రెండేళ్లకు ఒకసారి జరిగే 'ఆటో ఎక్స్‌పో 2025' (Auto Expo 2025) కార్యక్రమాన్ని దేశ ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' (Narendra Modi) ప్రారంభించారు. ఈ ఈవెంట్‌కు దిగ్గజ వాహన తయారీ సంస్థలు హాజరవుతాయి. ఇది ఈ రోజు (జనవరి 17) నుంచి 22వ తేదీ వరకు జరుగుతాయి. కాగా ఆటో ఎక్స్‌పో మొదటిరోజు లాంచ్ అయిన టూ వీలర్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
హోండా యాక్టివా ఈ (Honda Activa e)
హోండా మోటార్‌సైకిల్ కంపెనీ గత ఏడాది మార్కెట్లో ఆవిష్కరించిన కొత్త 'యాక్టివా ఈ' (Activa e) ధరలను 'భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2025' వేదికపై ప్రకటించింది. ఈ స్కూటర్ 1.17 లక్షల నుంచి రూ. 1.52 లక్షల మధ్య ఉంది. ఈ స్కూటర్ 1.5 కిలోవాట్ స్వాపబుల్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక సింగిల్ ఛార్జితో 102 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. దీని టాప్ స్పీడ్ 80 కిమీ/గం. కాగా ఇది 7.3 సెకన్లలో 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
హోండా క్యూసీ1 (Honda QC1)
ఆటో ఎక్స్‌పోలో కనిపించిన టూ వీలర్లలో హోండా క్యూసీ1 కూడా ఒకటి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 90,000. ఇందులో 1.5 కిలోవాట్ బ్యాటరీ 80 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 50 కిమీ/గం. ఈ స్కూటర్ 330 వాట్స్ ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 6:50 గంటలు. ఇది 9.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ 300 (TVS RTX 300)
టీవీఎస్ కంపెనీ కూడా భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2025లో ఆర్‌టీఎక్స్ 30 బైకును ఆవిష్కరించింది. పలుమార్లు ఈ బైకును టెస్ట్ చేసిన తరువాత ఈ రోజు (జనవరి 17) అధికారికంగా ప్రదర్శించింది. ఇది బ్రాండ్ మొట్టమొదటి అడ్వెంచర్ బైక్. ఇందులోని 299 సీసీ ఇంజిన్ 35 హార్స్ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.
ఇదీ చదవండి: ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ పయనం
టీవీఎస్ జుపీటర్ సీఎన్‌జీ (Bajaj Jupiter CNG)
టీవీఎస్ కంపెనీ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తన జుపీటర్ సీఎన్‌జీ ప్రదర్శించింది. ఈ స్కూటర్ ఫ్రీడమ్ 125 బైక్ మాదిరిగానే పెట్రోల్, సీఎన్‌జీతో పనిచేస్తుంది. కాబట్టి మంచి పనితీరును అందించడమే కాకుండా.. ఎక్కువ మైలేజ్ కూడా అందిస్తుందని సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. దీని ధర రూ. 1 లక్ష నుంచి రూ. 1.10 లక్షల మధ్య ఉంటుందని సమాచారం.
టీవీఎస్, బజాజ్ బ్రాండ్ వెహికల్స్ మాత్రమే కాకుండా.. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీలు కూడా ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తమ కొత్త వాహనాలను, రాబోయే వాహనాలను ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment