బీఎండబ్ల్యూ ఇండియా (BMW India) తన నాల్గవ తరం ఎక్స్3 (X3)ని ఆటో ఎక్స్‌పో 2025లో లాంచ్ చేసింది. ఇది పెట్రోల్, డీజిల్ వేరియంట్ల రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 75.80 లక్షలు, రూ. 77.80 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ మోడల్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు ఏప్రిల్‌లో ప్రారంభమవుతాయి.
2025 బీఎండబ్ల్యూ ఎక్స్3 రెండు మోడల్స్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతాయి. పెట్రోల్ మోడల్ 190 హార్స్ పవర్, 310 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డీజిల్ వెర్షన్ 197 హార్స్ పవర్, 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
లేటెస్ట్ డిజైన్ కలిగిన బీఎండబ్ల్యూ ఎక్స్3 కారు.. స్లిమ్ హెడ్‌లైట్స్, కిడ్నీ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇందులో 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్, 14.9 ఇంచెస్ డ్రైవర్ డిస్‌ప్లే వంటివి ఉంటాయి. హీటెడ్ స్పోర్ట్స్ సీట్లు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, పార్క్ అసిస్ట్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేషన్ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, రిక్లైనింగ్ రియర్ బెంచ్ వంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment