Urinary Tract Infection
-
Health: సొ'షై'టీ తెచ్చే.. యూరి'నారీ' ప్రాబ్లెమ్స్!
సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్లు ఎక్కువ. దీనికి తోడు బయటకు వెళ్లి పనిచేసే మహిళల్లో అంటే వర్కింగ్ ఉమెన్‌లో ఈ సమస్యలు మరింత ఎక్కువ. అంతేకాదు... ఈ సమస్యలు కేవలం వర్కింగ్ ఉమెన్లోనే కాకుండా స్కూళ్లు కాలేజీలకు వెళ్లే బాలికలు, యువతుల్లోనూ అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన వృత్తుల్లో ఉన్న మహిళల్లోనూ కనిపించవచ్చు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం.గృహిణుల (హోమ్ మేకర్స్)తో పోలిస్తే బయటికి వెళ్లి పనిచేసే మహిళలు (వర్కింగ్ ఉమెన్) తమకు ఉన్న కొన్ని రకాల పరిమితుల కారణంగా నీళ్లు తక్కువగా తాగుతుండటంతోపాటు మూత్రానికి వెళ్లాల్సి వచ్చినా బయట వాళ్లకు వసతిలేని కారణంగా ఎక్కువసేపు ఆపుకుంటుంటారు. దాంతో వారిలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. అవి...1. మూత్రంలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ఇన్ఫెక్షన్స్), 2. మూత్ర విసర్జనలో సమస్యలు.... మళ్లీ ఈ మూత్ర విసర్జన సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది బ్లాడర్ సామర్థ్యం తగ్గి త్వరత్వరగా మూత్రానికి వెళ్లాల్సి రావడం. రెండోది మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్నా విసర్జన సాఫీగా జరగక తీవ్రమైన నొప్పి రావడం. ఇవిగాక తక్కువగా నీళ్లు తాగడం వల్ల మూడో సమస్యగా కిడ్నీల్లో రాళ్లు వచ్చే ముప్పు కూడా ఉంటుంది.ఎందుకీ సమస్యలు..సాధారణంగా వర్కింగ్ ఉమెన్ మూత్రవిసర్జన చేసే పరిస్థితి రాకుండా ఉండటం కోసం నీళ్లు చాలా తక్కువగా తాగుతుంటారు. సౌకర్యాలు బాగుండే కొన్ని పెద్ద / కార్పొరేట్ ఆఫీసులు మినహాయిస్తే చాలా చోట్ల రెస్ట్‌రూమ్స్ అపరిశుభ్రంగా ఉండటం, శుభ్రం చేసుకోడానికి నీళ్లు అందుబాటులోకి లేకపోవడం, ఉన్నా అవి పరిశుభ్రంగా లేకపోవడం వంటి అనేక కారణాలతో నీళ్లు తక్కువగా తాగుతుంటారు.ఇక మూత్రవిసర్జన చేయాల్సివచ్చినప్పుడు బయటి రెస్ట్రూమ్/బాత్రూమ్లు బాగుండవనే అభిప్రాయంతో మూత్రవిసర్జనకు వెళ్లకుండా ఆపుకుంటారు. ఇలా ఎక్కువ సేపు బిగబట్టడం వల్ల బ్లాడర్ సామర్థ్యం తగ్గుతుంది. ఇలా బిగబట్టడం చాలాకాలం పాటు కొనసాగితే మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలొస్తాయి. ఆ సమస్యలేమిటో చూద్దాం.మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్లు (యూటీఐ) : మూత్రమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్ను ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’ అంటారు. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే... మూత్రపిండాలు దేహంలోని వ్యర్థాలను వడపోశాక, వ్యర్థాలను మూత్రం రూపంలో ఓ కండరనిర్మితమైన బెలూన్ లాంటి బ్లాడర్‌లో నిల్వ ఉంచుతాయి. ఈ బ్లాడర్ చివర స్ఫింక్టర్ అనే కండరాలు ఎప్పుడు బడితే అప్పుడు మూత్రస్రావం కాకుండా ఆపుతుంటాయి.మూత్రాన్ని చాలాసేపటి వరకు (దాదాపు నాలుగ్గంటలకు పైబడి) ఆపుతుంటే అక్కడ బ్యాక్టీరియా వృద్ధిచెందుతుంది. ఆ బ్యాక్టీరియా కారణంగానే మూత్రంలో ఇన్ఫెక్షన్లు (యూటీఐ) వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్లు మూత్రపిండాలకీ పాకవచ్చు. ఇది కాస్త ప్రమాదకరమైన పరిణామం. మొదటిసారి ఇన్ఫెక్షన్ రావడాన్ని ‘ప్రైమరీ ఇన్ఫెక్షన్’ అంటారు. అవే ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ వస్తుంటే వాటిని ‘రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్’ అని అంటారు. మూత్రపిండాల్లో వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అని అంటారు. ఇది కొంచెం సీరియస్ సమస్య.లక్షణాలు..మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ మూత్రవిసర్జనకు వెళ్లాలని అనిపిస్తుండటం, చలిజ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.నిర్ధారణ పరీక్షలు..సాధారణ మూత్ర సమస్యలకు పెద్దగా పరీక్షలేమీ అవసరం ఉండవు. కానీ సమస్య మాటిమాటికీ వస్తుంటే అందుకు కారణాలు తెలుసుకునేందుకు కొన్ని అడ్వాన్స్డ్ పరీక్షలు అవసరమవుతాయి. సాధారణంగా ∙సీయూఈ ∙యూరిన్ కల్చర్ ∙అల్ట్రాసౌండ్ స్కానింగ్ ∙సీటీ, ఎమ్మారై, ఎక్స్‌రే (ఐవీయూ, ఎంజీయూజీ లాంటివి) ∙సిస్టోస్కోప్ (యూటీఐ) ∙అవసరాన్ని బట్టి కొన్ని రక్తపరీక్షలు చేస్తుంటారు. చికిత్స..యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు సాధారణంగా నోటి ద్వారా తీసుకునే యాంటీబయాటిక్ మందులతో చికిత్స చేస్తుంటారు. అవసరాన్నిబట్టి ఒక్కోసారి అడ్వాన్స్డ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి రావచ్చు. సమస్య ఇంకా ముదిరితే ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, సమస్యకు అనుగుణంగా చికిత్స ఇస్తుంటారు.బ్లాడర్ సంబంధమైన సమస్యలు..యూరినరీ బ్లాడర్ దాదాపు 500 ఎమ్ఎల్ మూత్రం నిల్వ ఉండే సామర్థ్యంతో ఉంటుంది. మూత్రం చాలాసేపు ఆపుకునేవారికి రెండు రకాల సమస్యలొస్తుంటాయి. మొదటిది... అదేపనిగా ఆపుకుంటూ ఉంటే బ్లాడర్ కండరాలు క్రమంగా నిల్వ చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అలాంటప్పుడు 200 ఎమ్ఎల్ మూత్రం నిల్వకాగానే మూత్రవిసర్జన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎంతగా ఆపుకుందామన్నా ఆగక... మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంటుంది. ఇక రెండో రకం సమస్యలో... తరచూ మూత్రాన్ని ఆపుకోవడం అలవాటైపోవడంతో మూత్రాన్ని ఆపేందుకు ఉపయోగపడే స్ఫింక్టర్ కండరాలు గట్టిగా బిగుసుకుపోతాయి. ఈ రెండు రకాల సమస్యల్లో బ్లాడర్ పనితీరు (బ్లాడర్ ఫంక్షన్) తగ్గుతుంది. కొన్నాళ్ల తర్వాత అర్జెంట్‌గా వెళ్లాల్సి రావడం... లేదా కొంతమందిలో పాస్ చేసిన తర్వాత కూడా బ్లాడర్‌లో కొంత మిగిలిపోయుంటుంది. ఈ రకమైన సమస్యను ‘డిస్ఫంక్షనల్ వాయిడింగ్’ అంటారు.లక్షణాలు..మూత్రం వస్తున్న ఫీలింగ్ కలిగినప్పుడు మూత్రానికి వెళ్తే... స్ఫింక్టర్ కండరాలు బిగుసుకుపోయి, ఎంతకీ రిలాక్స్ కాకపోవడంతో మూత్ర విసర్జన ఓ సమస్యగా మారుతుంది. మూత్రం సాఫీగా తేలిగ్గా రాదు, మూత్రవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతుంది.నిర్ధారణ / చికిత్స..బ్లాడర్ ఫంక్షన్ పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేసి, దానికి అనుగుణంగా నొప్పిని నివారించే మందులతోనూ, కండరాలను రిలాక్స్ చేసే ఔషధాలతో చికిత్స అందిస్తారు.మూత్రపిండాల్లో రాళ్లు..ఇవి అనేక కారణాలతో వచ్చినప్పటికీ వర్కింగ్ ఉమన్‌లో మాత్రం నీళ్లు తక్కువగా తాగడం వల్ల ఇవి వస్తుంటాయి. ఎక్కువగా నీరు తాగని వారిలో వ్యర్థాలు స్ఫటికంలా మారడంతో ఇవి వస్తుంటాయి. ఇవి చాలా బాధాకరంగా పరిణమిస్తాయి. ఏర్పడ్డ స్ఫటికం సైజును బట్టి రకరకాల చికిత్సలు అవసరమవుతాయి.నివారణ / పరిష్కారాలు..ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వంటి చికిత్సలు తీసుకోవడం కంటే ఈ సమస్యల నివారణ కోసం జాగ్రత్తలు అవసరం. బయటకు వెళ్లిన మహిళల మూత్రవిసర్జనకు మనదగ్గర పెద్దగా వసతులు ఉండవు. కాబట్టి ఇది ఒక సామాజిక సమస్య కూడా. ఈ సమస్యతో వచ్చే మహిళలకు డాక్టర్లు కొంత కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా నివారణ చర్యలను తెలుపుతారు. అవి...– మహిళలకు బయటి బాత్రూమ్లకు వెళ్లాల్సి వస్తుందన్న బెరుకువీడి దేహ జీవక్రియలను అవసరమైనన్ని నీళ్లు తాగుతుండాలి. – మరీ తప్పనప్పుడు ఎప్పుడో ఒకసారి మినహా... వస్తున్నట్లు అనిపించగానే మూత్రవిసర్జనకు వెళ్లాలి.– మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి కొన్ని రకాల ఫాస్ట్‌ఫుడ్, యానిమల్ ్రపోటీన్, చీజ్, చాక్లెట్ల వంటివి వీలైనంత తక్కువగా తీసుకోవాలి. కొన్ని ఆహారాల కారణంగా కొందరిలో స్ఫటికాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. అలాంటివారు తమకు సరిపడనివాటిని వాటికి దూరంగా ఉండాలి.ఇవి చదవండి: సకాలంలో స్పందిస్తే ఆత్మహత్యలను నివారించవచ్చు -
పెరుగుతున్న మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు
సాక్షి, హైదరాబాద్: యూరాలజీ, నెఫ్రాలజీ సేవలకు దేశంలోనే పేరెన్నికగన్న ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక యూరాలజీ సదస్సు రెండో ఎడిషన్ నగరంలో శనివారం ప్రారంభమైంది. యూరేత్రా @ ఏఐఎన్‌యూ పేరుతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సదస్సుకు 8 దేశాలతో సహా.. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 800 మందికి పైగా యూరాలజిస్టులు హాజరయ్యారు.మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలలో సరికొత్త టెక్నిక్‌ల గురించిన లోతైన చర్చ ఈ సదస్సులో జరుగుతోంది. మూత్రనాళాలు సన్నబడిపోవడం వల్ల మూత్రవిసర్జన తగ్గడం, దానివల్ల అనేక సమస్యలు వచ్చినప్పుడు ఈ శస్త్రచికిత్స చేస్తారు. ఇలా సన్నబడే అవకాశాలు పురుషుల్లో ఎక్కువగా ఉంటాయి గానీ, మహిళలు, పిల్లల్లోనూ కనిపిస్తుంది.గతంలో మూత్రనాళాలు సన్నబడటానికి గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులు ప్రధాన కారణం అయ్యేవి. అయితే, గత రెండు దశాబ్దాలుగా అవగాహన పెరగడంతో ఇది 30-40 శాతం వరకు తగ్గింది. రోడ్డు ప్రమాదాలు, ఇన్ఫెక్షన్ల వల్ల మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు ఎక్కువగా చేయాల్సి వస్తోందని ఏఐఎన్‌యూ ఆస్పత్రి యూరాలజిస్టులు గమనించారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి.ఈ సందర్భంగా సదస్సు నిర్వాహక కార్యదర్శి, ఏఐఎన్‌యూ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ భవతేజ్ ఎన్గంటి మాట్లాడుతూ, “రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ ఫ్రాక్చర్లు జరిగినప్పుడు మూత్రనాళాలు దెబ్బతింటాయి. అలాంటప్పుడు కొన్ని నెలలు వేచి ఉండి, ఆ తర్వాత దీన్ని సరిచేయాలి. ప్రమాదాలు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నాయి.ముందున్న వాహనాన్ని వేగంగా ఢీకొన్నప్పుడు ఇతర అవయవాలతో పాటు మూత్రనాళాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. యూటీఐ, ఎస్టీఐ లాంటి ఇన్ఫెక్షన్ల వల్ల కూడా మూత్రనాళాలు సన్నబడుతున్నాయి. క్యాన్సర్ లాంటివాటికి రేడియేషన్ ఇచ్చినప్పుడు కూడా మూత్రనాళాల్లో సమస్యలు వస్తున్నాయి. కొందరు పిల్లల్లో పుట్టుకతోనే అసలు మూత్రనాళం ఏర్పడదు. ఎక్కువకాలం పాటు ఆస్పత్రిలో ఉన్నప్పుడు క్యాథటర్స్ అమర్చుకోవడం, అదనపు వ్యాధులు ఉండటం వల్ల కూడా ఈ సమస్య వస్తోంది” అని తెలిపారు. సాధారణంగా మూత్రనాళాలకు రిపేర్ చేసినప్పుడు అవి ఫెయిలయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ల సొంత టిష్యూల ఆధారంగానే ఆపరేషన్ చేయాలి. బుగ్గలలో టిష్యూ, నాలుక దగ్గర ఉండే టిష్యూలను తీసుకుంటాం. ఇందుకు జెనెటికల్ ఇంజినీర్ లేదా బయో ఇంజినీరింగ్ నైపుణ్యాలు అవసరం అవుతాయి. మరీ ఎక్కువసార్లు విఫలం అయితే టిష్యూ అందుబాటులో ఉండదు. అందుకే ఇప్పుడు సెల్ థెరపీ ఆధారంగా రీజనరేటివ్ పద్ధతులు అవలంబిస్తున్నారు. అంటే.. టిష్యూను ఇంజెక్ట్ చేయడం ద్వారా మూత్రనాళం దానంతట అదే బాగుపడుతుంది.ఏఐఎన్‌యూ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి.మల్లికార్జున మాట్లాడుతూ, “గడిచిన తొమ్మిదేళ్లలో వెయ్యికి పైగా శస్త్రచికిత్సలు చేశాం. గతంలో ఏడాదికి 50 కేసులే చేసేవాళ్లం. ఇప్పుడు 200-250 వరకు చేస్తున్నాం. దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి శస్త్రచికిత్సలలో మేం అగ్రస్థానంలో ఉన్నాం. నిపుణుల నుంచి నేర్చుకుని, శిక్షణ పొందడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు సంక్లిష్టమైనవి, వీటిలో వైఫల్యాల రేటు ఎక్కువ. రోగుల కోణం నుంచి చూసినప్పుడు పెరుగుతున్న డిమాండుకు, నిపుణులైన సర్జన్లకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉంది” అని చెప్పారు. యూకే, ఉగాండా, నేపాల్, బంగ్లాదేశ్, సింగపూర్, థాయ్ లాండ్, గల్ఫ్ దేశాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 800 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారతదేశంలోనే మూత్రనాళ శస్త్రచికిత్సలలో అగ్రగణ్యులుగా పేరొందిన పుణెకు చెందిన డాక్టర్ సంజయ్ కులకర్ణి, కోయంబత్తూరుకు చెందిన డాక్టర్ గణేష్ గోపాలకృష్ణన్ ప్రధానంగా ఈ సదస్సులో మాట్లాడారు. ఐఎస్బీ హైదరాబాద్ మాజీ డీన్ అజిత్ రంగ్నేకర్ కూడా ఇందులో ప్రధాన వక్తగా పాల్గొన్నారు.ఏఐఎన్‌యూ గురించి భారతదేశంలో యూరాలజీ, నెఫ్రాలజీ ఆస్పత్రుల నెట్వర్కులో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ప్రముఖమైనది. ఇటీవల దీన్ని ఏషియా హెల్త్‌కేర్ హోల్డింగ్స్ టేకోవర్ చేసింది. ప్రముఖ నెఫ్రాలజిస్టులు, యూరాలజిస్టులతో కూడిన ఏడు ఆస్పత్రులు దేశంలోని నాలుగు నగరాల్లో ఉన్నాయి.యూరాలజీ, నెఫ్రాలజీ రంగాలలో చికిత్సాపరమైన నైపుణ్యాలతో ఈ ఆస్పత్రి యూరో-ఆంకాలజీ, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ, పిల్లల యూరాలజీ, మమిళల యూరాలజీ, ఆండ్రాలజీ, మూత్రపిండాల మార్పిడి, డయాలసిస్ లాంటి సేవలు అందిస్తోంది. యూరాలజీ, నెఫ్రాలజీ, యూరో-ఆంకాలజీ రంగాల్లో ఇప్పటివరకు 1200 రోబోటిక్ సర్జరీలు చేసి, రోబోటిక్ యూరాలజీ రంగంలో దేశంలోనే ముందంజలో ఉంది. దేశంలో ఈ ఆస్పత్రికి 500 పడకలు ఉన్నాయి, ఇప్పటివరకు లక్ష మందికి పైగా రోగులకు చికిత్సలు అందించారు. ఏఐఎన్‌యూకు ఎన్ఏబీహెచ్, డీఎన్బీ (యూరాలజీ అండ్ నెఫ్రాలజీ), ఎఫ్ఎన్బీ (మినిమల్ ఇన్వేజివ్ యూరాలజీ) నుంచి ఎక్రెడిటేషన్ ఉంది. -
తుమ్మితే పేగులు బయటికొచ్చాయి!
వాషింగ్టన్: ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతూ ఇటీవల మూత్రకోశం ఆపరేషన్ చేయించుకున్న 63 ఏళ్ల రోగి అనూహ్యమైన మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొన్నారు. గట్టిగా తుమ్మి, దగ్గడంతో పేగులు బయటికొచ్చాయి. దీంతో ఆయనను అత్యవసరంగా ఆస్పత్రిలో చేర్పించి ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకుండా కాపాడారు. ఫ్లోరిడావాసికి జరిగిన ఈ విచిత్ర ఘటన వివరాలు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడికల్ కేస్ రిపోర్ట్స్’లో ప్రచురితమయ్యాయి. యూరినరీ బ్లాడర్ ఆపరేషన్ తర్వాత కోలుకున్న ఆ వ్యక్తికి ఇటీవల ఆస్పత్రికి వెళ్లారు. ఆపరేషన్ సమయంలో పై నుంచి వేసిన కుట్లను విప్పేశారు. ఆపరేషన్, కుట్లు విప్పడం అంతా సవ్యంగా జరగడంతో చిన్న పార్టీ చేసుకుందామనుకుని ఆ దంపతులు తర్వాతి రోజు ఉదయాన్నే దగ్గర్లోని రెస్టారెంట్‌కు వెళ్లి అల్పాహారం తినేందుకు కూర్చున్నారు. ఆ సమయంలో ఆ వ్యక్తి బిగ్గరగా తుమ్మడంతోపాటు దగ్గారు. దీంతో ఆపరేషన్ కోసం గతంలో కోత పెట్టిన ప్రాంతం నుంచి పేగుల్లో కొంతభాగం బయటికొచ్చింది. హుతాశుడైన వ్యక్తి వెంటనే ధైర్యం తెచ్చుకుని సొంతంగా డ్రైవింగ్ చేస్తూ ఆస్పత్రికి వెళ్దామనుకున్నాడు. భార్య వద్దని వారించడంతో అంబులెన్సులో ఆస్పత్రికి వెళ్లారు. పరిస్థితి చూసి అవాక్కవడం వైద్యుల వంతయింది. ముగ్గురు నిష్ణాతులైన యూరాలజీ సర్జన్లు జాగ్రత్తగా వాటిని మళ్లీ యథాస్థానంలోకి వెనక్కి నెట్టారు. ఇలాంటి ఘటన జరగడం మాకు తెలిసి ఇదే తొలిసారి అని అక్కడి వైద్యులు వ్యాఖ్యానించారు. -
ఏం డాక్లర్లయ్యా సామీ! గర్భసంచి ఆపరేషన్ చేయమంటే.. మూత్రనాళం కోసి
అనంతపురం: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది అనే చందంగా మారింది గుంతకల్లు రైల్వే ఆస్పత్రి వైద్యుల తీరు. గర్భసంచి తొలగించాలంటూ శస్త్ర చికిత్స చేపట్టిన వైద్యులు.. ఏకంగా రోగి మూత్రనాళాన్నే కత్తిరించి పరిస్థితిని మరింత జఠిలం చేసిన వైనం సంచలనం రేకెత్తించింది. వివరాలు.. గుంతకల్లుకు చెందిన ఓ మహిళ రెండు రోజుల క్రితం రైల్వే ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు ఆమెకు గర్భసంచి తొలగించాలని సూచించి శుక్రవారం శస్త్రచికిత్స చేశారు. అయితే గర్బసంచి తొలగించే క్రమంలో మూత్ర విసర్జన నాళాన్ని కట్ చేశారు. ఫలితంగా ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో చేతులెత్తిసిన వైద్యులు వెంటనే ఆమెను కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఘటనపై రైల్వే ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గజలక్ష్మీ ప్రభావతి వివరణ కోసం ప్రయత్నించగా ఆమె స్పందించ లేదు. కాగా, గత నెల 8వ తేదీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న పరిమళ ప్రాణాలు కోల్పోయిన ఘటన మరువకనే మరో దారుణం వెలుగు చూడడంతో రైల్వే ఆస్పత్రికి వెళ్లాలంటే ఉద్యోగులు భయపడుతున్నారు. చిన్నపాటి కుటుంబనియంత్రణ ఆపరేషన్‌ను దాదాపు 8 గంటల పాటు చేసి, చివరకు ఆమె పరిస్థితి విషమం కావడంతో వైద్యులు చేతులెత్తేశారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అనంతపురానికి తరలిస్తుండగా పరిమళ మృతి చెందింది. -
Health Tips: గర్భసంచి జారిందన్నారు.. ఆపరేషన్ లేకుండా మందులతో తగ్గుతుందా?
నాకు 55 ఏళ్లు. ఏడాదిగా యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గర్భసంచి జారింది, ఆపరేషన్ చేయాలి అన్నారు. ఆపరేషన్ లేకుండా మందులతో నా సమస్య తగ్గే మార్గం లేదా? – ఎన్. విజయలక్ష్మి, బాల్కొండ గర్భసంచికి ఉండే సపోర్ట్ స్ట్రక్చర్స్ అయిన లిగమెంట్స్, మజిల్స్‌ని పెల్విక్ ఫ్లోర్ అంటారు. వయసు పైబడుతున్న కొద్దీ పెల్విక్ ఫ్లోర్ బలహీనమవుతూ ఉంటుంది. దాంతో గర్భసంచి, యూరిన్ బ్యాగ్, మోషన్ ఏరియా వదులై జారుతుంది. యూరిన్ బ్యాగ్ ఉన్న స్థానం నుంచి కిందికి జారినప్పుడు యూరిన్ పూర్తిగా ఖాళీ అవకపోవడం, పదేపదే యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం, కాళ్లు, నడుము నొప్పి ఉంటాయి. దీనిని పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్ అంటాం. కారణాలు ఇవే! యూరిన్ బ్యాగ్ మాత్రమే జారితే cystocele qgzeg.యాభై ఏళ్లు దాటిన వాళ్లలో పదిలో ఎనిమిది మందికి ఇలాంటివి ఉంటాయి. ప్రసవాలు, అధిక బరువు, తీవ్రమైన మలబద్ధకం, తీవ్రమైన దగ్గు, అధిక బరువులను ఎత్తడం, పైబడుతున్న వయసు వంటి కారణాల వల్ల గర్భసంచి జారుతుంది. ఇది డాక్టర్ చేసే ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ద్వారా తెలుస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్ కనుక్కోవడానికి వైద్య పరీక్షలు చేస్తారు. అల్ట్రాస్కానింగ్ చేస్తారు. కొందరి విషయంలో యూరోడైనమిక్ స్టడీస్ అవసరం ఉంటుంది. ఈ సమస్యకు చాలా చికిత్సా పద్ధతులున్నాయి. చిన్న ప్రొలాప్స్ అయితే కనుక జీవన శైలిని మార్చుకుని అంటే అధిక బరువు ఉంటే వ్యాయామాలు చేసి బరువు తగ్గించుకోవడం, దగ్గు, మలబద్ధకానికి చికిత్స తీసుకోవడం, అధిక బరువులు ఎత్తకుండా చూసుకోవడం వంటివాటి పట్ల శ్రద్ధ పెట్టి సమస్యను తగ్గించుకోవచ్చు. చాలా మందికి సర్జరీని అవాయిడ్ చేస్తాం పెల్విక్ ఫ్లోర్ మజిల్ ఎక్సర్సైజెస్ కూడా ఈ సమస్యను తగ్గించుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఇవి పెల్విక్ ఫ్లోర్ పటుత్వాన్ని కాపాడుతాయి. బలహీనమైన కండరాలను బలోపేతం చేస్తాయి. మూడు నుంచి ఆరు నెలల వరకు నిపుణుల పర్యవేక్షణలో ఈ వ్యాయామాలను చేస్తే చాలా ప్రయోజనం ఉంటుంది. వెజైనల్ హార్మోన్ క్రీమ్స్ .. ఈస్ట్రోజెన్ క్రీమ్‌తో కూడా ఆ అసౌకర్యం కొంత తగ్గే అవకాశం ఉంది. vaginal pessary అని సిలికాన్ రింగ్ దొరుకుతుంది. దీన్ని డాక్టర్ పర్యవేక్షణలో వెజైనాలో అమర్చి.. ప్రొలాప్స్ తగ్గుతుందా లేదా అని చూస్తారు. ఈ pessaryని డాక్టరే ప్రిస్క్రైబ్ చేస్తారు. దీంతో చాలా మందికి సర్జరీని అవాయిడ్ చేస్తాం. పైన విధానాలేవీ పనిచేయనప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది. ఈ ఆపరేషన్‌లో యూరిన్ బ్యాగ్‌ని, గర్భసంచిని పైకి లిఫ్ట్ చేసి సపోర్ట్ చేస్తారు. దీంతో యూరినరీ, పెల్విక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. - డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్. చదవండి: Health: ప్రెగ్నెన్సీలో మైగ్రేన్ వస్తే? ఈ టాబ్లెట్లు మాత్రం అస్సలు వాడొద్దు! Health Tips: ఏడో నెల.. ఆకు కూరలు, పప్పులు, దానిమ్మ రోజూ తినాలి! ఇంకా.. -
చిన్నారుల్లో యూటీఐ నివారణ ఇలా...
చిన్నపిల్లలు చాలామంది మూత్రవిసర్జన సమయంలో మంట అని ఏడుస్తుంటారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరుగుతుంది. వేసవిలో పిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. ఈ కింది జాగ్రత్తలతో దాన్ని నివారించవచ్చు. ►పిల్లలు తగినంతగా నీళ్లు తాగేలా జాగ్రత్త తీసుకోవాలి. మరీ ముఖ్యంగా వేసవి సీజన్లో ఆటల్లో పడి పిల్లలు నీళ్లు తాగరు. దాంతో ఈ సమస్య ముప్పు పెరుగుతుంది. ►వదులుగా ఉండే దుస్తులు వేయాలి. ముఖ్యంగా నడుము కింది భాగంలో బిగుతుగా లేకుండా చూసుకోవాలి. ►వారి ప్రైవేటు అవయవాల ప్రాంతాన్నంతా పరిశుభ్రంగా ఉంచుకోవడం నేర్పించాలి. ఇన్ఫెక్షన్ ఉన్న సమయంలో మూత్రవిసర్జన తర్వాత గోరు వెచ్చని నీళ్లతో ఆ ప్రాంతమంతా శుభ్రం చేయాలి. ఇందుకు సబ్బు నీళ్లు వాడకూడదు. ప్లెయిన్ వాటరే మంచిది. ►పిల్లలకు మంచి టాయిలెట్ అలవాట్లు నేర్పాలి. అంటే మూత్రమంతా బయటకు వచ్చేలా మూత్రవిసర్జన చేయడం, ప్రైవేట్ పార్ట్స్ శుభ్రంగా కడుక్కోవడం వంటివి). ►యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చేయకూడని పనులనూ గుర్తుపెట్టుకోవాలి. నీళ్ల తొట్టిలో సబ్బు కలిపి నురగవచ్చేలా చేసి, తొట్టి స్నానం చేయించడం (బబుల్ బాత్) వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అందుకే ఆ సమయంలో బబుల్‌బాత్ చేయించకూడదు. -
Health Tips: ఆపి ఉంచడం వలన మూత్రంలోని పదార్థాలు జిగటగా మారి.. ఆపై
Do Not Hold Urine For Long Time: మూత్ర విసర్జన ఎప్పుడు చేస్తాం? మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే చేయలేం కదా? అది ఎప్పుడు వస్తే అప్పుడే విసర్జన చేసేది కదా... దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలా? అని చికాకు పడకండి. ఎందుకంటే స్కూలుకెళ్లే పిల్లలు మూత్రానికి వెళ్లవలసి వచ్చినా, టీచర్ని అడగడానికి సిగ్గుపడి అడగరు. ఒకోసారి అడిగినా, టీచర్లు పంపకపోవచ్చు వాళ్లు ఆ వంక పెట్టి బయటకు వెళ్లొస్తుంటారని! దాంతో వాళ్లు ఆపుకోలేక చాలా ఇబ్బంది పడతారు. పెద్దవాళ్లు కూడా ఒకోసారి కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తుంటారు. అయితే అలా మూత్రం వచ్చిన వెంటనే ఆ పని కానివ్వకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు వైద్యులు. అవేమిటో చూద్దాం. ఒంట్లో ఉన్న మలినాల్ని కడిగి తనతోపాటు బయటకి తీసుకెళ్ళే ద్రవపదార్థమే మూత్రం. మరి ఆ మలినాలను ఎప్పటికప్పుడు బయటకి పంపాలి కాని ఆపితే ఎలా? ఇది మంచి అలవాటు కాదు. దీనివలన ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా? మీరే చూడండి. సాధారణంగా మనుషుల బ్లాడర్ 400 మిల్లీలీటర్ల నుంచి 600 మిల్లీలీటర్ల దాకా మూత్రాన్ని ఉంచుకోగలదు. ఆ పరిమితి దాటిన క్షణం నుంచే బ్లాడర్ మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అక్కడినుంచి ఎంతసేపు మూత్రాన్ని ఆపుకుంటే అంత ఒత్తిడి. బ్లాడర్ పరిమాణం ఇంకొద్దిగా పెరుగుతుంది. ఇలా పెరగడం మంచిదనుకుంటున్నారేమో...కానే కాదు. ఇలా సైజులో మార్పులు రావడం వలన మెదడుకి బ్లాడర్ నుంచి సంకేతాలు తక్కువగా అందుతాయి. దాంతో మూత్ర విసర్జన జరగాల్సిన సమయంలో జరగకపోవచ్చు. ఇలా చేయడం వలన మలినాలు ఎక్కువసేపు అలానే ఉండిపోతాయి. మూత్రాన్ని అలా ఆపి ఉంచడం వలన మూత్రంలోని కొన్ని పదార్థాలు జిగటగా మారతాయి. ఇవే మెల్లిమెల్లిగా రాళ్ళుగా మారతాయి. ఇదే పద్ధతి కొనసాగిస్తూ ఉంటే, అవి ఇంకా బంకగా మారి, మరింత పెద్ద రాళ్లు వస్తాయి. ఇలా క్రమంగా రాళ్ళు పెరిగిపోతూనే ఉంటాయి. మూత్రాన్ని ఆపుకోవడం వలన కిడ్నీల్లో స్టోన్స్, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ మహిళల్లోనే ఎక్కువ. ఎందుకంటే పురుషుల మాదిరి ఎక్కడపడితే అక్కడ మహిళలు మూత్రాన్ని విసర్జించలేరు కాబట్టి ఆపుకునే అలవాటు వారిలో ఎక్కువగా ఉండటం ఇలా జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ అలవాటు వలన వచ్చే మరో సమస్య యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఈ సమస్య పురుషులతో పోలిస్తే మహిళల్లో చాలా ఎక్కువ. ఈ రకమైన ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, మాటిమాటికి మూత్రం వస్తుంది, మూత్రంలో మంటగా ఉంటుంది, ఒక్కోసారి బ్లాడర్ ఖాళీగా ఉన్నా మూత్రం వచ్చినట్లుగా అనిపిస్తుంది. అదే తీవ్రమైన సమస్య. ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా పడుతుంది. జ్వరం, వెన్నునొప్పి వంటి సమస్యలు ఎన్నో వస్తాయి. అందుకే ద్రవపదార్థాలను ప్లాన్డ్ గా తీసుకోవాలి. బస్సుల్లో దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీసు మీటింగ్స్ ఉన్నప్పుడు కొద్దిగా తక్కువ తీసుకోవడం కొంత మెరుగు, ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే మాత్రం డ్రైవర్‌కి చెప్పి బస్ ఆపించడానికి మొహమాటపడద్దు. ఎందుకంటే ఒకోసారి అది ప్రాణాలకే ప్రమాదంగా పరిణమించవచ్చు. చదవండి: Jeedipappu Health Benefits: జీడిపప్పును పచ్చిగా తింటున్నారా..! సంతానలేమితో బాధపడే వారు పిస్తాతో పాటు వీటిని తింటే.. -
మన దేశంలో ఈ సమస్య తీవ్రత ఎక్కువే..
ఈ చలికాలంలో నీళ్లు తాగేది ఒకింత తక్కువే అయినా... కొందరికి తరచూ మూత్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా సాధారణం కంటే చాలా ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చే పరిస్థితినే ‘ఓవర్ యాక్టివ్ బ్లాడర్’ అంటారు. ఇది ఆరోగ్యపరంగానే కాదు... సామాజికంగా కూడా బాధితులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీంతో ఈ సమస్య ఉన్న బాధితులు నీళ్లు తక్కువగా తాగడం మొదలుపెడతారు. ఫలితంగా సాధారణ జీవక్రియలు, మూత్రపిండాలకు సంబంధించిన మరికొన్ని సమస్యలూ వచ్చే అవకాశముంది. తరచూ నిద్రాభంగం వల్ల ‘నిద్రలేమి’తో వచ్చే ఆరోగ్యసమస్యలు అదనం. ఈ సమస్య లక్షణాలేమిటో, దాన్ని అదుపు చేయడం ఎలాగో తెలుసుకుందాం. కొందరిలో మూత్రాశయపు బ్లాడర్ గోడలు తరచూ అతిగా స్పందించి, త్వరత్వరగా ముడుచుకుపోతూ... మూత్రాన్ని బయటకు పంపించడానికి ప్రయత్నిస్తాయి. ఈ సమస్యతో బాధపడేవారు తాము ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు అక్కడ టాయిలెట్ గదులెక్కడున్నాయో వెతుక్కుంటూ ఉంటారు. ఈ ప్రవర్తననే ‘‘టాయిలెట్ మ్యాపింగ్’’ అంటారు. ఇక రాత్రివేళ తరచూ పక్క మీది నుంచి లేస్తూ ఉండటం... కేవలం వారిని మాత్రమేగాక వారి భాగస్వామికీ నిద్రాభంగం కలిగిస్తూ ఇబ్బందిగా పరిణమిస్తుంది. దాంతో ఆరోగ్యసమస్య కాస్తా... కుటుంబ సమస్యగా కూడా పరిణమిస్తుంది. ఫలితంగా ఇది వారి ‘జీవననాణ్యత’ (క్వాలిటీ ఆఫ్ లైఫ్)ను దెబ్బతీస్తుంది. మనదేశంలో దీని తీవ్రత... నిజానికి మన దేశంలో ఈ సమస్య ఎక్కువే అయినప్పటికీ దీని గణాంకాలు చాలా తక్కువగా నమోదవుతుంటాయన్నది వైద్య నిపుణుల భావన. అయినప్పటికీ కొన్ని అధ్యయనాల ప్రకారం పురుషుల్లోని 14 శాతం, మహిళల్లో 12 శాతం మందిలోనూ ఈ సమస్య ఉంటుంది. మెనోపాజ్‌కు చేరువైన/ మెనోపాజ్ వచ్చిన మహిళలు, ప్రోస్టేట్ సమస్య ఉన్న పురుషుల్లో ఈ సమస్య మరింత ఎక్కువ. మేనేజ్మెంట్ / చికిత్స ∙జీవనశైలి మార్పులు : ఇందులో భాగంగా సాధారణ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకొమ్మని డాక్టర్లు / నిపుణులు సలహా ఇస్తారు. కొందరు అవసరమైన దాని కంటే చాలా ఎక్కువ నీళ్లు తాగుతుంటారు. ఉదాహరణకు... ఉదయాన్నే చేసే మూత్రవిసర్జన వల్ల దేహంలోని చాలా విషపదార్థాలు బయటకు వెళ్తాయనే అపోహతో చాలామంది రెండు లీటర్లకు పైగా నీళ్లు తాగేస్తారు.అవసరానికి మించి నీళ్లు తాగకుండా జాగ్రత్తపడాలి. (ఇందుకు కొంత పరిశీలన, అభ్యాసం అవసరం. మనకు ఎన్ని నీళ్లు సరిపోతాయనే అంశాన్ని మరీ నీళ్లు తక్కువైనప్పుడు డీహైడ్రేషన్‌లో కనిపించే లక్షణాలైన కండరాలు బిగుసుకుపోవడం (మజిల్ క్రాంప్స్) వంటి వాటిని గమనిస్తూ... దేహానికి అవసరమైన నీళ్ల మోతాదును ఎవరికి వారే స్వయంగా గుర్తించగలిగేలా నిశితంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది.); నిద్రపోవడానికి రెండు గంటల ముందుగా నీళ్లు తాగడం...ఆ తర్వాత తాగకపోవడం; పొగతాగడం, కాఫీ (కెఫిన్), ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం; ఓవర్ ద కౌంటర్ మందులకు దూరంగా ఉండటం వంటి జీవనశైలి మార్పులతో ఈ సమస్యను చాలావరకు కట్టడి చేయవచ్చు. ►బిహేవియర్ థెరపీ : మానసిక చికిత్సలో భాగంగా ఇచ్చే అభ్యాస చికిత్సతో బ్లాడర్‌పై క్రమంగా అదుపు సాధించేలా చేయడం. ►నోటితో ఇచ్చే మందులు / బ్లాడర్‌కు ఇంజెక్షన్లు : సమస్య తీవ్రత తక్కువగా ఉన్నవారికి నోటితో ఇచ్చే కొన్ని మందులతో... సమస్య మరీ ఎక్కువగా ఉన్నవారిలో నేరుగా బ్లాడర్ కండరాలు బలోపేతమయ్యేందుకు నేరుగా బ్లాడర్‌లోకి ఇచ్చే కొన్ని ఇంజెక్షన్లతో. ►ఎలక్ట్రిక్ ఇంపల్స్ / స్టిమ్యులేషన్ టెక్నిక్స్ : ఏదైనా నరం దెబ్బతిన్నప్పడు దాన్ని ప్రేరేపించేలా (నర్వ్ స్టిమ్యులేటింగ్ టెక్నిక్స్) చేయడం. ఇందులో భాగంగా మెదడు, వెన్నుపూస నుంచి వచ్చే నరాలు, అవి బ్లాడర్‌కు చేరాక... వాటి నుంచి అందే సిగ్నల్స్ అన్నీ సరిగా అందేలా దెబ్బతిన్న నరాలకు ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన కలిగేలా విద్యుత్ ప్రేరణలు కల్పించడం. ►శస్త్రచికిత్స : ఇది చాలా చాలా అరుదుగా మాత్రమే అవసరమయ్యే ప్రక్రియ. ►పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఎక్సర్సైజ్లు : కెగెల్స్ ఎక్సర్సైజ్ అని పిలిచే ఈ వ్యాయామల వల్ల పొత్తికడుపు కండరాలు, యూరినరీ బ్లాడర్ కింది భాగంలోని కండారాలు, మూత్రసంచి (బ్లాడర్) నుంచి బయటకు తీసుకొచ్చే నాళమైన యురెథ్రాకు మధ్య ఉండే ‘నెక్’ లాంటి చోట ఉండే కండరాలు బలోపేతమవుతాయి. ఈ వ్యాయామాలతో మూత్రం ఆపుకోగల సామర్థ్యం క్రమంగా (అంటే 4 – 8 వారాలలో) పెరుగుతుంది. డాక్టర్ల పర్యవేక్షణలో ఫిజియోల సూచనలతో చేసే ఈ వ్యాయామాలతో పరిస్థితి క్రమంగా చాలావరకు మెరుగువుతుంది. ఏ వైద్య నిపుణులను సంప్రదించాలి ‘ఓవర్ యాక్టివ్ బ్లాడర్’తో బాధపడే పురుషులు యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. అలాగే ఓవర్ ఆక్టివ్ బ్లాడర్‌తో బాధపడేవారైనా లేదా స్ట్రెస్ యురినరీ ఇన్‌కాంటినెన్స్ (ఎస్‌యూఐ) ఉన్న మహిళలైనా యూరోగైనకాలజిస్ట్ను సంప్రదించాలి. స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ కొందరు మహిళల్లో మూత్రం నిల్వ అయ్యేందుకు ఉపయోగపడే సంచి అయిన బ్లాడర్‌కు కాకుండా... మూత్రాన్ని బయటకి చేరవేసేందుకు... మూత్రసంచి (బ్లాడర్) నుంచి బయటకు తీసుకొచ్చే నాళమైన యురెథ్రాలో సమస్య ఉంటుంది. ఇలాంటివారిలో ఏ చిన్న ఒత్తిడి పడ్డా వారి యురెథ్రా మూత్రాన్ని బయటకు కారేలా చేస్తుంది. అంటే... దగ్గినా, తుమ్మినా, గట్టిగా నవ్వినా... వారికి తెలియకుండానే మూత్రం కారిపోతుంది. అంటే అర్జెంటుగా మూత్రానికి వెళ్లాలనిపించే భావన వేరు, తమకు తెలియకుండానే మూత్రం పడిపోవడం వేరు. ఇలా... తమకు తెలియకుండానే మూత్రం పడిపోయే సమస్యను స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ (ఎస్‌యూఐ) అంటారు. ఇక్కడ స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి కాదు. మూత్రసంచి లేదా దాని పరిసరాల్లో ఉండే కండరాలపై పడే చిన్నపాటి ఒత్తిడిని కూడా తట్టుకోలేకపోవడమని అర్థం. ఇది మహిళల్లో చాలా ఎక్కువగా కనిపించే సమస్య. ప్రసవం సమయాల్లో గర్భసంచి నుంచి శిశువు బయటకు వచ్చే మార్గం (బర్త్ కెనాల్) చాలా ఎక్కువగా సాగడం, ఎక్కువ సార్లు కాన్పులు కావడం (మల్టిపుల్ వెజినల్ డెలివరీస్) వంటి అనేక అంశాలు... మూత్రవిసర్జనను నియంత్రించే కండరాలను బలహీనపరచడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఉన్నవారి కంటే స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ సమస్య ఉన్న మహిళలకు ఇవ్వాల్సిన చికిత్స ఒకింత వేరుగా ఉంటుంది. కారణాలు ► ఏదైనా కారణాలతో మెదడు, వెన్నుపూసలోని నరాలు దెబ్బతినడంతో తలెత్తే నాడీ సంబంధ సమస్యల వల్ల. ►పక్షవాతం, మల్టిపుల్ స్కిరోసిస్, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి వాటి కారణంగా. ►వయసు పెరుగుతున్న కొద్దీ బ్లాడర్ కండరాలు బలహీనం కావడం (ఇది అందరిలో జరిగే పరిణామం కాదు... కేవలం కొద్దిమందిలోనే). ►వెన్నుపూస లేదా పెల్విక్ లేదా నడుముకు సర్జరీ జరిగిన కొంతమందిలో. ►కెఫిన్ / ఆల్కహాల్ / కొన్ని ఓవర్ ద కౌంటర్ మందుల వల్ల. ►ఇన్ఫెక్షన్ల (ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్) వల్ల. ►స్థూలకాయం వల్ల. ►మహిళల్లో మెనోపాజ్ తర్వాత దేహంలో ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల లోపం వల్ల. డా. శివరాజ్ మనోహరన్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, యాండ్రాలజిస్ట్ – రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్. -
మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే!
సమాజంలో మూత్రవిసర్జనకు స్త్రీలకు ఉండే సౌకర్యాలు చాలా తక్కువ. పెద్ద పెద్ద నగరాల్లో ఏమోకానీ, చిన్న ఊర్లలో బయటకు వెళితే ఇంటికి వచ్చే వరకు ఉగ్గబట్టుకోవాల్సిందే! ఇలా ఎక్కువ సార్లు ఆపితే ఇన్ఫెక్షన్ వస్తుంది. యూరినరీ ఇన్ఫెక్షన్లు మూత్రాన్ని ఆపుకోలేని ఇబ్బందిని కూడా కలగజేస్తాయి. దీంతో నలుగురిలోకి వెళ్లాలన్నా, దూరాభారం వెళ్లాలన్నా భయపడే పరిస్థితి వస్తుంది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిలో మూత్రాశయ ఇన్ఫెక్షన్స్ (యూరినరీట్రాక్ ఇన్ఫెక్షన్– యూటీఐ) కామన్‌గా కనిపిస్తుంది. ఈ సమస్య స్త్రీలలోనే అధికం. ప్రతి ఐదుగురు స్త్రీలలో ఒకరు తమ జీవితకాలంలో ఒక్కసారైన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ను ఎదుర్కొన్నవారే. మూత్రనాళం, మూత్రాశయ ముఖ ద్వారంలో బ్యాక్టీరియా చేరడం వల్ల యూటీఐ సంభవిస్తుంది. కొన్ని సార్లు ఈ ఇన్ఫెక్షన్ యూరినరీ బ్లాడర్, కిడ్నీల్లో కనిపించి ఇబ్బంది పెడుతుంది. యూరినరీ ఇన్ఫెక్షన్ వల్ల పైలోనెఫ్రటీస్ అనే కిడ్నీ వ్యాధి కూడా వచ్చే ప్రమాదం ఉంది. యూటీఐ లక్షణాలు.. కిడ్నీ, బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఈ రెండింటిలో కామన్‌గా కనిపించే లక్షణం మాత్రం ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సిరావడం. ఈ లక్షణం కాకుండా బ్లాడర్‌లో ఇన్ఫెక్షన్ వస్తే బ్లాడర్ ఖాళీ అయినప్పటికీ మూత్రానికి వెళ్లాలనిపించడం, మూత్రం పోసేటపుపడు మంట,నొప్పి ఉండడం, పొత్తికడుపులో నొప్పి, యూరిన్‌లో రక్తం పడడం కనిపిస్తాయి. అదే కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంటే అధిక జ్వరం, చలితో ఒణికిపోవడం, విపరీతమైన నడుము నొప్పి, వాంతులవుతుండడం తదితరాలుంటాయి. అరికట్టడం ఎలా? తగినన్ని నీళ్లు తాగి ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తూ ఉండాలి. మూత్రవిసర్జన చేయాలనిపించినప్పుడు బలవంతంగా ఆపుకోకూడదు. బలవంతంగా మూత్రాన్ని ఆపడం వల్ల మూత్రాశయంలోకి బ్యాక్టీరియా చేరుతుంది. వీలైనంత ఎక్కువ నీళ్లు తాగడం ద్వారా బ్యాక్టీరియా మూత్రం ద్వారా కొట్టుకుపోయి ఇన్ఫెక్షన్ తీవ్రత తగ్గుతుంది. మల విసర్జనకు వెళ్లినప్పుడు వెనక నుంచి ముందుకు కాకుండా చేతిని ముందు నుంచి వెనక్కి జరుపుతూ శుభ్రంచేసుకోవాలి. దంపతులు లైంగిక కలయిక తర్వాత మూత్రవిసర్జన చేసి శుభ్రంగా కడుక్కోవాలి. పైన చెప్పిన మార్గాలు పాటించిన తర్వాత కూడా మూత్రంలో మంట, మూత్రంలో రక్తం పడడం, చలిజ్వరం,నడుంనొప్పి, వాంతులు, మూత్రం దుర్వాసన కలిగిఉండడం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సిరావటం, ముఖ్యంగా రాత్రివేళ ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సిరావటం, మూత్రాన్ని అదుపు చేసుకోలేకపోవడం, మూత్రం చుక్కలుగా పడుతూనే ఉండడం, మూత్రవిసర్జన బలవంతంగా చేయాల్సిరావడం, విసర్జన తర్వాత కూడా ఇంకా మూత్రం మిగిలి ఉందని అనిపించడం ఉంటే మాత్రం తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాలి. -
ఐసీయూలో కరుణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: మూత్రనాళ ఇన్ఫెక్షన్కు చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధికి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో రక్తపోటు ఒక్కసారిగా తగ్గింది. దీంతో ఆయన్ని చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్సచేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రక్తపోటు నియంత్రణలోకి వచ్చిందని శనివారం రాత్రి ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. కరుణానిధి కుటుంబ సభ్యులు వెద్యులతో చర్చించారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, కరుణానిధి కొడుకు స్టాలిన్, కుమార్తె కనిమొళి తదితరులు ఆసుపత్రిలో ఉన్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురై, కరుణానిధి కుటుంబానికి దూరంగా ఉంటున్న పెద్ద కొడుకు అళగిరి ఆస్పత్రికి తండ్రిని పరామర్శించడానికి వచ్చారు. తమిళనాడు గవర్నర్, రక్షణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ వాస్నిక్ తదితరులు ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. వైద్య సాయాన్నైనా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..కరుణానిధి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు. కరుణానిధి నివాసానికి భారీగా అభిమానులు తరలివస్తున్న దృష్ట్యా ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇద్దరు కార్యకర్తల మృతి.. కరుణానిధి అనారోగ్యంపై వ్యాపించిన వదంతులతో ఇద్దరు డీఎంకే కార్యకర్తలు మరణించారు. వాట్సాప్‌లో కరుణ అనారోగ్యంపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి విని నామక్కల్ జిల్లా నామగిరిపేటకు చెందిన శివషణ్ముగం (64) గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. అలాగే, తిరువారూరు జిల్లా ముత్తుపేటకు చెందిన తమీమ్ (55) శుక్రవారం రాత్రి టీవీలో కరుణానిధి అనారోగ్యంపై వచ్చిన వార్తలు వింటూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. -
దళితుడితో మూత్రం తాగించారు!
లక్నో : తమ పంటను కోయలేదని అగ్ర కులాలకు చెందిన కొందరు వ్యక్తులు ఓ దళితుడితో మూత్రం తాగించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఏప్రిల్ 23న జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. బదౌన్ జిల్లాలోని అజంపూర్ బిసౌరియా గ్రామంలోని వాల్మికీ సామాజిక వర్గానికి చెందిన సీతారాం వాల్మికీ తనకున్న కొద్ది పొలంలో గోధమ సాగు చేశారు. తన పంట కోతకు రావడంతో ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే అదే ఊరిలో అగ్ర కులానికి చెందిన కొందరు రైతులు మాత్రం తమ పొలంలోని పంటను కోసిన తర్వాతే నీ పంటని కోసుకోవాలని సీతారాంని బెదిరించారు. దీనికి అతను ఒప్పుకోకపోవడంతో అతనిపై దౌర్జన్యానికి దిగారు. ఈ ఘటనపై బాధితుడు మాట్లాడుతూ.. వారి మాట విననందుకు తనపై చెప్పులతో దాడి చేశారని తెలిపారు. అంతేకాకుండా మీసాలను బలంగా లాగుతూ.. బలవంతగా తనతో మూత్రం తాగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై పాశవికంగా ప్రవర్తించిన వారిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే స్థానిక ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసేందుకు నిరాకరించాడు. దీంతో ఎస్పీని ఆశ్రయించడంతో ఆయన ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ పోలీసు అధికారిని సస్పెండ్ చేయడంతోపాటు అతనిపై శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించారు. ఈ కేసులో గ్రామానికి చెందిన విజయ్ సింగ్, పింకు సింగ్, శైలేంద్ర సింగ్ ప్రధాన నిందితులుగా ఉన్నారని పోలీసు ఉన్నాతాధికారులు తెలిపారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. -
అపచారంపై అపచారం!
సాక్షి, విశాఖపట్నం:సింహాద్రి అప్పన్న ఆలయంలో ఆపచారంపై అపచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ఆలయంలో చోటు చేసుకుంటున్న పలు అవాంఛనీయ సంఘటనలతో భక్తులు తీవ్రంగా మండి పడుతున్నారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రానికి తిలోదకాలివ్వడం, సుప్రభాత, పవళింపు సేవల్లో అన్యాయాలు, అర్చకుల్లో ఆధిపత్య పోరు వంటి ఘటనలు వెలుగు చూశాయి. కొద్దిరోజుల క్రితం రాజభోగం సమయంలో ఓ మహిళ గర్భ గుడిలో ఉండడం తీవ్ర దుమారం రేపింది. దీనిని అపచారంగా భావించిన భక్తజనం నిప్పులు చెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాక్షాత్తూ ఆలయ ఉద్యోగే అపచారానికి పాల్పడ్డాడు. పరమ పవిత్రంగా భావించే స్వామి ఉత్తర ద్వారం సమీపంలో సూరిబాబు అనే నాలుగో తరగతి ఉద్యోగి బహిరంగంగా, పట్టపగలు మూత్ర విసర్జన చేశాడు. దానిని కొంతమంది భక్తులు కెమెరాలో బంధించారు. ఈ ఘటనపై ఆలయ ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. -
హీరోయిన్ కారు ముందు మూత్రం పోశాడు
-
హీరోయిన్ కారు ముందు మూత్రం పోశాడు
అహ్మదాబాద్ : నటి మోనాల్ గుజ్జర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన కారు ముందు మూత్ర విసర్జన చేస్తున్న ఓ వ్యక్తిని అడ్డుకున్న ఆమె.. అతని చేతిలో తిట్లు తింది. దీంతో ఆమె పోలీసులుకు ఫిర్యాదు చేయగా.. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధోలీవుడ్(గుజరాత్ ఇండస్ట్రీ) తార మోనాల్ రెండు రోజుల క్రితం సాయంత్రం గుల్బై టెక్రాలోని ఓ కాఫీ షాప్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమె పార్కింగ్ చేసిన కారు ముందు మూత్ర విసర్జన చేస్తున్నాడు. వెంటనే అది గమనించిన ఆమెలో కూర్చుని కారు హారన్ కొడుతూ అతన్ని వారించింది. అయినా ఆ వ్యక్తి తన పని కానిచ్చేసి ఆమె వైపుగా వచ్చాడు. హారన్ ఎందుకు కొట్టావంటూ మోనాల్‌తో వాగ్వాదానికి దిగాడు. అలా చెయ్యటం ఆమె తప్పని చెబుతుండగా.. అసభ్యపదజాలంతో తిట్టడం ప్రారంభించాడు. ఆ వ్యవహారమంతా ఆమె తన ఫోన్లో వీడియో తీసింది. మరుసటి రోజు గుజరాత్ యూనివర్సిటీ పోలీసులకు మోనాల్ ఫిర్యాదు చేసింది. అతన్ని అదుపులోకి తీసుకోగా.. తన కాంప్లెక్స్‌లో బాత్రూమ్లు పాడైపోయాయని.. అందుకే అలా చేశానని చెప్పుకొచ్చాడు. మోనాల్ సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ చిత్రాలతో తెలుగువారికి పరిచయస్తురాలే. -
బలవంతంగా మూత్రం తాగించారు.. ఆ అవమానంతో...
లక్నో : ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఆరోపణలతో ఓ యువకుడిపై దాష్టీకానికి పాల్పడ్డారు. పంచాయితీ పెద్దల తీర్పుతో బలవంతంగా అతనితో మూత్రం తాగించగా.. ఆ అవమాన భారంతో అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... సహారాన్పూర్లోని ఇందిరా కాలనీకి చెందిన యువకుడికి ఓ యువతితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ స్థానికులు దాడి చేశారు. ఈ క్రమంలో పంచాయితీ పెట్టగా.. పెద్దలు దారుణమైన తీర్పు ఇచ్చారు. మహిళలు అతనితో బలవంతంగా మూత్రాన్ని తాగించారు. ఘటన తర్వాత ఇంటికెళ్లిన ఆ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి కాపాడారు. అసలు ఆ యువతి ఎవరో తనకు తెలీదని.. ఎంత చెబుతున్నా వినకుండా గ్రామస్థులు తనపై దాడి చేశారని అతను చెబుతున్నాడు. తనకు ప్రాణహాని ఉందని చెప్పిన అతను పోలీస్ రక్షణ కోరుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు -
మంత్రివర్యా.. నీకిది తగునా?
సాక్షి, న్యూఢిల్లీ : స్వచ్ఛ భారత్ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని స్ఫూర్తిగా తీసుకొని రాజస్థాన్ ప్రభుత్వం ‘స్వచ్చ్ భారత్ అభియాన్’ కింద మంచి ర్యాంక్‌ను కొట్టేయాలని ప్రయత్నిస్తోంది. సరిగ్గా ఈ సమయంలోనే రాజస్థాన్ ఆరోగ్య మంత్రి కాలిచరణ్ శరఫ్ బుధవారం జైపూర్‌లోని ఓ గోడకు మూత్రం పోస్తూ దొరికిపోయారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించింది. ఇది చాలా చిన్న విషయమంటూ మంత్రి కాలిచరణ్ శరఫ్ కొట్టివేయగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం బహిరంగంగా మూత్ర విసర్జన చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా చాలా మంది మంత్రి ప్రవర్తనను విమర్శిస్తున్నారు. ఈ ఫొటోను షేర్ చేసిన ప్రముఖ క్రికెటర్ హరిభజన్ సింగ్ కూడా మంత్రి ప్రవర్తనను సున్నితంగా విమర్శించారు. -
మూత్ర పరీక్షతో టీబీ నిర్ధారణ
సాక్షి, అమరావతి: క్షయ (టీబీ–ట్యూబర్క్యులోసిస్) వ్యాధిని నిర్ధారించేం దుకు సరికొత్త మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఇన్నాళ్లూ ఛాతీని ఎక్స్‌రే తీయడం లేదా రక్తపరీక్ష ద్వారా క్షయను నిర్ధారించేవారు. ఈ విధానాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి. ఒక్కోసారి రక్తపరీక్షలతో వ్యాధి నిర్ధారణ జరిగేది కాదు. దీనివల్ల రోగులు వ్యాధి తీవ్రంగా నష్టపోయేవారు. ఇప్పుడా పరిస్థితికి చరమగీతం పాడనున్నారు. అమెరికాకు చెందిన జార్జ్ మాసన్ యూనివర్సిటీ వైద్యులు కొత్తగా మూత్ర పరీక్ష ద్వారా టీబీని నిర్ధారించే మార్గాన్ని కనుగొన్నారు. ఎక్స్‌రే, రక్త పరీక్షల కంటే 100 శాతం ఎక్కువ కచ్చితత్వంతో వ్యాధిని నిర్ధారించవచ్చని నిరూపించారు. ఈ వివరాలు సైన్స్ ట్రాన్స్లేషన్ మెడిసిన్ అనే జర్నల్‌లో ప్రచురించారు. 25 శాతం కేసులు భారత్‌లోనే... ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది టీబీ బారినపడి మరణిస్తున్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కొత్త నిర్ధారణ విధానం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. కఫం పరీక్ష కూడా టీబీ నిర్ధారణలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే, ఇప్పటిదాకా పాటిస్తున్న విధానాలు చాలా జాప్యంతో కూడుకున్నవి. పైగా పెద్దమొత్తంలో ఖర్చు కావడంతో పేద దేశాల్లో చాలామంది రోగులు టీబీ పరీక్షలు చేయించుకోలేకపోతున్నారని ఆ సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీబీ కేసుల్లో 25 శాతం కేసులు భారతదేశంలోనే నమోదవుతున్నట్లు సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్, ఎకనామిక్స్ అండ్ పాలసీ(సీడీడీఈపీ) వెల్లడించడం గమనార్హం. త్వరలోనే అందుబాటులోకి... టీబీ నిర్ధారణ కోసం రూపొందించిన కొత్త విధానం త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. తాజా పరిశోధనల్లో ‘హైడ్రోజెల్ నానో కాజెస్’అనే విధానం ద్వారా మూత్ర పరీక్ష చేసి, దీంతో ట్యూబర్ క్యులోసిస్ బ్యాక్టీరియాను కొనుగొన్నారు. ఈ పరీక్ష ద్వారా బాక్టీరియా తీవ్రతతోపాటు మనిషిలోని ఇమ్యూనిటీ (వ్యాధి నిరోధక శక్తి)ని కూడా అంచనా వేయొచ్చు. దీనికోసం జెన్ ఎక్స్పర్ట్ మెషీన్లను ఉపయోగించారు. దాదాపు 8 ఏళ్లపాటు సాగించిన పరిశోధనలు ఫలించాయని, టీబీ నిర్ధారణలో ఇప్పటివరకూ ఉన్న పరీక్షలన్నింటి కంటే అత్యంత కచ్చితమైన ఫలితాలు వచ్చాయని కొత్త ఆవిష్కరణను ప్రచురించిన జర్నల్ ప్రకటించింది. ఇందులో అల్సెండ్రా లూసిని అనే సైంటిస్ట్ కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో విజృంభిస్తున్న క్షయ ఆంధ్రప్రదేశ్‌లో టీబీ కేసులు ఒకరి నుంచి ఒకరికి వేగంగా విస్తరిస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఒక టీబీ రోగి నుంచి ఏడాదిలో కనీసం 12 మందికి ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్టు తేలింది. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యాధిగ్రస్తుడి నుంచి నలుగురికి వ్యాపిస్తున్నట్టు వెల్లడైంది. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాలో 130 మందికి కొత్తగా టీబీ వ్యాధి సోకుతున్నట్టు కుటుంబ సంక్షేమశాఖ అధికారులు గుర్తించారు. మన రాష్ట్రంలో ఏటా దాదాపు 10,000 మంది టీబీ బాధితులు బయటపడుతున్నారు. దేశంలోనే ఎక్కువ మంది హెచ్ఐవీ బాధితులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు. హెచ్ఐవీ బాధితుల్లో 80 శాతం మందికి టీబీ సోకుతోంది. వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడడం, పోషకాహారం తీసుకోవడం వంటి వాటితో క్షయ రోగం నుంచి విముక్తి పొందవచ్చు. -
ఇంకా పక్క తడుపుతున్నాడు...
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబు వయసు పదేళ్లు. వాడు ఇప్పటికీ పక్కతడుపుతూనే ఉంటాడు. రాత్రిళ్లు ప్రతి రెండు గంటలకోసారి యూరిన్‌కు వెళ్తుంటాడు. పగలు కూడా ఎక్కువగానే వెళ్తుంటాడు. ఈ సమస్యతో చాలా ఇబ్బంది పడుతుంటాడు. మావాడి సమస్యకు తగిన సలహా ఇవ్వండి. – సుమశ్రీ, ఖమ్మం మీ బాబుకు ఉన్న కండిషన్‌ను ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అని చెప్పవచ్చు. దాంతోపాటు యూరిన్ పరిమాణం ఎక్కువగా రావడాన్ని పాలీయూరియా అన్న కండిషన్ కూడా ఉందేమోనని కూడా అనుమానించాలి. ఈ సమస్యకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా తాగడం, యూరినరీ ఇన్ఫెక్షన్స్, మనస్తత్వ సంబంధమైన సమస్యలు, ఎండోక్రైన్ సమస్యలు, యూరినరీ బ్లాడర్ డిజ్‌ఫంక్షన్, దీర్ఘకాలికమైన కిడ్నీ సమస్యలు, మలబద్దకం వంటివి ముఖ్యమైనవి. మీ బాబు విషయంలో అతడి సమస్యకు నిర్దిష్టమైన కారణాన్ని తెలుసుకోడానికి కంప్లీట్ యూరిన్ అనాలిసిస్, 24 గంటల్లో అతడు విసర్జించే మూత్రపరిమాణం పరీక్షలతోపాటు యూరిన్ ఆస్మనాలిటీ, అల్ట్రాసౌండ్ ఆఫ్ కేయూబీ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో సాధారణంగా సాయంత్రం నుంచి రాత్రివరకు నీళ్లు ఎక్కువగా తాగకుండా చూడటం, తియ్యటి పదార్థాలను ఎక్కువగా తీసుకోకుండా చూడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో పాటు యూరిన్ పాస్ చేసేటప్పుడు విసర్జన పూర్తిగా చేసేలా చూడటం ప్రధానం. (ముఖ్యంగా వాయిడింగ్ డిస్ఫంక్షన్ అవాయిడ్ చేయడానికి). ఇలాంటి మంచి విసర్జక అలవాట్లతో ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. అయితే పైన పేర్కొన్న కారణాలలో ఏవైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు పూర్తిస్థాయి మూత్రపరీక్షలు (కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్) చేయించండి. మీరు ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని సంప్రదించండి. పాపకుఇప్పుడు మరో చెవిలో నొప్పి... మా పాప వయస్సు ఆరేళ్లు. రెండు నెలల క్రితం మా పాపకు జలుబు వస్తే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకెళ్లాం. ఆయన చికిత్స చేశాక తగ్గిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ మరోపక్క చెవి నొప్పిగా ఉందని అంటోంది. ఇలా జరిగే అవకాశం ఉందా? – రమ్య, ఒంగోలు మీ పాపకు ఉన్న కండిషన్‌ను ‘అడినాయిడైటిస్ విత్ యూస్టేషియన్ కెటార్’ అని చెప్పవచ్చు. ఎడినాయిడ్స్ అనే గ్రంధులు ముక్కు వెనకాల, టాన్సిల్ పైన ఉంటాయి. ఈ గ్రంథులకు టాన్సిల్స్ తరహాలో ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇది కొన్ని వారాలు, నెలలు ఉండవచ్చు. చిన్నపిల్లల్లో ఈ కండిషన్‌ను తరచూ చూస్తుంటాం. ఇలాంటిది జరిగినప్పుడు మధ్య చెవి నుంచి ముక్కు వెనుక భాగంలో ఉండే యూస్టేషియన్ ట్యూబులో కొన్ని మార్పులు జరగవచ్చు. ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు సైనసెటిస్, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, నోటితో గాలి పీల్చడం, నిద్రపట్టడంలో ఇబ్బంది వంటి ఇతర లక్షణాలూ కనిపించవచ్చు. ఇలాంటి పిల్లలకు యాంటీహిస్టమిన్, యాంటీబయాటిక్ కోర్సులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి ఉంటే పెయిన్ మెడికేషన్ కూడా అవసరం కావచ్చు. ఇలాంటి లక్షణాలు దీర్ఘకాలం కొనసాగితూ ఉంటే కొందరిలో చాలా అరుదుగా ఎడినాయిడ్స్‌ను తొలగించాల్సి రావచ్చు. మీరు మీ పీడియాట్రీషియన్ లేదా ఈఎన్టీ సర్జన్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి. పాపకు ఒంటి మీద మచ్చలు... ఎందుకిలా? మా పాపకు 14 ఏళ్లు. ఏడాది కిందటినుంచి ఒంటిమీద, ముఖం మీద చాలా మచ్చలు వస్తున్నాయి. ఈ మచ్చలు పోవడానికి ఏం చేయాలి? – ప్రియ, ఆదిలాబాద్ మీ పాపకు ఉన్న కండిషన్ నీవస్ అంటారు. దీన్ని వైద్యపరిభాషలో మల్టిపుల్ నీవస్ అనీ, సాధారణ పరిభాషలో చర్మంపై రంగుమచ్చలు (కలర్డ్ స్పాట్స్ ఆన్ ద స్కిన్) అంటారు. ఇవి రెండు రకాలు. మొదటిది అపాయకరం కానివీ, చాలా సాధారణంగా కనిపించే మచ్చలు. రెండోది హానికరంగా మారే మెలిగ్నెంట్ మచ్చ. ఒంటిపై మచ్చలు పుట్టకతోనే రావచ్చు. మధ్యలో వచ్చే మచ్చలు 10 నుంచి 30 ఏళ్ల మధ్య రావచ్చు. నీవస్ చర్మానికి రంగునిచ్చే కణాల వల్ల వస్తుంది. ఇది శరీరంలో ఎక్కడైనా (అరచేతుల్లో, అరికాళ్లలో, ఆఖరుకు గోళ్లమీద కూడా) రావచ్చు. సూర్యకాంతికి ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం, కుటుంబ చరిత్రలో ఇలాంటి మచ్చలున్న సందర్భాల్లో ఇది వచ్చేందుకు అవకాశం ఎక్కువ. కొన్ని సందర్భాల్లో నీవాయిడ్ బేసల్ సెల్ కార్సినోమా అనే కండిషన్ కూడా రావచ్చు. ఇది పుట్టుకనుంచి ఉండటంతో పాటు, యుక్తవయస్సు వారిలోనూ కనిపిస్తుంది. వారికి ఈ మచ్చలతోపాటు జన్యుపరమైన అబ్నార్మాలిటీస్ చూస్తుంటాం. అలాంటి వాళ్లకు ముఖ ఆకృతి, పళ్లు, చేతులు, మెదడుకు సంబంధించిన లోపాలు కనిపిస్తాయి. మీ పాపకు ఉన్న కండిషన్‌తో పైన చెప్పినవాటికి సంబంధం లేదు. మీ పాపది హానికరం కాని సాధారణ నీవస్ కావచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. క్యాన్సర్‌గా మారే అవకాశం కూడా చాలా తక్కువ. అయితే... కొన్ని నీవస్‌లు క్రమంగా క్యాన్సర్ లక్షణాలను సంతరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒంటిపై మీ పాపలా మచ్చలు ఉన్నవారు రెగ్యులర్‌గా డెర్మటాలజిస్ట్‌లతో ఫాలో అప్‌లో ఉండటం మంచిది. అది ఎలాంటి మచ్చ అయినా... ఏ, బీ, సీ, డీ అన్న నాలుగు అంశాలు గమనిస్తూ ఉండటం మంచిది. ఏ– అంటే ఎసిమెట్రీ... అంటే పుట్టుమచ్చ సౌష్టవంలో ఏదైనా మార్పు ఉందా?, బీ– అంటే బార్డర్... అంటే పుట్టుమచ్చ అంచుల్లో ఏదైనా మార్పు ఉందా లేక అది ఉబ్బెత్తుగా మారుతోందా?, సీ– అంటే కలర్... అంటే పుట్టుమచ్చ రంగులో ఏదైనా మార్పు కనిపిస్తోందా?, డీ– అంటే డయామీటర్... అంటే మచ్చ వ్యాసం (పరిమాణం) పెరుగుతోందా? ఈ నాలుగు మార్పుల్లో ఏదైనా కనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. అప్పుడు బయాప్సీ తీసి పరీక్ష చేసి అది హానికరమా కాదా అన్నది వారు నిర్ణయిస్తారు. ఇక ఇలాంటివి రాకుండా ఉండాలంటే... ఎండకు ఎక్కువగా ఎక్స్పోజ్ కావడం పూర్తిగా తగ్గించాలి. హానికారక అల్ట్రావాయొలెట్ కిరణాలు తాకకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేప్పుడు ఎక్కువ ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి. మీ పాపకు ఉన్న మచ్చల్ని అప్పుడప్పుడూ డెర్మటాలజిస్ట్‌తో పరీక్ష చేయిస్తూ ఉండటం మంచిది. ఇలాంటి నీవస్‌లు ముఖం మీద ఉండి కాస్మటిక్‌గా ఇబ్బంది కలిగిస్తుంటే... దీన్ని ఎక్సెషన్ థెరపీతో వాటిని తొలగించవచ్చు. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
లీటర్ యూరిన్.. రూ. 1
సాక్షి, న్యూఢిల్లీ : మూత్రానికి విలువ పెరుగుతోంది.. ఒక లీటర్ యూరిన్‌కు రూపాయి విలువను ప్రభుత్వం నిర్ణయించింది. ఇదేంటి అనుకుంటున్నారా? నిజం. దేశంలో ఎరువుల కోరత తగ్గించే క్రమంలో కేంద్రం ప్రభుత్వం ఎవరూ ఊహించని ఇటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లోని తాలుకా, తహసీల్ కార్యాలయాల్లో యూరిన్ బ్యాంక్‌లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. యూరిన్ బ్యాంక్‌ల్లో సేకరించిన యూరిన్‌తో యూరియాను తయారు చేయవచ్చని.. ఆయన తెలిపారు. ఇలా చేయడం వల్ల యూరియాను దిగుమతి చేసుకునే అవసరం లేకుండా అతి తక్కువ ధరకే నాణ్యమైన యూరియాను మన రైతులకు అందించవచ్చని ఆయన తెలిపారు. యూరిన్‌లో నైట్రోజన్ శాతం అధికంగా ఉంటుందని ఆయన తెలిపారు. అయితే దృరదృష్టవశాత్తు దీనిని మనం ఉపయోగించుకోవడం లేదన్నారు. దేశంలో వ్యర్థాన్ని సంపదగా మార్చే ఇటువంటి ఆలోచనను అందరూ అంగీరిస్తారని ఆయన చెప్పారు. పైలెట్ ప్రాజెక్ట్ యూరిన్ నుంచి యూరియా రూపొందించే కార్యక్రం మొదటగా మహరాష్ట్రలోని నాగ్‌పూర్ దగ్గరున్నధాఫ్‌వడ ప్రాంతంఓ ఏర్పటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులు, ప్రజలు, స్థానికులు ఎవరైనా.. 10 లీటర్ల యూరిన్‌ను బ్యాంక్‌కు అందిస్తే.. లీటర్‌కు రూపాయి చొప్పున 10 రూపాయలు కూడా వారికి అందిస్తామని ఆయన తెలిపారు. -
తరచూ జ్వరం.. మూత్ర విసర్జనలో మంట!
నా వయసు 38 ఏళ్లు. తరచుగా జ్వరం. మూత్రవిసర్జన సమయంలో చాలా మంటగా ఉంటోంది. ఇలా మాటిమాటికీ జ్వరం, మూత్రంలో మంట రాకుండా ఉండేందుకు తగిన సలహా ఇవ్వండి. – సుభద్ర, ఖమ్మం మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్’తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా మీకు మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తున్న కారణం ఏమిటన్నది తెలుసుకోవాలి. మీకు షుగర్ ఉంటే కూడా ఇలా మాటిమాటికీ యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఒకసారి మీరు షుగర్ టెస్ట్ చేయించుకోండి. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లుగానీ, మూత్రనాళాల్లో వాపుగానీ ఉన్నాయేమో చూడాలి. మీకు డాక్టర్ ఇచ్చిన యాంటీబయాటిక్ పూర్తి కోర్సు వాడకుండా ఉన్నా కూడా మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్స్ తిరగబెట్టవచ్చు. మీకు ఏ కారణం లేకుండా ఇన్ఫెక్షన్ వస్తుంటే కనీసం మూడు నెలల పాటు యాంటీబయాటిక్స్ వాడాలి. రోజూ నీళ్లు ఎక్కువగా (అంటే రెండు నుంచి మూడు లీటర్లు) తాగాలి. మూత్రం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోకుండా, వెంటనే మూత్రవిసర్జనకు వెళ్లాలి. ఈ వయసునుంచే బీపీ మందులు వాడాల్సిందేనా? నా వయసు 27 ఏళ్లు. నాకు ఏ విధమైన ఆరోగ్య సమస్యలూ లేవు. అయితే జ్వరం వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్‌కు చూపించుకుంటే బీపీ 170 / 120 ఉన్నట్లు తెలిసింది. ఇంత చిన్న వయసు నుంచే బీపీ మందులు వాడాల్సిందేనా? దయచేసి సలహా ఇవ్వండి.– సుకుమార్, చౌటుప్పల్ ఇంత చిన్న వయసులో ఏ కారణం లేకుండా మీరు చెప్పిన బీపీ రీడింగ్స్ రావడం చాలా అరుదు. ముఫ్ఫై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ సమస్య ఏమైనా ఉందేమోనని చూడాలి. మీరు ముందుగా యూరిన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్, క్రియాటినిన్‌తో పాటు కొన్ని ఇతర పరీక్షలు చేయించుకోండి. ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ నియంత్రణలో ఉండటానికి మందులు వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంది. మందులు వాడటమే కాకుండా, ఆహారంలో ఉప్పు చాలా తగ్గించడం వంటి జీవనశైలికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. రోజూ క్రమం తప్పకుండా ఒక గంటకు తగ్గకుండా వాకింగ్ చేయాలి. మీరు ఉండాల్సిన దానికంటే బరువు ఎక్కువగా ఉన్నట్లయితే, దాన్ని నియంత్రించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తప్పనిసరిగా మానేయండి. బాబు కళ్లు, కాళ్లు వాచినట్లుగా ఉంటున్నాయి... మా అబ్బాయికి ఆరేళ్లు. పొద్దున్నే లేచినప్పుడు కళ్ల మీద రెప్పలు ఉబ్బి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కాళ్లలో కూడా వాపు కనిపిస్తోంది. యూరిన్ టెస్ట్‌లో ప్రోటీన్ 3 ప్లస్ ఉందని చెప్పారు. ఈ సమస్య ఏమిటి? దీని విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి?– నవీన్‌కుమార్, చిత్తూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు నెఫ్రొటిక్ సిండ్రోమ్ అనే వ్యాధి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారికి మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా పోతుంటాయి. మొదటగా ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. మీరు ఒకసారి మీ బాబుకు 24 గంటల్లో మూత్రంలో ఎంత ప్రోటీన్ పోతుందో తెలుసుకునే పరీక్ష చేయించండి. దానితో పాటు ఆల్బుమిన్ కొలెస్ట్రాల్ పరీక్ష కూడా చేయించండి. నెఫ్రోటిక్ సిండ్రోమ్‌లో సీరమ్ ఆల్బుమిన్ తక్కువగా ఉండి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఇది చిన్న పిల్లల్లో చాలా సాధారణంగా వచ్చే సమస్య. మొదటిసారి వచ్చినప్పుడు మూడు నెలల పాటు స్టెరాయిడ్స్ వాడాలి. అవి వాడే ముందు మీ బాబుకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేవని నిర్ధారణ చేసుకోవాలి. ఈ వ్యాధి పదిహేనేళ్ల వయసు వరకు మళ్లీ మళ్లీ వస్తుంటుంది. అయితే మొదటిసారే పూర్తి చికిత్స చేయించుకుంటే మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ. ఈ పేషెంట్స్ ఉప్పు, కొవ్వు పదార్థాలు తగ్గించి వాడాలి. ఇన్ఫెక్షన్ వస్తే వ్యాధి తిరగబెట్టవచ్చు. అలాంటప్పుడు మొదట ఇన్ఫెక్షన్ నియంత్రించుకోవాలి. మూత్రంలోఎరుపు కనిపిస్తోంది! నాకు 37 ఏళ్లు. అప్పుడప్పుడూ మూత్రం ఎర్రగా వస్తోంది. గత ఐదేళ్ల నుంచి ఇలా జరుగుతోంది. రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోతోంది. నొప్పి ఏమీ లేదు. ఇలా రావడం వల్ల భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తుందా? కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందా? – రవిప్రసాద్, ఎచ్చర్ల మీరు చెప్పినట్లుగా మూత్రంలో రక్తం చాలాసార్లు పోతుంటే... ఎందువల్ల ఇలా జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. దానికి తగినట్లుగా చికిత్స తీసుకోవాలి. ఇలా మాటిమాటికీ మూత్రంలో రక్తస్రావం అవుతుండటానికి కిడ్నీలో రాళ్లు ఉండటం, ఇన్ఫెక్షన్ ఉండటం, కిడ్నీ సమస్య లేదా మరేదైనా కిడ్నీ సమస్య (గ్లోమెరూలో నెఫ్రైటిస్ వంటిది) ఉండవచ్చు. మీరు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోండి. మూత్రపరీ„ý కూడా చేయించుకోవాలి. కిడ్నీలో రాళ్లుగానీ, ఇన్ఫెక్షన్ గానీ లేకుండా ఇలా రక్తం వస్తుంటే మూత్రంలో ప్రోటీన్ పోతుందేమోనని కూడా చూడాలి. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఒకవేళ రక్తంతో పాటు ప్రోటీన్ కూడా పోతుంటే కిడ్నీ బయాప్సీ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలు దెబ్బతినకుండా ఉండేందుకు మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్,హైదరాబాద్ -
గౌట్ సమస్య తగ్గుతుందా?
నా వయసు 46 ఏళ్లు. కొద్దిరోజులుగా కాలి బొటనవేలు వాచి, సలపరంతో కూడిన నొప్పి వస్తోంది. కాలిలో చిన్నపాటి కదలిక కూడా కష్టంగా అనిపించింది. వైద్యుడిని సంప్రదిస్తే గౌట్ అని చెప్పారు. మందులు వాడినప్పటికీ సమస్య తగ్గలేదు. రక్తపరీక్ష చేయిస్తే రక్తంలో ఇంకా ‘యూరిక్ యాసిడ్’ స్థాయులు అధికంగానే ఉన్నాయని రిపోర్టు వచ్చింది. దయచేసి నా సమస్యకు హోమియో చికిత్స ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉదా? - ఎమ్. జీవన్‌రెడ్డి, హైదరాబాద్ మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందువల్ల గౌట్ వ్యాధి వస్తుంది. ఇది ఒక రకం కీళ్లవ్యాధి. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఇదే ‘గౌట్’ వ్యాధి. కారణాలు: ∙సాధారణంగా రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది ∙ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు కొన్ని కిడ్నీ సంబంధిత వ్యాధుల వల్ల యూరిక్ యాసిడ్ విసర్జన లోపాలు ఏర్పడి గౌట్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. లక్షణాలు: ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది ∙ఈ సమస్యకు సరైన చికిత్స తీసుకోకపోతే కీళ్లు దెబ్బతింటాయి. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. నివారణ / జాగ్రత్తలు: మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స: హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
ఉదయం వేళ మడమ నొప్పి!
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 35 ఏళ్లు. నా బరువు 75 కేజీలు. ఆర్నెల్ల నుంచి ఉదయం లేవగానే మడమలో విపరీతమైన నొప్పి కారణంగా నడవలేకపోతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే బరువు తగ్గాలని అన్నారు. ఎక్స్–రే తీసి, ఎముక పెరిగిందని అన్నారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? – మాలతి, హైదరాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ప్లాంటార్ ఫేషిౖయెటిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది మడమ సమస్య. మన కాళ్లలో ప్లాంటార్ ఫేషియా అనే కణజాలం ఉంటుంది. అడుగులు వేసే సమయంలో ఇది కుషన్‌లా పనిచేసి, అరికాలిని షాక్ నుంచి రక్షిస్తుంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ సాగే గుణాన్ని కోల్పోయి, గట్టిగా మారుతుంది. ఇది పలచబారడం వల్ల గాయాలను తట్టుకునే శక్తి కోల్పోతుంది. దాంతో ప్లాంటార్ ఫేషియా చిన్న చిన్న దెబ్బలకూ డ్యామేజ్ అవుతుంది. దాంతో మడమ నొప్పి, వాపు వస్తాయి. ఈ నొప్పి అరికాలు కింది భాగంలో ఉంటుంది. మడమలో మేకులతో గుచ్చినట్లు, కత్తులతో పొడిచినట్లుగా ఉంటుంది. ఉదయం పూట మొట్టమొదటిసారి నిల్చున్నప్పుడు మడమలో ఇలా నొప్పి రావడాన్ని ప్లాంటార్ ఫేషిౖయెటిస్ అంటారు. ఇది అరుదైన సమస్య కాదు. ప్రతి పదిమందిలో ఒకరు దీనితో బాధపడుతుంటారు. కారణాలు : ∙ఊబకాయం / బరువు ఎక్కువగా ఉండటం ఎక్కువసేపు నిలబడటం, పనిచేస్తూ ఉండటం ∙చాలా తక్కువ వ్యవధిలో చాలా ఎక్కువ చురుకుగా పనిచేయడం ∙ హైహీల్స్ చెప్పులు వాడటం (మహిళల్లో వచ్చే నొప్పికి ఇది ముఖ్యకారణం). లక్షణాలు : ∙మడమలో నొప్పి అధికంగా వస్తుంది ∙మడమలో పొడిచినట్లుగా నొప్పి ఉంటుంది ∙కండరాల నొప్పులు వ్యాధి నిర్ధారణ : అల్ట్రాసౌండ్ స్కానింగ్ చికిత్స : హోమియో విధానంలో ప్లాంటార్ ఫేషిౖయెటిస్కి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి లక్షణాలను విశ్లేషించి, తగిన మందులను వైద్యులు సూచిస్తారు. మడమనొప్పికి హోమియోలో రస్టాక్, పల్సటిల్లా, బ్రయోనియా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని వైద్యనిపుణుల పర్యవేక్షణలో వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. మీరు వెంటనే అనుభవజ్ఞులైన హోమియో వైద్య నిపుణుడిని సంప్రదించండి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ఫిషర్ తగ్గుతుందా? నా వయసు 63 ఏళ్లు. మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పారు. ఆపరేషన్ అవసరమన్నారు. ఆపరేషన్ లేకుండా హోమియోలో దీనికి చికిత్స ఉందా? – హనుమంతరావు, కాకినాడ మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం కారణంగా మలవిసర్జన సాఫీగా జరగదు. అప్పుడు విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు వస్తాయి. ఈ పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగవచ్చు. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువ. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు : ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు : తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన తర్వాత మరో రెండు గంటల పాటు మలద్వారం దగ్గర నొప్పి, మంట. వ్యాధి నిర్ధారణ : సీబీపీ, ఈఎస్ఆర్, ఎమ్మారై, సీటీస్కాన్ చికిత్స : ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. ఏ సైడ్ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స చేయడం హోమియో విధానం ప్రత్యేకత. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది. డాక్టర్ టి. కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ మాటిమాటికీ యూరినరీ ఇన్ఫెక్షన్... మళ్లీ రాకుండా ఉంటుందా? నా వయసు 28 ఏళ్లు. బరువు నార్మల్‌గానే ఉన్నాను.కానీ ఈ మధ్య వెంటవెంటనే మూత్రం వచ్చినట్లుగా అనిపించడంతో పాటు మంటగా ఉంటోంది. డాక్టర్ని సంప్రదిస్తే యూరినరీ ఇన్ఫెక్షన్ అన్నారు. ఇది మళ్లీ రాకుండా తగ్గుతుందా?– ఒక సోదరి, ఖమ్మం మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడతారు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అప్పర్ యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్స్ : ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్ను యురెథ్రయిటిస్ అంటారు. కారణాలు : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించని వారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. లక్షణాలు : మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంట ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం చికిత్స : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. వ్యా«ధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి హోమియో మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
పబ్లిక్‌గా మూత్రవిసర్జన..ఏంటని ప్రశ్నించినందుకు
నోయిడా : స్వచ్ఛ భారత్ నినాదంతో ఓ వైపు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంటే.. బహిరంగ మూత్ర విసర్జన చేయడమే కాకుండా అడ్డుకున్న వారిపై దాడులు పెరిగిపోతున్నాయి. పబ్లిక్‌గా అందరిముందే మూత్రవిసర్జన ఏంటని ప్రశ్నించినందుకు ఓ న్యాయవాదిపై దాడి చేయడమే కాకుండా, మద్యం మత్తులో అతని ఇంటికి కూడా వెళ్లి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో సెక్టర్ 49లో చోటుచేసుకుంది. మద్యం మత్తులో అందరూ చూస్తుండగానే మూత్రవిసర్జన చేస్తున్న వ్యక్తిని 32 ఏళ్ల న్యాయవాది గౌరవ్ వసోయా అడ్డుకున్నారు. అయితే ఆ సమయంలో మూత్రవిసర్జన చేసిన వ్యక్తితో పాటూ మరో నలుగురు కూడా అక్కడే ఉన్నారు. వీరందరూ కలిసి ఒక్కసారిగా గౌరవ్‌పై దాడికి దిగారు. దీంతో వారి నుంచి తప్పించుకొని వెళ్లినా, గౌరవ్‌ను వెంబడించి అతని ఇంటివరకు వెళ్లారు. వారందరూ తమ ఇంటి ఆవరణను మొత్తం నాశనం చేశారని గౌరవ్ తండ్రి కుషాల్‌పాల్ సింగ్ తెలిపారు. పీకల్లోతు వరకు మద్యం సేవించిన వారందరూ ఓ కార్లో వచ్చారని సింగ్ పోలీసులకు చెప్పారు. రాళ్లతో కొడుతూ ఇంట్లోని కూర్చితో గౌరవ్‌పై దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. -
అడ్డంగా బుక్కయిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ : స్వచ్ఛ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి చేస్తుంటే సొంత పార్టీ నుంచే ఆయనకు మద్దతు కరువైందనిపిస్తోంది. ఏకంగా ఆయన మంత్రి వర్గంలోని సభ్యుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ బహిరంగ మూత్ర విసర్జన చేసి అడ్డంగా బుక్ అయ్యారు. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కారు ఆపి సెక్యురిటీ గార్డుల సంరక్షణలో మూత్రవిసర్జన చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఇటీవలే బీజేపీ ఎంపీ ప్రియాంకా రావత్ సరయూ నదిలో ప్లాస్టిక్ బాటిల్ విసిరేసిన వీడియో బయటకు రావడంతో వివాదం రేగిన విషయం తెలిసిందే. ఓ వైపు స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నిస్తుంటే, సాక్షాత్తూ మంత్రులు, ఎంపీలే దీనికి విరుద్దంగా వ్యవహరిస్తుండటంతో నెటిజన్లు మండిపడుతున్నారు. -
యూరిక్ యాసిడ్ పెరిగితే...
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 49 ఏళ్లు. కొద్దిరోజుల క్రితం ఉన్నట్టుండి కాలి బొటనవేలు వాచిపోయి, విపరీతమైన సలపరంతో కూడిన నొప్పి వచ్చింది. కాలిలో చిన్నపాటి కదలిక కూడా ఎంతో కష్టంగా అనిపించింది. వైద్యుడిని సంప్రదిస్తే గౌట్ అని చెప్పారు. మందులు వాడినప్పటికీ పూర్తిగా తగ్గలేదు. రక్తంలో ‘యూరిక్ యాసిడ్’ స్థాయులు అధికంగానే ఉన్నాయని రిపోర్టు వచ్చింది. నాకు పరిష్కారం లభించే అవకాశం ఉదా? – సత్యనారాయణ, భీమవరం మన శరీరంలో యధావిధిగా జరిగే ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందువల్ల గౌట్ వ్యాధి వస్తుంది. ఇది ఒక రకం కీళ్లవ్యాధి. ఈ వ్యాధి నుంచి బయటపడటానికి ఆహారంలో మార్పులు, వ్యాయామాలు చేసినప్పటికీ రక్తంలోని యూరిక్ యాసిడ్ పాళ్లు సాధారణ స్థితికి చేరుకోకపోతే... వ్యాధి మళ్లీ మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంది. మనం తీసుకునే ఆహారంలోని ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుకుంటుంది. ఇలా చేరిన యూరిక్ యాసిడ్ స్ఫటికాలుగా కీళ్లలోనూ, కీళ్ల చుట్టూ ఉండే కణజాలంలో చేరుతుంది. అప్పుడు కీలు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితే ‘గౌట్’. కారణాలు : ∙రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా, విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్‌కు దారితీస్తుంది. ∙ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (మాంసం, గుడ్లు, చేపలు) ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం. ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. ∙కొన్ని కిడ్నీ వ్యాధుల వల్ల కూడా గౌట్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. నివారణ / జాగ్రత్తలు : ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే లివర్, కిడ్నీ, ఎముక మూలుగు, పేగులను తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగులు తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానాలి. చికిత్స : హోమియో వైద్యవిధానంలో అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
యూరిన్ బాటిల్స్‌తో రైతుల ఆందోళన
న్యూఢిల్లీ: దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతుల ఆందోళన కొనసాగుతోంది. రుణమాఫీ, కరువు సాయం చేయాలంటూ రోజుకో రూపంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్న రైతులు శనివారం మరోసారి వినూత్నంగా నిరసన తెలిపారు. సమస్యను ఎంత తీవ్రంగా తెలుపుతూ, ఇప్పటికైనా తమను ఆదుకోవాలని.. ‘తమ మూత్రం తామే తాగుతామంటూ’ యూరిన్ బాటిల్ ముందు పెట్టుకుని తమ ఆందోళన ఉధృతం చేశారు. కరువు నిధులను విడుదల చేయాలని, కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో తమిళనాడుకు చెందిన రైతుల బృందం మార్చి 14 నుంచి ఢిల్లీలో నిరసన ప్రదర్శనలను చేస్తోన్న విషయం తెలిసిందే. తమిళనాడులోని రైతులు కరవు కోరల్లో చిక్కుకున్నారని, సాగునీరు లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ తమని ఆదుకోండి మహాప్రభో అని దీనంగా వేడుకుంటున్నారు. గతంలో రైతులు నగ్నంగా ఆందోళనలు, కపాలాల మాలలు మెడలో ధరించినా, ఎలుకలు, చనిపోయిన పాములను నోట కరిచినా, చీరలు కట్టుకుని నిరసన తెలిపినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. కాగా రైతుల ఆందోళన నేపథ్యంలోనే కరువు, తుపాను సాయం కింద తమిళనాడుకు కేంద్రం రూ.2వేల కోట్ల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సాయం తమకు సరిపోదంటూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. -
ఆ ఇన్ఫెక్షన్లు ఈ సీజన్లోనే ఎందుకు ఎక్కువ?
విమెన్ కౌన్సెలింగ్ వేసవిలో నేను తరచూ మూత్రంలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్)కు గురవుతుంటాను. ఎండాకాలంలో ఎందుకీ సమస్య మాటిమాటికీ తిరగబెడుతుంది? కారణాలు వివరించండి. – మాలతి, వర్ధమాన్‌కోట మన మూత్ర వ్యవస్థలో రెండు కిడ్నీలుంటాయి. వాటి నుంచి మూత్రకోశానికి (బ్లాడర్) రెండు నాళాలు వెళ్తాయి. వాటిని యురేటర్స్ అంటారు. బ్లాడర్ నుంచి మరో నాళం (ఇదే మూత్ర నాళం) ద్వారా మూత్రవిసర్జన జరుగుతుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తే... మాటిమాటికీ మూత్రానికి వెళ్లాలనిపించడం, మూత్ర విసర్జన సమయంలో మంట, పొత్తికడుపులో నొప్పి, కాస్తంత మబ్బు రంగులో, ఒక్కోసారి ఎర్రగా, కొంత దుర్వాసనతో మూత్రం వస్తుంది. చాలా సందర్భాల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు ఈ–కొలై అనే పరాన్న జీవి కారణమవుతుంది. సాధారణంగా ఇది ఆహారనాళంలో ఉంటుంది. అయితే అవి మూత్ర విసర్జన వ్యవస్థలోకి కూడా ప్రవేశించవచ్చు. అలాగే క్లెబిసియెల్లా, ఎంటరోకోకస్ ఫీకాలిస్ అనే సూక్ష్మజీవులు యాంటీబయాటిక్స్‌కు లొంగకుండా మొండిగా మారుతున్నాయి. పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రవిసర్జక నాళం పొడవు తక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు సోకగల ప్రదేశాల పైన మలవిసర్జన నాళం వంటి ప్రదేశాలకు దగ్గరగా ఉంటాయి. తక్కువ ప్రదేశంలో ఎక్కువ పరిమాణంలో బ్యాక్టీరియా పెరిగేందుకు అవకాశం ఉండటంతో మహిళల్లో తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. మహిళల్లో సహజంగా ఉండే సిగ్గు, బిడియం ఎక్కువ. కాబట్టి ఇటువంటి కారణాలున్నప్పటికీ వైద్యం కోసం హాస్పిటల్స్‌కు వచ్చే వాళ్లు చాలా తక్కువ. సమస్య తీవ్రమైనప్పుడే వారు ఆసుపత్రులకు వస్తుంటారు. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. గుర్తించిన వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స చేయించుకోవాలి, లేకపోతే కిడ్నీల వంటి కీలకమైన అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. డాక్టర్ ఊర్మిళ ఆనంద్ సీనియర్ నెఫ్రాలజిస్ట్, యశోద హస్పిటల్స్, సికింద్రాబాద్ ఆకర్షణీయమైన రంగుల ఆహారం తీసుకోవచ్చా? పీడియాట్రిక్ కౌన్సెలింగ్ వేసవి సెలవుల్లో ఊళ్లకు, బయటి ప్రదేశాలకు, విహార యాత్రలకు వెళ్తుంటాం కదా? అక్కడ ఆకర్షణీయమైన రంగులతో ఉండే ఆహారాలకు పిల్లలు తేలిగ్గా ఎట్రాక్ట్ అవుతుంటారు. ఆ ఆహారం వారికి ఇవ్వవచ్చా? – శ్రద్ధ శ్రీ, బళ్లారి ఆహారపదార్థాల్లో కృత్రిమ రంగులు, నిల్వ ఉంచేందుకు వాడే ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం వారి ఆరోగ్యానికి, వికాసానికి, పెరుగుదలకు కీడు చేస్తుంది. కొన్ని కృత్రిమ రంగులు అసలే మంచిది కాదు. ఎందుకంటే వాటిని బయటకు పంపేందుకు మూత్రపిండాలు అతిగా శ్రమించాల్సి ఉంటుంది. ఫలితంగా వాటి దుష్ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. ఇక ఆహారం ఆకర్షణీయంగా ఉండటంతో పాటు దీర్ఘకాలం నిల్వ ఉండటానికి వాడే ప్రిజర్వేటివ్స్... సన్‌సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్‌క్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్, క్వినోలిన్ ఎల్లో, అల్యూరా రెడ్ వంటి రసాయనాలతో పిల్లల్లో అతి ధోరణలు (హైపర్యాక్టివ్) పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. సోడియం బెంజోయేట్ వంటి రసాయనాలు విటమిన్ ’సి’తో కలిసినప్పుడు అది క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ రసాయనం లివర్ సిర్రోసిస్‌కు, పార్కిన్సన్ డిసీజ్లాంటి వాటికి దారితీస్తుందని కూడా వెల్లడయింది. అందుకే రంగులు ఉండే ఆహారం తీసుకునే విషయంలో పిల్లలను ప్రోత్సహించకూడదు. దీనికి బదులు స్వాభావిక ఆహారాలు, పానీయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్ రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ మునుపటి చురుకుదనం సాధించడం ఎలా..? లైఫ్‌స్టయిల్ కౌన్సెలింగ్ నా వయసు 57 ఏళ్లు. గతంలో చాలా ఆరోగ్యంగా ఉండేవాడిని. ఇటీవల నా ఫిట్నెస్ తగ్గినట్లు అనిపిస్తోంది. మెట్లు ఎక్కే సమయంలో మునుపటిలా చురుగ్గా లేకపోవడం వల్ల నాకు ఈ ఫీలింగ్ వస్తోంది. నేను మునుపటిలాగే ఆరోగ్యాన్నే పొందడానికి ఏం చేయాలో సలహా ఇవ్వండి. ఇక ఇటీవల సమ్మర్లో మరింత అలసట ఫీలవుతున్నాను. – బి. వెంకటేశ్వరరావు, గుంటూరు వయసు పెరుగుతున్న సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ప్రధానమైన అంశం. మీ వయసు వారిలో డయాబెటిస్ లేదా హైబీపీ లాంటి వ్యాధి లక్షణాలు ఏవైనా ఉంటే, వాటికి తగిన చికిత్స పొందడం, మంచి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అంశాలు ఎంతగానో దోహదపడతాయి. వీటన్నింటిలోనూ వ్యాయామం చాలా ముఖ్యం. మీరు ఏ వయసువారైనప్పటికీ వ్యాయామంతో తగిన ప్రయోజనం పొందవచ్చు. దీనివల్ల గుండెజబ్బులు, మతిమరపు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, అధికరక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యలను నివారించుకోవచ్చు. ఎముకల సాంద్రత తగ్గడం కూడ నివారితమవుతుంది. దాని వల్ల వయసు పైబడ్డవారు పడిపోయే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ పడిపోయినప్పుడు ఎముకల విరిగే అవకాశమూ తగ్గుతుంది. పైగా వ్యాయామం చేసేవారిలో ఎండార్ఫిన్ వంటి జీవరసాయనాలు ఎక్కువగా స్రవించి ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు అవి దిగులుగా ఉండటం, యాంగై్జటీ, డిప్రెషన్‌ను కూడా రాకుండా నివారిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. అయితే కాస్త వయసుపైబడ్డవారు వ్యాయామాన్ని ప్రారంభించే ముందుగా డాక్టర్ నుంచి తగిన సలహా పొందాలి. వారి వ్యక్తిగత రుగ్మతలకూ, జీవనశైలికి తగిన వ్యాయామ విధానాల గురించి డాక్టర్ నుంచి సూచనలు పొందాలి. ఉదాహరణకు డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు తాము తీసుకుంటున్న మందులు, ఆహారానికి తగినట్లుగా తమ వ్యాయామ పద్ధతులు, వేళల గురించి డాక్టర్ నుంచి సలహా పొందడం అవసరం. పైగా వ్యాయామాన్ని కొత్తగా మొదలుపెట్టేవారు భారమైన పెద్దపెద్ద వ్యాయామాలను ఒకేసారి ప్రారంభించకూడదు. వ్యవధినీ, శరీరం మీద పడే భారాన్ని మెల్లమెల్లగా పెంచాలి. రోజులో రెండుసార్లు వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం వల్ల అయ్యే గాయాలను నివారించడానికి ఎక్సర్సైజ్కు ముందుగా వార్మింగ్ అప్, తర్వాత కూలింగ్ డౌన్ వ్యాయామాలు చేయడం మేలు. వ్యాయామం మనల్ని మరింత చురుగ్గా ఉండేలా చేయాలి. అంతేతప్ప నిస్సత్తువను పెంచకూడదు. వేసవిలో మరింత నిస్సత్తువతోనూ, నీరసంగా ఉండటం జరుగుతోందంటే బహుశా మీరు నీటిని, ఉప్పును ఎక్కువగా చెమట రూపంలో కోల్పోవడం వల్ల కావచ్చు. వేసవిలో ఎక్సర్సైజ్ చేయవచ్చు. కానీ అవి ఎక్కువ శ్రమ కలిగించేలా కాకుండా బాగా తేలికపాటివే అయి ఉండాలి. ఈ సీజన్లో డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా చూసుకోండి. వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పులు పెరిగినా, ఒంట్లో ఎక్కడైనా ఎర్రబారినా, శ్వాస అందకపోయినా, చెమటలు ఎక్కువగా పట్టినా, ఇతరత్రా ఇబ్బందులు ఎదురైనా వెంటనే వ్యాయామం ఆపేయాలి. వెంటనే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్సనూ, సలహాలు, సూచనలను పొందాలి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్ లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
కీళ్ళనొప్పి ఎందుకు వస్తుంది?
అవగాహన దేహంలో కీళ్ళ మధ్య ఒత్తిడిని తగ్గించి మృదువైన కదలికలకు తోడ్పడే కార్టిలేజ్ (దేహంలో కీళ్ళు ఉన్నచోట ఉండే రక్షిత కణజాలం) క్షీణించడం మొదలైనప్పుడు వస్తుండే నొప్పినే ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అంటారు. నొప్పితో పాటు కొందరిలో వాపు కూడా ఉంటుంది. ఇది తీవ్రస్ధాయికి చేరినప్పుడు అడుగుతీసి అడుగు వేయడం, చేతులు కదిలించడం కష్టమవుతుంది. దేహంలో కార్టిలేజ్ దెబ్బతిన్న ప్రదేశాన్ని బట్టి బాధ తీవ్రత ఉంటుంది. ఆర్థరైటిస్ వచ్చేందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా జన్యుపరమైన అవసవ్యతల వల్ల ఇలా జరుగుతుంటుందని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆర్థోపీడిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ శిశిర్ రస్తోగీ అంటున్నారు. గంటల తరబడి కుర్చీలోంచి కదలకుండా పని చేయడం, స్థూలకాయం, వ్యాయామానికి తావు లేని జీవన శైలి, పౌష్ఠికాహార లోపం... ఆర్థరైటిస్‌కు ఇతరత్రా కారణాలు. కొన్ని సార్లు ఆర్థరైటిస్‌ను ఆస్టియో ఆర్థరైటిస్‌గా పొరబడుతుంటారు. అవగా హన లోపం వల్ల ఇలా జరుగుతుంటుంది. ఇవి రెండూ రెండు రకాల సమస్యలు. ఎముకలు డొల్ల బారడం... ఆస్టియోపోరోసిస్. కీళ్ళ నొప్పులు... ఆస్టియో ఆర్థరైటిస్. మనదేశంలో రెండూ ఎక్కువే. ప్రైమరీ, సెకండరీ అని ఆర్థరైటిస్‌లో రెండు రకాలు ఉన్నాయి. వృద్ధాప్యంలో వచ్చే కీళ్ళ నొప్పులు ప్రైమరీ. ఏదైనా వ్యాధి కారణంగా, గాయం వల్లా వచ్చే ఆర్థరైటిస్.... సెకండరీ. ‘‘ఆర్థరైటిస్‌ను నివారించేందుకు ఉన్న అత్యుత్తమ మైన మార్గం వ్యాయామం. క్రమబద్ధంగా, సవ్యంగా వ్యాయామం చేస్తుండాలి. బైఠాయించి నట్లు కూర్చుండిపోవడం, కాళ్ళుకత్తెరలా పెట్టి కూర్చోవడం మంచిది కాదు. అలాగే ఎప్పటి కప్పుడు బరువు చూసుకుంటుండాలి. బరువు పెరిగితే కీళ్ళు ఒత్తిడికిలోనై కార్టిలేజ్ బలహీన పడే ప్రమాదం ఉంది. ఒంట్లో యూరిక్ ఆసిడ్ నిల్వలు ఎక్కువైనప్పుడు కూడా ఆర్థరైటిస్ రావచ్చు’’ అని సర్ గంగారామ్ హాస్పిటల్ కన్సల్టెంట్ ఆర్థోపీడిక్ సర్జన్ డాక్టర్ నవీన్ తల్వార్ అంటున్నారు. -
ఆ ‘రాళ్ల దెబ్బల’ నుంచి రక్షించుకోండి!
అందరికీ ఆరోగ్యాన్నిచ్చేవే అయినా కొందరికి అవి కాస్త ప్రతికూలంగా పనిచేస్తాయి. అలా పాలు, పాలకూర వంటివి కొందరికి కిడ్నీలో రాళ్లను ఏర్పరచుతాయి. అలాగే పైన పల్చటి పొర ఉండే టమాటా కాస్తా... టెంకాయి పైన టెంకలాంటి రాయిని కిడ్నీలో ఏర్పరుస్తుంది. ఇలా కిడ్నీలకు వచ్చే మరో ప్రమాదం రాళ్ల రూపంలో ఉంటుందన్నమాట. వాటి వల్ల కూడా దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ రాళ్ల దెబ్బలనుంచి కిడ్నీలను కాపాడుకోవాలంటే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు. అదే చేస్తుంది ఎంతో మేలు. పెద్ద ప్రమాదాన్నే నివారించే ఆ చిరు జాగ్రత్తలివే... (చదవండి: అర్థంచేసుకోకపోతే.. కిడ్నీ ఒక పెద్ద పజిల్) ►రోజుకు తప్పని సరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల యూరిన్‌ను విసర్జించాల్సి ఉంటుంది కాబట్టి శరీర కణాల నిర్వహణకు పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. ►ఆగ్సలేట్ ఎక్కువగా ఉండే గింజలు, సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి. ► క్యాల్షియం సప్లిమెంట్లనూ తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అలాగే క్యాల్షియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది కాబట్టి వైద్యుల çసూచనల మేరకు ఆహార నియమాలను పాటించాలి. ►ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్, క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువ. ► ఆరెంజ్ జ్యూస్‌కు క్యాల్షియం ఆక్సలేట్‌ను రాయిగా మారకుండా నిరోధించే లక్షణం ఉంది. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ మంచిదే. అయితే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం కూడా కిడ్నీస్టోన్ సమస్యకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి పుల్లటి పండ్లతో చేసిన జ్యూస్‌లను ఎక్కువగా తీసుకోకూడదు. ►కూల్‌డ్రింకులను అస్సలు తాగకూడదు. కిడ్నీకి గండం... మందులూ, మద్యం మూత్రపిండాల ఆరోగ్యానికి గండంగా పరిణమించేవి మామూలుగా మనం వాడే మందులు, కొందరు అలవాటుగా తీసుకునే మద్యం. మీరు చాలసార్లు వినే ఉంటారు... చీప్‌లిక్కర్ కిడ్నీలను కొట్టేస్తుందని. సాధారణంగా ఒంటిని శుభ్రపరచడం అన్నది కిడ్నీల పని కదా. చీప్లిక్కర్లో మత్తును సమకూర్చడానికి వేసే వివిధ రకాల రసాయనాలను రక్తం నుంచి తొలగించడానికి కిడ్నీలు తమ సామర్థ్యానికి మించి కష్టపడతాయి. అలా మలినాలనూ, కాలుష్యాలనూ తొలగిస్తూ, తొలగిస్తూ, తమ సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతాయి. దీన్నే కిడ్నీ ఫెయిల్యూర్‌గా చెబుతుంటారు. ఇదే పరిణామం మద్యం వల్ల కూడా వస్తుంది. వాస్తవానికి మద్యం అంటేనే కూడా బాటిలెత్తు కాలుష్యం. ఆ కలుషిత పదార్థాలను తొలగించే ప్రక్రియను నిరంతరాయం చేస్తూ చేస్తూ కిడ్నీలు అలసిపోతాయి. ఇక ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్‌గా మనం పేర్కొనే మందులతోనూ ఇదే అనర్థం కలుగుతుంది. ఆ మందులలోని మలినాలను తొలగించడానికి కిడ్నీలు కష్టపడతాయి. మందులలోని ఆ మాలిన్యాలను తొలగించేలోపే మళ్లీ వేసుకున్న మందులలోని మలినసంద్రం మళ్లీ మూత్రపిండాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అంతటి కష్టాన్ని ఓర్చలేక అవి కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి కండిషన్లకు దారితీస్తాయి. అలాంటప్పుడు కృత్రిమంగా మనిషి జీవించి ఉండగలిగే మేరకు మాత్రమే ఒంట్లోని కాలుష్యాలను యంత్రాల సహాయంతో తొలగించే ప్రక్రియ ‘డయాలసిస్’తో నిత్యం నరకబాధలను చూస్తూ రోజుల ప్రాతిపదికన రోగులు తమ ప్రాణాలను దక్కించుకుంటూ ఉంటారు. ఇలాంటి బాధలేమీ పడకుండా నిండా ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవితం గడపాలంటే రెండంటే రెండు కిడ్నీలను పదిలంగా చూసుకుంటే చాలు. ఆ రెండు కిడ్నీలే నిండు నూరేళ్లు! సంతోషాల క్యాలెండర్ లెక్కల్లో వెరసి వెయ్యేళ్లు!! -
గో మూత్రం క్యాన్సర్‌కు మందా?
న్యూఢిల్లీ: గో మూత్రంతో క్యాన్సర్ నయం అవుతుందా? ఈ విషయాన్ని తెలుసుకునేందుకే కేంద్ర ప్రభుత్వం గో మూత్రం పరిశోధనల కోసం ఓ కమిటీని వేయాలని నిర్ణయించింది. గో మూత్రంతో కీళ్ల నొప్పుల నుంచి క్యాన్సర్ వరకు అన్ని రోగాలు నయం అవుతాయనే అపోహ లేదా నమ్మకం భారతీయుల్లో ఉంది. అందుకనే మానవుల ఆరోగ్యం పరిపుష్టికి తాగేందుకు, నేలను శుభ్రచేయడానికి గో మూత్రంతో తయారు చేసిన ఔషధాలను పతంజలి బ్రాండ్ ప్రమోట్ చేస్తోంది. ఇండోర్‌లో నైతే ఏకంగా గో మూత్రంతో థెరపీ అంటూ ఓ ఆస్పత్రే వెలసింది. ఎంత అన్నది కచ్చితంగా తెలియదుగానీ దేశంలో ఆవు మూత్రంతో కోట్లది రూపాయల వ్యాపారం జరుగుతోంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం గోమూత్రం అమ్మకాలపై పన్నును కూడా విధించింది. క్యాన్సర్ నుంచి డెంగ్యూ జ్వరం వరకు రోగాలను నయం చేయడంలో గో మూత్రం ఏ మేరకు ప్రభావం చూపించగలదో కనుగొనేందుకు చేపట్టాల్సిన ప్రయోగాలు ఏమిటీ, వాటికి ఎంత ఖర్చవుతుందో అన్న అంశాలను తాము ఏర్పాటు చేయబోయే కమిటీ ముందుగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని, వాటిని కేంద్రంలోని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖకు పంపిస్తుందని కమిటీకి కో-ఆర్డినేటర్‌గా నియమితులైన ఢిల్లీ ఐఐటీకి చెందిన డాక్టర్ కావ్య దషోరా తెలిపారు. గోవును తల్లిగా భావించి పూజించడం, గోవునుంచి వచ్చే పాలు, పెరుగును ఆహారంగా తీసుకోవడం, యజ్ఞయాగాదులు, పూజలు, పునస్కారాల్లో ఆవు నెయ్యిని, గో మూత్రాన్ని ఉపయోగించడం హిందువుల సంస్కతి, సంప్రదాయం. గో మూత్రం వైరస్‌ను హరించి వేస్తుందన్న నమ్మకం ఉందని, అయితే కేవలం నమ్మకాలతో ముందుకు పోలేముకనుక, గో మూత్రంతో ప్రయోజనాలు ఏమిటో, రోగాలు నయం చేయడంలో దాని ప్రభావం ఏమిటో తెలుసుకునే లక్ష్యంతోనే ప్రభుత్వం కమిటీని వేస్తున్నట్లు డాక్టర్ కావ్య వివరించారు. ఈ నెలాఖరులోగా కమిటీ ఏర్పాటవుతుందని ఆమె తెలిపారు. వీరేంద్ర కుమార్ జైన్ అనే వ్యక్తి ఇండోర్‌లో గో మూత్రం థెరపి వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తమ థెరపికి ప్రజల నుంచి ఆదరణ ఎక్కువగా ఉందని, ఇప్పుడు తమ వద్ద 19 మంది డాక్టర్లు పని చేస్తున్నారని ఆయన తెలిపారు. -
స్వచ్ఛ భారత్ లక్ష్యం ఇదేనా..?
► ఏళ్లతరబడిగా మూతపడిన సులభ్‌కాంప్లెక్స్ ► బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన పెద్దపల్లి(సుల్తానాబాద్ రూరల్): ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తుండగా, సుల్తానాబాద్‌లో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొని ఉంది. స్థానిక మినీ కలెక్టరేట్ ఏర్పడిన సమయంలో సందర్శకులు, ప్రజల కోసం సులభ్‌కాంప్లెక్స్‌ను నిర్మించారు. అప్పటి ఎమ్మెల్యే గీట్ల ముకుందరరెడ్డి దూరదృష్టితో మినీ కలెక్టరేట్‌తో పాటు సులభ్‌కాంప్లెక్స్‌ను నిర్మించి 2008జూలై 14న ప్రారంభించారు. ప్రభుత్వ వాటాగా రూ.2.50లక్షలు, నిర్వహకులు రూ.2.50లక్షలతో దీనిని నిర్మించారు. అయితే సులభ్‌కాంప్లెక్స్ నిర్వహకులకు ప్రభుత్వ వాటా చెల్లింపు కాకపోవడం, అప్పట్లో ఆదరణ లేకపోవడంతో దీనిని మూసివేశారు. దాదాపు ఆరేళ్లుగా తెరువడం లేదు. ప్రస్తుతం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దీని అవసరం ఎంతో ఏర్పడింది. అనేక గ్రామాలకు, మండలాలకు కూడలి అయిన సుల్తానాబాద్‌లో ప్రజలకు తగినన్ని మూత్రశాలలు లేకుండా పోయాయి. కూరగాయల మార్కెట్ వద్ద ఒకటి మాత్రమే పనిచేస్తోంది. కాల్వశ్రీరాంపూర్ చౌరస్తాలో ఉన్న ఐబీ, ఇరిగేషన్, పాత సివిల్ ఆసుపత్రి, పాత మటన్ మార్కెట్, బస్టాండ్ స్థలాల్లో, బంజరుదొడ్డి, రోడ్డు ప్రక్కన డ్రెయినేజీల్లో బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారు. -
ఆరుబయటకే..!
రాష్ట్రంలో అధ్వానస్థితిలో ఉమ్మడి ఆదిలాబాద్ దిగువ నుంచి రెండోస్థానం నాలుగు జిల్లాల్లో సగటున 21.03 శాతం కుటుంబాలకే మరుగుదొడ్లు బహిరంగ విసర్జన లేని గ్రామాలు కేవలం 66 మంచిర్యాల : స్వచ్ఛభారత్ సంకల్పం మన ముందు చిన్నబోతోంది. పారిశుధ్యం తీరు పరిహసింపబడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేని జిల్లాల జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్ రెండోస్థానంలో ఉంది. మరుగుదొడ్లు లేక బహిరంగ మల, మూత్ర విసర్జనలతో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానం మనదే. 2012 సంవత్సరం వరకు మొత్తం కుటుంబాల్లో 10 శాతం మాత్రమే మరుగుదొడ్లతో అత్యంత దయనీయంగా ఉన్న గ్రామీణ ఆదిలాబాద్.. భారత ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి స్వచ్ఛభారత్ కార్యక్రమానికి ఇచ్చిన ప్రాధాన్యతతో కొంత మెరుగైంది. అయినా రాష్ట్రంలోని పాత పది జిల్లాల పరిధిలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేని కుటుంబాలు, గ్రామాలు అధికంగా ఉన్న జిల్లాగా ఆదిలాబాద్ నిలవడం దౌర్భగ్యం. కొత్తగా ఏర్పాటైన నాలుగు జిల్లాల సగటును లెక్కిస్తే కేవలం 21.03 శాతం కుటుంబాలకే ఈ సౌకర్యం ఉంది. ప్రోత్సాహకం పెంచినా.. మరుగుదొడ్డి అనేది కుటుంబ వ్యక్తిగత అవసరాల్లో ముఖ్యమైనది. వీటి నిర్మాణానికి ప్రభుత్వం ప్రోత్సాహకం కూడా అందిస్తోంది. గతంలో ఇచ్చే మొత్తాన్ని ఏకంగా రూ.12 వేలకు పెంచింది. ఇంత చేసినా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనునకబడే ఉంది. ఇప్పుడు నాలుగు జిల్లాలుగా విడిపోగా.. ఇకనైనా పారిశుధ్య ప్రక్రియను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత కళ్లకు కడుతోంది. మరోవైపు.. కొన్ని మండలాల్లో మరుగుదొడ్లు నిర్మించుకున్నా వినియోగించడం లేదని అధికారులు గుర్తించారు. ఈ లెక్కన కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మంచిర్యాలలో 80.91 శాతం, నిర్మల్ జిల్లాలో 79.84 శాతం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 77.44 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో 76.06 శాతం గ్రామీణులకు దొడ్లు లేవని గుర్తించారు. కాగా.. నాలుగు జిల్లాల్లో అభివృద్ధిలో మంచిర్యాల ముందు స్థానంలో ఉన్నట్లు లెక్కలు చెపుతుండగా, వ్యక్తిగత మరుగుదొడ్లు లేని గ్రామాల విషయంలో కూడా ముందే ఉండడం గమనార్హం. గోండు తెగకు చెందిన గిరిజనులు, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండే ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లు మిగతా రెండు జిల్లాల కన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయి. పొరుగు జిల్లాలు కరీంనగర్, సిరిసిల్లలో వంద శాతం ఉమ్మడి ఆదిలాబాద్‌ను ఆనుకొని ఉన్న కరీంనగర్ మరుగుదొడ్ల వినియోగంలో ముందు వరుసలో ఉంది. విభజన తరువాత ఏర్పాటైన కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లోని గ్రామాలన్నీ వంద శాతం మరుగుదొడ్లు ఉన్నవిగా గుర్తింపు పొందాయి. మంచిర్యాల పక్కన గోదావరి ఆవల ఉన్న పెద్దపల్లి జిల్లాలోని పల్లెల్లో సైతం 71.65 శాతం మరుగుదొడ్లు ఉన్నాయి. రాష్ట్రంలో మంగళవారం నాటికి 6,17, 297 గృహాల్లో మరుగుదొడ్ల నిర్మాణం జరగగా, మన నాలుగు జిల్లాలో మాత్రం ఆశించిన పురోగతి లేదు. ఇప్పటికైనా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకొని స్వచ్ఛ భారత్ మిషన్ కింద గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మిస్తే ‘అవతలికి’ పోయే బాధ ప్రజలకు తప్పుతుంది. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడినట్లవుతుంది. ఓడీఎఫ్ గ్రామాలు 66 వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు గల కుటుంబాలు నివసించే గ్రామాలను ఓడీఎఫ్ (ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ) గ్రామాలుగా చెబుతారు. రాష్ట్రంలోని 8,700 గ్రామ పంచాయతీల పరిధిలోని 10,969 గ్రామాల్లో 1,524 ఈ కేటగిరీలో చేరాయి. కానీ.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో మాత్రం 1,606 గ్రామాలకు గాను 66 గ్రామాలే ఓడీఎఫ్ స్థాయిని ప్రకటించుకున్నాయి. వీటిలో 31 గ్రామాలను స్వచ్ఛభారత్ మిషన్ తనిఖీ చేసి ఆమోదించింది. కరీంనగర్, సరిసిల్ల జిల్లాల స్థాయిలో వందశాతానికి చేరుకోవాలంటే ఎంత కాలం పడుతుందో చూడాలి. -
ఫటాఫట్
ఇది తాగండి! రోజూ ఓ పావులీటరు కాన్‌బెర్రీ జ్యూస్ తాగితే మంచిది. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళకు! దీని వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (యు.టి.ఐ) రాకుండా ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. రెండున్నర కోట్ల సార్లు! మన చేతివేళ్ళను ముడుస్తూ ఉంటాం, తెరుస్తూ ఉంటాం, వంచుతూ ఉంటాం. చాలామందికి తెలియనిది ఏమిటంటే, జీవితంలో మన చేతి వేళ్ళు ఏకంగా సుమారు రెండున్నర కోట్ల సార్లు ఇలా ముడవడం, తెరవడం జరుగుతుందట! బుర్ర పని చేయట్లేదా? ఆఫీసులో బుర్ర చురుగ్గా పనిచేయడం లేదా? అయితే, ఒక్కసారి చుట్టుపక్కల చూడండి. అది ఎందుకు అంటారా? చుట్టుపక్కల వాతావరణం, మనుషులు నిరుత్సాహంగా, విసుగు తెప్పించేలా ఉన్నా, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నా ఆ ప్రభావం మన బుర్ర పనిచేసే తీరు మీద పడుతుందట! ఆరోగ్యానికి... చాక్లెట్ ► చాక్లెట్ తింటే వచ్చే నష్టాల గురించి చాలా చెబుతుంటారు కానీ, డార్క్ చాక్లెట్ వల్ల లాభాలూ ఉన్నాయి. డార్క్ చాక్లెట్‌కు రక్తపోటును తగ్గించే సుగుణం ఉంది. అలాగే, గుండె పోటు ముప్పును కూడా తగ్గిస్తుందట. ► డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆ మాటకొస్తే, ఇతర ఆహారపదార్థాల కన్నా ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా, పొటాషియమ్, ఫాస్ఫరస్, జింక్, సెలీనియమ్ల కూడా ఇందులో పుష్కలం. ►డార్క్ చాక్లెట్ తింటే, అందులోని బయో యాక్టివ్ పదార్థాల మూలంగా చర్మం అందంగా మారుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. -
ఆన్సర్స్ రాసేటప్పుడు కళ్ళకు మసకలు!
నా వయస్సు 28 ఏళ్లు. నేను ప్రస్తుతం కొన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నాను. నాకు దృష్టిలోపం ఉంది. అద్దాలు వాడుతున్నాను. కొన్నిసార్లు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే సమయంలొ ఆన్సర్ షీట్లో ఆన్సర్స్ రాసేప్పుడు కళ్లు మసక అవుతున్నాయి. దానివల్ల అతి కష్టమ్మీద పరీక్ష రాయాల్సి వస్తోంది. డాక్టర్‌ను కలిస్తే మందులూ, చుక్కల మందూ ఇచ్చారు. అయినా ఫలితం లేదు. దయచేసి ఈ సమస్య నుంచి బయటపడే మార్గం చెప్పండి. – రఘురామ్, ఖమ్మం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు కంట్లో ఇమేజ్ ‘అకామడేటివ్ ఫెయిల్యూర్’ సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. కెమెరాలో బొమ్మ క్లియర్ అయ్యేందుకు ఫోకస్ అడ్జెస్ట్ చేసిన ప్రక్రియే కంట్లోనూ జరుగుతుంది. ఎదుటి వస్తువును చూసే ప్రక్రియలో ఈ అడ్జెస్ట్మెంట్ కంట్లో ఆటోమేటిగ్గా జరుగుతుంది. దీన్నే అకామడేషన్ అంటారు. అది సరిగా జరగనప్పుడు దాన్ని అకామడేటివ్ ఫెయిల్యూర్ అంటారు. కొందరిలో సహజంగా కంటి కండరాలు బలహీనంగా ఉండి అకామడేటివ్ ఫెయిల్యూర్ జరగవచ్చు. మరికొందరిలో టెన్షన్ పడుతున్నప్పుడు సైకో సొమాటిక్ కారణాల వల్ల ఈ అకామడేటివ్ ఫెయిల్యూర్ జరుగుతుంది. పైగా మీరు ఎగ్జామ్ సమయంలోనే ఈ సమస్య వస్తుందంటున్నారు కాబట్టి చాలావరకు అది ఎగ్జామ్ టెన్షన్ వల్లనే కావచ్చు. లేదంటే చదువుతున్న ప్రతిసారీ ఈ సమస్య రావాలి కదా. మీరు అద్దాలు వాడుతున్నానని అన్నారు. అవి సరైన పవర్‌తో (అండర్ కరక్షన్తో, ఓవర్ కరెక్షన్తో) ఉన్నాయా లేదా అన్న విషయాన్ని ఓసారి కంటి వైద్య నిపుణుడిని కలిసి పరీక్ష చేయించుకోండి. మీ వయస్సుకు రక్తపోటు, చక్కెర వ్యాధి ఉండకపోవచ్చు. అయినా ఓసారి పరీక్ష చేయించుకుని అవి లేవని నిర్ధారించుకోవడం మంచిది. థైరాయిడ్ వ్యాధి, అనీమియా (రక్తహీనత) కూడా ఉన్నాయేమో పరీక్షించుకోండి. డ్రై ఐ, ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్లను కూడా చెక్ చేయించుకోవాలి. పైవన్నీ నార్మల్‌గా ఉంటే మీకు ఎగ్జామ్ టెన్షన్ వల్లనే ఈ సమస్య వస్తోందని నిర్ధారణ చేయవచ్చు. నా వయస్సు 44 ఏళ్లు. సిగరెట్లు తాగుతాను. ఓసారి సిగరెట్ వెలిగిస్తుంటే లైటర్‌లో మంట కాస్తంత పైవరకూ వచ్చి, కంటికి సెగ తగిలిందనిపించింది. అలా జరిగినందువల్ల నా కంటికి ఏదైనా హాని జరిగే అవకాశం ఉందా? సిగరెట్ స్మోకింగ్ వల్ల కంటికి ఏదైనా ప్రమాదమా?– సుకుమార్, నల్లగొండ కార్నియా పైపొరను ఎపిథీలియమ్ అంటారు. మాటిమాటికీ పొగ, సెగ తగలడం వల్ల ఈ ఎపిథీలియమ్ దెబ్బతినడానికి అవకాశం ఉంది. ఒకవేళ అది దెబ్బతింటే కంట్లోంచి నీరు కారడం, ఎరుపెక్కడం, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలా ఎక్కువగా పొగతాగేవాళ్ల (క్రానిక్ స్మోకర్స్)లో నికోటిన్ విష పదార్థం ప్రభావంవల్ల ‘టుబాకో ఆంబ్లోపియా’ అనే సమస్య వస్తుంది. ఆంబ్లోపియా వచ్చిన వాళ్లలో కంటి నరం (ఆప్టిక్ నర్వ్) దెబ్బతిని స్పష్టమైన బొమ్మ (క్లియర్ ఇమేజ్) కనిపించకుండా కేవలం ఓ స్కెచ్లాగానో, ఫోటోగ్రాఫ్ నెగెటివ్ లాగానో (ఘోస్ట్ ఇమేజ్) కనిపిస్తుంది. దీని వల్ల వచ్చే ఇంకొక సమస్య కళ్లు పొడిబారడం... అంటే డ్రై ఐ అన్నమాట. మీరు వెంటనే సిగరెట్ మానేయండి. ఆంబ్లోపియా వచ్చినవాళ్లు వెంటనే సిగరెట్ పూర్తిగా మానేసి, వాళ్లకు విటమిన్ సప్లిమెంట్స్ (ప్రత్యేకంగా బి1, బి2, బి12, బి6) ఇస్తే పరిస్థితి మళ్ళీ సాధారణంగా మారేందుకు అవకాశం ఉంది. తరచూ... యూరినరీ ఇన్ఫెక్షన్లు నా వయసు 34 ఏళ్లు. తరచుగా జ్వరం. మూత్రవిసర్జన సమయంలో విపరీతమైన మంట కూడా ఉంటోంది. ఇలా తరచూ జ్వరం, మూత్రంలో మంట వస్తున్నాయి. ఇలా మాటిమాటికీ జ్వరం రాకుండా ఉండేందుకు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి? – సుమాలిక, దోసపహాడ్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్’తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా మీకు మాటిమాటికీ మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తున్న కారణం ఏమిటన్నది తెలుసుకోవాలి. మీకు షుగర్ ఉంటే కూడా ఇలా మాటిమాటికీ యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఒకసారి మీరు షుగర్ టెస్ట్ చేయించుకోండి. అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకొని మూత్రవిసర్జన వ్యవస్థలో ఎక్కడైనా రాళ్లుగానీ, మూత్రనాళాల్లో వాపుగానీ ఉన్నాయేమో చూడాలి. మీకు డాక్టర్ ఇచ్చిన యాంటీబయాటిక్ పూర్తి కోర్సు వాడకుండా ఉన్నా కూడా మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్స్ తిరగబెట్టవచ్చు. మీకు ఏ కారణం లేకుండా ఇన్ఫెక్షన్ వస్తుంటే కనీసం మూడు నెలల పాటు యాంటీబయాటిక్స్ వాడాలి. రోజూ నీళ్లు ఎక్కువగా (అంటే రెండు నుంచి మూడు లీటర్లు) తాగాలి. మూత్రం వచ్చినప్పుడు ఎక్కువసేపు ఆపుకోకుండా, వెంటనే మూత్రవిసర్జనకు వెళ్లాలి. మా బాబు వయసు ఎనిమిదేళ్లు. ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ముఖం, కాళ్లు వాపు వచ్చాయి. యూరిన్‌లో ప్రోటీన్స్ పోయాయనీ, నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్పి చికిత్స చేశారు. నెలరోజులు మందులు వాడిన తర్వాత యూరిన్‌లో ప్రోటీన్ పోవడం తగ్గింది. మందులు ఆపేశాము. మళ్లీ 15 రోజుల తర్వాత యూరిన్‌లో మళ్లీ ప్రోటీన్లు పోవడం ప్రారంభమైంది. మళ్లీ మందులు వాడితే ప్రోటీన్లు పోవడం తగ్గింది. ఇలా మందులు వాడినప్పుడల్లా తగ్గి, ఆపేయగానే మూత్రంలో మళ్లీ ప్రోటీన్లు పోతున్నాయి. అయితే ఎక్కువకాలం మందులు వాడితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందా అని ఆందోళనగా ఉంది. వాటివల్ల ఏవైనా సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలూ ఉన్నాయా? దయచేసి వివరించండి. – యూసఫ్, ఖమ్మం నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఉన్నప్పుడు మొదటిసారి పూర్తిగా మూడు నెలల పాటు డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడాలి. కొంతమంది పిల్లల్లో మందులు మానేయగానే మళ్లీ ప్రోటీన్ పోవడం ప్రారంభమవుతుంది. ఇలాంటి పిల్లల్లో తక్కువ మోతాదులో మందులను ఆర్నెల్ల నుంచి తొమ్మిది నెలల పాటు వాడాల్సి ఉంటుంది. కొంతమందిలో సైడ్ఎఫెక్ట్స్ కనిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు వేరే మందులు వాడాల్సి ఉంటుంది. చాలామంది పిల్లల్లో ఈ వ్యాధి 12–14 సంవత్సరాల వయసప్పుడు పూర్తిగా నయమవుతుంది. కిడ్నీలు దెబ్బతినే అవకాశం చాలా తక్కువ. మీరు ఆందోళన పడకుండా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడండి. -
తాగేసి మహిళ బ్యాగ్‌పై మూత్రం పోశాడు!
ఒడిషా నుంచి వచ్చిన ఓ వ్యాపారి తప్పతాగి.. కోల్‌కతా విమానాశ్రయంలో ఓ మహిళ బ్యాగ్‌పై మూత్రం పోయడంతో అతడిని పోలీసులు అరెస్టుచేశారు. ప్రభాకర్ దొర అనే ఈ వ్యాపారి కోల్‌కతా నుంచి చెన్నై వెళ్లేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ అతడు మోతాదుకు మించి తాగేయడంతో.. అతడిని విమానం నుంచి దింపేశారు. అతడిని సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీసుకొచ్చి, తర్వాత మరో విమానం వచ్చేవరకు ఆగాలని చెప్పారు. అప్పటిలోగా అతడి పరిస్థితి అదుపులోకి వస్తుందని ఇండిగో సిబ్బంది భావించారు. రాత్రి 11 గంటలకు చెన్నై వెళ్లడానికి చిట్ట చివరి విమానం ఉంది. దాంతో మిగిలిన ప్రయాణికులతో పాటు దొర కూడా బోర్డింగ్ ప్రాంతానికి చేరుకున్నాడు. అయితే అతడి మత్తు అప్పటికి ఇంకా దిగలేదు. దాంతో.. ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో అక్కడే ఉన్న ఓ మహిళ బ్యాగ్‌పై మూత్రవిసర్జన చేశాడు. దాంతో తీవ్రంగా ఆగ్రహించిన సదరు మహిళ ఎయిర్‌పోర్టు మేనేజర్ గదిలోకి వెళ్లి, ఫిర్యాదుచేశారు. దాంతో దొరను పోలీసులకు అప్పగించారు. రాత్రంతా జైల్లోనే ఉన్న ప్రభాకర్ దొరను తెల్లవారిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల్‌పై విడుదలయ్యాడు. -
గుండె వైఫల్యాన్ని తగ్గించేందుకు చికిత్సలివే
కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 54 ఏళ్లు. గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి నేను మూత్రం తగ్గడం, చర్మం పల్చబడటం, కండరాల పటుత్వం తగ్గడం వంటి లక్షణాలతో డాక్టర్‌ను కలిశాను. ఆయన పరీక్షలు చేసి గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గిందని, గుండె వైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్) అని చెప్పారు. గుండె వైఫల్యం చెందనడానికి కారణాలు, నిర్ధారణ, చికిత్స గురించి తెలుపగలరు. - సత్యనారాయణ, విజయవాడ గుండె వైఫల్యానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో అతి ముఖ్యమైన కారణం గుండెపోటు. ఒకసారి గుండెపోటుకు గురైన వాళ్లలో నూటికి 60 మందిలో గుండె వైఫల్యం చెందే అవకాశం ఉంది. అయితే ఇదొక్కటే కాదు... దీర్ఘకాలం పాటు హైబీపీ నియంత్రణలో లేకపోవడం వల్ల కూడా గుండె కండరం దెబ్బతిని గుండె వైఫల్యానికి దారితీయవచ్చు. అలాగే డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని, అంతిమంగా గుండె వైఫల్యానికి దారితీస్తుంది. దీర్ఘకాలంలో కిడ్నీ జబ్బు ఉన్నవారికి కూడా రక్తంలో విషతుల్యాల ప్రభావం పెరిగి, క్రమేపీ గుండె దెబ్బతినిపోతుంది. అరుదుగా పుట్టుకతో కండర ప్రోటీన్ లోపం ఉన్నవారికి, కాన్పు సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురైన మహిళలకు, అలాగే జీవితంలో ఉన్నట్టుండి ఎన్నడూలేనంతటి తీవ్రమైన ఒత్తిడి బారినపడిన వారికి కూడా హఠాత్తుగా గుండె వైఫల్యం సంభవించే ముప్పు ఉంది. నిర్ధారణ : గుండె వైఫల్యాన్ని చాలావరకు లక్షణాల ఆధారంగానే గుర్తుపట్టవచ్చు. వైద్యులు రోగిని పరీక్షించడంతో పాటు కచ్చితమైన నిర్ధారణకు కొన్ని పరీక్షలు చేయిస్తారు. ఈసీజీ పరీక్ష చేస్తే గతంలో గుండెపోటు వచ్చిందా, గుండె గదులు పెద్దగా అయ్యాయా, కండరం మందంగా తయారైందా వంటి వివరాలన్నీ బయటపడతాయి. ‘ఎకో’ పరీక్ష చేస్తే గుండె పంపింగ్ సామర్థ్యం ఎలా ఉందన్నది తెలుస్తుంది. ఇవి కాకుండా గుండెవైఫల్యం లక్షణాలు స్పష్టంగా కనబడుతున్నప్పుడు - ఒకవేళ గుండె రక్తనాళాల్లో పూడికలుండి, త్వరలో గుండెపోటు ముంచుకొచ్చే అవకాశం ఉందేమో తెలుసుకునేందుకు ‘యాంజియోగ్రామ్’ అవసరమవుతుంది. దాదాపు నూటికి 99 మందిలో ఈ పరీక్షలతోనే గుండె వైఫల్యం కచ్చితంగా నిర్ధారణ అవుతుంది. అరుదుగా మరింత స్పష్టత కోసం ఎమ్మారై, పెట్ స్కాన్ వంటి పరీక్షలూ అవసరమవుతాయి. ఆయాసంగా ఉన్నప్పుడు దానికి కారణం గుండె వైఫల్యమా లేదా ఉబ్బసమా అన్నది తెలుసుకునేందుకు ‘బీఎన్పీ’ రక్తపరీక్ష ఉపకరిస్తుంది. చికిత్స : గుండె వైఫల్యం మొదలైనప్పుడు దగ్గు, ఆయాసం వంటి పైకి కనిపించే లక్షణాలతో పాటు గుండె సైజు పెరగడం, గుండె కండరం మందం కావడం వంటి అంతర్గత సమస్యలూ ఉంటాయి. వ్యాధి ముదరకుండా చూడటానికి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. గుండె, కిడ్నీ వంటి కీలక అవయవాల పనితీరును సమన్వయం చేస్తూ పంపింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు బీటాబ్లాకర్లు, ఏసీబీ, ఏఆర్‌బీ ఇన్హిబిటార్లు, స్పైరనోలాక్టోన్ వంటి మందులు ఇస్తారు. వీటికి తోడు గుండె సైజు పెరిగినప్పుడు దాని దుష్ర్పభావాలను అడ్డుకునేందుకు ‘నెప్రిలైజిన్ ఇన్హిబిటార్’ వంటి మందులు అందుబాటులోకి రాబోతున్నాయి. అలాగే ఒంట్లో అధికంగా చేరిపోయిన నీటిని మూత్రం రూపంలో బయటకు పంపేందుకు డైయూరెటిక్స్ మందులు ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా వ్యాధి ముదరకుండా జీవితకాలం పెరగడానికి తోడ్పడతాయి. గుండె పంపింగ్ సామర్థ్యం 30 శాతం కంటే తక్కువ ఉన్నవారికి ఆల్డోస్టెరాన్ యాంటగోనిస్ట్ రకం మందులు ఉపయోగపడతాయి. ఆస్తమా వంటి సమస్యలున్నవారు బీటా బ్లాకర్స్‌ను తట్టుకోలేరు. వీరికి ‘ఇవాబ్రాడిన్’ అనే కొత్త మందు అందుబాటులోకి వచ్చింది. కిడ్నీ సమస్యలున్నవారు ఏసీఈ, ఏఆర్‌బీ మందులను తట్టుకోలేరు. వీరికి ప్రత్యామ్నాయంగా మరికొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. ఇవన్నీ రక్తనాళాలను విప్పారిలా చేస్తూ గుండె మీది భారాన్ని తగ్గిస్తాయి. ఈ మందుల వల్ల రోగి బాధలు తగ్గడమే కాకుండా గుండె వైఫల్యం కారణంగా లోపల తలెత్తే సమస్యలూ తగ్గి రోజువారీ పనులన్నీ హాయిగా చేసుకోగలుగుతారు. కాబట్టి మందులను పద్ధతి ప్రకారం తీసుకోవడం అవసరం. డాక్టర్ కృష్ణారెడ్డి సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ కీళ్లు బిగుసుకుపోయి, కదలడమే కష్టంగా ఉంది హోమియో కౌన్సెలింగ్ నా వయసు 37 ఏళ్లు. నాకు కొంతకాలం నుంచి చేతివేళ్లు, కాలివేళ్లు, తుంటిప్రాంతంలో నొప్పి, వాపు ఉంటున్నాయి. ఉదయానే నిద్ర లేచేసరికి కీళ్లు బిగుసుకుపోయినట్టుగా కదలికలు కష్టంగా ఉంటున్నాయి. ఈ వ్యాధి ఏమిటి? హోమియో చికిత్స ద్వారా పూర్తిగా నయమవుతుందా? - ఎస్. పవన్ కుమార్, హైదరాబాద్ మీరు తెలిపిన వివరాలను బట్టి ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ (కీళ్లవాతం) అయ్యే అవకాశం ఉంది. చల్లటి వాతావరణంలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కీళ్లవాతం అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన శరీర రోగనిరోధక వ్యవస్థ కొన్ని అసమతుల్యతల కారణంగా పొరబడి సొంత కణాలపైనే దాడి చేయడం వల్ల కలుగుతుంది. చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరిలోనైనా ఇది వస్తుంది. కారణాలు: ఈ వ్యాధికి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు కానీ కొన్ని ఇన్ఫెక్షన్ల వలన, వాతావరణ మార్పులు, వంశపారంపర్యత, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఎక్కువగా కలుగుతుంది. ధూమపానం, స్థూలకాయం వంటివి కూడా ఈ వ్యాధిని ప్రేరేపిస్తాయి. లక్షణాలు: కీళ్లలో విపరీతమైన నొప్పి, వాపు, చేతితో తాకితే వేడిగా అనిపించడం, ఉదయాన లేవగానే కీళ్లు బిగుసుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలోని ఇరుపార్శ్వాలలో ఉండే ఒకేరకమైన కీళ్లను ప్రభావితం చేయడం ఈ వ్యాధి ముఖ్యలక్షణం. మొదటి ఈ వ్యాధి చిన్న చేతివేళ్లు, కాలివేళ్లను, వ్యాధి తీవ్రత పెరిగేకొద్దీ మణికట్టు, మోచేతులు, భుజాలు, మోకాళ్లు, తుంటి, చీలమండలు వంటి కీళ్లను ప్రభావితం చేస్తుంది. వీటితోపాటు నీరసం, రక్తహీనత, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, జ్వరం వంటి లక్షణాలను కూడా గమనించవచ్చు. చికిత్స: ఇలాంటి వ్యాధులకు హోమియో చికిత్స ద్వారా చక్కటి పరిష్కారం లభిస్తుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
స్వచ్ఛ భారతం ఇదేనా?
విశ్లేషణ స్వచ్ఛ భారత్ ప్రజల తలకెక్కలేదు. వారు వీధులలో చెత్తను వేస్తున్నారు, మూత్ర విసర్జన చేస్తున్నారు. సుగమ్య భారత్‌ను నిజం చేయాల్సిన వారు ప్రచారం తప్ప వికలాంగులకు అనువైన సదుపాయాలను కల్పించడంలేదు. ప్రశంసనీయమైన లక్ష్యాలతో దేశంలో ప్రస్తుతం రెండు ఉద్య మాలు సాగుతున్నాయి. ఒకటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం. రెండవది, రైలు, బస్సు స్టేషన్లు, భవనాలు తదితరా లను వికలాంగులకు అందు బాటులోకి తేవడానికి ఉద్దేశిం చిన సుగమ్య భారత్. వాటిపై భారీ ప్రచారం సాగుతోంది. శుద్ధి ప్రణా ళికకు 2019 తుది గడువు. ఆలోగా ఎక్కడబడితే అక్కడ కనిపించే చెత్తనంతా తొలగించి దేశాన్ని పరిశుభ్రం చేయాల్సిఉంది. ప్రతి ఒక్కరూ, పౌరులు, అధికారులు అందుకు పూనుకుని వ్యక్తిగత ఆరోగ్యం, ప్రజారోగ్యం వంటి ప్రయోజనాలను పొం దాల్సి ఉంటుంది. ఇక వికలాంగులంతా వారికి కల్పిం చిన సదుపాయాలను వాడుకుంటూ ఉండాలి. అలా జరుగుతుంటే చాలా చక్కగా ఉంటుంది. కానీ ప్రజలు పరిశుభ్రతను బలవంతంగా రుద్దగలి గేది కాదని, అలవ రచుకోవాల్సినదని ఇంకా గుర్తిం చలేక పోవడం వల్ల ఈ రెండు లక్ష్యాలు నెరవేరడమూ కష్టమే. సబ్సిడీల పంపిణీకి అవినీతి క్యాన్సర్ సోకక పోతే, ప్రోత్సాహకాలు మరుగు దొడ్ల నిర్మాణానికి తోడ్ప డతాయి. సుగమ్య భారత్ భావనను నిజం చేయా ల్సిన వారు దాన్ని ప్రచారం చేయడమే తప్ప వికలాం గులకు అనువైన సదుపాయాల నిర్మాణానికి తోడ్పడటం లేదు. ఒక సాధారణమైన మనిషి తాత్కాలిక వైకల్యానికి గురైతే తప్ప వికలాంగులు అనుభవించే బాధ ఎలాంటిదో తెలియదు. మహారాష్ట్ర ఆర్థిక మంత్రి జయంత్ పాటిల్ ప్రమాదానికి గురై రెండు కాళ్లు విరి గాయి. దీంతో ఆ మంత్రి శాసనసభలోకి ప్రవేశించడా నికి వీలుగా ఒక రాంప్‌ను (వాలు దారి), ట్రెజరీ బెంచ్ కు చేరడానికి మరో రాంప్‌ను ఏర్పాటు చేశారు. సెక్ర టేరియట్‌లో నిరాటంకంగా ఆయన విధులను సాగించ డానికి వీలుగా ఆగమేఘాలపై ఇంకో రాంప్ ప్రత్యక్ష మైంది. రాష్ట్ర ప్రభుత్వ భవనాలను వికలాంగు లకు అను వైనవిగా మార్చడానికి బడ్జెట్లో సంకేతాత్మ కంగానైనా నిధులను కేటాయించడానికి ఆయనను ఒప్పించినట్టు గుర్తుంది. అయినా ఎక్కడా రాంప్లు కనబడటం లేదు. వికలాంగులు బాధలు పడుతూనే ఉన్నారు. స్వచ్ఛ భారత్ సైతం నరేంద్ర మోదీ ఆశిస్తున్నట్టు విజయవంతం అయ్యేలా సాగడం లేదు. గ్రామాల నుంచి నగరాల వరకు స్థానిక సంస్థలు ఈ పరిశుభ్రతా పరిరక్షణ కృషి, పౌరులను చైతన్యవంతులను చేసే కృషి అభిలషణీయ స్థాయిలో సాగడానికి హామీని కల్పించ డానికి సహాయపడాల్సి ఉంది. అయినా, ఎక్కడో కొద్ది చోట్ల తప్పితే, ఒక నియమం అన్నట్టు ప్రతి చోటా ఈ కృషి తీవ్రంగా కొరవడటమే కనబడుతోంది. అసలు పరిశుభ్రత పట్లనే వ్యక్తులలో, సంస్థలలో పట్టింపు లేనితనం ఉంది. సబ్సిడీల వల్ల మరుగుదొడ్లను నిర్మించి ఉండొచ్చు. కానీ వాటి ఉపయోగం రెండు కారణాల వల్ల అభిలషణీయ స్థాయికన్నా తక్కువగా ఉంటోంది. ఒకటి, పాత అలవాట్లు అంత తేలికగా వదిలేవి కాకపోవడం. రెండు, వాటిని శుభ్రంగా ఉంచడానికి నీరు కొరవడటం. గణాంకాలను చూస్తే ప్రశంసనీయమైన కృషి జరిగినట్టే అనిపిస్తుంది. కలగాల్సిన ప్రయోజనాలను బట్టి చూస్తే నిర్మించిన మరుగు దొడ్లు అందుకు అనుగుణంగా ఉండ టంలేదు. అదే పెద్ద సమస్య. ఇది కేవలం మరుగు దొడ్లను నిర్మించడానికి సం బంధించిన సమస్య కాదు, వాటిని ఉపయోగించడంలో ప్రజలకు శిక్షణ గరపడమే సమస్య. అయితే మరుగుదొడ్లు లేకపోవడం వల్ల తలెత్తే సమస్యలూ ఉన్నాయి.. బాలికలు మధ్యలోనే చదువు మానుకుంటున్నారు, నగరాలలో మహిళలు ‘మూత్ర విసర్జనా హక్కు’ను కోరుతున్నారు. ఈ కార్యక్రమం ఇంకా ప్రజల తలకెక్కలేదు. వారు ఆనందంగా వీధులలో చెత్తను వేస్తున్నారు, ఉమ్ముతు న్నారు, మూత్ర విసర్జన చేస్తున్నారు. స్వచ్ఛ భారత్‌ను ప్రారంభించిన ప్రధానే వచ్చి శుభ్రం చేస్తారన్నట్టు వ్యవ హరిస్తున్నారు. ఇదేదో ప్రభుత్వ కార్యకలాపం అన్నట్టు చాలా కార్యక్రమాల్లాగే ఇదీ వారిని తాకలేదు. ఎవరైనా వీధుల్లో ఉమ్మితే లేదా వాడేసిన ఖాళీ గుట్కా ప్యాకెట్‌ను పారేస్తే, సిగరెట్ పీకలను పారేస్తే వారిని ఎగతాళి చేస్తుంటాను. పరిశుభ్రత ఆవశ్యకతను వివారిస్తాను. పరిశుభ్రతకు సంబంధించిన ప్రజా ప్రమాణాలను ఉల్లం ఘించిన వ్యక్తిని అది సిగ్గుపడేలా చేస్తుంది. తేలికగా చేయగలిగేది.. ఉమ్మిన వ్యక్తిని చెప్పులు విప్పి కేవలం అతని కాలిబొటన వేలిని ఉమ్మిన దానిలో లేదా కళ్లెలో పెట్టమనాలి. ‘‘మీరు ఉమ్మినదాన్ని మీరు ఒక్కసారి తాకి చూసి, మరొకరు దాన్ని తాకితే ఎలా ఉంటుందో ఊహిం చండి’’ అంటే సరి. ఆ ఆలోచనే చీదర పుట్టించడం అతని మొహంలో కనిపిస్తుంది, ఈ సుదీర్ఘ ప్రయా ణంలో మనం, ప్రజారోగ్యకర పరిస్థితులకు హామీని కల్పించగలగడంలోనే మనందరి సొంత ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించడం అవసరం. ఇక వికలాంగులకు సదుపాయాలను అందుబాటులోకి తేవడం మనందరి తప్పనిసరి బాధ్యత. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు - మహేష్ విజాపుర్కార్ ఈ మెయిల్ : mvijapurkar@gmail.com -
పక్క తడుపుతున్నాడు
హోమియో కౌన్సెలింగ్ మా బాబు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. రాత్రి నిద్రలో అప్పుడప్పుడు పక్క తడుపుతున్నాడు. కొన్నిసార్లు పగటి నిద్రలో కూడా. దీనికి కారణం ఏమిటి? హోమియో ద్వారా దీన్ని నివారించవచ్చా? - ఒక సోదరి, మోత్కూరు ప్రపంచంలో ప్రతి మూలలోనూ ఇలాంటి సమస్యతో పిల్లలు, ఈ కారణంగా బాధపడే తల్లిదండ్రులు ఉంటారు. దీన్ని బెడ్‌వెట్టింగ్ లేదా నాక్చర్నల్ అన్యురసిస్ లేదా స్లీప్ వెట్టింగ్ అంటారు. కొందరు పిల్లలు పగలు నిద్రపోయేటప్పుడు కూడా మూత్రవిసర్జన చేస్తుంటారు. ముఖ్యంగా ఆరు సంవత్సరాలలోపు పిల్లల్లో ఈ పరిస్థితిని ఎక్కువగా చూస్తుంటాం. మూత్రాశయం మీద నియంత్రణ నాలుగు సంవత్సరాల వయసులో వస్తుంది. కొందరిలో ఆ తర్వాత వస్తుంది. ఐదేళ్లలోపు పిల్లల్లో 16 శాతం మందిలో, ఆరేళ్ల పిల్లల్లో 13 శాతం, ఏడు-ఎనిమిదేళ్ల పిల్లల్లో 9 శాతం మందిలో, పది-పద్నాలుగేళ్ల పిల్లల్లో 4 శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది. బెడ్ వెట్టింగ్ అన్నది పిల్లల్లో అసంకల్పితంగా జరుగుతుంది. ఎవ్వరూ కావాలని ఇలా చేయరు. దీనివల్ల బాధపడే పిల్లలు బయట ఎవరికీ దీన్ని చెప్పుకోలేరు. ఇక తల్లిదండ్రులు దీని గురించి పిల్లలపై అరవడం, వారిని భయపెట్టడం చేస్తుంటారు. తాము పెద్ద తప్పు చేస్తున్నామనే అపరాధ భావనను పిల్లల్లో కలిగిస్తుంటారు. అది పిల్లల్లో మరింత ఆత్మన్యూనతకు కారణమవుతుంది. కారణాలు : మూత్రంలో ఇన్ఫెక్షన్ వంశపారంపర్యం ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకోవడం కొందరిలో మానసిక వైకల్యం ఫుడ్ అలర్జీలు లక్షణాలు : రాత్రిపూట పక్క తడపడంతో పాటు మరికొన్ని లక్షణాలు కూడా పిల్లల్లో కనిపిస్తుంటాయి. అవి... మాటిమాటికీ మూత్ర విసర్జన చేస్తుండటం మూత్రంలో మంట మలబద్దకం వ్యాధి నిర్ధారణ : యూరినరీ అనాలసిస్, అల్ట్రాసౌండ్, యూరోడైనమిక్స్ చికిత్స : హోమియోలో మంచి మందులు ఉన్నాయి. కండరాలను నియంత్రణలోకి వచ్చేలా చేయడంలో అవి బాగా తోడ్పడతాయి. హోమియోలో నక్స్‌వామికా, పల్సటిల్లా, సెపియా, కాస్టికమ్ వంటి మందులు ఇందుకు సమర్థంగా తోడ్పడతాయి. అయితే అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో అవి వాడాల్సి ఉంటుంది. - డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి, హైదరాబాద్ -
ప్రతిసారీ ఎందుకిలా?
సందేహం నా వయసు 22. బరువు 41 కిలోలు. తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతూ ఉంటున్నాను. నేను చాలా జాగ్రత్తగా శుభ్రంగా ఉంటాను. అయినా ప్రతిసారీ ఇలా ఎందుకవుతుందో అర్థం కావడం లేదు. - దివ్య, కర్నూలు ఆడవారిలో మూత్రం బయటికి వచ్చే రంధ్రం, యోని రంధ్రం, మలం బయటకు వచ్చే రంధ్రం చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి. మూత్రాశయం నుంచి మూత్రం బయటకు వచ్చే మూత్రం వైపు (యురెత్రా) ఆడవారిలో కేవలం 4సె.మీ. పొడవే ఉంటుంది. అదే మగవారిలో 15 సె.మీ పైన ఉంటుంది. అందువల్ల, మలాశయం నుంచి వచ్చే క్రిములు తొందరగా మూత్రం పైపు ద్వారా మూత్రాశయంలోకి పాకి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి మాటిమాటికి వస్తుంటాయి. కొందరిలో రక్తహీనత ఉన్నా, షుగర్ వ్యాధి ఉన్నా, కిడ్నీలో సమస్యలు, ఇంకా ఎన్నో కారణాల వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ మాటిమాటికీ వస్తుంటాయి. మంచినీళ్లు తక్కువగా తాగడం వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. రోజుకు కనీసం 2-3 లీటర్ల నీళ్లు త్రాగాలి. మలవిసర్జన తర్వాత, ముందు నుంచి వెనక్కి శుభ్రం చేసుకోవాలి. వెనకాల నుంచి ముందుకి శుభ్రం చేసుకోవడం వల్ల మల ద్వారం దగ్గర క్రిములు, మూత్రాశయంలోకి తొందరగా పాకే అవకాశాలు ఉంటాయి. ఒకసారి డాక్టర్ని సంప్రదించి, సీయూఈ, యూరిన్ కల్చర్ చేయించుకుంటే ఇన్ఫెక్షన్ ఎంత ఉంది, ఏ యాంటిబయాటిక్ వాడితే తొందరగా తగ్గుతుందో తెలుస్తుంది. దానినిబట్టి ఇన్ఫెక్షన్కి తగ్గ మందులు వాడవచ్చు. అశ్రద్ధ చేస్తే ఇన్ఫెక్షన్ కిడ్నీలకు పాకి అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. భయపడడం మాని డాక్టర్ని సంప్రదించి, చికిత్స తీసుకోవడం మంచిది. నా వయసు 24. పెళ్లై మూడేళ్లు అవుతోంది. ఇప్పుడు ఆరు నెలల బాబు ఉన్నాడు. నార్మల్ డెలివరీ కష్టమని, సిజేరియన్ చేశారు. కొన్ని రోజులకే ట్యూబెక్టమీ కూడా చేయించుకున్నాను. ఇప్పుడు నేను ఎన్నిరోజుల తర్వాత నా భర్తను శారీరకంగా కలవచ్చు? కలిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - నళిని, ఊరు పేరు రాయలేదు సిజేరియన్ తర్వాత కుట్లు మానిపోయి కడుపులో నొప్పి, ఇంకా ఇతర ఇబ్బందులు లేనప్పుడు మూడునెలలు పూర్తయిన తర్వాత నుంచి కలవవచ్చు. సాధారణంగా కాన్పు తర్వాత ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, మామూలు స్థితికి రావడానికి మూడు నుంచి ఆరునెలలు పట్టవచ్చు. నీకు ఆపరేషన్ అయ్యి ఆరు నెలలు అయ్యింది. అలాగే ట్యూబెక్టమీ కూడా చేయించుకున్నావు కాబట్టి కలవడానికి ఎలాంటి జాగ్రత్తలు అవసరం లేదు. నాకు పెళ్లై ఏడాది కూడా కాలేదు. మొదట్నుంచి నాకు పీరియడ్స్‌కు వారం రోజుల ముందు నుంచి ఒళ్లు నొప్పులు, కాళ్ల నొప్పులు విపరీతంగా ఉంటాయి. అలాగే వక్షోజాలు కూడా భరించలేనంత నొప్పిగా ఉంటాయి. పీరియడ్స్ పూర్తయ్యాక గానీ నొప్పులు తగ్గవు. డాక్టర్‌ను సంప్రదిస్తే, కొందరి శరీరతత్వం ఇలా ఉంటుందని, పెళ్లయ్యాక తగ్గుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు పెళ్లైనా తగ్గడం లేదు. నెలకు పదిహేను రోజులు శారీరకంగా కలవకుండా ఉండడంతో మా వారికి కోపం, చిరాకు వస్తున్నాయి. నాకు ఈ నొప్పులతో ఇబ్బందిగా ఉంటోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - కిరణ్మయి, మియాపూర్ కొందరిలో పీరియడ్స్‌కు వారం పదిరోజుల ముందు నుంచి ఒంట్లో నీరు చేరి, వక్షోజాలు బరువు ఎక్కి నొప్పి పుట్టడం, కీళ్లనొప్పులు, కాళ్ళవాపులు వంటివి వచ్చి, పీరియడ్స్ అవగానే తగ్గిపోతాయి. కొందరిలో శారీరక మార్పులే కాకుండా మానసిక మార్పులు అంటే కోపం, చిరాకు, డిప్రెషన్ వంటివి కూడా ఏర్పడవచ్చు. దీనినే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) అంటారు. ఈ లక్షణాలు అన్నీ అందరిలో ఉండాలని లేదు. ఒక్కొక్కరిలో ఒక్కోలాగ ఉండవచ్చు. 85 శాతం మందిలో చిన్నపాటి లక్షణాలు ఉంటాయి. 5 నుంచి10 శాతం మందిలో లక్షణాలు తీవ్రంగా ఉండవచ్చు. పీరియడ్స్ ముందు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లలో మార్పులు, కొన్ని రకాల మినరల్స్ లోపాలు, ఇంకో ఎన్నో తెలియని కారణాల వల్ల ఈ లక్షణాలు ఏర్పడవచ్చు. వీటికి చికిత్సలో భాగంగా మందులతో పాటు, జీవనశైలిలో మార్పులు, మానసిక, శారీరక ఒత్తిడిని అధిగమించడం, యోగా, మెడిటేషన్, వ్యాయామాలు కూడా చెయ్యవలసి ఉంటుంది. ఈ సమయంలో కాఫీ, టీ, ఉప్పు, చక్కెర వంటివి తగ్గించుకోవడం, పండ్లు, కూరగాయలు, నీళ్ళు అధికంగా తీసుకోవడంతో పాటు, తగిన విశ్రాంతి ఉండేలా చూసుకోవలసి ఉంటుంది. చికిత్సలో భాగంగా విటమిన్ బి-6, ఈ వంటి విటమిన్స్, కాల్షియం, మెగ్నీషియం, మినరల్స్, పైమ్రోజ్ ఆయిల్‌తో కూడిన మందులు మూడు నుంచి ఆరు నెలలు పైగా వాడి చూడవలసి ఉంటుంది. నొప్పులు మరీ ఎక్కువగా ఉంటే పారసెటమాల్ టాబ్లెట్ అప్పుడప్పుడు వాడుకోవచ్చు. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్ -
భార్య హత్య కేసులో అరెస్ట్
చక్రాయపేట: భార్యను హత్య చేసిన కేసులో చక్రాయపేట మండలం నాగులగట్టుపల్లె గ్రామానికి చెందిన శివరామ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. శివరాం తన సొంతూరు రాయచోటిలోని మాసాపేటలో నివాసముండేవాడు. 8 ఏళ్ల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన ఆదినారాయణ కుమార్తె శివమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇతను ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే ఇతని భార్య విలాసవంతమైన జీవితం గడపాలని అప్పుడప్పుడు ఇతన్ని ఒత్తిడి చేసేది. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం నాగులగట్టుపల్లెలో ఓ సినిమా థియేటర్లో మేనేజర్‌గా చేరాడు. సంసారం కూడా అక్కడే పెట్టారు. శివమ్మ కోరిక మేరకు కొంత బంగారం, కారు కూడా కొనుగోలు చేశాడు. ఈ మధ్యకాలంలో అతను పనిచేసే సినిమా థియేటర్‌ను లీజుకు తీసుకోగా భారీ నష్టాలు వచ్చాయి. దీంతో తన భార్య బంగారును తాకట్టు పెట్టాడు. తర్వాత భార్య శివమ్మ తన బంగారం తెచ్చి ఇవ్వాలని పదే పదే అడిగేది. ఈనెల 8వ తేదీ కూడా అదే తరహాలో ఒత్తిడి చేయడంతో అతను ఇంటి నుంచి థియేటర్‌కు వెళ్లి రాత్రి ఇంటికి వెళ్లలేదు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు ఇంటికి వెళ్లాడు. అతను ఇంటికి వెళ్లేసరికి అతని భార్య పుట్టింటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. వారిద్దరి మధ్య గొడవ జరిగి శివమ్మ శరీరంపై ఉన్న చున్నీతో గొంతుకు ఉరివేసి చంపాడు. అనంతరం ఏమీ తెలియనట్లు మళ్లీ సినిమా థియేటర్‌కు వచ్చి సినిమా వేసి ఇంటికి వెళ్లాడు. తన భార్య ఉరి వేసుకొని చనిపోయిందని చుట్టు పక్కల వారికి చెప్పి దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్‌ను కూడా పిలిపించాడు. రాయచోటికి తీసుకెళ్లాలని డాక్టర్ చెప్పడంతో వాహనంలో రాయచోటిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు ఆయన నిర్ధారించారు. మృతురాలి సోదరుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన భార్యను తానే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని, అతన్ని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ పుల్లయ్య, ఎస్ఐ గోవిందు తెలిపారు. -
మాటిమాటికీ మూత్రం... ఎందుకిలా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 52 ఏళ్లు. గత ఆర్నెల్ల నుంచి రాత్రిపూట మూత్ర విసర్జన కోసం మాటిమాటికీ లేచేవాణ్ణి. ఈమధ్య మూత్రం బొట్లు బొట్లుగా వస్తోంది. కంట్రోల్ తప్పింది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - రమేశ్, కందుకూరు పురుషుల్లో అత్యంత ప్రధానమైన గ్రంథి ప్రోస్టేట్ (పౌరుషగ్రంథి). ఇది వీర్యం ఉత్పత్తిలో కీలకమైన భూమిక పోషిస్తుంది. సంతానం కలగజేయడానికి కారణమయ్యే శుక్రకణాలు ఈ ప్రోస్టేట్ గ్రంథి తయారు చేసే స్రావాలలో కలిసి వీర్యం రూపంలో బయటకు వస్తుంటాయి. ఇలా సంతాన సాఫల్యంలో ఈ గ్రంథికి అంతటి ప్రాధాన్యం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆ గ్రంథి కొద్దికొద్దిగా ఉబ్బుతుంటుంది. ఫలితంగా మూత్రవిసర్జనలో రకరకాల సమస్యలు తలెత్తడం సహజంగా జరిగే పరిణామమే. దీన్ని బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా’ అంటారు. ప్రోస్టేట్ గ్రంథి సమస్య సాధారణంగా 40 సంవత్సరాలు పైబడ్డ వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశవాసుల్లో ఈ సమస్య ఒకింత తక్కువేగానీ... పట్టణ ప్రాంతాల్లో, మాంసాహారం తినేవాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన లక్షణాలు కనిపించినా, మూత్ర సమస్యలు వేధిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. కారణాలు : ప్రోస్టేట్ పెరగడానికి హార్మోన్ల స్థాయి తగ్గుదల ముఖ్యకారణం. కాస్త అరుదే అయినా గాయాలు కావడం గౌట్ సమస్య లక్షణాలు : మాటిమాటికీ మూత్రం రావడం పదే పదే మూత్ర విసర్జన చేయాలనిపించడం మూత్రం ఆపుకోలేకపోవడం మూత్రం ఆగి ఆగి రావడం మూత్ర విసర్జనలో రక్తం పడటం వ్యాధి నిర్ధారణ : అల్ట్రా సౌండ్ సోనోగ్రఫీ బయాప్సీ స్కానింగ్ చికిత్స : హోమియోపతి వైద్య విధానంలో ప్రోస్టేట్ గ్రంథి వాపు నుంచి పూర్తి ఉపశమనం కలిగించే మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ విధానంలో కేవలం లక్షణాలను తగ్గించడమే కాకుండా సమస్యను పూర్తిగా నయం చేయడం సాధ్యమవుతుంది. రోగి శారీరక తత్వాన్ని బట్టి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. ఆర్నికా, బెల్లడోనా, కోనియం, తూజా, మెర్క్‌సాల్ వంటి మందులు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. అయితే అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో తగిన మోతాదులో వీటిని వాడాల్సి ఉంటుంది. - డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి హైదరాబాద్ -
విద్యార్థిని మింగిన నీటిగుంత
ప్రమాదం జరిగిందని తెలిసినా.. నిర్లక్ష్యంగా వెళ్లిపోయిన ప్రిన్సిపాల్ విద్యార్థి బహిర్భూమికి వెళ్లగా చోటుచేసుకున్న దుర్ఘటన బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా శాయంపేట : పాఠశాల పరిసరాల్లో బహిర్భూమికి వెళ్లిన విష్ణు(10) అనే విద్యార్థి నీటి తటాకాన్ని తలపిం చేలా తవ్విన భారీ గుంతలో పడి దుర్మరణం పాల య్యాడు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం శాయంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రేగొండ మండలం కొత్తపల్లిగోరికి చెందిన కొలిపాక రవి, మంజుల దంపతులకు ఇద్దరు కుమారులు వారిలో పెద్ద కుమారుడు వేణు పుట్టకతోనే అంగవైకల్యం కలిగి ఉన్నాడు. రెండో కుమారుడు విష్ణు గతేడాది మెుగుళ్లపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో సీటు సంపాదించాడు. మొగుళ్లపల్లిలో పాఠశాల భవనం అందుబాటులోకి రాకపోవడంతో, తాత్కాలిక ఏర్పాటుగా శాయంపేట గురుకులంలోనే విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. కాగా, శాయంపేట గురుకులంలో స్థానిక విద్యార్థులు 450 మంది, మొగుళ్లపల్లికి చెందినవారు మరో 160 మంది చదువుతున్నారు. అయితే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అమాంతంగా పెరిగిం ది కానీ.. టాయిలెట్స్ సంఖ్య మాత్రం పెరగలేదు. మరోవైపు పాఠశాల ప్రిన్సిపాల్ మరుగుదొడ్లు, మూత్రశాలలకు తాళం వేసి ఉంచేవారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత్యంతరం లేక విద్యార్థులు ప్రతిరోజు బహిర్భూమి కోసం పరిసరాల్లోని నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లేవారు. కర్రను పట్టుకోబోయి.. ఈక్రమంలో శనివారం ఉదయం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో విద్యార్థులు భోజనాలు ముగించుకొని, విద్యార్థి విష్ణు తోటి విద్యార్థులతో కలిసి పాఠశాలను ఆనుకొని ఉన్న ఓ ప్రైవేటు స్థలంలో బహిర్భూమికి వెళ్లారు. ఆ స్థలంలోని మెురంను తరలించగా మిగిలిన పెద్ద గుంతలో ఇటీవల కురిసిన వర్షాలకు నీళ్లు భారీగా చేరాయి. విద్యార్థి కొలిపాక విష్ణు ఆ గుంతలోకి కర్ర వేసి ఆడసాగాడు. ఇంతలో కర్ర అందులోకి పడిపోయింది. దీంతో ఆ కర్రను ఎలాగైనా పట్టుకోవాలని గుంత ఒడ్డుకు చేరుకొని అడుగువేశాడు. దీంతో ఒడ్డున ఉన్న మట్టిపెళ్లలు ఒక్కసారిగా కూలడంతో విష్ణు నీళ్లలోకి మునిగిపోయాడు. వెంటనే తోటి విద్యార్థులు విష్ణు చేతికి కర్ర అందించి.. ఒడ్డుకు లాగే ప్రయత్నం చేశారు. అది విఫలమైంది. విష్ణు నీళ్లలో మునిగిపోయాడు. దీంతో తోటి విద్యార్థులు కార్తీక్, గణేశ్, యశ్వంత్‌లు పరుగెత్తుకుంటూ వెళ్లి ఉపాధ్యాయులకు జరిగిన విషయాన్ని తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో మృతదేహం కోసం వెతికించారు. రాత్రి 8 గంటలకు విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్ వేటు విద్యార్థి మృతదేహంతో విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు గురుకులం ఎదుట సోమవారం రాత్రి ధర్నాకు దిగారు. దీంతో పరకాల తహసీల్దార్ కృష్ణ గురుకులానికి చేరుకొని మృతిచెందిన విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇప్పించడంతో పాటు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామన్నారు. దీంతో వారు ఆందోళనను విరమించారు. కాగా, ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆరా తీశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ ఎండీ ఖాజాను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఉగ్గ పట్టుకోవాల్సిందే !
నగరంలో పబ్లిక్ టాయిలెట్లు కరువు మహిళలకు తీవ్ర ఇబ్బందులు స్పందించని అధికారులు కరీంనగర్ కార్పొరేషన్ : నగరంలో పబ్లిక్ టాయిలెట్లు కరువయ్యాయి. 3.5 లక్షల జనాభా గల నగరంలో కేవలం 20 పబ్లిక్ టాయిలెట్లు మాత్రమే ఉన్నాయి. ఉత్తర తెలంగాణలోనే అతి పెద్ద బిజినెస్ సెంటర్‌గా వెలుగొందుతున్న నగర ప్రధాన వ్యాపార కూడలి టవర్‌సర్కిల్‌కు సమీపంలో కేవలం మూడు టాయిలెట్లు ఉండడం చూస్తుంటే అధికారులకు స్వచ్ఛ కరీంనగర్, ప్రజారోగ్యంపై ఎలాంటి శ్రద్ధ ఉందో అర్థమవుతుంది. ప్రతి రోజు లక్షకు పైగా జనాభా ప్రధాన వ్యాపార కూడలికి వస్తూ పోతుంటారు. కొనుగోళ్ల నిమిత్తం వివిధ గ్రామాల నుంచి వచ్చే వారితో మార్కెట్ అంతా కిటకిటలాడుతుంటుంది. అయితే మహిళలే ఎక్కువగా వస్తుంటారు. అయితే వారి కోసం ప్రత్యేక టాయిలెట్స్ లేకపోవడం దారుణం. కనీసం షాపింగ్మాల్స్ల్లోనూ ఏర్పాటు చేయడం లేదు. ప్రణాళికలు కరువు స్వచ్ఛభారత్‌లో పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు నిధులు కూడా కేటాయించింది. అయితే టాయిలెట్ల నిర్మాణంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. స్వచ్ఛభారత్ అంటే కేవలం రోడ్లు శుభ్రం చేయడమనే భావనలోనే అధికారులు ఉన్నారు. దీంతో మిగతా విషయాలపై దృష్టి సారించడం లేదు. టాయిలెట్లు ఎంత అవసరమో ఆ బాధను అనుభవించే వారికే తెలుస్తుంది. వర్షాకాలంలో మాటిమాటికి టాయిలెట్ రావడం సర్వసాధారణం. పురుషులు ఎక్కడపడితే అక్కడ సమస్య తీర్చుకుంటారు. కానీ స్త్రీల బాధ వర్ణనాతీతం. మూత్రం విసర్జించకుండా ఎక్కువ సేపు ఆగితే మూత్ర సంబంధవ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ టాయిలెట్ల సౌకర్యం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఇంటికి వెళ్లే వరకు ఆపుకోవడం తప్ప గత్యంతరం లేదు. ప్రభుత్వ స్థలం ఉన్న ప్రాంతాల్లోనైనా టాయిలెట్లు నిర్మించాలనే ఆలోచన కూడా రావడం లేదు. మహిళలకు ప్రత్యేకం ఎప్పుడు ? ఈనెల 1న నగరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మున్సిపాలిటీల సదస్సులో మున్సిపల్ మంత్రి కేటీఆర్ మహిళల బాధలను సర్వే ద్వారా తెలుసుకుని కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. కామన్ టాయిలెట్లకు రావడానికి మహిళలు ఇబ్బందులు పడుతున్నట్లు సర్వేలో తేలిందని, మహిళల కోసం మున్సిపాలిటీల్లోని ప్రధాన వ్యాపార కూడళ్లలో ‘షీ టాయిలెట్సు’ యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు ఉండాలని తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్నింటిపై మున్సిపాలిటీలకు సర్వహక్కులు ఉంటాయన్నారు. ఈ సమస్య పరిష్కరించాల్సిన మున్సిపాలిటీలు పట్టించుకోవడం లేదని విమర్శలు వినవిపిస్తున్నాయి. తొమ్మిదింటికి ప్రతిపాదనలు – రవీందర్, ఏసీపీ నగరపాలక సంస్థలో ప్రస్తుతం 20 పబ్లిక్ టాయిలెట్లు వినయోగంలో ఉన్నాయి. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌తో మరో తొమ్మిదింటికి ప్రతిపాదనలు తయారు చేశారు. షీ టాయిలెట్లు, పాఠశాలల్లో ప్రత్యేక టాయిలెట్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. -
ఆనందంలో బాస్ పై యూరిన్ పోశాడు...
లండన్ః కొందరికి ఆనందం వచ్చినా, ఆగ్రహం వచ్చినా పట్టలేరు. అనుకోని సంఘటన ఏది జరిగినా తట్టుకోలేకపోతారు. ఆ కోవకు చెందిన వ్యక్తి ప్రవర్తనే ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఓ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగికి అనుకోకుండా లాటరీ తగలడంతో చిత్రవిచిత్రంగా ప్రవర్తించాడు. బాస్ రూం లోకి వెళ్ళి అక్కడ యూరిన్ పోసి నానా హంగామా చేశాడు. సీసీటీవీ కెమెరాకు చిక్కిన ఆ షాకింగ్ ఘటన.. ఇప్పుడు వైరల్ గా మారింది. లండన్ లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి ఆకస్మాత్తుగా లాటరీ విన్ అయినట్లు సమాచారం అందింది. అనుకోకుండా అంతటి అదృష్టం వరించేప్పటికి ఆనందం పట్టలేకపోయాడు. హడావిడిలో ఏం చేస్తున్నాడో మర్చిపోయాడు. బాస్ రూం లోకి వెళ్ళి యూరిన్ పోసి కలంకలం సృష్టించాడు. జాక్ పాట్ తనను వరించిందని తెలియగానే ముందుగా.. కూర్చున్న కుర్చీలోనే ఎగిరెగిరి గంతులేశాడు. అనంతరం ఒళ్ళు తెలీకుండా ఆఫీసులో ఆటూ ఇటూ పరుగులు తీశాడు. దీంతో పక్కనే ఉన్న కొలీగ్స్ ఖిన్నులైపోయారు. కార్యాలయంలో ఎప్పుడూ తమతోపాటు.. ప్రశాంతంగా పనిచేసుకునే వ్యక్తి ఉన్నట్లుండి వింతగా ప్రవర్తించడంతో కాస్త భయపడ్డారు కూడా. అయితే అక్కడున్న వారు ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే అతడు తిన్నగా బాస్ కేబిన్ లోకి ప్రవేశించాడు. అక్కడున్న పర్సనల్ సెక్రెటరీని భయభ్రాంతులకు గురి చేశాడు. తర్వాత బాస్ పై కూడా తన ప్రతాపం చూపించాడు. కుర్చీనుంచీ పడియేట్టు కొట్టడమే కాక ఏకంగా అతడిపై యూరిన్ పోసి హల్ చల్ చేసి... చివరికి ఏమీ తెలియనట్లు తన సీట్లోకి వెళ్ళిపోయాడు. సీసీ కెమెరాకు చిక్కిన ఆ వీడియో ఇప్పుడు య్యూట్యూబ్ లో వైరల్ అయింది. కార్యాలయాల్లోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్తోంది. -
ఆనందంలో బాస్ పై యూరిన్ పోశాడు...
-
75 బస్తాల యూరియా సీజ్
► లక్ష్మీఎంటర్ ప్రైజెస్ ఎరువుల దుకాణంపై కేసు నమోదు ► అధిక ధరలకు ఎరువులు అమ్మితే చర్యలు చల్లవానిపేట(జలుమూరు): ఎరువులు అధిక ధరలకు అమ్మితే వారిపై కేసులు నమోదుచేసి శాఖపరంగా చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వ్యవసాయాశాఖ సహాయ సంచాలకులు ఎస్‌జేవీ రామ్మోహనరావు అన్నారు. చల్లవానిపేటలో లక్ష్మీఎంటర్ ప్రైజెస్ ఎరువుల దుకాణాన్ని ఆయన సోమవారం తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి అక్రమంగా నిల్వ ఉన్న 75 బస్తాల యూరియాను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఎరువులు అమ్మకాలకు తగిన లైసెన్స్‌లు, అనుమతులు ఉన్నాయా లేదా అన్నది పరిశీలించారు. అమ్మే ఎరువులు అనుమతి ఉన్న డీలర్లు వద్ద నుంచి తెస్తున్నారా లేదా సరిచూశారు. పురుగు మందులను నిశితంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొందరు ఎరువుల వ్యాపారులు వ్యాపారం లేదని రికార్డులు చూపడంలేదని, అలాంటి వాటిని పరిశీలించి సంబంధిత లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాలు మేరకు ఇలా జిల్లాలో రెండు బృందాలతో ముమ్మర తనిఖీలు చేసి, తుది నివేదిక ఉన్నతాధికారులకు పంపనున్నామన్నారు. ఆయనతో పాటు పెనుగొండ ఏవో వై.రాఘవేంద్రరావు, ఏవో విజయభాస్కరరావు, ఎంపీఈవో పి.రాజశేఖర్ తదితరులు ఉన్నారు. -
జరిమానాలు వేసేందుకు ప్రత్యేక అధికారులు
సాక్షి,సిటీబ్యూరో: నగరంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారు, బహిరంగ మూత్ర విసర్జన చేసే వారిపై జరిమానాలు విధించేందుకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ జరిమానాల వసూళ్లలో పారదర్శకత కోసం ఈ–చలాన్ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన ఉందన్నారు. గురువారం జీహెచ్ఎంసీ వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్ల నుంచి చెత్త తరలించే వారికి అందజేసిన 1830 ఆటోట్రాలీలకు వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలన్నారు. అవసరాలకు అనుగుణంగా కొత్త ఆటోలకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. పర్యాటక ప్రాంతాలు, ప్రముఖులు ప్రయాణించే మార్గాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నిర్వాహకులే తరలించాలి హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లనుంచి వెలువడే వ్యర్థాలను నిర్వాహకులే తరలించాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని యాజమాన్యాలకు స్పష్టంగా తెలియజేయాల్సిందిగా డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లలో ఆహార పదార్థాల వృథాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. సేంద్రియ ఎరువుల పిట్లను ఎవరికి వారుగా ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఏఎంఓహెచ్‌లకు సూచించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ రవికిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
మూత్రంతో బీరు తయారీ..!
సాధారణంగా బీరు తాగగానే యూరిన్‌కు పరిగెత్తేవారిని మనం చూస్తూనే ఉంటాం. మరి అలాంటిది యూరిన్‌తోనే బీర్ తయారుచేస్తే ఎలా ఉంటుంది. చాలా చండాలంగా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ బెస్ట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్‌తో ఉండే బీర్‌ను యూరిన్‌తో తయారుచేసే టెక్నిక్‌ను కనుగొన్నారు పరిశోధకులు. బెల్జియంలోని ఘెంట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కేవలం సోలార్ ఎనర్జీని ఉపయోగించుకొని యూరిన్‌ను నీరుగా మార్చే మెషిన్‌ను కనుగొన్నారు. ఈ విధానంలో.. పెద్ద ట్యాంక్‌లో యూరిన్‌ను స్టోర్ చేసి సోలార్ పవర్‌తో పనిచేసే బాయిలర్‌లో వేడి చేస్తారు. అనంతరం దానిని ఒక పొరగుండా పంపినప్పుడు పొటాషియం, నైట్రోజన్, పాస్పరస్ లాంటి ఖనిజాలతో పాటునీరు వేరవుతుంది. ఇటీవలే సెంట్రల్ ఘెంట్‌లో 10 రోజుల పాటు నిర్వహించిన మ్యూజిక్, థియెటర్ ఫెస్టివల్లో 'పీ ఫర్ సైన్స్' పేరుతో ఈ మెషిన్‌ను ఉంచి సుమారు వెయ్యి లీటర్ల యూరిన్‌ను సేకరించారు. దీంతో బెల్జియంలోనే మాంచి టేస్టున్న బీరును తయారుచేయనున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఈ ప్రక్రియలో వెలువడిన ఖనిజాలను పంటలకు ఎరువులుగా కూడా వాడుకోవచ్చని డాక్టర్ డెరెసి వెల్లడించారు. -
గౌటీ ఆర్థరైటిస్ అంటే...?
కౌన్సెలింగ్ మా నాన్న వయసు 52 ఏళ్లు. అప్పుడప్పుడు కాళ్ల వేళ్లు వాచి నొప్పిగా ఉంటున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే గౌటీ ఆర్థరైటిస్ అన్నారు. దాని గురించి మాకు అవగాహన లేదు. గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏమిటో తెలియజేయగలరు. హోమియోలో దానికి పరిష్కారం ఉందా? - శ్రీనివాస్, నెల్లూరు మన శరీరంలో ఉండే కీళ్లలో ఉప్పు లాంటి స్ఫటికాలు తయారై వాచినట్లుగా ఉండి, మంట నొప్పి వంటి లక్షణాలతో బాధిస్తూ ఉంటే ఆ సమస్యను గౌటీ ఆర్థరైటిస్ అంటారు. సాధారణంగా ఇది చిన్న కీళ్లలో మరీ ముఖ్యంగా కాలి బొటనవేలి వాపుతో ప్రారంభమవుతుంది. దీన్ని అలాగే వదిలేస్తే మిగతా కీళ్లను బాధిస్తుంది. కారణం : మానవుని రక్తంలో యూరిక్ యాసిడ్ అనే పదార్థం ఉంటుంది. ఇలా తయారైన యూరిక్ యాసిడ్ ఎక్కువగా స్రవిస్తున్నప్పుడు దాన్ని మూత్రపిండాలు సమర్థంగా బయటకు పంపకపోతే రక్తంలో ఆ పదార్థం పాళ్లు పెరిగి ఈ సమస్యకు దారితీయవచ్చు. జన్యుపరమైన కారణాలతోనూ, మాంసాహారం, మద్యం వంటివి తీసుకునే వారిలోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎలా ఏర్పడుతుంది : రక్తంలో ఎక్కువ మోతాదులో యూరిక్ యాసిడ్ పేరుకుపోవడం వల్ల అది కీళ్లలోని మృదులాస్థిలోకి చేరి అక్కడ పేరుకుపోవడం మొదలవుతుంది. అలా పేరుకున్నది కాస్తా చిన్న చిన్న స్ఫటికాలుగా తయారవుతుంది. ఈ స్ఫటికాలు క్రమేపీ కీలు మధ్య భాగంలో చేరి ఈ సమస్య వస్తుంది. లక్షణాలు: ఈ సమస్య సాధారణంగా పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది కీలు నొప్పి సాధారణంగా రాత్రిపూట, తెల్లవారుజామున ఎక్కువగా ఉంటుంది వాపు సూదులు పొడినట్లుగా ఉంటుంది కీలో లోపలి ఆగంలో మండుతున్నట్లుగా ఉంటుంది 12 - 24 గంటల్లో నొప్పి తీవ్రస్థాయికి చేరుతుంది. కొన్ని సందర్భాల్లో మందులు వేసుకున్నా, వేసుకోకపోయినా 4-5 రోజుల్లో నొప్పి దానంతట అదే తగ్గిపోతుంది. ఆ తర్వాత మళ్లీ కొన్ని రోజులకో, కొన్ని నెలలకో ఈ సమస్య మళ్లీ మొదలువుతుంది కీలు ఎర్రగా వాచిపోయి కదలికలు కష్టంగా ఉంటాయి వాపు తగ్గుతున్న దశలో చర్మం పొరలు పొరలుగా ఊడిపోవడం జరుగుతుంది. నిర్ధారణ: ఇది కూడా ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాగే నొప్పితో మొదలవుతుంది. కానీ కీళ్లలో వాపు ఉండి ఎక్కువగా నొప్పి రావడం జరుగుతుంది. లక్షణాలతో పాటు రక్తపరీక్ష, ఎక్స్-రే, కీలులోని ద్రవపరీక్ష చేసి సమస్యను నిర్ధారణ చేస్తారు. నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే ప్రమాదాలు: చాలా మంది నొప్పి తగ్గగానే ఈ సమస్యను మరచిపోతారు. కానీ దీనికి చికిత్స తీసుకోకపోతే కిడ్నీ సమస్యలు సైతం తలెత్తే ప్రమాదం ఉంటుంది. హోమియో చికిత్స: రోగి లక్షణాల ఆధారంగా కాన్స్టిట్యూషన్ పద్ధతిలో చికిత్స చేయడం ద్వారా చికిత్స చేయవచ్చు. క్రమేపీ రోగనిరోధక శక్తి పెంచుతూ పోవడం వల్ల ఈ సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి హైదరాబాద్ -
మూత్ర విసర్జన చేస్తుంటే.. తుపాకీతో కాల్చాడు
భువనేశ్వర్: ఆసుపత్రి ముందు మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని ఓ డాక్టర్ కాల్చిన సంఘటన ఆదివారం ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తే.. దారిన వెళ్తున్న ఓ వ్యక్తి ఆసుపత్రి ముందు మూత్ర విసర్జన చేశాడు. ఇది తట్టుకోలేని ఆసుపత్రి డాక్టర్ రివాల్వర్ తో అతని ఎడమకాలు మోకాలి కింద కాల్చాడు. బుల్లెట్ తగలడంతో వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు డాక్టర్ ను అరెస్టు చేసి రివాల్వర్ ను స్వాధీనం చేసుకున్నారు. -
మూత్ర విసర్జన చేస్తుంటే.. తుపాకీతో కాల్చాడు
-
అందుబాటులో 26 వేల మెట్రిక్ టన్నుల యూరియా
– అధిక ధరలకు ఎరువులు అమ్మితే లైసెన్స్ రద్దు – జిల్లా వ్యవసాయ ఉపసంచాలకుడు బైరెడ్డి సింగిరెడ్డి మరికల్(ధన్వాడ): ఖరీఫ్ సిజన్‌ను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో యూరియా కొరత రాకుండా 26 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచినట్లు జిల్లా వ్యవసాయ శాఖ ఉపసంచాలకుడు బైరెడ్డి సింగిరెడ్డి అన్నారు. శుక్రవారం మరికల్లో ప్రయివేట్ ఫర్టీలైజర్ దుకాణాలకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రూ.298 గల యూరియా బస్తాను రైతులకు రూ.320లకు విక్రయిస్తునట్లు తమ దృష్టికి వచ్చిందని అధిక ధరలకు ఎరువులు అమ్మినా, రైతులు కొనుగోలు చేసిన ఎరువులకు రశీదులు ఇవ్వకపొయిన దుకాణాల లైసెన్స్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఖరీఫ్‌లో యూరియా కొరత లేకుండా ఉండేందుకు 26వేల మేట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచామని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. రైతులకు మరిన్ని సేవలను అందించేందుకు జిల్లాలో మూడు ఉపసంచాలకుల పోస్టులను భర్తీ చేశామన్నారు. ప్రయివేట్ ఫర్టిలైజర్ దుకాణదారులు అధిక ధరలకు ఎరువులు అమ్మినా, బిల్లులు ఇవ్వకపొయిన, పంటలకు సబంధించిన సమస్యలు, సలహాలు, సూచనల కోసం 7288894286 నంబర్‌కు ఫోన్ చేయాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ సక్రియానాయక్, ఇంచార్జ్ ఏఓ రాజేష్, సిబ్బంది లక్ష్మన్‌సింగ్ పాల్గొన్నారు. -
ఆవు మూత్రం తాగించి, పేడ తినిపించారు
న్యూఢిల్లీ: గో రక్షణ సమితి సభ్యుల అకృత్యం ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బీఫ్ ను ఎగుమతి చేస్తున్నారనే ఆరోపణలతో ఇద్దరు యువకుల చేత బలవంతంగా ఆవు మూత్రం తాగించి, ఆవు పేడ తినిపించిన వైనం విమర్శలకు తావిచ్చింది. అక్రమంగా బీఫ్ ను తరలిస్తున్నారని ఆరోపిస్తూ వారిపై భౌతికంగా దాడిచేసి పంచగవ్య తినిపించారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. గో రక్షణ సమితి అధ్యక్షుడు ధర్మేంద్ర యాదవ్, అతని సహచరులు గుర్గావ్ లో ఇద్దరు యువకులు రిజ్వాన్, ముక్తియర్ లపై ఈ దారుణానికి పాల్పడ్డారు. యువకులిద్దరు 'పంచగవ్య'తో కూర్చొని ఉండడం, దాన్ని సులభంగా మింగడానికి గో రక్షణ కార్యకర్తలు నీళ్లు ఇవ్వడం.. తినమని గద్దించడం ఈ వీడియోలో చూడవచ్చు. 'గోమాత కీ జై', 'జై శ్రీ రామ్' అంటూ నినాదాలు చేశార. అయితే రిజ్వాన్, ముక్తియర్ అక్రమంగా 7 వందల కేజీ గొడ్డు మాంసాన్ని రవాణా చేస్తున్నారని ధర్మేంద్ర ఆరోపించారు. మేవాత్ నుంచి ఢిల్లీకి తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. అందుకే వారికి గుణపాఠం చెప్పాలనే పంచగవ్య (ఆవు మూత్రం.. పేడ. పాలు పెరుగు, నెయ్యిల మిశ్రమం) తినిపించామని తెలిపారు. దీని ద్వారా వారిని పరిశుద్ధులను చేశామన్నారు. దీన్ని వీడియో ఎవరు తీశారో, బయటికి ఎలా వచ్చిందో తమకు తెలియదన్నారు. 3 వందల కేజీల బీఫ్ ను స్వాధీనం చేసుకున్నామని ఫరీదా పోలీస్ అధికారి తెలిపారు. గోవధ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి పంపామన్నారు. అయితే బలవంతంగా పేడ, మూత్రం తినిపించిన అంశం తమ దృష్టికి రాలేదన్నారు. -
ఆవుల మూత్రంలో బంగారం!
జునాఘడ్: గుజరాత్ లోని జునాఘడ్ జిల్లాలో ఎక్కువగా కనిపించే గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రంలో బంగారం ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు 400 గిర్ జాతి ఆవుల మూత్రంపై నాలుగేళ్ల పాటు విస్తృతంగా పరిశోధనలు జరిపిన జునాఘడ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(జేఏయూ) లీటర్ మూత్రంలో మూడు మిల్లీ గ్రాముల నుంచి 10 మిల్లీ గ్రాముల వరకు బంగారం ఉన్నట్టు పేర్కొన్నారు. బంగారానికి సంబంధించిన ధాతువులు నీటిలో కలిసిపోయి ఆవుల మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. పూర్వీకుల చిత్రాల్లో మాత్రమే ఆవుల మూత్రంలో బంగారం ఉన్నట్లు తెలిసేదని, పరిశోధనలు చేయగా అది నిజమేనని తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని రకాల కెమికల్ పద్ధతులను ఉపయోగించి ఆవుల మూత్రం నుంచి బంగారాన్ని బయటకు తేవచ్చని చెప్పారు. ఒంటె, గేదే, గొర్రె, మేకలపై కూడా ఇలాంటి పరిశోధనలు చేశామని చెప్పారు. అయితే, వాటి మూత్రంలో వ్యాధి నిరోధక శక్తికి సంబంధించి ఆధారాలేవీ కనిపించలేదని వివరించారు. గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రంలో అనేక రకాల వ్యాధులకు నిరోధకంగా పనిచేసే లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ పరిశోధనలు చేసే జేఏయూ ఫుడ్ టెస్టింగ్ లాబోరేటరీ ఏటా దాదాపు 50,000లకు పైగా పరీక్షలు జరుపుతుంది. ఎగుమతులు, డైరీ ప్రొడక్ట్స్, కూరగాయలు, దినుసులు, తేనే, పురుగుల మందులు తదితరాలపై పరిశోధనలు ఇక్కడ నిర్వహిస్తారు. ప్రస్తుతం గిర్ ఆవుల మూత్రం మనుషుల జబ్బులకు, వృక్షాల పెంపకానికి ఎలా పనిచేస్తుందో పరిశోధనలు చేస్తున్నట్లు శాస్త్రజ్ఞులు వివరించారు. -
హెల్త్ కార్నర్
⇒ మధుమేహం వచ్చే సూచనలు ఉన్నవారు అరచెంచా మెంతిపొడిని ప్రతిరోజూ భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా చేస్తే కొన్నేళ్ల వరకు మధుమేహం రాకుండా నివారించ వచ్చు. ⇒ చాలామందికి చిగుళ్ల నుంచి తరచు రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని, అందులో చిటికెడు ఉప్పు వేసి నూరుకోవాలి. ఆ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు చిగుళ్లకు రాస్తే సమస్య తీరుతుంది. ⇒ ప్రతిరోజూ గ్లాసు నీళ్లలో పావు టీ స్పూన్ యాలకుల పొడిని కలుపుకొని తాగితే.. యూరినరీ ఇన్ఫెక్షన్ బాధ నుంచి బయటపడొచ్చు. ⇒ అరిగిన కీళ్లు, ఎముకలతో బాధపడేవారు.. చింతగింజలను వేయించి, వాటి తొక్క తీసి పొడి చేసుకోవాలి. ఒక చెంచా చింతగింజల పొడిని వేడి నీళ్లలో కలుపుకొని రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా చేస్తే ఎముకల మధ్యలో కరిగి పోయిన గుజ్జు తిరిగి తయారవుతుంది. ⇒ ఎండిన ఉసిరికాయలను పొడి చేసి ఓ సీసాలో పెట్టుకోవాలి. ప్రతిరోజూ ఉదయం టీ స్పూన్ ఉసిరిపొడిలో టీ స్పూన్ తేనెను కలిపి తీసుకుంటే ఆస్తమా సమస్య క్రమంగా తగ్గుతుంది. ⇒ కాళ్లు, చేతులు బెణికినప్పుడు.. ఆ ప్రాంతంలో వేడినీళ్లలో ముంచిన క్యాబేజీ ఆకులను పెట్టి బ్యాండేజ్ వేసుకోవాలి. గంట గంటకు క్యాబేజీ ఆకులను మార్చాలి. -
సీసీటీవీలో పనిమనిషి అడ్డంగా దొరికింది!
కువైట్: ఎంతో నమ్మకంగా ఇంట్లో పని చేయాల్సిన ఓ మహిళ చేయకూడని తప్పుచేసి అడ్డంగా దొరికిపోయింది. సీసీ టీవీలో అసలు విషయాన్ని గమనించిన యజమాని షాక్ నుంచి తేరుకోలేకపోయాడు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ వివరాలిలా ఉన్నాయి.. కువైట్ లో ఓ ఇంట్లో ఇద్దరు మహిళలు హౌస్ మెయిడ్స్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంటి యజమాని తనకు జ్యూస్ కావాలని అడిగాడు. ఇంతలో ఓ మహిళ జ్యూస్ తయారు చేసి ఏదో పనిమీద కాస్త పక్కకువెళ్లింది. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. మరో మహిళ యజమాని కోసం సిద్ధం చేసిన జ్యూస్ లో తన యూరిన్ ను పోసింది. ఈ దృశ్యాలు వంటింట్లో ఏర్పాటుచేసిన సీసీటీవీలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఆ వీడియోను గమనిస్తే ఆ మహిళ ఆ పనికి ముందే సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అయితే ఆ పుటేజ్ ఎలాగో బయటకు లీక్ అయింది. ఈ విషయం ఆనోటా ఈనోటా మీడియాకు చేరింది. మీడియా ఆ కుటుంబాన్ని సంప్రదించగా, కెమెరాలో ఆ దృశ్యాన్ని చూసి షాక్ తిన్నానని యజమాని చెప్పాడు. కానీ, ఆ ఘాతుకానికి పాల్పడ్డ పనిమనిషి పేరు, వివరాలు వెల్లడించేందుకు ఇంటి యజమాని నిరాకరించాడు. అయితే చుట్టుపక్కల ఇళ్లవారిని మాత్రం పనివారి చేష్టలపై కన్నేసి నిఘా పెట్టాలని సూచన చేయటం విశేషం. -
మూత్రంతోనూ విద్యుత్!
అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. విద్యుదుత్పత్తికి గాలి, నీరు, సూర్యుడు, మూత్రం కాదేదీ అనర్హం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఓ పక్క పర్యావరణ సమస్యలు, మరో పక్క పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్. ఈ డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు శాస్త్రవేత్తలు వివిధ వనరుల కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. తాజాగా లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బాత్కు చెందిన శాస్త్రవేత్తలు మూత్రం నుంచి విద్యుదుత్పత్తి చేశారు. మూత్రానికి కొన్ని రకాల బ్యాక్టీరియాలను జోడించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేశారు. సేంద్రియ పదార్థాలు, మురికినీరు, బ్యాక్టీరియాల ద్వారా మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్‌ను ఉపయోగించి విద్యుత్ తయారుచేస్తారనే విషయం తెలిసిందే. ఇలాంటి ఫ్యూయల్ సెల్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. బాత్ శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి మూత్రంతో విద్యుదుత్పత్తి చేసే సెల్స్‌ను తయారుచేశారు. ప్రపంచంలోని ఏ మూలనైనా విద్యుదుత్పత్తి చేయొచ్చని శాస్త్రవేత్త మిరెల్లా డీ లొరెంజో పేర్కొన్నాడు. ఒక క్యూబిక్ మీటర్ పరిమాణమున్న సెల్ ద్వారా రెండు వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని చెప్పాడు. -
బలవంతంగా నోట్లో యూరిన్ పోశారు!
రోజు రోజుకూ మానవత్వం మంటకలసి పోతోంది. అమానుషం కోరలు చాస్తోంది. సాటి మనిషిని భరించలేని తనం రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఓ కూరగాయల వ్యాపారిపై ఉత్తర ప్రదేశ్ లో జరిగిన దారుణ ఘటన అదే రుజువు చేస్తోంది. ఉత్తర ప్రదేశ్ ఆగ్రా నగరానికి దగ్గరలోని ఎత్మద్ పూర్ గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. ఓ కూరగాయల వ్యాపారి నోట్లో ఐదుగురు వ్యక్తులు బలవంతంగా యూరిన్ పోసిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. భాయీ సాబ్ కాస్త తప్పుకొని దారివ్వండి అంటూ బాధితుడు అడగడమే తప్పయిపోయింది. స్థానికంగా కూరగాయల వ్యాపారం చేసుకుంటున్న నిరోత్తమ్ ఖాన్ ఆదివారం ఇంటికి వచ్చే సమయంలో ఓ సమాజ్ వాదీ పార్టీ జిల్లా యూనిట్ ఇంఛార్జి తోపాటు ఐదుగురు వ్యక్తులు తాను దారి అడిగినందుకు కొట్టడమే కాక తన నోట్లో బలవంతంగా యూరిన్ పోశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తనకు కాస్త దారివ్వమంటూ పున్నీఖాన్ ను అడగడమే తప్పయిపోయిందని, ఆగ్రహించిన అతడు తన బంధువులతోపాటు తనపై దాడి చేయడమే కాక తన నోట్లో యూరిన్ పోశారని నిరోత్తమ్ ఆందోళన వ్యక్తం చేశాడు. దాడి సమయంలో తనకు ఎటువంటి సహాయం దొరకకపోవడంతో దిక్కులేని స్థితిలో ఊరుకున్న బాధితుడు... బుధవారం కొంతమంది సహాయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. -
ఫ్యూయెల్ సెల్ తో మూత్రాన్ని విద్యుత్తుగా...
లండన్ : వ్యర్థాల నుంచి విద్యుత్ అంటూ ఇప్పటికే శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు. ఇప్పటికే మనిషి మూత్రాన్ని విద్యుత్తుగా మార్చేందుకు సైతం అనేక పరిశోధనలు జరిపారు. విద్యుత్ ఉత్పాదకత పెంచేందుకు ప్రపంచమంతా పలు రకాల అధ్యయనాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో తాజాగా చవకైన, శక్తివంతమైన అతి చిన్న ఫ్యూయెల్ సెల్ పరికరంతో మూత్రాన్ని విద్యుత్తుగా మార్చవచ్చని కొత్త తరహా పరిశోధనలద్వారా కనుగొన్నారు. మూత్రం ఉండే పునరుత్పాదక జీవశక్తిని వినియోగించి ఫ్యూయెల్ సెల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చంటున్నారు అధ్యయనకారులు. లండన్ బాత్ విశ్వవిద్యాలయం, మెరీ యూనివర్శిటీ లు బ్రిస్టల్ రోబోటిక్ ల్యాబరెటరీ ద్వారా సరికొత్త టెక్నాలజీతో పరిశోధనలు నిర్వహించారు. ఈ కొత్త రకం ఫ్యూయెల్ సెల్స్ గురించి ఎలక్ట్రో కిమికా ఆక్టా జర్నల్ లో ప్రచురించారు. దీనిద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు ఎటువంటి ఖరీదైన వస్తువులు అవసరం లేదని, కార్బన్, కాటన్, టిటానియమ్ వైర్లతో తయారయ్యే అతి చవుకైన కాథోడ్ ఉపయోగించి శక్తివంతమైన విద్యుత్తును వెలికి తీయవచ్చని వివరించారు. ఆహార వ్యర్థాల్లో... ముఖ్యంగా గుడ్డు తెల్లసొనలోని వొవాల్బుమిన్ ప్రొటీన్, గ్లూకోజ్ లు విద్యుత్తును వెలికి తీసేందుకు ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడతాయి. వీటితో ఫ్యూయెల్ సెల్స్ మరింత వేగంగా స్పందించి, మరింత శక్తిని సృష్టించేందుకు వీలవుతుంది. అయితే ఈ పరిశోధనల్లో ఎలక్ట్రోడ్ల పొడవు పెంచి మెలిపెట్టడంద్వారా విద్యుత్ ఉత్పత్తి పదిరెట్లు పెరిగినట్లు కనుగొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, ముఖ్యంగా నిరుపేద, గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఫ్యూయెల్ సెల్స్ ద్వారా వ్యర్థాలను వినియోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రధాన రచయిత జోన్ ఖౌలర్ వెల్లడించారు. తాము రూపొందించిన డిజైన్ సంప్రదాయ నమూనాలకంటే తక్కువ ధర కలిగి, మరింత శక్తివంతంగా పనిచేస్తుందని చెప్తున్నారు. వ్యర్థాల నుంచి విద్యుత్ వెలికి తీసే మిగిలిన అన్ని పరికరాలకన్నా, మూత్రం నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే ఈ ఫ్యూయెల్ సెల్ పరికరంతో అత్యధిక విద్యుత్తు ఉత్పత్తికావడం గమనించవచ్చని ఖౌలర్ తెలిపారు. -
నాకు పెళ్లయి ఆరు నెలలవుతోంది...
యూరాలజీ కౌన్సెలింగ్ నాకు పెళ్లయి ఆరు నెలలవుతోంది. అప్పటి నుంచి తరచూ మూత్రంలో మంట, నొప్పి వస్తున్నాయి. పరిష్కారం చెప్పండి. - ఒక సోదరి, హైదరాబాద్ మహిళలకు పెళ్లైన కొత్తలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణంగా వస్తుంటాయి. దీన్నే హనీమూన్ సిస్టైటిస్ అంటారు. కలయిక సమయంలో యోనిమార్గంలోని సూక్ష్మక్రిములు మూత్రాశయంలోకి ప్రవేశించడం వల్ల ఇలా అవుతుంది. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మూడు రోజులు యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఇది తగ్గిపోతుంది. మళ్లీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి కొన్ని మందులు వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా నీళ్లు ఎక్కువగా తాగడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కూడా చాలా అవసరం. మా ఆవిడ వయసు 45 ఏళ్లు. నెల రోజల క్రితం మూత్రంలో రక్తం పడిపోయింది. అప్పటి నుంచి క్యాన్సరేమోనని ఆందోళన పడుతోంది. - మహేందర్‌రావు, మెదక్ మూత్రంలో రక్తం పోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మూత్రాశయంలో ఇన్ఫెక్షన్, మూత్రవాహికలో రాళ్లు ఉండటం, క్యాన్సర్, టీబీ వంటి ఎన్నో కారణాల వల్ల ఇలా రక్తం పోతుంది. ఏ కారణం వల్ల ఇలా జరుగుతుందో తెలుసుకోడానికి స్కానింగ్, ఎక్స్-రే వంటి పరీక్షలు చేస్తారు. కారణానికి తగిన చికిత్స చేస్తారు. ఒక్కోసారి రక్తం పడుతుండే ఈ లక్షణాన్ని చూసి ఇన్ఫెక్షన్గా భావించి, యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు. ఇది సరికాదు. కనీసం అల్ట్రా సౌండ్ స్కాన్ చేసి... రాళ్లు, గడ్డలు లాంటివి ఏమీ లేవని నిర్ధారణ చేసుకోవడం చాలా అవసరం. డాక్టర్ సనంద్ బాగ్ సీనియర్ యూరాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. గత ఆర్నెల్లుగా మెడ, చెవుల భాగంలో దురద వస్తోంది. నా రోల్డ్‌గోల్డ్ చైన్ మెడకు ఆనే చోట ఈ దురద వస్తోంది. ఎన్ని ఆయింట్మెంట్స్, క్రీమ్స్ వాడినా తగ్గడం లేదు. హోమియోలో దీనికి శాశ్వత చికిత్స ఉందా? - సునీత, కర్నూలు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి అది డర్మటైటిస్ కావచ్చు. ఇందులో కొన్ని రకాలు ఉన్నాయి. అవి.. కాంటాక్ట్ డర్మటైటిస్: స్పర్శను బట్టి వచ్చే చర్మ వ్యాధి ఇది. ఇందులో చర్మం గులాబీ రంగుకు మారుతుంది. ఇది దురదను కలిగిస్తుంది. చికాకు, అలర్జీని కలిగిస్తుంది. రబ్బరు తొడుగుల వల్లగానీ లేదా ఆభరణాలోని కోబాల్ట్ వంటి లోహాలు ఈ జబ్బుకు కారణమవుతాయి. కొన్ని పరిమళ ద్రవ్యాలు, నగలు, చర్మసంరక్షణ ఉత్పత్తుల వల్ల ఇది సంభవించవచ్చు. నుమ్యులార్ డర్మటైటిస్: నుమ్యులార్ డర్మటైటిస్లో నాణెం ఆకృతిలో మచ్చలు వస్తాయి. ఇవి కాళ్లు, చేతులు, భుజాలు, నడుముపై వస్తుంది. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువ. సాధారణంగా ఇది 55 నుంచి 65 ఏళ్ల వయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎగ్జిమా: ఇది కూడా ఒక రకం డర్మటైటిస్. క్రానిక్ స్కిన్ ఇన్ఫ్లమేషన్ని ఎగ్జిమా అంటారు. ఇందులో చర్మం ఎరుపుదనంతో కమిలినట్లుగా ఉండటం, కొద్దిగా పొరలు తయారవ్వడం, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దురద ఎక్కువగా కనిపిస్తుంది. ఎగ్జిమా వ్యాధి బయటపడేటప్పుడు ఒక నిర్దిష్టమైన విధానాన్ని అవలంబిస్తుంది. మొదట చర్మం ఎరుపు రంగులో కములుతుంది. తర్వాత వాపుతో కూడిన పొక్కులు వస్తాయి. ఇవి క్రమంగా నీటి బుగ్గల ఆకృతిని సంతరించుకుంటాయి. సెబోరిక్ డర్మటైటిస్: ఇది ముఖ్యంగా పిల్లలలో కనిపిస్తుంది. ముఖం, తల మీద చర్మంపై ఎరుపు లేదా పసుపు రంగులో చర్మం కమిలినట్లుగా ఉంటుంది. కనుబొమల వద్ద, ముక్కు పక్కల వ్యాపిస్తుంది. ఇది అధిక ఒత్తిడి వల్ల రావచ్చు. కారణాలు: కొన్ని రకాల మందులు జుట్టుకోసం వాడే రంగులు కుంకుమ మొదలైన పదార్థాల వల్ల డర్మటైటిస్ వస్తుంది. జంతుచర్మాలతో తయారైన ఉత్పాదనలు, రోల్డ్‌గోల్డ్ నగల వల్ల కూడా డర్మటైటిస్ రావచ్చు. డర్మటైటిస్‌కు హోమియోలో మంచి మందులు ఉన్నాయి. యాంటిమోనియమ్, క్రూడమ్, అపిస్ మెల్లిఫికా, రస్టాక్సికోడెండ్రాన్, సల్ఫర్ వంటి మందులను రోగి లక్షణాలను బట్టి అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే డర్మటైటిస్ పూర్తిగా నయమవుతుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి డీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ మా అత్తగారి వయసు 52 ఏళ్లు. ఈమధ్య పొడిదగ్గు, పడుకుంటే ఆయాసంతో నిద్రలేవడం, గుండెదడ వంటివి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాం. హార్ట్ వాల్వ్‌లలో సమస్య ఉందని డాక్టర్ గారు అన్నారు. అసలు ఈ వాల్వ్స్ సమస్య ఎందుకు వస్తుందో వివరించి, లక్షణాలు కారణాల గురించి దయచేసి తెలపండి. - సునీత, నందిగామ మీరు చెప్పిన లక్షణాల బట్టి మీ అత్తగారికి గుండె కవాటాలలో సమస్య (హార్ట్ వాల్వ్ డిసీజ్) ఉందని తెలుస్తోంది. గుండెలో నాలుగు కవాటాలు ఉంటాయి. అవి.. 1) ట్రైకస్పిడ్ వాల్వ్ 2) పల్మనరీ వాల్వ్ 3) మైట్రల్ వాల్వ్ 4) అయోర్టిక్ వాల్వ్. వీటిలో రెండు రకాలు సమస్యలు రావచ్చు. అవి... వాల్వ్స్ సన్నబడటం (స్టెనోసిస్)తో పాటు వాల్వ్ లీక్ కావడం (రీగర్జిటేషన్). వాల్వ్ సమస్యలకు కారణాలు: కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల, కొందరిలో రుమాటిక్ హార్ట్ డిసీజెస్ వల్ల, మరికొందరికి ఇవి పుట్టుకతోనే రావచ్చు. కొందరిలో వయసు పెరగడం వల్ల కూడా రావచ్చు. వాల్వ్ సమస్యలో లక్షణాలు: హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఆయాసం, పొడి దగ్గు, పడుకుంటే ఆయాసం వల్ల నిద్ర నుంచి లేవాల్సి రావడం, గుండె దడ కనిపిస్తాయి. నిస్సత్తువతోనూ ఒక్కోసారి గుండెనొప్పి రావచ్చు. కొందరిలో సమస్య వచ్చిన కవాటాన్ని బట్టి నిర్దిష్టంగా కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. ఉదాహరణకు ట్రైకస్పిడ్ వాల్వ్ లీక్ (రీ-గర్జిటేషన్) సమస్యతో కాళ్ల వాపు మైట్రల్ వాల్వ్ సన్నబడితే (స్టెనోసిస్తో) రక్తపు వాంతులు అయోర్టిక్ వాల్వ్ సన్నబడితే (స్టెనోసిస్తో) స్పృహ తప్పవచ్చు. ఇప్పుడు ‘ట్రాన్స్ ఈసోఫేజియల్ ఎకో కార్డియోగ్రామ్’ అనే పరీక్ష వల్ల గుండెను మరింత స్పష్టంగా చూడటానికి అవకాశం ఉంది. కాబట్టి నిర్దిష్టంగా సమస్య ఒక్క చోటే ఉంటే మొత్తం వాల్వ్‌ను మార్చవచ్చు. వాల్వ్ సమస్యలకు చికిత్స: వీటికి కొంతవరకు మందులతో చికిత్స చేయవచ్చు. మందులతో చికిత్స సాధ్యం కాకపోతే రోగి పరిస్థితిని బట్టి సర్జరీ అవసరమవుతుంది. మైట్రల్ వాల్వ్ సన్నగా మారడం (స్టెనోసిస్) జరిగితే... రోగులకు బెలూన్ వాల్విలోప్లాస్టీ చికిత్స ద్వారా సన్నబడ్డ వాల్వ్‌ను తిరిగి తెరవవచ్చు. అయితే మిగతా గుండె కవాటాల్లో సమస్య తలెత్తితే ఈ ప్రక్రియ సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు వాల్వ్ రీప్లేస్మెంట్ అన్నదే పరిష్కారం. వాల్వ్స్‌ను రీప్లేస్ చేసే క్రమంలో రెండు రకాల వాల్వ్స్‌ను ఉపయోగించవచ్చు. అవి... 1) మెకానికల్ వాల్వ్స్ 2) టిష్యూ వాల్వ్స్. మెకానికల్ వాల్వ్స్ విషయంలో ఒక ప్రతికూలత ఉంది. ఈ రోగులకు జీవితాంతం రక్తాన్ని పలుచబార్చే మందు ఎసిట్రోమ్ వాడాల్సి ఉంటుంది టిష్యూ వాల్వ్స్ ఇతర జంతువుల కండరాలతో చేసినవి. ఈ టిష్యూ వాల్వ్స్ వాడిన వాళ్లలో రక్తాన్ని పలుచబార్చే మందు ఎసిట్రోమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది 15 ఏళ్ల వరకు పనిచేస్తుంది. ప్రస్తుతం వాల్వ్స్ మార్చడం కన్నా ఉన్న వాల్స్ ఎప్పుడూ మెరుగైనవి కావడంతో సర్జరీ కంటే వాల్వ్స్ రిపేర్ చేయడమే మేలు. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియోథొరాసిక్ సర్జన్, సెంచరీ హాసిత్పటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
అడ్డంగా బుక్కయిన సూపర్ సింగర్
లాస్ ఏంజెల్స్: హాలీవుడ్‌కు చెందిన వన్ డైరెక్షన్ సింగర్ నియాల్ హోరన్ (22) మరోసారి వార్తల్లో నిలిచాడు. తన ఆల్బమ్‌తో ప్రపంచవ్యాప్తంగా యువతను ఉర్రూతలూగించిన ఈ హాలీవుడ్ సింగర్ తాను చేసిన పనికి అడ్డంగా బుక్కయ్యాడు. ముద్దుగుమ్మలతో పార్టీ అనంతరం వీధి చివరి బహిరంగంగా మూత్రం విసర్జిస్తూ దొరికిపోయాడు. వెస్ట్ హాలీవుడ్లో1 ఓక్ క్లబ్ లో హంగాయా పూర్తయిన తర్వాత శుక్రవారం రాత్రి దీపస్తంభం దగ్గర యూరినేట్ చేస్తూ ఫోటోలకు చిక్కాడు. ఆ ఫోటోలు ఇపుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఒకవైపు ఖరీదైన బూట్లు, బట్టల్లో రాకింగ్ స్టార్ లా వెలిగిపోతూ.. మరోవైపు నియాల్ ఇలాంటి అనాగరిక చర్యకు పాల్పడడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. కాగా వన్ డైరెక్షన్ ఆల్బంతో నియాల్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అతని స్వరానికి యూత్ ఫిదా అయింది. కాగా వన్ డైరెక్షన్ ఆల్బంతో నియాల్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అతని స్వరానికి యూత్ ఫిదా అయిపోయారు. అలాంటి మ్యూజిక్ బ్యాండ్ అతనితో బ్రేకప్ చేప్పే ఆలోచనలో ఉన్నట్టు ఆ మధ్య వార్తలు రావడంతో అతని కెరియర్ డైలమాలో పడింది. ఈ నేపథ్యంలోనే గోల్ప్ ఏజెన్సీ పెట్టే ప్రయత్నాల్లో మునిగి తేలుగుతున్నట్టు సమాచారం. -
అక్కడ మూత్రం పోసి అడ్డంగా బుక్కయ్యాడు
అలహాబాద్: స్వచ్ఛ్ భారత్ గురించి ఎంత ప్రచారం జరుగుతున్నా.. కొందరు మాత్రం యథేచ్ఛగా తమ 'పని' కానించేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (ఏడీఎమ్) చేసిన పన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతోంది. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అలహాబాద్ బోట్ క్లబ్ లో త్రివేణి మహోత్సవ్ అనే స్వచ్ఛ్ భారత్ ఈవెంట్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఇందులో తనతో సహా అందరూ 'క్లీన్ గంగా' అనే టీషర్ట్ ధరించి కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. కానీ ఆయనలా చెప్పిన కొన్ని గంటలకే.. ఏడీఎమ్ ఓపీ శ్రీవాస్తవ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే త్రివేణి సంగమానికి కేవలం కొన్ని అడుగుల దూరంలో నిలుచుని బహిరంగంగా మూత్ర విసర్జన చేశారు. ఆయన 'క్లీన్ గంగా' అనే టీ షర్ట్ ధరించి మరీ ఈ పని చేయడంతో.. ఒక్కసారిగా గగ్గోలు పుట్టింది. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. దీన్ని క్షమించరాని నేరంగా పరిగణించి ఏడీఎమ్ను సస్పెండ్ చేయాలని సీఎం అఖిలేష్ యాదవ్‌ను యూపీ బీజేపీ చీఫ్ లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ కోరారు. 'అసలే నాకు షుగర్.. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను' అని ఈ ఘటనపై ఆయన సీరియస్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోను ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమా భారతికి పంపనున్నట్లు బాజ్‌పాయ్ తెలిపారు. ఏడీఎమ్ చర్యపై విచారణ జరిపించడానికి అటల్ రాయ్ అనే అధికారికి బాధ్యతలు అప్పగిస్తూ.. నివేదిక అందిన తర్వాతనే చర్యలు తీసుకుంటామని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సంజయ్ కుమార్ వివరించారు. -
విమానంలో మూత్ర విసర్జన చేసిన ప్రయాణీకుడికి జరిమానా
లండన్ః మద్యం మత్తులో విమానంలో మూత్ర విసర్జన చేసిన ఓ ప్రయాణీకుడికి ఎయిర్ ఇండియా 1000 పౌండ్ల జరిమానా విధించింది. ఎయిర్ ఇండియా విమానంలో ఇండియానుంచి బర్మింగ్ హామ్ వరకూ తన పదేళ్ళ కొడుకుతో కలసి ప్రయాణించిన జిను అబ్రహం (39).. ఒళ్ళు తెలియకుండా విమానంలోనే మూత్ర విసర్జన చేయడంతో ప్రయాణీకుల ఆగ్రహానికి గురయ్యాడు. జనవరి 19న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కిన అబ్రహం.. మద్యం మత్తులో తాను కూర్చున్న సీటు బెల్టు తొలగించి, పక్కనే ఉన్న ప్రయాణీకులు వద్దన్నా వినకుండా విమానంలోనే మూత్ర విసర్జన చేశాడు. దీంతో ప్రయాణీకులంతా అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానం బర్మింగ్ హామ్ చేరుకున్న వెంటనే ఎయిరిండియా సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం బర్మింహామ్ కోర్టుకు హాజరు పరచగా... విచారణ అనంతరం బర్మింగ్ హామ్ క్రౌన్ కోర్టు అబ్రహం కు 300 యూరోలు అంటే సుమారు వెయ్యి పౌండ్లు జరిమానా విధించింది. -
విమానంలో మూత్రం పోసినందుకు రూ. లక్ష జరిమానా
బాగా తాగేసి.. ఎయిరిండియా విమానంలో సీటు మీద, ఫ్లోర్ మీద మూత్ర విసర్జన చేసిన ఓ ప్రయాణికుడికి దాదాపు లక్ష రూపాయల జరిమానా విధించారు. భారతదేశం నుంచి ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వెళ్లేందుకు ఎయిరిండియా విమానం ఎక్కిన జిను అబ్రహం (39) ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. దాంతో ఎయిరిండియా విమాన సిబ్బందితో పాటు తోటి ప్రయాణికులు కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తన పదేళ్ల కొడుకుతో కలిసి ప్రయాణిస్తున్నఅబ్రహంకు సంకెళ్లు వేసి, సీట్ బెల్టులతో కుర్చీకి కట్టేశారు. బర్మింగ్‌హామ్‌లో విమానం దిగిన వెంటనే అరెస్టు చేయగా, బర్మింగ్‌హామ్ క్రౌన్ కోర్టు అతడికి 300 పౌండ్ల జరిమానా విధించింది. దాంతోపాటు పరిహారం కింద మరో 500 పౌండ్లు, ఖర్చుల కింద 185 పౌండ్లు, బాధితుల సర్చార్జిగా 30 పౌండ్లు చెల్లించాలని తీర్పు చెప్పారు. అబ్రహం విమానంలో వెళ్తుండగా మద్యం తాగి బాగా ఊగిపోయాడు. సీట్లోకి వెళ్లి కూర్చోమని సిబ్బంది ఎంత కోరినా పట్టించుకోలేదు. ఇక విమానం మరో అరగంటలో ల్యాండ్ అవుతుందనగా ప్యాంటు తీసేసి.. విమానం ఫ్లోర్ మీద, సీటు మీద మూత్ర విసర్జన చేశాడని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది జాన్ కార్డిఫ్ తెలిపారు. దాంతో అతడిని ప్లాస్టిక్ సంకెళ్లతో బంధించి, సీటు బెల్టుతో సీటుకు కట్టేశారు. విమానం ల్యాండ్ కాగానే అరెస్టు చేశారు. అయితే.. తాను యాంటీ డిప్రసెంట్ మందులు వాడుతున్నానని, రెండు పెగ్గుల విస్కీ తీసుకున్నానని, ఏం చేశానో తనకు గుర్తులేదని అబ్రహం కోర్టులో చెప్పాడు. కానీ, భారతదేశంలో బయల్దేరే సమయంలో మందుల సంచి కనిపించలేదని, అందుకే మందులు వేసుకోలేకపోయాడని అతడి తరఫు న్యాయవాది అలన్ న్యూపోర్ట్ చెప్పారు. అందువల్ల తన భార్య ఆరోగ్యం గురించి ఆందోళనగా ఉన్నాడన్నారు. -
మూత్రానికి బదులు డెట్టాల్ వాడుతున్నాం: లాలు
రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలు ప్రసాద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డెట్టాల్లాగే మూత్రం కూడా మంచి యాంటీసెప్టిక్ అని ఆయన అన్నారు. పట్నాలో జరిగిన హోమియోపతిక్ సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు మనం సాధించిన ప్రగతి ఏమిటంటే.. చేతులను డెట్టాల్‌తో కడుక్కోవడమేనన్నారు. చిన్నతనంలో ఎప్పుడైనా దెబ్బలు తగిలితే మూత్రంతో కడిగేవాళ్లమని, అది యాంటీసెప్టిక్‌గా పనిచేసేదని చెప్పారు. ఇప్పుడు మాత్రం ప్రజలు డెట్టాల్ వాడుతున్నారని, కొందరు దాన్ని చేతులు కడుక్కోడానికి కూడా వాడుతున్నారని ఆయన అన్నారు. మనం సాధించిన అభివృద్ధి ఇదేనని చెప్పారు. కొసమెరుపు: తన పెద్ద కొడుకు, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు బదులుగా లాలు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
మెట్లు ఎక్కినా దిగినా ఛాతీ బరువెక్కుతుంటే..!
కిడ్నీ కౌన్సెలింగ్ నా వయస్సు 50 సంవత్సరాలు. ఇటీవల హెల్త్ ప్యాకేజిలో బాడీ చెకప్ చేయిస్తే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు చెప్పారు. నిజంగానే రాళ్లు ఉన్నట్టు నిర్ధారించే పరిక్షలు ఏవి? వాటిని నివారించడం ఎలా? - భూషణం, విశాఖపట్నం మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్ష, ఇంట్రావీనస్ యూరోగ్రఫీ (ఐవీయూ), ఎక్స్-రే, సీటీ స్కాన్ల వంటి పరీక్షలతో కిడ్నీ స్టోన్స్‌ను నిర్ధారణ చేస్తారు. కిడ్నీల్లోని రాళ్లను నివారించండిలా మూత్రపిండాల్లో వచ్చే రాళ్ల వల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ఆ జాగ్రత్తలివి... నీటిని ఎక్కువగా తాగాలి. రోజుకు తప్పని సరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల యూరిన్‌ను విసర్జించాలి. కాబట్టి శరీర కణాల నిర్వహణకు, పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది ఆహారంలో ప్రొటీన్, నైట్రోజెన్, సోడియం ఉన్న పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. స్థూలంగా చెప్పాలంటే ఉప్పు పాళ్లు తక్కువగా ఉండాలి ఆగ్సలేట్ ఎక్కువగా ఉండే గింజలు, సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి క్యాల్షియం సప్లిమెంట్లను కూడా తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. పొటాషియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది కాబట్టి వైద్యుల సూచనల మేరకు ఆహార నియమాలను పాటించడం మంచిది ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్, క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువ ఆరెంజ్ జ్యూస్‌కు క్యాల్షియం ఆక్సలేట్‌ను రాయిగా మారకుండా నిరోధించే లక్షణం ఉంది. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ మంచిదే. అయితే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం కూడా కిడ్నీస్టోన్ సమస్యకు దారితీసే అవకాశం ఉంది. చికిత్స: ఎండోస్కోపీ ప్రక్రియతో మూత్రపిండం నుంచి రాయి తీయడం (పీసీఎన్ఎల్ - ఎండోస్కోపిక్ రిమూవల్ ఆఫ్ స్టోన్ ఫ్రమ్ ద కిడ్నీ) వంటి ప్రక్రియలతో రాయిని తొలగించవచ్చు. -డాక్టర్ ఎన్. ఉపేంద్రకుమార్ యూరాలజిస్ట్ అండ్ యాండ్రాలజిస్ట్, సికింద్రాబాద్ కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. నాకు గత మూడేళ్ల నుంచి షుగర్ వ్యాధి, హైబీపీ ఉన్నాయి. డాక్టర్ సలహా ప్రకారం క్రమం తప్పక మందులు వాడుతున్నాను. కానీ గత రెండు వారాల నుంచి మెట్లు ఎక్కినా, త్వరత్వరగా నడిచినా ఛాతీ బరువెక్కుతోంది. ఈ మధ్య భోజనం తర్వాత ఏమాత్రం నడిచినా ఆయాసంతో పాటు చెమటలు పడుతున్నాయి. అయితే నేను ఏ పనీ లేకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేదు. దీనికి కారణమేమిటి? వివరించండి. - ఎస్.ఆర్.జి., కొత్తగూడెం మీరు పేర్కొన్న వివరాల ప్రకారం మీకు ‘అన్స్టేబుల్ యాంజైనా’ అనే గుండెకు సంబంధించిన వ్యాధి ఉందని తెలుస్తోంది. ఒక వ్యక్తికి ఏ చిన్న శారీరక శ్రమకు గురైనా (అంటే నడక, మెట్లు ఎక్కడం మొదలైనవి) గుండె స్పందనల వేగం పెరిగి, గుండెకు మరింత ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్, రక్తసరఫరా అవసరమవుతుంది. దాంతో రక్తనాళాల్లో రక్తం ప్రవహించే వేగం పెరుగుతుంది. అయితే నార్మల్ వ్యక్తుల్లో మాదిరిగా కాకుండా కొందరిలో రక్తనాళాల్లో అడ్డంకులు ఉన్నప్పుడు ఇలా నొప్పి, ఆయాసం వచ్చి, సేదదీరినప్పుడు గుండె వేగం తగ్గి, మళ్లీ అవి కూడా తగ్గిపోతాయి. అలాగే గుండెమీద అధికంగా భారం పడకుండా ఉండే పరిస్థితిలో (అంటే పడుకున్నా, కూర్చున్నా) ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మీరు మీ ‘అన్స్టేబుల్ యాంజైనా’ అనే కండిషన్‌ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, దగ్గర్లోని గుండెజబ్బుల నిపుణుడిని సంప్రదించండి. యాంజియోగ్రామ్ పరీక్ష చేయించు కొని, రక్తనాళాల్లో అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని తొలగింపజేసు కోవడం అవసరం. లేకపోతే గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. - డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, హైదరాబాద్ డయాబెటిక్ కౌన్సెలింగ్ మనం డయాబెటిస్‌ను మందులు లేకుండానే నియంత్రించలేమా? ఇన్సులిన్ ఇంజెక్షన్ల రూపంలో కాకుండా టాబ్లెట్ల రూపంలో దొరికే అవకాశం ఉందా? దయచేసి వివరించండి. - సురేఖ, మంచిర్యాల డయాబెటిస్ (టైప్-2) తొలిదశల్లో అంటే ప్రీ-డయాబెటిక్ స్టేజ్‌లో దీన్ని క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహార నియమాలు పాటించడం (అంటే కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థాలు) తక్కువగా ఉండటంతో పాటు అందులో కొవ్వులు, ప్రోటీన్ల పాళ్లు ఎంత ఉండాలో అంతే ఉండేలా ఆహారం తీసుకోవడం) వంటి చర్యల ద్వారా డయాబెటిస్‌ను సాధ్యమైనంత ఆలస్యం చేయవచ్చు. ఇలా క్రమం తప్పకుండా వ్యాయామం, మంచి ఆహారనియమాలు, ఆరోగ్యకరమైన జీవనశైలితోనూ రక్తంలోని చక్కెరపాళ్లు అదుపులోకి రాకపోతే మాత్రం తప్పనిసరిగా డయాబెటిస్‌కు మందులు వాడాల్సిందే. మందులు వాడటం మొదలుపెట్టాక కూడా వ్యాయామం, ఆహారనియమాలు పాటించాల్సిందే. ఇక మీ రెండో ప్రశ్నకు సమాధానం ఏమిటంటే... ప్రపంచంలో ఇప్పటివరకూ ఎక్కడా కూడా ఇన్సులిన్ టాబ్లెట్ల రూపంలో అందుబాటులో లేదు. అయితే ఇంజెక్షన్ల ద్వారా కాకుండా టాబ్లెట్ల ద్వారా ఇన్సులిన్ అందించడానికి పరిశోధనలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్నాయి. నా వయసు 27. జీటీటీ టెస్ట్‌లో షుగర్ ఉన్నట్లుగా వచ్చింది. కానీ హెచ్‌బీఏ1సీ పరీక్షలో మాత్రం నార్మల్ వచ్చింది. అయినా ప్రస్తుతం నేను గ్లైకోమెట్-500 మి.గ్రా. టాబ్లెట్లు రోజుకు రెండు వాడుతున్నాను. రోజూ ఫోలిక్ యాసిడ్ తీసుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. - దివ్య, వరంగల్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మీ చక్కెరపాళ్లను అదుపులో ఉంచుకోవాలి. దీనికంటే ముందు మీరు మీ డయాబెటిక్ టాబ్లెట్లు ఆపేయండి. వీలైతే డయాబెటిస్‌ను నియంత్రించే ఆహారంతోనే మీ చక్కెరపాళ్లను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. మీ రీనల్ ఫంక్షన్ పరీక్షలు, హెచ్‌బీఏ1సీ పరీక్షలు ఎప్పుడూ నార్మల్‌గా ఉండాలి. ఒకసారి గర్భం ధరించాక అవసరమైన అన్ని పరీక్షలతో పాటు మంచి ఫాలోఅప్ జరుగుతుండాలి. ఒకవేళ గర్భధారణ సమయంలో ప్రత్యేకంగా చివరి మూడు నెలలలో చక్కెరపాళ్లు నియంత్రణలోకి రాకపోతే ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రావచ్చు. డాక్టర్ కె.డి. మోదీ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, హైదరాబాద్ -
నోటి వాపు ఉందంటే ఎమ్మారై చేయించాలి..
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 67. కొంతకాలంగా మూత్రం సరిగ్గా రావడం లేదు. కొంచెం కొంచెంగా పడుతోంది. రాత్రివేళల్లో తరచు మూత్రానికి వెళ్లాల్సి వస్తోంది. నా సమస్య ఆపరేషన్ అవసరం లేకుండా హోమియో ద్వారా నయమవుతుందా? - పి.ఎస్.ఆర్.శర్మ, హైదరాబాద్ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు బినైన్ ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ ఉండే అవకాశం ఉంది. సాధారణంగా వయసు పైబడిన వాళ్లలో ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం పెరుగుతుంది. కొందరిలో 45 ఏళ్ల నుంచే ప్రోస్టేట్ గ్రంథి పెరగడం ప్రారంభం కావచ్చు. దీనికి ప్రత్యేక కారణం ఏమీ లేదు. కాకపోతే ఇలా జరగడం మాత్రం సాధారణమే. ప్రోస్టేట్ గ్రంథి పెరగడం వల్ల యూరిన్ పూర్తిగా బయటకు రాకుండా మూత్రాశయంలోనే నిల్వ ఉండటం, రాత్రి మళ్లీ మళ్లీ సడన్‌గా మూత్రానికి వెళ్లాల్సిరావడం, మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి, మంట, మూత్రవిసర్జన కోసం ముక్కుతూ ఒత్తిడి కలిగించాల్సి రావడం, మూత్రం చుక్కలు చుక్కలుగా పడటం, విసర్జన సమయంలో మంట, మూత్రం చుక్కలతో పాటు ఒక్కోసారి రక్తం కూడా రావడం వంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రోస్టేట్ ఎన్‌లార్జిమెంట్ వచ్చిన గ్రంథి క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఈ పరిస్థితి కాస్త అరుదు. మీకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోడానికి ‘ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజన్’ (పీఎస్ఏ) పరీక్ష చేయించుకోవాలి. అలాగే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా లేక కేవలం ఎన్లార్జిమెంటేనా అని తెలుసుకోడానికి కొన్ని మూత్రపరీక్షలు, యూరోఫ్లోమెట్రీ వంటి పరీక్షలు అవసరం. స్టార్ హోమియోపతి చికిత్స: ప్రోస్టేట్ ఎన్‌లార్జిమెంట్ కోసం హోమియోలో ఆర్నికా, లైకోపోడియం, అర్జెంటమ్ నైట్రికమ్, బెరైటా కార్బ్, కిమేఫిల్లా, హైడ్రాంజియా, ఆయోడమ్, సబల్ సెరులేటా, సల్ఫర్, తూజా వంటి చాలా మంచి మందులున్నాయి. వ్యాధి లక్షణాలను బట్టి ఈ మందులను అక్యూట్ దశలో ఇవ్వవచ్చు. అదేవిధంగా ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి బెల్లడోనా, కాంథారిస్, నైట్రిక్ యాసిడ్, పల్సటిల్లా, సైలీషియా, స్టెఫిసాగ్రియా, తూజా వంటి మందులు వాడవచ్చు. మీరు మొదట పీఎస్ఏ పరీక్ష చేయించుకుని, ఈ సమస్యకు చికిత్స చేయగల నిపుణులైన హోమియో వైద్యుడిని సంప్రదించండి. చాలా సందర్భాల్లో ఆపరేషన్ అవసరం లేకుండానే కేవలం హోమియో మందుల ద్వారానే నయం చేయడానికి ఆస్కారం ఉంది. డాక్టర్ మురళి అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ క్యాన్సర్ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. గుట్కా తింటుంటాను. ఆర్నెల్లుగా నా నోటిలో వాపు, నొప్పి వస్తున్నాయి. ఒక నెలరోజులుగా ఈ బాధ మరీ ఎక్కువగా ఉంది. నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే నోటిక్యాన్సర్ అంటున్నారు. నాకు ఆందోళనగా ఉంది. సరైన సలహా చెప్పండి. - జి.ఆర్.ఆర్., హైదరాబాద్ గుట్కాలు/పొగాకు నమిలేవారిలో నోటి క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఎక్కువ. నోటి పరిశుభ్రత అంతగా పాటించకపోవడంతో పాటు, ఇలా గుట్కాలు, పొగాకు నమలడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి అంశాలు క్యాన్సర్‌ను ప్రేరేపిస్తాయి. అంటే చెంపలు, నాలుక, చిగుళ్లు... ఇలా నోటిలోని ఏ భాగంలో మీకు క్యాన్సర్ వచ్చిందో రాయలేదు. మీకు నోటిలో వాపు కూడా వచ్చిందంటే అది క్యాన్సర్ కాస్త ముదిరిన దశను సూచిస్తోంది. మొదట మీకు సమస్య ఉన్నచోట, మెడ భాగంలోనూ సీటీ లేదా ఎమ్మారై స్కానింగ్ పరీక్షలు చేయించి, క్యాన్సర్ వ్యాధి తీవ్రతను అంచనా వేయాలి. ఈ పరీక్షల వల్ల పుండు పడిన చోటి నుంచి, అది ఏ మేరకు వ్యాపించిందో కూడా తెలుస్తుంది. అది ఇప్పటికే మీ దవడ ఎముకను చేరిందా, లేక ఎముకను దాటి మెడలోని లింఫ్ గ్రంథులకూ వ్యాపించిందా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. మీరు మామూలుగా నోరు తెరవగలుగుతూ ఉంటే, క్యాన్సర్ మీ దవడ కండరాల్లోకి వ్యాపించి ఉండకపోవచ్చు. ఒకవేళ క్యాన్సర్ దవడ కండరాల్లోకి వ్యాపిస్తే నోరుతెరవడం కష్టమవుతుంది. దాంతో క్యాన్సర్ కూడా కొంచెం ముదిరినట్లు అర్థం. వ్యాపించకపోతే శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ వచ్చిన భాగం మేరకు తొలగించడం మొదట చేయాలి. ఆ తర్వాత తొలగించిన భాగాన్ని ప్లాస్టిక్ సర్జరీ లేదా రీ-కన్స్ట్రక్టివ్ సర్జరీ ద్వారా పునర్మించవచ్చు. ఈ పద్ధతుల ద్వారా దవడ ఎముకను తొలగించి కూడా మళ్లీ మునుపటిలాగే అమర్చేలా చూడవచ్చు. ఒకవేళ మెడలోని లింఫ్ గ్రంథుల్లోకి కూడా క్యాన్సర్ వ్యాపించి ఉంటే, వాటన్నింటినీ నెక్ డిసెక్షన్ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. బయాప్సీ రిపోర్టు ఆధారంగా శస్త్రచికిత్స గాయాలు మానాక, రేడియోథెరపీ ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. మీరు మొదట గుట్కా నమలడం మానేయండి. అది నోటితోబాటు మిగిలిన అవయవాలకు కూడా చాలా చెరుపు చేస్తుంది. డాక్టర్ కె.శ్రీకాంత్ సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ ఫిజియో అండ్ రీహాబ్ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. రోజూ 8-10 గంటలు కూర్చొనే పనిచేస్తాను. అప్పుడప్పుడూ నడుము నొప్పి వస్తుండేది. ఇప్పుడు ఆ నొప్పి క్రమంగా కాళ్లకూ పాకుతోంది. కాళ్ల తిమ్మిర్లు వస్తున్నాయి. సరిగా నిలబడలేకపోతున్నాను. పరిష్కారం చెప్పండి. - రామ్మోహన్, హైదరాబాద్ నడుము నొప్పి అనేక కారణాలతో వస్తుంటుంది. కంప్యూటర్ ముందు చాలా సేపు కూర్చొని పనిచేసే చాలామందిలో ఇది కనిపిస్తూ ఉంటుంది. కొందరిలో అపసవ్య భంగిమలో కూర్చోవడం వల్ల నడుము నొప్పి వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో కిడ్నీకి సంబంధించిన జబ్బులు, పేగులకు సంబంధిత వ్యాధులు ఉన్నా ఇలా నడుమునొప్పి రావచ్చు. మహిళల్లో గైనిక్ సమస్యలు ఉండటం కూడా నడుము నొప్పికి ఒక కారణం కావచ్చు. పోషకాహార లోపం వల్ల ముఖ్యంగా విటమిన్-డి తగ్గడం వల్ల కూడా ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చి ఈ తరహా నొప్పులు వచ్చేందుకు అవకాశం ఉందని కొత్త పరిశోధనలు తెలుపుతున్నాయి. మీరు ముందుగా డాక్టర్‌కు చూపించి, అసలు ఏ సమస్య కారణంగా నడుమునొప్పి వస్తోందో తెలుసుకోవాలి. ఒకవేళ ఎముకలు లేదా నరాలకు సంబంధించిన అంశాల కారణంగా నడుము నొప్పి వస్తుంటే, దాన్ని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. నొప్పి కాళ్లవైపునకు పాకుతోందనీ, కాళ్లు తిమ్మిర్లుగా ఉంటున్నాయని చెప్పిన లక్షణాలను బట్టి, ఇది చాలావరకు నరాలకు సంబంధించిన సమస్య కావచ్చు. దీనికోసం రేడియాలజీ, ఎమ్మారై పరీక్షలు చేయాల్సి రావచ్చు. ఇలా వచ్చే నడుము నొప్పి తగ్గడానికి కొన్ని రకాల వ్యాయామాలు ఉన్నాయి. అయితే నిర్దిష్టంగా అది ఫలానా కారణంతో అని తేలేవరకూ ఇలాంటి వ్యాయామాలు చేయడం సరికాదు. ఎందుకంటే కారణాలను బట్టి, నొప్పి తగ్గడానికి చేయాల్సిన వ్యాయామాలు మారుతుంటాయి. తగిన వ్యాయామాలు చేయకపోయినా వ్యాధి తీవ్రత పెరగవచ్చు. తగిన వ్యాయామాలు సూచించేందుకు మీరు రీహ్యాబ్ స్పెషలిస్ట్‌ను సంప్రదించడం మంచిది. మీరు ముందుగా డాక్టర్‌ను కలిసి తగిన వైద్యపరీక్షలు చేయించుకోండి. ఇక అప్పటివరకూ మీ కూర్చొనే భంగిమలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోండి. మీరు కుర్చీలో వెన్నును నిటారుగా ఉంచి కూర్చునేలా మీ సీట్‌ను అడ్జెస్ట్ చేసుకోవాలి. దీనిని వర్క్ స్టేషన్ మాడిఫికేషన్ టెక్నిక్ అంటారు. ఇందులో భాగంగా ప్రతి గంటకోసారి లేచి నాలుగు అడుగులు వేయాలి. అప్పుడు మీ వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది చేశాక కూడా మీకు నడుమునొప్పి వస్తూ ఉంటే, వెంటనే డాక్టర్ కలిసి, తగిన వైద్య పరీక్షలు చేయించుకోండి. డాక్టర్ మిద్దె అజయ్‌కుమార్ లెసైన్స్డ్ పీటీ (యూఎస్ఏ), డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరో రీహాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
హెచ్ఐవీ ఏమో... ఏం చేయాలి?
ఆండ్రాలజీ కౌన్సెలింగ్ నాకు 22 ఏళ్లు. బి.టెక్. ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇటీవలే మా క్లాస్‌మేట్‌తో కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొన్నాను. పది రోజుల తర్వాత మూత్రంలో మంట మొదలైంది. ఇది జరిగి మూడు నెలలు అవుతోంది. ఆ అమ్మాయికి వేరే అబ్బాయిలతో కూడా సంబంధాలు ఉన్నాయని తెలిశాక హెచ్ఐవీ వస్తుందేమో అని భయం వేసి, పరీక్ష చేయించాను. నెగెటివ్ అని చెప్పారు. అయితే విండో పీరియడ్‌లో రిజల్ట్ సరిగా రాదని తెలిసి, మళ్లీ ఆందోళన మొదలైంది. నాకు హెచ్ఐవీ లేదని కన్ఫర్మేషన్ కోసం ఇంకే పరీక్షలు చేయించాలి? - జీ.ఆర్.కె., హైదరాబాద్ హెచ్ఐవీ నిర్ధారణ విషయంలో హెచ్ఐవీ ఎలీసా, వెస్ట్రన్ బ్లాట్ త్వరగా నిర్ధారణ చేయగలిగే పరీక్షలు. విండో పీరియడ్ అంటే వ్యాధి సోకడానికి, అది పరీక్షల ద్వారా బయటపడటానికి మధ్యన ఉండే సమయం. అంటే... విండో పీరియడ్‌లో పరీక్ష చేయిస్తే ఒకవేళ శరీరంలో హెచ్ఐవీ కారక ఇన్ఫెక్షన్ ఉన్నా పరీక్షల్లో మాత్రం తెలియదన్నమాట. ఎలీసా టెస్ట్‌లో ఈ విండో పీరియడ్ ఆర్నెల్ల వరకు పట్టవచ్చు. అదే వెస్ట్రన్ బ్లాట్ అయితే కొన్ని వారాల లోపే తెలుస్తుంది. అందుకే సెక్స్ తర్వాత వెస్ట్రన్ బ్లాట్గాని, ఎలీసాగాని మొదట చేయించి, ఆ తర్వాత మూడు నెలలకోసారి పరీక్ష చేయించి, నెగెటివ్ ఫలితం వస్తే మీరు నిశ్చింతగా ఉండవచ్చు. పెళ్లి వరకూ సెక్స్‌లో పాల్గొనకుండా ఉండటం అటు శారీరక ఆరోగ్యానికీ, ఇటు నైతిక, సామాజిక ఆరోగ్యానికి కూడా మంచిది. నా వయసు 24. గత పదేళ్లుగా రోజూ రెండుసార్లు హస్తప్రయోగం అలవాటు. స్ఖలనం తర్వాత నీరసంగా అనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా అంగం మీద నరాలు పెద్దగా కనిపిస్తున్నాయి. పూర్వంలా అంగస్తంభనలు కలగడం లేదు. నాకు సరైన సలహా ఇవ్వండి. - వి.ఎన్.ఆర్ యువకుల్లో ఆర్థిక, కెరియర్‌పరమైన బాధ్యతలు పెరుగుతుండటంతో అంగస్తంభనలు తగ్గినట్లుగా అనిపిస్తుంటాయి. ఇక అంగం మీద నరాలు (రక్తనాళాలు) కనిపిస్తుండటం అన్నది ఒక సమస్యే కాదు. ఇలా నరాలు ఉబ్బినట్లుగా కనిపించడానికి, అంగస్తంభనలు రాకపోవడానికి సంబంధమే లేదు. ఉదయం వేళల్లో నిద్రలో మీకు అంగస్తంభనలు కలుగుతుంటే మీరు అన్నివిధాలా నార్మలే. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 67. కొంతకాలంగా మూత్రం సరిగ్గా రావడం లేదు. కొంచెం కొంచెంగా చుక్కలుగా పడుతోంది. రాత్రివేళల్లో మళ్లీ మళ్లీ మూత్రానికి వెళ్లాల్సి వస్తోంది. నా సమస్య ఆపరేషన్ అవసరం లేకుండా హోమియో ద్వారా నయమవుతుందా? - విశ్వనాథరావు, హైదరాబాద్ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు బినైన్ ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ ఉండే అవకాశం ఉంది. సాధారణంగా వయసు పైబడిన వాళ్లలో ప్రోస్టేట్ గ్రంథి పరిమాణం పెరుగుతుంది. కొందరి విషయంలో 45 ఏళ్ల నుంచే ప్రోస్టేట్ గ్రంథి పెరగడం ప్రారంభం కావచ్చు. ఇలా జరగడం మాత్రం సాధారణమే. ప్రోస్టేట్ గ్రంథి పెరగడం వల్ల యూరిన్ పూర్తిగా బయటకు రాకుండా మూత్రాశయంలోనే నిల్వ ఉండటం, రాత్రి మళ్లీ మళ్లీ సడన్‌గా మూత్రానికి వెళ్లాల్సిరావడం, మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి, మంట, మూత్రవిసర్జన కోసం చాలా ఎక్కువగా ముక్కుతూ ఒత్తిడి కలిగించాల్సి రావడం, మూత్రం చుక్కలు చుక్కలుగా పడటం, విసర్జన సమయంలో మంట, మూత్రం చుక్కలతో పాటు ఒక్కోసారి రక్తం కూడా రావడం వంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు ప్రోస్టేట్ ఎన్‌లార్జిమెంట్ వచ్చిన గ్రంథి క్యాన్సర్ బారిన పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఈ పరిస్థితి కాస్త అరుదు. మీకు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోడానికి ‘ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజన్’ (పీఎస్ఏ) పరీక్ష చేయించుకోవాలి. అలాగే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా లేక కేవలం ఎన్లార్జిమెంటేనా అని తెలుసుకోడానికి కొన్ని మూత్రపరీక్షలు, యూరోఫ్లోమెట్రీ వంటి పరీక్షలు అవసరం. హోమియోకేర్ ఇంటర్నేషనల్ చికిత్స ప్రోస్టేట్ ఎన్‌లార్జిమెంట్ కోసం హోమియోలో ఆర్నికా, లైకోపోడియం, అర్జెంటమ్ నైట్రికమ్, బెరైటా కార్బ్, కిమేఫిల్లా, హైడ్రాంజియా, ఆయోడమ్, సబల్ సెరులేటా, సల్ఫర్, తూజా వంటి చాలా మంచి మందులున్నాయి. వ్యాధి లక్షణాలను బట్టి ఈ మందులను ఆక్యూట్ దశలో ఇవ్వవచ్చు. అదేవిధంగా ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి బెల్లడోనా, కాంథారిస్, నైట్రిక్ యాసిడ్, పల్సటిల్లా, సైలీషియా, స్టెఫిసాగ్రియా, తూజా వంటి చాలా మందులు వాడవచ్చు. మీరు మొదట పీఎస్ఏ పరీక్ష చేయించుకుని, ఈ సమస్యకు చికిత్స చేయగల నిపుణులైన హోమియో వైద్యుడిని సంప్రదించండి. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 21. నాకు ముఖమంతా మొటిమలు, మచ్చలు ఉన్నాయి. దాంతో నేను క్లిండామైసిన్, మెలాగ్లో ఆయింట్‌మెంట్స్‌ను ఒక నెలరోజులపాటు పైపూతగా వాడాను. అయినా ఫలితం లేకపోవడంతో డాక్టర్ దగ్గరకెళ్లాను. ఆమె సూచించిన మందులను మూడునెలలపాటు వాడాను. కానీ ప్రయోజనం కనిపించలేదు. ఈ మొటిమలు, మచ్చలతో నా ముఖం అందవికారంగా తయారైంది. దయచేసి మీరు తగిన పరిష్కారం సూచించగలరు. - అఖిల, ఈ మెయిల్ ఇప్పటికే మీరు సొంతంగా కొన్ని, వైద్యసలహాతో మరికొన్ని మందులు చాలా రోజులపాటు వాడారు. అయినా ఫలితం లేదంటున్నారు కాబట్టి చర్మవ్యాధుల నిపుణులను కలిసేలోగా మీరు మెడికేటెడ్ సన్‌స్క్రీన్ లోషన్ వాడండి. మీరు చర్మవ్యాధుల నిపుణులను కలిస్తే, అసలు మీకెందుకలా మొటిమలు, మచ్చలు వస్తున్నాయనేది తగిన పరీక్షలు చేసి, కనుక్కుంటారు. ఒకవేళ హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తున్నట్లయితే కనక అందుకు తగిన మందులు ఇస్తారు. మందుల వల్ల ప్రయోజనం లేకపోతే లేజర్ ట్రీట్మెంట్ ద్వారా వాటిని తగ్గిస్తారు. ఆందోళన వద్దు. నా వయసు 45. నా హీమోగ్లోబిన్ శాతం చాలా తక్కువగా ఉండటం వల్ల నాలుగు యూనిట్ల రక్తం ఎక్కించారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి, నా గర్భసంచి తొలగించారు. అప్పటినుంచి నాకు విపరీతంగా జుట్టు ఊడిపోతోంది. దీనికితోడు నా ఛాతీ మధ్యభాగంలో చిన్న మచ్చ ఏర్పడింది. దయచేసి, తగిన సలహా చెప్పండి. - కె. నందిని, హైదరాబాద్ సాధారణంగా ఐరన్ లోపం వల్ల, విటమిన్ బీ 12 లోపం వల్ల జుట్టు రాలిపోవడం జరుగుతుంటుంది. ప్రస్తుతం మీ రక్తంలో ఫెర్రెటిన్, బీ 12 ఎంత శాతం ఉందో పరీక్ష చేయించుకుని, డెర్మటాలజిస్ట్‌ను కలవండి. వాటి శాతం తక్కువగా ఉంటే తగిన మందులు ఇస్తారు. మీరు తెలియజేసిన వివరాలను బట్టి మీ ఛాతీపైన మచ్చ ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండవచ్చునని భావిస్తున్నాను. దానికి పై పూతగా యాంటీ ఫంగల్ క్రీములు వాడటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. మీరు వెంటనే మంచి డెర్మటాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ రే ఖాసింగ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ ఒలీవా అడ్వాన్స్డ్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ -
లింఫ్గ్రంథులకూ టీబీ వచ్చే అవకాశం ఉంది...
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 35 సంవత్సరాలు. నేను ఉద్యోగరీత్యా తరచు ప్రయాణాలు చేస్తుంటాను. ఎక్కువగా నాన్‌వెజ్ తీసుకుంటాను. ఈ మధ్య నా కాలిబొటనవేలు వాచి విపరీతంగా నొప్పిగా ఉంటే రక్తపరీక్షలో యూరిక్ యాసిడ్ పెరిగిందన్నారు. హోమియోలో దీనికి చికిత్స ఉందా? - పి. రమేశ్, రామేశ్వరం మన శరీరంలో ఏ కదలికలోనైనా కీళ్లదే ప్రధాన పాత్ర. ఆహార నియమాల లోపం వల్ల, కాలేయానికి సంబంధించిన జీవక్రియల అసమతుల్యత వలన రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగి కీళ్లలో గుళికలుగా చేరి నొప్పిని కలిగిస్తాయి. అలాంటి కీళ్ల జబ్బును గౌట్ ఆర్థరైటిస్ అంటారు. 25 నుంచి 45 సంవత్సరాల మధ్యవయసులో ఈ వ్యాధి రావచ్చు. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో గౌట్ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. గౌట్ ప్రధానంగా కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఈ ఆర్థరైటిస్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. మూత్రపిండాలు ఆశించిన స్థాయిలో యూరిక్ యాసిడ్ బయటికి పారదోలడంలో వైఫల్యం చెందడం వల్ల రక్తంలో వాటిస్థాయి పెరుగుతుంది. కారణాలు: రక్తంలో యూరిక్ ఆసిడ్ స్థాయి పెరగడం, వంశపారంపర్యం, స్థూలకాయం, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి, రోగనిరోధక శక్తి తగ్గించే మందులు, అధిక మద్యపానం, ఎక్కువగా మాంసం, చేపలు తినడం వల్ల, హైపోథైరాయిడ్ సమస్యతో బాధపడేవారిలో యూరిక్ ఆసిడ్ పెరిగే అవకాశం ఉంటుంది. లక్షణాలు: అకస్మాత్తుగా రాత్రివేళలో జ్వరం రావడం, కాలి బొటన వేలిలో నొప్పి, వాపుతో ప్రారంభమవుతుంది. అందుకే గౌట్ ఆర్థరైటిస్‌ను వైద్యపరిభాషలో పొడగ్రా అంటారు. కీళ్లవాపుతో కీళ్లు ఎర్రగా మారడం, కీళ్లు వేడిగా ఉండటం, మోకాళ్లలో నొప్పి, రాత్రివేళలో విపరీతమైన జ్వరం, నీరసంగా ఉండటం. జాగ్రత్తలు: మద్యపానం మానేయాలి, మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. క్రమపద్ధతిలో వ్యాయామం చేయాలి. చాలామందిలో కీళ్లనొప్పులు వచ్చేంత వరకు తెలియదు వారిలో యూరిక్ యాసిడ్ స్థాయికి మించి ఉందని. ముందుజాగ్రత్తగా ఇలాంటి నొప్పులు రాకుండా ఉండటానికి అధిక బరువును నియంత్రించాలి. సమతులాహారాన్ని తీసుకోవాలి. హోమియో చికిత్స: హోమియోపతిలో గౌట్ ఆర్థరైటిస్‌కు రోగి మానసిక, శారీరక లక్షణాలను అనుసరించి మందులివ్వడం జరుగుతుంది. కీళ్లలో యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏర్పడకుండా చూసి, రక్త ప్రసరణలోని వివిధ రసాయనాల సమతుల్యతను కాపాడటం ద్వారా గౌట్ వ్యాధిని సమూలంగా నయం చేయవచ్చు. ముఖ్యంగా బ్ర యోనియా, కాల్బికమ్, బెంజోమిన్, ఆసిడ్, బెర్పిరిస్, నైట్రిక్ యాసిడ్ వంటి మందులను వైద్యుని పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ డయాబెటిస్ కౌన్సెలింగ్ నా వయసు 32. ఈ మధ్య నా భార్యకు తెలియకుండా నాకు పరిచయం ఉన్న ఓ ఆంటీని కలిశాను. ఆవిడతో కలిసిన కొద్దిరోజులకే మూత్రంలో మంట, దురద, అంగచర్మంపై పొక్కులు వచ్చాయి. ఇది హెచ్.ఐ.వి అని నా ఫ్రెండ్స్ అంటే పరీక్ష చేయించుకున్నాను. హెచ్.ఐ.వి. నెగటివ్ వచ్చింది. అయినా నాకు భయంగా ఉంది. నా భార్యకు కూడా వస్తుందా? నాకు తగిన పరిష్కారం సూచించగలరు. - ఒక సోదరుడు, హైదరాబాద్ మీరు ఎప్పుడైనా బయటి వ్యక్తులతో కలిసినప్పుడు కండోమ్ వాడాలి. కండోమ్స్ వాడకం వల్ల సుఖవ్యాధులు రాకుండా ఉంటాయి. తర్వాత మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తుంటే హెచ్.ఐ.వి పరీక్ష అనేది అరక్షిత సెక్స్‌లో పాల్గొన్న మూడు నెలల తర్వాత తెలుస్తుంది. దీనిని విండోపిరియడ్ అంటారు. ఈ సమయంలో హెచ్.ఐ.వి పరీక్ష నెగటివే వస్తుంది. మీరు మూడు నెలల తర్వాత పరీక్ష చేయించుకోండి. అయితే సుఖవ్యాధులు మాత్రం సెక్స్‌లో పాల్గొన్న అతి తక్కువ వ్యవధిలోనే తెలుస్తుంది. దీనికోసం మీరు వీడీఆర్ఎల్, టార్చ్ పరీక్షలు, వీటితోపాటు ఆర్బీఎస్ పరీక్ష కూడా చేయించుకోవడం ద్వారా మీకు వచ్చినది సుఖవ్యాధా, కాదా తెలుస్తుంది. ప్రస్తుతం మీకు సుఖవ్యాధి ఉన్నా లేకపోయినా మీరు మీ భార్యతో కండోమ్‌తోనే సెక్స్‌లో పాల్గొనడం సురక్షితం. నా వయసు 21. నాకు ఆరు నెలలుగా జ్వరం వస్తూ పోతూ ఉంటోంది. వైద్యుల దగ్గరకి వెళ్లి చికిత్స తీసుకున్నా, ఫలితం లేదు. మలేరియా, మూత్రపరీక్ష, షుగర్ పరీక్షలు అన్నీ నెగటివ్ అనే వస్తున్నాయి. నాకు జ్వరంతో పాటు రాత్రులు విపరీతమైన చలి, దుప్పట్లు తడిసిపోయేంత చెమట కూడా ఉంటోంది. బాగా నీరసంగా ఉంటోంది. బరువు కూడా తగ్గాను. నా మెడ దగ్గర కొన్ని గడ్డలుగా కూడా ఉన్నట్లు అనిపిస్తోంది. నాకు తరుణోపాయం చూపించగలరు. - శ్రీలక్ష్మి, గుంతకల్లు మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తుంటే సర్వైకల్ లింఫిడినోపతిలా కనిపిస్తోంది. మీరు సీబీపీ, ఈఎస్సార్, ఎంపీ, వైడల్, సీయూఈ, చెస్ట్ఎక్స్రే, ఎఫ్ఎన్ఏసీ లేదా బయాప్సీ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా మీకు ఎటువంటి జ్వరం అన్నది తెలుస్తుంది. మీకు వచ్చిన జ్వరం టీ బీ జ్వరం అని నాకు అనిపిస్తోంది. టీబీ ఊపిరితిత్తులకే కాకుండా లింఫ్ గ్రంథులకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకసారి నేను చెప్పిన పరీక్షలు చేయించుకుని మీరు డాక్టర్ దగ్గర చూపించుకుంటే మీకు మంచి తరుణోపాయం లభిస్తుంది. డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కన్సల్టెంట్ - ఇంటర్నల్ మెడిసిన్ అండ్ డయాబెటిస్ సెంచరీ హాస్పిటల్ బంజారాహిల్స్, హైదరాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ మా అబ్బాయి వయసు 19 ఏళ్లు. ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఇటీవల వాడికి కాళ్లలో వాపు వస్తుంటే వైద్యులకు చూపించాం. పలు వైద్యపరీక్షలు నిర్వహించి, మా అబ్బాయికి కిడ్నీ జబ్బు ఉందని నిర్ధారించారు. మా కుటుంబ సభ్యుల్లో ఎవరికీ ఈ జబ్బు లేదు. మరి మా వాడికే ఎందుకొచ్చిందో తెలియడం లేదు. దయచేసి మా అబ్బాయి సమస్యకు సరైన పరిష్కారం చూపించగలరు. - ప్రకాష్, గుంటూరు కిడ్నీజబ్బులు రావడానికి చాలా కారణాలుంటాయి. మధుమేహం, రక్తపోటు ఉన్నవారిలో, ఊబకాయంతో బాధపడుతున్న వారిలో, కిడ్నీజబ్బులున్న కుటుంబ చరిత్ర కలిగి ఉన్నవారిలో ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కారణం తెలియకుండా కూడా కిడ్నీ జబ్బులు వస్తాయి. కిడ్నీజబ్బులు ఏ వయసులోనైనా రావచ్చు. కాబట్టి ఈ వ్యాధివల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీజబ్బు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలూ కనిపించవు. దురదృష్టవశాత్తూ వ్యాధి ముదిరిన తర్వాతనే లక్షణాలు బయట పడుతుంటాయి. కిడ్నీ వ్యాధిలో ఐదు దశలు ఉంటాయి. రోగి వయసు, వ్యాధి, దశ, ఇతర పరిస్థితులను బట్టి చికిత్స అందిస్తారు. మొదటి రెండు దశల్లోనే వ్యాధిని గుర్తించి చికిత్స అందిస్తే చాలా వరకు పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉంటుంది. మూడవ దశ, నాలుగవ దశలో గుర్తించి చికిత్స అందిస్తే వ్యాధి తీవ్రత పెరగకుండా చూసుకోవచ్చు లేదా 10-15 ఏళ్ల వరకు వ్యాధి ముదరకుండా వాయిదా వేయవచ్చు. కిడ్నీజబ్బు ఓ సెలైంట్ కిల్లర్. ఎందుకంటే ఈ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తుంటుంది. ఈ జబ్బులో చాలా వరకు వ్యాధి ముదిరిన తర్వాతనే లక్షణాలు కనపడుతుండడంతో ముందస్తుగా ఏం చేయలేకపోతుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా ఏడాదికి ఒకసారి మూత్రపరీక్ష, సీరమ్ క్రియాటినిన్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. మీ అబ్బాయికి కిడ్నీజబ్బు ఉందని మీరుగాని, మీ కుటుంబ సభ్యులు కానీ ఆందోళన చెందకండి. ప్రస్తుతం కిడ్నీజబ్బులకు మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చికిత్సను కొనసాగిస్తూ వైద్యుల సలహాలు, సూచనలు పాటించడం ద్వారా మీ అబ్బాయి కూడా అందరిలాగే సాధారణ జీవితం గడపగలుగుతారు. చదువను కొనసాగించి ఉద్యోగాలు, వ్యాపారాలు కూడా చేయగలుగుతారు. డాక్టర్ వి.సురేష్‌బాబు సీనియర్ నెఫ్రాలజిస్ట్ యశోదా హాస్పిటల్స్ సికింద్రాబాద్ -
ఆందోళనే అసలు సమస్య
ప్రైవేట్ కౌన్సెలింగ్ నాకు 30 ఏళ్లు. మూడు నెలల కిందట వివాహమయ్యింది. పెళ్లయిన మొదటిరాత్రి అంగం బాగానే గట్టిపడింది కాని అంగప్రవేశం చేస్తున్నప్పుడు టెన్షన్ వల్ల అంగస్తంభన తగ్గి సెక్స్ చేయలేకపోయాను. అప్పట్నుంచి సెక్స్ చేయాలంటే భయం వేస్తోంది. ఒకప్పుడు హస్తప్రయోగం బాగా చేసేవాణ్ణి. నెల తర్వాత ఇప్పుడు కూడా సెక్స్‌లో పాల్గొనాలంటే భయంతో సెక్స్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు నా భార్య కూడా నాతో సహకరించడం లేదు. దాంతో ఇంకా డిప్రెషన్లోకి వెళ్తున్నాను. నేను ఏం చేయాలో సలహా ఇవ్వండి. - కేకేఆర్., సికింద్రాబాద్ మీరు యాంగ్జైటీ న్యూరోసిస్‌తో బాధపడుతున్నారు. కొత్తగా పెళ్లయినవాళ్లలో ఆందోళన వల్ల ఇలా ఆశాభంగం కలగడం సహజం. ఇది సర్వసాధారణం. సెక్స్ అనేది స్వాభావికంగా చేసే సాధారణ ప్రక్రియ. ఇది ఇలాగే చేయాలనే నియమ నిబంధలేమీ ఉండవు. భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమ ఉండి మీ భార్య, మీరు పరస్పరం సహకరించుకుంటే మీరు ఈ సమస్యను చాలా తేలిగ్గా అధిగమించగలరు. మందులేవీ అవసరం లేకుండానే సెక్స్‌లో సమర్థంగా పాల్గొనగలరు. మరో విషయం... మీరు గతంలో చేసిన హస్తప్రయోగం వల్ల మీకు ఈ సమస్య రాలేదు. మీ భార్యతో సెక్స్‌లో పెర్ఫార్మార్మెన్స్ యాంగ్జైటీకి లోనవ్వడం వల్ల ఇలా జరిగింది. నాకు 28 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. ఈమధ్య సంబంధాలు చూస్తున్నారు. నాకు ఐదేళ్ల కిందట అంగస్తంభనలు బాగానే ఉండేవి. కాని ఈమధ్యకాలంలో అంతత్వరగా అంగస్తంభనలు కలగడం లేదు. సెక్స్చిత్రాలు చూసినా కూడా ఇదివరకు ఉన్నంత అంగస్తంభనలు రావడం లేదు. హస్తప్రయోగం చేస్తుంటే వీర్యం కూడా తక్కువగానే వస్తోంది. నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. దాంతో భార్యను సుఖపెట్టగలనా అని భయం వేస్తోంది. నాకు మంచి సలహా ఇవ్వండి. - ఎస్.ఆర్.కే., పొదిలి సాధారణంగా 20-25 ఏళ్ల మధ్య వయసున్నవారిలో విపరీతమైన సెక్స్ కోరికలు, వెంటవెంటనే అంగస్తంభనలు ఉండటం సాధారణం. మన దేశంలో సాధారణంగా యువత 25 ఏళ్ల ప్రాయం నుంచి యువకులు ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక అంశాల్లో నిమగ్నమై సాధారణ వ్యవహారాల్లో సమస్యలను ఎదుర్కోవడం మొదలై సెక్స్ మీద కొంత కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. దాంతో కొందరిలో హస్తప్రయోగం సమయంలో తృప్తి తక్కువగా ఉండవచ్చు. ఇది ప్రధాన సమస్య కాదు. పైగా మీ వయసులోని వారు ఎంతోకాలంగా హస్తప్రయోగం చేస్తుండటం వల్ల అది యాంత్రిక ప్రక్రియగా మారి గతంలో ఉన్నంత థ్రిల్ ఇవ్వకపోవచ్చు. అయితే పెళ్లితో ఈ సమస్యలు సమసిపోతాయి. మీరు నిశ్చింతగా పెళ్లి చేసుకుని సాధారణ సెక్స్ జీవితాన్ని గడపవచ్చు. నాకు 65 ఏళ్లు. నా భార్యకు 55 సంవత్సరాలు. నాకు సెక్స్ అంటే చాలా ఇంటరెస్ట్. ఇటీవల మూత్రపరీక్షలు చేయించుకుంటే ప్రోస్టేట్ గ్రంథిలో గడ్డలు తయారైనట్లు చెప్పారు. మూత్రం సరిగ్గా రాకపోవడంతో ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా ఆపరేషన్ చేసి తొలగించాలని చెబుతున్నారు. దీన్ని తొలగించాక వీర్యం రాదు అని అంటున్నారు. అంగస్తంభన ఏమైనా దెబ్బతింటుందేమోనని నాకు ఆందోళనగా ఉంది. ఈ విషయంలో నాకు సరైన సలహా ఇవ్వగలరు. - ఎమ్‌పీఎల్., విజయనగరం అరవై ఏళ్లు పైబడ్డవారిలో ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు రావడం సాధారణం. వీటిని మందులతో లేదా ఎండోస్కోపీ (టీయూఆర్‌పీ)తో నయం చేస్తాం. ఎక్కువభాగం వీర్యం ఈ ప్రోస్టేట్ గ్రంథి వల్లనే తయారవుతుంది. కాబట్టి దీన్ని తొలగించినప్పుడు వీర్యం తక్కువగా వస్తుంది. అయితే సెక్స్ చేయడానికి గాని, సెక్స్‌లో సంతృప్తి పొందడానికి గాని ఈ ఆపరేషన్ ఏవిధంగానూ అడ్డంకి కాదు. దీని వల్ల సెక్స్‌లో ఏ లోపమూ రాదు. అందువల్ల ఈ ఆపరేషన్ అవసరమని డాక్టర్లు చెబితే నిశ్చింతగా టీయూఆర్‌పీ సర్జరీ చేయించుకోవచ్చు. నా వయుస్సు 70 ఏళ్లు. పదిహేనేళ్ల నుంచి షుగర్ ఉంది. నా వుూత్రవూర్గం సన్నబడింది. డాక్టర్ సలహాతో యుూరెథ్రల్ క్యాథెటర్తో ఐదురోజులకు ఓసారి కాథెటరైజేషన్ చేసుకుంటున్నాను. ఇందుకోసం దాదాపు 15 నిమిషాల సమయం పడుతోంది. నాకు పెరీనియుల్ యుూరెథ్రాస్టమీ అవసరవూ? అప్పుడు యూరిన్పై కంట్రోల్ లేకుండా పోతుందా? - సీహెచ్‌ఎస్‌ఆర్., హైదరాబాద్ జ: డెబ్బయి ఏళ్ల వయసులో షుగర్ ఉండటం, ప్రోస్టేట్ పెరగడం, వుూత్రం సరిగ్గా రాకపోవడం అన్న సమస్యలు చాలా సాధారణంగా వచ్చేవే. ఇవే కాకుండా వుూత్రం సరిగ్గా రాకపోవడానికి స్ట్రిక్చర్ (వుూత్రనాళం సన్నబడటం) వంటివి కూడా కారణం కావచ్చు. ఈ స్ట్రిక్చర్ను రెట్రోగ్రేడ్ యూరొథ్రోగ్రామ్ (ఆర్జీయుూ) పరీక్ష ద్వారా కనుగొంటారు. ఆర్జీయుూ పరీక్షలోస్ట్రిక్చర్ను కనుగొంటే దానికి పెరీనియుల్ యుూరెథ్రోప్లాస్టీ అన్నది మంచి చికిత్స ప్రక్రియు. మీరు చెప్పిన పెరీనియుల్ యుురెథ్రాస్టమీ అన్నది స్ట్రిక్చర్ చాలా పొడవుగా ఉన్న సవుయుంలో చివరి ఆప్షన్‌గా చేసే శస్త్రచికిత్స. అరుుతే ఈ సర్జరీలో వుూత్రం వచ్చే వూర్గాన్ని వృషణాల కింద ఉండేలా ఏర్పాటు చేస్తారు. అలాంటప్పుడు కూర్చుని వుూత్ర విసర్జన చేయూల్సి ఉంటుంది. యుూరిన్పై మీ కంట్రోల్ ఉంటుంది. మీరు అనుకుంటున్నట్లు యుూరిన్ లీక్ అవ్వదు. నేను డిగ్రీ చదువుతున్నాను. నా ఛాతీ అమ్మాయిల ఛాతీలా పెరిగి ఉంది. ‘నువ్వు అమ్మాయివా?’ అంటూ ఫ్రెండ్స్ ఆటపట్టిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం నేను ఏం చేయాలో సలహా ఇవ్వండి. - ఎస్.ఆర్.కె., కొండాపూర్ కొన్ని సార్లు కొందరు అబ్బాయిల్లో కూడా యుక్తవయసులో బ్రెస్ట్లా పెరగవచ్చు. దీన్ని గైనకోమాస్టియా అంటారు. దీని పరిమాణం చిన్నగా ఉంటే అవి వాటంతట అవే తగ్గిపోవచ్చు. ఒకవేళ మరీ పెద్దగా ఉండి, పెరుగుతూ ఉంటే ప్రోలాక్టిన్ వంటి హార్మోన్ పరీక్షలు చేసి ఈ పెరుగుదలకు కారణమేమిటో ముందుగా కనుక్కుని, దానికి అనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కారణమేమీ లేకుండానే ఇవి పెరుగుతుంటే లైపోసక్షన్ అనే సర్జరీ ద్వారా అతి తక్కువ కోతతో వీటిని తొలగించవచ్చు. చాలామంది అనుకున్నట్లు లేదా మీ ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తున్నట్లు ఇది అన్నిసార్లూ ఆడతనాన్ని సూచించదు. కాబట్టి అనవసరంగా కంగారు పడకుండా యాండ్రాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
మాటిమాటికీ ఇద్దరికీ ఇన్ఫెక్షన్స్?
ప్రైవేట్ కౌన్సెలింగ్ నాకు 32 ఏళ్లు. సెక్స్ చేసిన ప్రతిసారీ మూత్రంలో మంట వస్తోంది. నాకంటే కూడా నా భార్యకు విపరీతమైన మంట, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం, పొత్తికడుపులో నొప్పిగా ఉండటం జరుగుతోంది. యాంటీబయాటిక్స్ వాడినప్పుడల్లా సమస్య కొద్దిగా తగ్గినా రెండు మూడు నెలల తర్వాత మళ్లీ వస్తోంది. దాంతో సెక్స్ అంటేనే భయంగా ఉంది. దయచేసి మా సమస్యకు పరిష్కారం చూపండి. - జి.ఎస్.ఆర్., సూళ్లూరుపేట మీరు చెబుతున్న లక్షణాలు బట్టి మీరిద్దరూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. సెక్సువల్ ఇంటర్‌కోర్స్ వల్ల ఈ ఇన్ఫెక్షన్ తీవ్రత మరింత ఎక్కువవుతోంది. చాలామంది మహిళల్లో వాళ్ల యోని బ్యాక్టీరియాతో కంటామినేట్ కావడం వల్ల, లేదా ఈ బ్యాక్టీరియాను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి (రెసిస్టెన్స్) తక్కువగా ఉండటం వల్ల యోని నుంచి బ్లాడర్‌కు తఈ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. మీరిద్దరూ యూరిన్ కల్చర్, బ్లడ్ షుగర్ వంటి పరీక్షలు చేయించుకొని, పూర్తి కోర్సు యాంటీబయాటిక్స్ మధ్యలో ఆపకుండా వాడండి. అప్పటికీ తగ్గకపోతే ఇద్దరూ యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయస్సు 74 ఏళ్లు. ప్రోస్టేట్ గ్లాండ్‌ను పూర్తిగా తొలగించారు. అయితే అంగస్తంభనలు మాత్రం బాగానే ఉంటున్నాయి. అప్పుడప్పుడు హస్తప్రయోగం చేస్తున్నాను. కానీ వీర్యం మాత్రం అస్సలు రావడం లేదు. నాకు వీర్యం ఎందుకు కావడం లేదు? ఈ ఆపరేషన్ తర్వాత సెక్స్ చేయవచ్చా? - ఆర్.ఆర్.డి., గుంటూరు ప్రోస్టేట్ గ్లాండ్ తొలగించిన తర్వాత వీర్యం ఎక్కువగా రాదు. ఎందుకంటే వీర్యంలో ఎక్కువభాగం ఈ గ్రంథి నుంచే తయారవుతుంది. అంగస్తంభనలు బాగా ఉండి మీరు సెక్స్ చేయగలుగుతుంటే నిరభ్యంతరంగా సెక్స్‌లో పాల్గొనవచ్చు. ఇందువల్ల ఎలాంటి ప్రమాదం, ఇబ్బంది ఉండదు. ఈ వయస్సులో వీర్యం వచ్చినా, రాకపోయినా దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు సెక్స్‌లో సంతృప్తి ఉంటే చాలు. నాకు 35 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. ఇక పిల్లలు పుట్టకుండా నేను వాసెక్టమీ చేయించుకోవాలనుకుంటున్నాను. అయితే మగతనానికి ఏదైనా లోపం వస్తుందేమోనని నాకు ఆందోళన కలుగుతోంది. ఒక్కోసారి మా ఆవిడకు ట్యూబెక్టమీ చేయిద్దామని కూడా అనుకుంటున్నాను. మా ఇద్దర్లో ఎవరు ఆపరేషన్ చేయించుకుంటే మంచిది? వాసెక్టమీ చేసిన తర్వాత మగతనం తగ్గుతుందని మా ఫ్రెండ్స్ అంటున్నారు. ఇది వాస్తవమేనా? - వి.ఆర్.కె., తల్లాడ మహిళలకు ట్యూబెక్టమీ చేయించడం కంటే మగవారిలో వాసెక్టమీ చేయడం సర్జికల్‌గా చాలా సులభమైన ప్రక్రియ. వాసెక్టమీ చేసిన తర్వాత ఒక్కరోజు కూడా ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు. ఈమధ్య కాలంలో ఒక్క కుట్టు కూడా లేకుండా, బ్లేడ్ ఉపయోగించకుండా కూడా ఈ ఆపరేషన్ చేయడం సాధ్యమవుతుంది. దీన్ని ‘నో స్కాల్పెల్ వ్యాసెక్టమీ’ అంటారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఇది పూర్తవుతుంది. ఆ మర్నాటి నుంచి అన్ని పనులూ మామూలుగానే చేసుకోవచ్చు. ఈ సర్జరీ వల్ల అంగస్తంభనల్లోగాని, సెక్స్ కోరికల విషయంలోగాని, పురుషత్వపు సామర్థ్యంలోగాని ఎలాంటి తేడాలు ఉండవు. శరీర దారుఢ్యంలోగాని, బరువులు ఎత్తడంలోగాని, ఫిట్నెస్లోగాని ఎలాంటి మార్పులు రావు. ఇంత తేలికైన ఆపరేషన్ కాబట్టే సాధారణంగా మగవారే వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకోవడం మంచిదని డాక్టర్లు సలహా ఇస్తారు. నాకు 60 ఏళ్లు. రోజూ ఒక పాకెట్‌కు పైగా సిగరెట్లు తాగుతాను. గత 15 రోజుల నుంచి నాకు మూత్రంలో రక్తం పడుతోంది. అయితే మంట, నొప్పి ఏమీ లేవు. ఈ వయస్సులో మూత్రంలో రక్తం పడటం మంచిది కాదని తెలిసినవాళ్లు అంటున్నారు. నాకు తగిన సలహా ఇవ్వండి. - ఎం.వి.పి.ఆర్., కందుకూరు నొప్పి లేకుండా మూత్రంలో రక్తం పడటాన్ని ‘పెయిన్లెస్ హిమచ్యూరియా’ అంటారు. యాభై ఏళ్లు పైబడిన వారిలో ఇలా రక్తం పడే లక్షణం కనిపిస్తున్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రత్యేకంగా పొగ తాగేవాళ్లలో వాళ్ల స్మోకింగ్ అలవాటు వల్ల బ్లాడర్‌లో చిన్న చిన్న గడ్డల వల్ల కూడా ఇది రావచ్చు. ఇదిగాక ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్‌లార్జిమెంట్ వల్ల లేదా ఇతరత్రా మూత్రంలో ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఇలా మూత్రంలో రక్తం రావచ్చు. కారణం ఏమైనా ఇలా నొప్పి లేకుండా మూత్రంలో రక్తం పడితే అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిస్టోస్కోపీ, మూత్రపరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ముందు మీరు మీ స్మోకింగ్ అలవాటును పూర్తిగా ఆపేయండి. అయితే తక్కువ వయస్సున్న వారిలో ఇలా మూత్రంలో రక్తం పడితే అది ఎక్కువశాతం ఇన్ఫెక్షన్ల వల్లనే కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మీరు వీలైనంత త్వరగా యూరాలజిస్ట్‌ను కలవండి. నా వయస్సు 28 ఏళ్లు. నాకు ఎడమవైపున ఉన్న వృషణం కుడివైపు దానికంటే కొంచెం కిందికి జారినట్లుగా ఉంటుంది. దాంతో నా పురుషాంగం కొంచెం ఎడమవైపునకు ఒంగినట్లుగా ఉంది. దాంతో అంగం స్తంభించినప్పుడల్లా నా పురుషాంగం ఎడమవైపునకు ఒంగుతోంది. వృషణాలు ఒకే లెవెల్లో లేకపోవడం వల్లనే పురుషాంగం ఇలా పక్కుకు వంగుతోందా? దీనివల్ల నేను పెళ్లి చేసుకొని సెక్స్‌లో పాల్గొంటే ఇబ్బందులు వస్తాయా? దీనికి చికిత్స ఉంటుందా? - కె.ఎస్.ఆర్., తెనాలి వృషణాలు సమానమైన లెవెల్లో ఉండకపోవడం చాలా సాధారణం. అంగం కూడా కొంచెం ఎడమవైపునకో, కుడివైపునకో పక్కకు తిరిగి ఉండటం కూడా సహజమే. పురుషాంగం ఇలా పక్కకు తిరిగి ఉండటానికీ, వృషణాల లెవెల్ సమానంగా లేకపోవడానికీ సంబంధం లేదు. మీకు సెక్స్ కోరికలు మామూలుగానే కలుగుతూ, అంగస్తంభనలు నార్మల్‌గా ఉండి, వృషణాల్లో నొప్పి లేకపోతే మీరు నిర్భయంగా పెళ్లిచేసుకోవచ్చు. మీరు అందరిలాగే దాంపత్యసుఖం అనుభవించగలరు. వైద్యపరంగా మీకు ఎలాంటి సమస్యా లేదు. ఈ అంశం మీ దాంపత్య సుఖానికి ఏ విధంగానూ అడ్డు కాదు. -
టైప్ చేస్తున్నప్పుడు వేళ్లు నొప్పి..!
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 28. ఒక కంపెనీలో సెక్రటరీగా పనిచేస్తున్నాను. కంప్యూటర్‌పై టైపింగ్ పని ఎక్కువగా చేస్తుంటాను. ఇటీవల టైప్ చేస్తున్న సమయంలో నా వేళ్లు ఎంతో నొప్పిగా ఉంటున్నాయి. రాత్రివేళల్లో చేతిలో సూదులు గుచ్చుతున్నంత బాధ ఉంటోంది. నా చేతులు బలహీనమైనట్లుగా కూడా అనిపిస్తోంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - రాధిక, హైదరాబాద్ మన చేతులకు సంబంధించిన నరాలు మణికట్టు దగ్గర ఒక సన్నటి ద్వారం గుండా అరచేతుల్లోకి వెళ్తుంటాయి. ఇక వయసు పెరుగుతున్న కొద్దీ మణికట్టులోని ఎముకలు అరుగుదలకు గురవుతుంటాయి. దాంతో మణికట్టు గుండె వెళ్లే నరాలకు మార్గం మరింత సన్నబడుతుంది. ఒక్కోసారి మహిళలు గర్భవతి అయినప్పుడు నీరు వచ్చినట్లగానే మణికట్టులోనూ నీళ్లు చేరుతుంటాయి. దాంతోపాటు టైపింగ్ సమయంలో మన మణికట్టును కాస్త ఒంచి టైప్ చేస్తుంటాం. దానివల్ల నరాల ప్రవేశద్వారం మరింత సన్నబడుతుంది. ఫలితంగా నరాలపై ఒత్తిడి పడి అరచేతుల్లో తిమ్మిర్లు, సూదులు గుచ్చుతున్న బాధ కలుగుతాయి. మీ విషయంలో ఒకసారి నర్వ్ కండక్షన్ స్టడీ పరీక్షలు చేయించి, వ్యాధిని దాని తీవ్రతను తెలుసుకొని, దానికి అనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి. నా వయసు 30 ఏళ్లు. ఈ వయసులోనే నాకు మోకాళ్లలో నొప్పులు వస్తున్నాయి. మెట్లు ఎక్కులేకపోతున్నాను. మా అమ్మ, అమ్మమ్మ - వీళ్లిద్దరూ మోకాళ్లలో నొప్పులతో బాధపడ్డారు. వాళ్లిద్దరికీ ఆర్థరైటిస్ ఉందని తేలింది. ఇది వారసత్వంగా కుటుంబాల్లో రావచ్చని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు. దాంతో నాకు చాలా ఆందోళనగా ఉంది. కుటుంబంలో అమ్మకు ఆర్థరైటిస్ వస్తే నాకూ వస్తుందా? దయచేసి వివరించండి. - ధనలక్ష్మి, ఒంగోలు మెట్లు ఎక్కే సమయంలో మోకాళ్లలో నొప్పి వస్తే... అది ఆర్థరైటిస్ కాకపోవచ్చు. మీ అమ్మ, అమ్మమ్మకు ఆర్థరైటిస్ అన్నది వయసుతో పాటు వచ్చిన సమస్య. మీరు ఆందోళన పడకుండా మీ సమస్య నిర్ధారణ కోసం ఒకసారి ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలవండి. హోమియో కౌన్సెలింగ్ నాకు తరచూ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. హోమియో వైద్యవిధానంలో తగ్గే మార్గం చెప్పండి. - సూర్యనారాయణ, మెదక్ మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(యూటీఐ)గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడతారు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అప్పర్ యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రా ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్ను యురెథ్రయిటిస్ అంటారు. కారణాలు: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన కొందరిలో ఈ-కొలై అనే బ్యాక్టీరియా దీనికి కారణం కావచ్చు. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా ఉంటుంది. మలవిసర్జన సమయంలో సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ-కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అందుకే హెచ్ఐవీ/ఎయిడ్స్, డయాబెటిస్, క్యాన్సర్‌తో బాధపడేవారికి తరచూ ఈ ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే మహిళల్లో, ప్రోస్టటైటిస్‌తో బాధపడే పురుషుల్లో సులభంగా ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి. లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంటు ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలి, జ్వరం, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు: యూరిన్ ఎగ్జామినేషన్, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ హోమియోపతి చికిత్స: వ్యాధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి - బెల్లడోనా, ఎపిస్, క్యాంథరిస్, సరసాపరిల్లా వంటి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా, నిర్ణీతకాలం వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 38 ఏళ్లు. ఇటీవల ఒకసారి రక్తం తగ్గితే, దాత నుంచి రక్తాన్ని స్వీకరించాను. ఆ తర్వాత నాకు హైఫీవర్ వచ్చింది. వైద్యపరీక్షలు చేయించుకుంటే, నాకు హెపటైటిస్-బి ఇన్ఫెక్షన్ ఉందని తెలిసింది. ఈ వ్యాధి గురించి వివరాలు తెలపండి. - ఒక సోదరుడు, గుంటూరు హెపటైటిస్-బి ఇన్ఫెక్షన్ చాలా వేగంగా కాలేయానికి చేరి, సమస్యతు తెచ్చిపెడుతుంది. ఇది ఒక రకంగా హెచ్ఐవీ కంటే కూడా చాలా ఎక్కువరెట్లు ప్రమాదకరమైనది.ఇది రక్తం, లాలాజలం, వీర్యం, శరీర ద్రవాల ద్వారా వ్యాపించవచ్చు. వైరస్ చేరిన వెంటనే పెద్దగా లక్షణాలు కనిపించకపోవచు కొంతమందిలో ఫ్లూ లాంటి జ్వరం, తీవ్రమైన అలసట, వికారం, కళ్లు, ఒళ్లు పచ్చబారటం వంటి కామెర్ల లక్షణాలు, కడుపునొప్పి, విరేచనాలు, కీళ్లనొప్పులు రావచ్చు. దీన్ని గుర్తించేందుకు యాంటిజెన్ పరీక్షలు చేస్తారు. వైరస్ చేరిన వెంటనే పరీక్షలలో ఈ విషయం తెలియదు. ఇన్ఫెక్షన్ సోకిన ఆరు నుంచి పన్నెండు వారాల తర్వాత మాత్రమే పాజిటివ్ ఫలితం వస్తుంది. ఆ సమయంలో మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి. దీనికి బారిన పడిన పది మందులో తొమ్మిది మందికి ఆర్నెల్లలో అదే తగ్గిపోతుంది. కొంతమందిలో మాత్రమే వ్యాధి శరీరంలో ఉండిపోయి, అది దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్గా మారుతుంది. దాంతో కాలేయం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. లివర్ క్యాన్సర్‌గా రావడానికి హెపటైటిస్-బి ఒక ముఖ్య కారణం. ఇది సోకినప్పుడు ఇన్ఫెక్షన్ ముదరకుండా కాలేయం దెబ్బతినకుండా చికిత్స అందిస్తారు. ఇంటర్ఫెరాన్ లాంటి ఇంజెక్షన్స్ ఇస్తారు. ఇవి రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి. కొన్నివారాలా పాటు మందులు వాడితే వైరస్ పెరుగుదల ఆగిపోతుంది. కొన్సిసార్లు జీవితాంతం మందులు వాడాల్సి రావచ్చు. శరీరంలో హెపటైటిస్-బి వైరస్ ఉండేవారి రక్తం నుంచి ఇతరులకు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి సూదులు, సిరంజీలు, బ్లేడ్లు, టూత్‌బ్రష్‌లతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవచ్చు. కాబట్టి ఇలాంటి వస్తువులు వాడటంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకరు వాడిన వస్తువులను మరొకరు వాడకపోవడం ద్వారా హెపటైటిస్-బి ఇన్ఫెక్షన్ను నివారించవచ్చు. రక్తమార్పిడితో పాటు అది వ్యాపించేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను నివారించడం ద్వారా దీన్ని అరికట్టవచ్చు. -
మరుగుదొడ్డితో విప్లవం!
దేశాన్ని పరిశుద్ధంగా ఉంచాలంటే, వీధుల్లో చెత్త లేకుండా చేయాలి. గోడల పక్కన మూత్ర విసర్జన చేయకూడదు. ఎక్కడంటే అక్కడ ఉమ్మి వేయకుండా ఉండాలి. ఇవన్నీ సాధ్యపడితే, ఇది విప్లవానికి ఏమాత్రం తీసిపోదు. అవి చౌక రకం ఎయిర్‌లైన్స్ కు ప్రజాదరణ పెరుగుతున్న రోజులు. 2002లో ఢిల్లీ నుంచి ముంబై వెళుతున్న విమానం లో టాయ్‌లెట్‌కు వెళుతున్న ఒక వ్యక్తిని నేను చూడటం తటస్థించింది. అతడు దాని తలుపు తెరిచాడు, లోపలికి చూశాడు, దాన్ని వాడకుండానే మహాశ్చర్యంతో వెనుదిరి గాడు. టాయ్‌లెట్ లోపల మురికిగా ఉందేమోనని నేననుకున్నాను. కేబిన్ సిబ్బందికి తెలియపర్చవలసిం దిగా అతనికి సూచించాను. కానీ నాది ఎంత తప్పు సూచనో! నా సహ ప్రయాణికుడు దిగ్భ్రాంతితోనే, ఆ టాయ్‌లెట్ మురికిగా లేదని, చాలా పరిశుభ్రంగా ఉంద ని వివరించాడు. అంత చిన్న, పరిశుభ్రమైన టాయ్ లెట్‌ను ఎలా ఉపయోగించాలో తెలియకున్నదని అతడి ఉద్దేశం. ఆ మాటలు విన్న ఇతర ప్రయాణికులు కొందరు ముందు వెనుక వరుసల లోంచి లేచి, టాయ్‌లెట్‌ని చూడాలని దాని నడవా వద్దకు వచ్చారు. సీన్ కట్ చేస్తే, అది 1990ల నాటి కాలం. మహా రాష్ట్రలోని లాతూర్‌లో ఘోర భూకంపం తర్వాత కుప్పకూలిన అన్ని ఇళ్లను పునర్నిర్మించారు. ప్రతి ఇంటికీ సమీపంలో ఒక విడి కుటుంబ టాయ్‌లెట్ కలిగి ఉండే లా వాటిని రూపొందించారు. గ్రామీణ మనస్తత్వం గురించి తెలుసు కాబట్టి పట్టణాల్లోని ఇంటిలోనే భాగమై ఉండే అటాచ్డ్ టాయ్‌లెట్ లా కాకుండా ఇంటి బయటే వాటిని నిర్మించారు. కానీ ప్రజలు మాత్రం వాటిని మరొ కలా అంటే నిల్వ గదిలా, (దయచేసి నన్ను నమ్మండి) చివరకి పూజ గదుల్లా కూడా వాటిని ఉపయోగించారు. ఎప్పటిలాగే కాలకృత్యాలకు బహిరంగ స్థలాలను సంద ర్శించసాగారు కూడా. ఈ వాస్తవాన్ని గుర్తించని ప్రభుత్వం 1990ల చివర లో కూడా ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.450 కోట్లను అందించింది. అయితే వీటిలో కూడా 40 శాతం మరుగుదొడ్లను ఇతర ప్రయోజనాలకు ఉపయోగించా రని తెలిపిన గణాంకాలు దిగ్భ్రాంతిపర్చాయి. టాయ్ లెట్‌కు అత్యంత కీలకమైన స్క్వాట్ పాన్ (విసర్జనకు ఉపయోగించే మూకుడు గుంట) ని కూడా కాంట్రాక్టర్లు అమర్చలేదు. ప్రజలు ఆ గదిని దేనికి ఉపయోగిస్తారో అందరికీ తెలుసు మరి. ఇలాంటి పరిస్థితుల్లో బహిరంగ మల విసర్జన మాటను అలా ఉంచి.. ఉమ్మి వేయడం, బహిరంగంగా మూత్ర విసర్జన చేయడం కూడా తప్పేనంటూ ఒక టాయ్‌లెట్ ఈ దేశానికి, దాని ప్రజలకు ఎలా శిక్షణ ఇవ్వగలదు? దీన్ని దృష్టిలో ఉంచుకునే, నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ అభియాన్ బహిరంగ విసర్జనకు వ్యతిరేక ప్రచారంతోనే మొదలైంది. ఎందు కంటే ఈ పథకం కేవలం టాయ్లెట్లపై మాత్రమే కాకుండా దేశాన్ని పరిశుద్ధంగా ఉంచడానికి సంబంధించింది. నిజానికి దోమల సంతతి అధికం కావటం వల్లే ఢిల్లీ ప్రజలు డెంగ్యూ వ్యాధికి గురవుతున్నారన్న వాస్తవం బట్టి స్వచ్ఛ భారత్ అభియాన్ ఏ మేరకు విజయం సాధించిందో మనందరం గ్రహించవచ్చు. రెండోది ఏమి టింటే, డెంగ్యూ వ్యాధి బారిన పడి బాధితులు చికిత్స కోసం పోటెత్తిన ప్రభుత్వ వైద్యశాలలే తమకు తాముగా మురికిగా ఉండటంతో అక్కడ తమకు రోగం నయమవు తుందా లేక ఇతర వ్యాధులు కూడా అంటుకుంటాయా అని తేల్చుకోవలసిన పరిస్థితి తయారైంది. ఇదంతా మోదీకి తెలియని విషయం కాదు. ముంబైతో సహా ఇతర భారతీయ నగరాలు కూడా దీనికి ఏమాత్రం భిన్నంగా లేవు. దేశాన్ని పరిశుద్ధంగా ఉంచాలంటే, మనం కనీసం గా అయినా కొన్నింటిని పాటించాలి. 1. వీధుల్లో చెత్త లేకుండా చేయాలి. 2. గోడల పక్కన మనుషులు మూత్ర విసర్జన చేయకూడదు. 3. మహిళలు తమ కాలకృత్యాల కోసం పొదల చాటుకు వెళ్లకుండా ఉండాలి. 4. ఎక్కడంటే అక్కడ ఉమ్మి వేయకుండా ఉండాలి. నిజంగా ఇవన్నీ సాధ్యమైనట్ల యితే, ఇది విప్లవానికి ఏమాత్రం తీసిపోదు. ఇక్కడ విప్లవం అని నేను మాట్లాడుతున్నది ప్రభుత్వాన్ని కూలదోయడం వంటిది కాదు కానీ, ఒక సమాజంగా మనం మారవలసిన పరిణామం అది. అన్ని స్థాయిల్లో (గ్రామ పంచాయతీల నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు) ఈ విప్లవంలో పాలుపంచుకోవలసిన ఇద్దరు ఆటగాళ్లు ఎవరంటే అటు పౌరులూ, ఇటు ప్రభుత్వమూనూ. ఈ లక్ష్య సాధనకు ఈ ఇరువురూ నిబద్ధతతో పనిచేయాలి. ఒకరు లేకుండా మరొకరు ఈ లక్ష్యాన్ని సాధించటం అసాధ్యం. పౌర అధికారులు తమ విధులను సరిగా నిర్వహిం చకపోవడం వల్లే దోమల సంతతి పెరుగుతోంది. నిధుల నుంచి మానవశక్తి వరకు అనేక రకాల అవరోధాలు వారికి అడ్డు తగులుతుండవచ్చు. కానీ క్షమించరాని ఉదాశీనత భారంతో వీరు నలిగిపోతున్నారు. ప్రజలు సైతం ఇది కావాలి, అది కావాలి అని పోరు పెట్టడమే తప్ప తమ పరిసరాలను తామే జాగ్రత్తగా చూసుకో వాలని భావించడం లేదు. సందుల్లోనే వారు చెత్త పడేస్తారు. దానిపై మురికినీరు పారడాన్ని కళ్లప్పగించి చూస్తారు. దానితో సమాధానపడతారు కూడా. ఎవ్వరూ పారిశుద్ధత గురించి డిమాండ్ చేయడం లేదు అందుకే పురపాలక సంస్ధలకు అంత నిర్లక్ష్యం. అటు పాలనా యంత్రాంగం, ఇటు వ్యక్తి లేదా కమ్యూనిటీ కూడా.. నేనేం చేయాలనుకుంటున్నానో అది నా పని కాదు అనే తత్వానికి సంబంధించిన భయంకరమైన సాంస్కృతిక ఆమోదంలో కొట్టుకు పోతున్నాయి. సమస్యను మార్చడం ద్వారానే విజయం సాధించగలమని ఏ ఒక్కరూ భావించడం లేదు. పారిశుధ్య ప్రమాణాలను అత్యున్నత స్థాయిలో ఉంచే పేరుతో, వంట చేయడానికి ముందు మడి కట్టుకునే దేశంలో (ఇది ఇప్పుడు పూర్తిగా ఛాందస సంప్రదాయంగా కనిపిస్తూ, పూజలు, అంత్యక్రియలు వంటి పరమ సాంప్రదాయక స్థాయికి కుదించుకు పోయింది) టాయ్‌లెట్‌కి వెళ్లిన తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చనే విషయాన్ని ప్రజలకు బోధించడం ఎలా సాధ్యపడుతుంది? మరుగుదొడ్లను ప్రజలందరికీ కల్పించడం ఒకెత్తు కాగా, వాటిని ఉపయోగించేలా చేయడం మరొకెత్తు. తగినన్ని టాయ్లెట్లను రైళ్లు అందిస్తు న్నాయి కానీ అవి పరమ రోతగా ఉంటున్నాయి. వాటిని ఉపయోగించే పద్ధతి మరొకెత్తు. రైళ్లలో, బస్స్టాండ్లలో, చివరికి దిగ్భ్రాంతి గొలిపేలా ఉద్యో గులే ఉపయోగిస్తున్న మునిసిపల్ ఆఫీసుల్లో మరుగు దొడ్లను ఉపయోగించే తీరు మన సాంస్కృతిక లోటుపాట్లను సూచిస్తుంది. వీటిమీదే తీవ్రమైన పోరాటం చేయవలసి ఉంది. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com) - మహేష్ విజాపుర్కార్ -
ఈ-సిగరెట్ అంతే డేంజర్..!
మా పాపకి నాలుగేళ్లు. తరచు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతోంది. ఆయుర్వేద మందుల్ని తెలియజేయగలరు. - పూర్ణిమ, హైదరాబాద్ ఆడవాళ్లలో జననాంగ ప్రాంతంలోనే మూత్రం బయటకు వచ్చే మార్గం ఉంటుంది. పైగా చిన్నపిల్లలో ఈ సమస్య ఎక్కువ. అక్కడ పరిశుభ్రత లోపిస్తే, ఈ వికారం కలుగుతుంది. దీనిని ఆయుర్వేదంలో ‘మూత్రదాహం లేదా మూత్రనాళపాకం’ అంటారు. ఈ వ్యాధిలో మూత్రం మాటిమాటికీ రావడం, స్వల్పంగా రావడం, మంట మొదలైన లక్షణాలుంటాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గేవరకూ ఆహారంలో పులుపు, కారం తక్కువగా తినాలి. నీళ్లు. బార్లీ నీళ్లు, ఇతర ద్రవపదార్థాలు ఎక్కువగా తాగాలి. ఔషధం: చంద్రప్రభావటి మాత్రలు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి; చందనాసవ లేదా అరవిందాసవ ద్రావకం రెండు చెంచాల మందుకి రెండు చెంచాల నీళ్లు కలిపి మూడుపూటలా తాగించాలి. గమనిక: ఈ సమస్య తగ్గిపోయిన తర్వాత, అదే మందుల్ని సగం మోతాదులో ఒక నెలపాటు వాడితే మూత్రాశయానికి వ్యాధి క్షమత్వ శక్తి పెంపొందుతుంది. ఆయుర్వేదం రీత్యా ‘తేనె’ ప్రాశస్త్యాన్ని వివరించండి. - రేణుక ఉపాధ్యాయుల, బెంగళూరు ఆయుర్వేదంలో తేనె గురించి చాలా సుదీర్ఘంగా వివరించారు. ఇవి కొన్ని ముఖ్యాంశాలు మాత్రమే. మకరందాన్ని అందించే పుష్పాన్ని బట్టి, దాన్ని సేకరించే తేనెటీగలలో గల రకాన్ని బట్టి గూడా తేనె గుణ ధర్మాలు మారుతుంటాయి. సంస్కృతంలో తేనెను ‘మధు’ లేక ‘క్షౌద్రం’ అంటారు. స్వచ్ఛమైన తేనెలో మధుర కషాయ రసాలు (తీపి, వగరు) మిళితమై ఉంటాయి. దీన్ని సేవించిన కొద్ది నిమిషాలకే నీరసం తగ్గిపోతుంది. రోగనిరోధక శక్తిని పెంపొందించుతుంది. అందుకే నవజాత శిశువులకు కొద్దిగా తేనెను, ఆవునెయ్యితో కలిపి ఇస్తారు. గురు, రూక్ష, కషాయ గుణాలుండటం వల్ల తేనెను చాలా స్వల్ప ప్రమాణంలోనే సేవించాలి. కంటికి మంచిది. శరీరంలోని కొవ్వుని కరిగిస్తుంది. కఫాన్ని హరిస్తుంది. వాంతులు, నీళ్ల విరేచనాలు, దగ్గు, ఆయాసాలను నయం చేస్తుంది. దప్పిక, తేపులు తగ్గుతాయి. రక్తస్రావాన్ని అరికడుతుంది. విషహరం. గాయాలు తగ్గడానికీ, ఇన్ఫెక్షన్లు తగ్గటానికి తేనెను కడుపులోకి సేవించడమే కాకుండా, బయట పూతగా కూడా వాడవచ్చు. గమనిక: తేనెను అధికమాత్రలో సేవిస్తే అజీర్ణం కల్గించి, ప్రమాదాలకు దారితీస్తుంది. తేనెను వేడిచేయకూడదు. మధుమేహ రోగులకు ‘తీపి’ పదార్థాలు తినడంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరమో, అవి తేనెకూ వర్తిస్తాయి. తేనె సేకరించిన తర్వాత ఒక సంవత్సరం పిమ్మట వాడటం అత్యుత్తమమని శాస్త్రోక్తం. నా వయసు 45 ఏళ్లు. విపరీతంగా సిగరెట్లు తాగుతాను. ఎంత ప్రయత్నించినా చైన్స్మోకింగ్ మానడం సాధ్యం కావడం లేదు. స్నేహితులు ఈ-సిగరెట్‌ను ప్రయత్నించమని చెబుతున్నారు. ఈ-సిగరెట్ (ఎలక్ట్రానిక్ సిగరెట్) ఉపయోగించడం ద్వారా సిగరెట్ మానేయవచ్చా? ఇది సురక్షితమేనా? - దేవరాజు, హైదరాబాద్ ఎలక్ట్రానిక్ సిగరెట్లు (ఈ-సిగరెట్స్) అన్నీ ఒకేలా పని చేస్తాయి. అందులో ఒక బ్యాటరీ ఉంటుంది. దాని కాట్రిడ్జ్ (మందు నింపే బోలు ప్రదేశం)లో నికోటిన్ ఉంటుంది. మామూలు సిగరెట్‌కూ, ఈ-సిగరెట్‌కూ తేడా ఒక్కటే. ఈ-సిగరెట్లో పొగాకు ఉండదు. అంతే. అయితే కేవలం పొగాకు మాత్రమే గాక... సాధారణ సిగరెట్లో ప్రమాదకరమైన రసాయనాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండి, అవన్నీ ఆరోగ్యానికి చేటు చేస్తాయని నిరూపితమైంది. అదే పరిణామంలో కాకపోయినా ఈ-సిగరెట్‌లోనూ దాదాపు సాధారణ సిగరెట్లో ఉండే ప్రమాదకరమైన రసాయనాల్లో కొన్నైనా ఉంటాయి. నికోటిన్ అనే పదార్థం మామూలు సిగరెట్లు, ఈ-సిగరెట్లు... ఈ రెండింటిలోనూ ఉంటుంది. తనకు బానిస అయ్యేలా చేసుకోవడానికి నికోటిన్ ప్రతీతి. మందుల భద్రత విషయంలో ప్రామాణికమైన అమెరికాలోని అత్యున్నత సంస్థ ఎఫ్‌డీఏ విశ్లేషణల ప్రకారం... ఈ-సిగరెట్‌లోనూ గుర్తించగల స్థాయిలో క్యాన్సర్ కారకాలూ, విషపూరిత రసాయనాలూ ఉన్నాయి. ఈ-సిగరెట్లో కాట్రిడ్జ్‌లో డీ-ఇథైల్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం, నైట్రోజమైన్స్ అనే క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. పైగా ఎన్నో రకాల కాలుష్యాలు సైతం ఈ-సిగరెట్ ద్వారా శరీరంలోకి వెళ్తుంటాయి. ఈ పొగను లోపలికి పీల్చినప్పుడు అది మామూలు సిగరెట్లలాగే గొంతు, ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక మంట, ఇన్ఫెక్షన్లను (క్రానిక్ ఇన్ఫ్లమేషన్ను) కలిగిస్తుంది. ఇలా పొగ పీల్చడం దీర్ఘకాలం పాటు కొనసాగితే అది ఈ-సిగరెట్ పొగ అయినా సరే... కొన్నాళ్ల తర్వాత బ్రాంకైటిస్, ఎంఫసిమా, గుండెజబ్బుల వంటి వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి ఈ-సిగరెట్ మామూలు సిగరెట్ కంటే చాలా సురక్షితమైనదేమీ కాదు. పైగా ఏ సిగరెట్ అయినప్పటికీ అందులోని పొగ వల్ల సిరలు, ధమనులు చాలా ఎక్కువగా ధ్వంసమవుతాయి. ఈ పరిణామమే ఆ తర్వాత గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇక ఈ-సిగరెట్‌లోని పొగలో మామూలు సిగరెట్లో పోలిస్తే రసాయనాల సంఖ్య కొంచెం తగ్గితే తగ్గుతుండవచ్చు. అంతమాత్రాన అది మామూలు సిగరెట్ కంటే సురక్షితం అని కచ్చితంగా చెప్పడానికి ఆస్కారం లేదు. దీర్ఘకాలంలో మామూలు సిగరెట్‌తో వచ్చే దాదాపు అన్ని రకాల దుష్పరిణామాలూ ఈ-సిగరెట్‌తోనూ వస్తాయి. ఈ-సిగరెట్‌లోనూ ఉండేది నికోటినే కాబట్టి దానికి బానిసై మళ్లీ మీరు ఈ-సిగరెట్‌కు అలవాటు పడతారు. మీరు సిగరెట్ వదిలేయదలిస్తే... ఒక్కసారిగా వదిలేయడం. మానేయగానే కాస్త చిరాకు, కోపం, నిస్పృహ, అస్థిమితంగా ఉండటం వంటి కొన్ని తాత్కాలిక లక్షణాలు కనిపించినా, దీర్ఘకాలంలో సిగరెట్ మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ. మా పాప వయసు ఏడేళ్లు. కాస్త వర్షం వచ్చే వాతావరణం ఉంటే చాలు జలుబు ఎక్కువగా వస్తుంది. ఇలాంటి వాతావరణంలో రాత్రుళ్లు ఊపిరి సరిగ్గా ఆడటం లేదని చెబుతూ ఇబ్బంది పడుతోంది. మా పాప సమస్యకు సరైన పరిష్కారం సూచించండి. - శ్రీరేఖ, మార్కాపురం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు ఉన్న కండిషన్‌ను రైనైటిస్‌గా చెప్పవచ్చు. రైనైటిస్ అనేది ముక్కు లోపలి పొర (నేసల్ మ్యూకోజా) ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, కొద్దిమందిలో ముక్కు లోపల దురద, విపరీతమైన తుమ్ములు వంటి ఇతర లక్షణాలు కూడా రైనైటిస్లో కనిపిస్తాయి. ఇటీవల ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొద్దిమందిలో ఇది సైనసైటిస్, ఆస్తమాతో పాటు కనిపించవచ్చు. కొంతమందిలో ఎప్పుడూ (పెరిన్నియల్గా) కనిపించే ఈ సమస్య మరికొందరిలో అప్పుడప్పుడు (సీజనల్) గా కనిపిస్తుంటుంది. ఇది అలర్జీ వల్లనే కాకుండా ఇన్ఫెక్షన్స్కు సంబంధం లేని ఇతర సమస్యలు (నాన్ఇన్ఫెక్షియస్ కారణాల వల్ల కూడా) రావచ్చు. అలర్జెన్స్ వల్లనే కాకుండా చల్లటి గాలి, ఎక్సర్సైజ్, వాతావరణంలో మార్పులు, కాలుష్యాలు, ఉద్వేగాలకు లోనుకావడం (ఎమోషనల్ డిస్టర్బెన్సెస్) వల్ల కూడా ఇది వస్తుంది. కొన్ని సందర్భాల్లో హార్మోన్ల సమతౌల్యతలో లోపాల వల్ల కూడా రావచ్చు. ఇక మీ పాప విషయంలో మీరు చెప్పిన అంశాలను బట్టి చూస్తుంటే ఇది ఇడియోపథిక్ అలర్జిక్ రైనైటిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలాంటి సమస్యలో చాలాసార్లు కారణం తెలుసుకోవడం కష్టం అయినప్పటికీ- కంప్లీట్ హీమోగ్రామ్, ఇమ్యునోగ్లోబ్లులిన్ (ఐజీఈ) లెవెల్స్, సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే అలర్జెన్స్ పరీక్ష వల్ల కూడా కొంతవరకు కారణాలు తెలుసుకోవచ్చు. దీనికి చికిత్సగా ముక్కులో వేయాల్సిన చుక్కల మందు (సెలైన్ నేసల్ డ్రాప్స్), యాంటీహిస్టమైన్ గ్రూపు మందులు వాడాల్సి ఉంటుంది. తీవ్రత మరీ ఎక్కువగా ఉంటే నేసల్ స్టెరాయిడ్స్‌తో చాలావరకు ఉపశమనం ఉంటుంది. ఇక సమస్యను నివారించడం కోసం రైనైటిస్‌ను ప్రేరేపించే ఇతర అంశాలు అంటే... ఫేస్‌పౌడర్, పెయింట్ వంటి ఘాటైన వాసనలు ఉండే పదార్థాలు, పెంపుడు జంతువుల ఒంటి మీద వెంట్రుకలు, దుమ్మూ ధూళి, కాలుష్యాల వంటి వాటికి పాపను దూరంగా ఉంచాలి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోండి. -
శ్రీమంతుడు..
సొంత గ్రామాభివృద్ధికి ముందుకొచ్చిన మోహన్‌రావు రూ.50 లక్షల విరాళం ప్రకటించిన ‘దొడ్డ’ శ్రీమంతుడు.. ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేసే కాన్సెప్ట్‌తో వచ్చిన మూవీ. ఇదే సినిమా పలువురికి ఆదర్శం అవుతోంది. రూ.కోట్లు సంపాదించినా.. దేశ, విదేశాల్లో స్థిరపడినా.. లగ్జరీ జీవితం గడుపుతున్నా.. పుట్టి, పెరిగిన ఊరికి ఏమైనా చేయూలనే తపన ఆ సొంతూరి గ్రామాభివృద్ధికి బాటలు వేస్తోంది! పల్లెలను అభివృద్ధి చేయూలని సీఎం కేసీఆర్ గ్రామజ్యోతి పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించాలని చూస్తున్నారు. ఇదే స్ఫూర్తితో నర్సంపేట నియోజకవర్గానికి చెందిన ప్రవుుఖ వ్యాపారి తవు సొంత ఊరు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో సీఎంను కలిసి విరాళం అందించి తన ‘దొడ్డ’ మనసును చాటుకున్నారు. అతనే దొడ్డ మోహన్‌రావు. - నర్సంపేట నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రావూనికి చెందిన వారు దొడ్డ మోహన్‌రావు. ఆయనకు సొంతూరిపై మమకారం ఎక్కువ. గ్రామ వాతావరణమన్నా.. ఆ కల్లాకపటం లేని మనసులన్నా చాలా ఇష్టం. ఎంత సంపాదించినా ఏం లాభం. సొంత గ్రామానికి ఏమి చేయకపోతే అనేది అయన ఆలోచన. ఆ ఆలోచనే సహకారం అందించడానికి పురిగొల్పింది. ఇంకా సొంత ఊరితోపాటు నర్సంపేట పట్టణంలో రూ. లక్షలు విరాళంగా ఇచ్చి అభివృద్ధికి బాటలు వేశారు. గతంలో మిషన్ కాకతీయు పథకంలో భాగంగా రూ.కోటి రూపాయుల విరాళాన్ని అందించి సొంత ఊరిలో వుూడు చెరువుల అభివృద్ధికి దత్తత తీసుకున్నాడు. తాజాగా వుంగళవారం వురో రూ.50 లక్షల విరాళాన్ని అందించేందుకు టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి సవుక్షంలో వుుఖ్యవుంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కలిశారు. పల్లెల సర్వతోవుుఖాభివృద్ధి కోసం వుుందుకొచ్చాడు. లింగగిరిలో పుట్టి, పెరిగి హైదరాబాద్‌కు వెళ్లి కెమికల్ ఫ్యాక్టరీని నెలకొల్పి వేలాది వుందికి జీవనోపాధి ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా బలపడ్డాడు. ఎంత సంపాదించినా సొంత ప్రాంతానికి మేలు చేయూలనే తపన దొడ్డ మోహన్‌రావుకు ఉండి సహృదయుంతో విరాళాలు ప్రకటించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గానికి చెందిన ప్రవుుఖ వ్యాపారి హైదరాబాద్‌లో స్థిరపడి గ్రావుజ్యోతి స్ఫూర్తితో సొంత గ్రావూల అభివృద్ధికి విరాళాలు ప్రకటించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. రానున్న రోజుల్లో వురికొంత వుంది ప్రవుుఖులు తవు సొంత గ్రావూల అభివృద్ధికి దత్తత తీసుకుని వునసున్న శ్రీవుంతులుగా కీర్తిని సంపాదించాలని నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు. -
‘రంగు’ పడుద్ది..!
ఇచ్చట మూత్రం పోయరాదు.. అని రాసినా, చెప్పులు వేలాడదీసినా.. గోడలు తడిపేసి పోవడం మన దగ్గర నిత్యం కనిపించే దృశ్యం. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోనూ ఇదే సమస్య మితిమీరిపోవడంతో అధికారులు ఓ కొత్త ఉపాయం ఆలోచించారు. నగరంలో రోడ్ల పక్కన గోడలపై ప్రత్యేక పెయింట్‌ను వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పది గోడలపై ఈ రంగును వేయడం పూర్తి చేశారు కూడా. రాతలకు, చెప్పులకే జంకనివారు రంగుకు మాత్రం ముచ్చటపడి ఎందుకు ఊరుకుంటారని అనుకుంటున్నారా? ఆ పెయింట్ వేసిన గోడలపై మూత్రం పోస్తే రంగు పడుద్ది మరి! మామూలు గోడపై కిందకు జారిపోయే మూత్రం.. ఈ గోడపై పోస్తే తిరిగి పోసినవారి మీదే పడుతుంది! అల్ట్రా వయొలెట్ కోటెడ్ సూపర్ హైడ్రోఫోబిక్ పెయింట్ వేయడమే అందుకు కారణం. శాన్ ఫ్రాన్సిస్కోలో బహిరంగ మూత్రవిసర్జనకు 50-100 డాలర్ల వరకూ జరిమానా విధిస్తారు. అయినా పరిస్థితి మారకపోవడం.. తమ గోడపై మూత్రం శుభ్రం చేయాలంటూ వందలాది విజ్ఞప్తులు రావడంతో అధికారులు ఈ కొత్త ఐడియా అమలులో పెట్టారు. -
బాబుకు తరచు జ్వరం..?
పీడియాట్రీషియన్ కౌన్సెలింగ్ మా బాబుకు 6 నెలలు. వాడికి ఇటీవల రెండుసార్లు జ్వరం వస్తే డాక్టర్‌కు చూపించాం. యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్నందువల్ల ఇలా తరచూ జ్వరం వస్తున్నట్లు చెప్పారు. ఇంత చిన్న పిల్లల్లోనూ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయా? అలా రాకుండా ఉండాలంటే మేము ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి? - సావిత్రి, తుని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నెలల పిల్లల్లో కూడా చాలా సాధారణమే. చిన్నపిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు అనేక కారణాలుంటాయి. వయసు, జెండర్, అనువంశీకంగా కనిపించడం, వ్యాధి నిరోధక శక్తి, మూత్రకోశానికి సంబంధించి అంతర్గత అవయవ నిర్మాణంలో ఏవైనా తేడాలుండటం, మూత్రవిసర్జన తర్వాత ఎంతో కొంత మూత్రం లోపల మిగిలిపోవడం, మలబద్ధకం, వ్యక్తిగత పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వంటి అనేక కారణాలతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. జ్వరం, తేలిగ్గా చిరాకు పడుతుండటం, సరిగా ఆహారం తీసుకోకపోవడం, వాంతులు, నీళ్లవిరేచనాలు, మూత్రవిసర్జనను నియంత్రించుకోలేకపోవడం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, పొత్తికడుపులో నొప్పి, చుక్కలు చుక్కలుగా మూత్రం పడటం వంటి లక్షణాలతో దీన్ని గుర్తించవచ్చు. పిల్లల్లో... మరీ ముఖ్యంగా నెలల పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను గుర్తించినప్పుడు వారిలో మూత్రకోశ వ్యవస్థకు సంబంధించి ఏదైనా లోపాలు ఉన్నాయేమో పరీక్షించడం తప్పనిసరి. ఉదాహరణకు ఇలాంటి పిల్లల్లో ఫైమోసిస్, విసైకో యూరేటరీ రిఫ్లక్స్ (వీయూఆర్), మూత్రపిండాల్లో ఏవైనా తేడాలు (కిడ్నీ అబ్నార్మాలిటీస్) వంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్లకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి పిల్లల్లో పదేపదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తే తప్పనిసరిగా కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ విత్ కల్చర్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్, వీసీయూజీ, మూత్రపిండాల పనితీరు తెలుసుకోడానికి న్యూక్లియర్ స్కాన్ వంటి పరీక్షలతో పాటు రీనల్ ఫంక్షన్ పరీక్షలు చేయించడం తప్పనిసరి. చిన్నపిల్లలకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ పదే పదే వస్తున్నప్పుడు... కిడ్నీకి ఇన్ఫెక్షన్ సోకకుండా నివారించడానికి మూడు నుంచి ఆరు నెలల పాటు తప్పనిసరిగా ప్రొఫిలాక్టిక్ యూరినరీ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొద్దిగా పెద్దపిల్లల విషయానికి వస్తే వారిలో మలబద్దకం లేకుండా చూడటం, తరచూ మూత్రవిసర్జన చేసేలా చూడటంతో పాటు మంచినీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తీసుకునేలా అలవాటు చేయడం అవసరం. మీరు పైన పేర్కొన్న విషయాలను అనుసరిస్తూ తగిన పరీక్షలు చేయించుకుని, మీ పిల్లల వైద్య నిపుణుడి ఆధ్వర్యంలో తగిన చికిత్సను కొనసాగించండి. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హెదరాబాద్ -
యాండ్రాలజీ కౌన్సెలింగ్
ఆ ఆపరేషన్ తర్వాత అన్నీ సమస్యలే! నా వయసు 31 ఏళ్లు. కిడ్నీలో రాయి ఉందని చెప్పి మూత్రనాళం ద్వారా దాన్ని తొలగించారు.ఆపరేషన్ చేసినప్పటి నుంచి మూత్రంలో మంట, సెక్స్ చేసేప్పుడు విపరీతమైన నొప్పి, అప్పుడప్పుడు మూత్రంలో కొంచెం రక్తం పడటం జరుగుతోంది. యూరిన్‌లో రక్తం కనపడుతుంటే చాలా ఆందోళనగా ఉంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - సీ.వి.ఆర్.ఆర్., తణుకు కిడ్నీలో రాళ్లను ఆపరేషన్ లేకుండా మూత్రనాళం ద్వారా తొలగించడం చాలా సాధారణమైన ప్రక్రియ. దీని తర్వాత చాలామందిలో ఎలాంటి సమస్యా ఉండదు. కాకపోతే కొద్దిమందిలో మాత్రం యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చి, తగిన యాంటీబయాటిక్స్ వాడకపోవడం వల్లగానీ లేదా కొన్ని రాళ్లు లోపలే మిగిలిపోవడం వల్లగానీ మీరు చెప్పిన లక్షణాలు కనిపించవచ్చు. మీరు యూరిన్ కల్చర్ పరీక్ష చేయించుకుని సరైన యాంటీబయాటిక్స్ వాడితే ఇది పూర్తిగా నయమవుతుంది. ఇక ముఖ్యమైన అంశం ఏమిటంటే... ఈ తరహా సర్జరీ (ఎండోస్కోపీ)లో కిడ్నీలో ఒక స్టెంట్ కూడా ఉంచుతారు. దాన్ని ఒక నెల తర్వాత తీయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మరచిపోయి అలా తీయించుకోకపోతే కూడా ఇన్ఫెక్షన్ సమస్యలు వస్తాయి. దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్‌ను మరోమారు సంప్రదించండి. నా వయసు 21. స్నానం చేసే సమయంలో పురుషాంగంపై ఉన్న చర్మాన్ని వెనక్కి లాగి ప్రతిరోజూ శుభ్రపరచుకుంటాను. అరుుతే ఈవుధ్య అంగం మీది చర్మం బాగా పొడిగా అరుుపోరుు వుునుపటిలా వెనక్కురావడం లేదు. బలవంతంగా వెనక్కు నెడితే క్రాక్స్ ఏర్పడి రక్తం కూడా వస్తోంది. ఈ సవుస్యతో చాలా ఆందోళనగా కూడా ఉంది. నాకు ఎలాంటి చెడు అలవాట్లూ లేవు. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - జీ.ఆర్., ఖమ్మం పురుషాంగం మీది చర్మం ఫ్రీగా వెనక్కు వెళ్లకుండా ఉండే కండిషన్‌ను ఫైమోసిస్ అంటారు. ఒక్కోసారి ఫైమోసిస్ వల్ల చర్మం చివరి భాగంలో క్రాక్స్ వచ్చి ఇన్ఫెక్షన్కు దారితీసే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు సెక్స్ చేస్తే నొప్పి రావచ్చు. ఒక్కోసారి చర్మం వెనక్కి వెళ్లి వుళ్లీ వుుందుకు రాకపోతే వాపు కూడా రావచ్చు. యుుక్తవయుసులో ఇలా చర్మం ఫ్రీగా వుుందుకు, వెనక్కు రాకపోతే సున్తీ చేరుుంచుకోవడమే వుంచిది. దీనివల్ల వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కూడా సులువు. మున్ముందు సెక్స్‌కూ ఆటంకాలు ఉండవు. కాబట్టి మీకు దగ్గర్లోని డాక్టర్‌కు చూపించి వెంటనే తగిన చికిత్స తీసుకోండి. డాక్టర్ వి. చంద్రమోహన్ యూరో సర్జన్ అండ్ యాండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ -
యాండ్రాలజీ కౌన్సెలింగ్
ఈ వయసులో ప్రోస్టేట్ సమస్యలు సాధారణం! నాకు 65 ఏళ్లు. ఇటీవల మూత్రపరీక్షలు చేయించుకుంటే ప్రోస్టేట్ గ్రంథిలో గడ్డలు వచ్చినట్లు చెప్పారు. మూత్రం సరిగ్గా రాకపోవడంతో ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా ఆపరేషన్ చేసి తొలగించాలని చెబుతున్నారు. దీన్ని తొలగించాక వీర్యం రాదు అని అంటున్నారు. అంగస్తంభన ఏమైనా దెబ్బతింటుందేమోనని నాకు ఆందోళనగా ఉంది. ఈ విషయంలో నాకు సరైన సలహా ఇవ్వగలరు. - జె.పి.ఆర్.కె., రాయచోటి అరవై ఏళ్లు పైబడ్డవారిలో ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు రావడం సాధారణం. వీటిని మందులతో లేదా ఎండోస్కోపీ (టీయూఆర్‌పీ) ప్రక్రియతో నయం చేస్తాం. ఎక్కువభాగం వీర్యం ఈ ప్రోస్టేట్ గ్రంథి వల్లనే తయారవుతుంది. కాబట్టి దీన్ని తొలగించినప్పుడు వీర్యం తక్కువగా వస్తుంది. అయితే సెక్స్ చేయడానికి గాని, సెక్స్‌లో సంతృప్తి పొందడానికి గాని ఈ ఆపరేషన్ ఏవిధంగానూ అడ్డంకి కాదు. దీని వల్ల ఎలాంటి సెక్స్ లోపమూ రాదు. అందువల్ల ఈ ఆపరేషన్ అవసరమని డాక్టర్లు చెబితే నిర్భయంగా టీయూఆర్‌పీ సర్జరీ చేయించుకోవచ్చు. నాకు 48 ఏళ్లు. ఈవుధ్యనే షుగర్ బయటపడింది. సెక్స్ చేశాక పురుషాంగం చివర నొప్పి, వుంటగా ఉంటోంది. అంగం మీద చర్మం కూడా బాగా పొడిపొడిగా, కొంచెం దురదగా ఉంటోంది. ఒకరోజు తర్వాత అంతా తగ్గిపోతోంది. అయితే పురుషాంగం మీది చర్మం వెనక్కు వెళ్లడం లేదు. నా సమస్యకు తగిన పరిష్కారం సూచించండి. - జీ.వి.ఆర్.ఎల్.ఎమ్., కందుకూరు షుగర్ ఉన్నవాళ్లలో పురుషాంగం చివరన ఉండే చర్మం వుూత్రంతో తడిసి అది ఇన్ఫెక్షన్కు దారితీయువచ్చు. ఒక్కోసారి పేషంట్స్లో షుగర్ వ్యాధి ఈ కారణం వల్లనే బయటపడుతుంది. ఈ కండిషన్‌ను బెలనోప్టరుుటిస్ అని అంటారు. ఇలా కావడం ఇదే మొదటిసారి కాబట్టి డాక్టర్‌ను కలిసి యూంటీబయూటిక్ పూర్తి కోర్సు తీసుకొండి. అలాగే డాక్టర్ సూచనల మేరకు లోకల్ కీమ్స్ కూడా అప్లరుు చేస్తే ఈ సవుస్య పూర్తిగా నయువువుతుంది. ఒకవేళ ఇదే కండిషన్ ఏడాదిలో రెండు, వుూడుసార్లు కనిపిస్తూ ఇలాగే ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంటే సున్తీ చేరుుంచుకోవడం శ్రేయస్కరం. ఒకసారి డయూబెటిస్ ఉందని తెలిసిన తర్వాత బ్లడ్ షుగర్‌ను పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం. నాకు 25 ఏళ్లు. చాలా మంది అమ్మాయిలతో సెక్స్ సంబంధాలు ఉన్నాయి. ఈమధ్య మూత్రధార సరిగ్గా రావడం లేదు. జ్వరం వస్తోంది. బరువు తగ్గిపోతోంది. నాకు హెచ్ఐవీ వచ్చిందేమో అని భయంగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - వి.బి.ఆర్., గుంటూరు మీరు మొట్టమొదట మీ వివాహేతర సంబంధాలను పూర్తిగా నిలిపివేయండి. ఆ తర్వాత హెచ్ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, హెపటైటిస్-సి, వీడీఆర్ఎల్ వంటి పరీక్షలన్నీ చేయించుకోండి. మూత్ర ధార సరిగ్గా రావడం లేదు కాబట్టి మూత్రం కల్చర్ పరీక్ష, ఆర్జీయూ అనే ఎక్స్-రే చేయించుకోవాలి. మీకు మూత్రనాళంలో ఏదైనా అడ్డంకి ఉందేమో చూడాలి. ఇలా ఉంటే దాన్ని స్ట్రిక్చర్ అంటారు. ఈ పరీక్షలన్నీ చేయించుకుని, ఆ ఫలితాల ఆధారంగా సరైన చికిత్స పొందండి. మీరు వెంటనే యూరాలజిస్ట్‌ను కలవండి. -
అలా చేశారని..109 మంది అరెస్ట్
ఆగ్రా: బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేసిన 109 మందిని ఆగ్రాలోని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు మూత్రవిసర్జనకి అడ్డాలుగా మారడంతో వీటిని అరికట్టడానికి శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ జీఎన్ ఖన్నాఅన్నారు. రైల్వే స్టేషన్ ఆవరణలో మూత్రవిసర్జన చేస్తున్న109 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైల్వే స్టేషన్ ఆవరణలో దుర్గంధం పెరిగిపోయిందని...దీన్ని తగ్గించి పరిసరాలను శుభ్రంగా ఉంచే చర్యల్లో భాగంగానే డ్రైవ్ నిర్వహించామన్నారు.