీఫ్ ఓలా కొల్లెనియస్ పేర్కొన్నారు. శిలాజ ఇంధనాల వాడకం తగ్గించడానికి పలు కంపెనీలు కీలక నిర్ణయాలను తీసుకున్నాయి. జనరల్ మోటార్స్, 2035, వోల్వో కార్స్ 2030 నాటికి పూర్తిగా శిలాజ ఇంధనాల వాహనాల ఉత్పత్తిని నిలిపివేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనరంగంలో టెస్లాకు పోటీగా ఎదగాలని కంపెనీలు ప్రణాళికలను రచిస్తున్నాయి. -
నీ లుక్ అదిరే సెడాన్, మెర్సిడెస్ నుంచి రెండు లగ్జరీ కార్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇండియా తాజాగా ఏఎంజీ బ్రాండ్‌లో రెండు సరికొత్త సెడాన్స్‌ను భారత్‌లో గురువారం ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ‘ఈ 53 4మేటిక్ ప్లస్’ ధర రూ.1.02 కోట్లు కాగా ‘ఈ 63 ఎస్ 4మేటిక్ ప్లస్’ ధర రూ.1.70 కోట్లు. ఏఎంజీ శ్రేణిలో అత్యంత వేగంగా ప్రయాణించే సెడాన్ ఈ 63 ఎస్ 4మేటిక్ ప్లస్ అని కంపెనీ సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ అయ్యర్ ఈ సందర్భంగా తెలిపారు. 9 స్పీడ్ మల్టీ క్లచ్ ట్రాన్స్మిషన్, 612 హెచ్‌పీ, 850 ఎన్ఎం టార్క్‌తో 4.0 లీటర్ వీ8 బైటర్బో ఇంజిన్‌ను దీనికి పొందుపరిచారు. 3.4 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 300 కిలోమీటర్లు. 435 హెచ్‌పీ, 520 ఎన్ఎం టార్క్‌తో ట్విన్ టర్బోచార్జింగ్‌తో ఎలక్ట్రిఫైడ్ 3.0 లీటర్ ఇంజిన్‌ను ఈ 53 4మేటిక్ ప్లస్‌కు జోడించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.5 సెకన్లలో చేరుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. వైడ్‌స్క్రీన్ కాక్‌పిట్, ఏఎంజీ పెర్ఫార్మెన్స్ స్టీరింగ్ వీల్, ఎంబక్స్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ వంటి హంగులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంస్థకు 94 విక్రయ కేంద్రాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కారును కొనుగోలు చేయవచ్చు. -
మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
ముంబై: మెర్సిడెస్ బెంజ్ తన కొత్త ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్ విభాగానికి ఏ-క్లాస్ లిమోసిన్ మోడల్ కారును గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.39.90 లక్షలు (ఎక్స్‌షోరూమ్). ఈ మోడల్ ఏ200, ఏ200డి, ఏఎంజీ ఏ 35 4ఎంఏటీఐసీ... మూడు వేరియంట్లలో లభిస్తుంది. కాగా, మోడల్ ధరలపై జూలై 1 తర్వాత రూ. లక్ష దాకా పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో లభించే ఈ మోడల్ ట్రాన్స్మిషన్, ఇంజిన్లపై కంపెనీ ఎనిమిదేళ్ల పాటు వారెంటీని ఇస్తుంది. భారత్‌లో విలాస కార్లను కోరుకునే కస్టమర్లు ఎంతో కాలంగా ఎదురుచూసిన మెర్సిడెస్ బెంజ్ ఏ-క్లాస్ మోడల్ ఇక్కడి మార్కెట్లో విడుదల చేయడం తమకెంతో ఆనందంగా ఉందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మారి్టన్ ష్వెంక్ తెలిపారు. చదవండి: భారత మార్కెట్లోకి బీఎండబ్య్యూ 220ఐ స్పోర్ట్ -
ఎస్బీఐతో బెంజ్ జట్టు: ప్రత్యేక ఆఫర్లు
సాక్షి,ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భాగస్వామ్యాన్నికుదుర్చుకుంది. తద్వారా తన వినియోగదారులకు ఆకర్షణీయమైన వడ్డీరేటుతోపాటు, ఇతర ప్రయోజనాలను కల్పించనుంది. అలాగే ఎస్బీఐ యోనో ద్వారా కార్లను కొనుగోలు చేసినవారికి అదనపు ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. తమ లగ్జరీ కార్లను బుక్ చేసుకున్న ఎస్బీఐ కస్టమర్లకు తక్కువ వడ్డీరేట్లకే కార్ల ఫైనాన్సింగ్, ఇతర అనేక ఆర్థిక ప్రయోజనాలను అందించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు బెంజ్ మంగళవారం తెలిపింది. అలాగే ఎస్బీఐ డిజిటల్ ప్లాట్‌ఫామ్ యోనో ద్వారా బెంజ్ కార్లను కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. బెంజ్ కారును బుక్ చేసుకునే వినియోగదారులందరికీ డీలర్‌షిప్‌ల వద్ద రూ.25 వేల అదనపు ప్రయోజనం లభిస్తుందని తెలిపింది. డిసెంబర్ 31 వరకు ఇవి అమల్లో ఉండనున్నాయి. మెర్సిడెస్ బెంజ్ కొత్త కస్టమర్లను చేరుకోవడానికి కొత్త మార్గాలను నిరంతరం అన్వేషిస్తోందనీ, అలాగే ఒక బ్యాంకుతో టై అప్ కావడం ఇదే మొదటిసారని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ అండ్ సీఈవొ మార్టిన్ ష్వెంక్ అన్నారు. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలోని మొత్తం 17 సర్కిల్లలోని ఎస్బీఐ హెచ్ఎన్ఐ(అధిక నికర-విలువ గల వ్యక్తులు) కస్టమర్లకు మెర్సిడెస్ బెంజ్ సహకారంతో ఆఫర్లను అందిస్తున్నామని ఎస్బీఐ రీటైల్ అండ్ డిజిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎస్ సెట్టి చెప్పారు. పండుగ సీజన్లో ఈ అవకాశాన్నిఉపయోగించుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
కారు రివర్స్ తీస్తుండగా ప్రమాదవశాత్తూ..
న్యూఢిల్లీ : బుడిబుడి అడుగులేస్తూ ఆడుకుంటున్న ఆ చిన్నారిని కారు రూపంలో మృత్యువు కబళించింది. అపార్ట్మెంట్ సెల్లార్లో కారు రివర్స్ తీస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలోని తిలక్ నగర్లో చోటుచేసుకుంది. (దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు) రాధిక అనే 10 నెలల చిన్నారి తన ఇంటి కిందనే ఉన్న పార్కింగ్ స్థలంలో ఆడుకుంటుంది. అదే సమయంలో అఖిలేష్ అనే డ్రైవర్ మెర్సిడిస్ బెంజ్ కారును రివర్స్ తీశాడు. ఈ క్రమంలో కారు వెనక భాగం బాలికను ఢీకొంది. తీవ్రగాయాలైన బాలికను డీడీయూ ఆసుపత్రికి తరలించగా, బాలిక మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కారు యజమాని జస్బీర్ సింగ్‌గా గుర్తించారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (కరోనా ఎఫెక్ట్; వైద్యానికీ ఆధార్!) -
‘బెంజ్’ కార్లలో నిఘా నేత్రం
జర్మనీకి చెందిన ఖరీదైన కార్ల కంపెనీ ‘మెర్సిడెస్ బెంజ్’ కార్లలో వినియోగదారులకు తెలియని ఓ రహస్య ఫీచర్ ఉన్నట్లు మొట్టమొదటి సారిగా వెలుగులోకి వచ్చింది. అదే నిఘా నేత్రం. దాన్నే ట్రాకింగ్ డివైస్ అని, లొకేషన్ సెన్సర్ అని కూడా పిలుస్తారు. ఈ నిఘా నేత్రం ఫీచర్ ద్వారా ఆ కారు ఎక్కడ, ఎప్పుడుందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఈ విషయం తెల్సిన వినియోగదారులు తమ ‘గోప్యత’ గుట్టు రట్టవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక కార్లలో కులాసాగా తిరిగే విలాస కుర్రవాళ్లయితే లబోదిబోమంటున్నారు. 1,70,000 మెర్సిడెస్ బెంజ్ కార్లను గతేడాది ఒక్క బ్రిటన్‌లోనే అమ్మామని, వాటన్నింటిలోనూ ఈ నిఘా నేత్రం ఉందని కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. తాము ఎలాంటి దురుద్దేశంతోని ఈ లొకేషన్ సెన్సర్‌ను ఏర్పాటు చేయలేదని, అత్యవసర సమయాల్లోనే ఈ సెన్సర్ ఉపయోగాన్ని వాడుకుంటామని యాజమాన్యం పేర్కొంది. థర్ట్ పార్టీ ఆర్థిక సహాయంతో ఈ కారును కొన్నవాళ్లు ఆ పార్టీని మోసం చేసిన పక్షంలో కారు ఎక్కడుందో, ఎక్కడి నుంచి కారును స్వాధీనం చేసుకోవచ్చో తెలియజేయడం కోసం ఈ ఏర్పాటు చేశామని, వారికి యజమాని వివరాలతోపాటు కారున్న చోటుకు సంబంధించిన సమాచారం ఇస్తామని యాజమాన్యం వివరించింది. కొత్త కార్లతోపాటు వాడిన కార్లలో కూడా ఈ సెన్సర్‌ను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. అయితే ఐరోపా డేటా రక్షణ చట్టం నిబంధనల ప్రకారం కార్లలో ఇలాంటి ‘నిఘా నేత్రా’లను ఏర్పాటు చేయకూడదు. తాము కార్లను అమ్మేటప్పుడే వినియోగదారుల నుంచి లొకేషన్ సెన్సర్ల ఏర్పాటుకు అనుమతి తీసుకుంటున్నామని కూడా యాజమాన్యం తెలియజేసింది. కార్లను కొనేటప్పుడు, ముఖ్యంగా ఫైనాన్స్‌లో కొనేటప్పుడు అనేక కాగితాల మీద సంతకాలు తీసుకుంటారని, అలాంటప్పుడు ఈ నిబంధన దేనికో ఎవరు క్షుణ్నంగా చదవి సంతకాలు చేస్తారని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. తమ కార్ల అమ్మకాల్లో 80 శాతం అమ్మకాలు థర్డ్ పార్టీ ఫైనాన్స్‌తోని జరగుతాయని, అందుకని ఈ ఫీచర్ తప్పనిసరి అయిందని కూడా యాజమాన్యం వాదిస్తోంది. అయితే ఈ సెన్సర్లపై దర్యాప్తు జరపాల్సిందిగా లండన్ మాజీ రక్షణ మంత్రి డేవిడ్ డేవిస్ ఆదివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కంపెనీ ఇలా ‘బిగ్ బ్రదర్’లా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదని, ఈ కంపెనీ మీద ఇంతకు ముందు కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. అయితే తాను సెన్సర్ల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఇలా మూడో పార్టీకి అందించడం చట్టపరంగా ఎంతమేరకు సమంజసమో కూడా పరిశీలించాల్సి ఉందని ఆయన చెప్పారు. తమ కార్లలో మాత్రం ఇలాంటి నిఘా నేత్రం లేదని బీఎండబ్లూ, జాగ్వర్ ల్యాండ్ రోవర్, వోక్స్వాగన్ కార్ల కంపెనీలు స్పష్టం చేశాయి. ఇలాంటి ఫీచర్ అవసరమైతే ఎక్కువగా చోరీలకు గురవుతున్న ఫోర్డ్ కంపెనీలకు ఉండాలిగానీ మెర్సిడెస్ బెంచీలకు ఎందుకని ప్రశ్నిస్తున్నవారు లేకపోలేదు. ఈ ఒక్క సంవత్సరమే 1557 ఫోర్డ్ కారులు చోరీకి గురయ్యాయి. -
బెంజ్ కార్లపై బంపర్ ఆఫర్లు
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారతీయ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవలి కాలంలో తమ కార్ల అమ్మకాలు పడిపోయిన నేపథ్యంలో, కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు పలు ఆఫర్లను అందిస్తోంది మెర్సిడెస్ బెంజ్. ముఖ్యంగా దఫల వారీ చెల్లింపుల అవకాశాన్ని అందిస్తోంది. ఇంకా సరసమైన ఈఎంఐ సదుపాయం, రెండేళ్ల కాంప్లింమెంటరీ ఇన్సూరెన్స్ లాంటి ఆఫర్లను అందిస్తోంది. ఎంపిక చేసిన మోడళ్లపై ఈ ఆఫర్లను అందించనున్నమాని బెంజ్ గురువారం ప్రకటించింది. ఈ ఆఫర్లకు తోడు రెండు తమ వాహనాలపై తాజా అప్‌గ్రేడ్స్‌ను అదనంగా ఎలాంటి చార్జ్ వసూలు చేయకుండానే అందిస్తామని మెర్సిడెస్ బెంజ్ ప్రకటనలో తెలిపింది. ఆఫర్లలో భాగంగా, ఒక కస్టమర్ వాహనం ఖరీదులో నాలుగింట ఒక వంతు ప్రారంభ చెల్లింపుగా చెల్లించి, మిగిలిన మొత్తాన్ని మూడు సమాన వార్షిక వాయిదాలలో చెల్లించి మెర్సిడెస్ బెంజ్ కారును సొంతం చేసుకోవచ్చు. సి, ఇ, ఎస్-క్లాస్, సీఎల్ఎ, జీఎల్ఎ, జీఎల్సి, జీఎల్ఇ, జీఎల్ఎస్ మోడళ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇది కాకుండా, కస్టమర్ 60 నెలల ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుని కారును కూడా సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు..40 శాతం దాకా తక్కువ ఈఎంఐ ఆఫర్ కూడా అందిస్తోంది. మెయింటెనెన్స్, వారంటీ, కచ్చితమైన బై బ్యాక్ ఆఫర్ కూడా ఇందులో భాగం. దీంతోపాటు రెండేళ్ల కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ ఉచితం. కొనుగోలు విషయంలో వినియోగదారుడికి ఆర్థిక సౌలభ్యాన్ని అందించడం ద్వారా కస్టమర్ విశ్వాసాన్ని తిరిగి పొందాలనే లక్ష్యంతో ఈ ఆఫర్లను తీసుకొచ్చామని, భారతీయ వినియోగదారుల నాడిని అర్థం చేసుకున్నామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. అలాగే తమ మొత్తం పోర్ట్‌ఫోలియో బీఎస్ -6 నిబంధనలకనుగుణంగా క్రమంగా ముందుకు సాగుతోందన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 60 శాతం సాధించామని, 2019 సెప్టెంబర్ నాటికి 80 శాతానికి చేరుకుంటుందని ఆయన అన్నారు. ఏప్రిల్, 2020 కాలపరిమితి కంటే ముందే తమ మొత్తం పోర్ట్‌ఫోలియో బీఎస్-6 పరివర్తన సాధిస్తామన్నారు. ఆటో పరిశ్రమ 2001 నుండి మందగమనాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గత ఏడాది 40 వేల యూనిట్లకు పైగా విక్రయించిన సంస్థ ప్రస్తుత సంవత్సరం జనవరి-జూన్ కాలంలో 3 నుంచి 5 వేల కార్లను విక్రయించింది. -
ఫెరారీకి ఏమైంది...
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా వన్ అంటే సగటు ఫార్ములా వన్ అభిమానికి టపీమని గుర్తొచ్చే పేరు ఫెరారీ.. ఇప్పటి వరకూ ఫార్ములా వన్‌లో 235 రేసులకు పైగా విజయాలతో మిగతా టీంలకు అందనంత ఎత్తున నిలిచిన ఈ ఇటాలియన్ టీం ప్రస్తుతం విజయాల కోసం ఎదురు చూస్తోంది. చివరి సారిగా 2007లో కిమిరైకోనెన్ను ప్రపంచ డ్రైవర్ చాంపియన్‌ను చేసిన ఫెరారీ తిరిగి మళ్లీ ఆ ఘనతను సాధించలేకపోయింది. ప్రస్తుతం జరుగుతున్న హైబ్రీడ్ ఎరాలో మెర్సిడెస్ ముందర మోకరిల్లింది. 90 ఏళ్ల రేసింగ్ చరిత్ర కలిగిన ఫెరారీ నేడు దారుణంగా విఫలమవుతుండడం సగటు ఫెరారీ అభిమానికే కాకుండా ఫార్ములా వన్‌తో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తిని బాధించే అంశం 2019 ఫార్ములా వన్ సీజన్ మొదలై ఇప్పటికే దాదాపు రెండు నెలలు కావొస్తుంది. 5 రేసులు ముగిసే సరికి మాజీ ప్రపంచ రేసింగ్ చాంపియన్ అయిన ఫెరారీ ఒక్క రేసు కూడా గెలవకపోవడాన్ని ఫెరారీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరిగిన ప్రీ సీజన్ టెస్టింగ్‌లో దూకుడును ప్రదర్శించిన ఫెరారీ సీజన్ ఆరంభం తరువాత మెర్సిడెస్ పేస్‌కు తలవంచింది. 2019 సీజన్ మొదటి గ్రాండ్ ప్రీ అయిన ఆస్ట్ర్రేలియాలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగిన ఫెరారీ అంచనాలను అందుకోలేక 4, 5 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. తదుపరి జరిగిన బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ రేసులో క్వాలిఫయింగ్‌లో పోల్ సాధించడంతో పాటు ఫ్రంట్ రోని లాక్ చేసిన ఫెరారీ గాడిలో పడిందని అందరూ అనుకున్నారు. అయితే రేసు రోజున ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపంతో గెలవాల్సిన రేసును ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెరిక్ మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అదే రేసులో రెండో స్థానం నుంచి మొదలు పెట్టిన మరో ఫెరారీ డ్రైవర్, మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ చేసిన చిన్న పొరపాటు వలన 5వ స్థానంతో ముగించాడు. అదే విధంగా మూడో రేసైన చైనా గ్రాండ్ ప్రీలో మెర్సిడెస్కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. పని చేయని అప్‌గ్రేడ్స్ చైనా రేసులో అంచనాలను అందుకోలేక పోయిన ఫెరారీ తదుపరి రేసు అయిన అజర్బైజాన్ గ్రాండ్ ప్రీ కోసం ఫ్రంట్ వింగ్ అప్‌గ్రేడ్స్‌తో ముందుకొచ్చింది. అయినా ఫెరారీ దురదృష్టంలో ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో స్పానిష్ గ్రాండ్ ప్రీ కోసం ఇంజన్ అప్‌గ్రేడ్ చేసినా ఫెరారీ అభిమానులకు మాత్రం నిరాశే మిగిలింది. డిజైన్ కాన్సెప్ట్‌లో తప్పుంది 2019 సీజన్ కారు అయినటువంటి ఎస్ఎఫ్-90ఎచ్ కారు డిజైన్ కాన్సెప్ట్‌లో తప్పుందని టీం ప్రిన్సిపల్ మాటియా బినొట్టో స్పానిష్ గ్రాండ్ ప్రీ రేసు అనంతరం వ్యాఖ్యానించారు. కార్నర్స్‌లో మెర్సిడెస్, రెడ్‌బుల్ కార్ల కంటే వేగంగా వెళ్లలేకపోతున్నామని, అయితే స్ట్నేయిట్ లైన్ స్పీడులో మా ఇంజిన్ అద్భుతంగా పని చేస్తోందని ఆయన అన్నారు. అయితే 2016 సీజన్ మాదిరే ఈ సీజన్ కూడా ఫెరారీ ఒక్క విజయం నమోదు చేయకుండానే ముగిస్తుందేమోననే ఆందోళనలో ఫెరారీ అభిమానులున్నారు. -
కొత్త బెంజ్ కారు లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: లగ్జరీ కార్ మేకర్ మెర్సిడెస్-బెంజ్ కొత్త కారును లాంచ్ చేసింది. ఏఎంజీ సీ 43 కూపే 2019 వెర్షన్‌న లగ్జరీ కారును గురువారం ఆవిష్కరించింది. దీని ధరను రూ. 75 లక్షలుగా ( ఎక్స్ షో రూం ) నిర్ణయించింది. టూ డోర్ కూపే 3.0 లీటర్ వీ 6 టర్బో ఇంజీన్‌తో రూపొందించింది. ఇది 287 కిలోవాట్స్ శక్తి. 520 గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4.7 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఔత్సాహిక యువ వాహన చోదకుల కోసం మెర్సిడెస్ ఏఎంసీ బ్రాండ్‌లో కొత్త మోడల్ ప్రవేశపెట్టడం చాలా ఆనందంతంగా ఉందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మార్టిన్ స్కువెంక్ చెప్పారు. -
మెర్సిడెస్ బెంజ్ కొత్త తరం సి–క్లాస్ కారు
ముంబై: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ తాజాగా సి–క్లాస్‌లో కొత్త తరం కార్ల శ్రేణిని ప్రవేశపెట్టింది. బీఎస్–6 ప్రమాణాలకు అనుగుణమైన డీజిల్ ఇంజిన్‌తో ఇది పనిచేస్తుంది. ఇందులో సి 220డి ప్రైమ్ ధర రూ. 40 లక్షలు, సీ 220డి ప్రోగ్రెసివ్ రేటు రూ. 44.25 లక్షలు, టాప్ ఎండ్ సి 300డి ఏఎంజీ ధర రూ. 48.50 లక్షలుగా ఉంటుందని మెర్సిడెస్ బెంజ్ వెల్లడించింది. ప్రస్తుత సి–క్లాస్‌తో పోలిస్తే లేటెస్ట్ కారులో దాదాపు 50 శాతం మేర కొత్త మార్పులు చేసినట్లు, 6,500 పైచిలుకు కొత్త విడిభాగాలు ఇందులో ఉపయోగించినట్లు వివరించింది. సి 220డి విక్రయాలు గురువారం నుంచి ప్రారంభం అయినట్లు, సి 300డి అమ్మకాలు మాత్రం డిసెంబర్ త్రైమాసికంలో ప్రారంభం కానున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ జాప్ తెలిపారు. భారత మార్కె ట్లో ప్రవేశపెట్టినప్పట్నుంచి ఇప్పటిదాకా 30,500 పై చిలుకు సి–క్లాస్ కార్లు యూనిట్లు అమ్ముడయ్యాయని, ఇక్కడ తమకు అత్యధిక విక్రయాలు ఉన్న టాప్ మోడల్స్‌లో ఇది ఒకటని ఆయన పేర్కొన్నారు. -
త్వరలో అలరించబోతున్న కొత్త కార్లు
కొత్త కారు అంటే ... ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుంది. మార్కెట్లోకి ఎప్పుడు ఏ కొత్త కారు వస్తుందా? అని ఎదురు చూసే ఆటోప్రియులు చాలా మందే. ఈ ఏడాది ఇంకా నాలుగు నెలలే ఉంది. ఆటో ఎక్స్ 2018లో చెప్పిన మేరకు ఈ నాలుగు నెలల్లో 11 కార్ల మేర మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే త్వరలోనే ఆటో ప్రియులను అలరించనున్న ఈ కార్లేమిటో ఓ సారి తెలుసుకుందామా? మెర్సిడెస్-బెంజ్ సీ-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ : కొత్త ఇంజిన్లతో మెర్సిడెస్-బెంజ్ సీ-క్లాస్ ఫేస్‌లిఫ్ట్ ఆటో అభిమానుల ముందకు వస్తుంది. దాంతో పాటు ఎక్స్టీరియర్స్లో కూడా పలు మార్పులను చేపట్టింది మెర్సిడెస్ బెంజ్. ఇప్పటికే ఈ వెహికిల్ టెస్ట్ డ్రైవ్ అయిపోయిందట. మొత్తం లగ్జరీ లుక్, అద్భుతమైన ప్రదర్శనలో ఇది అభిమానులను అలరించబోతుంది. దీని ధర రూ.42 లక్షల నుంచి రూ.48 లక్షల వరకు ఉంటుంది. 2018 అక్టోబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్ ఆల్-టెర్రైన్: ఆటో ఎక్స్‌పోలో సందర్శకుల నుండి ఎక్కువ ఆదరణ లభించిన వాటిలో మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించిన ఇ-క్లాస్ ఆల్ టెర్రైన్ కారు ఒకటి. మెర్సిడెస్ ఇ-క్లాస్ ఎస్టేట్ వెర్షన్ రివైజ్డ్ వెర్షనే ఈ ఇ-క్లాస్ ఆల్ టెర్రైన్. దీనిని తొలుత 216లో ప్యారిస్ మోటార్ షోలో ఆవిష్కరించారు. దీనిని ప్రస్తుతం మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. దీని ధర రూ.65 లక్షల మేర ఉండొచ్చు. సెప్టెంబర్‌లో ఇది లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి. 2018 మారుతీ ఎర్టిగా : ఇది సెవన్-సీటర్ ఎంపీవీ. ఇది చాలా తేలికగా, చాలా పీచర్లతో వస్తుంది. కొత్త ఇంజిన్లను దీనిలో పొందుపరిచారు. నెక్సా రిటైల్ స్టోర్లు వీటిని విక్రయించబోతుంది. దీని ధర రూ.7 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఉంటుంది. అక్టోబర్‌లో ఈ వెహికిల్ లాంచింగ్. ఫోర్డ్ ఫిగో అండ్ ఫోర్డ్ యాస్పైర్ ఫేస్‌లిఫ్ట్ : ఈ ఫిగో సిబ్లింగ్స్ అత్యంత శక్తివంతమైన 1.2 లీటరు డ్రాగన్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో మార్కెట్లోకి వస్తున్నాయి. అదనపు సేఫ్టీ ఫీచర్లు, పలు వినూత్న ఫీచర్లతో ఇది లాంచ్ కాబోతున్నాయి. యాస్పైర్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ.5.20 లక్షల నుంచి రూ.9 లక్షలుండగా.. ఫిగో ధర రూ.4.80 లక్షల నుంచి రూ.7.80 లక్షలుగా ఉన్నాయి. తొలుత సెప్టెంబర్‌లో యాస్పైర్ను లాంచ్ చేసి, ఆ అనంతరం ఫిగోను మార్కెట్లోకి తేబోతున్నారు. మహింద్రా మారాజ్జో : ఎక్కువ స్పేస్ కలిగి, ఏడు సీట్లతో రాబోతున్న వెహికిల్ మహింద్రా మారాజ్జో. దీని ధర రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఉంటుంది. లాంచ్ తేదీ : 2018 సెప్టెంబర్ 3. మహింద్రా ఎస్201 : సబ్-కాపాక్ట్ ఎస్యూవీ స్పేస్‌లో మరో వాహనం మహింద్రా ఎస్201. మారుతీ విటారా బ్రిజా, ఎకోస్పోర్ట్, టాటా నెక్సోన్కు ఇది డైరెక్ట్ పోటీ దారిగా నిలువబోతుంది. దీని ధర రూ.7 లక్షల నుంచి రూ.11 లక్షల మధ్యలో ఉంది. 2018 అక్టోబర్‌లో దీని లాంచింగ్. 2018 హోండా సీఆర్-వీ : ఇప్పటికే మార్కెట్లలో ఐదు తరం సీఆర్-వీ ఉంది. భారత్‌లో ఏడు సీట్ల అవతార్‌గా రాబోతున్న తొలి వాహనం ఇదే. 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఇది కలిగి ఉండబోతుండగా.. తొలిసారి దీని ద్వారా 1.6 లీటర్ ఇంజిన్‌ను ప్రవేశపెడుతోంది. డస్టన్ జీఓ, జీవో ప్లస్ ఫేస్‌లిఫ్ట్ : ఎక్స్టీరియర్లో స్వల్ప మార్పులతో, లోపల కొత్త ఫీచర్లతో డస్టన్ ఈ వాహనాలను తీసుకొస్తోంది. టచ్‌స్క్రీన్, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ను ఇవి కలిగి ఉంటాయి. దీని ధర రూ.3.50 లక్షల నుంచి రూ.4.80 లక్షల వరకు ఉండబోతున్నాయి. లాంచింగ్ : 2018 సెప్టెంబర్. జీప్ కంపాస్ ట్రైల్హాక్ : భారత్‌లో ఇదే అత్యంత ఖరీదైన కంపాస్ మోడల్. దీని ధర రూ.23 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఉండొచ్చని సమాచారం. లాంచింగ్ : 2018 అక్టోబర్. నిసాన్ కిక్స్ : నిసాన్ కంపెనీ కిక్స్‌పై భారీ ఆశలే పెట్టుకుంది. టెర్రానో వంటి బ్రో ప్లాట్‌ఫామ్ ఆధారితంగా ఈ వెహికిల్ లాంచ్ చేస్తోంది. దీని ధర రూ.9.90 లక్షల నుంచి రూ.14 లక్షలు ఉంటుందని అంచనా. డిసెంబర్లో దీన్ని లాంచ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. హ్యుందాయ్ శాంట్రో : హ్యుందాయ్ శాంట్రో బడ్జెట్ కార్ కస్టమర్ల మదిలో ఇప్పటికీ బెస్ట్ కారుగానే నిలిచింది. భారత్‌లో హ్యుందాయ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన మోడల్ శాంట్రో. ఆశించి ఫలితాలు సాధించడం లేదనే కారణం చేత శాంట్రో కారును విపణి నుండి తొలగించిప్పటికీ దీనికి ఉన్న డిమాండ్ ఇంకా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ తమ శాంట్రో కారును మళ్లీ లాంచ్ చేయడానికి సిద్దమైంది. 2018 అక్టోబర్‌లో ఇది లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.