Bharat Mobility Global Expo 2025
-
ఆటో ఎక్స్పో 2025: ఆకట్టుకున్న ఈ విటారా
మారుతి సుజుకి (Maruti Suzuki) భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈ విటారా (e Vitara)ను లాంచ్ చేసింది. Heartect-e ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మితమైన ఈ కారు.. విశాలమైన క్యాబిన్, దృఢమైన నిర్మాణం కలిగి ఉంటుంది. దీని ఉత్పత్తిని కంపెనీ గుజరాత్ ప్లాంట్‌లో త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది.సరికొత్త మారుతి సుజుకి ఈ విటారా ట్విన్ డెక్ ఫ్లోటింగ్ కన్సోల్‌తో కూడిన డిజిటల్ కాక్‌పిట్, కొత్త స్టీరింగ్ వీల్, ఫిక్స్డ్ గ్లాస్ సన్‌రూఫ్, మల్టీ కలర్ యాంబియంట్ లైటింగ్‌తో కూడిన సాఫ్ట్ టచ్ డ్యూయల్ టోన్ మెటీరియల్స్ వంటివి పొందుతుంది. వీటితో పాటు ఈ కారులో 10.1 ఇంచెస్ డిజిటల్ డిస్ప్లే, 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెనుక సీటులోని ప్రయాణికుల కోసం 40:20:40 స్ప్లిట్ కాన్ఫిగరేషన్, రిక్లైనింగ్ అండ్ స్లైడింగ్ ఫంక్షనాలిటీ మొదలైనవన్నీ ఉన్నాయి.ఇదీ చదవండి: Auto Expo 2025: ఒక్క వేదికపై లెక్కలేనన్ని వెహికల్స్ఈ విటారా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ పొందనుంది. అవి 49 కిలోవాట్, 61 కిలోవాట్ బ్యాటరీ. పెద్ద బ్యాటరీ ఆల్-వీల్-డ్రైవ్ (AWD) సిస్టమ్‌తో కూడా అందుబాటులో ఉంది. మారుతి ఖచ్చితమైన రేంజ్ వివరాలను అధికారికంగా వెల్లడించనప్పటికీ, పెద్ద బ్యాటరీ ప్యాక్ 500కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. ధరలు కూడా కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే దీని ప్రారంభ ధర రూ. 17 లక్షలు ఉండే అవకాశం ఉంది.Get Ready to witness your dream car Maruti Suzuki’s Electric SUV e VITARA https://t.co/WNFuX1hGsM— Maruti Suzuki (@Maruti_Corp) January 17, 2025 -
Auto Expo 2025: ఒక్క వేదిక.. ఎన్నో వెహికల్స్
రెండేళ్లకు ఒకసారి జరిగే 'ఆటో ఎక్స్పో 2025' (Auto Expo 2025) కార్యక్రమాన్ని దేశ ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' (Narendra Modi) ప్రారంభించారు. ఈ ఈవెంట్‌కు దిగ్గజ వాహన తయారీ సంస్థలు హాజరవుతాయి. ఇది ఈ రోజు (జనవరి 17) నుంచి 22వ తేదీ వరకు జరుగుతాయి. కాగా ఆటో ఎక్స్పో మొదటిరోజు లాంచ్ అయిన టూ వీలర్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.హోండా యాక్టివా ఈ (Honda Activa e)హోండా మోటార్‌సైకిల్ కంపెనీ గత ఏడాది మార్కెట్లో ఆవిష్కరించిన కొత్త 'యాక్టివా ఈ' (Activa e) ధరలను 'భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్పో 2025' వేదికపై ప్రకటించింది. ఈ స్కూటర్ 1.17 లక్షల నుంచి రూ. 1.52 లక్షల మధ్య ఉంది. ఈ స్కూటర్ 1.5 కిలోవాట్ స్వాపబుల్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక సింగిల్ ఛార్జితో 102 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. దీని టాప్ స్పీడ్ 80 కిమీ/గం. కాగా ఇది 7.3 సెకన్లలో 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది.హోండా క్యూసీ1 (Honda QC1)ఆటో ఎక్స్‌పోలో కనిపించిన టూ వీలర్లలో హోండా క్యూసీ1 కూడా ఒకటి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 90,000. ఇందులో 1.5 కిలోవాట్ బ్యాటరీ 80 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 50 కిమీ/గం. ఈ స్కూటర్ 330 వాట్స్ ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 6:50 గంటలు. ఇది 9.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 300 (TVS RTX 300)టీవీఎస్ కంపెనీ కూడా భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్పో 2025లో ఆర్టీఎక్స్ 30 బైకును ఆవిష్కరించింది. పలుమార్లు ఈ బైకును టెస్ట్ చేసిన తరువాత ఈ రోజు (జనవరి 17) అధికారికంగా ప్రదర్శించింది. ఇది బ్రాండ్ మొట్టమొదటి అడ్వెంచర్ బైక్. ఇందులోని 299 సీసీ ఇంజిన్ 35 హార్స్ పవర్, 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి పనితీరు పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.ఇదీ చదవండి: ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ పయనంటీవీఎస్ జుపీటర్ సీఎన్జీ (Bajaj Jupiter CNG)టీవీఎస్ కంపెనీ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన జుపీటర్ సీఎన్జీ ప్రదర్శించింది. ఈ స్కూటర్ ఫ్రీడమ్ 125 బైక్ మాదిరిగానే పెట్రోల్, సీఎన్జీతో పనిచేస్తుంది. కాబట్టి మంచి పనితీరును అందించడమే కాకుండా.. ఎక్కువ మైలేజ్ కూడా అందిస్తుందని సమాచారం. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. దీని ధర రూ. 1 లక్ష నుంచి రూ. 1.10 లక్షల మధ్య ఉంటుందని సమాచారం.టీవీఎస్, బజాజ్ బ్రాండ్ వెహికల్స్ మాత్రమే కాకుండా.. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలు కూడా ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తమ కొత్త వాహనాలను, రాబోయే వాహనాలను ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.