
బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్‌జీ బైక్ (ఫ్రీడమ్ 125) లాంచ్ చేస్తే.. టీవీఎస్ మోటార్ (TVS Motor) కంపెనీ మొదటి సీఎన్‌జీ స్కూటర్(జూపిటర్)ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించింది. ఇది ఫ్రీడమ్ 125 మాదిరిగానే పెట్రోల్, సీఎన్‌జీలతో నడుస్తుంది.
టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ (TVS Jupiter CNG) స్కూటర్ చూడటానికి జుపీటర్ 125 మాదిరిగా ఉన్నప్పటికీ.. ముందుభాగంలో కనిపించే CNG స్టిక్కర్ దానిని సీఎన్‌జీ స్కూటర్‌గా గుర్తించడానికి సహాయపడుతుంది. 1.4 కేజీ కెపాసిటీ కలిగిన సీఎన్‌జీ ట్యాంక్.. స్కూటర్ సీటు కింద ఉంటుంది. కాగా ఇందులోని 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 6000 rpm వద్ద 7.2 హార్స్ పవర్, 5500 rpm వద్ద 9.4 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ స్కూటర్ 226 కిమీ మైలేజ్ (సీఎన్‌జీ + పెట్రోల్) ఇస్తుందని సమాచారం. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80.5 కిమీ కావడం గమనార్హం. స్టాండర్డ్ జూపిటర్ మాదిరిగానే.. సీఎన్‌జీ స్కూటర్ కూడా డిజిటల్ అనలాగ్ డిస్‌ప్లే, యూఎస్బీ ఛార్జర్, స్టార్ట్ / స్టాప్ టెక్ వంటివన్నీ పొందుతుంది. కంపెనీ తన సీఎన్‌జీ స్కూటర్ ధరలను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇది సాధారణ జూపిటర్ ధర కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment