మారుతి సుజుకి (Maruti Suzuki) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈ విటారా (e Vitara)ను లాంచ్ చేసింది. Heartect-e ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మితమైన ఈ కారు.. విశాలమైన క్యాబిన్, దృఢమైన నిర్మాణం కలిగి ఉంటుంది. దీని ఉత్పత్తిని కంపెనీ గుజరాత్ ప్లాంట్‌లో త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది.
సరికొత్త మారుతి సుజుకి ఈ విటారా ట్విన్ డెక్ ఫ్లోటింగ్ కన్సోల్‌తో కూడిన డిజిటల్ కాక్‌పిట్, కొత్త స్టీరింగ్ వీల్, ఫిక్స్‌డ్ గ్లాస్ సన్‌రూఫ్, మల్టీ కలర్ యాంబియంట్ లైటింగ్‌తో కూడిన సాఫ్ట్ టచ్ డ్యూయల్ టోన్ మెటీరియల్స్ వంటివి పొందుతుంది. వీటితో పాటు ఈ కారులో 10.1 ఇంచెస్ డిజిటల్ డిస్‌ప్లే, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెనుక సీటులోని ప్రయాణికుల కోసం 40:20:40 స్ప్లిట్ కాన్ఫిగరేషన్, రిక్లైనింగ్ అండ్ స్లైడింగ్ ఫంక్షనాలిటీ మొదలైనవన్నీ ఉన్నాయి.
ఇదీ చదవండి: Auto Expo 2025: ఒక్క వేదికపై లెక్కలేనన్ని వెహికల్స్
ఈ విటారా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ పొందనుంది. అవి 49 కిలోవాట్, 61 కిలోవాట్ బ్యాటరీ. పెద్ద బ్యాటరీ ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సిస్టమ్‌తో కూడా అందుబాటులో ఉంది. మారుతి ఖచ్చితమైన రేంజ్ వివరాలను అధికారికంగా వెల్లడించనప్పటికీ, పెద్ద బ్యాటరీ ప్యాక్ 500కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ధరలు కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని ప్రారంభ ధర రూ. 17 లక్షలు ఉండే అవకాశం ఉంది.
Get Ready to witness your dream car Maruti Suzuki’s Electric SUV e VITARA https://t.co/WNFuX1hGsM
— Maruti Suzuki (@Maruti_Corp) January 17, 2025
Comments
Please login to add a commentAdd a comment