
శ్రీమంతుడు..
సొంత గ్రామాభివృద్ధికి ముందుకొచ్చిన మోహన్‌రావు
రూ.50 లక్షల విరాళం ప్రకటించిన ‘దొడ్డ’
శ్రీమంతుడు.. ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేసే కాన్సెప్ట్‌తో వచ్చిన మూవీ. ఇదే సినిమా పలువురికి ఆదర్శం అవుతోంది. రూ.కోట్లు సంపాదించినా.. దేశ, విదేశాల్లో స్థిరపడినా.. లగ్జరీ జీవితం గడుపుతున్నా.. పుట్టి, పెరిగిన ఊరికి ఏమైనా చేయూలనే తపన ఆ సొంతూరి గ్రామాభివృద్ధికి బాటలు వేస్తోంది! పల్లెలను అభివృద్ధి చేయూలని సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. ఇదే స్ఫూర్తితో నర్సంపేట నియోజకవర్గానికి చెందిన ప్రవుుఖ వ్యాపారి తవు సొంత ఊరు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో సీఎంను కలిసి విరాళం అందించి తన ‘దొడ్డ’ మనసును చాటుకున్నారు. అతనే దొడ్డ మోహన్‌రావు. - నర్సంపేట
నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రావూనికి చెందిన వారు దొడ్డ మోహన్‌రావు. ఆయనకు సొంతూరిపై మమకారం ఎక్కువ. గ్రామ వాతావరణమన్నా.. ఆ కల్లాకపటం లేని మనసులన్నా చాలా ఇష్టం. ఎంత సంపాదించినా ఏం లాభం. సొంత గ్రామానికి ఏమి చేయకపోతే అనేది అయన ఆలోచన. ఆ ఆలోచనే సహకారం అందించడానికి పురిగొల్పింది. ఇంకా సొంత ఊరితోపాటు నర్సంపేట పట్టణంలో రూ. లక్షలు విరాళంగా ఇచ్చి అభివృద్ధికి బాటలు వేశారు. గతంలో మిషన్ కాకతీయు పథకంలో భాగంగా రూ.కోటి రూపాయుల విరాళాన్ని అందించి సొంత ఊరిలో వుూడు చెరువుల అభివృద్ధికి దత్తత తీసుకున్నాడు. తాజాగా వుంగళవారం వురో రూ.50 లక్షల విరాళాన్ని అందించేందుకు టీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి సవుక్షంలో వుుఖ్యవుంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిశారు. పల్లెల సర్వతోవుుఖాభివృద్ధి కోసం వుుందుకొచ్చాడు. లింగగిరిలో పుట్టి, పెరిగి హైదరాబాద్‌కు వెళ్లి కెమికల్ ఫ్యాక్టరీని నెలకొల్పి వేలాది వుందికి జీవనోపాధి ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా బలపడ్డాడు.
ఎంత సంపాదించినా సొంత ప్రాంతానికి మేలు చేయూలనే తపన దొడ్డ మోహన్‌రావుకు ఉండి సహృదయుంతో విరాళాలు ప్రకటించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గానికి చెందిన ప్రవుుఖ వ్యాపారి హైదరాబాద్‌లో స్థిరపడి గ్రావుజ్యోతి స్ఫూర్తితో సొంత గ్రావూల అభివృద్ధికి విరాళాలు ప్రకటించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. రానున్న రోజుల్లో వురికొంత వుంది ప్రవుుఖులు తవు సొంత గ్రావూల అభివృద్ధికి దత్తత తీసుకుని వునసున్న శ్రీవుంతులుగా కీర్తిని సంపాదించాలని నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు.