న్యూఢిల్లీ :
స్వచ్ఛ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి చేస్తుంటే సొంత పార్టీ నుంచే ఆయనకు మద్దతు కరువైందనిపిస్తోంది. ఏకంగా ఆయన మంత్రి వర్గంలోని సభ్యుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ బహిరంగ మూత్ర విసర్జన చేసి అడ్డంగా బుక్ అయ్యారు. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కారు ఆపి సెక్యురిటీ గార్డుల సంరక్షణలో మూత్రవిసర్జన చేస్తూ కెమెరా కంటికి చిక్కారు.
ఇటీవలే బీజేపీ ఎంపీ ప్రియాంకా రావత్ సరయూ నదిలో ప్లాస్టిక్ బాటిల్ విసిరేసిన వీడియో బయటకు రావడంతో వివాదం రేగిన విషయం తెలిసిందే. ఓ వైపు స్వచ్ఛ భారత్ కార్యక్రమంతో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నిస్తుంటే, సాక్షాత్తూ మంత్రులు, ఎంపీలే దీనికి విరుద్దంగా వ్యవహరిస్తుండటంతో నెటిజన్లు మండిపడుతున్నారు.