Auto Expo
-
మెగా ఆటో షో!
అంతర్జాతీయ ఆటోమొబైల్ హబ్‌గా అవతరిస్తున్న భారత్... ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో షోకు వేదిక కానుంది. వచ్చే ఏడాది భారత్ మొబిలిటీ షోలో భాగంగా జరగనున్న వాహన ప్రదర్శన కోసం దేశ, విదేశీ దిగ్గజాలన్నీ క్యూ కడుతున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన బిగ్–5 ప్రపంచ వాహన ప్రదర్శనలను తలదన్నేలా ఢిల్లీ ఆటో ఎక్స్పో కనువిందు చేయనుంది!దేశంలో మరో వాహన జాతరకు కౌంట్‌డౌన్ మొదలైంది. ప్రపంచ ఆటోమొబైల్ దిగ్గజాలన్నీ కొంగొత్త మోడళ్లను ప్రదర్శించేందుకు పోటీ పడుతున్నాయి. దేశీ దిగ్గజాలు టాటా మోటార్స్... మారుతీ సుజుకీ నుంచి గ్లోబల్ కంపెనీలు టయోటా, చైనా బీవైడీ వరకు దాదాపు 28 కంపెనీలు తమ కొత్త వాహన ఆవిష్కరణలతో సందర్శకులను అలరించనున్నాయి. దేశంలో తొలిసారిగా ఆటో షోతో పాటు దీనికి అనుబంధంగా పలు ప్రదర్శనలను కలిపి భారత్ మొబిలిటీ షో–2025 పేరుతో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా వచ్చే ఏడాది జనవరి 17–22 వరకు జరగనున్న ఆటో ఎక్స్పో ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారత్ మండపం ఈ కార్ల మేళాతో భారత్ సత్తాను చాటిచెప్పనుంది.. ముఖ్యంగా ఈసారి ఎలక్ట్రిక్ వాహనాలపైనే కంపెనీలన్నీ మరింత ఫోకస్ చేస్తుండటం విశేషం. 2023లో జరిగిన ఆటో షోతో పోలిస్తే రానున్న షో నాలుగు రెట్లు పెద్దది. అంతేకాదు 1986లో దేశంలో మొదలైన ఆటో ఎక్స్పో నుంచి చూస్తే.. 2025 షో కనీవినీ ఎరుగని స్థాయిలో చరిత్ర సృష్టించనుంది. డెట్రాయిట్, జెనీవా దిగదుడుపే...!ఈసారి ఆటో షో.. విదేశాల్లో పేరొందిన ప్రదర్శనలన్నింటినీ మించిపోయే రేంజ్లో ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జెనీవా, మ్యూనిక్, డెట్రాయిట్, పారిస్, టోక్యో ఆటో ఎక్స్పోలను ‘బిగ్–5’గా వ్యవహరిస్తారు. ఇటీవలి కాలంలో ఇక్కడ పాల్గొంటున్న కంపెనీల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అధిక వ్యయాలు, సందర్శకులు తగ్గడం దీనికి ప్రధాన కారణం. మ్యూనిక్ ఆటో షోలో 13 కార్ల కంపెనీలు పాల్గొనగా... ఈ ఏడాది ఆరంభంలో జరిగిన జెనీవా షోలో 20 వాహన సంస్థలు పాలు పంచుకున్నాయి. ఇక పారిస్‌లో 11, టోక్యోలో 22 కంపెనీలు కొత్త ఆవిష్కరణలు చేశాయి. గతేడాది జరిగిన డెట్రాయిట్ ఆటో షోలో 13 కంపెనీలు 35 వాహన బ్రాండ్లను ప్రదర్శించాయి. కాగా, రాబోయే మన ఆటో ఎక్స్‌పోలో 16 కార్ల కంపెనీలు, 6 వాణిజ్య వాహన తయారీదారులు, 6 ద్విచక్ర వాహన సంస్థలు.. వెరసి 28 సంస్థలు అదరగొట్టేందుకు సై అంటున్నాయి. గత ఎడిషన్ (2023)కు దూరంగా ఉన్న హీరో మోటో, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, స్కోడా తదితర కంపెనీలు మళ్లీ తిరిగొస్తున్నాయి. మరోపక్క, ఈసారి అర డజను కొత్త కంపెనీలు రంగంలోకి దూకుతున్నాయి. ఇందులో వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ విన్‌ఫాస్ట్, టీఐ క్లీన్ మొబిలిటీ, పోర్‡్ష తదితర కంపెనీలు ఉన్నాయి.వీటిపై ఫోకస్మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రి్టక్ ఎస్యూవీ వియత్నాం కార్ల కంపెనీ విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్లు వేవ్ మొబిలిటీ భారత్‌లో తొలి సోలార్ ఎలక్ట్రిక్ కారు ఈవీల హల్చల్.. గత షోలో కంపెనీల సంఖ్య తగ్గినప్పటికీ 75 వాహనాలను ఆవిష్కరించారు. ఈసారి కొత్త మోడళ్లతో పాటు ఆవిష్కరణలు గణనీయంగా పెరగనున్నాయి. ముఖ్యంగా మారుతీ సుజుకీ ఈవీ రంగంలో తన తొలి మోడల్‌ను ప్రపంచానికి చూపనుంది. టాటా మోటార్స్ సైతం కొత్త ఈవీలను ప్రదర్శించనుంది. వియత్నాం ఈవీ తయారీదారు విన్‌ఫాస్ట్ కార్లు కూడా షో కోసం ఫుల్ చార్జ్ అవుతున్నాయి.మన మార్కెట్ రయ్ రయ్... ఈ ఏడాది మన వాహన మార్కెట్ కాస్త మందకొడిగా ఉన్నప్పటికీ.. ప్రపంచ టాప్–10 ఆటోమొబైల్ మార్కెట్లలో అత్యంత వేగవంతంమైన వృద్ధితో టాప్‌గేర్‌లో దూసుకుపోతోంది. ప్రధాన వాహన మార్కెట్లలో ఒక్క భారత్, చైనా, దక్షిణ కొరియా మాత్రమే 2019 ముందు నాటి కోవిడ్ ముందస్తు స్థాయి అమ్మకాలను చేరుకోగలిగాయి. అత్యంత కీలక ఆటోమొబైల్ మార్కెట్లయిన అమెరికా, జర్మనీ, జపాన్‌లో 2019 నాటి ఉత్పత్తి కోవిడ్ ముందు స్థాయిని అందుకోలేకపోవడం గమానార్హం. ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పురోగమిస్తున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులోనే జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లను అధిగమించే అవకాశం ఉంది. ఇది వాహన కంపెనీలకు అపారమైన అవకాశాలను షృష్టించనుంది. అంతేకాదు, దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వారే కావడం, తలసరి ఆదాయం (ప్రస్తుతం దాదాపు 2000 డాలర్లు. 2030 కల్లా 5,000 డాలర్లను చేరుతుందని అంచనా) పెరుగుతుండటం కూడా సానుకూలాంశం! -
దిగ్గజ కంపెనీలకు వేదికగా ఢిల్లీ - భారత్ వైపు చూస్తున్న గ్లోబల్ మార్కెట్
2022 నుంచి ప్రపంచ దేశాల్లో మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా అవతరించిన భారత్.. క్రమంగా వృద్ధి చెందుతూనే ఉంది. అగ్రశ్రేణి ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు చూపు కూడా ఇండియా వైపు పడుతోంది. దీంతో చాలా సంస్థలు తమ వాహనాలను ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ రోజు ఢిల్లీలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 అనేక కొత్త వాహనాలు దర్శనమివ్వనున్నాయి. ఢిల్లీ వేదికగా ఈ రోజు నుంచి ప్రారంభమైన 'భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024' ఫిబ్రవరి 3 వరకు కొనసాగుతుంది. ఇందులో మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, కియా, మెర్సిడెస్-బెంజ్, బీఎండబ్ల్యూ, హీరో మోటోకార్ప్, బజాజ్, టీవీఎస్, అశోక్ లేలాండ్ వంటి సుమారు 28 కంపెనీలు, 600కి పైగా ఆటో కాంపోనెంట్ తయారీదారులు, 50కి పైగా బ్యాటరీ అండ్ స్టోరేజీ కంపెనీలు, 10 కంటే ఎక్కువ టైర్ల తయారీదారులు, తొమ్మిది నిర్మాణ పరికరాల తయారీదారులు, ఐదు స్టీల్ తయారీదారులు, 15 కంటే ఎక్కువ టెక్నాలజీ అండ్ స్టార్టప్ కంపెనీలు మొదలైనవి కనిపించనున్నాయి. భారతదేశం వాహన తయారీదారులకు అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. ద్విచక్ర వాహనాల నుండి భారీ వాణిజ్య వాహనాల వరకు భారతదేశం ప్రపంచంలోని నాలుగు పెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉంది. ఉత్పత్తికి మాత్రమే కాకుండా ఎగుమతికి కూడా ఇండియా చాలా అనుకూలంగా ఉంటుంది. 2030 నాటికి భారతదేశంలో ఉత్పత్తయ్యే అన్ని ప్యాసింజర్ వాహనాల్లో వాహనాల వాటా 14 శాతం నుంచి 25 శాతానికి పెరుగుతుంది. అంతే కాకుండా భారతదేశంలో ఉత్పత్తయ్యే టూ వీలర్లలో దాదాపు 30 శాతం ఎగుమతయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదీ చదవండి: విప్రో కీలక నిర్ణయం - వందలాది మంది ఉద్యోగులపై వేటు! -
ముగిసిన ఆటో ఎక్స్పో
గ్రేటర్ నోయిడా: సుమారు వారం రోజులు సాగిన ఆటో ఎక్స్పో బుధవారంతో ముగిసింది. ఈసారి రికార్డు స్థాయిలో 6,36,743 మంది షోను సందర్శించినట్లు దేశీ వాహన తయారీ సంస్థల సమాఖ్య సియామ్ తెలిపింది. రెండేళ్లకోసారి జరిగే ఆటో షోను వాస్తవానికి 2022లోనే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కోవిడ్–19 కారణంగా 2023కి వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి 11న ప్రారంభమై 18తో ముగిసింది. తొలి రెండు రోజులు (11,12) మీడియా కోసం కేటాయించగా, 13–18 వరకు సందర్శకులను అనుమతించారు. ఆటో కంపెనీలు ఇందులో 75 పైచిలుకు వాహనాలను ఆవిష్కరించాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్, కియా ఇండియా వంటివి పాల్గొనగా మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా వంటి కంపెనీలు దూరంగా ఉన్నాయి. మారుతీ సుజుకీ అయిదు డోర్ల జిమ్నీ వెర్షన్‌ను, హ్యుందాయ్ మోటర్స్ ఇండియా అయానిక్ 5ని, కియా ఇండియా తమ కాన్సెప్ట్ ఈవీ9 మొదలైన వాహనాలను ఆవిష్కరించాయి. గ్రేటర్ నోయిడాలో ఆటో ఎక్స్పో 2023 సందర్భంగా బుధవారం టయోటా పెవీలియన్‌లో సందర్శకులు -
ఆటో ఎక్స్పో 2023: ఎలక్ట్రిక్ వాహనాలే హైలైట్, 5 మోడళ్లు ప్రపంచంలో తొలిసారి
గ్రేటర్ నోయిడా: భారత్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండేళ్లకోసారి జరిగే ఆటో ఎక్స్పో 2023 బుధవారం ప్రారంభమైంది. 2022లో జరగాల్సిన ఈ కార్యక్రమం కోవిడ్–19 కారణంగా వాయిదాపడింది. ఈసారి షోలో ఎలక్ట్రిక్ వాహనాలు హైలైట్. 5 మోడళ్లు ప్రపంచంలో తొలిసారి ఎక్స్‌పోలో తళుక్కుమంటున్నాయి. వీటిలో మారుతీ 5 డోర్ జిమ్మీ, నెక్స్ట్ జనరేషన్ కియా కార్నివల్, ఎంజీ ఎయిర్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, హ్యుందాయ్ అయానిక్–5 ఉన్నాయి. జనవరి 18 వరకు ప్రదర్శన ఉంటుంది. సుజుకీ ఈవీఎక్స్ 550 కిలోమీటర్లు వాహన తయారీ దిగ్గజం జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ మధ్యస్థాయి ఎస్యూవీ ‘ఈవీఎక్స్’ తొలిసారిగా అంతర్జాతీయంగా దర్శనమిచ్చింది. 2025లో ఈ కారు మార్కెట్లో అడుగుపెట్టనుంది. 60 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఏర్పాటు ఉంది. ఒకసారి చార్జింగ్‌తో 550 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ డైరెక్టర్, ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ వెల్లడించారు. మొత్తం 16 వాహనాలను మారుతీ ప్రదర్శిస్తోంది. వీటిలో వేగన్–ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రోటోటైప్, బ్రెజ్జా ఎస్–సీఎన్జీ, గ్రాండ్ విటారా ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వంటివి ఉన్నాయి. హ్యుందాయ్: అయానిక్–5 ఈవీ ప్రపంచంలో తొలిసారిగా ఆవిష్కరించింది. పరిచయ ఆఫర్లో ధర తొలి 500 మంది కస్టమర్లకు రూ.44.95 లక్షలు. 72.6 కిలోవాట్ అవర్ బ్యాటరీతో 217 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్ పొందుపరిచారు. ఒకసారి చార్జింగ్‌తో 631 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అయానిక్–6 ఎలక్ట్రిక్ సెడాన్ సైతం కొలువుదీరింది. 53, 77 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఎంజీ: హెక్టర్, హెక్టర్ ప్లస్ ఫేస్‌లిఫ్ట్ కొలువుదీరాయి. ఆల్ ఎలక్ట్రిక్ మిఫా 9 ఎంపీవీ తొలిసారిగా భారత్‌లో తళుక్కుమన్నది. దీనిలో 90 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఉంది. 440 కిలోమీటర్లు పరుగెడుతుంది. ఫుల్లీ ఎలక్ట్రిక్ ఎంజీ–4 హ్యాచ్‌బ్యాక్, ఎంజీ 5 ఎలక్ట్రిక్ స్టేషన్ వేగన్ (ఎస్టేట్), ఈఎంజీ6 హైబ్రిడ్ సెడాన్ సైతం ప్రదర్శనలో ఉంది. బీవైడీ: సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను ఆవిష్కరించింది. 2023 చివరి త్రైమాసికంలో రానుంది. లెక్సస్: ఎల్ఎం 300హెచ్ ఎంపీవీ (టయోటా వెల్ఫైర్) భారత్‌లో అడుగుపెట్టింది. హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో రూపుదిద్దుకుంది. 150 హెచ్‌పీ, 2.5 లీటర్ అట్కిన్సన్ సైకిల్ పెట్రోల్ ఇంజన్ ఏర్పాటు ఉంది. కొత్త ఆర్ఎక్స్ ఎస్యూవీ భారత్‌లో ప్రవేశించింది. ఎల్ఎఫ్–30, ఎల్ఎఫ్–జడ్ ఈవీ కాన్సెప్ట్ మోడళ్లు ఉన్నాయి. టయోటా: ల్యాండ్ క్రూజ్ ఎల్సీ 300 ఎస్యూవీ కొత్త రూపులో చమక్కుమంటోంది. బీజడ్4ఎక్స్ భారత్‌లో అడుగుపెట్టింది. 71.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఏర్పాటు ఉంది. 450 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. టాటా: అందరినీ ఆశ్చర్యంలో పడేస్తూ హ్యారియర్ ఈవీ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. 2024లో మార్కెట్లోకి రానుంది. డ్యూయల్ మోటార్, ఆల్ వీల్ డ్రైవ్ ఉంది. 2025లో రంగ ప్రవేశం చేయనున్న సియర్రా ఈవీ కాన్సెప్ట్ సైతం మెరిసింది. చదవండి: ఐకూ11 5జీ వచ్చేసింది: దీని ప్రత్యేకత, ఆఫర్లు తెలిస్తే ఫిదా -
అట్టహాసంగా ఆటో ఎక్స్పో-2023, కళ్లు చెదిరే ఈవీల హవా (ఫొటోలు)
-
ఆటో ఎక్స్పో 2023: కియా కేఏ4 ఆవిష్కారం, వేల కోట్ల పెట్టుబడులు
సాక్షి,ముంబై: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కార్ల తయారీదారులలో ఒకటైన కియా ఇండియా ఆటో ఎక్స్పో 2023లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. కాన్సెప్ట్ EV9 SUV , KA4 కార్లను ఆవిష్కరించింది.అంతేకాదు ఇండియాలో రానున్న 4-5 సంవత్సరాలలో రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఆర్ అండ్ డీ సెంటర్, 2025లో మేడిన్ ఇండియా ఈవీనీ లాంచింగ్‌లో ఈ పెట్టుబడి సహాయపడుతుందని కియా పేర్కొంది. కియా ఇండియా తన ఆల్-ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్ - కియా కాన్సెప్ట్ ఈవీ9, కొత్త కేఏ4లను జనవరి 11న ప్రారంభమైన ఆటో ఎక్స్పో 16వ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. KA4 లాంచ్‌తో, కంపెనీ MPV సెగ్మెంట్లో బలమైన పట్టు సాధించాలని చూస్తోంది. ఈ 4వ జనరేషన్ కార్నివాల్ ఎంపీవీ ఈ ఏడాది చివర్లో భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో కేఏ4 3 ఇంజన్ ఎంపికలతో రానుంది. వీటిలో 3.5-లీటర్ GDi V6 పెట్రోల్, 3.5-లీటర్ MPi V6 పెట్రోల్ , 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా లభ్యంకానుంది. 3 లేదా 4 వరుసల సీటింగ్ కాన్ఫిగ రేషన్లతో, గరిష్టంగా 11 మంది ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుందట. 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అలాగే డ్యాష్ బోర్డ్‌లోని టచ్-సెన్సిటివ్ బటన్స్ ద్వారా ఇన్ఫోటైన్మెంట్, క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్లను నియంత్రించే ఫీచర్లు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. కాగా మూడు సంవత్సరాల కోవిడ్ అనంతరం జరుగుతున్న మొదటి ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. వివిధ విభాగాల నుండి 45 వాహన తయారీదారులతో సహా 70 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటారు.కియా ఇండియా 2023లో 220 నగరాలకు విస్తరించాలని , 2024 నాటికి 100 ప్లస్ అవుట్లెట్లకు చేరుకోవాలని యోచిస్తోంది. -
మూడేళ్ల విరామం.. మళ్లీ కనువిందు చేయనున్న ఆటో ఎక్స్పో!
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ ఎక్స్పో దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది మళ్లీ కనువిందు చేయనుంది. జనవరి 11న ప్రారంభం కానుంది. 11–12 తేదీల్లో మీడియాకు, 13–18 వరకు సందర్శకులకు అనుమతి ఉంటుంది. రెండేళ్లకోసారి జరిగే ఆటో ఎక్స్పో వాస్తవానికి 2022లో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా నిర్వహించలేదు. ఈసారి షోలో మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్, కియా ఇండియా, టయోటా కిర్లోస్కర్, ఎంజీ మోటర్ ఇండియా తదితర సంస్థలు పాల్గోనున్నాయి. అలాగే కొత్త అంకుర సంస్థలు.. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు కూడా వీటిలో ఉండబోతున్నాయి. అయిదు అంతర్జాతీయ లాంచింగ్‌లతో పాటు 75 పైచిలుకు కొత్త ఉత్పత్తులను ఇందులో ఆవిష్కరించనున్నారు. 2020 ఎడిషన్‌తో పోలిస్తే ఈసారి అత్యధికంగా 46 వాహన తయారీ కంపెనీలతో పాటు 80 పైగా సంస్థలు పాల్గొంటున్నట్లు ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ తెలిపింది. కొన్ని కంపెనీలు దూరం.. ఈసారి ఆటో షోలో కొన్ని సంస్థలు పాల్గొనడం లేదు. మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్, నిస్సాన్.. లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి మొదలైనవి వీటిలో ఉన్నాయి. అటు హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటర్ వంటి ప్రధాన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు కూడా కేవలం ఫ్లెక్స్ ఫ్యుయల్ ప్రొటోటైప్ వాహనాలకే పరిమితం కానున్నాయి. తమలాంటి లగ్జరీ బ్రాండ్స్‌పై ఆసక్తి ఉండే కస్టమర్లు ఈ తరహా ఆటో ఎక్స్పోలకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని గమనించిన నేపథ్యంలో ఈసారి షోలో పాల్గొనరాదని నిర్ణయించుకున్నట్లు మెర్సిడెస్–బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. దానికి బదులుగా కస్టమర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందించడంపై దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. అటు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ సోల్చ్ కూడా భారత్‌లో కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెట్టడంపైనే ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. వేదిక చాలా దూరంగా ఉండటం, వ్యయాలు తడిసి మోపెడవుతుండటం వంటి అంశాలు ఆటో షోలో పాల్గొనడానికి ప్రతికూలాంశాలుగా ఉంటున్నాయని గతంలో పలు ఆటోమొబైల్ తయారీ సంస్థలు తెలిపాయి. చదవండి: రైల్వే శాఖ కీలక నిర్ణయం: ప్రయాణం చేసేటప్పుడు అలా చేస్తే చిక్కుల్లో పడినట్లే! -
మారుతి స్విఫ్ట్-2023 కమింగ్ సూన్: ఆకర్షణీయ, అప్డేటెడ్ ఫీచర్లతో
సాక్షి,ముంబై: దేశీయ కార్‌మేకర్ మారుతి సుజుకి తన హ్యాచ్‌బ్యాక్ మారుతి స్విఫ్ట్ మోడల్లో కొత్త వెర్షన్‌ను తీసుకొస్తోంది. కొత్త డిజైన్, అప్డేట్స్, ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్‌తో 2023 జనవరి నాటికి కొత్త తరం సుజుకి స్విఫ్ట్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేయనుంది. అంతేకాదు 2023లో జరగనున్న ఆటోఎక్స్పోలో దీన్ని ప్రదర్శించవచ్చని ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి. రానున్నమారుతి స్విఫ్ట్ 2023లో గణనీయమైన కాస్మెటిక్ మార్పులు , ఫీచర్ అప్గ్రేడ్లు చేసే అవకాశం ఉందని ఆటో వర్గాలు భావిస్తున్నాయి. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో ద్వైవార్షిక ఆటోమోటివ్ ఈవెంట్ జనవరి 13 నుండి ప్రారంభం కానుంది. కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, కొత్త సీ-ఎయిర్ స్ప్లిటర్లతో అప్డేట్ చేసిన బంపర్, కొత్త LED ఎలిమెంట్స్‌తో కూడిన స్లీకర్ హెడ్‌ల్యాంప్‌లు , ఫ్రంట్ ఎండ్‌లో.. కొత్త ఫాగ్ ల్యాంప్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, కొత్త బాడీ ప్యానెల్స్, వీల్ ఆర్చ్‌లపై ఫాక్స్ ఎయిర్ వెంట్లు, బ్లాక్ అవుట్ పిల్లర్లు, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్‌తో రివైజ్ చేసినట్టు సమాచారం. దాదాపు కొత్త బాలెనో హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే, హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌లో డిజైన్ చేసిందట. ఇంకా డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ,లెదర్ సీట్లుతొపాటు ఆపిల్ కార్ప్లే ,ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, సుజుకి వాయిస్ అసిస్ట్ , OTA (ఓవర్-ది-ఎయిర్ అప్డేట్లు)తో కూడిన పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ (కొత్త స్మార్ట్‌ప్లే ప్రో+) ఉండవచ్చు. దీంతోపాటు 360 డిగ్రీల కెమెరా, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, లేన్-కీప్ అసిస్ట్ ,అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లాంటి ఇతర ఇంటీరియర్ అప్డేట్స్ను అందించనుంది. ఇక ఇంజీన్ విషయానికి వస్తే..1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో ఉండవచ్చు. దీంతో పాటు యూరప్‌తో సహా ఇతర మార్కెట్లలో విక్రయిస్తున్న 1.4 లీటర్ల బూస్టర్‌జెట్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజీన్‌తో, కొత్త తరం సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్‌ను కూడా ఇండియాలో ఆ విష్కరించనుందని అంచనా. అయితే కొత్త స్విఫ్ట్ అరంగేట్రంపై అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడాల్సి ఉంది. -
కళ్లు చెదిరేలా ‘ఈ కార్లు’.. చూపు తిప్పుకోనివ్వవు (ఫొటోలు)
-
కళ్లుచెదిరేలా..2022 ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ఎక్స్పో
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 15వ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ఎక్స్పో 2022 అట్టహాసంగా పప్రారంభమైంది. శుక్రవారంమొదలైన ఈ షో మూడురోజుల పాటు ఆగస్ట్ 7 వరకు కొసాగుతుంది. అతిపెద్ద ఆటో షోగా భావిస్తున్న ఈ ప్రదర్శనలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటో ఉపకరణాలు, బ్యాటరీలు, ఇతర ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తారు. కేంద్ర సమాచార ప్రసార క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఎక్స్పోను ప్రారంభించారు. ద"ఇండియాస్ ఈవీ సెక్టార్: రోడ్‌మ్యాప్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్" పేరుతో ఆగస్టు 4న నిర్వహించిన ఒకరోజు సెమినార్ తర్వాత ఈ ఎక్స్పో జరుగుతోంది. ఆల్టియస్ ఆటో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ఎక్స్పో జరుగుతోంది. సుమారు 100 మంది భారతీయ అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైక్‌లు, సైకిళ్లు, స్కూటర్లు, రిక్షాలు, కార్ట్లు, ఇతర ఆటో ఉత్పత్తులు ఈ వేదిక ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ లభిస్తోందని,రానున్న కాలంలో డిమాండ్మరింతర పుంజుకోనుందని ఎక్స్పో 2022 నిర్వాహకుడు రాజీవ్ అరోరా ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ-వాహనాల తయారీదారులందరిని ఒకవేదికమీదకు తీసకొస్తున్న ఈ ఎక్స్‌పోలో పలు లాంచ్‌లు జరగనున్నాయని తెలిపారు. ఈ ఎక్స్పో ప్రధాన లక్ష్యం కొత్త వ్యాపారాన్ని సృష్టించడం, పర్యావరణ పరిరక్షణ అని ఆయన పేర్కొన్నారు. కాగా 2015లో తొలిసారిగా నిర్వహించబడిన ఇలాంటి ఎక్స్‌పోలు న్యూఢిల్లీ ,కోల్‌కతాలో బెంగళూరు, లక్నో, హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన అంబులెన్స్ ఇదే!! 2.8సెకన్లలో 100కిలోమీటర్ల వేగంతో
దుబాయ్ రోడ్లలో ఇకపై ప్రపంచంలోనో అత్యంత ఖరీదైన లైకాన్ హైపర్ స్పోర్ట్స్ అంబులెన్స్‌లు దూసుకెళ్లనున్నాయి. ఇటీవల దుబాయ్ కార్పొరేషన్ ఆఫ్ అంబులెన్స్ సర్వీసెస్ ఇటీవల దుబాయ్ ఎక్స్‌పోలో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్, ఖరీదైన అంబులెన్స్‌ను ప్రదర్శించింది.ఈ అంబులెన్స్ కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. గరిష్టంగా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని నిర్వాహకులు తెలిపారు. దుబాయ్‌కి చెందిన డబ్ల్యూ మోటార్స్ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఏడవ లైకాన్ హైపర్ స్పోర్ట్స్ కారును తయారు చేసింది. ప్రపంచవ్యాప్తంగా లైకాన్ హైపర్‌స్పోర్ట్ కారు 6యూనిట్లు మాత్రమే ఉండగా.. డబ్ల్యూ మోటార్స్ 7వ కారును తయారు చేసింది. ఇక దీని ధర అక్షరాల రూ.26కోట్లు. ఫీచర్ల విషయానికొస్తే.. ఈ కారును 440 వజ్రాల సెట్‌తో డిజైన్ చేశారు. కారు లోపలి టాప్ భాగం బంగారు పూత మనకు దర్శనమిస్తుంది. లైకాన్ హైపర్‌స్పోర్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ హోలోగ్రాఫిక్, హోలోగ్రాఫిక్ మిడ్-ఎయిర్ డిస్ప్లేతో వస్తుంది. డ్రైవర్ ఇచ్చే సిగ్నల్స్ ఆధారంగా పనిచేస్తుంది. కారు మొత్తం బరువును తగ్గించడానికి పూర్తిగా కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించారు. -
BMW Circular EV: కారుని ఇలా కూడా తయారు చేస్తారా!
మ్యూనిక్: బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కారు.. పేరు ఐవిజన్ సర్క్యులర్.. ఎలక్ట్రిక్ కారు అంటే.. పర్యావరణ అనుకూలమైనదన్న సంగతి అందరికీ తెలిసిందే.. ఇప్పటికే చాలా ఎలక్ట్రిక్ కార్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అయితే వాటన్నింటిని తలదన్నెలా బీఎండబ్ల్యూ సంస్థ సర్కులర్ పేరుతో కొత్త కారుని మార్కెట్లోకి తేబోతుంది. ఈ మేరకు ఈ కారు నమూనాను జర్మనీలోని మ్యూనిక్‌లో జరుగుతున్న మొబిలిటీ షోలో ప్రదర్శించారు. త్వరలో రాబోయే ఈ కారు ఆటో మొబైల్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తుందని చెబుతున్నారు. రీసైకిల్డ్ మెటీరియల్‌తో బీఎండబ్ల్యూ సంస్థ సర్కులర్ కారుని పూర్తిగా రీసైకిల్డ్ మెటీరియల్‌తో తయారుచేశారు. అంతేకాదు.. ఈ కారు జీవిత కాలం ముగిసిన తర్వాత కారులోని భాగాలన్నిటినీ మళ్లీ రీసైకిల్ చేసి.. కొత్త కార్ల తయారీలో ఉపయోగించవచ్చని ఆ సంస్థ చెబుతోంది. కారు బాడీ మొత్తాన్ని ఐనోడైజ్డ్ అల్యుమీనియంతో తయారు చేశారు. ఇక ఇంటీరియర్‌లో క్యాబిన్ భాగం మొత్తాన్ని రీసైకిల్డ్ చేసిన ప్లాస్టిక్‌తో రూపొందించారు. ఇందులో ఉపయోగించిన బ్యాటరీ సైతం రీసైకిల్డ్ చేసినదే కావడం గమనార్హం. డిజైన్‌లోను అదే తీరు ఇక కారు డిజైన్ విషయానికి వస్తే అవుట్ లుక్ స్పోర్ట్స్ యుటిలిటీ, ఇన్నర్ డిజైన్ మల్టీ పర్పస్ యుటిలిటీ తరహాలో ఉంది. ప్రస్తుతం బీఎండబ్ల్యూ తయారుచేస్తున్న వాహనాల్లో 30 శాతం మేర పునర్వినియోగ సామగ్రిని వాడుతున్నారు. అయితే, 2040 సరికి తమ వాహనాలన్నింటినీ 100 శాతం రీసైకిల్డ్ మెటీరియల్‌తోనే తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సదరు సంస్థ తెలిపింది. ధరపై ఆసక్తి బీఎండబ్ల్యూ అంటేనే లగ్జరీ కార్లకు పేరు. ఆ సంస్థ నుంచి పూర్తిగా రిసైకిల్డ్ మెటీరియల్‌తో రూపొందిన ఐవిజన్ సర్క్యులర్ కారు ధర ఎలా ఉంటుందనే అసక్తి నెలకొంది. అయితే ఈ కారుని మార్కెట్లోకి ఎప్పుడు తెస్తారన్న వివరాలను బీఎండబ్ల్యూ ప్రకటించలేదు. చదవండి: BMW i Vision AMBY : ది సూపర్ ఎలక్ట్రిక్ సైకిల్..! రేంజ్ తెలిస్తే షాక్..! -
గూర్ఖా వచ్చేస్తోంది.. మహీంద్రా థార్‌కు గట్టిపోటీ!
ఆఫ్‌రోడ్ ఎస్యూవీ సెగ్మెంట్లో రారాజుగా ఉన్న మహీంద్రా థార్‌కు గట్టిపోటీ ఎదురవబోతుంది. ఈ సెగ్మెంట్లో థార్‌కి పోటీగా గూర్ఖా తెస్తోంది ఫోర్స్ మోటార్స్ కంపెనీ. రాబోయే పండగ సీజన్లో ఈ ఎస్‌యూవీని మార్కెట్లో రిలీజ్ చేసేందుకు వీలుగా సన్నహకాలు చేస్తోంది. ఈ మేరకు ఇటీవల సోషల్ మీడియాలో టీజర్ వదిలింది. సెప్టెంబరులోనే ? ఆఫ్‌రోడ్ రైడ్‌ని ఇష్టపడే వారి అభిరుచులకు తగ్గట్టుగా గూర్ఖా ఎస్‌యూవీని ఫోర్స్ సంస్థ డిజైన్ చేసింది. ఈ ఏడాది ఆరంభంలో నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో గూర్ఖా వాహనాన్ని ప్రదర్శించింది ఫోర్స్ సంస్థ. ఇదే ఏడాది మూడో త్రైమాసికంలో ఈ వాహనాన్ని మార్కెట్లోకి తెస్తామని ప్రకటించింది. దీంతో సెప్టెంబరు చివరి నాటికి ఫోర్స్ మార్కెట్లోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. గూర్ఖా ప్రత్యేకతలు - ఫోర్ వీల్ డ్రైవింగ్‌తో వచ్చే ఈ థార్ జీప్‌లో త్రీ డోర్స్, ఫోర్ డోర్ డిజైన్లు అందుబాటులో ఉంటాయి - ఎల్ఈడీ డీఆర్ఎల్ హెడ్లైట్లను ఉపయోగించారు - ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీకి తగ్గట్టుగా గ్రిల్స్, క్రోమ్, బంపర్లను డిజైన్ చేశారు. - రెండో వరుసలో కూడా కెప్టెన్ సీట్లను అమర్చే అవకాశం ఉంది - ఆఫ్‌రోడ్ స్పెషాలిటీ అయిన టైయిల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీల్ డిజైన్‌ను కొనసాగిస్తున్నారు - గూర్ఖా పూర్తిగా రగ్గడ్ లుక్‌తో వస్తోంది. చదవండి :ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ఆపిల్ కార్లు -
థర్డ్ వేవ్ ముప్పుతో నోయిడా ఆటో ఎక్స్ పో వాయిదా
-
అతిపెద్ద ఆటో ఎక్స్పో వాయిదా
న్యూఢిల్లీ: థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో 2022 ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరిగే ఆటో ఎక్స్పో వాయిదా పడింది. రెండేళ్లకోసారి ఈ వాహన ప్రదర్శన జరుగుతుంది. ప్రదర్శన తిలకించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు వస్తారని, సామాజిక దూరం నిర్వహణ క్లిష్టమవుతుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపింది. కోవిడ్–19 పరిస్థితులను ఆధారంగా చేసుకుని కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించేదీ ఈ ఏడాది చివరికల్లా నిర్ణయిస్తామని వివరించింది. 2020లో జరిగిన ఆటో ఎక్స్పోను ఆరులక్షల పైచిలుకు మంది సందర్శించారు. 70 దాకా కొత్త మోడళ్లను కంపెనీలు ఆవిష్కరించాయి. -
ఆటో ఎక్స్పో 2020
-
ముగిసిన సాక్షి మెగా ఆటో ఎక్స్పో
-
ముగిసిన ఆటో ఎక్స్పో
గ్రేటర్ నోయిడా: ఆరు రోజులపాటు అట్టహాసంగా సాగిన 14వ ఆటో ఎక్స్పో బుధవారం ముగిసింది. ఇందులో 22 కొత్త వాహనాలు, 81 ఉత్పత్తులను ఆవిష్కరించారు. 18 కాన్సెప్ట్ వాహనాలను ప్రదర్శించారు. 6 లక్షల పైగా సందర్శకులు ఆటో ఎక్స్పోను సందర్శించారు. ఆటోమోటివ్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ, భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ, భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ దీన్ని సంయుక్తంగా నిర్వహించాయి. ఈసారి ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రీడ్స్, పర్యావరణ అనుకూల టెక్నాలజీకి పెద్ద పీట వేశాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాతో పాటు మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ తదితర లగ్జరీ కార్ల సంస్థలు తమ భవిష్యత్ మోడల్స్‌ను ప్రదర్శించాయి. అయితే, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్, నిస్సాన్, ఫోర్డ్ వంటి విదేశీ సంస్థలతో పాటు దేశీ దిగ్గజం బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ దీనికి దూరంగా ఉన్నాయి. గత ఎక్స్పోలకు భిన్నంగా ఈసారి అదనంగా మరో రోజు పొడిగించడంపై అటు సందర్శకులు, ఇటు తయారీ సంస్థల నుంచి మ -
కొత్త వాహన పాలసీ 2 నెలల్లో!!
గ్రేటర్ నోయిడా: కేంద్ర ప్రభుత్వం రాబోయే రెండు నెలల్లో కొత్త వాహన పాలసీ ముసాయిదాను ప్రకటించనుంది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా పాలసీని రూపొందిస్తామని భారీ పరిశ్రమల మంత్రి అనంత్ గీతే తెలిపారు. 14వ ఆటో ఎక్స్పో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాలసీ రూపకల్పనలో సియామ్, ఏసీఎంఏ సహా పరిశ్రమ ప్రతినిధుల సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారాయన. ‘ఎఫ్ఏఎంఈ స్కీమ్ తొలి దశ మార్చిలో ముగియనుంది. దీంతో రెండో దశపై దృష్టి కేంద్రీకరించాం. దీన్ని మరింత విజయవంతం చేయాలని భావిస్తున్నాం’ అని తెలిపారు. వివిధ వాహన విభాగాలపై పన్నును సవరించాలనే పరిశ్రమ డిమాండ్‌పై స్పందిస్తూ.. ‘పరిశ్రమ నుంచి పలు విజ్ఞప్తులు అందాయి. కొత్త పాలసీ విధానంలో వీటిని పరిష్కరిస్తాం’ అని హామీనిచ్చారు. కొత్త పాలసీ విధానం పరిశ్రమకు, వినియోగదారులకు స్నేహపూరితంగా ఉంటుందన్నారు. పరిశ్రమ కొత్త టెక్నాలజీలను ఒడిసి పట్టుకోవాలని, బీఎస్–6 నిబంధనల అమలు విషయంలో సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పరిశ్రమకు మద్దతుగా ఉంటుందన్నారు. ఇక పన్ను సంబంధ సమస్యలను ప్రభుత్వం తప్పనిసరిగా పరిష్కరించాల్సి ఉందని సియామ్ ప్రెసిడెంట్ అభయ్ ఫిరొడియా కోరారు. వాహన పరిశ్రమలో పలు మంత్రిత్వ శాఖల ప్రమేయం ఉందని, అలాకాకుండా ప్రతిపాదిత నోడల్ వ్యవస్థ ‘నేషనల్ ఆటోమోటివ్ బోర్డు’ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2020 ఏప్రిల్ తర్వాత కూడా బీఎస్–4 వాహన విక్రయాలకు ప్రభుత్వం అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. కాగా వాహన పరిశ్రమ ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ రేటు 5%గా ఉండాలని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఇది 12%. అలాగే ప్యాసింజర్ వాహన విభాగంలో కేవలం రెండు జీఎస్టీ శ్లాబ్‌లు మాత్రమే ఉండాలని కోరుతోంది. యూఎం లోహియా: యూఎం లోహియా టూవీలర్స్ తాజాగా ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ క్రూయిజర్ ‘రెనెగెడ్ థార్’ను ఆవిష్కరించింది. దీని ధర రూ.4.9 లక్షలు (ఎక్స్‌షోరూమ్). కంపెనీ అలాగే రెనెగెడ్ డ్యూటీ ఎస్, రెనెగెడ్ డ్యూటీ ఏస్ బైక్స్‌ను ప్రదర్శకు ఉంచింది. వీటి ప్రారంభ ధర రూ.1.9 లక్షలు. ఈ రెండింటిలో 223 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. సుజుకీ మోటార్‌సైకిల్: సుజుకీ మోటార్‌సైకిల్ తాజాగా 125 సీసీ అడ్వాన్స్డ్ లగ్జరీ స్కూటర్ ‘బర్గ్‌మ్యాన్ స్ట్రీట్’ను ఆవిష్కరించింది. అలాగే సహా సబ్ 1,000 సీసీ విభాగంలో జీఎస్ఎక్స్–ఎస్750 బైక్‌ను ప్రదర్శించింది. కంపెనీ హయబుసా తర్వాత భారత్‌లో తయారు చేస్తోన్న రెండో పవర్ బైక్ ఈ జీఎస్ఎక్స్–ఎస్750నే. ఇన్ట్రూడర్ బైక్‌లో కొత్త వేరియంట్‌ను ప్రదర్శనకు ఉంచింది. పినాకిల్: పినాకిల్ స్పెషాలిటీ వెహికల్స్ తాజాగా కస్టమైజ్డ్ లగ్జరీ ఎక్స్‌పాండబుల్ మోటార్హోమ్ ‘ఫినెట్జా’ను ఆవిష్కరించింది. దీని ధర రూ.15–50 లక్షల శ్రేణిలో ఉండొచ్చు. కంపెనీ అలాగే మోడిఫైడ్ ఎగ్జిక్యూటివ్ బిజినెస్ వ్యాన్ ‘ఒపిసియా’, కస్టమైజ్డ్ టూరర్ ‘మాగ్రిఫిసియా’, మోడిఫైడ్ ప్రొడక్ట్ డిస్ప్లే వ్యాన్ ‘ఎగ్జిబికా’లను ప్రదర్శనకు ఉంచింది. ఎంఫ్లుక్స్ మోటార్స్: ఎంఫ్లుక్స్ మోటార్స్ తాజాగా ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ ‘ఎంఫ్లుక్స్ వన్’ నమూనాను ఆవిష్కరించింది. ఇది 2019 ఏప్రిల్‌లో భారతీయ రోడ్లపై పరిగెత్తనుంది. దీని గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు. యూనిటి: స్వీడన్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ యూనిటి తాజాగా 5 సీటర్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ.7.1 లక్షలు. ఇది 2020లో మార్కెట్లోకి రానుంది. కంపెనీ అలాగే 2 సీటర్ ఎలక్ట్రిక్ కారు ‘యూనిటి వన్’ను ప్రదర్శనకు ఉంచింది. ఈ కార్ల అసెంబ్లింగ్, మార్కెటింగ్ కార్యకలాపాల కోసం బర్డ్ గ్రూప్‌తో భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది. ట్వంటీ టూ మోటార్స్: ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ట్వంటీ టూ మోటార్స్ తాజాగా స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఫ్లో’ను ఆవిష్కరించింది. దీని ధర రూ.74,740. దీన్ని 5 గంటలు చార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు వెళ్లొచ్చని కంపెనీ తెలిపింది. వీటి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇవి 2018 రెండో అర్ధభాగంలో కస్టమర్లకు డెలివరీ అవుతాయి. (ఆటోషోను ప్రారంభిస్తున్న సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్. ) (టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310తో మోడల్) (బీఎండబ్ల్యూ మినీ కూపర్ కన్వర్టబుల్ ఎస్) -
పియాజ్జియో కొత్త బైక్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: ఇటాలియన్ ఆటో దిగ్గజం పియాజ్జియో 125 సీసీ బైక్‌ను ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ప్రముఖ వెస్పా స్కూ టర్ల తయారీ సంస్థ పియాజియో.. దేశీయ మార్కెట్లోకి ఏప్రిలియా ఎస్ఆర్ 125ను విడుదల చేసింది. దీనికి ధరను రూ .65,310 (ఎక్స్-షోరూమ్ పూణే) గా నిర్ణయించింది. వీటితో పాటు వెస్పా స్కూటర్లను కూడా ప్రదర్శించింది. వెస్పాజీటీఎస్, ట్యునో 150, ఇ-స్కూటర్ ఎలక్ట్రికాలను 2018 ఆటో ఎక్స్‌పోలో షోకేస్ చేసింది. ఈ సందర్భంగా ఒక కొత్త మొబైల్ కనెక్టివిటీ అప్లికేషన్ కూడా సంస్థ ప్రారంభించింది. 3 వాల్వ్ ఇంజీన్, 14 అంగుళాల వీల్స్, వైడర్ టైర్లతో సరసమైన ధరలో దేశవ్యాప్త డీలర్ల ద్వారా భారతీయ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని పియాజియో సీఈఓఅండ్ ఎండీ డియాగో గ్రాఫీ వెల్లడించారు. ఈ లాంచింగ్‌లతో కొత్త కేటగిరీలలో దేశంలో తమ వారసత్వం కొనసాగుతుందన్నారు. దీంతోపాటు యూత్‌ను ఆకట్టుకునే లక్ష్యంతో స్పోర్టి వెర్షన్ ఏప్రిలియా స్టామ్ను కూడా పరిచయం చేసింది. 125సీసీ ఇంజీన్, వైడ్ టెర్రైన్ టూర్లు, 12అంగుళాల ప్రధాన ఫీచర్లతో ఈ ఏడాది చివర్లో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇక మార్కెట్ పోటీ విషయానికి వస్తే ఎస్ఆర్ 125 బైక్ ఇటీవల కొత్తగా విడుదైలన టీవీఎస్ ఎన్ టార్క్ 125 , హోండా గ్రాజియా, సుజుకి యాక్స్‌స్ లకుగట్టిపోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
మారుతి కొత్త కాన్సెప్ట్ ప్యూచర్ ఎస్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో భారతదేశపు అతి పెద్ద ఆటో షో 2018 ది మోటార్ షో ప్రీ ఈవెంట్ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేశీయ దిగ్గజం ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఇండియాలో రూపొందించిన తమ సరికొత్త ఫ్యూచర్ ఎస్ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించింది. ఈ కొత్త ఫ్యూచర్ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ ఎస్ కాన్సెప్ట్ ఎస్‌యూవీని మారుతి సుజుకి ఇండియా డిజైనింగ్ బృందం వినూత్నంగా అభివృద్ది చేసింది. ఎత్తైన బాడీ, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ , ఆకర్షణీయమైన ఇంటీరియర్‌లో సొబగులు దీని సొంతం. ముఖ్యంగా టోటల్ బాడీ డిజైన్, పలుచటి హెడ్ ల్యాంప్స్‌తోపాటు మారుతి ఇప్పటి వరకు పరిచయం చేయని ఫ్రంట్ గ్రిల్ , ముందు వైపు అద్దం చుట్టూ ఉన్నతెలుపు రంగు పట్టీని అమర్చింది. ఇంకా ఫ్రంట్ బంపర్ క్రింద సిల్వర్ బాష్ ప్లేట్ , రౌండ్ ఫాగ్ ల్యాంప్స్ ,బాడీ కలర్, బ్లాక్ అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. డోర్ ట్రిమ్స్, సీట్లు, స్టీరింగ్ వీల్, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, డ్యాష్ బోర్డ్ సహా పలు ఇతర ఇంటీరియర్ ఫీచర్లు ఆరెంజ్ లో తీర్చిదిద్దింది. కాంపాక్ట్ కార్లు వినియోగదారుల సహజ ఎంపికగా ఉందని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సీఎండీ కెన్చి అయుకవా చెప్పారు. బోల్డ్, డైనమిక్‌గా తమడిజైనర్లు ఈ బ్రాండ్ కొత్త రూపాన్ని సృష్టించారని తెలిపారు. కాగా ఢిల్లీ ఆటో ఎక్స్పో 2018లో ఈ సారి 37 వాహన తయారీ సంస్థలు , ఆటోమొబైల్ ఆధారిత పలు కంపెనీలు తమ ఉత్పత్తులను ఆవిష్కరించనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు వివిధ కంపెనీలకార్లు, బైకులు, బస్సులు, ట్రక్కులు ఎన్నో కొత్త వాహనాలు సందడి చేయనున్నాయి. -
అట్టహాసంగా ఆటో ఎక్స్పో 2018 ప్రీ ఈవెంట్
సాక్షి, న్యూఢిల్లీ: 2018 ఆటోఎక్స్‌పో-ది మోటా ర్ షో ప్రీ ఓపెన్ ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 9-14వ తేదీవరకు జరిగే 14వ ఆటో ఎక్స్‌పోలో నేడు(బుధవారం), రేపు మీడియాకు, కంపెనీలకు ప్రత్యక షో నిర్వహిస్తున్నారు. గ్రేటర్ నోయిడా వేదికగా ఈ ఎక్స్పో ప్రారంభం కానున్న సందర్భంగా పలు కంపెనీల వాహనాల ప్రదర్శన సందడి చేసింది. ముఖ్యంగా మోస్ట్ ఎవైటెడ్ ఆటో ఎక్స్ పో హ్యుందాయ్, మారుతిసుజుకి, హీరో మోటో కార్ప్, అలాగే ఇటాలియన్ ఆటోమొబైల్ బ్రాండ్స్ ఏప్రిలియా, పియాజ్జియో , కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌తో సందడి చేశాయి. ఇంకా ఫోక్స్ వ్యాగన్, రాయల్ ఎన్ఫీల్డ్ సహా బజాజ్ ఆటో, నిస్సాన్ ఇండియా కంపనీలు తమ సరికొత్త వాహనాలతో హల్చల్ చేసేందుకు రడీ అయిపోయాయి. ఈ సందర్భంగా భారతీయ మార్కెట్లో 2020 నాటికి ఒక ఎలక్ట్రిక్ వాహనంతో సహా తొమ్మిది కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా బుధవారం ప్రకటించింది. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మన రోడ్లపై కియా
సాక్షి, న్యూఢిల్లీ : కొరియన్ ఆటో దిగ్గజం కియా మోటార్స్ భారత్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కాన్సెప్ట్ ఎస్‌యూవీని బుధవారం ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. ఎస్పీ కాన్సెప్ట్‌తో పిలిచే ఈ కార్లు 2019లో భారత రోడ్లపై సందడి చేస్తాయని తెలిపింది. మార్కెట్ ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా ధర నిర్ణయిస్తామని కియా మోటార్స్ ఇండియా సేల్స్ హెడ్ మనోహర్ భట్ చెప్పారు. ఏపీలో మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ను నెలకొల్పనున్న కియా మోటార్స్ భారత్‌లో తొలుత ప్రవేశపెట్టనున్న ఎస్‌యూవీని ఆటో ఎక్స్పో వేదికగా ఆవిష్కరించింది. భారత్‌లో రూ 7000 కోట్లు పైగా పెట్టుబడులు పెట్టనున్న కంపెనీ ఏడాదికి మూడు లక్షల కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. భారత్‌లో రాబోయే రోజుల్లో ఎలక్ర్టిక్ వాహనాలకు మెరుగైన డిమాండ్ ఉంటుందని కియో అంచనా వేస్తోంది. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆటో ఎక్స్ పో... సందర్శకుల తాకిడి
మొదటి రోజు 80 వేల మంది గ్రేటర్ నోయిడా: ఆటో ఎక్స్పోను శుక్రవారం 80 వేల మంది సందర్శించారు. ఈ ఆటో షోకు శుక్రవారం నుంచి మంగళవారం(ఈ నెల 9) వరకూ ప్రజలను అనుమతిస్తారు. ఇక్కడి ఇండియా ఎక్స్పో మార్ట్‌లో జరుగుతున్న ఈ ఆటో షోను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్(సియామ్), ఆటోమోటివ్ కాంపొనెంట్స్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్(ఏసీఎంఏ), కాన్ఫెడరేషన్ ఆప్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. భారత వాహన మార్కెట్లోకి రానున్న తాజా, ఉత్తమ వాహనాలను చూడటానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని సియామ్ పేర్కొంది. సూపర్ బైక్‌ల సెక్షన్‌ను చూడ్డానికి జనం బాగా వచ్చారని నిర్వాహకులు వెల్లడించారు. పురాతన వాహనాలతో కూడిన వింటేజ్ కార్ పెవిలియన్ కూడా పలువురిని ఆకర్షించింది. వీధి నాటకాలు, తోలు బొమ్మలాటల ద్వారా రోడ్డు భద్రతపై సందర్శకులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఆటో ఎక్స్‌పోలో మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్, హోండా కార్స్, ఆడి తదితర కంపెనీలు వాహనాలను ప్రదర్శిస్తున్నాయి. -
ఎదురుపడకుండా జాగ్రత్త పడ్డారు
ఈ మధ్యే బ్రేకప్ చెప్పేసుకున్న బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా, రణబీర్ కపూర్ ఒకరికొకరు ఎదురు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పోకు ఒకే సమయంలో హాజరైన ఈ ఇద్దరు మాజీ ప్రేమికులు ఒకరి కంట ఒకరు పడకుండానే వెళ్లిపోయారు. బుధవారం ఉదయం 11.30 సమయంలో ఎక్స్ పోకు హాజరైన కత్రినా దాదాపు గంట పాటు అక్కడే గడిపారు. అదే సమయంలో రణబీర్ కూడా ఎక్స్‌పోకు హాజరు కావటంతో ఈ ప్రేమజంట ఒకరికొకరు ఎదురుపడితే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని అక్కడున్న వారంతా ఎదురుచూశారు. అయితే రణబీర్ కూడా వస్తున్న విషయం ముందే తెలిసిందో లేక చూసింది చాల్లే అనుకుందో గాని కత్రినా ఎక్స్పో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఈ ఇద్దరు ప్రేమికులు ఎదురు పడితే ఎలా ఉంటుందో చూడాలనుకున్న జనాలకు మాత్రం నిరాశే మిగిలింది. ఎక్స్పో చూసిన తరువాత రణబీర్ తన సినిమా షూటింగ్ కోసం బార్సీలోనా పయనమవ్వగా, కత్రిన మాత్రం తన లేటెస్ట్ సినిమా ఫితూర్ ప్రమోషన్ కోసం ఢిల్లీలోనే ఉండిపోయింది. అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా ఫితూర్లో కత్రినా కైఫ్, ఆదిత్యారాయ్ కపూర్, టబులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 12న రిలీజ్ కు రెడీ అవుతోంది.