BMW Circular EV: కారుని ఇలా కూడా తయారు చేస్తారా! | BMW Circular Electric Car Manufactured By Fully Recycled Materials | Sakshi
Sakshi News home page

BMW Circular EV: కారుని ఇలా కూడా తయారు చేస్తారా!

Published Wed, Sep 8 2021 8:24 AM | Last Updated on Wed, Sep 8 2021 8:26 AM

BMW Circular Electric Car Manufactured By Fully Recycled Materials - Sakshi

మ్యూనిక్‌: బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్‌ కారు.. పేరు ఐవిజన్‌ సర్క్యులర్‌.. ఎలక్ట్రిక్‌ కారు అంటే.. పర్యావరణ అనుకూలమైనదన్న సంగతి అందరికీ తెలిసిందే.. ఇప్పటికే చాలా ఎలక్ట్రిక్‌ కార్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అయితే వాటన్నింటిని తలదన్నెలా బీఎండబ్ల్యూ సంస్థ సర్కులర్‌ పేరుతో కొత్త కారుని మార్కెట్‌లోకి తేబోతుంది. ఈ మేరకు ఈ కారు నమూనాను జర్మనీలోని మ్యూనిక్‌లో జరుగుతున్న మొబిలిటీ షోలో ప్రదర్శించారు. త్వరలో రాబోయే ఈ కారు ఆటో మొబైల్‌ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తుందని చెబుతున్నారు.


రీసైకిల్డ్‌ మెటీరియల్‌తో
బీఎండబ్ల్యూ సంస్థ సర్కులర్‌ కారుని పూర్తిగా రీసైకిల్డ్‌ మెటీరియల్‌తో తయారుచేశారు. అంతేకాదు.. ఈ కారు జీవిత కాలం ముగిసిన తర్వాత కారులోని భాగాలన్నిటినీ మళ్లీ రీసైకిల్‌ చేసి.. కొత్త కార్ల తయారీలో ఉపయోగించవచ్చని ఆ సంస్థ చెబుతోంది. కారు బాడీ మొత్తాన్ని ఐనోడైజ్డ్‌ అల్యుమీనియంతో తయారు చేశారు. ఇక ఇంటీరియర్‌లో క్యాబిన్‌ భాగం మొత్తాన్ని రీసైకిల్డ్‌ చేసిన ప్లాస్టిక్‌తో రూపొందించారు. ఇందులో ఉపయోగించిన బ్యాటరీ సైతం రీసైకిల్డ్‌ చేసినదే కావడం గమనార్హం.
డిజైన్‌లోను అదే తీరు
ఇక కారు డిజైన్‌ విషయానికి వస్తే అవుట్‌ లుక్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ,  ఇన్నర్‌ డిజైన్‌ మల్టీ పర్పస్‌ యుటిలిటీ తరహాలో ఉంది.  ప్రస్తుతం బీఎండబ్ల్యూ తయారుచేస్తున్న వాహనాల్లో 30 శాతం మేర పునర్వినియోగ సామగ్రిని వాడుతున్నారు. అయితే, 2040 సరికి తమ వాహనాలన్నింటినీ 100 శాతం రీసైకిల్డ్‌ మెటీరియల్‌తోనే తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సదరు సంస్థ తెలిపింది.
ధరపై ఆసక్తి
బీఎండబ్ల్యూ అంటేనే లగ్జరీ కార్లకు పేరు. ఆ సంస్థ నుంచి పూర్తిగా రిసైకిల్డ్‌ మెటీరియల్‌తో రూపొందిన ఐవిజన్‌ సర్క్యులర్‌ కారు ధర ఎలా ఉంటుందనే అసక్తి నెలకొంది. అయితే ఈ కారుని మార్కెట్లోకి ఎప్పుడు తెస్తారన్న వివరాలను బీఎండబ్ల్యూ  ప్రకటించలేదు.

చదవండి: BMW i Vision AMBY : ది సూపర్​ ఎలక్ట్రిక్‌ సైకిల్..! రేంజ్‌ తెలిస్తే షాక్‌..!​

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement