Concept
-
స్మార్ట్ ఫోన్ చేతికి చుట్టేసుకుంటే.. (ఫొటోలు)
-
వైద్య ఆరోగ్య రంగంలో ప్రగతిదాయక అడుగులు
-
కథ చెబుతాం ఊ కొడతారా..
చిన్నప్పుడు ‘అనగనగా..’అంటూ అమ్మమ్మలు, నానమ్మలు కథలు చెప్పే రోజులు గుర్తున్నాయా? కథను ఊరిస్తూ.. ఊహించేలా చెబుతుంటే ఆ పాత్రల్లోకి మనం పరకాయ ప్రవేశం చేసేవాళ్లం. కడుపులో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు ‘నారాయణ మంత్రం’విని ఊకొట్టాడని.. తల్లిగర్భంలో ఉన్నప్పుడే అభిమన్యుడు ‘పద్మవ్యూహం’గురించి విని నేర్చుకున్నాడని పురాణాల్లో చదువుకున్నాం. దృశ్య రూపంలో కంటే శ్రవణ రూప కథనంలో పిల్లల ఊహాశక్తి మెరుగుపడుతుంది. అందుకే మనిషి పరిణామక్రమంలో కథ ప్రాధాన్యం అనన్య సామాన్యం. అయితే నేటి కంప్యూటర్ యుగంలో ఆ అదృష్టం పిల్లలకు పూర్తిగా దూరమైంది. కెరీర్ పరుగులో పడిపోయి.. పిల్లలకు కథలను చెప్పగలిగేంత సమయం, ఓపిక రెండూ తల్లిదండ్రులకు దొరకడం లేదు. అందుకే ఇప్పటి పిల్లలు కథలంటే గుగూల్లో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందిస్తూ చదువుపై వారికి ఆసక్తి కలిగించి.. తద్వారా వారిలోని సృజనాత్మక శక్తిని, నిద్రాణంగా దాగి ఉన్న కళలను వెలికి తీసే ఉద్దేశంతోనే పుట్టిందే స్టోరీ టెల్లింగ్ డే. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చక్కటి స్పందన లభిస్తోంది. – విశాఖపట్నం డెస్క్ నేటితరం చేతుల్లో పుస్తకాలు నలగవు కానీ ఫోన్లలోని యాప్స్ గిరగిరా తిరుగుతుంటాయి. స్మార్ట్ ఫోన్లు, వీడియో గేమ్‌లు, ఇంటర్నెట్లతో కాలం గడిపే చిన్నారుల్లో సృజనాత్మకశక్తి పూర్తిగా తగ్గిపోవడంతో పాటు వారిలో ఊబకాయం తదితర దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అనేక సర్వేలు వెల్లడించాయి. ‘మీ పిల్లలు తెలివిగల వాళ్లు కావాలంటే వారికి రోజూ కథలు చెప్పండి’అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పారంటే.. చిన్నారుల జీవితాలను కథలు ఎంతగా ప్రభావితం చేయగలవో అర్థం అవుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రుల ఆలోచనల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. పిల్లలకు ప్రతి రోజూ కథలు చెప్పే సమయం దొరక్కపోయినా.. వారాంతాల్లో తప్పనిసరిగా ‘స్టోరీ టెల్లింగ్’ కార్యక్రమాలకు తీసుకెళ్తున్నారు. పాఠశాలల్లో సైతం వారంలో కనీసం రెండు రోజులు స్టోరీ టెల్లింగ్ క్లాసులు ఉండేలా యాజమాన్యాలకు అభ్యర్థిస్తున్నారు . ఈ పరిస్థితుల్లో నగరంలో స్టోరీ టెల్లింగ్ నిపుణులు, ఈ తరహా కార్యక్రమాలకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. ‘మియావాకీ’ అలా మొదలైంది కథల ద్వారా పిల్లలను చదువు వైపు మళ్లించడం సులభమని ఉపాధ్యాయురాలు, ప్రముఖ స్టోరీ టెల్లర్ షింపీ కుమారి అంటున్నారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నివాసి అయిన షింపీ కుమారి ఎమ్మెస్సీ, బీఈడీ చదివారు. ఉద్యోగ రీత్యా 2006లో విశాఖ వచ్చారు. ఇక్కడ ఓ ప్రైవేట్ పాఠశాలలో సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులు బోధిస్తున్నారు. ద్వారకానగర్‌లోని పౌరగ్రంథాలయం కమిటీ కార్యదర్శి డీఎస్ వర్మ చొరవతో 7 నెలల కిందట మియావాకీ స్టోరీ టైమ్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. పౌర గ్రంథాలయంలో నెలలో రెండు రోజులు ఒకటి నుంచి 4వ తరగతి పిల్లలకు ఉదయం 10.15 నుంచి 11.30 వరకు, 5వ తరగతి నుంచి 8 తరగతి చదివే పిల్లలకు 11.15 నుంచి 12.30 వరకు కథలు చెప్పడం ప్రారంభించారు. తొలుత షింపీ కుమారి ఒక్కరే పిల్లలకు చక్కని కథలు చెబుతూ.. వివిధ అంశాలు వివరించేవారు. ఆమె తలపెట్టిన ఈ కార్యానికి తర్వాత నగరానికి చెందిన స్టోరీ టెల్లర్, వాయిస్ ఆరి్టస్ట్ సీతా శ్రీనివాస్, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) ఎడ్యుకేటర్ శ్రావ్య గరుడ, ఉపాధ్యాయిరాలు రబియా నవాజ్ తోడయ్యారు. వారు స్వచ్ఛందంగా తమ సేవలందిస్తూ చిన్నారులను తీర్చిదిద్దే గురుతర బాధ్యతలో భాగస్వాములయ్యారు. ఒక్క స్టోరీ టెల్లింగ్ ఎన్నో కళలను వెలికి తీస్తుందని షింపీకుమారి తెలిపారు. స్టోరీ టెల్లింగ్ క్లాస్ పూర్తయిన ప్రతిసారీ తాము పిల్లలతో డ్రాయింగ్, క్రాఫ్టŠస్, సింగింగ్, పప్పెట్రీ, ఒరిగామి తదితర కృత్యాలు పిల్లలతో చేయిస్తామని.. తద్వారా పిల్లల్లో తాము అనుకున్నది వ్యక్తీకరించే స్వతంత్రత వస్తుందన్నారు. భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్, విశాఖ పౌర గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో గ్రంథాలయం మూడో అంతస్తులోని పిల్లల విభాగంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేదని తెలిపారు. కథ అంటే ఓకే అంటారు సాధారణంగా పాట పాడదామా, డ్రాయింగ్ వేద్దామా అని పిల్లలను అడిగితే కొందరు మాత్రమే సరేనంటారు. అదే కథ వింటారా అంటే అందరూ ఓకే అంటారు. కథ చెప్పడం అనేది ఓ కళ. మిగతా కళలతో పోలిస్తే కథల్లో వినేవాళ్లే కళాకారులు. ఎందుకంటే కథ వినేవాళ్లు వాళ్ల బుర్రల్లో పాత్రలను ఊహించుకుంటారు. అందుకే కథలను అందరూ ఇష్టపడతారు. కెనడాలో మూడేళ్ల కిందట స్కూల్ కరిక్యులమ్‌లో స్టోరీ టెల్లింగ్‌ను చేర్చారు. మన సంప్రదాయంలో అది ఎప్పట్నించో ఉంది. చరిత్ర, పురాణాలను కథల ద్వారానే మనం చెప్తాం కదా.. ఊహాశక్తితో పాటు భాషా పరిజ్ఞానం కథలు వినడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తరగతుల్లో చెప్పే పాఠాల్లో దాదాపు సగం చిన్నారులకు గుర్తు ఉండవు. అదే ఓ కథలోని ప్రతీ సంఘటన పిల్లల మనసుల్లో బలంగా నాటుకుపోతుంది. వారిలో ఊహాశక్తి పెరుగుతుంది. కథ చెబుతూ పోతుంటే ఆ తర్వాత ఏం జరుగుతుందన్న విషయాన్ని చిన్నారులు ఊహిస్తూ ఉంటారు. ఇదే వారి మానసిక ఎదుగుదలకు ఉపయుక్తంగా నిలుస్తుందని నిపుణుల అభిప్రాయం. ఇక చరిత్రకు సంబంధించిన అంశాలను కథల్లా చెప్పడం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు తెలియజేయవచ్చు. మాతృభాషతో పాటు ఇంగ్లి‹Ù, హిందీ తదితర భాషల్లో పిల్లలకు కథలు చెబితే వారికి భాషా పరిజ్ఞానం కూడా పెరుగుతుంది. కథ చెప్పడం ఓ కళ శ్రోతలను ఆకట్టుకునేలా కథలను చెప్పగలగడం ఓ ప్రత్యేకమైన కళ. కథల్లోని అంశాలకు తగ్గ ట్టు ఓ ఊహాజనిత లోకాన్ని కళ్లకు కట్టేలా కథలు చెప్పగలిగినపుడే శ్రోతలు ఆ కథలో పూర్తిగా నిమగ్నమవుతారు. ఇప్పటి స్టోరీ టెల్లర్స్ వారి హావభావాలను కథలతో కలిపి వ్యక్తీకరించడంతో పాటు పెయింటింగ్స్, పేపర్ కటింగ్స్, పాటలు వంటి వాటిని తమ మాధ్యమాలుగా వినియోగిస్తున్నారు. ఎంచుకున్న కథతోపాటు ఎత్తుగడ, ముగింపు అనే అంశాలు ఓ స్టోరీ టెల్లర్ నైపుణ్యాన్ని తెలియజేస్తా యి. కథలు అనగానే కేవలం చిన్నారులకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరబడ్డట్టే. ఎన్నో ఒత్తిళ్లతో సతమతమయ్యే పెద్ద వారికి సైతం ఈ తరహా కథకాలక్షేపాలు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి. కథల్లా పాఠాలు కథలు వింటూ పాఠాలు వినడం.. కథలే పాఠాలైపోవడం నాకెంతో నచ్చింది. ఇంతకు ముందు చదివింది గుర్తుండేది కాదు. ఇప్పుడు మా బుక్స్‌లోని లెసన్స్ కథల్లా మారిపోయాక.. బాగా గుర్తుంటున్నాయి. మార్కులు కూడా బాగా వస్తున్నాయి. – బి.తనూశ్రీ, 3వ తరగతి, భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్ క్లాసెస్ బాగుంటున్నాయి స్టోరీ టెల్లింగ్ క్లాసెస్ చాలా బాగుంటున్నాయి. లైబ్రరీలో కొత్తకొత్త పుస్తకాలు కూడా నాకు చాలా నచ్చుతున్నాయి. బుక్స్ రీడింగ్ వల్ల కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కథలు నేర్చుకోవడంతో పాటు చెప్పడం అలవాటు చేసుకుంటున్నా.. – సూర్య విహాన్ వర్మ, 3వ తరగతి, టింపనీ సీనియర్ సెకండరీ స్కూల్ అద్భుతాలు చేయవచ్చు కథలు ఎవరికైనా నచ్చుతాయి. అవి ఏ వయసు వారికైనా గుర్తుండిపోతాయి. కథ, కథలు చెప్పే విధానంలోను నవ్యత ఉంటే అవి మనల్ని జీవితాంతం వెంటాడుతాయి. మేం చేస్తున్నది అదే. కథల ద్వారా చిన్ని మనసుల్లో నైపుణ్యాన్ని చొప్పిస్తున్నాం. ఈ నెల 26న మియావాకీ స్టోరీటైమ్లో మళ్లీ కలుద్దాం. – సీతా శ్రీనివాస్, స్టోరీ టెల్లర్, వాయిస్ ఆర్టిస్ట్ విద్యార్థులకు మేలు చేస్తుంది స్టోరీ టెల్లింగ్ విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. ఏదైనా కథలా చెబితే వారికి ఇట్టే గుర్తుండిపోతుంది. ఒక్క చదువే కాదు.. సరైన రీతిలో భావవ్యక్తీకరణ అనేక విధాలుగా జీవితంలో ఉపయోగపడుతుంది. స్టోరీ టెల్లింగ్ ద్వారా ఆ నైపుణ్యం పిల్లలకు అందించేందుకు మేం కృషి చేస్తున్నాం. – శ్రావ్య గరుడ, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్(స్టెమ్) ఎడ్యుకేటర్ -
వన్ ప్లస్ 11 కాన్సెప్ట్ ఫోన్ ఫస్ట్ లుక్.. లిక్విడ్ కూలింగ్ ఫీచర్ అదుర్స్!
చాలా రోజులుగా ఊరిస్తున్న వన్ ప్లస్ 11 (OnePlus 11) కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్ స్టన్నింగ్ ఫీచర్స్‌ను తాజాగా ఆవిష్కరించింది. గతంలో ఎప్పుడూ చూడని ఓ సరికొత్త ఫీచర్‌ను ఇందులో తీసుకొచ్చింది. అదే యాక్టివ్ క్రియోఫ్లక్స్ కూలింగ్ సొల్యూషన్. ఈ యాక్టివ్ క్రియోఫ్లక్స్ అనేది సాధారణంగా డెస్క్‌టాప్ కంప్యూటర్లలో ఉండే క్లోజ్డ్-లూప్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌కి మరో పేరు. కానీ దీన్ని స్మార్ట్‌ఫోన్‌కు అనువుగా రూపొందించారు. ఫోన్ మధ్యలో ఒక సిరామిక్ పైజోఎలెక్ట్రిక్ మైక్రోపంప్ ఉంటుంది. ఇది చిన్నచిన్న గొట్టాల ద్వారా కూలింగ్ ద్రవాన్ని ఫోన్ అంతటికీ పంపుతుంది. ఇది రేడియేటర్‌గా పనిచేసి ఫోన్ హీట్‌ను గ్రహించి చల్లబరుస్తుంది. ఈ యాక్టివ్ క్రయోఫ్లక్స్ కూలింగ్ సిస్టమ్ ఫోన్ ఉష్ణోగ్రతలను 2.1 డిగ్రీల వరకు తగ్గించగలదని వన్ ప్లస్ పేర్కొంది. ఇది ఛార్జింగ్ సమయంలోనే ఉష్ణోగ్రతను 1.6 డిగ్రీలకు తగ్గిస్తుంది. దీంతో ఛార్జింగ్ సమయం కూడా ఆదా అవుతుంది. (ఇదీ చదవండి: సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?) ఇక మిగిలినవి ఫోన్ డిజైన్ ఇతర ఆకృతులకు సంబంధించినవి. ఫోన్ వెనుక కవర్ కోసం వంపు తిరిగిన, పారదర్శక గాజును ఉపయోగించారు. దీంతో వెనుకవైపు కూలింగ్ ద్రవం ప్రవహించే ప్రకాశవంతమైన గొట్టాలను చూడవచ్చు. అలాగే కెమెరా చుట్టూ కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. అయితే వన్ ప్లస్ ఈ కాన్సెప్ట్ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిని ఎప్పుడు మొదటు పెడుతుందో స్పష్టత లేదు. ఇలాగే 2020లో వన్‌ప్లస్ ఆసక్తికరమైన సెల్ఫ్-టింటింగ్ కెమెరా కవర్ క్లాస్‌ను ఆవిష్కరించింది. కానీ వాటిని ఉత్పత్తి చేయలేదు. -
దేశంలోనే తొలిసారిగా ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ విధానం
-
సాయిధరమ్ తేజ్... చిత్రలహరిలో చెప్పింది ఇదే..
Sai Dharam Tej : టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఇవాళ వార్తల్లో ప్రముఖంగా నిలిచిన విషయం తెలిసిందే. యాక్సిడెంట్ జరిగిన వెంటనే స్థానికులు 108కి సమాచారం అందించడంతో గోల్డెన్ అవర్‌లో చికిత్స అంది ప్రాణపాయం తప్పింది. నిజ జీవితానికి దగ్గర అన్నట్టుగానే సరిగ్గా ఏడాది కిందట ప్రమాదంలో గాయపడినప్పుడు చుట్టు పక్కల ఎవ్వరూ లేకపోయినా తక్షణ సాయం ఎలా పొందాలనే కాన్సెప్టుతో యాప్‌ను డెవలప్ చేసే యువకుడిగా తేజ్ చిత్రలహరి అనే సినిమా వచ్చింది. యాక్సిడెంట్ అలెర్ట్ సిస్టమ్ పేరుతో ఓ స్టార్టప్ నెలకొల్పే న్యూ ఎంట్రప్యూనర్‌గా తేజ్ అందులో కనిపించారు. ఒక ఐడియా ఎంతోమంది జీవితాల్లో మార్పు తెస్తుంది. అయితే ఆ ఐడియా కార్యరూపం దాల్చే క్రమంలో ఎదురయ్యే ఒడిదుడుకులు, ఆటుపోట్లు, అవకాశాలు ఎలా ఉంటాయినే వివరాలు... స్టార్టప్ ఒకప్పుడు వ్యాపారం అనేది కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉండేది. అది కూడా సంప్రదాయ పద్దతిలోనే కొనసాగేది. కానీ కొత్త వాళ్లు ఆ రంగంలో ప్రవేశించడం దుర్లభంగా ఉండేంది. వచ్చినా నిలదొక్కుకోవడం కష్టంగా ఉండేది. అయితే ఇంటర్నెట్ యాక్సెస్ పెరగడం, స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రావడంతో వ్యాపారంలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. మంచి కాన్సెప్టు ఉంటే చాలు తక్కువ పెట్టుబడితో స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నారు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సక్సెస్ మంత్ర స్టార్టప్‌ల విజయాల గురించి చర్చిస్తే ఫ్లిప్‌కార్ట్ మొదలు బైజూస్, అన్ అకాడమీ, జోమాటో, స్విగ్గీ, పేటీఎం, ఓయో, ఓలా ఒక్కటేమికి వరుసగా అనేక కంపెనీలు మన కళ్లేదుటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఈ స్టార్టప్‌లు ప్రారంభమై కష్టనష్టాలు ఎదుర్కొని వేల కోట్ల మార్కెట్ విలువను సొంతం చేసుకునేందుకు సంప్రదాయ పద్దతిలో ఏళ్లకు ఏళ్లు తీసుకోలేదు. జస్ట్ ఐదు నుంచి పదేళ్లలోనే వేల కోట్లకు చేరుకున్నాయి. కారణం కొత్త దనం, ఈజీ యాక్సెస్. స్టార్టప్ కంపెనీలకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు. అయితే ఈ రెండు ఉంటేనే కంపెనీలు సక్సెస్ అవుతాయా అంటే కాదనే చెప్పాలి. స్టార్టప్ పుట్టుకకు కారణమైన కాన్సెప్టుకి వెన్నుదన్నుగా నిలిచే వెంచర్ క్యాపిటలిస్టులది ముఖ్య పాత్ర, వెంచర్ క్యాపిటలిస్టులు ఒకప్పుడు వ్యాపారం మొదలు పెట్టాలంటే రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అనేక రూల్స్, నిబంధనలు, అధికారుల అలసత్వం, బంధుప్రీతి, రాజకీయ జోక్యం తదితర కారణాల వల్ల ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రుణాల మంజూరు తలకు మించిన భారం అయ్యేది. కానీ వెంచర్ క్యాపిటలిస్టులు పెరిగిన తర్వాత ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. ఒప్పించడం సవాలే వ్యాపారం రంగంలో సక్సెస్ అయ్యే కాన్సెప్టులకి సహాకారం అందించేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. అయితే వెంచర్ క్యాపిటలిస్టుల దగ్గరికి చేరుకోవడం, అక్కడ వారిని కాన్సెప్టుకి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడమనేది మరో యజ్ఞం లాంటింది. కాన్సెప్టులో దమ్ముండి, వెంచర్ క్యాపిటలిస్టుల అండ లభిస్తే ఇక ఆ వ్యాపారానికి తిరుగు ఉండందు. మన దగ్గర దేశీ కంపెనీలతో విదేశీ సంస్థలకు చెందిన అనేక వెంచర్ క్యాపిటిలస్టులు పెట్టుబడులకు రెడీగా ఉన్నారు. అయితే వెంచర్ క్యాపిటలిస్టుల దగ్గరికి చేరడం కష్టం. దీనికి సంబంధించిన కష్టాలు ఎలా ఉంటాయనే అంశాలు మనకు చిత్రలహరి, ఆకాశమేన ఈ హద్దురా సినిమాల్లో పూసగుచ్చినట్టు వివరించారు. వాళ్లే వస్తున్నారు విభిన్నతకు నిలయమైన భారత్‌లాంటి దేశంలో పెట్టుబడుల అవసరాలు గుర్తించిన అనేక మంది వెంచర్ క్యాపిటలిస్టులు తమ రూటు మార్చుకున్నారు. టెక్ దిగ్గజ కంపెనీలు సైతం స్టార్టప్‌లకు చేయూత ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, ఫేస్బుక్, గూగుల్ వంటి సంస్థలు స్టార్టప్‌లకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ముందుకు వచ్చాయి. ప్రత్యేకంగా స్టార్టప్ కాంపిటీషన్లు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా స్టార్టప్‌లకు చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వ పరంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ పేరుతో హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇంక్యుబేషన్ సెంటర్‌ను నిర్మించింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి నగరాల్లోనూ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. మంచి కాన్సెప్టుతో ఇక్కడికి వెళితే ప్లగ్ అండ్ ప్లే మోడ్‌లో పని చేసుకోవచ్చు. ప్రైవేటు పరంగా స్టార్టప్‌లకు ఉండే పరిమిత వనరులను దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ ఖర్చుతో వర్క్‌స్పేస్‌ను అందించే సంస్థలు సైతం పుట్టుకొచ్చాయి. ఇవి కాఫీ లాంజ్ తరహాలో ఉంటాయి. మన కంప్యూటర్/లాప్‌ట్యాప్‌లతో అక్కడికి వెళితే చాలు టేబుల్, ఇంటర్నెట్, కాఫీ, లంచ్ తదితర సౌకర్యాలు కల్పిస్తారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోవచ్చు. అతి తక్కువ ఖర్చుతో ఈ తరహా ఆఫీస్ స్పేస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్‌లో ఈ తరహా స్టార్టప్‌లోనే సుచిత్ర మొదట పని చేస్తుంది. చదవండి : Bigg Boss: బాస్‌లకే బాస్ అసలైన బిగ్‌బాస్ ఇతనే -
BMW Circular EV: కారుని ఇలా కూడా తయారు చేస్తారా!
మ్యూనిక్: బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కారు.. పేరు ఐవిజన్ సర్క్యులర్.. ఎలక్ట్రిక్ కారు అంటే.. పర్యావరణ అనుకూలమైనదన్న సంగతి అందరికీ తెలిసిందే.. ఇప్పటికే చాలా ఎలక్ట్రిక్ కార్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. అయితే వాటన్నింటిని తలదన్నెలా బీఎండబ్ల్యూ సంస్థ సర్కులర్ పేరుతో కొత్త కారుని మార్కెట్లోకి తేబోతుంది. ఈ మేరకు ఈ కారు నమూనాను జర్మనీలోని మ్యూనిక్‌లో జరుగుతున్న మొబిలిటీ షోలో ప్రదర్శించారు. త్వరలో రాబోయే ఈ కారు ఆటో మొబైల్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తుందని చెబుతున్నారు. రీసైకిల్డ్ మెటీరియల్‌తో బీఎండబ్ల్యూ సంస్థ సర్కులర్ కారుని పూర్తిగా రీసైకిల్డ్ మెటీరియల్‌తో తయారుచేశారు. అంతేకాదు.. ఈ కారు జీవిత కాలం ముగిసిన తర్వాత కారులోని భాగాలన్నిటినీ మళ్లీ రీసైకిల్ చేసి.. కొత్త కార్ల తయారీలో ఉపయోగించవచ్చని ఆ సంస్థ చెబుతోంది. కారు బాడీ మొత్తాన్ని ఐనోడైజ్డ్ అల్యుమీనియంతో తయారు చేశారు. ఇక ఇంటీరియర్‌లో క్యాబిన్ భాగం మొత్తాన్ని రీసైకిల్డ్ చేసిన ప్లాస్టిక్‌తో రూపొందించారు. ఇందులో ఉపయోగించిన బ్యాటరీ సైతం రీసైకిల్డ్ చేసినదే కావడం గమనార్హం. డిజైన్‌లోను అదే తీరు ఇక కారు డిజైన్ విషయానికి వస్తే అవుట్ లుక్ స్పోర్ట్స్ యుటిలిటీ, ఇన్నర్ డిజైన్ మల్టీ పర్పస్ యుటిలిటీ తరహాలో ఉంది. ప్రస్తుతం బీఎండబ్ల్యూ తయారుచేస్తున్న వాహనాల్లో 30 శాతం మేర పునర్వినియోగ సామగ్రిని వాడుతున్నారు. అయితే, 2040 సరికి తమ వాహనాలన్నింటినీ 100 శాతం రీసైకిల్డ్ మెటీరియల్‌తోనే తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సదరు సంస్థ తెలిపింది. ధరపై ఆసక్తి బీఎండబ్ల్యూ అంటేనే లగ్జరీ కార్లకు పేరు. ఆ సంస్థ నుంచి పూర్తిగా రిసైకిల్డ్ మెటీరియల్‌తో రూపొందిన ఐవిజన్ సర్క్యులర్ కారు ధర ఎలా ఉంటుందనే అసక్తి నెలకొంది. అయితే ఈ కారుని మార్కెట్లోకి ఎప్పుడు తెస్తారన్న వివరాలను బీఎండబ్ల్యూ ప్రకటించలేదు. చదవండి: BMW i Vision AMBY : ది సూపర్ ఎలక్ట్రిక్ సైకిల్..! రేంజ్ తెలిస్తే షాక్..! -
హ్యుందాయ్ సంచలనం! త్వరలో హైడ్రోజన్ వేవ్ కారు!!
కొరియర్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఇప్పటికే ఫ్లైయింగ్ కార్ టెక్నాలజీపై విస్త్రృతంగా పరిశోధనలు చేస్తోన్న ఆ సంస్థ తాజాగా మరో టెక్నాలజీపై దృష్టి సారించింది. హైడ్రోజన్‌తో నడిచే కారును మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈవీలకు ధీటుగా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ) కార్ల ట్రెండ్ నడుస్తోంది. ఇండియా మొదలు అమెరికా వరకు మారుతి నుంచి జనరల్ మెటార్స్ వరకు అన్ని కంపెనీలు ఈవీ టెక్నాలజీపై దృష్టి సారించాయి. ఇక టెస్లా కంపెనీ ఎస్ ప్లెయిడ్ కార్లయితే కొత్త ట్రెండ్‌నే క్రియేట్ చేస్తున్నాయి. రాబోయే ఐదేళ్లలో ఈవీ కార్లకే పరిమితం అవుతామంటూ ఆడి ప్రకటించింది. ఇలా ఆటో మొబైల్ ఇండస్ట్రీ అంతా ఈవీ కార్ల గురించి, దానికి సంబంధించిన టెక్నాలజీ గురించి బిజీగా ఉంటే హ్యుందాయ్ వీటికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంటోంది. ఈవీ కార్లకు తోడు హైడ్రోజన్ కార్ల తయారీపై ఫోకస్ పెట్టింది. హైడ్రోజన్ వేవ్ సంప్రదాయేతర ఇంధన వనరులు ఉపయోగించుకునే వాటిలో బ్యాటరీల తర్వాత స్థానం హైడ్రోజన్ సెల్స్దే. అయితే బ్యాటరీ ఆధారిత ఈవీలతో పోల్చితే హైడ్రోజన్ సెల్స్ ఆధారిత ఇంజన్ల పనితీరు సంక్లిష్టమైంది. ఆ టెక్నాలజీ ఇంకా కమర్షియల్‌గా విరివిగా వినియోగంలోకి రాలేదు. కానీ హ్యందాయ్ ఓ అడుగు ముందుకు వేసి హ్రైడోజన్ వేవ్ పేరుతో కాన్సెప్టు కారుని సిద్ధం చేసింది. సెప్టెంబరు 7న హైడ్రోజన్ సెల్ బేస్డ్ కాన్సెప్టు కారుకు సంబంధించిన విశేషాలు సెప్టెంబరు 7న జరిగే వర్చువల్ సమావేశంలో హ్యందాయ్ సంస్థ వెల్లడించనుంది. ఆ తర్వాత కొరియాలోని గొయాంగ్లో ఈ కారుకు సంబంధించిన విశేషాలను ప్రదర్శించనుంది. ఈ మేరకు హ్యుందాయ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. హైడ్రోజన్ కారుకి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలంటే సెప్టెంబరు 7 వరకు వేచి చూడాలి. చదవండి : ఏసీ ఎకానమీ కోచ్.. ధర తక్కువ సౌకర్యాలు ఎక్కువ -
ఊసరవెల్లిలా రంగులు మార్చే ఫోన్, అందరి దృష్టి దానిపైనే
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఈసారి అందరి దృష్టి ఇన్ఫినిక్స్ కాన్సెప్ట్ 2021 ఫోన్‌పై పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ ఫోన్లో ఫీచర్స్‌ని ఇన్ఫినిక్స్ చేర్చింది. రంగులు మార్చేస్తుంది డ్యూయల్ కలర్ ఛేంజింగ్ బ్యాక్ కవర్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఇన్ఫినిక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ కలర్ మారుతుందని ఇన్ఫినిక్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్ జెస్సీ ఝాంగ్ తెలిపారు. గతంలో ఈ తరహా ఫీచర్‌తో ఏ ఫోన్ రాలేదు. ఒక రకంగా ఈ ఫోన్ ఊసరవెల్లిలా రంగులు మార్చేస్తుంది. క్రేజీ ఫీచర్లు యువతను ఆకట్టుకునేలా అనేక ఫీచర్లను ఇన్ఫినిక్స్ తన రాబోయే ఫోన్లో జోడించనుంది. అందులో కలర్ ఛేంజింగ్ బ్యాక్ ప్యానెల్‌తో పాటు 4000 mAh బ్యాటరీ అందివ్వనుంది దీనికి తోడుగా 160 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇవ్వడం వల్ల 10 నిమిషాల్లోనే ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అందివ్వనుంది. 3డీ గ్లాస్ కవరింగ్, 60 ఎక్స్ జూమ్ వంటి ఫీచర్లు అందించింది. అంతేకాదు ఫోన్ ఎక్కువగా వాడుతున్నా... ఛార్జింగ్ చేసే సమయంలో వేడెక్కకుండా ఉండే టెక్నాలజిని ఉపయోగిస్తున్నట్టు ఇన్ఫినిక్స్ తెలిపింది. చదవండి : Gravton Quanta EV: రూ.80కే.. 800 కిలోమీటర్లు ప్రయాణం -
శివరాత్రికి కానుకగా ‘పైసా పరమాత్మ’
కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. అలా సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న చిత్రం 'పైసా పరమాత్మ' . సాంకేత్, సుధీర్, కృష్ణ తేజ్, జబర్దస్త్ అవినాష్, రమణ, అనూష, అరోహి నాయుడు, బనీష, జబర్దస్త్ దీవెన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్ పతాకంపై టి.కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ కిరణ్ తిరుమల దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కి హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది.. కాగా ఈ చిత్రం మహా శివరాత్రి సందర్బంగా మార్చి 12 భారీగా విడుదల కానుంది.. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శక, నిర్మాత కిరణ్ కుమార్ తిరుమల, హీరోలు సాకేత్, సుధీర్, నటులు కృష్ణ తేజ, ముక్కు అవినాష్, రమణ, హీరోయిన్స్ ఆరోహి నాయుడు, భనిష, సంగీత దర్శకుడు కనిష్క, కోడైరెక్టర్ రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.. దర్శక, నిర్మాత కిరణ్ కుమార్ తిరుమల మాట్లాడుతూ.. ' మానవ నిత్య జీవితంలో అందరూ నమ్మేది, నమ్మించేది పైసా.. దానిని బేస్ చేసుకొని 8 క్యారెక్టర్స్ చుట్టూ కథ జరుగుతోంది.. ప్రధానంగా సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించాం. రెగ్యులర్ సినిమాలా కాకుండా కథ, కథనం చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి సన్నివేశం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా కనిష్క ఇచ్చిన మ్యూజిక్, అర్ అర్ సినిమాకి మెయిన్ హైలెట్. ఆర్ ఆర్ సాంగ్స్ రింగ్ టోన్స్ పెట్టుకుంటారు. అంత అద్భుతంగా కనిష్క్ చేసాడు. అలాగే బాబు ఇచ్చిన విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. సస్పెన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో యాక్షన్ డ్రామా థ్రిల్లర్ చిత్రం ఇది. మార్చి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను డిజప్పాయింట్ చేయదు.. అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కనిష్క మాట్లాడుతూ.. ' డిఫరెంట్ సబ్జెక్ట్ తో రూపొందిన పైసా పరమాత్మ చిత్రం అందరికీ నచ్చుతుంది. నటీ నటులు అందరూ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఈ చిత్రంలో రెండు సాంగ్స్ ఒక రిమిక్ సాంగ్ ఉంటుంది.. సినిమా చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.. అన్నారు. హీరో సాకేత్ మాట్లాడుతూ.. ' ఈ చిత్రంలో హీరోగా నటించే ఛాన్స్ ఇచ్చిన కిరణ్ గారికి ఋణపడి ఉంటాను. అందరం కలిసి ఒక మంచి సినిమా చేశాం.. సస్పెన్స్ థ్రిల్లర్ తో రూపొందిన ఈ చిత్రం అనేక ట్విస్ట్ లతో సాగుతుంది.. అన్నారు. మరో హీరో సుధీర్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ ఉన్న సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.. మా పైసా పరమాత్మ కూడా కొత్త కంటెంట్ తో వస్తోంది. ఆడియెన్స్ అందరూ మా చిత్రాన్ని ఆదరించాలి అన్నారు. నటుడు కృష్ణ తేజ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఒక ముఖ్యపాత్రలో నటించాను. నా 14ఏళ్ళు సినీ కేరియర్ లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసిన చిత్రం ఇది. మెస్మరైజింగ్ చేస్తుంది. ప్రతీ ఒక్కరూ నా క్యారెక్టర్ ని ఓన్ చేసుకుంటారు. అంత అద్భుతంగా కిరణ్ డిజైన్ చేసాడు.. ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమా కూడా ఇంకా బాగుంటుంది.. అన్నారు. హీరోయిన్ ఆరోహి నాయుడు మాట్లాడుతూ.. కంప్లీట్ టీం వర్క్ ఇది. డైరెక్టర్ కిరణ్ గారు ప్రతి క్యారెక్టర్ ని అద్భుతంగా డిజైన్ చేశాడు. మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశాను.. నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన కిరణ్ గారికి నా థాంక్స్.. అన్నారు. నటి బనిష మాట్లాడుతూ.. ' నేను, అవినాష్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. టీమ్ అందరం చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. ముఖ్యంగా కిరణ్ గారు వన్ మాన్ షోలా ఈ చిత్రాన్ని చేశారు. ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చుతుంది.. అన్నారు. కమిడియన్ ముక్కు అవినాష్ మాట్లాడుతూ.. కెమెరామెన్ జియల్ బాబు కాల్ చేసి ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ ఉంది చేయాలి అన్నారు.. కిరణ్ చెప్పిన సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సినిమా చాలా బాగా వచ్చింది.. అందరికీ నచ్చుతుంది.. అన్నారు. నటుడు రమణ మాట్లాడుతూ.. కథని నమ్మి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేశారు. ఒక ముఖ్యపాత్రలో నటించాను. సినిమా చూశాను.. చాలా బాగుంది.. అందరికీ నచ్చుతుంది.. అన్నారు. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ' కిరణ్ గారు అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని చేశారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. సినిమా బాగా వచ్చింది.. మార్చి 12న విడులవుతుంది.. సినిమాని చూసి పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను.. అన్నారు. -
భలే భజరంగీ
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన తాజా చిత్రం ‘భజరంగీ 2’. హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో భావన కథానాయికగా నటించారు. జయన్న ఫిలిమ్స్ బ్యానర్‌పై జయన్న, భోగేంద్ర నిర్మించారు. శివరాజ్ కుమార్ పుట్టినరోజు (జూలై 12) సందర్భంగా ఆదివారం ‘భజరంగీ–2’ టీజర్ విడుదల చేశారు. 2013లో ఘనవిజయం సాధించిన ‘భజరంగీ’ చిత్రానికి సీక్వెల్‌గా ‘భజరంగీ–2’ తెరకెక్కింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ స్పందన చూసి ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట దర్శక–నిర్మాతలు. టీజర్‌కు వచ్చిన స్పందన గురుంచి శివరాజ్ కుమార్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా టీజర్‌కు ఇంత స్పందన వస్తుందని అనుకోలేదు. అన్ని ఇండస్ట్రీల నుంచి ఫోన్ చేస్తున్నారు. ఈ అద్భుతమైన స్పందనకి అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు. -
సిటీలో చిన్నడవి
హుస్సేన్ సాగర్ తీరం అడవి అందాలు సంతరించుకోనుంది. బల్క్ ప్లాంటేషన్ (పెద్దమొత్తంలో మొక్కలు నాటడం) పద్ధతిలో నెక్లెస్ రోడ్ ప్రాంతంలో మూడెకరాల విస్తీర్ణంలో 30 వేల మొక్కలు నాటేందుకు రంగం సిద్ధమైంది. ఈ మహత్కార్యాన్ని చేపట్టేందుకు ‘ఫారెస్ట్ ఇన్ సిటీస్’ కాన్సెప్ట్‌తో బెంగళూర్‌కు చెందిన ‘సే ట్రీస్’ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు హెచ్ఎండీఏతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. – సాక్షి, సిటీబ్యూరో ♦ బల్క్ ప్లాంటేషన్ పద్ధతిలో మూడెకరాల్లో 30వేల మొక్కల పెంపకం ♦ ‘ఫారెస్ట్ ఇన్ సిటీస్’ కాన్సెప్ట్‌తో ముందుకొచ్చిన ‘సే ట్రీస్’ సంస్థ సంజీవయ్య పార్కుకు ఆనుకొని పీవీ ఘాట్‌కు ఎదురుగా ఉన్న మూడెకరాల స్థలంలో అడవిని తలపిం చేలా మొక్కలు నాటుతామని ‘సే ట్రీస్’ బృందం హెచ్ఎండీఏ అధికారులకు తెలిపింది. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ల పై వర్టికల్ గార్డెనింగ్పై అధ్యయనం చేసిన బృందం.. ‘ఫారెస్ట్ ఇన్ సిటీస్’ కాన్సెప్ట్‌ను అధికారులకు వివరిం చింది. సొంత నిధులతో మొక్కలు నాటి, రెండేళ్లు నిర్వహణ బాధ్యతలూ చూసుకుంటామంది. ఆకట్టుకునే అడవి అందాలు... ‘సిటీజనులు అడవి అందాలు చూసే భాగ్యాన్ని కల్పించేందుకు మావంతు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే దేశంలోని వివిధ నగరాల్లో ఈ విధానానికి శ్రీకారం చుట్టాం. బల్క్ ప్లాంటేషన్ పద్ధతిలో వివిధ రకాల మొక్కలను దగ్గరదగ్గరగా నాటాలనుకుంటున్నామ’ని సంస్థ వలంటీర్ ప్రశాంత్ తెలిపారు. రెండేళ్ల నిర్వహణ అనంతరం మొక్కలు బాగా పెరిగాక ప్రజలకు ఇందులోకి అనుమతి ఉంటుందని అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు పేర్కొంటున్నారు. ఇది పూర్తయి తే సిటీలో ‘చిన్నడవి’ తయారైనట్టే. దీంతో సిటీలో వేడితో పాటు కాలుష్యం కొంతమేర తగ్గే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ ప్రాంతంలోనూ... అవుటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)లోని నాలుగు ప్రాంతాల్లోనూ ఈ విధానం అమలు చేయాలని అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు యోచిస్తున్నారు. ఈ మార్గంలో చిన్నపాటి అడవిని రూపొందిస్తే ప్రయాణికులకు ఆహ్లాదభరిత వాతావరణం అందించినట్టే. నానక్‌రామ్‌గూడ–కోకాపేట, పటాన్చెరు, బొంగళూరు, శామీర్‌పేట–ఘట్కేసర్ ప్రాంతాల్లోని ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలుచేసే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. -
వాట్ ఎ షేమ్!
‘‘మహిళలను దేవతలుగా కొలిచిన నేలపై ఇన్ని దారుణాలా?! అసలు ఎక్కడ తప్పు జరుగుతోంది? నిర్భయ, నందినీలకు జరిగినట్లు ఎవరికీ జరగకూడదు. అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. మాకు కావలసింది న్యాయం, గౌరవం. దయచేసి ఈ దారుణాలను ఆపండి’’ అని ఆగ్రహావేదనలు వ్యక్తం చేశారు నటి స్నేహ. మహిళలకు మద్దతుగా, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా ఆమె గళం విప్పారు. భావన, వరలక్ష్మీలకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె ఓ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఇది: నా సహచర నటీమణులు భావన, వరలక్ష్మీలకు ఎదురైన అనుభవాలను తలచుకుంటుంటే నా మనసు తీవ్రంగా ఆవేదన చెందుతోంది. మనస్ఫూర్తిగా వాళ్లకు నా మద్దతు తెలుపుతున్నాను. ధైర్యంగా వాళ్లు మాట్లాడిన తీరుని ప్రశంసిస్తున్నాను. ఇటువంటి ఘటనల గురించి ఓపెన్‌గా హ్యాండిల్ చేసిన విధానంలో వాళ్ల పరిణతి కనిపిస్తోంది. ఇంకెన్నాళ్లీ ప్రేక్షక పాత్ర? మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, అవమానాలు... ప్రతి రోజూ సమాజంలో ఏ మూలన చూసినా ఇటువంటి ఘటనలే కనిపిస్తున్నాయి. చాలామంది బాధిత మహిళలు తమ మనసులో మాటలు చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్లూ ఓ భాగమైన ఈ సమాజమే కారణం. ఇటువంటి దురాగతాలు జరిగినప్పుడు ఎక్కువగా అమ్మాయిలనే నిందిస్తున్నారు. నైతిక విలువలు, సంప్రదాయ పరిరక్షణకు పాటుబడుతున్నామని ప్రచారం చేసుకునేవాళ్లు... అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఎక్కడికి వెళ్లాలి? ఎవరితో వెళ్లాలి? అనేవి చెబుతారు. ఈ సందర్భంగా నేను వాళ్లను ఒకటి అడగాలనుకుంటున్నాను. మూడేళ్ల పసిపాపలు, ఏడేళ్ల చిన్నారులపై అకృత్యాలు, అఘాయిత్యాలు జరిపి చెత్తబుట్టల్లో పడేస్తున్నారు. ఏం జరుగుతుందో కూడా వాళ్ల ఊహకు తెలీదు. ఇలాంటి అకృత్యాలను ఎందుకు అరికట్టలేకపోతున్నారు. ఇంకెన్నాళ్లు ప్రేక్షక పాత్ర పోషిస్తారు? ఓ మై గాడ్! హృదయ విదారకరమైన ఫొటోలు చూస్తుంటే, నా మనసు ముక్కలవుతోంది. ఓ తల్లిగా ఆ చిన్నారుల తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోగలను. ఆ రోజులు పోయాయి తప్పు ఎక్కడ జరిగింది? ‘మదర్ ఇండియా’గా, దేశాన్ని అమ్మగా పిలవబడే రాజ్యంలో ఏం జరుగుతోంది? జీవనదులకు మహిళల పేర్లు పెడతారు. దేవుడితో సమానంగా దేవతలను పూజిస్తారు. పురాణ ఇతిహాస గ్రంథాల్లో ‘దేవుడు తనలో సగభాగాన్ని అర్ధాంగికి ఇచ్చాడు’ అని చెబుతారు. ఓ ఆడదాని కారణంగా రాజ్యం రావణకాష్టంలా తగలబడిందనే కథలు విన్నాము. మహిళలను చాలా విధాలుగా కొలిచే దేశం ఇది. కానీ, మహిళలు గర్వంగా తలెత్తుకుని, హుందాగా గౌరవంతో బతికే రోజులు పోయాయి. ఇప్పుడీ మాట చెబితే ఎప్పుడో గడిచిన గతంలా ధ్వనిస్తుంది. వాట్ ఎ షేమ్!! ఆ ఆలోచన వస్తే.. వెన్నులో వణుకుపుట్టాలి ఇటువంటి అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలనే నిర్ణయం తీసుకోవడానికి ఇంతకు మించిన తరుణం లేదు. మహిళల గౌరవాన్ని తిరిగి తీసుకురావడానికి.. అంతకు ముందు ఉన్నట్టు మేము సురక్షితంగా ఉన్నామని మహిళలు ధైర్యంగా ఉండడానికి పొరాటం చేయవలసిన సమయమిదే. ముఖ్యంగా... పసిపాపలను అబ్యూజ్ చేయడానికి కూడా ఏ మగాడైనా భయపడాలి. మనసులో అలాంటి ఆలోచన చేయడానికి కూడా భయపడాలి. నేరస్తుల వెన్నులో వణుకు పుట్టించే కఠినమైన చట్టాలు తీసుకురావాలి. న్యాయవ్యవస్థను పటిష్టం చేయాలి. నిర్భయ, నందిని, రితిక, హాసిని... ఇంకా ఎంతమంది? ఇక ఈ దేశంలో బాధితులు ఉండకూడదు. మాకు న్యాయం కావాలి. మాకు గౌరవం కావాలి. గౌరవంగా బతికే హక్కు కావాలి. మా హక్కులను సాధించుకునే గెలుపు కావాలి. ఈ సందర్భంగా నేనొక చిన్న అడుగు వేస్తున్నాను. చిన్నదే కానీ చాలా ముఖ్యమైన అడుగు ఇది. ఓ తల్లిగా నేనో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ‘మహిళలను గౌరవంగా చూసేలా.. మహిళల అర్హతకు తగ్గట్టు వాళ్లతో హుందాగా ప్రవర్తించేలా’ నా కుమారుణ్ణి పెంచుతానని అందరికీ మాటిస్తున్నాను. సేలంలో ఐదుగురు వ్యక్తులు కలసి పదేళ్ల అమ్మాయిని వేధించి చంపేశారు. తమిళనాడులో ఏం జరుగుతోంది? ప్రతి రోజూ వార్తల్లో ఇలాంటివి కనిపించడం కామన్ అవుతుందా?? దయచేసి ఈ దుర్మార్గాలను ఆపండి. – స్నేహ -
రెక్కల వాహనం వచ్చేస్తోంది!
వియత్నాంః జోరుగా హుషారుగా షికారు పోదమా... అంటూ ఇప్పుడిక.. రెక్కల స్కూటర్ పై విహరించ వచ్చు. పక్షుల్లా రెక్కలు విప్పి జామ్ అంటూ దూసుకుపోవచ్చు. వియత్నాం మోటర్ సైకిల్ షోలో మొదటిసారి విభిన్నంగా కనిపించిన వింగ్స్ స్కూటర్... ద్విచక్ర వాహనదారులనే కాక, సాధారణ ప్రజలనూ అమితంగా ఆకట్టుకుంటోంది. ప్టాస్టిక్ వంటి ట్రాన్స్ లూసెంట్ మెటీరియల్ తో, ప్రత్యేకాకరంలో ఉన్న సీటుకు తోడు రెక్కలతో తయారైన యమహా 04 జెన్ ద్విచక్రవాహనాన్ని వియత్నాం మోటర్ సైకిల్ షోలో ప్రదర్శనకు ఉంచారు. హో చి మించ్ నగరంలో ఏప్రిల్ 7 న ప్రారంభమై, 10 వరకు కొనసాగే ప్రదర్శనలో కొత్తరకం వింగ్స్ స్కూటర్ ను సందర్శకులు అందుబాటులో ఉంచారు. మోటర్ వాహన సంస్థ యమహా ద్వారా కొత్తగా రూపొందిన రెక్కల వాహనం 04జెన్...వియత్నాంలోని మోటార్ సైకిల్ షోలో యమహా సంస్థ... మొదటిసారి ప్రవేశపెట్టింది. రెక్కల కీటకాలను, పక్షులను తలపిస్తున్న 04జెన్ డిజైన్... ఆస్థెటిక్ మెటీరియల్ తో తయారై పలువురిని ఆకర్షిస్తోంది. యమహా సంస్థ నాలుగో సృష్టి అయిన ఈ నమూనా వాహనం... యమహా 'రన్' ఫిలాసఫీ ఆధారంగా తయారైంది. ఇప్పుడు వియత్నాం షోలో ప్రత్యేకతను సంతరించుకున్న 04జెన్ వాహన బాహ్య నిర్మాణం.. పారదర్శక రూపంతో, రెక్కలతో... విభిన్నసౌందర్యంతో యమహా అభిమానుల్నే కాక, ఇతరుల చూపునూ కట్టిపడేస్తోంది. ఈ వాహనంలో ప్రత్యేకంగా కనిపించే వింగ్స్... స్కూటర్ సైడ్ ప్యానెల్ ను కవర్ చేసేట్లుగా ఉంటాయి. అలాగే హ్యాండిల్ బార్ గ్రిప్స్, స్కూటర్ సీట్ కవర్ లెదర్ తో తయారై అత్యంత సౌకర్యంవంతంగా ఉంటాయి. చూసేందుకు ఓ కళా రూపంలా కనిపించే 04జెన్ కాన్సెప్ట్... ప్రపంచ మార్కెట్లోనే ఇప్పటి వరకూ ఎక్కడా, ఎవ్వరూ సృష్టించలేదు. ఈ కొత్త రకం యమహా ఉత్పత్తిని త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేసే యోచనలో సంస్థ పావులు కదుపుతోంది. -
ఈ 'నగ్న రెస్టారెంట్'లో బట్టలిప్పి భోజనం చేస్తారు!
లండన్: భోజన ప్రియులకోసం లండన్ లోని ఓ హోటల్ కొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది. విభిన్నరుచులను చవిచూడాలనుకునే వారికోసం కొత్త పోకడకు తెరతీసింది. ఆహార ప్రియులను అమితంగా ఆకట్టుకునేందుకు ప్రత్యేక టాప్ అప్ లతో ఆహ్వానం పలుకుతోంది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' పేరిట అన్ని ప్రత్యేకతలు కలిగిన థీమ్డ్ రెస్టారెంట్ ప్రారంభానికి స్థానిక ఔల్ కేఫ్.. శ్రీకారం చుట్టింది. లండన్ ప్రజలకు మరింత చేరువవ్వాలన్న ఉద్దేశంతో ఔల్ కేఫ్.. కొత్త డైనింగ్ అనుభవాలను అందించేందుకు 'నేకెడ్ రెస్టారెంట్' (నగ్న రెస్టారెంట్)ను ప్రారంభిస్తోంది. ప్రపంచంలోనే ఇప్పటి వరకూ ఎక్కడా లేని అదనపు సౌకర్యాలను వినియోగదారులకు అందించేందుకు ఈ హోటల్ ముందుకొచ్చింది. ఇంతకుముందు కడిల్ కేఫ్ లో కాఫీ, స్నాక్స్, టీతోపాటు కౌగిలింతల సౌకర్యాన్ని కూడా అందుకున్న లండన్ ప్రజలకు, ఇప్పుడు ఔల్ కేఫ్ బర్త్ డే డ్రెస్ (నగ్నంగా) తో భుజించే ఆఫర్‌ను తెరపైకి తెచ్చింది. నగరంలోని భూగర్భ రైల్వే నెట్వర్క్ లండన్ ట్యూబ్.. కూడా ప్రస్తుతం పాప్ అప్ రెస్టారెంట్ గా మారిపోయింది. బ్రిటన్ రాజధానిలో భోజన ప్రియులకు ప్రత్యేక అనుభూతులను అందించేందుకు విభిన్నంగా ఆలోచించిన ఈ సంస్థ.. దుస్తులు తొలగించి మరీ (నగ్నంగా) భోజనాలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. విడిచిన దుస్తులు, ఇతర ఖరీదైన వస్తువులు భద్రపరచుకొనేందుకు హోటల్ ప్రత్యేక లాకర్ల వసతిని కల్పిస్తుందట. భోజనానికి దుస్తులు విప్పి కూర్చోవాలా, ఉంచుకొని కూర్చోవాలా అన్న ఎంపికను మాత్రం వినియోగదారుల ఇష్టానికే వదిలేసింది. గోప్యతకు వీలుగా రెస్టారెంట్లో బ్యాంబూ పార్టిషన్లతోపాటు ప్రత్యేక స్థలాన్ని కేటాయించిందట. ఇక్కడి సభ్యులు, సిబ్బంది కూడా కురుచ దుస్తులు ధరించి ఈ రెస్టారెంట్‌కు వచ్చేసారి ప్రోత్సహిస్తారని తెలుస్తోంది. బున్యాది పేరుతో ఈ కొత్త రకం రెస్టారెంట్ సెంట్రల్ లండన్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక్కడ లభించే ప్రత్యేక సౌకర్యాలు, డిన్నర్లు, వంటి అనుభవాలను రుచిచూసేందుకు ముందుగా బున్యాది డాట్ కామ్ (thebunyadi.com) లో రిజిస్టర్ చేసుకోవచ్చట. ఇప్పటికే 4000 మందికి పైగా ప్రజలు ఈ కొత్త భోజనశాలను పరీక్షించేందుకు సైన్ అప్ చేశారట. దుస్తుల సంకెళ్ళనుండి విముక్తులను చేయడం, ఆధునిక జీవితంలో సరికొత్త అనుభవాలను చవి చూసేందుకు వీలుగా ఈ రెస్టారెంట్ ఉంటుందట. ఇక్కడ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు వంటివి ఉపయోగించే వీలు ఉండదట. ఎక్కువ కాంతి లేకుండా డిమ్ లైట్ (క్యాండిల్ లైట్) లోనే డిన్నర్ ఏర్పాట్లు ఉంటాయని నిర్వాహకులు చెప్తున్నారు. అంతేకాదు పూర్వకాలపు పద్ధతిలో వంటకాలను కట్టెల పొయ్యిపై వండటం, మట్టి పాత్రలతో వడ్డించడం వంటివి కూడ ఇక్కడి సౌకర్యాల్లో భాగమే. ఈ రెస్టారెంట్లో 'నేకెడ్'' మాత్రమే కాదు 'నాన్ నేకెడ్' సెక్షన్ కూడ వేరుగా ఉంటుందట. -
సరికొత్త హైబ్రిడ్ కారు, లీటరుకు 100 కి.మీ.
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూలమైన వాహనాలు తయారీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ దశలో కంపెనీల మధ్య పోటీ కూడా బాగా పెరిగింది. కేంద్రప్రభుత్వం సైతం ఇలాంటి హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లనే ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో ఓ సరికొత్త కారును రూపొందించింది. ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్పో లో రెనో తన కొత్త హైబ్రిడ్ కారును ప్రదర్శించింది. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఈ హ్యాచ్ బ్యాక్ కారు లీటరు పెట్రోలుతో సుమారు వంద కిలోమీటర్లు నడుస్తుందని ధీమాగా చెబుతోంది. హై ఎండ్ లుక్‌తో ఆకట్టుకుంటున్న ఈ కాంపాక్ట్ కార్ పెట్రోలు ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ రెండింటితోనూ పనిచేస్తుందట. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం... రెనో ఆవిష్కరించిన ఈ కాంపాక్ట్ కారు మిగతావాటితో పోలిస్తే బరువు తక్కువగా ఉంటుంది. దీని బరువు వెయ్యి కిలోల లోపే ఉండటం వల్ల ఇంధనం వినియోగం గణనీయంగా తగ్గుతుందని తెలిపింది. అల్యూమినియం, స్టీలు, మెగ్నీషియం లాంటి లోహాలను ఈ కారు తయారీలో వాడడంతో బరువు తగ్గిందని రెనో పేర్కొంది. అయితే రెనో ఒక శాంపిల్‌గా మాత్రమే ఈ కారును ఆటో ఎక్స్పో లో చూపింది. కానీ మార్కెట్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ధర ఎంత వివరాలను మాత్రం ప్రకటించలేదు. -
ప్రభుత్వ విధానాల్లోకి శ్రీమంతుడు కాన్సెప్ట్
-
శ్రీమంతుడు..
సొంత గ్రామాభివృద్ధికి ముందుకొచ్చిన మోహన్‌రావు రూ.50 లక్షల విరాళం ప్రకటించిన ‘దొడ్డ’ శ్రీమంతుడు.. ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేసే కాన్సెప్ట్‌తో వచ్చిన మూవీ. ఇదే సినిమా పలువురికి ఆదర్శం అవుతోంది. రూ.కోట్లు సంపాదించినా.. దేశ, విదేశాల్లో స్థిరపడినా.. లగ్జరీ జీవితం గడుపుతున్నా.. పుట్టి, పెరిగిన ఊరికి ఏమైనా చేయూలనే తపన ఆ సొంతూరి గ్రామాభివృద్ధికి బాటలు వేస్తోంది! పల్లెలను అభివృద్ధి చేయూలని సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. ఇదే స్ఫూర్తితో నర్సంపేట నియోజకవర్గానికి చెందిన ప్రవుుఖ వ్యాపారి తవు సొంత ఊరు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో సీఎంను కలిసి విరాళం అందించి తన ‘దొడ్డ’ మనసును చాటుకున్నారు. అతనే దొడ్డ మోహన్‌రావు. - నర్సంపేట నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రావూనికి చెందిన వారు దొడ్డ మోహన్‌రావు. ఆయనకు సొంతూరిపై మమకారం ఎక్కువ. గ్రామ వాతావరణమన్నా.. ఆ కల్లాకపటం లేని మనసులన్నా చాలా ఇష్టం. ఎంత సంపాదించినా ఏం లాభం. సొంత గ్రామానికి ఏమి చేయకపోతే అనేది అయన ఆలోచన. ఆ ఆలోచనే సహకారం అందించడానికి పురిగొల్పింది. ఇంకా సొంత ఊరితోపాటు నర్సంపేట పట్టణంలో రూ. లక్షలు విరాళంగా ఇచ్చి అభివృద్ధికి బాటలు వేశారు. గతంలో మిషన్ కాకతీయు పథకంలో భాగంగా రూ.కోటి రూపాయుల విరాళాన్ని అందించి సొంత ఊరిలో వుూడు చెరువుల అభివృద్ధికి దత్తత తీసుకున్నాడు. తాజాగా వుంగళవారం వురో రూ.50 లక్షల విరాళాన్ని అందించేందుకు టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి సవుక్షంలో వుుఖ్యవుంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిశారు. పల్లెల సర్వతోవుుఖాభివృద్ధి కోసం వుుందుకొచ్చాడు. లింగగిరిలో పుట్టి, పెరిగి హైదరాబాద్‌కు వెళ్లి కెమికల్ ఫ్యాక్టరీని నెలకొల్పి వేలాది వుందికి జీవనోపాధి ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా బలపడ్డాడు. ఎంత సంపాదించినా సొంత ప్రాంతానికి మేలు చేయూలనే తపన దొడ్డ మోహన్‌రావుకు ఉండి సహృదయుంతో విరాళాలు ప్రకటించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గానికి చెందిన ప్రవుుఖ వ్యాపారి హైదరాబాద్‌లో స్థిరపడి గ్రావుజ్యోతి స్ఫూర్తితో సొంత గ్రావూల అభివృద్ధికి విరాళాలు ప్రకటించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. రానున్న రోజుల్లో వురికొంత వుంది ప్రవుుఖులు తవు సొంత గ్రావూల అభివృద్ధికి దత్తత తీసుకుని వునసున్న శ్రీవుంతులుగా కీర్తిని సంపాదించాలని నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు. -
షార్ట్‌ఫిల్మ్ ఫైల్‌ను షేర్లో ఉంచడం మరవొద్దు!
‘పూరి జగన్నాథ్ డెరైక్టర్ హంట్’కు ఔత్సాహికుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. పూరి ఇచ్చిన కాన్సెప్టులతో తాము రూపొందించిన షార్ట్‌ఫిల్మ్స్‌ను అనేకమంది యువదర్శకులు సాక్షి మెయిల్ ఐడీకి పంపిస్తున్నారు. తక్కువ పరిమాణంతో ఉన్న ఈ షార్ట్ఫిలిమ్ఫైల్స్ను జీమెయిల్ ద్వారా పంపవచ్చు. పరిమాణం విషయంలో జీమెయిల్ పరిధిని దాటితే జీమెయిల్‌తోనే అనుసంధానం అయిన గూగుల్‌డ్రైవ్ ద్వారా ఉచితంగానే పంపవచ్చు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే గూగుల్ డ్రైవ్ ద్వారా పంపుతున్న వీడియోఫైల్ను సాక్షి మెయిల్ ఐడీకి షేర్ చేయవలసి ఉంటుంది. ఇలా షేర్ చేసిన వీడియోలను మాత్రమే నిర్ణేతలు డౌన్లోడ్ చేసుకొని చూడటానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే గూగుల్‌డ్రైవ్ ద్వారా పంపినవారు కూడా తమ వీడియోఫైల్స్ను షేరింగ్‌లో ఉంచామో లేదో గమనించాలి. గడువు ఫిబ్రవరి 14 వరకే! (వివరాల కోసం జనవరి 2 నుంచి 11ల మధ్యన వచ్చిన సాక్షి ‘ఫ్యామిలీ’ సంచికలు చూడండి) -
చదువుకొనలేం..
ప్రైవేట్ స్కూళ్లలో అడ్డగోలు ఫీజులు - ఐఐటీ, డీజీ, కాన్సెప్ట్, ఈటెక్నో, ఇతర పేర్లతో దోపిడీపర్వం - నియంత్రణంలో సర్కారు విఫలం - పేదలకు భారమవుతున్న విద్య చదువుకునే రోజులు పోయి, చదువు‘కొనే’ రోజులొచ్చాయి. ప్రైవేట్ పాఠశాలలు ఐఐటీ, డీజీ, కాన్సెప్ట్, ఈ టెక్నో అంటూ కొత్త పేర్లు పెట్టుకొని వేలల్లో ఫీజులు, డొనేషన్లు గుంజుతున్నాయి. పోటీ ప్రపంచంలో తమ పిల్లలు ఎక్కడ వెనకబడతారోననే భయంతో తల్లిదండ్రులు సైతం ఖర్చుకు వెనకాడకుండా ఇలాంటి స్కూళ్లలోనే చదివి స్తున్నారు. దీంతో యాజమాన్యాలు ఫీజులను అమాంతం పెంచుతున్నాయి. ఫలితంగా పాఠశాల విద్య భారమవుతోంది. ఇంత ఫీజులా? నాకు ఇద్దరు పిల్లలు... పెద్దోడు మూడో క్లాస్, చిన్నోడు ఎల్కేజీ. మనం ఎంత చేసినా పిల్లల కోసమే కదా అని కరీంనగర్లో పేరున్న స్కూళ్లో చదివిద్దామని పోతే... వాళ్లు ఫీజు చెప్పగానే కళ్లు తిరిగినయ్. ఎల్కేజీకి బస్సు ఫీజుతో కలిపి 20 వేలు చెప్పిండ్రు. మూడో క్లాస్‌కు 24 వేలు అన్నరు. ఇద్దరు పిల్లలను అందులో చదివించాలంటే స్కూల్ ఫీజే 45 వేల రూపాయల అయితది. స్కూల్ డ్రెస్‌లు, బుక్కులు, స్టేషనరీ వీటన్నింటికీ మరో 10 వేలన్నా అయితయ్. నాకొచ్చే జీతం ఏడాదికి 72 వేలు. పిల్లల స్కూల్‌కే 55 వేలు పోతే ఇంకా మా కుటుంబం ఎట్ల గడవాలె. - మహేందర్, కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ, న్యూస్‌లైన్ : మరో పది రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలు... ఆపై మరో వారం రోజులకు ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులు రంగురంగుల కరపత్రాలతో రాజకీయ ప్రచారాన్ని తలపించేలా ఇళ్లిళ్లూ తిరుగుతున్నారు. చాలాపాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేవు. కొన్ని పాఠశాలలకు గుర్తింపు లేదు. ఒలింపియాడ్, ఐఐటీ, టెక్నో, కాన్సెప్ట్, ఈ టెక్నో, ఈ కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ తదితర పేర్లను గతేడాది తొలగించారు. పేర్లు మారినా ఫీజుల్లో ఎలాంటి మార్పులు లేవు. వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. పిల్లలను చేర్పించడంపై టీచర్లకు కూడా ‘ప్రైవేటు’ యాజమాన్యాలు టార్గెట్ విధించాయి. ఒక్కో టీచర్ కనీసం పది మందిని చేర్పిస్తే వేతనాలు సంతృప్తికరంగా ఇస్తామని హామీలు ఇస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఏం మాట్లాడినా ఓపికతో ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ఫీజులు పలు పాఠశాలల్లో ఫీజులు లక్ష రూపాయలకు చేరాయి. జిల్లాకేంద్రంతోపాటు గోదావరిఖని, పలు మున్సిపాలిటీల పరిధిలోని కార్పొరేట్ స్థాయి పాఠశాలల్లో హాస్టల్ ఫీజుతో కలుపుకుని రూ.50వేల వరకు వసూలు చేస్తున్నారు. మండలకేంద్రాల్లోనూ ఫీజులు ఇంచుమించు ఇంతే ఉన్నా యి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాశాఖ నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాలి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్థాయి నుంచే భారీగా ఫీజులు గుంజుతున్నారు. బోధనతోపాటు ఐఐటీ కోచింగ్, అబాకస్, స్పోకెన్ ఇంగ్లిష్, కరాటే, డ్రాయింగ్, బాక్సింగ్ ఇతర టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నామంటూ పలు రకాల ఫీజుల పేరుతో వసూళ్లు చేస్తున్నారు. పాఠశాలల్లోనే యూనిఫాంలు, పుస్తకాలు, నోట్‌బుక్స్, బూట్లు, సాక్సులు, టై అంటూ ఇష్టమొచ్చిన ధరలు యాజమాన్యాలే నిర్ణయించి, తప్పనిసరిగా వారి వద్దనే తీసుకోవాలంటూ నిబంధన విధిస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఓ విద్యాసంస్థ మొదటిసారిగా ఐఐటీ, మెడిసిన్ ఫౌండేషన్ అంటూ జిల్లా కేంద్రానికి చేరుకుని... అప్పటివరకు రూ.3 నుంచి రూ.5 వేలు ఉన్న పాఠశాల ఫీజును ఏకంగా రూ.15 వేలకు పెంచింది. ఆ తర్వాత జిల్లాలో అసలు విద్యా సంస్థల తీరే మారిపోయింది. సాధారణ స్థాయి పాఠశాలల్లో నర్సరీకి రూ.3 వేల వరకు ఫీజుండగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి దాకా తరగతి ప్రకారం రూ.4 వేల నుంచి రూ.15 వేల దాకా ఉన్నాయి. అదనంగా హాస్ట ల్ ఫీజులు రూ.20 వేల నుంచి రూ.25 వేలు ఉంది. కార్పొరేట్ స్థాయి పాఠశాలల్లో నర్సరీ నుంచి ఎల్కేజీ వరకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి దాకా 12వేల నుంచి 30 వేల దాకా ఫీజులుంటున్నా యి. హాస్టళ్లో ఉంచి చదివించాలంటే స్కూలు ఫీజు కాకుండా రూ.30 వేల నుంచి రూ.40 వేల దాకా కట్టాల్సిందే. పదో తరగతి అయితే ఇంకా ఎక్కువే. కొన్ని పాఠశాలలు మరో అడుగు ముందుకేసి ఐఏఎస్ ఫౌండేషన్ కోర్సులో బీజాలు వేస్తామంటూ లక్ష రూపాయల ఫీజు అంటూ కొత్త విధానానికి రూపకల్పన చేశాయి. కొన్ని పాఠశాలలు బ్రాండ్ ఇమేజ్ పేరుతో దోచుకుంటున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పేరుతో జిల్లాకేంద్రంలో 20కి పైగా పాఠశాలలు ఉన్నాయంటే దోపిడీ ఎంత మేర ఉందో ఊహించుకోవచ్చు. ఆధునిక విధానంలో బోధన అందించడం, భవిష్యత్ లక్ష్యాలకు ఇప్పటినుంచి తర్ఫీదు ఇవ్వడం మంచిదే అయినా అలా విజయాలు సాధించినవారి సంఖ్య ఒకటిరెండుకే పరిమితమవుతుండడంతో ధనార్జనకోసమే ఇలాంటి కోర్సులనే మాటలు వినిపిస్తున్నాయి. ఇంత సొమ్ము వెచ్చించి ప్రైవేట్‌లో చదివించడం పేదలకు సాధ్యమయ్యే పనికాదు. నిబంధనలకు విరుద్ధం విద్యాహక్కుచట్టం ప్రకారం ఓ పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరే విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిం చకూడదనే నిబంధన ఉన్నా చాలా స్కూళ్లు దీన్ని పాటించడం లేదు. ఎంట్రెన్స్‌లతో విద్యార్థులు చిన్న వయసులోనే మానసికంగా కుంగిపోయి చదువు పై ఏకాగ్రత సాధించలేకపోతున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. దీనికితో డు భారీగా ఫీజులు వసూలు చేస్తున్న చాలా పాఠశాల లు డిగ్రీ, ఇంటర్ చదివిన వారితోనే బోధన సాగిస్తున్నాయి. కరపత్రాల్లో ఆకర్షణీయమైన ప్రకటనలతో విద్యార్థుల తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తున్నాయి. విద్యాహక్కు చట్టం ఏం చెబుతోంది - ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలు ఏర్పాటు చేయకూడదు. - పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి. - ప్రవేశపరీక్ష నిర్వహించకూడదు. - అర్హత కలిగిన ఉపాధ్యాయులతోనే విద్యాబోధన చేపట్టాలి. - అనాథలు, హెచ్ఐవీ బాధితులు, వికలాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, 60 వేల లోపు వార్షిక ఆదాయం ఉన్న బీసీ, మైనార్టీ, ఓసీ విద్యార్థులకు 6 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. - పాథమిక పాఠశాలల్లో 1:30, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1:35 చొప్పున ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి ఉండాలి. - ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ప్రత్యేక కేటగిరీ పాఠశాలల్లో ఒకటో తరగతిలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలి. అందుకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది.